
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: పాన్ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్ భారత చిత్రపరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ వరించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటకు తన కలంతో ప్రాణం పోసిన గీతరచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు అంబరాన్నంటాయి.
చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందనగానే గ్రామస్తులు బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రాసిన పాట ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం తెలుగు జాతికే గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.