పుష్ప- 3 గురించి అప్డేట్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌ | Allu Arjun Reacts To Pushpa 3 Rumour, He Reveals Plans Of Franchise Expansion For His Pushpa - Sakshi
Sakshi News home page

Allu Arjun On Pushpa 3: పుష్ప- 3 గురించి కీలక అప్డేట్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌

Published Sat, Feb 17 2024 9:39 AM | Last Updated on Sat, Feb 17 2024 10:41 AM

Pushpa 3 Confirmation By Allu Arjun - Sakshi

జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్​లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. ​ ఈ ఏడాది ఫిబ్రవరి 15 (గురువారం) నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆయన కూడా భాగం అయ్యారు. సుకుమార్‌ తెరకెక్కించిన పుష్ప చిత్రం అంతర్జాతీయ స్థాయికి చేరకుంది. భారత్‌లో ఇప్పటికే ఎన్నో అవార్డులను, ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్​లోనూ సందడి చేసింది.

ఈ ఫెస్టివల్‌లో  ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఈ చిత్రం ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ ఫిల్మ్‌ మేకర్స్, మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్‌లతో అల్లు అర్జున్‌ కొంత సమయం పాటు చర్చించారు. ఆపై భారతీయ సినిమా ప్రాముఖ్యత, చరిత్ర గురించిన పలు అంశాలపై అల్లు అర్జున్‌ మాట్లాడారు. ఈ క్రమంలో పుష్ప పార్ట్‌ -3 గురించి బన్నీ కామెంట్‌ చేశారు. అన్నీ అనుకూలిస్తే పుష్ప 3 కూడా ఉండొచ్చు. పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు అల్లు అర్జున్‌ తెలిపారు.

రెండో భాగం విడుదలయ్యాక పార్ట్‌- 3 గురించి ప్రకటన రావచ్చని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ అల్లు అర్జున్‌ ఇప్పటకే త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా డైరెక్టర్లతో సినిమాను ఒప్పుకున్నారు. బోయపాటి శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్ట్‌ చేయనున్నారని టాక్‌ ఉంది. ఇలాంటి సమయంలో పుష్ప-3 రావడం అంత సులభం కాదని చెప్పవచ్చు.

పుష్ప సినిమాలో రష్మికా మందన్నాతో పాటు ఫాహద్‌ ఫాజిల్ రోల్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.  నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న పుష్ప పార్ట్‌ -2 ఆగస్టు 15న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement