![Singer Chinmayi Faced Netizens Comments - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/2/chinmayi.jpg.webp?itok=4kV-RV9C)
ప్రముఖ గాయనిగా చిన్మయి శ్రీపాదకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా సమంతకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ఆమె మల్టీటాలెంటెడ్‌గా చిత్ర పరిశ్రమలో రానించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. ఎదుటివారు ఎంతిటివారైనా సరే తను ఓపెన్‌గానే విరుచుకుపడుతుంది. దీంతో ఆమెపై ఒక వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు.
(ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు )
తాజాగా అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో ఆమెకు ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు ఒక నెటిజన్ ఇలా మెసేజ్ చేశాడు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. సాటి అమ్మాయిల కోసం నిలబడే తీరు నాకు ఎంతో నచ్చింది. ఇలాగే మీరు ఎప్పుడూ ఉండాలి. మా సోదరికి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంది.' అని మెసేజ్ చేశాడు.
కానీ చిన్మయి తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో దాగున్న అసలు స్వరూపం బయటకు వచ్చింది. మళ్లీ ఇలా మెసేజ్ చేశాడు. 'నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా.?' అంటూ మరో అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. అంతటితో ఆగక 'నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.' అని వరుసబెట్టి మెసేజ్‌లు పంపాడు.
(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు)
దీనిపై చిన్మయి ఫైర్ అయింది. ఈ చెత్త ఎదవను చూడండి మొదట పద్దతిగా మెసేజ్‌లు చేశాడు.. నేను తిరిగి రిప్లై ఇవ్వకపోవడంతో వాడి ఈగో దెబ్బతిన్నట్లు ఉంది. దీంతో వాడి అసలు రూపం బయటకొచ్చింది. ఇలాంటి వాడ్ని ఏం చేయాలి.. ముందు వాడి నాన్నను అనాలి. ఇంత చెత్తగా పిల్లలను ఎలా పెంచాడు. ఇలాంటి ఎదవలు సమాజంలో చాలామందే ఉన్నారు. అమ్మాయిలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చిన్మయి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment