ఎల్‌ఐసీ మూవీ.. కృతీ శెట్టికి తండ్రిగా నటించేదెవరో తెలుసా? | Pradeep Ranganathan, Krithi Shetty LIC Movie Launched | Sakshi
Sakshi News home page

LIC Movie: విఘ్నేశ్‌ శివన్‌ కొత్త సినిమా ఎల్‌ఐసీ.. లవ్‌ టుడే హీరోతో జోడీ కట్టిన ఉప్పెన బ్యూటీ

Published Sat, Dec 16 2023 9:56 AM | Last Updated on Sat, Dec 16 2023 10:38 AM

Pradeep Ranganathan, Krithi Shetty LIC Movie Launched - Sakshi

దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కొత్త సినిమా గురువారం ఉదయం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విఘ్నేశ్‌ గత ఏడాది కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్‌ కథానాయకుడిగా ఓ సినిమా చేయాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఈయన దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎల్‌ఐసీ అని టైటిల్‌ ఖరారు చేశారు. ఎల్‌ఐసీ అంటే లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ అని అర్థం.

లవ్‌ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా హీరోయిన్‌ కృతిశెట్టి నటిస్తుండగా నటుడు ఎస్‌జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్‌ సంగీతాన్ని, రవి వర్మన్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు.

కాగా ఈ చిత్రం ప్రేమికుల మధ్య ఏర్పడే ఈగో, విడిపోవడం, మళ్లీ కలవడం వంటి అంశాలతో వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కృతి శెట్టికి తండ్రిగా ఎస్‌జే సూర్య, హీరోకి మిత్రుడిగా యోగి బాబు నటిస్తున్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్‌ రెండు షెడ్యూల్లో పూర్తి చేసి 2024 సమ్మర్‌ స్పెషల్‌ గా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారు.

చదవండి: రూ.100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్‌కు ఊరట.. ఆ స్కామ్‌లో క్లీన్ చిట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement