ఎట్టకేలకు లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు ఒక్కటి కాబోతున్నారు. అయిదేళ్లుగా రిలేషన్‌లో ఉన్న ప్రేమ జంట గురువారం ఏడడుగులు వేయబోతున్నారు. ఈ రోజు(జూన్ 9న) నయన్-విఘ్నెశ్ మహాబలిపురంలోని ఓ రీసార్ట్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భారీ భద్రత నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు విఘ్నేశ్ కాబోయే భార్య(నయనతార) గురించి ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు.
చదవండి: నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో.. నెట్టింట వైరల్
‘ఈ రోజు జూన్ 9.. ఇది నయన్ లవ్. థ్యాంక్యూ గాడ్... నా జీవితంలోని అందమైన వ్యక్తులు, విశ్వం, సంకల్పానికి ధన్యవాదాలు !! ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి మంచి యాదృచ్చికం, ప్రతి ఆశీర్వాదం, ప్రతిరోజూ షూటింగ్, ప్రార్థనలు నా జీవితాన్ని ఇంత అందంగా మార్చాయి. వీటిన్నింటికి నేను కృతజ్ఞతుడిని. ఇప్పుడు, ఇదంత నా జీవితంలోని ప్రేమకు(నయనతార) అంకితం. మరి కొద్ది గంటల్లో వధువుగా నిన్ను చూసేందుకు పరితపిస్తున్న తంగమై. మన కుటుంబం, స్నేహితుల ఆశీర్వాదంతో అధికారికంగా నీతో కొత్త జీవితం ఆరంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు విఘ్నేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment