Chandrabose
-
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
'డ్రింకర్ సాయి' నుంచి యూత్ ఫుల్ లవ్ సాంగ్ విడుదల
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'డ్రింకర్ సాయి'. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.'బాగి బాగి..' లిరికల్ సాంగ్‌ను శ్రీ వసంత్ మంచి బీట్తో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. జావెద్ అలీ ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ పాట ఎ యూత్ ఫుల్ లవ్ సాంగ్‌గా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌లో హీరో ధర్మ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. -
నెమలికళ్ల తూగుతున్న తూనీగల్లా.. పాట విన్నారా?
కొత్త కంటెంట్‌తో రిఫ్రెషింగ్ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల గణేష్ మాస్టర్ చేతుల మీదుగా విడుదల చేసిన గు...గుగ్గు అనే పాటకు కూడా మంచి స్పందన వస్తోంది.తాజాగా ఈ చిత్రం నుంచి మరో బ్యూటిఫుల్ మెలోడి సాంగ్ చూడకయ్యో.. నెమలికళ్ల అనే పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్, ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ల తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది. మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా ఉంది. గాయనీ సునీత, సాయిచరణ్ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు 'ప్రణయగోదారి'. టైటిల్ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాను' అన్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. -
సొంతూరు కోసం మంచి మనసు చాటుకున్న చంద్రబోస్
ప్రముఖ సినీ రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో ఆస్కార్ గ్రంథాలయం నిర్మించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సమయంలో తన గ్రామ ప్రజలు ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా చల్లగరిగెలో తనకు దక్కిన గౌరవానికి గుర్తుగా 'ఆస్కార్ గ్రంథాలయం' ఏర్పాటు చేస్తానని చంద్రబోస్ మాట ఇచ్చారు. గ్రామంలో ఇది వరకే ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి రూ. 36 లక్షలతో కొత్త భవనాన్ని ఆయన నిర్మించారు.నేడు జులై 4న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చంద్రబోస్ చేతుల మీదుగా ఆ గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు. రెండంతస్తులతో అన్ని వసతులతో దానిని ఆయన నిర్మించారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న గ్రామంలోని యువకులకు అవసరమయ్యే అన్నీ పుస్తకాలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు.సుమారు 30 ఏళ్ల కెరీర్లో సినీ పాటల రచయితగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు చంద్రబోస్. 860 సినిమాల్లో 3600కిపైగా పాటలు ఆయన రాశారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టిన చంద్రబోస్ అసామాన్యంగా చిత్రసీమలో ఎదిగారు. రాబోవు తరాల కవులకి ఆయన జీవితం, ప్రయాణం ఆదర్శవంతం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన రచించిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. కొండపొలం (2021) సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు ఎస్సార్ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ఆయన అందుకున్నారు. -
కుర్రాళ్ళ గుండెల్లో మోత మోగించే పాట విడుదల చేసిన విశ్వక్
టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. రీసెంట్గా ‘గామి’ చిత్రంలో అఘోరా పాత్రలో నటించిన విశ్వక్ ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన నటించిన మరో కొత్త చిత్రం విడుదలకు రెడీగా ఉంది. విశ్వక్, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి తాజాగా అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'మోత మోగిపోద్ది..' అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్ నెట్టింట దుమ్మురేపుతుంది. ఈ పాటలో విశ్వక్‌తో అయేషా ఖాన్ తన అందచందాలతో స్టెప్పులేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. రంగస్థలం సినిమాలో 'రంగమ్మా మంగమ్మా' పాటతో మెప్పించిన 'ఎమ్ఎమ్ మానసి' ఇప్పుడు 'మోత మోగిపోద్ది..' అంటూ అదిరిపోయే సాంగ్ పాడింది. ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రియదర్శి సరసన కనిపించిన అయేషాఖాన్ ఆ సినిమాతో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో ఈ ఐటమ్ సాంగ్‌తో మోత మోగిపోయేలా స్టెప్పులు వేసింది. మే 17న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. -
Mega 156 Pooja Ceremony Photos: చిరంజీవి-వశిష్ఠ 'మెగా 156' సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు
-
‘మిస్టరీ’ పాట బాగుంది: చంద్రబోస్
అలీ, తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘మిస్టరీ’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటిస్తున్నాడు. స్నప్ప చౌదరి హీరోయిన్. అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి 'ఎదురయ్యే సవాళ్లు' పాట ను ఆస్కార్ అవార్డ్ విజేత పాటల రచయిత చంద్ర బోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ తవ్వ స్వరపరిచిన 'ఎదురయ్యే సవాళ్లు' చాలా బాగుంది. ఈ పాటకి సాహిత్యం అందించిన శ్రీనివాస్ సూర్య కి, పాడిన మనోజ్ కి అభినందలు. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నాను’అని అన్నారు. ‘ఇదొక కామెడీ థ్రిల్లర్. ఔట్పుట్ బాగొచ్చింది. పాటలతో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని డైరెక్టర్ సాయికృష్ణ అన్నారు. నేను అడగగానే మా సినిమా లోని పాటని చంద్రబోస్ గారు విడుదల చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను’అని హీరోయిన్ స్వప్న చౌదరి అన్నారు. -
ఆస్కార్‌లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ
ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం. తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్‌నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్‌కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్‌షిప్‌లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ... ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్‌లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు. దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్‌లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. గర్వంగా ఉంది – రాజమౌళి ‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కొత్త రూల్ ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్‌లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ఉండాలి, థియేటర్స్‌లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట. ఇకపై ఆస్కార్‌కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్‌లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్‌ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్. ఆ నలుగురికీ గౌరవం ‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్‌కి, ఫ్యాన్స్‌కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్‌గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్‌ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్లతో పాటు సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్‌లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్‌లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు. -
వరంగల్ స్టూడెంట్ ఇవాళ ఆస్కార్‌ను తీసుకొచ్చాడు: అల్లు అరవింద్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికపై ఆర్ఆర్ఆర్ టీంకు అభినందన సభ నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ. 'కలలో కూడా కనలేని ఆస్కార్ ఈ రోజు రాజమౌళి టీం వల్ల సాధ్యమైంది. క్షణక్షణం నుంచి మొదలైన కీరవాణి ప్రస్థానం ఈ రోజు ఆస్కార్ అందుకునే స్థాయికి వచ్చింది. వరంగల్‌లో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ ఈ రోజు ఎక్కడో ఉన్న ఆస్కార్‌ను తీసుకొచ్చాడు. అతనే చంద్రబోస్. ఈ రోజు తెలుగు సినిమా అంటే అందరూ తిరిగి చూసే స్థాయికి తీసుకొచ్చారు. రాజమౌళి చిత్రబృందం తెలుగు సినిమాస్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. చంద్రబోస్ మాట్లాడుతూ..' సినీ ఇండస్ట్రీ అంత మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు కీరవాణి మాటలతో నా జీవిత గమనం మార్చింది. ఆస్కార్ ఎనౌన్స్ చేసేటప్పుడు నేను భయంతో కీరవాణి చెయ్యి పట్టుకున్నా. ఆస్కార్ పట్టుకున్న వెంటనే భారతీయ కీర్తి పతాకాన్ని పట్టుకున్నాననే భావన కలిగింది. ఆస్కార్ అందుకోవడం నా జన్మలో చేసుకున్న అదృష్టం. కీరవాణితో నాది 28 ఏళ్ల అనుబంధం. బాహుబలిలో నాకు అవకాశం రాకున్నా.. ఆర్ఆర్ఆర్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుని సహనంతో ఉండి ఈ పాట రాయడానికి దాదాపు 17 నెలలు పట్టింది.' అని అన్నారు. సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి మాట్లాడుతూ:.. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం వెనుక మూల విగ్రహాలు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. నేను చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలు మాత్రమే. తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు ఒక్కచోట చేరి ఇలా పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది. నా మొట్ట మొదటి పాట చేసింది చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థియేటర్ అది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన నాకు కృష్ణంరాజు సూర్యనారాయణ రాజు ఇచ్చారు. ఆస్కార్ వల్ల నేను ఎక్సయిటింగ్ అవ్వలేదు. నిజంగా ప్రతిష్టాత్మకమైన అవార్డ్. ఈ పాటకు అందరూ ఎంతో కష్టపడి చేశారు. ఈ సినిమా కోసం ఆస్కార్ మెంబర్స్‌కి షోస్ వేసి చూపించాం. వాళ్లకు నచ్చింది. అందరూ సమిష్టిగా చేసిన కృషికి లభించిన విజయానికి మీరందరు వేడుక చేయడం సంతోషంగా ఉంది.' అని అన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ..' ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. బాహుబలి సినిమాతో టాలీవుడ్ విశ్వ వ్యాప్తంగా విస్తరించింది. ఆ సినిమాకు కూడా ఆస్కార్ అవార్డ్స్ రావాల్సింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా సీఎం కేసీఆర్, ప్రభుత్వం సహకారం అందించింది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు తెలుగులోనూ వస్తున్నాయి. లక్షలాది మందికి అన్నం పెడుతున్న పరిశ్రమ తెలుగు సినిమా. పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం.' అని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ' ఈరోజు ఆస్కార్ అవార్డు రావడం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. తెలంగాణ వస్తే సినీ పరిశ్రమ వస్తే ఏమౌతుందోనని అనుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా మా పోరాటం పాలకుల మీద కానీ ప్రజల మీదకు కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భాషను యాసను సినిమాల్లో అవమానించేవారు అని మేము బాధ పడేటోళ్లం. కానీ ఈరోజు గర్వపడుతున్నాం. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలినేదే మా ధ్యేయం. తెలంగాణలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ షూటింగ్స్ జరుపుకోవడానికి మేము సహకరిస్తాం. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి.' అని అన్నారు. -
'నాటు నాటు' పాట అలా పుట్టింది... వెల్లడించిన చంద్రబోస్
చిట్యాల: చల్లగరిగలో చిన్నప్పుడు నేర్చుకున్న పదాలతోనే ‘నాటు నాటు’పాట పుట్టింది.. దీంతో ఊరికే ఆస్కార్ అవార్డు దక్కిందని.. సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు రాసిన ‘నాటు నాటు’పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు స్వీకరించిన అనంతరం సొంత ఊరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు ఆదివారం వచ్చిన చంద్రబోస్ దంపతులు.. స్థానిక శివాలయంలో పూజలు చేశారు. ఇంటినుంచి పాఠశాల వరకు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వెళ్లారు. చంద్రబోస్ చదివిన పాఠశాల 1969–2022 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు అతన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ గ్రంథాలయం నుంచే తనకు అక్షర బీజం పడిందని.. ఇప్పడు శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని పునర్నిర్మిస్తానని చెప్పారు. గ్రామస్తులతో చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. -
'నాటు నాటు' రచయిత చంద్రబోస్ గ్రామంలో సంబరాలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ భారత చిత్రపరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ వరించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటకు తన కలంతో ప్రాణం పోసిన గీతరచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందనగానే గ్రామస్తులు బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రాసిన పాట ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం తెలుగు జాతికే గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఆస్కార్ విజయంపై చంద్రబోస్ భార్య ఎమోషనల్
-
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా ఆర్ఆర్ఆర్ జోరు తగ్గలేదు. ఇటీవలె ఈ సినిమాలోని ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న, జూనియర్, రామ్ చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇక ఈనెల 13న 95వ అకాడమీ (Oscars 2023)అవార్డులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని తెలుగువారితో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. తాజాగా నాటు నాటు పాట, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నాటునాటు పాట గురించి ప్రస్తావిస్తూ.. ''అచ్చ తెలుగులో రాసిన ఈ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటన,కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వం, చంద్రబోస్ అద్భుత రచన కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది. గుడికి వెళ్తే ఆస్కార్ పురస్కారం రావాలని దండం పెట్టండి.ఇక నాటునాటులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల నటన అద్భుతం. నాటు నాటు పాటలో ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు. కవలలై పుట్టినవారికి కూడా ఇది సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను'' అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. -
నాటు నాట్ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాల గర్వంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి
-
ఆయన సరస్వతి పుత్రుడు.. తెలుగువారికి ఇది గర్వకారణం: చిరంజీవి
టాలీవుడ్ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. ఆయన రచించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చినందుకు మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించారు. చిరు తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విజయోత్సవ సమావేశంలో చంద్రబోస్‌ను చిరంజీవి, రవితేజ ఘనంగా సన్మానించారు. చిరంజీవి మాట్లాడుతూ.. 'చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గర్వకారణంగా ఉంది. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణితోపాటు ఈ పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. తెలుగు వాళ్లందరి తరఫున చంద్రబోస్‌కు నా ప్రత్యేక అభినందనలు. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడు.' అంటూ కొనియాడారు. కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. మొదటిసారి తెలుగు సినిమాకు ఈ ఘనత దక్కడంతో పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ గేయరచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ దంపతుల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సుచిత్ర తండ్రి, చంద్రబోస్ మామగారు చాంద్ బాషా (92) శుక్రవారం రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేశారు. చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు ,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం , మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు.ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగనున్నాయి. చాంద్ బాషా మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చంద్రబోస్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్
ప్రముఖ నవలా రచయిత, మోటివేషనల్ స్పీకర్ యండమూరి వీరేంద్రనాథ్‌కు సినీ గేయ రచయిత చంద్రబోస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చంద్రబోస్ రాసిన టైటిల్ సాంగ్‌పై ఫేస్బుక్ వేదికగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ పాటలో సాహిత్యం అర్థం లేకుండా ఉందని, పాటలోని కొన్ని పంక్తులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడే వీడే..తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే’ అనే పంక్తిని ఉద్దేశిస్తూ ‘తిమిరము’ అంటే అర్థం తెలుసా? శివదూషణ కాదా ఇది? ఎవరు రాశారో కానీ ఏమిటీ పిచ్చి రాతలు? అంటూ యండమూరి వీరేంద్రనాథ్ పోస్ట్ చేశారు. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ ఆయన కామెంట్స్‌కి చంద్రబోస్ గట్టిగా బదులిచ్చారు. తాను రాసిన పాటలోని లైన్లు విరోధాబాసాలంకారం కిందకు వస్తాయని, పరస్పర విరుద్ధమైన రెండు పదాలు కలయికను లోతుగా పరికిస్తే విరోధం తొలగిపోయి ఆ పదబంధం లోతు తెలుస్తుందన్నారు. ఇది రచయితలు అందరికీ తెలుసని, తనకు తెలిసే ఈ ప్రయోగం చేశానని వివరణ ఇచ్చారు. అసలు తిమిరంలోని నిగూడార్థం తెలియని వారే అసలైన తిమిరమంటూ చంద్రబోస్ రీకౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ప్రముఖ రచయిత సత్యానంద్ ఫోన్ చేసి సాహిత్యపరంగా అధ్యయనం చేయాల్సిన గీతమిదని ప్రశంసించారన్నారు. చదవండి: సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్ యానిమల్ నుంచి క్రేజీ అప్డేట్ -
ఈ మధ్య నేను విన్న పాటల్లో చాలా అరుదైన పాట అదే : చంద్రబోస్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ "వాసవసుహాస" పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాటపై ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ ప్రశంసలు కురిపించారు. ''నేను ఈ మధ్య విన్న పాటల్లో చాలా చాలా అరుదైన,విలువైన పాట.వినగానే ఆశ్చర్యానందానికి లోనైన పాట..వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని వాసవ సుహాస గీతం.రాయడానికి ఎంత ప్రతిభ ఉండాలో దాన్ని ఒప్పుకోడానికి అంత అభిరుచి, భాషా సంస్కరం వుండాలి. కవి కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయపూర్వక ఆశంసలు'' అంటూ చంద్రబోస్ అభినందించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. -
ఆధ్యాత్మికం ఉట్టిపడేలా 'దేవ దేవ' పాట విడుదల
Deva Deva Song Out From Brahmastra Movie: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్. ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'కుంకుమల' వీడియో సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా 'దేవ దేవ' అనే మరో పాటను విడుదల చేశారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ సాంగ్‌కు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రీరామ చంద్ర, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాట ఆధ్యాత్మికతతో ఉల్లాసభరితంగా సాగింది. ఈ పాట గురించి 'నేను ఈ సాంగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. ఈ పాటతో ఆధ్యాత్మికంగా శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతి పొందుతారని నేను ఆశిస్తున్నాను' అని రణ్‌బీర్ కపూర్ తెలిపాడు. 'ఈ పాటను విడుదల చేసేందుకు శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను' అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
ఆటా వేడుకలకు సర్వ సిద్ధం: అతిథులతో కళకళ లాడుతున్న వేదిక
వాషింగ్టన్: అమెరికా తెలుగు సంఘం (ఆటా)17వ ఆటా మహసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభంగా జరిగే ఈ వేడుకలకోసం తెలుగువారంతా అమెరికాకు చేరుకుంటున్నారు. పదివేలమందికిపైగా హాజరవుతారని భావిస్తున్న ఆటా మహాసభలకు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాషింగ్టన్ డీసీకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు తమన్, చంద్రబోస్, శివారెడ్డి , సింగర్ మంగ్లీ తదితరులు ఏటీఏ కాన్ఫరెన్స్‌కు చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్న వేడుకల కోసం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా కోవిడ్ కారణంగా రెండేళ్ళలో వేడుకలు ఇంత పెద్ద ఎత్తున జరగకపోవడం, కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరింత ఉత్సాహం నెలకొంది. ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా, ఉత్సాహంగా సభలను నిర్వహించేందుకు ఎద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఆటా అధ్యక్షుడు తెలిపారు. -వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
కమల్ హాసన్ పాడిన పాట విన్నారా !
Kamal Haasan Vikram Telugu Version First Lyrical Mathuga Mathuga Released: సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై తన నట విశ్వరూపాన్ని చూపేందుకు రెడీ అయ్యాడు కమల్ హాసన్. యూనివర్సల్ హీరో కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విక్రమ్. అలాగే సూర్య అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్‌పై నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'విక్రమ్' తెలుగు వెర్షన్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'మత్తుగా మత్తుగా' అంటూ సాగే ఈ పాటను కమల్ హాసన్ ఆలపించడం విశేషం. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ 'రా' ఏజెంట్‌గా అలరించనున్నారని సమాచారం. చదవండి: మెటావర్స్ వెర్షన్లో 'విక్రమ్'.. తొలి మూవీగా రికార్డ్ -
పుష్ప: 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
Dakko Dakko Meka Full Video Song From Pushpa Released: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప చిత్రంలోని తొలి సాంగ్ 'దాక్కో దాక్కో మేక' ఫుల్ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఒకేసారి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఫుల్‌సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రంలోని అన్ని పాటలను చంద్రబోస్ రాయడం విశేషం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. #DaakkoDaakkoMeka #OduOduAadu #OduOduAade #JokkeJokkeMeke Full video song out now 🔥🔥 ▶️ https://t.co/js1UAKhvj1#PushpaTheRise@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/7KTSyZlCr0 — Pushpa (@PushpaMovie) December 30, 2021 -
‘కలయా.. నిజమా.. గుండెలను పిండేసేలా ఉంది’
‘‘కలయా నిజమా... అనే పల్లవితో సాగే పాటలో కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యాన్ని పొందుపరిచారు. ఈ పాట గుండెలను పిండేసేలా ఉంది. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రాణం పోశాయి’’ అని పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. నాగవర్మ, దివ్యా సురేశ్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో నాగవర్మ బైర్రాజు నిర్మించిన చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలోని ‘కలయా.. నిజమా’ అంటూ సాగే పాటను చంద్రబోస్ విడుదల చేశారు. ‘‘ప్రేమించిన అమ్మాయి కోసం ఓ సినిమా రచయిత ఏం చేశాడు? అనే ప్రేమకథకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా తీశాం’’ అన్నారు హరిచందన్. ‘‘అక్టోబర్‌లో మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ. -
నాట్స్ కవితల పోటీ పురస్కార విజేతలు
డల్లాస్ : భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా "నా దేశం-నా జెండా" అనే అంశంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితాస్పర్థలో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కవులు పాల్గొన్నారు. 913కి పైగా అందిన కవితల్లోంచి 9 మందిని విజేతలుగా ఎంపిక చేసి, వారితో కవి సమ్మేళనం నిర్వహించిన అనంతరం ఎవరు ఏ పురస్కారాన్ని అందుకున్నారో ప్రకటించామని ఈ కార్యక్రమ నిర్వాహకులు డా.సూర్యం గంటి తెలిపారు. నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె, నిర్వాహకులు డా సూర్యం గంటి, డా. ఆళ్ల శ్రీనివాస రెడ్డి విజేతలను ప్రకటించారు. విజేతలు.. వారి బహుమతులు సర్వోత్తమ పురస్కారం: రూ 20,000/-: దోర్నాథుల సిద్ధార్థ ఉత్తమ పురస్కారం: రూ 15,000/-: వంగర పరమేశ్వర రావు విశిష్ట పురస్కారం: రూ 10,000/-: నూజిళ్ల శ్రీనివాస్ విశేష పురస్కారం: రూ 5,000/-: కిరణ్ విభావరి గౌరవ పురస్కారం-1: రూ. 2000/- : వినీల్ కాంతి కుమార్ (శతఘ్ని) గౌరవ పురస్కారం-2: రూ. 2000/- : శిరీష మణిపురి గౌరవ పురస్కారం-3: రూ. 2000/- : జోగు అంజయ్య గౌరవ పురస్కారం-4: రూ. 2000/- : అల్లాడి వేణు గోపాల్ గౌరవ పురస్కారం-5: రూ. 2000/- : చెరుకూరి రాజశేఖర్ "పురస్కారాలు గెలుపొందిన తొమ్మిది మంది కవులూ సినీ కవులైన చంద్రబోసు, భాస్కర భట్ల, సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రితో కవితా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 14 సాయంత్రం తెలుగువారు అభివృద్ధి చేసిన ఆన్‌లైన వీడియో ప్లాట్‌ఫాం https://nristreams.tv/NATS-live/ లోనూ నాట్స్ యూట్యూబ్ ఛానల్లోనూ, సామాజిక మాధ్యమంలోనూ ప్రసారం చేశామని, దీన్ని అధిక సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారని సంచాలకులు రాజశేఖర్ అల్లాడ తెలిపారు. మొదటి సారిగా ఈ ప్రయత్నం చేశాం. అనుకున్నదాని కంటే గొప్ప స్పందన లభించిందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. "భాషే రమ్యం- సేవే గమ్యం మా నాట్స్ నినాదం. ఆ దిశలో భాష విషయంలో చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. కవితల పోటీలలో పురస్కారాలు గెలుచుకున్న విజేతలకు శుభాకాంక్షలు. ఇంకా మరిన్ని కవితలు మరింత గొప్పగా వ్రాయాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన చంద్రబోసు గారికి, సిరాశ్రీ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, భాస్కరభట్ల గారికి కృతజ్ఞతలు" అని నాట్స్ నూతన అధ్యక్షులు శేఖర్ అన్నె చెప్పుకొచ్చారు. (500 పేద కుటుంబాలకు నాట్స్ సాయం) "ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెయ్యాలనే ఉత్సాహం నాట్స్ కి కలుగుతోంది. దీనికి కారణభూతమైన అశేషమైన కవులకు, కవయిత్రులకు మా కృతజ్ఞతలు. తెలుగు భాషకు చేస్తున్న సేవలో మీ ప్రోత్సాహం శిరోధార్యం", అని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని తెలిపారు. యాప్‌లో ప్రసారమైన ఆన్లైన్ కవి సమ్మేళన కార్యక్రమంలో చివరిగా సినీ కవులు కూడా తమ దేశభక్తి కవితలను చదివి వినిపించారు. "విశేషమేమిటంటే జూమ్‌లో కాకుండా పూర్తిగా తెలుగువారి చేత తయారు చేయబడిన NRI STREAMS CONNECT APP ద్వారా ఈ ఆన్లైన్ కవి సమ్మేళనాన్ని నిర్వహించడం మరింత ఔచిత్యంగా అనిపిస్తోంది" అని సినీ కవి చంద్రబోస్ అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ లింకుల్లో చూడవచ్చు: https://nristreams.tv/NATS-live/ అండ్ https://www.youtube.com/watch?v=yWoDY7queO0 -
‘ఒక్క అడుగు నాతో వేస్తే చాలు’
‘ఒకసారి చూస్తే చాలు.. ఒకసారి నవ్వితే చాలు.. ఒక అడుగు నాతో వేస్తే చాలు.. ఒక రిప్లై ఇస్తే చాలు.. ఒక స్మైలీ పెడితే చాలు.. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. నాతో నువ్వుంటే చాలు.. కోరుకోను ఇంకేం వరాలు’అంటూ సాగే ఈ పాట లవర్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. అంతేకాకుండా వాట్సప్ స్టేటస్, కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్స్‌లలో ఈ పాట మార్మోగటం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ పాటకు ట్యూన్ కట్టగా.. చంద్రబోస్ లిరిక్స్‌ను అందించాడు. ఈ పాటకు వీరిద్దరు ఒకెత్తయితే అద్నాన్ సమీ వాయిస్ ఈ పాటకు మరింత హైలెట్‌గా నిలిచింది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న ‘90 ఎం.ఎల్’ సినిమాలోని మరో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. చంద్రబోస్ అందించిన హార్ట్ టచింగ్ లిరిక్స్‌తో పాటు అద్నాన్ సమీ వాయిస్ ఎక్స్ట్రార్డినరీగా నిలిచింది. ఇక జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ కూడా కొత్తగా ఉంది. ఓవరాల్‌గా అన్ని హంగులు జోడించి విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి కథానాయికగా కనిపించనుంది. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వాణిజ్య అంశాలతో వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఈ చిత్రంలో రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్, ప్రగతి, ప్రవీణ్ తదితరులు నటించారు. -
నాన్నా! నేనున్నాను
అమ్మ పాలు పడితే.. నాన్న జీవితాన్ని పిండి చెమట చిందిస్తాడు. పాలు తియ్యగా ఉంటాయి. చెమట ఉప్పగా ఉంటుంది. ఇవాళ తిన్న ఆ ఉప్పుకి రుణం తీర్చుకోవాలి. ‘నాన్నా! నేనున్నాను’ అని అయినా చెప్పండి. జనరల్‌గా అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడతాం.. నాన్న గురించి తక్కువ మాట్లాడినట్లనిపిస్తుంటుంది. ఎందుకు అమ్మ గురించే ఎక్కువ మాట్లాడతాం? నిజమే. సమాజంలో అమ్మ గురించి మాట్లాడినంత ఎక్కువగా నాన్న గురించి మాట్లాడం. అలాగని నాన్నను తగ్గించినట్లు కాదు. నాన్నను అర్థం చేసుకోవడంలో మనదే లోపం. సత్యం మాతా; పితా జ్ఞానం అన్నారు. సత్యం తల్లి. జ్ఞానం తండ్రి. కానీ నా దృష్టిలో ఇది సత్యం... ఇది అసత్యం అని తెలుసుకోవడానికి కూడా జ్ఞానం కావాలి. కాబట్టి నాన్న ఎప్పుడూ గొప్పవాడే. నాన్నను తక్కువ చేసినా అది తక్కువయ్యేది కాదు. ఎందుకంటే ‘‘కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా.. నడిపించిన మా నాన్నకు నాన్నయ్యానుగా’’ అని ‘మనం’ సినిమా కోసం పాట రాశాను. చెడ్డ ప్రియురాలు ఉండొచ్చు. చెడు స్నేహితురాలు ఉండొచ్చు. కానీ చెడ్డ తల్లి ఉండదు అంటారు. అమ్మ కని పెంచుతుంది. అసలైన జీవన మార్గంలో మనం ముందుకు వెళ్లడానికి, మన లక్ష్యం వైపు వెళ్లడానికి శక్తిని, సామర్థ్యాన్ని, తెలివిని, విద్వత్తును ఇచ్చి దారిని చూపించి .. ఇలా వెళ్లు నీ గమ్యం వస్తుంది అని ఒక సద్బుద్ధిని, సన్మార్గాన్ని చూపించేవాడు నాన్న. నా దృష్టిలో కని పెంచడంకన్నా.. నడిపించేవాడు ఇంకా గొప్ప. ఎందుకంటే... తల్లి కన్న తర్వాత వాడు మంచివాడు కావొచ్చు. చెడ్డవాడు కావొచ్చు. కానీ నడిపించేవాడు.. నడిపించే శక్తి లేకపోతే వారు దుర్మార్గులు కూడా అవొచ్చు. రాక్షసులు కావొచ్చు. నడిపించేవాడు సరిగ్గా ఉంటేనే కని పెంచినదానికి ఓ అర్థం. నాన్న గురించి ఇంత బాగా చెప్పారు. అమ్మ గొప్పతనం గురించి ‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ’ అని రాశారు. ఆ పాట రాసిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటారా? మా అమ్మగారిని ఊహించుకునే ఆ పాట రాశాను. ఎందుకంటే ఆ ట్యూన్ నా దగ్గరకు వచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. నేను భోజనం చేసి అంతా సిద్ధం చేసుకునే సరికి 12 అయ్యింది. పాట రాయడానికి అప్పుడు కూర్చున్నాను. ఆ ట్యూన్ కొత్తగా ఉంటుంది. ఆస్వాదించి రాయాలి. ఒంటి గంటకు ఆ ప్రవాహం ప్రారంభమైంది. రాసే ముందు మా అమ్మను ఓసారి తలుచుకున్నాను. ఆమె పడ్డ కష్టాన్ని, చేసిన త్యాగాన్ని, శ్రమను గుర్తు చేసుకున్నా. అలాగే నా పిల్లలకు తల్లి అయిన నా భార్య గురించి ఆలోచించాను. అలా నాకు ఇద్దరు అమ్మలు. వారిద్దరినీ నా మనోఫలకంపై గుర్తు చేసుకున్నాను. నాకు తెలియకుండానే, నాలో ఏదో శక్తి ప్రవేశించి ఆ పాట రాయించిందని నా అభిప్రాయం. ఆ రోజు ఆ పాటను నేను రాశానా? లేక మా అమ్మ రాయించిందా. నా భార్య రాయించిందా? లేక పైన ఉన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ రాయించిందా? తెలియదు. ప్రపంచంలోని అమ్మలందరికీ చెందుతుంది ఈ పాట. ఎందుకంటే మనలోని ప్రాణం అమ్మ. మనదైన రూపం అమ్మ. ఎనలేని జాలిగుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ. కరుణించే కోపం అమ్మ. వరమిచ్చే తీపి శాపం అమ్మ. అమ్మ కోప్పడినా అది కోపం కాదు కరుణ. కరుణకు మరో రూపం. అమ్మ శాపనార్థాలు పెట్టినా అవి మనకు దీవెనలే. అమ్మ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహిస్తే మనకు అది అర్థం అవుతుంది. ఆ దూషణలే తర్వాత భూషణలు అవుతాయి అని. ఆ ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకుని మనల్ని మనం మార్చుకుంటే..మనల్ని మనం మలుచుకుంటే ఆ తిట్లు మనం జీవితంలో పైకి రావడానికి మెట్లుగా వాడుకోవచ్చు. ప్రతి తిట్టు మనం పైకి ఎదగడానికి దోహదపడటానికి మెట్టు. నాన్న గురించి పాట రాయలేదేమో? ఆ అవకాశం నాకు ‘శత్రువు’ అనే చిన్న సినిమాకి వచ్చింది. అయితే ‘మనం’ సినిమాలో అమ్మ గురించి, నాన్న గురించి ఒకే పాటలో రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ‘ఒకరిది కన్ను.. ఒకరిది చూపు’ అని రాశాను. కన్ను అమ్మ అయితే చూపు నాన్న. కన్ను మూసుకుంటే లాభం ఏముంది? తెరిచి చూడాలి. కంటికి ప్రయోజనం చూపు. చూపుకి ఎంత ప్రయోజనం ఉందో చెబుతున్నాం. అలాగే ‘ఒకరిది మాట ఒకరిది భావం’ అని రాశాను. అంటే మాట ఒకరు.. అర్థం ఒకరు అని. మాట లేనిదే అర్థం లేదు. అలాగే మాటల్లేని భావం కూడ వ్యర్థమే. మాట, అర్థం రెండూ ఉండాలి. తల్లిదండ్రుల్లో ఎవరు గొప్పవారు అనే విషయం పక్కనపెడితే ఇద్దరి కలయికలోనే మనం వచ్చింది. మన శరీరంలోని ప్రతి కణంలో వారి తాలుకూ అంశలు ఉంటాయి. అమ్మలోని ఓర్పు... నాన్నలోని చాకచక్యం. తెలివి ఇలా అన్నీ ఉంటాయి. బీజం, క్షేత్రం రెండూ ఉంటేనే కదా ఫలం వచ్చేది. వారిద్దరికీ సమప్రాధాన్యం ఉంది కాబట్టే మనం ఈ రోజు ఇలా ఉన్నాం. అమ్మానాన్నను పాటల రూపంలో కీర్తించడం బాగుంది. కానీ మనం వారిని ఎలా చూసుకోవాలి? మన కోసం ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలను ఓర్చుకుంటారు. త్యాగాలు సపర్యలు, సేవలు చేసీ చేసీ వాళ్ల యవ్వనాన్నంతా మనకోసం ధారపోస్తారు. వాళ్లు తాజాగా ఉన్నప్పుడు మన కోసం కరిగిపోతారు. వారి శరీరం వంగిపోయినప్పుడు, ముడతలు పడేలా కష్టపడినప్పుడు, వారి వృద్ధాప్యంలో మనం వారికి ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? అన్నది ముఖ్యం. ‘అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా.. అడుగులు, నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా’ అని పాటలో రాశాను. చిన్నప్పుడు మనకు అడుగులు, నడకలు నేర్పించిన నాన్నకు మనం నేడు మార్గం కావాలి. దారి చూపించాలి. ఇప్పటి కాలంలో మనం సాంకేతికంగా చాలా ముందు ఉన్నాం. ఇదంతా నాన్నకు తెలియదు. మనం నాన్నకు తెలియజెప్పాలి. చెప్పడానికి విసిగించుకోకూడదు. చీదరించుకోకూడదు. నాన్నకు అన్నీ బోధపడేలా చెప్పాలి. ఆయన మనకోసం చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా మనం ఏం ఇస్తున్నాం? ఆ వయసులో వారు కోరుకునేదేంటి? కాస్తంత ప్రశాంతత. వాళ్లు ప్రశాతంగా ఉండేలా చూడాలి. మన పిల్లలతో ఆడుకునే సమయాన్ని ఇవ్వాలి. ఆయన తన అనుభవాలను చెబుతుంటే శ్రద్ధగా వినాలి. విని వారిని సంతోషపెట్టాలి. వారి మాటల్లోని అనుభవసారాన్ని గ్రహించి మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అప్పుడు వారి వృద్ధాప్యం కూడా బాగుంటుంది. వృద్ధాప్యం వారికి శాపంలా అనిపించకూడదు. స్వామి వివేకానంద ‘భరత భూమి నా బాల్యడోల. నా యవ్వన నందనవనం. నా వార్ధక్యం వారణాసి’ అన్నారు. వారణాసి అంటే పుణ్యక్షేత్రం. వృద్ధాప్యం అంత పవిత్రమైనది అని అర్థం. మనం అంత పవిత్రంగా వారిని చూసుకోవాలి. వారు ఉండే వాతావరణం కానీ ప్రదేశాన్ని బాగా ఉంచాలి. తల్లిదండ్రులను బాగా చూసుకుంటే వారి రుణం తీర్చుకున్నట్లే అంటారు. కానీ ఆ రుణం తీరనిది. మనం దయారుణాన్ని మాత్రమే తీర్చుకుంటాం. అది ప్రయత్నం. మనకు ఇంత గొప్ప శరీరాన్ని, మనస్సును, జ్ఞానాన్ని అందించారు. ప్రపంచంలోకి తెచ్చారు. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులు అడుగులు తడబడే వయసులో ఉన్నప్పుడు వారికి మనం ఊతకర్ర అవ్వాలి. మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్న విషయాలు? పిల్లలం ఒక్కోసారి తల్లి చెప్పింది చేస్తాం. ఒక్కోసారి చేయం. కానీ తండ్రి చేసేది మాత్రం కచ్చితంగా వింటాం. అంటే ఆచరిస్తాం అని అర్థం. మా అమ్మ మాకు రకరకాల విషయాలు చెబుతుండేది. జీవితం అంటే ఏంటి? కష్టం, సుఖం ఇలా తనకు తెలిసిన మాటల్లో చెప్పేది. కానీ నాన్న మాత్రం చేస్తుండేవారు. మా నాన్నను చూసి ఒకటే నేర్చుకున్నాం. అది చాలా గొప్ప విషయం. అది గొప్పదని ఎలా తెలిసిందంటే... నాకు జ్ఞానం కలిగాక, చాలా అధ్యయనం చేశాక తెలిసిందే. ఒక శ్లోకం చదివాను. ‘శ్లోకార్థేన ప్రవక్ష్యామి యద్యుక్తం గ్రంథకోటిబిం పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం’. దీని అర్థం ఏంటంటే.. కోటి గ్రంథాలను కాచి వడపోసి ఒక సగం శ్లోకంలో ఇమిడిస్తే ‘పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అయింది’. గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు.. అన్నింటి సారాంశం ఇదే. ఈ విషయాన్ని మా నాన్న అమలు చేశారు. నేను విన్నాను, చూశాను. నాన్న పరోపకారం చేశారు. పరపీడన చేయలేదు. ఆయన చర్యలు, ఆయన చేష్టలు, ఆయన క్రియల ద్వారా ఇది తెలుసుకున్నాను. పరులను ఇబ్బంది పెట్టడం, ఇతరుల సొమ్ము ఆశించడం ఎప్పుడూ చేయలేదు. దీన్నంతా నేను చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఒకే ఒక్క విషయం అది. దాన్ని పాటిస్తున్నాను. కుదిరితే సాయం చేయాలి కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. మీ నాన్నకు, నాన్నగా మీకు ఉన్న తేడాలేంటి? అప్పట్లో మా నాన్నకు ఉన్న పరిధులు వేరు. మేం నలుగురు సంతానం. ఆయనకు సంపాదన అంతగా లేదు. మాది పల్లెటూరు. మమ్మల్ని పెంచడానికి వాళ్లు చాలా కష్టపడ్డారు. మేం కూడా వాటిని అర్థం చేసుకొని పెరిగాం. నేను నాన్న అయ్యేసరికి ఆ కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు లేవు. కాబట్టి పిల్లల్ని పెంచడానికి కష్టపడలేదు. అయితే సాధారణంగా కష్టాల నుంచి సగం నేర్చుకుంటారు. మేం నేర్చుకున్నాం. జీవితం గురించి తెలుసుకున్నాం. నా పిల్లలకు నేర్చుకునే అవకాశం పోయింది. అన్ని సదుపాయాలు కల్పించి, అందించి పిల్లల్ని పెంచడానికి మించిన దురదృష్టం ఇంకోటి లేదు. దాని వల్ల వాళ్లు చాలా కోల్పోతారు. ఇప్పుడు వాళ్లని పెంచడానికి ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను. మంచి మార్గంలో నడపడానికి, బోధించడానికి కష్టపడుతున్నాను. మా నాన్న జీవించడానికి కష్టపడారు. నేను జీవితాన్ని బోధించడానికి కష్టపడుతున్నాను. ఇప్పటి పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనిస్తున్నాం కదా? అవును. ఇప్పుడు నా పిల్లలకు వారు ఎంచుకునే మార్గంలో నడిచే స్వేచ్ఛ ఉంది. చిన్నప్పుడు నాకు అది లేదు. పాటలు పాడకుండా మంచి ఉద్యోగం చేయి అంటూ అప్పుడప్పుడు కోప్పడేవారు నాన్న. మనకు అవి తిండిపెట్టవు, చదువుకోమని చెప్పేవారు. అలా నా చేతికి సంకెళ్లు ఉండేవి. ఆ సంకెళ్లతోటే నేను స్వేచ్చగా ఎగరగలిగాను. ఆ సంకెళ్లు వేసుకునే ఎగిరే విద్య నాకు అబ్బింది. ఆ సంకెళ్లు నాకు వరం అయ్యాయి. విహరించే శక్తి, ఓర్పు నేర్చుకున్నాను. ప్రతికూల పరిస్థితులలో కూడా నన్ను నేను మలుచుకున్నాను, చెక్కుకున్నాను. దానివల్ల ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనే శక్తి ఏర్పడింది. ఇప్పటి తరానికి ఆ అవకాశం తక్కువ. ఇప్పటి పిల్లలకు సంకెళ్లు లేవు. పూర్తిగా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్చ దుర్వినియోగం అవ్వకుండా ఏం చేయాలో మనం చెప్పాల్సి వస్తొంది. పిల్లల్ని ఒకప్పుడు అమ్మే ఎత్తుకునేది. ఇప్పుడు నాన్న కూడా పిల్లల్ని ఎత్తుకుంటారు. ఈ మార్పు గురించి చెప్పండి? నాన్నకు అమ్మతనం వచ్చిందా? ఈ విషయాన్ని మనం రెండు కోణాల్లో చూడొచ్చు. చిన్నప్పుడు మా నాన్న దర్జాగా ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. మా అమ్మ మమ్మల్ని ఎత్తుకొని వెళ్లేది. ఇప్పుడు నాన్న ఎత్తుకుంటున్నారు. వంట పని షేర్ చేసుకుంటున్నారు, ఆర్థిక స్వాతంత్య్రం స్త్రీకి వచ్చింది. ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఆర్థిక భారాన్ని ఇద్దరూ పంచుకుంటున్నప్పుడు, బాధ్యతనూ ఇద్దరూ మోస్తున్నారు. వంటలు అమ్మకే పరిమితం కాదు. స్త్రీకి లభించిన విద్య, ఉద్యోగ అవకాశాలు వల్ల ఆర్థికంగా వాళ్లు భర్తకు తోడు రావడంతో ఇప్పుడు అన్నీ ఇద్దరూ పంచుకునేలా మారాయి. ఇది మంచి పరిణామం. మగవాళ్లు ఇంటి పనులు పంచుకుంటే తక్కువ అయిపోతారనే భావన సమాజంలో పూర్తిగా పోయిందంటారా? పూర్తిగా పోయిందని చెప్పలేం. అక్కడక్కడా ఇంకా ఇలాంటి భావాలు ఉన్నాయి. అయితే నేను ‘మాతృత్వపు మాధుర్యానికి మగ రూపం నాన్న’ అనే వాక్యం ఓ పాటలో విన్నాను. ఇప్పుడు నాన్న కూడా చాలా మెత్తబడిపోతున్నాడు. ఇంతకుముందు అమ్మ మృదువుగా ఉండేది నాన్న కఠినంగా ఉండేవారు. ఇప్పుడు నాన్న కూడా మృదువుగా మారిపోతున్నాడు. ఇంతకుముందు హూంకరించేవాడు, గర్జించేవాడు. ఇప్పుడు లాలించడమే. నాన్న కూడా ఎత్తుకుంటున్నాడు, వంట చేస్తున్నాడు, డైపర్ మార్చడం చేస్తున్నాడు. ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. పిల్లల సంరక్షణ భారంలో పాలుపంచుకుంటున్నాడు. ఓ రకంగా చాలా మంచి మార్పు. ఇద్దరు కలసి కన్నారు.. ఇద్దరు కలసి పెంచాలి. ఇద్దరూ కలసి తీర్చిదిద్దాలి. ఇలా చేయడం హర్షణీయం. మీ చిన్నతనంలో పేదరికం అనుభవించారు. ఇప్పుడు పరిస్థితి వేరు. మరి మీ నాన్న కోసం మీరు ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి? చిన్నప్పుడు పాటలు వినడానికి మాకు రేడియో లేదు. ఒక కరెంట్ బల్బ్ ఉండేది. పాటలు ఎలా వినేవాడిని అంటే.. అప్పట్లో రేడియోలో జనరంజని ప్రోగ్రామ్ వచ్చేది. మా చుట్టుపక్కల చాలామందికి రేడియో ఉండేది. పక్కవాళ్ల ఇంట్లో పల్లవి వచ్చేది. ఆ ఇల్లు దాటేలోపే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. ఇంకో ఇంటికి చేరుకునే సరికి చరణం వచ్చేది. అలా పాటలు వినేవాణ్ణి. రేడియో లేదు అని నిరాశ చెందకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలి అనుకునేవాణ్ణి. ఏకసంథాగ్రాహిత్వం ఆ పేదరికం నుంచే వచ్చింది. రేడియో లేకపోవడం నుంచి వచ్చింది. ఫ్యాను, కనీస వసతులు లేకపోవడం వల్ల ఏ చిన్న అవకాశం దొరికినా కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓ రూపాయి, పాటల పుస్తకం దాచుకోవడం లాంటి లక్షణాలు వచ్చాయి. మా ఊళ్లో మా నాన్నకు మేం పిల్లలందరం కలసి ఇల్లు కట్టాం. కలర్ టీవీ, ఫ్రిజ్, గీజర్ ఇలా అన్నీ పెట్టాం. అన్ని సౌకర్యాలతో కట్టాం. మేమెలా ఉన్నామో వాళ్లు అలానే ఉండాలని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మా అమ్మగారు ఈ మధ్య చనిపోయారు. అది పెద్ద బాధ. రచయితగా మీరు సంపాదించిన కీర్తి ఎంతో. ఆ విజయానికి మీ నాన్న వ్యక్తపరిచిన ఆనందం గురించి? అదో అంతు చిక్కని ప్రశ్న. నేను మా ఊరు వెళుతుంటాను. నా చిన్నప్పుడు ఎలా ఉండేవారో నాతో నాన్న ఇప్పుడూ అలానే ఉంటారు. వేరేవాళ్లతో అలానే ఉంటారు. నా గురించి గొప్పగా మాట్లాడినా అలానే ఉంటారు. అదే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పుడు సైకిల్ మీద 20 కిమీ వెళ్లినప్పుడు ఎలాంటి వ్యక్తిత్వం ఉందో ఇప్పుడు బెంజి కారులో తీసుకెళ్లినా అదే వ్యక్తిత్వం. మట్టిని వదలని మనస్తత్వం ఆయనది. పిల్లల విజయాన్ని బయటకు వ్యక్తపరచకుండానే ఆస్వాదిస్తారు. తల్లి ఎక్కువా? తండ్రి ఎక్కువా? ఇద్దరూ సమానమే. మనకు తల్లి అందించే చనుబాలు ఎంత గొప్పవో తండ్రి చిందించే చమట నీళ్లు కూడా అంతే గొప్ప. రెండిటికీ ఒకటే విలువ అని అంటాను. తల్లి 9 నెలలు మోస్తుంది. తండ్రి తాను బతికున్నంత కాలం మనల్ని మోస్తూనే ఉంటాడు. తన ఊహల్లో, జ్ఞాపకాల్లో తన ఆలోచనల్లో తన కలల్లో నిరంతరం మోస్తూనే ఉంటాడు. నాన్న పాటల్లో మీకు నచ్చినవి? నాన్న మీద చాలా తక్కువ పాటలు వచ్చాయి. కవులందరూ అమ్మల్నే కీర్తించారు. ఈ మధ్య నాన్న గురుంచీ రాస్తున్నారు. విన్నారో లేదో కానీ ఈ మధ్య ఓ గజల్ బాగా ఫేమస్ అయింది. ‘నాన్న నాకు చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను. కానీ కనిపించని ఒక కవచం అది. నన్ను గాల్లో ఎగరేస్తున్నాడు అనే అనుకున్నాను కానీ నాలో ధైర్యాన్ని నింపుతున్నాడు’ అంటూ ఆ గజల్ సాగుతుంది. అది విన్నప్పుడల్లా నాకు చాలా సంతోషం కలుగుతుంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నాన్న పాట కూడా బావుంటుంది. మరి.. వృద్ధాప్యంలో ఉన్న నాన్న ఒంటరి జీవితం గడపబోతున్నారా? ఇప్పుడు మా నాన్న ఒక్కరే ఉంటున్నారు. అయితే నాన్నని ఇకనుంచి నా దగ్గరే పెట్టుకుంటాను. నాతోపాటే మా నాన్న ఉంటారు. నా పెళ్లయిన తర్వాత పదేళ్ల వరకూ కూడా నాతోనే ఉన్నారు. ఇల్లు కట్టాక సరదాగా ఉందాం అని అక్కడ ఉన్నారు. సో.. ఈ ఫాదర్స్ డే తర్వాత మీ నాన్న ఇక మీతోనే ఉంటారన్న మాట.. అవును. నేనున్నంతవరకూ నాన్న నాతోనే ఉంటారు. డి.జి. భవాని -
చంద్రబోస్ నివాసంలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోమృతి చెందారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మదనమ్మకు మొత్తం నలుగురు సంతానం కాగా వారిలో చంద్రబోస్ చివరివాడు. చంద్రబోస్‌కు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
యేరుశనగ కోసం మట్టిని దవ్వితే..
పదం పలికింది – పాట నిలిచింది సినిమా పాట ఒక ‘సక్కటి’ కవితైపోవడం అన్నిసార్లూ జరగదు. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం ప్రతిభావంతుడైన గీత రచయిత దాన్ని వదులుకోడు. దానికి, మార్చిలో విడుదల కానున్న ‘రంగస్థలం’ కోసం చంద్రబోస్ రాసిన ఈ గీతమే సాక్ష్యం. యేరుశనగ కోసం మట్టిని దవ్వితే యేకంగా తగిలిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె సింతాసెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతె సేతికి అందిన సందమామలాగ / ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె ఈ పల్లవితో సాగే ఈ పాటలో– ‘రెండు కాళ్ల సినుకువి నువ్వు/ గుండె సెర్లో దూకేసినావు’; ‘సెరుకుముక్క నువ్వు కొరికి తింటావుంటే... సెరుకుగెడకే తీపి రుసి తెలిపినావె’; ‘తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ’; ‘కడవ నువ్వు నడుమున బెట్టి కట్టమీద నడిచొత్తావుంటె సంద్రం నీ సంకెక్కినట్టు’; ‘కట్టెల మోపు తలకెత్తుకోని అడుగులోన అడుగేత్తవుంటే అడవి నీకు గొడుగట్టినట్టు’; ‘బురద సేలో వరి నాటు ఏత్తావుంటె... భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు’ లాంటి చక్కటి వ్యక్తీకరణలున్నాయి. దీనికి సంగీతం, గానం దేవిశ్రీ ప్రసాద్. దర్శకుడు సుకుమార్. సమంత, రామ్‌చరణ్ నాయికానాయకులు. -
ఎంత సక్కగున్నావె లచ్చిమి.. ఎంతెంత బాగుందో!
యేరుశనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకేబిందెలాగ.. ఎంతసక్కగున్నావె లచిమి.. ఎంత సక్కగున్నావె.. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే సేతికి అందిన సందమామలాగ.. ఎంత సక్కగున్నావే లచిమి.. ఎంత సక్కగున్నావె.. మల్లెపూల మధ్య ముద్దబంతిలాగ.. ఎంత సక్కగున్నావె.. ముత్తెదువ మెళ్లో పసుపుకొమ్ములాగ.. ఎంత సక్కగున్నావె.. సుక్కల సీర కట్టిన ఎన్నెలలాగ ఎంత సక్కగున్నావె.. అంటూ చిట్టిబాబు తన రామలక్ష్మీ కోసం పాడిన పాట ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. పల్లె నేపథ్యాన్ని కళ్లకు కట్టెలా చంద్రబోస్ అందించిన సాహిత్యం, జానపద రీతిలో చెవులకు ఇంపుగా దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం, గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. శ్రోతలను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పాటపై తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ రచయిత కోన వెంకట్ ప్రశంసల జల్లు కురిపించారు. సుకుమార్ ‘రంగస్థలం’ ట్రైలర్ ఎంతగానో నచ్చింది. కానీ ఈ పాట రంగస్థలంను మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఉంది. ఈ పాటకు సాహిత్యం అందించిన చంద్రబోస్‌కు, సంగీంత అందించిన డీఎస్పీకి మిలియన్ చీర్స్ అంటూ వర్మ ప్రశంసించారు. ‘చాలా అరుదుగా కొన్ని పాటలు మన గుండెల్ని తాకి, మన మనసుల్ని మీటి, మన జ్ఞపకాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంటాయి. ఇది అచ్చం అలాంటి పాటే’ అంటూ కోన వెంటక్ ట్వీట్ చేశారు. ఈ పాటకుగాను సమంత ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఈ పాటలో రాంచరణ్ కనబర్చిన హావభావాలు అద్వితీయమని కొనియాడారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రంగస్థలం’ లో చిట్టిబాబుగా రామ్‌చరణ్, రామలక్ష్మిగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు కానుకగా మంగళవారం ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎంతసక్కగున్నావె.. లచిమి పాట రెండు మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి.. యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ‘హో.. హో.. హో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం...’ అంటూ రామ్‌చరణ్ వాయిస్‌తో సాగే టీజర్ ఇంతకుముందు విడుదలై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 30న విడుదలకానుంది. -
పత్రం పుష్పం ఫలం
ఉగాదితో కొత్త సంవత్సరం మొదలైనా... మన జీవితాల్లో ఎలాంటి విఘ్నాలూ లేకుండా ఉండడానికి మనం చేసుకునే మొదటి పండుగ వినాయక చవితి. మంచి మాట తెలుసుకోడానికి... మంచి బాటలో నడవడానికి మంచివారుగా బతకడానికి... గణనాథుడు నృత్త, గీత, వాద్యాలతో వినోదాత్మకంగా మనకు జ్ఞానం ప్రసాదిస్తాడన్నది నమ్మకం. పత్రం, పుష్పం, ఫలం... ఇవేవీ లేకపోయినా తోయం... అంటే... గరిటెడు జలంతో కూడా సంతృప్తి పడే జనదేవుడు లంబోదరుడు... వరసిద్ధి వినాయకుడు. ఈ పది రోజులూ ఆయనే ప్రతి వీధికీ కళ. అందుకే మా పాఠక దేవుళ్లకు ఇవాళ్టి ఫ్యామిలీ కళకళ. పత్రం దండాలయ్య ఉండ్రాళ్లయ్యా... దాదాపు పాతికేళ్లు అయ్యింది ఈ పాట వచ్చి. ఇప్పటికీ చవితి పందిళ్లలో మోగుతూనే ఉంటుంది. ఏ కవికైనా ఇది సంతోషం కలిగించే అంశమే. ‘కూలీ నెం.1’ సినిమాలో ఈ పాట ఒక టీజింగ్ సందర్భంలో వస్తుంది. బాగా డబ్బు, అహంకారం ఉన్న ఒక అమ్మాయి రైల్వే కూలీలు చేస్తున్న గణేశ్ ఊరేగింపునకు అడ్డం వస్తుంది. అంతకు ముందే ఆమె ప్రవర్తన గురించి విన్న హీరో దీనిని చాన్స్‌గా తీసుకుని టీజ్ చేస్తూ పాట పాడతాడు. పైకి ఇది టీజింగ్ సాంగ్లా అనిపించినా, అర్థం చూస్తే శాశ్వతంగా నిలిచే భక్తిగీతంలా రాయాలని నిశ్చయించుకున్నా. ఆ విధంగానే వచ్చింది. ‘చిన్నారి ఈ చిట్టెలుకరా భరించెరా లంబోదర... పాపం కొండంత నీ పెనుభారం... ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మధన్యం’ అనే పల్లవి ఎలుకకు వర్తిస్తుంది, హీరోయిన్‌కూ వర్తిస్తుంది. హీరోయిన్ను మర్చిపోవచ్చు. ఎలుకను మర్చిపోరు గదా. ‘శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం... ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం’... అనే లైన్లు హీరోయిన్‌కి వర్తిస్తాయి, వినాయకునికీ చంద్రునికీ మధ్య జరిగిన కథనూ చెబుతాయి. ఈ రెండో అర్థం వల్లే పాట ఇప్పటికీ నిలుచుందని అనుకుంటున్నాను. ఇళయరాజా ఇచ్చిన పల్లవికి చెన్నైలో కూచుని రాసిన పాట ఇది. బాలూ గళం, కోరస్, కంపోజిషన్ అందులో ఉండే సెలెబ్రేషన్ మూడ్ పాటను శాశ్వతం చేశాయి. ఈ పాటే కాదు చాలా సినిమాల్లో దైవప్రస్తావన ఉండే పాటలు అనేకం రాశాను. కాని నాది ఒక రకంగా నిరీశ్వరవాదం. నా దైవానికి రూపం లేదు. ఇది నాస్తికత్వం కాదు. నా దృష్టిలో దైవాన్ని బాహ్యంగా చూడటం కాదు లోలోపల చూడాలి. అందుకే నేను దేవతా మూర్తులను వివిధ బాధ్యతలు నిర్వహించే కార్యనిర్వహణాధికారులుగా చూస్తాను. ఇన్ఛార్జ్లన్న మాట. నిర్వికల్ప సమాధి అంటారు. ఈ స్థితికి చేరుకున్నప్పుడే దైవాన్ని, మనల్ని కూడా ఒకసారి దర్శిస్తాం. నా దృష్టిలో పూజలు, పండుగలు దుష్కార్యాల నుంచి కాసేపు మనసు మళ్లించడానికి ఉద్దేశించినవే. కాని దైవానికి చేరువ కావాలంటే బాహ్య బంధనాల నుంచి విముక్తి పొంది అంతఃస్వేచ్ఛను అనుభవించాలంటే ఇవి చాలవు. లోపలి ప్రయాణం సాగాలి. ఈ మాటను చెప్పడానికే నేను ‘శివదర్పణం’ గ్రంథం రాశాను. అందులో శివుణ్ణి ఒక వేటగాడిగా భావిస్తూ ‘నా మనసే ఒక కారడవి. అందులో కోర్కెలనే క్రూరమృగాలు విషసర్పాలు తిరుగుతున్నాయి. వాటిని వేటాడు’ అని వేడుకున్నాను. ప్రతి మనిషి కోరుకోవాల్సింది ఇదే. మనలో ప్రతి ఒక్కరం అంతర్గత సమృద్ధితో సంపదతో తులతూగాలని వినాయకచవితి సందర్భంగా ఆశిస్తూ శుభాకాంక్షలు అందిస్తున్నాను. - సిరివెన్నెల సీతారామశాస్త్రి పుష్పం జైజై గణేశా.. జై కొడతా గణేశా... ‘జై చిరంజీవ’ సినిమా కోసం ఈ పాట సిట్యుయేషన్‌ను క్రియేట్ చేసి హీరో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ పాడాలి అని చెప్పారు. ఏం స్తుతిస్తాడు... ఎలా స్తుతిస్తాడు... ఆ స్తుతిలో నుంచి ప్రేక్షకులకు ఏం సందేశం ఇవ్వాలి అనేది ఇక నా తలనొప్పి. కాని కవి కన్ను అనేది ఒకటి ఉంటుంది. దానికి దృష్టిలోపం, చత్వారం లేకపోతే ప్రతి సన్నివేశంలో ఏదో ఒక అర్థాన్ని వెతుకుతుంది. ఆ సమయంలో ఈ లోకంలో ఉన్న చెత్త నాకు గుర్తుకు వచ్చింది. ఈ చెత్తను వినాయకునికి గుర్తు చేయాలి. ఆయన తొండంతో కుంభవృష్టిని కురిపించి దానిని కడిగేయించాలి అనిపించింది. అందుకే పల్లవిలో ‘లోకం నలుమూలలా లేదయ్యా కులాసా... దేశం పలువైపులా ఏదో రభస... మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా... పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా’ అన్నాను. ‘చిట్టి ఎలుకను ఎక్కి, గట్టి కుడుములు మెక్కి ఈ చిక్కు విడిపించడానికి రమ్మ’ని పిలిచాను. పల్లవి ఓకే. చరణంలో ఏం చెప్పాలి? వినాయకుడు కుమారస్వామి సహిత శివపార్వతుల పటం చూడండి. వారి వాహనాలు గమనించండి. వాస్తవంగా అయితే ఒక వాహనానికీ మరో వాహనానికీ వైరం ఉంది. కాని అవి కలిసి మెలిసి లేవూ. మనమెందుకు కొట్టుకుంటున్నాం. అదే మొదటి చరణంలో చెప్పాను. ‘నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా... ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా... పలుజాతుల భిన్నత్వం కనిపి స్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా’... మనకెందుకు లేదు సోదరభావం అని నిలదీశాను. బాగుందనిపించింది. ఈ స్ఫూర్తితో మేం ఉంటాం కాని మాకో బెడదుంది దానిని తొలగించు అని రెండో చరణంలో చెప్పాను. దాదాల నుంచి లంచాలు మరిగిన నాయకుల నుంచి రక్షించమని కోరుకున్నాను. కాని అక్కడ నాకు తోచిన చమత్కారం ఏమిటంటే ‘ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా’ అనడం. నిజంగానే ఇప్పుడు కూడా ధరలు చుక్కల్లోనేగా ఉన్నాయి. కందిపప్పు కిలో రెండు వందలని విన్నాను. మనం వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తాం. కాని ఈ సందర్భంగా చేయాల్సింది మనలోని చెడును ముంచడం మనలోని అహాన్ని వంచడం. ఆ మాటను కూడా చెప్పాను. ఈ పాట జనానికి బాగా నచ్చింది. వినాయకుని మంటపాల్లో జేజేలు అందుకుంటూనే ఉంది. మరో విషయం ఏమిటంటే చిన్నప్పటి నుంచి నేను విఘ్నేశ్వరుడి భక్తుణ్ణి. మా ఊరి చెరువు దగ్గర మంచి నల్లరేగడి మట్టి దొరికేది. దానిని తీసుకొచ్చి నా స్వహస్తాలతో వినాయకుడి ప్రతిమను చేసి ఇంట్లో ఒక గుడిలాంటిదే మెయింటెయిన్ చేసేవాణ్ణి. ఆయన దయ వల్ల నాకు బుద్ధి లభించింది. పాటల రచయిత కావాలనే కోరికా సిద్ధించింది. అందరికీ హ్యాపీ వినాయక చవితి. - చంద్రబోస్ ఫలం తిరు తిరు గణనాథ... వినాయక చవితి అనగానే నాకు మా వూరు ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) పక్కన ఉండే చిట్టడివి గుర్తుకు వస్తుంది. ఆ రోజు పిల్లలందరికీ ఆ అడవిలోకి వెళ్లే పర్మిషన్ దొరుకుతుంది. మరి పత్రి తేవాలి కదా. అందరం సరదాగా పోలోమంటూ పోయి పత్రి తెచ్చేవాళ్లం. మా బ్రాహ్మణ కుటుంబం కాబట్టి దర్బలో ఇంట్లోనే ఉండేవి. నేను మరీ భక్తుణ్ణి కదా. అంత భక్తిశ్రద్ధలతో చిన్నప్పుడు పూజలూ అవీ చేసిన గుర్తు లేదు. అయినప్పటికీ ఆ వినాయకుడి దయ వల్ల చదువు బాగా వచ్చింది. అయితే నాగార్జున యూనివర్సిటీలో బి.టెక్ చేరాక చదువుపై శ్రద్ధంతా పోయింది. వినాయకుడు అనగానే చదువు గుర్తుకొస్తుంది కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. ‘100% లవ్’ సినిమాలో నేను రాసిన పాటలో కూడా ఇదంతా కనిపిస్తుంది. ఆటపాటల్లో హాయిగా ఉండాలనుకునే యూత్‌కి బాబోయ్ ఈ పరీక్షల భారం లేకుండా హాయిగా మార్కులొస్తే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఆ మూడే పాట పల్లవిలో కనిపిస్తుంది. ‘తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై.. ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై’ అని ఉంటుంది పల్లవి. కాని చరణం అంతకన్నా సరదాగా ఉంటుంది. ‘చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూనివ్వు కనులారా చదివింది ఒకసారే ఐనా కల్లోను మరిచిపోని మెమరీనివ్వు’.... ఇలా ఉంటుంది చరణం. ఇందులో ‘ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు’ అడగడం ‘ఆన్సర్ షీటు మీద ఆగిపోని పెన్ను’ అడగడం కనిపిస్తుంది. రెండో చరణంలో ఇంకా సింపుల్ కోరికలు ఉంటాయి. ‘తలలే మార్చిన తండ్రిగారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారుమారు’ అని చెప్తూ కనుక మా తలరాతలు బాగుండేలా చూడు స్వామి అని వేడుకుంటుంది హీరోయిన్. ‘పేపర్లో ఫొటోలు ర్యాంకులెవ్వరడిగారు పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు’ అనడం ఒక చమక్కు. అప్పటికే కొన్ని మాంటేజస్ తీసి కొన్ని రఫ్నోట్స్లు సుకుమార్‌గారు తయారు చేశారు. ఆ మాంటెజస్కు తగినట్టుగా ఆ రఫ్నోట్స్ ఇన్‌ఫ్లూయెన్స్‌తో రాసిన పాట ఇది. దేవిశ్రీ ప్రసాద్ బాణి, దానికి హరిణి గొంతు రాణించాయి. తమన్నా, నాగచైతన్య కూడా ఈ పాటలోని సన్నివేశాలను బాగా పండించారు. క్లాసికల్ బాణీలో ఉన్న ఈ పాట ఇంత పెద్ద హిట్ కావడం నాకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు రామ్ నటించిన ‘గణేశ్’ సినిమాలో కూడా వినాయకుడి మీద ఒక పాట రాశాను. మాలాంటివాళ్లకు పాటే దైవం. మంచి పల్లవి తడితే అదే పెద్ద ప్రసాదం. మీ అందరినీ ఆ విఘ్నేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. - రామజోగయ్యశాస్త్రి -
పోరా పోవే మూవీ స్టిల్స్
-
గీత స్మరణం
పల్లవి చూద్దాం ఆకసం అంతం... (2) వేద్దాం అక్కడే పాదం ॥ మళ్లీ పుట్టి మహినే గెలిచి ఎల్లలు దాటిన యోధా గాలుల గీతాలే ఎన్నడూ ఆగవులే గెలుపను దప్పిక ఎప్పుడూ తీరదులే తీరదులే హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు హే... మాతృదేశంలో సంతోషం పండించు చరణం : 1 ఆకాశం అడ్డొస్తే ఎగిరే పక్షైపోదాం మహాశిఖరమే అడ్డొస్తే దాటి మేఘాలౌదాం అరణ్యమొస్తే గాలైపోదాం సముద్రమొస్తే చేపైపోదాం వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం వెంటేపడుతుంది విజయం విజయం విజయం లక్ష్యం ఎన్నటికీ దీక్షకి బంధువురా విజయం ఎప్పటికీ చెమటకి చుట్టమురా ॥ చరణం : 2 మనసు ధనస్సు మాట బాణం ఎప్పుడైనా తప్పబోదు కొదమసింహమా గెలిచి పోరాడు పోరాడు... వీరా... నీ గుండె వజ్రం వజ్రం వజ్రం వెంటేపడుతుంది విజయం విజయం విజయం అందరి దీవెనతో ఆయువు పొందానే మీకే నా బ్రతుకే అంకితమిస్తానే హే... కత్తికొనతో ఒక సూర్యుణ్ణే సృష్టించు హే... మాతృదేశంలో సంతోషం పండించు ॥ చిత్రం : విక్రమ సింహ (2014) రచన : చంద్రబోస్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : ఎస్.పి.బాలు, బృందం - నిర్వహణ: నాగేశ్ -
ఈ రోజు నాకు రెండు పండగలు: సింగీతం
‘‘సింగీతం శ్రీనివాసరావు అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. ఆయన ఆలోచనలెప్పుడూ పది, పదిహేనేళ్లు ముందుంటాయి. అంత ఫార్వార్డ్‌గా ఆలోచించడం ఆయన గొప్పదనం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు పాటలు కూడా స్వరపరచడం గొప్ప విషయం’’ అన్నారు డా.దాసరి నారాయణరావు. శాండల్‌వుడ్ మీడియా పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో భారతి, భారతీకృష్ణ నిర్మించిన చిత్రం ‘వెల్కమ్ ఒబామా’. ఊర్మిళ, రేచల్, ఎస్తబన్, సంజీవ్, భువనచంద్ర, అనంతశ్రీరామ్, నిరంజని, ఆర్జే బాషా ముఖ్య తారలు. ఇటీవల హైదరాబాద్‌లో పలువురు చిత్రరంగ ప్రముఖుల కోసం ఈ చిత్రం ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని తిలకించిన దాసరి పై విధంగా స్పందించారు. వాణిజ్య అంశాలతో పాటు మంచి విలువలున్న చిత్రమని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సింగీతం మాట్లాడుతూ - ‘‘ఈ రోజు నాకు రెండు పండగలు. ఒకటి వినాయక చవితి అయితే మరొకటి ‘వెల్కమ్ ఒబామా’కు దక్కుతున్న ప్రశంసలు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆ తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తాం. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ టీవీ చానల్ ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకుంది. సింగీతంగారి దర్శకత్వం, ఆయన స్వరపరచిన పాటలు, కథ, నిర్మాణ విలువలు.. ఇవన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి: కెమెరా: ఎస్.ఎస్. ధర్మన్, ఎడిటింగ్: సూర్య, ఆర్ట్: వర్మ, మాటలు: రోహిణి, కథ-సంగీతం-పాటలు-దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.