కార్తిక్ నేత- వైరముత్తు(కర్టెసీ : ఇండియా టుడే)
కోలీవుడ్‌లో హిట్ మూవీగా నిలిచిన విజయ్ సేతుపతి- త్రిషల ‘96’ సినిమాలో ‘అంతాతీ నీ సాంగ్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు యువ రచయిత కార్తిక్ నేత. గతేడాది విడుదలైన చిత్రాల్లోని ఉత్తమ పాటల్లో ఒకటిగా నిలిచిన పాటతో కార్తిక్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో పలు ఎంటర్టేన్‌మెంట్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జాతీయ అవార్డు గ్రహీత, ప్రసిద్ధ రచయిత వైరముత్తుపై కార్తిక్ సంచలన ఆరోపణలు చేశాడు. ‘వాగై సోడా వా’ అనే సినిమాలో ‘సారా సారా సరకాత్తు’ అనే పాటను రాసింది తానైతే.. టైటిల్ కార్డ్స్‌లో మాత్రం వైరముత్తు తన పేరు వేయించుకున్నారని కార్తిక్ వ్యాఖ్యానించాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన పాటలకు ఆయన క్రెడిట్ కొట్టేశారంటూ ఆరోపించాడు.
ఈ క్రమంలో అతని ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో కార్తిక్ వెనక్కి తగ్గాడు. ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ... ‘ ఇటీవల నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన మాట వాస్తవమే. అయితే అప్పుడు నేనేం మాట్లాడానో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను నా మాటలను అంగీకరించలేను అలాగే తిరస్కరించలేను కూడా. ప్రస్తుతం నేను సిటీలో లేను. ఈ విషయం గురించి ఇప్పుడు నేనేం మాట్లాడలేను’ అని పేర్కొన్నాడు. కాగా మీటూ ఉద్యమంలో భాగంగా వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసిన గాయని చిన్మయి శ్రీపాద కార్తిక్‌కు మద్దతుగా నిలిచారు. ‘ కార్తిక్ నేత తనకు జరిగిన అన్యాయం గురించి నోరు విప్పడం హర్షించదగ్గ విషయం’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment