Allu Arjun Pushpa To Release In Two Parts Rumors Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

పుష్ప... డబుల్‌ ధమాకా!

Published Fri, May 7 2021 12:42 AM | Last Updated on Fri, May 7 2021 9:39 AM

Allu Arjun and Sukumar Film To Release in Two Parts - Sakshi

‘పుష్ప’ చిత్రం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందన్నది ఆ వార్త సారాంశం. ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అల్లు అర్జున్‌కు ఇటీవల కరోనా సోకడం వల్ల ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందనే పనిలో నిమగ్నమై ఉన్నారట దర్శకుడు సుకుమార్‌ అండ్‌ కో. మరి... ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందా? లేదా? అనే విషయంపై రానున్న రోజుల్లో ఓ స్పష్టత వచ్చేస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 13న విడుదలకు షెడ్యూల్‌ అయిన ‘పుష్ప’ సినిమా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడనుందనే టాక్‌ వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement