annapoorna
-
అన్నపూర్ణమ్మకు కౌంటర్.. సింగర్ చిన్మయికి షాక్..!
సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన కామెంట్స్‌పై వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే చిన్మయి వ్యాఖ్యలపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న అన్నపూర్ణమ్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? అంటూ మాట్లాడింది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయి శ్రీపాద.. అన్నపూర్ణమ్మ చేసిన కామెంట్స్‌కు రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ.. చిన్మయి వీడియో మాట్లాడుతూ..' ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
సురేశ్ కొండేటికి నానమ్మగా అన్నపూర్ణమ్మ!
తెలుగు సినిమాల్లో అమ్మ, అమ్మమ్మ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అన్నపూర్ణమ్మ. సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు ఈమె అమ్మగా నటించి మెప్పించింది. తమిళ సినిమాల్లోనూ అన్నపూర్ణమ్మకు ఎక్కువ అవకాశాలు వచ్చినా సరే తెలుగు సినిమాలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. ఇప్పటికీ ఏదో ఒక మూవీలో కనిపిస్తూనే ఉంటుంది. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) దాదాపు 80 సినిమాల్లో ఆమె అమ్మ పాత్రలు చేసింది. ఇప్పుడు ఈమె.. నటుడిగా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో నటిస్తోంది. సురేష్ కొండేటి ప్రస్తుతం 'అభిమాని' అనే వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులోనే వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారు. బషీర్ అమ్మ ప్రొడక్షన్స్‌లో వస్తున్న అభిమాని వెబ్ మూవీకి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) -
అన్నపూరణి
అన్నపూరణి (తెలుగులో అన్నపూర్ణ)గా మారారు నయనతార. ఆమె కెరీర్లో రూపొందుతున్న 75వ చిత్రానికి ‘అన్నపూరణి’ టైటిల్‌ను ఖరారు చేసి, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతి అన్నపూరణి పాత్రలో నటిస్తున్నారు నయనతార. అన్నపూరణి పుస్తకం చదువుతూ, ఆ పుస్తకం పేజీల మధ్యలో నాన్ వెజ్ వంటకాల రెసిపీలను చూస్తుండటం, ఆమె అభిరుచులు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం వంటి అంశాలు టీజర్లో కనిపిస్తాయి. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలు పోషించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన జంటగా, సీనియర్ నటి జమున ముఖ్య పాత్రలో నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇటీవల విడుదలైంది. థియేటర్స్ ప్రారంభించగానే ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అన్నపూర్ణ మాట్లాడుతూ– ‘‘45 ఏళ్ల కెరీర్లో ఎన్నో చక్కటి పాత్రలు పోషించాను. అయితే నా పేరుతో కూడిన టైటిల్ పాత్రను ఇంతవరకు చేయలేదు. ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ నా కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘సీనియర్ నటీనటులతో కలసి నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘హృదయాలను కదిలించే సన్నివేశాలతో పాటు భావోద్వేగాలున్న పాత్ర నాది’’ అన్నారు అర్చన. ‘‘అమెరికాతో పాటు ఓవర్సీస్లో విడుదలైన మా సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివనాగు. ‘‘మా చిత్రం దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎం.ఎన్.ఆర్.చౌదరి. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, నిర్మాత ఆచంట గోపీనాథ్, దర్శకుడు వి. సముద్ర, విలన్ పాత్రధారి శ్రీహర్ష, అమెజాన్ ప్రతినిధి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మరో సీనియర్ నటి జమున ప్రధాన పాత్రలో నటించగా బాలాదిత్య, అర్చన జంటగా నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం (అక్టోబర్ 25న) ఓవర్సీస్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ చిన్న సినిమా ఒకేసారి ఓవర్సీస్లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి. అమేజాన్ ప్రైమ్‌లో విడుదలవుతున్న మా సినిమాని ఇండియాలో మాత్రం థియేటర్లు ప్రారంభించాక విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి అభిరుచిగల దర్శకుడు శివనాగు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. పాటలు చాలా బావున్నాయి’’ అని అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్. -
అమ్మగా ఉండటమే ఇష్టం!
అరసవల్లి: ‘అందరికీ అమ్మ పాత్రలు రావు. అలా వచ్చిన అవకాశాలను ఇష్టంగా స్వీకరించి పాత్రలో లీనమైతేనే.. ఆ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది..’ అని ప్రముఖ సీనియర్ నటి, అలనాటి తార అన్నపూర్ణ అన్నారు. శనివారం ఆమె అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆదిత్యుని ఆశీర్వచనాన్ని ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: ఇంటస్ట్రీలో తొలి అడుగులు.. అన్నపూర్ణ: మాది విజయవాడ. మురళీమోహన్ వంటి నటులతో అప్పట్లో పలు నాటకాల్లో నటించాను. సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. నా అసలు పేరు ఉమ..అయితే అన్నపూర్ణగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నన్ను స్వర్గం–నరకం సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు. సాక్షి: తెలుగు సినీ రంగానికి ‘అమ్మ’ గుర్తింపుపై మీ స్పందన ? అన్నపూర్ణ: నిజంగా ఒక పాత్రలో అంతటి గుర్తింపు రావడం అదృష్టమే. అదేదో ఓవర్ నైట్‌లో సాధించేది కాదు. ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించడంతో వచ్చిన అనుభవమే. నటి నిర్మలమ్మ తర్వాత నన్ను అంతటి స్థానంలో ప్రేక్షకులు గుర్తించారంటే అదే పెద్ద అవార్డులా భావిస్తాను. సాక్షి: ముందు హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేశారా? అన్నపూర్ణ: నిజమే..తొలిసారిగా 1975లో స్వర్గం–నరకం సినిమాలో మోహన్‌బాబుతో హీరోయిన్గా చేశాను. ఆ తర్వాత భార్య పాత్రలు తర్వాత ఏకంగా అమ్మ పాత్రలు చేయాల్సి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లో ఎక్కువగా అవకాశాలొచ్చాయి. ఏ పాత్ర వచ్చినా ఇష ్టం గా నటించి 400 దాటి సినిమాల్లో కన్పి ంచాను. అందులో అమ్మ పాత్రలు మంచి గుర్తింపు తెచ్చాయి. అమ్మతనం అందరికీ రాదు గదా..! సాక్షి: మీ ఇంట్లో ఇటీవల జరిగిన ఘటన గురించి.? అన్నపూర్ణ: నిజంగా దురదృష్టకరం. జూలైలో మా అమ్మాయి కీర్తి అనారోగ్య కారణంతో ఆత్మహత్య చేసుకుంది. ఇది నాకు తీరని లోటు. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను. ‘అమ్మ’ అనే పిలుపు నా ఇంట్లో నుంచి దూరమయ్యింది. సాక్షి: ప్రస్తుతం సిని ఇండస్ట్రీ ఎలా ఉంది..? అన్నపూర్ణ: సిని ఇండస్ట్రీ అంటే ఎప్పటికీ మాయాలోకమే. ఇక్కడ అన్ని పాత్రల్లోనూ ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. ఆర్టిస్ట్‌గా మనకు కోపమొచ్చినా మనమే పోతాం. అవకాశాలిచ్చిన పెద్దలకు కోపమొచ్చినా మనమే పోవాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా తెలుసుకోవడానికి సమయం పడుతుంది. అంతేగానీ ముందుగా తెలుసుకునేందుకు తొందరపడితే మనకే నష్టం. సాక్షి: శ్రీకాకుళం సందర్శనకు ఏమైనా ప్రత్యేకత ఉందా..? అన్నపూర్ణ: శ్రీకాకుళంతో నాకు అనుబంధముంది. ఇక్కడ చిన్నపాటి ఆస్తులు కూడా ఉన్నాయి. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వచ్చాను. ఇంకా చెప్పాలంటే నాకిష్టమైన విలక్షణ నటుడు రావు గోపాలరావు అరసవల్లి వస్తుండేవారు. ఆయన నన్ను ‘ అన్నమ్మా..’ అని పిలిచేవారు. ఇప్పుడు ఆయన తనయుడు రావు రమేష్ తన నటనతో తండ్రిని గుర్తుచేస్తున్నాడు. సాక్షి: మీలో ఏదో అంచనా శక్తి ఉందనే ప్రచారం ఉండేది..? అన్నపూర్ణ: నిజమే..నేను సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరినైనా బాగా పరిశీలించి, వారు ఎంతకాలం ఇండస్ట్రీని ఏలుతారో ఇట్టే అంచనా వేయగలను. అప్పట్లో రాజబాబు, రంగనాథ్, మోహన్‌బాబు, మురళీ మోహన్ తదితరుల నటన, మేకప్ గెటప్‌లను చూసి ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారని చెప్పాను. అది నిజమైంది కూడా.. సాక్షి: ఈ తరానికి మీరిచ్చే సందేశం..? అన్నపూర్ణ: సందేశాలిచ్చినా వినే వాళ్లున్నారా...(నవ్వుతూ..) ఏదేమైనా సినిమాలో నటించడం ఓ ప్రైవేటు జాబ్ లాంటిది. దీనికి పెన్షన్ ఉండదు. కానీ బాగా నటించి పనిచేస్తే చరిత్రలో నిలిచిపోయేంత స్థానం దొరుకుతుంది. నేటి తరం గ్లామర్‌కే పెద్ద పీట వేస్తున్నారు. కొందరు మాత్రమే అద్భుతంగా రాణిస్తున్నారు. ఎవ్వరైనా ఈరంగంలో క్రమశిక్షణగా ఉంటేనా విజయం సాధిస్తారు. -
సీనియర్ నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య
-
నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ దత్తత కూతురు కీర్తి (22) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని దివ్యశక్తి అపార్ట్మెంట్స్ గోదావరి బ్లాక్‌లో అన్నపూర్ణ ఒక ఫ్లాట్‌లో ఉంటుండగా ఆమె కూతురు ఇంకో ఫ్లాట్‌లో భర్త వెంకటసాయి కృష్ణతో కలసి ఉంటోంది. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉండగా ఆ చిన్నారికి ఇంకా మాటలు రావడం లేదు. కూతురు విషయంలో కీర్తి తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యేది. కొంతకాలంగా పూర్తిగా డిప్రెష న్లోకి వెళ్లింది. గదిలో ఒంటరిగా గడుపుతూ ఏడుస్తూ ఉండేది. వెంకటసాయి శనివారం ఉదయం లేచి చూసే సరికి కీర్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆందోళనకు గురై చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి, కీర్తిని ఆస్పత్రికి తరలిం చారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్ర మానసిక వేదన తోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని అన్నపూర్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరుమున్నీరవుతున్న అన్నపూర్ణమ్మ.. అన్నపూర్ణమ్మకు కీర్తి ఒక్కతే కూతురు. మూడున్నరేళ్ల క్రితం కూతురి పెళ్లి చేసి తాను ఉంటున్న అపార్ట్మెం ట్లోనే మరో ఫ్లాట్‌లో ఉంచింది. ఒక్కగానొక్క కూతురు విగత జీవిగా మారడంతో అన్నపూర్ణ కన్నీరుమున్నీరవు తున్నారు. ఒక్క రోజు కూడా కూతురిని చూడకుండా ఉండలేని అన్నపూర్ణమ్మ కీర్తి లేకపోవడాన్ని తట్టుకోవడం కష్టమేనని చుటు ్టపక్కల వారు తెలిపారు. -
నేర నియంత్రణకు సీసీ కెమెరాలు తప్పనిసరి
అనంతగిరి : నేర నియంత్రణకు ప్రతీ పీఎస్ పరిధిలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో.. మంగళవారం తన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పీఎస్‌ల పరిధిలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న యూఐ కేసులను, పీటీ, ఎన్బీడ్లు, కంపౌండింగ్ ఈ– పెట్టీ కేసులు, క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌పై ఆరా తీశారు. వీటికి సంబంధించిన అంశాలను అడిగి నమోదు చేసుకున్నారు. ఆన్లైన్లో కేసులను సమీక్షించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, ఎంసీ రిపోర్ట్స్, ఎంవీఐకి సంబంధించి లాంగ్ పెండింగ్ కేసులకు గానూ.. సబ్ డివిజన్ల వారీగా యూఐ మేళాలు నిర్వహించి పరిష్కరించాలని డీఎస్పీలను ఆదేశించారు. మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 522 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 365 రోజుల పాటు ఇవి పని చేసేలా పర్యవేక్షించాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు రివార్డులు అందజేశారు. డీపీఓ నిర్వహణలో ఏఎస్పీ నర్సింలు, 5ఎస్‌లో వికారాబాద్ డీఎస్పీ శిరీషకు, ఈ పెట్టీ కేసుల్లో తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు ఆయా పీఎస్‌ల పరిధిలో ప్రతిభ కనబర్చిన సీఐలుకు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నర్సింలు, డీఎస్పీలు, సీఐలు, తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణ జిల్లాలోని రైతులకు ఆదరణ ఏదీ?
–అందని హెలెన్ నష్టపరిహారం –అడ్రస్సులేని వడ్డీ రాయితీ ఆకివీడు: వ్యవసాయం దండగ అనే రీతిలోనే ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. రైతులను ముప్పేటా ఇబ్బందులకు గురి చేసి వరి సాగు నుండి దూరం చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కన్పింస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ రంగాన్ని అభివద్ధి చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం ఇచ్చిన చంద్రబాబు అధికారం చేతికి అందిన తరువాత రైతుల్ని ఛీ«దరించుకుంటున్నారని పలువురు వ్యాఖాన్నిస్తున్నారు. రుణ మాఫీ రైతుకు గుది బండగా మారింది. వడ్డీలతో రైతులకు తలకు మించిన భారంగా పరిణమించింది. రుణమాఫీతో వడ్డీలు చెల్లించని రైతులకు సొసైటీలు, బ్యాంకులు రణాలు ఇవ్వకపోవడంతో సన్న చిన్నకారు రైతులు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి వడ్డీలు కడుతున్నారు. కొంత మంది పుస్తెలు కూడా తాకట్టు పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడింది. అలుపెరుగని అన్నదాత పచ్చని పైరును చూడకుండా ఉండలేక ఇంట్లో ఉన్న కొద్దిపాటి బంగారు వస్తువుల్ని తాకట్టు పెట్టుకుంటుంటే, సాక్షాత్తూ ముఖ్యమంత్రే బంగారు ఆభరణాలపై అప్పులు ఇవ్వవద్దుని హుకుం జారీ చేయడం రైతుల్లో కలకలం రేగుతోంది. హెలెన్ నష్టపరిహారం ఏదీ బాబూ! హెలెన్ నష్టపరిహారం నేటికీ అందలేదు. మూడేళ్ల క్రితం మంజూరైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం రైతులకు దక్కనివ్వకుండా ఇతరత్రార ఖర్చులకు వినియోగించుకుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా హెలెన్ నష్టపరిహారం రూ. 160 కోట్ల మేర సొమ్ము రైతులకు అందాల్సి ఉంది. హెలెన్ ఊసెత్తకుండానే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ఇతర జిల్లాల రైతులకు నష్టపరిహారం అందజేస్తామనడంలో ఆంతర్యమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అడ్రస్సులేని వడ్డీ రాయితీ గత ఏడాది రైతులు చెల్లించిన వడ్డీ రాయితీ నేటికీ ఆయా సొసైటీలకు జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా సహకార రంగం ద్వారా రూ. 900 కోట్ల మేర రైతులకు రుణాలు అందజేశారు. దీని తాలూకూ వడ్డీ 7 శాతం రైతుల వద్ద నుండి ముక్కు పిండి మరీ వసూలు చేశారు. సుమారు రూ. 95 లక్షల మేర వడ్డీ రాయితీ సొమ్ము రావలసి ఉంది. ఏడు శాతంలో 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. మరో 3 శాతం కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. సకాలంలో చెల్లించని వడ్డీ రాయితీ సొమ్ముకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా అని రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వడ్డీ రాయితీ చెల్లించని ప్రభుత్వం రుణమాఫీ సొమ్ముకు వడ్డీలు వసూలు చేయడం సిగ్గు చేటని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మింగ మెతుకులేదు. మీసాలకి.. –మల్లారెడ్డి శేషమోహనరంగారావు, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి. మింగ మెతుకులేదు.. మీసాలకి సంపెంగ నూనె రాసినట్లుగా చంద్రబాబు ప్రభుత్వ తీరు ఉంది. హెలెన్ తుఫాన్ నష్టపరిహారం ఇవ్వడానికి ఖజానా చిల్లు చూపిస్తున్నారు. మరి గుంటూరు ప్రాంత రైతులకు నష్టపరిహారం ఎక్కడ నుండి తీసుకువచ్చి ఇస్తారు. రైతుల్ని మభ్యపెట్టడం, మోసగించడం చంద్రబాబుకు అలవాటైపోయింది. హెలెన్ నష్టపరిహారం జిల్లాకు రూ. 160 కోట్లు రావలసి ఉంది. గత ఏడాది వడ్డీ రాయితీ రూ. 90 లక్షలు రావలసి ఉండగా ఒక్క రూపాయి విడుదల చేయాలేదు. అన్నపూర్ణ జిల్లాలోని అన్నదాతను ఆదుకునే తీరు ఇదేనా?. రైతులకు వెంటనే హెలెన్ నష్టపరిహారం, వడ్డీరాయితీ ఇవ్వాలి. బంగారు ఆభరణాలపై అప్పులు ఇవ్వవద్దనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలి. హెలెన్ నష్టపరిహారం ఇవ్వాలి –కె.సాయిలక్ష్మీశ్వరి, వ్యవసాయ శాక సంయుక్త సంచాలకులు, ఏలూరు హెలెన్ నష్టపరిహారాన్ని రైతులకు మంజూరు చేయాల్సి ఉంది.