![Super Star Rajinikanth To Work With Pradeep Ranganathan - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/24/rajini.jpg.webp?itok=KamYwUCj)
తమిళసినిమా: రజనీకాంత్ 171వ చిత్రం నుంచి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది ఆయన చేస్తున్న 169వ చిత్రం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రజనీకాంత్ తదుపరి మరో రెండు చిత్రాల్లో నటించడానికి సిద్ధమయ్యారు. అందులో లాల్ సలాం అనేది ఒకటి. దీనికి కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనున్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇకపోతే 171వ చిత్రం గురించి ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. దీనికి డాన్ చిత్రం ఫేమ్ విను చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. సడన్‌గా ప్రదీప్ రంగనాథన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటింన లవ్ టుడే చిత్రం అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని చూసిన రజనీకాంత్ ప్రదీప్‌రంగనాథన్‌ను ఎంతగానో ప్రశంసించారు. విను చక్రవర్తి చెప్పిన కథ రజనీకాంత్‌కు అంతగా రుచించలేదని, దీంతో ప్రదీప్ రంగనాథన్ తన 171వ చిత్రానికి దర్శకత్వం వహించేలా ప్రచారం జరుగుతోంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ రెండు చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment