
సింగర్ చిన్మయి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనీగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె సింగర్‌గా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో నిర్మాత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇక చిన్మయి సోషల్ మీడియా వేదికగా కూడా పలు సామాజీక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది.
చదవండి: ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో
అంతేకాదు యువతకు, మహిళలు సూచనలు ఇస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఓ నటిని హెచ్చరించింది. ప్రముఖ తమిళ నిర్మాతను కలిసి ఆమెకు చిన్మయి వార్నింగ్ ఇస్తూ సూచనలు ఇచ్చింది. వివరాలు.. తమిళ నటి, వీజే అర్చనా అర్చన ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. ఆ షూటింగ్ సెట్‌కు వచ్చిన నిర్మాత వైరముత్తును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
దీంతో తన ఫొటోలపై చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అది ఇలాగే మొదలవుతుంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండు. వీలైతే అతడికి తగినంత దూరం పాటించు. ముఖ్యంగా ఇలా ఒంటరిగా అసలు కలవకు. నీతో తోడుగా ఎవరైనా ఉండేలా చూసుకో.. జాగ్రత్త’ అంటూ అర్చన పోస్ట్‌కు కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాగా నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు.
చదవండి: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment