ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు.. | ACB And ED Speed Up Formula E-car Rase Case Investigation In Telangana | Sakshi
Sakshi News home page

ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు..

Published Sat, Dec 28 2024 12:57 PM | Last Updated on Sat, Dec 28 2024 1:32 PM

ACB And ED Speed Up Formula E-car Rase Case Investigation In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ అధికారులు స్పీడ్‌ పెంచారు. తాజాగా కారు రేసింగ్‌కు సంబంధించి ఏసీబీ.. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించింది. ఇదే సమయంలో ఈ కేసు వివరాలను ఏసీబీ అధికారులు ఈడీకి అందజేశారు.

తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసింగ్ కేసులో వివరాలను ఈడీకి అందజేశారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్‌ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్‌ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్‌ఐఆర్‌ కాపీని కూడా ఏసీబీ.. ఈడీకి అందించింది. ఇక, కొన్ని గంటల ముందే ఈడీ.. ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన కేటీఆర్‌ విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ -కారు రేసింగ్ కేసు విషయమై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కీలక అంశాలను ప్రస్తావన చేసిన ఏసీబీ. కౌంటర్‌లోని విషయాలు.. కారు రేసింగ్‌లో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేర పూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని కౌంటర్‌లో పేర్కొంది. క్యాబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశాడు. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారు. దీని వలన హెచ్ఎండీఏకు 8 కోట్లు అదనపు భారం పడింది. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని అడగడం దర్యాప్తును అడ్డుకోవడమే అవుతుందని తెలిపింది.

అలాగే, కేటీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏసీబీ స్పష్టం చేసింది. అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్‌పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపింది. రాజకీయ కక్షతోనో, అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామని చెప్పడం సరైనది కాదు. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్‌ను ఉల్లంఘించారు. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు ఆయనే చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియ ఆలస్యం అయినందున కేసు కొట్టివేయాలని కోరడం సరైంది కాదు. తీవ్రమైన అభియోగాలు  ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement