![Rajinikanth Film Festivals Starts From December 9th To 15th - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/11/rajini.jpg.webp?itok=mVXgMAeI)
తమిళసినిమా: రజనీకాంత్ పుట్టినరోజు అంటే ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు పండగే. రజినీకాంత్ పుట్టినరోజున అభిమానులు ఆలయాల్లో పూజలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈసారి ఇంకొంత స్పెషల్‌యాడ్ అవ్వడం విశేషం. రజనీకాంత్ ఈనెల 12న 71వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆయన గత 20 ఏళ్ల క్రితం కథ, కథనాన్ని సమకూర్చి నటించి నిర్మించిన చిత్రం బాబాను కొంత మార్పులు, చేర్పులతో సరికొత్త హంగులు చేర్చి విడుదల చేయడం ప్రత్యేకత అయితే రజనీకాంత్ చిత్రోత్సవాలు పేరుతో పీవీఆర్ సంస్థ ఈ నెల 9వ తేదీ నుం 15వ తేదీ వరకు ఆయన నటించిన హిట్ చిత్రాలను చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో రీ రిలీజ్ చేయడం మరో విశేషం. బాబా, శివాజి, 2.ఓ, దర్బార్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.
కాగా సరికొత్త హంగులతో రూపొందిన బాబా చిత్ర ప్రీమియర్ చెన్నైలోని సత్య థియేటర్లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షోకు నిర్మాత కలైపులి ఎస్.థాను, లతా రజనీకాంత్, గీత రచయిత వైరముత్తు పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. లతా రజనీకాంత్ మాట్లాడుత 20 ఏళ్ల క్రితం చూసిన దానికంటే పదిరెట్లు సంతృప్తిని బాబా చిత్రం కలిగింందని పేర్కొన్నారు. థియేటర్లో అభిమానుల చప్పట్లతో చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నారు. వారికి తమ కుటుంబంపై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment