
కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేశ్ శివన్ గురించి అందరికి సుపరిచితమే. ఇటీవలే విఘ్నేశ్ శివన్ బర్త్‌డే వేడులకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై 'నయనతార- బియాండ్ ది ఫెయిర్‌టేల్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేశ్ కలిసి సన్నివేశాలు ఉన్నాయి. అలాగే పలు ప్రశ్నలకు వీరిద్దరు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
(చదవండి: ‘గాడ్ ఫాదర్’లో నయన్ రోల్ ఇదే.. ఆసక్తిగా ఫస్ట్‌లుక్ పోస్టర్)
దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తమిళనాడు మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు వివాహానికి హాజరయ్యారు. త్వరలోనే విడుదల ప్రేమజంట డాక్యుమెంటరీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయనున్నారు. కాగా, చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment