పుష్ప: ది రైజ్‌ వచ్చి సరిగ్గా ఏడాది.. స్పెషల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన మూవీ టీం | Allu Arjun Pushpa Completes One Year Movie Team Shares Special Post | Sakshi
Sakshi News home page

Pushpa Movie: పుష్ప పార్ట్‌ 1 వచ్చి ఏడాది పూర్తి.. స్పెషల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన మూవీ టీం

Published Sun, Dec 18 2022 5:05 PM | Last Updated on Sun, Dec 18 2022 5:08 PM

Allu Arjun Pushpa Completes One Year Movie Team Shares Special Post - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది.  ‘పుష్ప అంటే ఫ్లవర్‌‌‌‌ అనుకుంటివా ఫైర్.. తగ్గేదే లే’ అంటూ ఇండియన్‌ బాక్సాఫీస్‌పై దాడి చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టేశాడు ‘పుష్పరాజ్‌’. ఈ మూవీ ఫస్ట్‌పార్ట్‌ పుష్పా: ది రైజ్‌ రిలీజై ఈ రోజుకి(డిసెంబర్‌ 17) సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌ ఓ స్పెషల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. ఈ మూవీ వచ్చి ఏడాది అయిన పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటికి అలానే ఉంది. 

చదవండి: పట్టలేని సంతోషంతో భార్యను హగ్‌ చేసుకున్న అభిషేక్‌.. ఆ రూమర్లకు ఈ వీడియో చెక్‌

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సృష్టించిన సంచలనం, గెలుచుకున్న అవార్డులు, కలెక్ట్‌ చేసిన మొత్తం వసూళ్లను ఈ సందర్భంగా వెల్లడిచింది మూవీ యూనిట్‌. పుష్పరాజ్‌తో రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 365 కోట్లు కలెక్ట్‌ చేసిందని, ఇక పాటలు 6 బిలియన్ల వ్యూస్‌ రాబట్టి తొలి భారత చిత్రంగా నిలిచిందని పేర్కొంది. అదే విధంగా ఇండియన్‌ ఫిలిం ఆఫ్‌ ది ఈయర్‌గా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా గెలిచిందని, అమెజాన్‌ ప్రైంలో అత్యధికంగా చూసిన ఇండియన్‌ మూవీగా పుష్ప నిలిచిందని తెలిపారు. 7 ఫలింఫేర్‌ అవార్డ్స్‌, 7 సైమా ఆవార్ట్స్‌తో పాటు..

చదవండి: రామ్‌ చరణ్‌పై ‘కింగ్‌ ఖాన్‌’ షారుక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

7 సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డులను కైవసం చేసుకున్నట్లు వెల్లడించింది పుష్ప టీం. అలా ఇండియాలో సెన్సెషన్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ ఇటీవల రష్యాలో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 8, 2022లో రష్యా వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ అయిన ఈ చిత్రం అక్కడ సైతం కలెక్షన్స్‌ కొల్లగొడుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పుష్ప టీం రష్యాలో పర్యటించింది. ఈ సందర్భంగా రష్యా టూర్‌లో భాగంగా పుష్ప టీం తీసుకున్న ఫొటోను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఫొటోను షేర్‌ చేశాడు. కాగా పుష్ప పార్ట్‌ 2 రిలీజ్‌ డేట్‌ కోసం ప్రేక్షకులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement