Allu Arjun's Pushpa Movie Team Announced Release Date - Sakshi
Sakshi News home page

అఫీషియల్‌: అల్లు అర్జున్‌ పుష్ప పార్ట్‌-1 రిలీజ్‌ డేట్‌

Published Sat, Oct 2 2021 9:33 AM | Last Updated on Sat, Oct 2 2021 10:53 AM

Pushpa Movie Team announced Release date - Sakshi

Allu Arjun Pushpa Part 1 Official Release Date: ఆర్య, ఆర్య 2 తర్వాత డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’.  ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. అయితే క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో విడుదల చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.  అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. 

ఈ మూవీని డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు శనివారం (అక్టోబర్‌ 2న) తెలిపింది మూవీ టీం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ  ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది.  ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో పోషిస్తుండగా..  మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్‌లో నటిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement