Mayilsamy
-
ఆ కమెడియన్ చివరి కోరిక తీర్చనున్న రజనీకాంత్
నటుడు మయిల్ స్వామి అంత్యక్రియలు ముగిశాయి. కాగా ఉదయం మయిల్ స్వామి భౌతిక కాయానికి అగ్ర కథానాయకుడు రజనీకాంత్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మయిల్ స్వామి తనకు చిరకాల మిత్రుడు అని పేర్కొన్నారు. మంచి నటుడు మాత్రమే కాకుండా సామాజిక సేవకుడు అని కొనియాడారు. మయిల్ స్వామి ఏటా తిరువణ్ణామలై వెళ్లేముందు తనకు ఫోన్ చేసే వారన్నారు. మయిల్ స్వామి, వివేక్ వంటి నటులు మరణం చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకుల తీరని లోటని పేర్కొన్నారు. తనను తిరువణ్ణామలైకు తీసుకెళ్లాలన్నది మయిల్ స్వామి కోరిక అని, అంది కశ్చితంగా నెరవేరుస్తానని, ఆ విషయమై తిరువణ్ణామలై ఆలయం అర్చకులతో మాట్లాడానని చెప్పారు. కాగా మయిల్ స్వామి భౌతికకాయానికి సోమవారంస్థానిక వడపళనిలోని ఏవీఎం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంతిమ యాత్రలో వందలాది మంది సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. మయిల్ స్వామి శివభక్తుడు కావడంతో శివ వాయిద్యాల మధ్య అంతిమయాత్ర సాగింది. -
ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు తారకరత్న మరణ వార్తను మరవకముందే మరో నటుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ కమెడియన్ మైల్స్వామి(57) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న మైల్ స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయారని చెప్పారు. మైల్ స్వామి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా మలై స్వామి మరణంపై ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న మైల్ స్వామి 1984లో నటుడిగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. 2000 నుంచి కమెడియన్‌గా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. చాలా సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆయన తమిళంలో నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ అనువాదమై విజయవంతమయ్యాయి. #JUSTIN | கட்சி எல்லைகள் கடந்து நட்பு பாராட்டியவர் - ஆளுநர் தமிழிசை#Mayilsamy | #RipMayilsamy | #TamilisaiSoundararajan | @DrTamilisaiGuv pic.twitter.com/3prtaenxef — PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) February 19, 2023