
నటుడు మయిల్ స్వామి అంత్యక్రియలు ముగిశాయి. కాగా ఉదయం మయిల్ స్వామి భౌతిక కాయానికి అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మయిల్ స్వామి తనకు చిరకాల మిత్రుడు అని పేర్కొన్నారు. మంచి నటుడు మాత్రమే కాకుండా సామాజిక సేవకుడు అని కొనియాడారు.
మయిల్ స్వామి ఏటా తిరువణ్ణామలై వెళ్లేముందు తనకు ఫోన్ చేసే వారన్నారు. మయిల్ స్వామి, వివేక్ వంటి నటులు మరణం చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకుల తీరని లోటని పేర్కొన్నారు. తనను తిరువణ్ణామలైకు తీసుకెళ్లాలన్నది మయిల్ స్వామి కోరిక అని, అంది కశ్చితంగా నెరవేరుస్తానని, ఆ విషయమై తిరువణ్ణామలై ఆలయం అర్చకులతో మాట్లాడానని చెప్పారు.
కాగా మయిల్ స్వామి భౌతికకాయానికి సోమవారంస్థానిక వడపళనిలోని ఏవీఎం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంతిమ యాత్రలో వందలాది మంది సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. మయిల్ స్వామి శివభక్తుడు కావడంతో శివ వాయిద్యాల మధ్య అంతిమయాత్ర సాగింది.
Comments
Please login to add a commentAdd a comment