అన్నపూరణి (తెలుగులో అన్నపూర్ణ)గా మారారు నయనతార. ఆమె కెరీర్‌లో రూపొందుతున్న 75వ చిత్రానికి ‘అన్నపూరణి’ టైటిల్‌ను ఖరారు చేసి, టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతి అన్నపూరణి పాత్రలో నటిస్తున్నారు నయనతార.
అన్నపూరణి పుస్తకం చదువుతూ, ఆ పుస్తకం పేజీల మధ్యలో నాన్ వెజ్ వంటకాల రెసిపీలను చూస్తుండటం, ఆమె అభిరుచులు కుటుంబ సభ్యులకు తెలియకపోవడం వంటి అంశాలు టీజర్‌లో కనిపిస్తాయి. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్.
Comments
Please login to add a commentAdd a comment