'డ్రింకర్ సాయి' నుంచి యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ విడుదల | Bhagi Bhagi Lyrical Video Song Out From Drinker Sai Movie | Sakshi
Sakshi News home page

'డ్రింకర్ సాయి' నుంచి యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ విడుదల

Published Fri, Nov 29 2024 6:42 PM | Last Updated on Fri, Nov 29 2024 6:42 PM

Bhagi Bhagi Lyrical Video Song Out From Drinker Sai Movie

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'డ్రింకర్ సాయి'. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అ‌వుతోంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి లిరికల్ సాంగ్‌ను రిలీజ్  చేశారు.

'బాగి బాగి..' లిరికల్ సాంగ్‌ను శ్రీ వసంత్ మంచి బీట్‌తో కంపోజ్ చేయగా, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. జావెద్ అలీ ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ పాట ఎ యూత్ ఫుల్ లవ్ సాంగ్‌గా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్‌లో హీరో ధర్మ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement