lyricist
-
విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ చనిపోయారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. సాంగ్ రైటర్‌గా ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి రోజుల్లో మానసికంగా చాలా కుంగిపోయారు. ఇప్పుడు ఇలా దయనీయ స్థితిలో మృత్యు ఒడికి చేరారు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)వైజాగ్‌కి చెందిన కులశేఖర్.. హైదరాబాద్‌లో తొలుత జర్నలిస్టుగా చేశారు. తర్వాత గీత రచయిత అయ్యారు. అలా 'చిత్రం', ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం, సైనికుడు లాంటి మంచి సినిమాల్లో పాటలు రాశారు. తర్వాత ఈయన కెరీర్ డౌన్ ఫాల్ అయింది. దీంతో మానసికంగా చాలా కుంగిపోయారు. దొంగతనాల వల్ల పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు.గత కొన్నాళ్లలో పెద్దగా సినిమాలు చేయలేదు. ఇంటర్వ్యూల్లోనూ కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఈయన చనిపోయారని తెలిసి పలువురు సినీ ప్రముఖు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఐదేళ్ల నిరీక్షణ.. 'జీబ్రా' ఫలితంపై సత్యదేవ్ ఎమోషనల్) -
కొత్త బిజినెస్.. ఫ్రెండ్‌కు అప్పజెప్పిన నటుడు.. అంతేకాదు!
సినిమా రంగంలో నిజమైన మిత్రులు కొందరే ఉంటారు. నటుడు గంజాకరుప్పు, గీత రచయిత జయంకొండాన్ ఆ కోవలోకే వస్తారు. గంజాకరుప్పు ఎన్నో చిత్రాల్లో హాస్యపాత్రల్లో ప్రేక్షకులను నవ్వించడంతోపాటు, కథానాయకుడిగా, నిర్మాతగానూ చిత్రాలు చేశారు. ప్రస్తుతం నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. 20 ఏళ్లుగా మంచి ఫ్రెండ్స్ గీత రచయిత జయంకొండాన్.. వేటప్పన్, ఇంద్రసేనా, ఓడుం మేఘంగళ్, ఒరు సంధిప్పిల్, సొక్కు సుందరం తదితర చిత్రాలకు పాటలను రాసి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలకు గేయరచయితగా పని చేస్తున్న ఈయన స్థానిక కేకే.నగర్లో కవింజర్ కిచెన్ పేరుతో హోటల్ నడుపుతున్నారు. గంజాకరుప్పు, జయంకొండాన్లు 20 ఏళ్లుగా మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ఫ్రెండ్‌కు పెళ్లి చేసే బాధ్యత కూడా! తాజాగా గంజాకరుప్పు త్వరలో ఊరంపాక్కమ్లో ప్రారంభించనున్న హోటల్ నిర్వహణ బాధ్యతలను గీత రచయిత జయంకొండాన్కు అప్పగించనున్నారు. అంతేకాదు ఇంకా అవివాహితుడిగా ఉన్న తన మిత్రుడికి పెళ్లి చేసే బాధ్యతలను తీసుకున్నారు. ఇందుకోసం డాక్టర్ చదివిన యువతిని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో స్నేహమంటే వీరిదే.. అని కోలీవుడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. కాగా నటుడు గంజాకరుప్పు భార్య కూడా వైద్యురాలు అన్న విషయం తెలిసిందే. చదవండి: ముగ్గురు కుమార్తెలతో భారమైన జీవితం.. లారెన్స్ సాయం.. వీడియో వైరల్ -
'అమ్మాయిలు చప్పట్లు కొడుతుంటే బయటకొచ్చేశా'.. యానిమల్ చిత్రంపై తీవ్ర విమర్శలు..!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. అయితే మొదటి రోజే పాజిటివ్ రావడంతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రంపై అభిమానులతో సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రశంసల కంటే విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ లిరిసిస్ట్ స్వానంద్ కిర్కిరే కూడా చేరిపోయారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్లో వరుస పోస్టులు చేశారు. స్వానంద్ కిర్కిరే తన ట్వీట్లో రాస్తూ.. 'యానిమల్ సినిమా చూశాక.. నేటి తరం మహిళలపై నాకు నిజంగా జాలి కలిగింది. మీకోసం కొత్త వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అంతే కాదు.. అతను మరింత భయంకరంగా ఉన్నాడు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. మిమ్మల్ని అణచివేసే వ్యక్తి గురించి నువ్వు గర్వపడుతున్నావు. నేటి తరం అమ్మాయిలు థియేటర్లో కూర్చోని రష్మికను చూసి చప్పట్లు కొడుతుంటే.. మనసులో సమానత్వం అనే ఆలోచనకు నివాళులు అర్పించి నిరాశ, నిస్పృహలతో బయటకు వచ్చేశా. ఈ సినిమా విపరీతంగా వసూళ్లు రాబట్టినప్పటికీ.. నా భారతీయ సినిమా ఉజ్వల చరిత్ర మాత్రం దారి తప్పుతోంది. యానిమల్ భారతీయ సినిమా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భయంకరమైన, ప్రమాదకరమైన దిశలో తీసుకెళ్తోంది.' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన యానిమల్ చిత్రబృందం స్పందించింది. అతని ట్వీట్లను ఉద్దేశించి తగిన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ట్వీట్లో రాస్తూ.. "మీ మోకాళ్లను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం, పాదాలు బ్యాలెన్స్ కోసం వేరు వేరుగా ఉంచండి. మీ పాదాలను సురక్షితంగా ల్యాండ్ చేయండి. అప్పుడు అది కచ్చితంగా ల్యాండ్ అవుతుంది' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. కాగా.. యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, ట్రిప్తీ డిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. शांतराम की - औरत , गुरुदुत्त की - साहब बीवी और ग़ुलाम , हृषीकेश मुखर्जी की - अनुपमा , श्याम बेनेगल की अंकुर और भूमिका , केतन मेहता की मिर्च मसाला , सुधीर मिश्रा की मैं ज़िंदा हूँ , गौरी शिंदे की इंगलिश विंगलिश , बहल की क्वीन सुजीत सरकार की पीकू आदि , हिंदुस्तानी सिनेमा — Swanand Kirkire (@swanandkirkire) December 2, 2023 Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing. Yes.... now it landed perfectly 😘… pic.twitter.com/OxTOE0vlvI — Animal The Film (@AnimalTheFilm) December 6, 2023 -
'నాటు నాటు' రచయిత చంద్రబోస్ గ్రామంలో సంబరాలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ భారత చిత్రపరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ వరించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటకు తన కలంతో ప్రాణం పోసిన గీతరచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందనగానే గ్రామస్తులు బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రాసిన పాట ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం తెలుగు జాతికే గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. -
నన్ను లైంగికంగా వేధించారు, కోలుకోలేకపోయా: బాలీవుడ్ నటుడు
సినీరచయిత, సింగర్, నటుడు పీయూశ్ మిశ్రా చిన్నతనంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాడు. 7వ తరగతిలోనే తన బంధువొకరు లైంగికంగా వేధించిందని పేర్కొన్నాడు. తుమ్హారీ అక్కత్ క్యా హై పీయూశ్ మిశ్రా అనే ఆటోబయోగ్రఫీ పుస్తకంలో ఈ విషయాన్ని పొందుపరిచాడు. ఇదే విషయం గురించి నటుడు మీడియాతో మాట్లాడుతూ.. 'శృంగారం అనేది ఆరోగ్యకరమైన విషయం. కానీ అది అభ్యంతరకరంగా, అయిష్టంగా ఉంటే మాత్రం దాని నుంచి కోలుకోవడానికి జీవితమే సరిపోదు. జీవితాంతం మాయని మచ్చలా అది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏడవ తరగతిలోనే మహిళా బంధువొకరు నన్ను లైంగికంగా వేధించింది. తనే కాదు, మరికొందరి పేర్లను కూడా నేను గుట్టుచప్పుడుగానే ఉంచాలనుకుంటున్నాను. ఎందుకంటే వారిలో కొందరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో బాగా స్థిరపడ్డారు. కాబట్టి ఈ సమయంలో వారిపై ప్రతీకారం తీర్చుకోలేను' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే పీయూశ్ మిశ్రా గులాల్, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, మఖ్బూల్, తమాషా వంటి చిత్రాల్లో నటించాడు. బాల్లిమారన్ అనే మ్యూజిక్ బ్యాండ్‌లో తను పాటలు రాసి వాటిని తనే స్వయంగా ఆలపించాడు. -
వివాదంలో చిక్కుకున్న ప్రముఖ రచయిత.. ఎస్పీకి ఫిర్యాదు
సినీ రచయిత అనంత శ్రీరామ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలె పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ “భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని వాడాడు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సదరు కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదం ఇప్పటికే నిషేదించగా భట్రాజులను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారంటూ ఆ కులస్తులు మండిపడుతున్నారు. నిషేధిత పదాన్ని ఉపయోగించినందున అనంత శ్రీరామ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం ఎస్పీకి భట్రాజు కులసంఘాలు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే అనంత శ్రీరామ్ సదరు వర్గానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. -
ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ సినీ పాటల రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయనకు ఏడేళ్ల క్రితం సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సింగర్ ముజాబా అజీజ్ తెలిపారు. బాలీవుడ్ సినిమాలు కైట్స్, క్రిష్, బాజీరావ్ మస్తానీ, కాబిల్ వంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. ఆయన మృతితో బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. -
ఘంటసాల తెలుగు పాట చిరునామా మాత్రమే కాదు పాటల సౌధానికి పునాది: అనంత్ శ్రీరామ్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 190 టీవీ చర్చ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు అయిన రత్నకుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, శ్యాం అప్పాలి, విజు చిలువేరు, నీలిమ గడ్డమణుగు, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమంను నిర్వహించగా.. మొదటి మూడు భాగాలు 21, 28 ఆగస్టు, 4 సెప్టెంబర్ నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 11 సెప్టెంబర్ నాడు చివరి భాగం ప్రసారమైందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా బాల రెడ్డి ఇందూర్తి శత గళార్చన నాల్గవ (చివరి) భాగంలో పాల్గొన్న ముఖ్యఅతిథి ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ ఘంటసాల అంటే తెలుగు పాటకి చిరునామె కాదు తెలుగు పాటల సౌధానికి పునాది లాంటి వారని కీర్తించారు. ఘంటసాలతోనే తెలుగు పాట ప్రపంచవ్యాప్తమైందన్నారు. అలాగే జర్మనీ లాంటి తెలుగుకి ఏ మాత్రము సంబంధం లేని దేశాలలో కూడా ఆయన ప్రదర్శన అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది అంటే అది తెలుగు బాషాకి ఎంత ఔన్నత్యం ఉందొ తెలుగు బాషాని ప్రాచుర్యం చేసిన ఆయన గొంతుకి కూడా ఉన్నతి, ఆ ఘనత దక్కుతుందన్నారు. పాటలకు చమత్కారం జోడించి పాడటం అనేది అది వారికొక్కరికే సాధ్యమయ్యిందని తెలిపారు. నిజంగా ఇలాంటి గాయకుడు ఉండటం వల్లనే తెలుగు భాష ఇంత పరిఢవిల్లుతుంది అని అనిపించింది.. ఘంటసాల గారి పుష్పవిలాపం, కుంతి విలాపం, గోవిలాపం గాని పద్యాలు మనం వింటే చదువుతున్నప్పుడు ఆ పద్యం లోని భావం అర్ధం కొంతవరకు అవగతం అవుతుందేమో కానీ వారు పాడుతున్నప్పుడు భావం, అర్ధంతో పాటు కవిలోని ఆర్ద్రత కూడా ఆవిష్కరించబడింది. ఇలాంటి గాయకుడు దొరకడం తెలుగు వారిగా మన అదృష్టం.. ఇలాంటి గాయకుడు పాడిన బాషాని విని అర్థం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం, అటువంటి గాయకుడు నభూతో నభవిష్యత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. శత గళార్చన నాలుగు భాగాల స్వాగతోపన్యాసంతో మనల్ని అలరించిన శారద ఆకునూరి (హ్యూస్టన్, USA), ఈ చివరి భాగంలో తన బృందం నుంచి వరప్రసాద్ బాలినేని, పేరూరి వెంకట సోమశేఖర్, కృష్ణ నాలాది, రాజశేఖర్ సూరిభొట్ల, సురేష్ ఖాజా, జ్యోతిర్మయి బొమ్ము, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, రమణ జువ్వాది, సత్యనారాయణ ఉల్మురి, ఉష మోచెర్ల ఘంటసాల పాటల ద్వారా ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమములో శ్యామ్ అప్పాలి (లాస్ ఏంజెలెస్, USA) బృందం నుంచి సాయి కాశీభొట్ల, శ్రీనివాస్ రాణి, ప్రసాద్ పార్థసారధి, సుధాకర్, వర్మ అల్లూరి, శ్రీహర్ష, శ్రీవల్లి శ్రీధర్, శ్రీయాన్ కంసాలి, ఆదిత్య కార్తీక్ ఉపాధ్యాయుల, అనూష వెన్నల, గౌరిధర్ మధు, రాజ్యలక్ష్మి వుదాతు, మీనాక్షి అనిపిండి, శాంత సుసర్ల, రఘు చక్రవర్తి, శ్రీధర్ జూలపల్లి, హరీష్ కొలపల్లి, నారాయణరెడ్డి ఇందుర్తి, వంశీకృష్ణ ఇరువరం పాల్గొన్నారు. శ్యాం అప్పాలి శత గళార్చన 4 భాగాలకు సాంకేతిక సహాయాన్ని కూడా అందించారు. శతగళార్చన కార్యక్రమంపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, వారి కోడలు కృష్ణకుమారి మాట్లాడుతూ ముందుగా "ఘంటసాల కు భారతరత్న" కోసం కృషి చేస్తున్న 33 దేశాల నుంచి 119 మంది పాల్గొనడం చాలా సంతోషం కలిగిందని, వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. అలాగే విశిష్ట అతిధులుగా దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, గేయ రచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులుకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇన్ని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించిన బాలరెడ్డి ఇందుర్తి, సింగపూర్ రత్న కుమార్ కవుటూరు ధన్యవాదములు తెలియచేసారు. శత గళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని. చాలా మంది ప్రముఖులు "ఘంటసాల గారికి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గీత రచయిత కపిలన్ కుమార్తె ఆత్మహత్య.. సీఎం పరామర్శ
సినీ గీత రచయిత కపిలన్ కూతురు తూరిగై(26) శుక్రవారం సాయంత్రం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక అరుణ్పాక్కంలో నివసిస్తున్న ఈమె కథా రచయిత, సినీ కాసూ్టమ్స్ డిజైనర్‌గా పని చేస్తోంది. బీయింగ్ ఉమెన్ మ్యాగజైన్ పేరుతో పత్రికను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తూరిగై ఆత్మహత్య చేసుకుంది. స్థానిక సాలిగ్రామంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అరుంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం తూరిగై మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ ఫోన్లో కపిలన్‌ను పరామర్శించారు. చదవండి: (Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత) -
Swiggy: రచయితకు చేదు అనుభవం.. రూ.70 వాపస్ చేస్తామనడంతో..
తమిళ పాటల రచయిత కో శేషాకు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్యూర్ వెజిటేరియన్ అయిన ఆయన స్విగ్గీ పుణ్యామా అని మాంసం రుచి చూడాల్సి వచ్చింది. శేషా బెంగళూరులో స్టే చేశాడు. ఈక్రమంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ద్వారా బుధవారం ‘గోబీ మంచూరియా విత్ కార్న్ ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చేశాడు. మాంచి ఆకలిమీదున్న ఆయన ఫుడ్ రాగానే ఆబగా తినేశాడు. కొద్దిగా తిన్న తర్వాత ఆయనకు ఫుడ్‌లో ఏదో తేడా అనిపించింది. అది వెజ్ మంచూరియా కాదని నిర్ధారణకు వచ్చి తినడం ఆపేశాడు. తనతోపాటు ఉన్న ఇద్దరు నాన్ వెజిటేరియన్ మిత్రులకు దాన్ని రుచి చూపించగా.. వాళ్లు అది చికెన్ మంచూరియా అని క్లారిటీ ఇచ్చారు. కంగుతిన్న శేషా స్విగ్గీ తప్పిదంపై కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. (చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్) Found pieces of chicken meat in the “Gobi Manchurian with Corn Fried Rice” that i ordered on @Swiggy from the @tbc_india. What’s worse was Swiggy customer care offered me a compensation of Rs. 70 (!!!) for “offending my religious sentiments”. 1/2 pic.twitter.com/4slmyooYWq — Ko Sesha (@KoSesha) August 17, 2022 అయితే, తమ పొరపాటును గుర్తించిన సదరు సంస్థ.. ఆర్డర్ విలువ రూ.70 వాపస్ చేస్తామని బదులిచ్చింది. దీంతో శేషాకు చిర్రెత్తుకొచ్చింది. తన మత విశ్వాలసాలను 70 రూపాయలకు విలువ కడతారా? అంటూ విమర్శలు గుప్పించాడు. చెత్త సర్వీస్ అంటూ ట్విటర్ వేదికగా గరం అయ్యాడు. పుట్టు వెజిటేరియన్ అయిన తనకు స్విగ్గీ స్టేట్ హెడ్ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అవసరమనుకుంటే డెలివరీ యాప్‌పై లీగల్‌గా కూడా వెళ్తానని శేషా చెప్పుకొచ్చాడు. I’ve been a strict vegetarian all my life & it disgusts me to think how casually they tried to buy my values. I demand that a representative of Swiggy, no lesser than the State Head call me to personally to apologise. I also reserve my rights to a legal remedy.@SwiggyCares — Ko Sesha (@KoSesha) August 17, 2022 కాగా, శేషా ట్వీట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆన్లైన్ ఫుల్ డెలివరీల్లో ఇవన్నీ కామన్ అని అంటుండగా మరికొందరు.. స్విగ్గీ సర్వీస్ మునుపటిలా లేదని అంటున్నారు. ఇంకొందరు.. ఇదివరకు ఎప్పుడూ మాంసం తిననపుడు.. అది వెజ్ కాదు.. నాన్ వెజ్ అని ఎలా తెలిసింది? అని శేషాను ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంపై స్విగ్గీ ట్విటర్ వేదికగా స్పందించింది. రెస్టారెంట్ పార్టనర్ వల్లే తమ కస్టమర్‌కు ఇబ్బంది కలిగిందని, తమ సర్వీస్‌లో లోపం కాదని చెప్పింది. నిజంగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని.. శేషాకు వివరణ ఇస్తామని బదులిచ్చింది. (చదవండి: విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!) For all those who have rushed to the aid of Swiggy:https://t.co/Fwsn7mmX51 — Ko Sesha (@KoSesha) August 17, 2022 -
ఎన్నో పాటలు రాశా, కానీ ఒక్క అవార్డు రాలేదు: జొన్నవిత్తుల
భక్తి పాటలు రాయడంలో ఘనుడు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. అంతేనా సందర్భం ఏదైనా సరే దానిమీద అప్పటికప్పుడు పేరడీ పాట రాసి వినిపించగలడు. అంతటి గొప్ప టాలెంట్ ఆయన సొంతం. కానీ ఇంతవరకు తననెవరూ పురస్కారంతో సత్కరించలేదంటున్నాడు జొన్నవిత్తుల. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'వేటూరి, సిరివెన్నెల సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో రాఘవేంద్రరావు నాకో సినిమా ఇచ్చి మొత్తం పాటలు నన్నే రాయమన్నారు. అదే ఆయన నాకు చేసిన మహా ఉపకారం. దేవుడి పాటలు ఎక్కువ రాసే నేను విక్రమార్కుడిలో జింతాత్త జిత్త జిత్త పాట రాశాను. తిట్ల మీద కూడా పాట రాశాను. నేను ఎన్నో పాటలు రాశాను. ప్రతి ఛానల్లో, ప్రతి గుడిలో అందరి బంధువయ, జగదానందకార, మహా కనకదుర్గ.. విజయ కనకదుర్గ, జయజయ శుభకర వినాయక, అయ్యప్ప దేవాయ నమహ.. వంటి ఎన్నో సాంగ్స్ మార్మోగుతూనే ఉన్నాయి. అది నాకు చాలా సంతోషం, కానీ నాకింతవరకు ఏ అవార్డూ రాలేదు' అని చెప్పుకొచ్చాడు జొన్నవిత్తుల. చదవండి: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన డైరెక్టర్ నేను మారిపోయాను, చాలా సంతోషంగా ఉన్నా: నాగచైతన్య -
అక్షర యోధుడు అదృష్టదీపుడు
అతను ‘ఎర్రజెండా నా ఎజెండా’ అని నినదించిన నిబద్ధత గల అభ్యుదయ కవి. సినిమా పాటకు కొత్త బాట వేసిన గేయకవి. నటుడు, గాయకుడు, ఉత్తమ ఉపన్యాసకుడు. చాలామందికి తెలియని అతని పూర్తి పేరు – సత్తి అదృష్ట దీప రామకృష్ణారెడ్డి. విద్యార్థి దశలోనే శ్రీశ్రీని అభిమానించిన దీపక్ శ్రీశ్రీ గేయాలను సభల్లోనూ, సమావేశాల్లోనూ వీరావేశంతో ఆలపించేవాడు. ‘అరసం’, ప్రజా నాట్యమండలి వంటి సంస్థలలో క్రియాశీల పాత్ర పోషించాడు. ‘కోకిలమ్మ పదాలు’తో కలంపట్టిన దీపక్... ‘అగ్ని’, ‘ప్రాణం’, ‘అడవి’ కవితా సంపుటాలనూ, ‘దీపక రాగం’ సాహిత్య వ్యాస సంపుటినీ వెలువరించాడు. అతని కుటుంబ సభ్యులు ప్రచురించిన ‘దీపం’ వ్యాస సంకలనం, అభిమానులు ప్రచురించిన ‘తెరచిన పుస్తకం’ జీవిత చరమాంకంలో వెలుగుచూసిన కానుకలు! ‘సాక్షి’ ఫన్డేలో ‘పదశోధన’ పేరుతో 640 వారాలుగా నిర్వహించిన పదబంధ ప్రహేళిక శీర్షిక తెలుగు భాష మీద దీపక్‌కు ఉన్న పట్టుకు నిదర్శనం. ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు ‘ప్రాణం’ చదివి ముగ్ధుడై ‘యువతరం కదిలింది’ (1980)లో పాటలు రాయమని పిలవడంతో అయాచితంగా అదృష్ట దీపక్ సినీ రంగంలో అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ అంటూ దీపక్ రాసిన పాట రెండు దశాబ్దాల పాటు నలభై సినిమా పాటల వరకు రాయడానికి దారి దీపమైంది. (చదవండి: శతతంత్రుల మాంత్రికుడు) ‘నేటి భారతం’ చిత్రం కోసం రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం...’ బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ‘ఎర్రమల్లెలు’ చిత్రం కోసం రాసిన ‘మేడే’ గీతం నేటికీ ఆ రోజున మారుమోగుతూనే ఉంది. తను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా చవకబారు పాటల్ని రాయడానికి ఇష్టపడక పోవడంవల్ల ‘నేను సైతం’ (2004) చిత్రం తర్వాత అతను చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ‘అక్షరాలే వేళ అగ్ని విరజిమ్మాలి’ అంటూ యువతరాన్ని ఉత్తేజపరిచిన అదృష్ట దీపక్ చిరస్మరణీయుడు. (చదవండి: కైఫియత్తులే ఇంటిపేరుగా...) – డాక్టర్ పైడిపాల, సినీ పరిశోధకుడు (మే 16న అదృష్ట దీపక్ ప్రథమ వర్ధంతి) -
విషాదం: ప్రముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్ కన్నుమూత
ప్రముఖ లిరిసిస్ట్ మాయా గోవింద్(82)ఇక లేరు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గురువారం గుండెపోటు కారణంగా కన్నుమూసినట్లు ఆమె తనయుడు అజయ్ తెలిపారు. 'బ్రెయిన్ క్లాట్ కావడంతో అమ్మ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించింది. చికిత్స తర్వాత కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు. అయితే గురువారం గుండెపోటు రావడంతో అమ్మ చనిపోయింది' అంటూ అజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన మాయా గోవింద్ సుమారు 350 సినిమాలకు పనిచేశారు. ‘ఆంఖో మే బేస్ హో తుమ్’,‘మై ఖిలాడీ తూ అనారీ’,‘ మోర్ ఘటర్ ఆయే సజన్వా, గుటుర్ గుటుర్ వంటి ఎన్నో పాపులర్ పాటలను రాశారు. కాగా మాయా గోవింద్ మృతి పట్ల బీ టౌన్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మాయా గోవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. -
‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’
ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మృతిపట్ల చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. కందికొండ కుటుంబానికి సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ముందు కందికొండ యాదగిరి చిత్రపురి కాలనీలో నాలుగు లక్షల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారని, అనారోగ్యం పాలైన తర్వాత ఆ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని నాలుగు లక్షలు వెనక్కి తీసుకున్నారని చెప్పుకొచ్చారు. (చదవండి: 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం) అయితే ఆయన అనారోగ్యం పాలైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఏదైనా సహాయం చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. అందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కందికొండ కుటుంబానికి 20 లక్షల రూపాయలు విలువ చేసే సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొని అందజేయడం జరిగిందని అన్నారు. అయితే కొద్ది రోజులు గడిచిన తరువాత తండ్రి అనారోగ్యం దృష్ట్యా సింగిల్ బెడ్ రూమ్ తమకు సరిపోవడం లేదని కందికొండ కుమార్తె తమ దృష్టికి తీసుకురావడంతో అది మంత్రి శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లానని అనిల్ కుమార్ పేర్కొన్నారు. మంత్రివర్యులు కూడా ఆ విషయం మీద సానుకూలంగా స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి అంగీకరించారని వారి కుమార్తెను సమయం చూసుకుని వస్తే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు. కందికొండ కుటుంబానికి ముందు సింగిల్ బెడ్ రూమ్ ఇచ్చామని డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యామని ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిల్ కుమార్ పేర్కొన్నారు. -
1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం
Popular Lyricist Kandikonda Yadagiri Passed Away His Life Journey: ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి (49) ఇక లేరు. శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 2012లో ఆయనకు తొలిసారిగా కేన్సర్ నిర్ధారణ అయింది. అప్పట్లోనే సర్జరీ చేయించారు. 2019లో కేన్సర్ తిరగబెట్టడంతో చికిత్సలో భాగంగా చేసిన కీమోథెరపీ, రేడియేషన్ వల్ల వెన్నెముక దెబ్బతింది. అప్పటి నుంచి కందికొండ పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. నోటమాట కూడా రాలేదు. నగరంలోని ప్రధాన ఆస్పత్రుల చుట్టూ తిరిగి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. కందికొండ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, కళాభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింఛాంబర్‌కు తరలించనున్నారు. కందికొండకు భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు (మార్చి 13) మహాప్రస్థానంలో జరగనున్నాయి. చదువుకునే రోజుల్లోనే.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో 1973 అక్టోబరు 13న సాంబయ్య, కొమురమ్మలకు కందికొండ జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతూర్లో, హైస్కూల్ చదువు నర్సంపేటలో కొనసాగించారు. మానుకోటలో ఇంటర్ పూర్తి చేసి, మహబూబా బాద్‌లో డిగ్రీ పూర్తి చేశారాయన. ఇంటర్ సెకండియర్‌లో చక్రి (దివంగత సంగీత దర్శకుడు)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ పాటల మీద ఆసక్తి ఉండడంతో ‘సాహితీ కళా భారతి’ అనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఇంటర్లో ఉన్నప్పడు పుణేలో జరిగిన జాతీయస్థాయి క్రీడల పోటీల్లో పరుగు పందెంలో పాల్గొన్నారు కందికొండ. 1997– 98లో మిస్టర్ బాడీ బిల్డర్‌గానూ గెలిచారు కందికొండ. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే సాహిత్యం, సినిమాల పట్ల కందికొండకు ఆసక్తి ఉంది. ఆ ఆసక్తే ఆయన్ను సినిమా ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది. ఇప్పటివరకు కందికొండ పదమూడు వందలకు పైగా పాటలు రాశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు.. చక్రి సంగీత సారథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంతో గేయరచయితగా కందికొండ ప్రస్థానం మొదలైంది. ఈ చిత్రంలో ‘మళ్లీ కూయవే గువ్వా’ పాట రాశారు. ‘ఇడియట్’ చిత్రంలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘పోకిరి’లో ‘జగడమే..’, ‘గలగల పారుతున్న గోదారిలా..’, ‘టెంపర్’ చిత్రంలో ‘వన్ మోర్ టైమ్’.. 'లవ్లీ'లో 'లవ్లీ లవ్లీ'.. ఇలా ఎన్నో హిట్ పాటలు కందికొండ కలం నుంచి వచ్చినవే. అలాగే 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాకా శ్రీకాంత్ నటించిన 'కోతలరాయుడు' చిత్రంలో ఒక పాట రాశారు. సినిమా పాటలతోనే కాదు.. సంప్రదాయ, జానపద పాటల్లోనూ తన ప్రతిభ చాటారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ‘మాగాణి మట్టి మెరుపు తెలంగాణ’, ‘చిన్నీ మా బతుకమ్మా.. చిన్నారక్క బతుకమ్మా’ వంటి చెప్పుకోదగ్గ పాటలు ఉన్నాయి. అలాగే 2018లో తెలంగాణ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా కందికొండ రాసిన ‘వచ్చాడు వచ్చాడు ఒక లీడర్’, 2019లో సంక్రాంతి సందర్భంగా రాసిన పాటలు కూడా బాగానే ప్రాచుర్యం పొందాయి. ఇరవై రోజుల క్రితం నాగుర్లపల్లికి వెళ్లిన కందికొండ తన తల్లిదండ్రులు ఉంటున్న పెంకుటిల్లును తనివి తీరా చూశారట. ‘కన్న కొడుకు మాకన్నా ముందే ఈ ప్రపంచానికి దూరం అవుతాడని అనుకోలేదు’ అని కందికొండ తల్లిదండ్రులు విలపించడం స్థానికుల కళ్లు చెమర్చేలా చేసింది. కందికొండ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ కన్నుమూత
-
మూగబోయిన కందికొండ గుండె సవ్వడి
-
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ గేయ రచయిత కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. కొన్నేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆసుపత్రి ఖర్చులు భారీగా చెల్లించాల్సి వస్తుండటంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ సాయం చేశారు. కాగా కందికొండ స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. ఆయన చదువుకునే రోజుల నుంచే పాటలు రాయడం నేర్చుకున్నారు. ఇంటర్ చదివేటప్పుడు చక్రితో పరిచయం ఏర్పడింది. మొదట్లో జానపద గీతాలు రాసిన కందికొండ సినీ సంగీత దర్శకుడైన చక్రి సాన్నిహిత్యంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారు. తొలిసారిగా చక్రి సంగీత దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో 'మళ్లి కూయవే గువ్వా' పాట రచనతో సినీ సాహిత్యంలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుస అవకాశాలతో పాటలు రాసి గేయరచయితగా నిలదొక్కుకున్నారు. కందికొండ సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు రాశారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు ప్రతి గ్రామంలోనూ మార్మోగాయి. ఆయన పాటలే కాదు కవిత్వం రాయడంలోనూ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు. చదవండి: పరుచూరి వెంకటేశ్వరరావు లేటెస్ట్ ఫొటో చూసి షాకవుతున్న ఫ్యాన్స్! -
Arabic Kuthu: అసలు ఆ పాటను ఎలా రాశాడబ్బా?
Vijay Beast Arabic Kuthu Song Lyricist Details: గంటలో మిలియన్న్నర వ్యూస్.. అంతే రేంజ్లో లైక్స్. సినిమా వాళ్లంటే పడిచచ్చే తమిళ తంబీలు, విజయ్ ఫ్యాన్స్ హోల్‌సేల్‌గా బీస్ట్ ‘అరబిక్ కుతు’ సాంగ్ పాటకి ఫిదా అయిపోతున్నారు. చాలాకాలం గ్యాప్ తర్వాత విజయ్ స్టైలిష్ స్టెప్పులేయడంతో ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. బీస్ట్ సినిమా కోసం సాంగ్‌కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్, స్టైలిష్ స్టెప్పులు కంపోజ్ చేసిన జానీ మాస్టర్‌కు మాత్రమే కాదు.. పాట రాసిన హీరో శివకార్తికేయన్కే మేజర్ క్రెడిట్ ఇవ్వాలంటున్నారు విజయ్ అభిమానులు. యస్.. టీవీ నటుడి నుంచి కష్టపడి నెమ్మది నెమ్మదిగా స్టార్ హీరోగా ఎదిగాడు శివకార్తికేయన్. ఇండస్ట్రీలో ఇగో లేని హీరోగా అతనికి పేరుంది. అందుకే అతడంటే కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. మిగతా భాషల్లోనూ అతనికి అభిమానులు ఎక్కువే. ఈ క్రమంలో హీరోగా, ప్రొడ్యూసర్‌గా, నిర్మాతగా, సింగర్‌గా.. గేయ రచయితగానూ తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంతకు ముందు కొలమావు కోకిల కోసం యోగిబాబు ‘కళ్యాణ వయసు’ సాంగ్, డాక్టర్ కోసం ‘చెల్లమ్మ, సో బేబీ’, సూర్య Etharkkum Thunindhavan కోసం ‘సుమ్మ సుర్రును’ లాంటి హిట్ సాంగ్స్ రాశాడు. ఇప్పుడు బీస్ట్ కోసం అరబిక్ టచ్‌తో అరబిక్ కుతు సాంగ్ అందించాడు. నిజానికి ఈ పాట షార్ట్ టైంలో ఆకట్టుకోవడానికి, అంచనాలు పెంచుకోవడానికి కారణం.. శివకార్తికేయన్ ఇచ్చిన అరబిక్ టచ్. ఇందుకోసం తానేమీ అరబిక్‌ను అవపోసన, బట్టీ పట్టలేదని అంటున్నాడు శివకార్తికేయన్. తాజాగా ఓ మీడియా బైట్‌లో మాట్లాడుతూ.. జస్ట్.. అరబిక్ హమ్మింగ్ పదాలను సేకరించి.. వాటికి తమిళ పదాలు మేళవించి రాశానని చెప్పాడు. అలా అరబిక్ కుతుకు తన పని తేలికయ్యిందని అంటున్నాడు శివకార్తికేయన్. ఇక ఈ సాంగ్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ సాంగ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ను సినీ గేయ రచయిత, దివంగత న ముత్తుకుమార్(ఎన్నో అర్థవంతమైన పాటల్ని రాసిన ముత్తుకుమార్.. 2016లో జాండిస్‌తో చనిపోయారు) కుటుంబానికి అందజేసి మంచి మనసు చాటుకున్నాడు నటుడు శివకార్తికేయన్. దీంతో సోషల్ మీడియాలో ఈ యంగ్ హీరోను తెగ పొగిడేస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషన్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో రాబోతున్న బీస్ట్.. ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. జొనిత గాంధీతో కలిసి అనిరుధ్ పాడిన అరబిక్ కుతు సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి. సాంగ్ హిట్‌ను సంగతి కాసేపు పక్కనపెడితే.. తెలుగు మీమ్స్ పేజీలు ఈ సాంగ్ లిరిక్స్‌లోని పదాలతో ట్రోలింగ్ చేస్తూ నవ్వులు పంచుతున్నారు. -
'నేను సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోయింది'
భక్తి చిత్రాల రచయితగా జేకే భారవి ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయనది. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు తీసిన ఆయన ఒక్క సినిమాతో కుదేలయిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కెరీర్లో ఎన్నో కార్లు చూసిన నేను ఇప్పుడు బైక్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూకి వచ్చాను. ఎన్నోఏళ్లుగా సంపాదించిందంతా ఒకే ఒక్క సినిమా జగద్గురు ఆదిశంకరతో పోయింది. తెలుగు, కన్నడ భాషల్లో నా కథలు ఓకే అయ్యాయి. కానీ కరోనా వల్ల డబ్బులు రావడం ఆలస్యమవుతోంది. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే నాగార్జున నాకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు, కానీ చేయి చాచి అడగడం నాకిష్టముండదు అని చెప్పుకొచ్చారు. -
సిరివెన్నెల చివరి కోరిక ఏంటో తెలుసా?
తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్రపరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదంటూ సినీప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కలం నుంచి జాలివారిన పాటలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ఏకాకి జీవితం నాది అంటూ నిష్క్రమించిన ఈ మహనీయుడికి ఓ కోరిక ఉండేదట! తన కొడుకు రాజాను ఒక మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో చూడాలని సిరివెన్నెల ఎంతగానో ఆశపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 14 ఏళ్ల క్రితం దర్శకుడు తేజ తెరకెక్కించిన 'కేక' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు రాజా. తర్వాత 'ఎవడు' సినిమాలో విలన్‌గా, అనంతరం 'ఫిదా'లో వరుణ్‌తేజ్ అన్నయ్యగా నటించాడు. కొన్ని మంచి పాత్రలే దక్కినా కూడా రాజాకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. దీంతో తన కొడుకు కెరీర్ విషయంలో సిరివెన్నెల మదనపడ్డారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. రాజా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే సిరివెన్నెల ఆత్మకి శాంతి చేకూరుతుందని, అది జరగాలని ఆయన అభిమానులు మనసారా కోరుకుంటున్నారు. -
కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం
కళావెన్నెల విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. పాటలు పామరులకు అందాయి. కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు? విశ్వనాథ్: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉందనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్ కార్డ్. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాలగారు వాళ్లు మాత్రమే సింగిల్ కార్డ్ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను. సిరివెన్నెల: కన్విక్షన్ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్న (విశ్వనాథ్‌ని సిరివెన్నెల అలానే పిలిచేవారు)గారు అన్నారు. విశ్వనాథ్: కేవీ మహదేవన్ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్ కట్టేవారు. ‘సిరివెన్నెల’ సినిమాకి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్నెస్. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్.. అనిపించింది. మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా? విశ్వనాథ్: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు. ‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి? సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా. మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ కెరీర్ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. విశ్వనాథ్: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే. వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..? విశ్వనాథ్: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వేరే రచయిత కోసం వెతుక్కోనవసరం లేదు. సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం. మీ శిష్యుడు రాత్రిపూట పాటలు రాయడం గురించి? సిరివెన్నెల: మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను. విశ్వనాథ్: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. ఇది చదవండి: సిరివెన్నెలకు గూగుల్ నివాళి.. 'ట్రెండింగ్ సెర్చ్' ట్వీట్ -
సిరివెన్నెలకు ఆ జిల్లా అంటే అమితమైన ప్రేమ..
సాక్షి, విజయనగరం: సప్తస్వర మాంత్రికుడు ఇకలేరన్న విషయం సాహితీలోకానికి తీరనిశోకాన్ని మిగిల్చింది. విద్యలనగరమైన విజయనగరం వచ్చినప్పుడల్లా సాంస్కృతిక నగరంలో అడుగుపెట్టడం తన అదృష్టమంటూనే మాటలను ప్రారంభించేవారు. గురజాడ నడయాడిన నేలపై, వందల ఏళ్లనాటి చరిత్ర కలిగిన సంగీత, నృత్య కళాశాలలో విద్యనేర్చుకున్న ఘంటసాల, సుశీలమ్మలను గుర్తుచేసుకుంటూనే తన ప్రసంగాన్ని జిల్లా వాసులకు అందించేవారు. ఆయన సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అటువంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం విజయనగర సాహిత్యాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. యాదృచ్ఛికంగా మహాకవి వర్ధంతిరోజునే పాటలబాటసారి అస్తమయం కావడం సాహిత్యలోకాన్ని విషాదంలో ముంచింది. విజయనగరమంటే అమితమైన ప్రేమ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెలకు విద్యలనగరమైన విజయనగరమంటే ఎంతో ఇష్టం. సరిగ్గా నేటికి మూడేళ్ల కిందట 2018లో గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని ఆనందగజపతి ఆడిటోరియంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో దర్శకులు క్రిష్‌కు గురజాడ పురస్కారాన్ని సమర్పించే సందర్భంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రధానవక్తగా పాల్గొని అద్భుతమైన ప్రసంగంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. 2017లో ఎస్.కన్వెన్షన్‌లో జరిగిన రోటరీ 60 వసంతాల వేడుకలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. బాధాకరం సాహితీ సౌరభం నేలరాలింది. ఆయన రచనలు అజరామరం. ఏ నోట విన్నా ఆయన రాసిన పాటలే. మంచి మనిషిగా, పాటల మాంత్రికునిగా పేరుగాంచి ఎన్నో అవార్డులు పొందిన వెన్నెల అస్తమయం అయిందన్న విషయం బాధాకరం. ఆయన కుమార్తె వివాహానికి విజయనగరంలో పరిచయమున్న బుచ్చిబాబు, ఉసిరికల చంద్రశేఖర్, కాపుగంటి ప్రకాష్, అశోక్ మందాకిని, గంటి మురళీ తదితరులను స్వయంగా ఆహ్వానించారు. గురజాడ సమాఖ్య తరఫున ఆయనకు అంజలిఘటిస్తున్నాం. – కాపుగంటి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య,విజయనగరం -
సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు
Sirivennela Sitaramasastry Popular Hit Songs: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల ఆయన న్యూమోనియాతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రీ. ఆయన 'సిరివెన్నెల' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 1986లో విడుదలైన శాస్త్రీయ సంగీత ప్రాధాన్యమున్న ఈ సినిమాకు కళాతపస్వీ కే. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 'సిరివెన్నెల' చిత్రంలోని 'విధాత తలపున ప్రభవించినది' అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో 'సిరివెన్నెల సీతారామశాస్త్రీ'గా స్థానం సంపాదించి పెట్టంది. ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది. మూడు నాలుగు నిమిషాలుండే పాటలో సినిమా తాలుకు భావాన్ని నింపడం అదికూడా అర్ధమయ్యే పదాలతో రాయడం అంటే అది అందరికీ సాధ్యం కాదు.. అలా పాటలు రాయడంలో దిగ్గజాలు అయిన మహానుభావులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కే. విశ్వనాథ్‌కు పరిచయం చేశారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాగే రుద్రవీణ సినిమాలో 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ' అనే పాట, 'లలిత ప్రియ కమలం విరిసినదీ' అనే పాటలను అద్భుతంగా రాసారు. 'లలిత ప్రియ కమలం' పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అలాగే కృష్ణ వంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాలో ఆయన రాసిన 'అర్ధ శతాబ్దపు' పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అగ్నిజ్వాలలను రగిలించే పాటలే కాదు చిగురుటాకు లాంటి అందమైన ప్రేమ గీతాలను కూడా సీతారామ శాస్త్రీ అందించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని' అని పాటను రాయడంమే కాదు అందులో పాడి నటించి మెప్పించారు. ఈ పాటకు సిరివెన్నెలను ప్రభుత్వం నంది పురస్కారంతో సత్కరించింది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. ఇటీవల ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన 'దోస్తీ' పాటతో కూడా అలరించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ. ఎన్నో వేల అద్భుత గేయాలు అందించి సంగీత ప్రపంచంలో జో కొట్టిన ఆయనకు నివాళిగా ఆ ఆణిముత్యాలు మీకోసం. 1. విధాత తలపున ప్రభవించినది (సిరివెన్నెల) 2. పారాహుషార్ (స్వయంకృషి) 3. నమ్మకు నమ్మకు ఈ రేయిని (రుద్రవీణ) 4. తరలిరాద తనే వసంతం (రుద్రవీణ) 5. ఘల్లు ఘల్లు (స్వర్ణకమలం) 6. బోటనీ పాఠముంది (శివ) 7. కొత్త కొత్తగా ఉన్నది (కూలీ నెం 1) 8. చిలుకా క్షేమమా (రౌడీ అల్లుడు) 9. జాము రాతిరి జాబిలమ్మ (క్షణక్షణం) 10. వారేవా ఏమీ ఫేసు (మనీ) 11. నిగ్గ దీసి అడుగు (గాయం) 12. అమ్మ బ్రహ్మ దేవుడో (గోవిందా గోవిందా) 13. చిలకా ఏ తోడు లేక (శుభలగ్నం) 14. తెలుసా మనసా (క్రిమినల్) 15. హైలెస్సో హైలెస్స (శుభసంకల్పం) 16. అపురూపమైనదమ్మ ఆడజన్మ (పవిత్రబంధం) 17. అర్ధ శతాబ్దపు (సింధూరం) 18. జగమంత కుటుంబం నాది (చక్రం) 19. సామజ వరగమన (అల వైకుంఠపురములో) 20. దోస్తీ (ఆర్ఆర్ఆర్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటా ఆణిముత్యమే
సాక్షి, హైదరాబాద్: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త టాలీవుడ్ పెద్దలను, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసింది. సుదీర్ఘ కరియర్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించి సిరివెన్నెలను తలుచుకుని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలుగు పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ వెతికి పట్టుకున్న ఆణిముత్యం సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయన ప్రతీ పాటను ఎంతో అద్భుతంగా మలిచారు. అప్పటికీ, ఇప్పటికీ ఆ పాటలు అజరామరమే. ‘విధాత తలపున ప్రభవించినది’ అంటూ మొదలు పెట్టిన ఆయన ప్రస్థానంలో మూడు వేలకు పైగా పాటలు. ముఖ్యంగా గాయం మూవీలో నిగ్గు దీసి అడుగు అంటూ సిగ్గులేని జనాన్ని కడిగేసిన పదునైన కలం ఆయనది. అందరిలో ఉన్నా... ఒంటరిగా బతుకుతున్న ఓ యువకుడి కథ కోసం ‘జగమంతా కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ తాత్వికతను ప్రదర్శించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు అంకురం : ఎవరో ఒకరు ఎపుడో అపుడు శ్రుతిలయలు - తెలవారదేమో స్వామీ మహర్షి - సాహసం నా పథం రుద్రవీణ - తరలిరాదా తనే వసంతం, నమ్మకు నమ్మకు ఈ రేయినీ కూలీ నెం:1 - కొత్త కొత్తగా ఉన్నదీ రౌడీ అల్లుడు - చిలుకా క్షేమమా క్రిమినల్ - తెలుసా మనసా పెళ్లి - జాబిలమ్మ నీకు అంత కోపమా మురారి మూవీలో అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి పాటతోపాటు, ‘చంద్రుడిలో ఉండే కుందేలు కిందకొచ్చిందా...కిందకొచ్చి నీలా మారిందా’ అనే భావుకత. ‘జామురాతిరి..జాబిలమ్మా...’ అంటూ జోల పాడి హాయిగా నిద్రపుచ్చే అందమైన సాహిత్యం ఆయన సొంతం. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ అలవైకుంఠపురంలో ‘సామజవరగమన పాటలు పెద్ద సంచలనం. ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)