Singer Chinmayi Fires On CM MK Stalin For Birthday Wishes To Harassment Accused Vairamuthu - Sakshi
Sakshi News home page

Chinmayi Slams MK Stalin: వాట్‌ ఏ గ్రేట్ కల్చర్.. మహిళలను వేధిస్తే సీఎం ఇంటికే వస్తాడు:‍ చిన్మయి

Published Fri, Jul 14 2023 9:07 AM | Last Updated on Fri, Jul 14 2023 10:29 AM

Singer Chinmayi Fire On CM Stalin For Birthday Wish To Vairamuthu - Sakshi

సింగర్ చిన్మయి పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలో పలువురిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తమిళ పాటల రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలతో ఆమెను కోలీవుడ్‌ నుంచి నిషేధానికి కుడా గురైంది. అయితే తాజాగా గురువారం వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచింది. ట్విటర్‌ వేదికగా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

(ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి)

సింగర్ చిన్మయి చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ వ్యక్తిగతంగా కలిసి.. ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సింగర్ చిన్మయికి ఆగ్రహం తెప్పించింది. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడితే సిగ్గేస్తోందని ఘాటుగా విమర్శించింది. రాజకీయ నాయకుల అండతోనే వారు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించింది.  

ట్వీట్‌లో చిన్మయి రాస్తూ.. 'తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అతని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడం. నేను ఒక మహిళగా అతనిపై మీటూ ఉద్యమంలో ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి తమిళ ఇండస్ట్రీలో బ్యాన్ విధించారు. రాజకీయ అండతో ఒక రచయిత  ఏ స్త్రీపైనా చేయి వేయగలడని ఫిక్స్ అయిపోయాడు. రాజకీయ నాయకులతో అతనికి ఉన్న సాన్నిహిత్యంతో మౌనంగా ఉండమని ఓ మహిళను బెదిరించాడు. అందుకే పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఈ మనిషికి ఉన్న శక్తి ఇది. నన్ను చాలా మంది మహిళలు ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని అడిగారు.

తమిళనాడులో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లో మహిళల భద్రత కోసం మాట్లాడడం తలుచుకుంటే సిగ్గేస్తోంది. ఎందుకంటే వైరముత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వారంతా మౌనంగా ఉంటారు. ఈ భూమి అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం మహిళలను వేధించేవారి పుట్టినరోజు జరుపుకుంటారు. కానీ వీటిపై మాట్లాడిన మహిళలను వేధిస్తారు.  

మనకు సున్నితత్వం, సానుభూతి, విద్యపైనా అవగాహన మాత్రం శూన్యం. బ్రిజ్ భూషణ్ నుంచి వైరముత్తు వరకు ఎల్లప్పుడు రాజకీయ నాయకులు వీరిని కాపాడతారు. ఈ భూమిలో ప్రాథమికంగా దొరకని న్యాయం కోసం ఎదురుచూడటం బాధాకరమైన విషయం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్‌, వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement