Sukumar Planning for Special Role to Samantha in Pushpa 2 Movie - Sakshi
Sakshi News home page

Samantha : సుకుమార్‌ స్కెచ్‌.. పుష్ప-2లో కూడా సమంత!

Published Sun, Mar 27 2022 8:58 AM | Last Updated on Sun, Mar 27 2022 10:56 AM

Samantha In Pushpa2: But Not For Item Song This Time - Sakshi

సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. పాన్‌ ఇండియా లెవల్‌లో బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రానికి  సీక్వెల్‌ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

'ఊ అంటావా ఉఊ అంటావా మావా' అనే పాటతో ఊపేసిన సమంతలో కూడా మెరవనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. అయితే ఐటెం సాంగ్‌ కోసం కాదు.. ఓ స్పెషల్‌ రోల్‌ కోసం ఆమెను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తుంది. పుష్ప విజయంలో కీలక పాత్ర పోషించిన సమంతను సీక్వెల్‌లో కూడా భాగస్వామ్యం చేయాలని సుక్కు భావిస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించన చర్చలు కూడా జరిగినట్లు సమాచారం​. ఇక పుష్ప-2 కూడా బన్నీకి జోడీగా రష్మిక మందన్నా కంటిన్యూ కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement