సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన కామెంట్స్‌పై వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే చిన్మయి వ్యాఖ్యలపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న అన్నపూర్ణమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? అంటూ మాట్లాడింది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయి శ్రీపాద.. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్‌కు రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.
అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ..
చిన్మయి వీడియో మాట్లాడుతూ..' ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment