
లవ్ టుడే సినిమా (Love Today Movie)తో సెన్సేషన్ అయ్యాడు హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ప్రస్తుతం డ్రాగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు రచయితగానూ పని చేస్తున్నాడు. తాజాగా చెన్నైలో జరిగిన డ్రాగన్ సినిమా (Dragon Movie) ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రదీప్ రంగనాథన్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.
నన్ను కిందకు లాగాలని ప్రయత్నాలు
ప్రదీప్ మాట్లాడుతూ.. నన్ను చాలామంది కిందకు లాగాలని ప్రయత్నిస్తున్నారు. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్కను. మొక్క మానవడానికి చాలా కష్టపడుతుంది. నేను కూడా అలాగే ఛాలెంజ్‌లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ లవ్ టుడే విషయానికి వస్తే.. ఈ మూవీకి హీరోయిన్ దొరకడం ఎంత కష్టమైపోయిందో! నేను హీరో అనగానే నాతో నటించేందుకు చాలామంది హీరోయిన్లు తటపటాయించారు.
నేను హీరో అనగానే ముఖం మీదే..
కొందరేమో డేట్స్ కుదరట్లేదంటూ ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మరికొందరేమో నిజాయితీగా నా పక్కన చేయనని, పెద్ద స్టార్స్‌తో మాత్రమే నటిస్తామని చెప్పారు. వారి నిజాయితీకి థాంక్స్. కట్ చేస్తే.. ఇప్పుడు నేను డ్రాగన్ మూవీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)తో కలిసి నటించాను. కాలేజీ డేస్‌లో అనుపమ నటించిన ప్రేమమ్ సినిమా చూశాను. ఇప్పుడు తనతో కలిసి యాక్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.
డ్రాగన్ రిలీజ్ ఎప్పుడంటే?
డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ఓరి దేవుడా మూవీ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కేఎస్ రవికుమార్, మిస్కిన్ , వీజే సిద్ధు, హర్షత్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
చదవండి: అంపశయ్యపై MS నారాయణ.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?: బ్రహ్మానందం