Watch: Pushpa Dakko Dakko Meka Full Video Song Released - Sakshi
Sakshi News home page

Pushpa Songs: 'దాక్కో దాక్కో మేక' ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Published Thu, Dec 30 2021 11:08 AM | Last Updated on Thu, Dec 30 2021 11:56 AM

Watch: Pushpa Dakko Dakko Meka Full Video Song Released - Sakshi

Dakko Dakko Meka Full Video Song From Pushpa  Released: అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్‌ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే.

తాజాగా పుష్ప చిత్రంలోని తొలి సాంగ్‌ 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఫుల్‌సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఇక ఈ చిత్రంలోని అన్ని పాటలను చంద్రబోస్‌ రాయడం విశేషం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement