Nayanthara And Vignesh Shivan Blessed With Twin Baby Boys, Pics Viral - Sakshi
Sakshi News home page

Nayanathara- Vignesh Shivan: ట్విన్స్‌కు జన్మనిచ్చిన నయనతార.. సంతోషంలో విఘ్నేశ్ శివన్

Published Sun, Oct 9 2022 7:23 PM | Last Updated on Mon, Oct 10 2022 9:29 AM

Nayanathara Vignesh Shivan Couples Blessed With Two Baby Boys Today - Sakshi

కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. తాజాగా నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) జన్మనిచ్చినట్లు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఫోటోలను షేర్ చేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్‌, విఘ్నేశ్‌ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నయనతార నటించిన గాడ్‌ ఫాదర్‌ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. 

ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్‌-విక్కీలు జూన్‌ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఇటీవలే అభిమానుల కోసం వీరిద్దరి పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నట్లు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వీరి పెళ్లి డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు.  ఈ డాక్యుమెంటరీలో నయనతార చిన్నతనం నుంచి పెళ్లి వరకూ సాగే ప్రయాణాన్ని అభిమానులకు చూపించనున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి లవ్‌ స్టోరీ, పెళ్లి వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా ప్రసారం కానుంది. అయితే నయనతార సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement