పదం పలికింది – పాట నిలిచింది
సినిమా పాట ఒక ‘సక్కటి’ కవితైపోవడం అన్నిసార్లూ జరగదు. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం ప్రతిభావంతుడైన గీత రచయిత దాన్ని వదులుకోడు. దానికి, మార్చిలో విడుదల కానున్న ‘రంగస్థలం’ కోసం చంద్రబోస్ రాసిన ఈ గీతమే సాక్ష్యం.
యేరుశనగ కోసం మట్టిని దవ్వితే
యేకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
సింతాసెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతె
సేతికి అందిన సందమామలాగ / ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
ఈ పల్లవితో సాగే ఈ పాటలో– ‘రెండు కాళ్ల సినుకువి నువ్వు/ గుండె సెర్లో దూకేసినావు’; ‘సెరుకుముక్క నువ్వు కొరికి తింటావుంటే... సెరుకుగెడకే తీపి రుసి తెలిపినావె’; ‘తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ’; ‘కడవ నువ్వు నడుమున బెట్టి కట్టమీద నడిచొత్తావుంటె సంద్రం నీ సంకెక్కినట్టు’; ‘కట్టెల మోపు తలకెత్తుకోని అడుగులోన అడుగేత్తవుంటే అడవి నీకు గొడుగట్టినట్టు’; ‘బురద సేలో వరి నాటు ఏత్తావుంటె... భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు’ లాంటి చక్కటి వ్యక్తీకరణలున్నాయి. దీనికి సంగీతం, గానం దేవిశ్రీ ప్రసాద్. దర్శకుడు సుకుమార్. సమంత, రామ్‌చరణ్ నాయికానాయకులు.
Comments
Please login to add a commentAdd a comment