స్టార్ జంటకు కలిసిరాని కొత్త ఏడాది.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్! | LIC Sends Legal Notice To Nayanthara's Husband Vignesh Shivan - Sakshi
Sakshi News home page

Vignesh Shivan: నయన్ భర్త సినిమాపై వివాదం.. నోటీసులిచ్చిన ఎల్‌ఐసీ!

Published Wed, Jan 10 2024 7:48 AM | Last Updated on Wed, Jan 10 2024 8:37 AM

LIC Sends Ligal Notices To Nayanathara Husband Vignesh Shivan - Sakshi

లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నయనతార భర్త శివన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. అసలు ఎందుకు సమస్య ఎక్కడ వచ్చింది? ఆ వివాదం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. 

ఈ చిత్రానికి ఎల్‍ఐసీ టైటిల్‍ పెట్టడంపై ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేరును గుర్తు చేసేలా ఉందంటూ వెల్లడించింది. ఈ మేరకు మూవీ టైటిల్ మార్చాలంటూ దర్శకుడు విఘ్నేశ్ శివన్‍కు ఎల్ఐసీ లీగల్ నోటీసులు పంపినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

అంతే కాకుండా.. ఎల్‍ఐసీ సినిమా టైటిల్‍ను ఏడు రోజుల్లోగా మార్చాలని.. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయంలో విఘ్నేశ్‍తో పాటు మూవీ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్‍కు నోటీసులు పంపినట్లు సమాచారం. పేరు మార్చకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని ఎల్ఐసీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఎల్‍ఐసీ పంపిన నోటీసులకు మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారికంగా స్పందన రాలేదు.

అయితే ఇప్పటికే నయనతార నటించిన అన్నపూరణి చిత్రం కూడా వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో  హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉ‍న్నాయంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నయనతార భర్త సినిమా సైతం వివాదంలో చిక్కుకుంది. కాగా.. ఈ చిత్రం ప్రముఖ నటుడు ఎస్‍జే సూర్య కీలకపాత్ర చేస్తున్నారు. ప్రదీప్ సోదరి పాత్రలో ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తారని తెలుస్తోంది. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement