Chinmayi Sripada
-
స్టార్ డైరెక్టర్‌పై కమెడియన్ దారుణ కామెంట్స్.. వాళ్లను ఆ జబ్బు వదలదేమో?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీకి ఆయనే కథను అందించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించగా.. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా బేబీ జాన్ టీమ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకి హాజరైంది.అయితే ఈ షోలో డైరెక్టర్ అట్లీని ఉద్దేశించిన కపిల్ శర్మ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది. అట్లీ కలర్‌ను ఉద్దేశిస్తూ వ్యంగ్యమైన ప్రశ్న వేశాడు కపిల్. మీరు ఎవరైనా స్టార్‌ని కలిసినప్పుడు.. మీరు అతనికి కనిపిస్తారా? అంటూ అట్లీ కలర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి అట్లీ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.దీనికి అట్లీ మాట్లాడుతూ...'ఒక విధంగా మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తా. నా మొదటి సినిమాను నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్కి నేను చాలా కృతజ్ఞతలు. అతను నా స్క్రిప్ట్, నా సామర్థ్యం మాత్రమే చూశాడు. అంతేకానీ నేను ఎలా ఉన్నానో ఆయన అడగలేదు. అక్కడ ఆయనకు నా కథ నచ్చింది. ప్రపంచం అది మాత్రమే గుర్తిస్తుంది. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. మీ హృదయంతో మాత్రమే స్పందించాలి. ' అంటూ కపిల్ శర్మకు ఇచ్చిపడేశాడు.అయితే ఈ ప్రశ్నపై సింగర్ చిన్మయి శ్రీపాద సైతం స్పందించింది. ఈ షో అట్లీ కలర్ గురించి కపిల్ శర్మ జోక్ చేశాడని విమర్శించింది. కామెడీ పేరుతో అతని చర్మం రంగు గురించి మాట్లాడే ఈ విపరీతమైన హేళనలను వాళ్లు ఎప్పటికీ ఆపలేరేమో? అంటూ మండిపడింది. కపిల్ శర్మ లాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని చిన్మయి ట్వీట్ చేసింది. అయితే కపిల్ కామెంట్స్ తనకు ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం చిన్మయి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Will they never stop these crass and racist jibes at his skin color in the name of ‘comedy’?Someone with the amount of influence and clout like Kapil Sharma saying something like this is disappointing and unfortunately, not surprising. https://t.co/63WjcoqHzA— Chinmayi Sripaada (@Chinmayi) December 15, 2024 -
మైనర్‌గా ఉన్నప్పటి నుంచే 'జానీ' వేధించాడు: చిన్మయి
ప్రముఖ గాయని చిన్మయి తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీపై రియాక్ట్ అయ్యారు. చిత్రపరిశ్రమలో 'మీటూ' ఉద్యమం సమయం నుంచే ఆమె అనేక అంశాలపై లేవనెత్తుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని మహిళలు లైంగిక దాడులకు గురైతే వెంటనే తన అభిప్రాయాన్ని తెలుపుతారు. డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక ఆరోపణలు చేసిన యువతి పక్షాన సింగర్ చిన్మయి నిలబడ్డారు.ఒక మీడియా కథనాన్ని ట్యాగ్ చేస్తూ చిన్మయి ఇలా చెప్పుకొచ్చారు. 'నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను.' అని ఆమె తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని (అసిస్టెంట్ కొరియోగ్రాఫర్) జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. నార్సింగ్ పోలీస్టేషన్లో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే.చిన్మయి ఒక సింగర్‌గానే కాదు... ఆమె ఒక ఫెమినిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. గతంలో చిన్మయి కూడా లైగింక వేధింపులకు గరైనట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే సాహిత్య రచయిత వైరముత్తు తన ఫోన్ నంబర్ తీసుకుని పలు ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. తాను నంబర్ మార్చినా కూడా ఎదో విధంగా తెలుసుకుని కాల్స్ చేసేవాడని ఆమె చెప్పారు. అలా ఆమె కూడా ఇలాంటి ఘటనలతో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే ఆమె మహళలకు అండగా నిలుస్తూ ఉంటారు. -
'అలాంటి వారిని అంటే సమాజమే ఒప్పుకోదు'.. బాలకృష్ణ వివాదంపై సింగర్ ట్వీట్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. హీరోయిన్ అంజలి పట్ల వ్యవహరించిన తీరు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. మహిళలంటే ఆయననకు ఎంత చులకనో అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరుపై నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. అయితే గతంలోనూ బాలయ్య నోటీ దురుసుతో ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయడం చాలాసార్లు జరిగింది. తాజాగా ఈ వివాదంపై సింగర్, ఫెమినిస్ట్ చిన్మయి శ్రీపాద స్పందించారు. ఈ అంశంపై తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.చిన్మయి తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ వీడియోను షేర్ చేస్తున్న వారిలో నేను గమనించిన అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఆమె నవ్వు వైపు చూడండి. ఆమెకు ఉండాలి కదా. ఇలాంటివీ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్‌పై స్పందించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మోరల్ పోలీసింగ్ కంటే పవిత్రమైంది. హరిశ్చంద్ర, శ్రీరామచంద్రమూర్తి లేదా వారి బంధువుల అవతారాలు అర్థం చేసుకోకపోవడం పొరపాటే అవుతుంది. పవర్లో ఉన్న వారిని తప్పుగా చూపేందుకు ఈ సమాజమే ఒప్పుకోదు. ముఖ్యంగా డబ్బు, కులం, రాజకీయ బలం నుంచి వచ్చిన వారిని. అయినా ఇందులో మీకు ఎలాంటి నష్టం లేనప్పుడు.. మహిళలకు ఎలా ప్రవర్తించాలో చెప్పకండి.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. One of the biggest problems that I notice from people sharing this“Look at her laughing. She should have _____”1. It is NOT possible to respond according to your spectator response as you watch this on your device. This most moral policing, holier than thou - pure as driven… https://t.co/nzTOlGJm0J— Chinmayi Sripaada (@Chinmayi) May 30, 2024 -
టెకీ రమ్య ఉదంతం : మీరొచ్చి పెంచుతారా? గాయని చిన్మయి ఆవేదన
తమిళనాడులోని కోయంబత్తూరలో ఐటీ ఉద్యోగి రమ్య ఆత్మహత్య ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వేధించిన నెటిజన్లు వచ్చి ఇపుడా బిడ్డను పెంచుతారా అంటూ ఫైర్ అయ్యారు. ఆ మేరకు ఇన్‌స్టాలో చిన్మయి పోస్ట్ పెట్టారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) ఏప్రిల్ 28న, తిరుముల్లైవాయల్‌లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని నాల్గవ అంతస్తు బాల్కనీలో రమ్య తన కుమార్తెతో ఆడుకుంటుండగా, ఎనిమిది నెలల పాప ఆమె చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిపోయింది. అయితే వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడంతో మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలోఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. దీంతో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మారిపోవడం విషాదం. మరోవైపు కేసు నమోదు చేసిన కరమడై పోలీసులు ఆమె మరణాకి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది! -
Chinmayi Sripada And Rahul Ravindran: సింగర్ చిన్మయి శ్రీపాద వివాహ వార్షికోత్సవం.. అరుదైన ఫోటోలు
-
అన్నపూర్ణమ్మకు కౌంటర్.. సింగర్ చిన్మయికి షాక్..!
సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన కామెంట్స్‌పై వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే చిన్మయి వ్యాఖ్యలపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న అన్నపూర్ణమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? అంటూ మాట్లాడింది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయి శ్రీపాద.. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్‌కు రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ.. చిన్మయి వీడియో మాట్లాడుతూ..' ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఎంత కావాలో చెప్పు అంటూ.. సింగర్ చిన్మయిపై వల్గర్ కామెంట్
ప్రముఖ గాయనిగా చిన్మయి శ్రీపాదకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా సమంతకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ఆమె మల్టీటాలెంటెడ్‌గా చిత్ర పరిశ్రమలో రానించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. ఎదుటివారు ఎంతిటివారైనా సరే తను ఓపెన్‌గానే విరుచుకుపడుతుంది. దీంతో ఆమెపై ఒక వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. (ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు ) తాజాగా అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో ఆమెకు ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు ఒక నెటిజన్ ఇలా మెసేజ్ చేశాడు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. సాటి అమ్మాయిల కోసం నిలబడే తీరు నాకు ఎంతో నచ్చింది. ఇలాగే మీరు ఎప్పుడూ ఉండాలి. మా సోదరికి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంది.' అని మెసేజ్ చేశాడు. కానీ చిన్మయి తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో దాగున్న అసలు స్వరూపం బయటకు వచ్చింది. మళ్లీ ఇలా మెసేజ్ చేశాడు. 'నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా.?' అంటూ మరో అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. అంతటితో ఆగక 'నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.' అని వరుసబెట్టి మెసేజ్‌లు పంపాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు) దీనిపై చిన్మయి ఫైర్ అయింది. ఈ చెత్త ఎదవను చూడండి మొదట పద్దతిగా మెసేజ్‌లు చేశాడు.. నేను తిరిగి రిప్లై ఇవ్వకపోవడంతో వాడి ఈగో దెబ్బతిన్నట్లు ఉంది. దీంతో వాడి అసలు రూపం బయటకొచ్చింది. ఇలాంటి వాడ్ని ఏం చేయాలి.. ముందు వాడి నాన్నను అనాలి. ఇంత చెత్తగా పిల్లలను ఎలా పెంచాడు. ఇలాంటి ఎదవలు సమాజంలో చాలామందే ఉన్నారు. అమ్మాయిలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చిన్మయి తెలిపింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్‌గా మాత్రమే డిబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణించారు. అయితే మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎలాంటి విషయాన్నైనా ముక్కుసాటిగా మాట్లాడే చిన్మయి.. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కొందరు యువకులు చేసిన ఇన్‌స్టా వీడియోపై ఆమె స్పందించారు. భారతీయ స్త్రీల వస్త్రధారణపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. బ్లౌజ్‌లు వేసుకోవడం మన దేశ సంస్కృతి కాదంటూ చిన్మయి తెలిపారు. (ఇది చదవండి: ఎస్పీ బాలు చనిపోయినప్పుడు రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లాను: సింగర్) కొందరు మహిళలు కనీసం చున్నీలు కూడా వేసుకోవడం లేదని ఓ యువకుడు ఇన్‌స్టాలో వీడియో షేర్ చేశాడు. దీనికి తనదైన శైలిలో సమాధానమిచ్చారు చిన్మయి. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ సంస్క్రృతి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. చిన్మయి మాట్లాడుతూ..'రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే బ్లౌజ్ కల్చర్‌ను తీసుకొచ్చారు. అప్పటివరకు మనదేశంలో అసలు జాకెట్లు వేసుకునేవారు కాదు. మహిళలను చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోండి. జాకెట్ లేకుండా ఉండటం చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారని.. అలా చూడడం వల్ల వారికి కలిగే లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు బ్లౌజ్ వేసుకునేవారు కాదు. బ్లౌజ్ అనేది బ్రిటిష్ కల్చర్. ముందు మన కల్చర్ ఏంటో తెలుసుకోండి.' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చారు. (ఇది చదవండి: PS 2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
కష్టకాలంలో సమంత నాకు అండగా నిలిచింది : సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి ఎక్కువగా సమంత నటించిన సినిమాలకు డబ్బింగ్ చెప్పడం ద్వారా పాపులర్ అయ్యింది. తొలి సినిమా ఏ మాయ చేశావే నుంచి సమంతకు-చిన్మయికి మంచి అనుబంధం ఉంది. కష్టకాలంలో ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుచున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత నాకు అండగా నిలబడింది. ధైర్యాన్నిచ్చింది. మీటూ సమయంలో నేను పని కోల్పోయాను. ఆ సమయంలో సామ్ నాకు పని కల్పించింది. నాకు అన్నిరకాలుగా మద్దతు పలికింది అని పేర్కొంది. కాగా మీటూ ఉద్యమ సమయంలో తమిళనాడు సీనియర్ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదంలో కోలీవుడ్ ఇండస్ట్రీ చిన్మయిపై బ్యాన్ విధించింది. మరోవైపు సమంత తన భర్త నాగచైతన్యతో విడిపోయినప్పుడు చిన్మయి ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది. విడాకులకు సమంతను టార్గెట్ చేసినప్పుడు చిన్మయి సోషల్ మీడియా వేదికగా సమంతకు మద్దతు పలికింది. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ బారిన పడిన సమయంలో కూడా చిన్మయి, ఆమె భర్త రాహుల్ సమంతకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ఆమెకు అండగా నిలిచారు. -
బెల్ట్‌తో కొట్టుకుంటూ కొడుకును బెదిరించిన శ్రీహాన్, చిన్మయి ఫైర్
ఎక్కడ ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతుంటుంది సింగర్ చిన్మయి శ్రీపాద. ఎవరైనా తప్పు చేశారని అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అది తప్పని సోషల్ మీడియాలో నొక్కి చెప్తుంది. అలా ఎలా చేస్తారని చెడుగుడు ఆడేస్తుంది. తాజాగా బిగ్‌బాస్ రన్నరప్ శ్రీహాన్ అప్లోడ్ చేసిన వీడియోపై మండిపడింది చిన్మయి. ఇంతకీ అందులో ఏముందంటే.. మాట వినని చైతూను దారిలో పెట్టాలనుకున్న శ్రీహాన్ తనను తాను కొట్టుకుంటున్నట్లుగా నటించాడు. 'ఎన్నిసార్లు చెప్పాలి.. నా మాట వింటావా? లేదా?' అని బెల్ట్‌తో కొట్టుకున్నట్లు నటించాడు. దీంతో చైతూ 'వింటా డాడీ, కొట్టుకోవద్దు.. సారీ' అంటూ ఏడుస్తుండగా దీన్నంతటినీ వీడియో తీస్తున్న సిరి మాత్రం పకపకా నవ్వేసింది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. 'మనకు మనం హాని చేసుకోవడం వల్ల పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలామంది పేరెంట్స్ పిల్లలు చెప్పినట్లు నడుచుకోకపోతే కొట్టుకోవడమో లేదంటే చచ్చిపోతామనో బెదిరిస్తారు. మరీ ముఖ్యంగా చూసిన సంబంధాన్ని ఓకే చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. ఈ ధోరణికి ఈ జనరేషన్‌లోనైనా ఫుల్స్టాప్ పెట్టాలి' అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన శ్రీహాన్ ఫ్యాన్స్ వాళ్లేదో సరదాగా చేశారు, దానికింత సీరియస్‌గా తీసుకుంటున్నారేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. పిల్లల ముందు స్వీయహాని చేసుకోవడం ముమ్మాటికీ తప్పే.. పిల్లల్ని అలాగేనా పెంచేది? అని ఫైర్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: ఆ హీరో తుపాకి కాల్చడం నేర్పించాడు బాలయ్య, చిరుల సంక్రాంతి ఫైట్.. ఇది మొదటిసారి కాదు, 11వసారి -
భర్తతో బయటికొచ్చిన నయన్‌పై ట్రోల్స్.. చిన్మయి ఫైర్
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోన్న నయనతార సినిమా ప్రమోషన్స్‌కు రావడం చాలా అరుదు. కానీ ఈసారి మాత్రం తను నటించిన కనెక్ట్ సినిమా కోసం ఇంటర్వ్యూ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఇటీవలే కనెక్ట్ ప్రీమియర్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. దీనిపై పలువురు నెటిజన్లు అసభ్య కామెంట్లు చేశారు. పెళ్లై పిల్లలున్నా కూడా ఇంకా అలాగే ఉందేంటని ప్రశ్నించారు. తన బాడీ షేప్ గురించి కూడా నోటికొచ్చిందని వాగారు. ఈ అనుచిత కామెంట్లపై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇలాంటి పురుషులు ఇంట్లో ఉంటే మహిళలు వారి కన్నబిడ్డలకు కూడా చున్నీ వేసే తిప్పాలేమో.. ఎందుకంటే పురుషుడు అతడి ఫీలింగ్స్ ఆపుకోలేడు కదా.. తండ్రైనా, సోదరుడైనా ఇంట్లో ఆడపిల్లను కూడా అలాంటి దుర్బుద్ధితోనే చూస్తాడేమో' అని ఆగ్రహించింది. మహిళలందరూ తమ ఆడపిల్లలను ఇలాంటి పురుషులకు దూరంగా ఉంచాలని, వాళ్ల వల్ల ఎటువంటి సంరక్షణ ఉండదని మండిపడింది. చదవండి: గర్భవతయ్యాక సడన్‌గా పెళ్లి? నటి ఏమందంటే? గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నటుడు -
హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. అలా తరచూ వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా ఓ నటుడిపై ఫైర్ అయ్యింది. పబ్లిక్‌లో ఓ హీరోయిన్ను పాయింట్ అవుట్ చేస్తూ చేసిన అతడి వ్యాఖ్యలను తప్పుబట్టింది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, నటి దర్శగుప్తా లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ఓ మై ఘోస్ట్. ఇందులో తమిళ నటుడు సతీష్ ఓ కీ రోల్ పోషించాడు. చదవండి: రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణం ఇదే! ఆ ఒక్క మాటకే విమర్శల దాడి ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సన్నీలియోన్ సాంప్రదాయంగా చీరకట్టులో రాగా దర్శగుప్తా మోడ్రన్ లెహెంగాలో వచ్చింది. ఇదే అంశంపై ఈవెంట్లో నటుడు సతీశ్ మాట్లాడుతూ నటి దర్శగుప్తాను ఉద్దేశిస్తూ పబ్లిక్‌గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ... ‘ఎక్కబో ముంబై నుంచి తమిళనాడుకు వచ్చిన సన్నీలియోన్ పద్ధతిగా చీరకట్టుకుని వచ్చారు. చూడటానికి ఆమె చాలా అందంగా ఉన్నారు. కానీ అటూ చూడండి మన దగ్గరి అమ్మాయి మాత్రం మోడ్రన్ డ్రెస్ వేసుకుని వచ్చింది’ అంటూ దర్శగుప్తాను చూపిస్తూ అన్నాడు. చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా? అంతేకాదు తానేమి ఆమెను విమర్శించడం లేదని, జస్ట్ పాయింట్ అవుట్ చేశానంతేనని అనడంతో అక్కడి వచ్చిన వారంత పగలపడి నవ్వారు. ఇక అతడి వ్యాఖ్యలపై చిన్మయి స్పందించింది. మహిళల డ్రస్సింగ్‌పై బహిరంగంగా కామెంట్స్ చేయడాన్ని ఆమె తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ ఆమె ఘాటుగా స్పందించింది. ‘ఒక స్త్రీని లక్ష్యంగా చేసుకుని, ఆమె వేసుకున్న డ్రెస్‌పై విమర్శలు చేయడమేంటి? ఆ మాటలకు జనాలు పగలబడి నవ్వడం ఏంటి? మహిళల డ్రస్‌పై విమర్శలు చేసే ఇలాంటి మగాళ్ల ప్రవర్తన ఇంకెప్పుడు మారుతుందో? ఇదేం అంత సరద విషయం కాదు’ అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాత్రమే నటుడు కామెంట్స్‌పై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. అలా బహిరంగంగా ఓ నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. I mean - To actually *point* at a woman and ask for mass heckling of a crowd by a man on a woman who doesn’t dress according to culture. When will this behaviour from men stop? Its not funny. pic.twitter.com/HIoC0LM8cM — Chinmayi Sripaada (@Chinmayi) November 9, 2022 -
సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి
స్టార్ హీరోయిన్ సమంత, గాయనీ చిన్మయి శ్రీపాదలు ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య వారు కలుసుకోవడం లేదని, వారి మధ్య సఖ్యత చెడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చిన్మయి దీనిపై నోరు విప్పారు. తనకు సమంత మంచి స్నేహితులమని, తామిద్దరం కలిసింది లేనిది అందరికి తెలియాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా ‘ఏం మాయ చేశావే’ చిత్రం నుంచి సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సమంత తన నటన, అందం, అభియనంతో ప్రేక్షకుల ఎంతగా మెప్పించిందో అంతే స్థాయిలో తన వాయిస్‌కి కూడా గుర్తింపు వచ్చింది. చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా నష్టపోయిన మేకర్స్ అప్పటి వరకు ప్లేబ్యాక్ సింగర్‌గా ఉన్న చిన్మయి సమంత డబ్బింగ్ చెప్పడంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇక సమంత కారణంగా తెలుగులో చిన్మయికి మంచి గుర్తింపు వచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇదే విషయాన్ని ఆమె ఇంటర్య్వూలో కూడా చెప్పారు. ఈ సందర్భంగా చిన్మయి మాట్లాడుతూ.. ‘సమంత చాలా మంచి వ్యక్తి. ఆమె వల్లే నాకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మించి కెరీర్ వచ్చింది. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆమెతో నా ప్రయాణంగా ముగిసిందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు సమంత తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక ఆమెకు నేను డబ్బింగ్ చెప్పే అవకాశం రాదేమో’ అని చెప్పకొచ్చారు. చదవండి: లైగర్ ఫ్లాప్.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఇక వారిద్దరి మధ్య విబేధాలు వచ్చాయన్న వార్తలపై ప్రశ్నించగా.. అందులో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ‘మేమిద్దరం కలిసినప్పుడల్లా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టకపోయినంత మాత్రాన మేం విడిపోయినట్లు కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. తరచూ మేమిద్దరం కలుసుకుంటాం.. కలిసి పార్టీలు, డిన్నర్లకు వెళుతుంటామని చెప్పడం వల్ల ఎవరికి లాభం. అందుకే మేం కలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పం. మేమిద్దరం కలవాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం’ అని ఆమె వివరించారు. -
'గర్భం దాల్చిన మూడ్నెళ్లకే అబార్షన్'...సింగర్ చిన్మయి ఎమోషనల్
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పిల్లల పేర్లు కూడా రివీల్ చేశారు. 2014లో నటుడు రాహుల్‌ని పెళ్లాడిన చిన్మయి ఇటీవలె ట్విన్స్‌కు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అయితే తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ స్టోరీని నెటిజన్లతో పంచుకుంది. తన స్వంత యూట్యూబ్ ఛానల్లో ఈ మేరకు వీడియోను షేర్ చేసింది. 'నేను, రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. 2020లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో అంతా అయోమయ పరిస్థితి. ప్రపంచమంతా తలకిందులయ్యింది. మా డాక్టర్ కూడా బయట ఏం జరుగుతుంతో తెలియదు.. ఇంతకాలం వెయిట్ చేశారు కదా ఇంకాస్త సమయం ఓపిక పట్టండి అని చెప్పింది. సెకండ్ వేవ్ అయిపోయాక నేను గర్బవతిని అయ్యాను. కానీ మూడు నెలలకే గర్భస్రావం(అబార్షన్)అయ్యింది. దీంతో చాలా బాధపడ్డాను. మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ తర్వాత కొన్నిరోజులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ నాకు పరిచయం అయ్యింది. తన సలహాతో నా డైట్, ఎక్సర్సైజ్ అన్నీ పాటించాను. అవి దాదాపు మన ఇండియన్ ఆయుర్వేదిక్ పద్దతులే. ఇక కొంతకాలానికి నేను మళ్లీ గర్భం దాల్చాను. కవలలకు జన్మనిచ్చాను. 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను' అంటూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. -
ఒక్క హిట్‌తో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు: నిఖిల్
Aakashame Nuvvani Song Out From Diamond Raja: ‘‘చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు అనేవి సాధారణమే. ఒక్క హిట్టుతో మళ్లీ కమ్ బ్యాక్ కావొచ్చు. ‘డైమండ్ రాజా’ చిత్రంతో వరుణ్ సందేశ్ కూడా ఇండస్ట్రీని రాక్ చేయాలి. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అని యంగ్ హీరో నిఖిల్ పేర్కొన్నారు. వరుణ్ సందేశ్, డాలీషా జంటగా శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డైమండ్ రాజా’. శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై తమటం కుమార్ రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘డైమండ్ రాజా’. అచ్చు రాజమణి స్వరాలు అందించిన ఈ చిత్రం నుంచి ‘ఆకాశమే నువ్వని..’ అంటూ సాగే పాటని నిఖిల్ విడుదల చేశారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో అరెరే, నిజంగా, ఏమంటావే..’ వంటి పాటల తర్వాత ఈ చిత్రంలోని ‘ఆకాశమే నువ్వని..’ పాట కూడా అంతే హిట్ అవుతుందని నమ్ముతున్నాను. వినోదాత్మకంగా ఉండే ‘డైమండ్ రాజా’ ని ఫ్యామిలీ అంతా కలసి చూడొచ్చు’’ అని తెలిపారు. ‘‘మా సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. ‘‘ప్రేక్షకులకు మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది’’ అని హీరోయిన్ డాలీషా ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: పి. రాజశేఖర్ రెడ్డి, టి. రమేష్, కెమెరా: వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, పవన్ రెడ్డి కోటిరెడ్డి. -
కవలలకు జన్మనిచ్చిన మరుసటి రోజే చిన్మయికి చేదు అనుభవం!
కవలకు జన్మినిచ్చిన మరుసటి రోజే సింగర్ చిన్మయికి ఇన్స్టాగ్రామ్ షాకిచ్చింది. ఇన్స్టాగ్రామ్ పాలసీలకు విరుద్ధంగా తన పోస్టులు ఉన్నాయనే రిపోర్డ్స్ అందడంతో ఇన్స్టాగ్రామ్ తన అకౌంట్‌ను రద్దు చేసింది. ఈ విషయాన్ని చిన్మయి స్వయంగా వెల్లడించింది. కాగా బుధవారం(జూన్ 22) చిన్మయి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ క్రమంలో చాలామంది ఆమెకు శుభకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె ప్రెగ్రెన్సీపై ఆసభ్యకర మెసెజ్‌లు, కామెంట్స్‌తో ట్రోల్ చేశారు. చదవండి: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి ఈ క్రమంలో కొందరు ఆమెకు ఆసభ్యకరమైన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఇదే విషయమై ఇన్స్టాగ్రామ్ ఆమె అకౌంట్‌ను రద్దు చేసినట్లు చిన్మయి చెప్పింది. తన బ్యాకప్ అకౌంట్(కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్), ట్విటర్ ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలిపింది. ఈ మేరకు చిన్మయి పోస్ట్ షేర్ చేస్తూ.. ‘నా ఇన్‌స్టా అకౌంట్‌ను డిలిట్ చేశారు. ‘నా అకౌంట్లో న్యూడ్ ఫొటో పోస్ట్ చేసి.. పైగా నాపై రిపోర్ట్ చేశారు. దీంతో ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్‌ను రద్దు చేసింది. అయితే ఇంతకు ముందే తరచూ అబ్బాయిలు నాకు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌కు కంప్లయింట్ చేశాను. చదవండి: అన్‌స్టాపబుల్: రెండో సీజన్ తొలి గెస్ట్ ఆ స్టార్ హీరోనట! కానీ దీనిపై చాలామంది రిపోర్ట్ చేయడంతో తన అకౌంట్‌ను తిసేశారఇది నా కొత్త అకౌంట్.. చిన్మయి.శ్రీపాద(chinmayi.sripada)’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా తన ఇన్స్టాగ్రాం వేదికగా చిన్మయి సమాజంలో అమ్మాయిలు, మహిళలకు ఎదురవుతున్న పలు సమస్యల మీద గళం వినిపించేది. ఎదురుదెబ్బలతో ధైర్యం కొల్పోయిన మహిళలకు ధైర్యం నింపేది. యువతుల సమస్యలకు పరిష్కారం ఇచ్చేది. ఈ నేపథ్యంలో తనను చాలా మంది ట్రోల్ చేస్తున్నారని చిన్మయి కొంత కాలంగా చెబుతూ వస్తుంది. కానీ ఆమె అకౌంట్‌ను ఇలా రద్దు చేయడంతో చిన్మయి ఫాలోవర్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. Instagram has basically removed MY account for reporting men who send ME their penises on DMs. Its been going on for a while where I report but MY access was barred. Anyway that’s that. My backup account is chinmayi.sripada 🤦🏽♀️ — Chinmayi Sripaada (@Chinmayi) June 23, 2022 View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayi.sripada) -
ఎలా కన్నావు? అంటున్నారు.. నా ఆన్సరేంటంటే: చిన్మయి
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. మా ఇంట్లోకి ద్రిపత్, శ్రావస్ అడుగుపెట్టారంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది సింగర్. ఇందులో ఆమె ఏం రాసుకొచ్చిందంటే.. చాలామంది నేను సరోగసి ద్వారా కవలలను కన్నానా? అని అడుగుతున్నారు. విషయమేంటంటే.. నేను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి నా ఫొటోలను ఏ ఒక్కటి కూడా బయటకు రానివ్వలేదు. చాలాకొద్ది మందికే ఈ విషయం తెలుసు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఇలా చేశాను. నా వ్యక్తిగత విషయాలను నేను ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. పిల్లల ఫొటోలు కూడా కొంతకాలం వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. ఇంకో విషయం చెప్పనా.. నాకు సిజేరియన్ చేసేటప్పుడు నేను భజన పాట పాడాను అని చెప్పుకొచ్చింది. కాగా, రాహుల్, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అటు రాహుల్ వెండితెరపై నటుడిగా అలరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayi.sripada) చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు, రజనీకాంత్ ట్వీట్ -
పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
ప్రమఖ సింగర్ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరి పిల్లల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు తెలియజేశారు. చిన్మయి, రాహుల్ తల్లిదండ్రులు కావడంపై నెటిజన్స్, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, రాహుల్, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. ఇక రాహుల్ విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్ సింగరాయ్’లో రాహుల్ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. దర్శకత్వం దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ‘చి..ల..సౌ’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించి, తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు. Driptah and Sharvas The new and forever center of our Universe. ❤️ @rahulr_23 pic.twitter.com/XIJIAiAdqx — Chinmayi Sripaada (@Chinmayi) June 21, 2022 -
చిన్మయి ఆసక్తికర ట్వీట్.. సమాజం రేపిస్టులను ప్రేమిస్తుందని
Singer Chinmayi Society Loves Only Rapist Tweet Viral: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది కూడా. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. సోషల్ మీడియా ద్వారా తమ బాధలను చెప్పుకునే అమ్మాయిలకు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం చెప్తుంటుంది. ఆమెకు పలువురు అబ్బాయిలు కూడా మద్దతు పలుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. 2017లో జరిగిన ఈ ఘటనపై అనేక మంది హీరోయిన్లు, ప్రముఖలు తమ గొంతు ఎత్తి బాధిత హీరోయిన్‌కు మద్దతుగా నిలిచారు. వారిలో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువోత్ ఒకరు. ఘటన తర్వాత మహిళా సంఘాలతో కలిసి పార్వతి ఒక పోరాటం చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఆ పోరాటం వల్ల తాను ఏం కోల్పోవాల్సి వచ్చిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పార్వతి. తాను ఇదివరకు నటించిన సినిమాలు హిట్ అయినా తనకు సినిమా అవకాశాలు తగ్గాయని పేర్కొంది. నిజాన్ని మాట్లాడినందుకు తనను, పోరాటంలో ఉన్నవారిని ఎలా బెదిరించారో కూడా తెలిపింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ వార్త చూసిన చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నిజం మాట్లాడినందుకు పార్వతి వంటి ఒక మంచి నటి పని కోల్పోయింది. అలాంటి నటి, లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్ల మాత్రమే తన పని కోల్పోయిందని చెప్పడం నిజం. చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను మాత్రమే సమాజం ప్రేమిస్తుంది.' అని చిన్మయి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017 ఫిబ్రవరిలో 17న జరిగిన నటి కిడ్నాప్, అత్యాచార వేధింపుల కేసులో నటుడు దిలీప్ కుమార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అతనికి జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించింది కేరళ హైకోర్టు. Actor Parvathy Thiruvoth on paying a price for speaking up. The fact that hyper talented actors such as she lost work JUST because they stood for a survivor of sexual assault in Kerala says a LOT! So many women silenced. Rapist loving society only. 🤮https://t.co/YINgJRux0L pic.twitter.com/OZFNV4ohg1 — Chinmayi Sripaada (@Chinmayi) January 15, 2022 ఇదీ చదవండి: చిన్మయికి ఆ ఇద్దరి మద్దతు.. స్క్రీన్ షాట్స్ వైరల్ -
అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదు : చిన్మయి
ఎలాంటి విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడే డేరింగ్ పర్సనాలిటీ గాయని చిన్మయిది. లైంగిక వేధింపులపై ప్రజలను చైతన్య పరుస్తూరామె. తాజాగా టిక్‌టాక్ స్టార్ ఫన్ భార్గవ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్ టిక్‌టాక్ వీడియోల పేరుతో 14 ఏళ్ల మైనర్ బాలికను లోబర్చుకొని, భార్గవ్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు విశాఖ పీస్లోఅతడిపై కేసు నమోదైంది. భార్గవ్ ఉదంతంపై చిన్మయి స్పందిస్తూ.. ఇలాంటివి జరిగినప్పుడు కూడా.. అమ్మాయిదే తప్పు అని లేవనెత్తే సొసైటీలో మనం ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్గవ్ కేసుకు సంబంధించి ఓ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్‌ను వివరిస్తూ.. 'తల్లి అతి గారాభం చేయడం,ఎక్కడికి వెళతుందో గమనించకపోడం, అమ్మాయికి పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో టిక్ టాక్ భార్గవ్‌తో ఆమె మరింత చనువుగా ఉండటం చేసేది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఓ మైనర్ బాలిక కామాంధడి చేతిలో బలికావాల్సి వచ్చింది. దీనికి తోడు బాలిక తండ్రి దూరంగా ఉండటం వల్ల మంచి చెప్పేవారు ఎవరూ లేకుండా పోయారు' అంటూ రాసిన వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదని, దానికి అమ్మాయిని బాధ్యురాల్ని చేయడం కరెక్ట్ కాదని ఘాటుగా బదులిచ్చింది. టిక్‌టాక్, రీల్స్చేయడంతో తప్పు లేదు : చిన్మయి ఇక భార్గవ్ లాంటి మనుషులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారని, అయితే అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఈ ఉదంతం బయటకు వచ్చిందని తెలిపింది. భార్గవ్‌ను ఉద్దేశిస్తూ..భార్గవ్ స్త్రీ లోలుడు అని అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన క్లిప్పింగ్‌ను తాను కూడా చూశానని, ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వాళ్లు చాలా స్మార్ట్‌గా, కన్నింగ్‌గా అమ్మాయిని లోబర్చుకుంటారని, ఇందుకు వాళ్ల పేరెంట్స్‌తోనూ మంచిగా మాటలు కలుపుతారని తెలిపింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అమ్మాయిలకు అకౌంట్ ఉండటం, వేరే వాళ్లతో రీల్స్, టిక్‌టాక్ చేయడంలో తప్పు లేదని, అయితే మనం ఎవరితో ఫ్రెండిప్ చేస్తున్నాం అనే అంశంపై చాలా ఆచితూచి వ్యవహరించాలని, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అన్న వివరాలను తల్లిదండడ్రులకు చెప్పడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి : భార్గవ్ స్త్రీ లోలుడు, బ్లాక్మెయిల్ చేసేవాడు.. అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ -
సింగర్ చిన్మయి శ్రీపాద - మహిళా దినోత్సవం ప్రత్యేక ఇంటర్వ్యూ
-
చిరునవ్వుల వరమిస్తావా.. చితినుండి లేచొస్తా!!
సాక్షి, హైదరాబాద్: గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండెపోటుతో ఆయన చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలువురు సినీ రంగ ప్రముఖులు, నటీనటులు, గాయనీ గాయకులు వెన్నెలకంటి మృతిపై సంతాపం ప్రకటించారు. ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటలను, అజరామర సాహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. 1988లో వచ్చిన `మహర్షి` మూవీలోని మాటరాని మౌనమిది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బిగ్గెస్ట్‌హిట్ చంద్రముఖిలోని `కొంత కాలం కొంతం కాలం కాలమాగిపోవాలి’ అనే పాట కూడా అభిమానులకు ఆకట్టుకుంది. దీంతోపాటు బృందావనం చిత్రంలో "మధురమే సుధా గానం", ఓహో ఓహో పావురమా’’, ఆదిత్య 369 చిత్రంలో ‘రాసలీల వేళ ’ లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలున్నాయి. వీటితోపాటు స్వాతికిరణం, బిరియానీ, ఆవారా, ఆకాశమంతా, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాల్లోని ఆయన పాటలు విశేష ఆదరణ పొందాయి. వెన్నెలకంటి అకాలమరణంపై గాయని చిన్మయి శ్రీపాద విచారం వ్యక్తం చేశారు. ‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను అంటూ చిరునవ్వుల వరమిస్తావా మూవీ కోసం ఆయన రాసిన గీతాన్ని తలుచుకున్నారు మరో సినీ గేయ రచయిత భాస్కర భట్ల. వెన్నెలకంటికి ట్విటర్ ద్వారా అశృనివాళులర్పించారు. చిరునవ్వుల వరమిస్తావా చితి నుండీ లేచొస్తా మరుజన్మకి కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తా -వెన్నెలకంటి ❤️ వెన్నెలకంటి గారికి అశృనివాళి 💐💐💐 — bhaskarabhatla (@bhaskarabhatla) January 5, 2021 Heartbreaking that Sri Vennelakanti garu has passed on. A legendary writer that’ll be sorely missed. — Chinmayi Sripaada (@Chinmayi) January 5, 2021 -
బుట్టబొమ్మ సారీ చెప్తుందా?
టాలీవుడ్ ప్రముఖ కథానాయుకలు సమంత అక్కినేని, పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వివాదం మరింత ముదిరింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని గురువారం పూజా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల పాటు తన టెక్నికల్ టీం సాయంతో ఖాతాను తిరిగి పునరుద్దరించినట్లు తెలిపారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఖాతా హ్యాక్ అయిన సందర్భంలో పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో.. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను జత చేస్తూ ఈమె (సమంత )నాకు పెద్దగా అందంగా కనిపించదు అంటూ కామెంట్ చేశారు హ్యాకర్స్ . ఇది సమంత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. (సమంతకు సారీ చెప్పాలి ) Spent the last hour stressing about the safety of my Instagram account. Thanking my technical team for instant help at this hour. Finally, got my hands back on my Instagram 🥰 Any message, follow back or post in d past hour from my account has been done will be undone. Ty. — Pooja Hegde (@hegdepooja) May 27, 2020 అకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం పట్టించుకోలేదు. వెంటనే సమంతకు సారీ చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. దీనికి తోడు డైరెక్టర్ నందినీ రెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద..పూజా హెగ్డేను ఉద్దేశించి వ్యంగాస్ర్తాలు సందించారు. నా బ్రెయిన్ కూడా హ్యాక్ అయ్యింది అంటూ నందనీ కామెంట్ పెడితే, ప్లీజ్ లవ్ మీ టూ.. నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు అంటూ చిన్మయి వరుస కామెంట్లు పెడుతూ సమంతకు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వైరల్ చేస్తూ.. ఫెమినిస్ట్ అని చెప్పుకునే తిరిగే చిన్మయి ఇంకో అమ్మాయిపై ఎలా నిందలు వేయగలుగుతుంది అంటూ పూజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిజాలు తెలుసుకోకుండా ఇలా చీప్ కామెంట్లు పెడతారా అంటూ నందనీరెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. దీంతో వివాదం మరింత ముదిరి అటు సమంత ఫ్యాన్స్, ఇటు బుట్టబొమ్మ ఫ్యాన్స్ వరుస ఆరోపణలు చేస్తూ ట్విట్టర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. 'వి సపోర్ట్ పూజా హెగ్డే' అంటూ ఆమె అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. Without knowing the real reason,how could u guys form a group and pass sarcasm on one.Ok...now what this doesn't come under ur so called "feminism" #WeSupportPoojaHegde pic.twitter.com/J4uh7nmQBw — Harshi✨ (@hd_2207) May 28, 2020 -
క్షమాపణ కోరడం, కాళ్లు పట్టుకోవడం జరగదు: చిన్మయి
సాక్షి, చెన్నై: సీనియర్ నటుడు, దక్షిణ భారత డబ్బింగ్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు రాధారవి, గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయికి మధ్య వివాదానికి తెరపడేలా లేదు. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. గత 2018లో డబ్బింగ్ కళాకారుల యూనియన్‌కు జరిగిన ఎన్నికల్లో నటుడు రాధారవి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత ఆయనపై గాయని చిన్మయి మీటూ ఆరోపణలను గుప్పించారు. దీంతో వీరి మధ్య వివాదానికి తెర లేచింది. కాగా గాయని చిన్మయిని యూనియన్ నుంచి తొలగించారు. అందుకు ఆమె సభ్యత్వాన్ని చెల్లించలేదన్న కారణాన్ని చూపారు. దీంతో చిన్మయి కోర్టును ఆశ్రయించారు. అక్కడ తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చినా, డబ్బింగ్ కళాకారుల యూనియన్ చిన్మయిని చేర్చుకోలేదు. కాగా డబ్బింగ్ కళాకారుల యూనియన్ ప్రస్తుతం కార్యవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో శనివారం ఎన్నికలు జరిగాయి. అయితే ఇంతకు ఈ ఎన్నికల్లో మళ్లీ రాధారవి అధ్యక్ష పదవికి పోటీ చేయగా, ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి అధ్యక్షపదవికి బరిలోకి దిగారు. అయితే ఎన్నికల అధికారి చిన్మయి నామినేషన్‌ను రద్దు చేశారు. దీంతో ఆమె మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిన్మయి పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఇది అన్యాయం అంటూ చిన్మయి మరోసారి అప్పీల్ చేయడానికి సిద్ధం అయ్యారు. సోమవారం రిట్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. కాగా శనివారం డబ్బింగ్ కళాకారుల యూనియన్ ఎన్నికలు జరిగాయి. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేసిన చిన్మయి నామినేషన్‌ను రద్దుకు గురి కావడంతో నటుడు రాధారవిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో ఇతర పదవులకు శనివారం ఎన్నికలను నిర్వహించారు. దీంతో ఆ ఎన్నికలను అడ్డుకునే విధంగా గాయని చిన్మయి పోలింగ్ జరుగుతున్న ప్రాంతానికి రానుందనే ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా నటుడు రాధారవి మీడియాతో మాట్లాడుతూ గాయని చిన్మయి క్షమాపణ చెబితే ఆమెను తిరిగి యూనియన్‌లోకి చేర్చుకుంటామని అన్నారు. దీనికి స్పందించిన గాయని చిన్మయి క్షమాపణ కోరడం గానీ,నటుడు రాధారవి ఇంటికి వచ్చి కాళ్లు పట్టుకోవడం గానీ జరగదన్నారు. తాను చట్ట పరంగానే ఎదుర్కొంటానని ఆమె పేర్కొన్నారు. -
మరోసారి వివాదంలో చిన్మయి!
గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వివాదంలో నిలిచారు. అయితే ఈ సారి తన వ్యాఖ్యలకు బదులుగా తన తల్లి మాట్లాడిన తీరుకు వార్తల్లో కెక్కారు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న చిన్మయి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవదాసీ వ్యవస్థను కూల్చివేసిన హేతువాది పెరియర్‌ను తాను ఎప్పటికీ క్షమించనని పేర్కొన్నారు. దీంతో చిన్మయి తల్లి తీరుపై ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్ అకౌంట్‌కు జోడించి దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందించిన చిన్మయి.. తన తల్లి మాటలకు బాధ్యత వహించనని తెలిపారు. ‘ఆమె మాటలను మీరు వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. ఆమెకు మాట్లాడే హక్కు ఉంది. తన ఉద్దేశాలను నేను తప్పుపట్టాను. సమాధానం చెప్పే సామర్థ్యం తనకు ఉంది’ అంటూ ఘూటుగా స్పందించారు. కాగా చిన్మయి విమర్శల్లో నిలవడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె పోరాటం చేశారు. ఇక కోలీవుడ్ ప్రముఖ రచయిత వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కోలీవుడ్ డబ్బింగ్ అసోషియేషన్ ఆమెపై వేటు కూడా వేసింది. I am not responsible for my mother’s actions. If you disagree with her disagree with her, please do. She is capable of speaking for herself. I dont defend her views or support. https://t.co/lAYBMzkLaC — Chinmayi Sripaada (@Chinmayi) December 30, 2019