Pushpa The Rise Expected To Set Bigger Records In Russia, Collected Over 10 Million Rubles - Sakshi
Sakshi News home page

Pushpa : రష్యాలోనూ తగ్గేదేలే అంటున్న ‘పుష్ప’రాజ్‌

Published Tue, Jan 3 2023 4:41 PM | Last Updated on Tue, Jan 3 2023 6:22 PM

Pushpa The Rise Expected To Set Bigger Records In Russia - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. 2021 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది.  ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటకి అలానే ఉంది. 

ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు రష్యాలోనూ రికార్డులు సృష్టిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత డిసెంబర్‌ 08, 2022న రష్యాలో  ఈ చిత్రాన్ని విడుదల చేశారు. 25 రోజుల్లో ఈ చిత్రం అక్కడ 10 మిలియన్‌ రూబెల్స్‌ని వసూలు చేసింది. అంటే మన ఇండియన్‌ కరెన్సీలో దాదాపు కోటిన్నర రూపాయలు అన్నమాట. అయితే ఈ రేంజ్‌లో  బాహుబలి 2 కూడా సాధించలేదని.. అంటున్నారు ట్రేడ్ పండితులు.

కానీ కొంత మంది నెటిజన్స్ మాత్రం పుష్ప ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసిన మొత్తం కూడా రాలేదని కామెంట్స్ చేస్తున్నారు.  అయితే పుష్పకు వచ్చినంత కలెక్షన్స్‌ ఇండియాలోని ఏ సినిమాకు అక్కడ రాలేదని సినీ పండితులు చెబుతున్నారు. కాగా ఈ సినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి.  ఈ నెల చివరి వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement