తెలుగు చిత్ర పరిశ్రమకు చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున, వెంకటేష్ మూల స్థంబాలు అని చెప్పవచ్చు. ఇప్పటికే వారి వారసులు కూడా సినిమాలో ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరిపోయాడు. నాగార్జున కుమారులు నాగ చైతన్య, అఖిల్ సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్‌తో రెడీగా ఉన్నాడు. అయితే, త్వరలో వెంకటేష్ కూడా తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రామానాయుడి వారసులుగా వెంకటేష్, రానా, సురేష్ బాబు ఇండస్ట్రీలో రానిస్తున్నారు. ఇప్పుడు తర్వాతి జనరేషన్ నుంచి వెంకీ కుమారుడు అర్జున్ ఎంట్రీ గురించి తెరపైకి వచ్చింది. బాలకృష్ణ టాక్ షోలో తాజాగా పాల్గొన్న వెంకటేష్.. ఆయనతో అర్జున్ సినిమా ఎంట్రీ గురించి ఆఫ్‌స్క్రీన్‌లో చర్చించారట. తన కుమారుడిని కూడా త్వరలో సినిమా రంగానికి పరిచయం చేయాలని ఉన్నట్లు బాలయ్యతో వెంకీ తెలిపారట. అర్జున్ అమెరికాలో చదువుకొంటున్నాడని త్వరలో అక్కడి నుంచి ఇండియాకు రానున్నట్లు కూడా చెప్పాడని సమాచారం. ఈ క్రమంలో అర్జున్‌కు కూడా సినిమాలంటే ఆసక్తి ఉందని వెంకీ చెప్పుకొచ్చాడట. దీంతో వెంకటేష్ వారసుడిగా అర్జున్ ఎంట్రీపై వార్తలు నెట్టింట భారీగా వైరల్ అవుతున్నాయి. తొలి సినిమా తమ సొంత బ్యానర్‌లోనే తెరకెక్కించే అవకాశం ఉంది.
వెంకటేష్ నలుగురు పిల్లల వివరాలు ఇవే
వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు కాగా, అర్జున్ చివరి వాడు. పెద్ద కుమార్తె ఆశ్రిత అందరికీ సుపరిచితమే.. పెళ్లి తర్వాత ఫుడ్ వ్లాగర్‌గా ఆమె చాలామందికి తెలుసు. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేతగా కొనసాగిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం 2019లో జరిగిన సంగతి తెలిసిందే. ఆశ్రిత మామయ్య రఘురాంరెడ్డి ఖమ్మం ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు. ఇక వెంకటేష్ రెండవ కుమార్తె హయ వాహిని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేశారు. విజయవాడకు చెందిన డాక్టర్ కుమారుడితో ఆమె వివాహం కొద్దిరోజుల క్రితమే జరిగింది. మూడో కూతురు భావన హైదరాబాద్‌లోనే గ్రాడ్యువేషన్ చదువుతుంది. ఇక వెంకీ కుమారుడు అర్జున్ సినిమా ఎంట్రీ కోసం దగ్గుబాటి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment