‘లవ్ టుడే’(Love Today) మూవీలో హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ’. ‘ఓరి దేవుడా’ మూవీ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ రవికుమార్, మిస్కిన్ , వీజే సిద్ధు, హర్షత్ ఖాన్ , అనుపమా పరమేశ్వరన్ తదితరులు నటిస్తున్నారు. కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మిస్తున్నారు.
లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘రైజ్ ఆఫ్ డ్రాగన్’ అనే పాటను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను లియోన్ జేమ్స్, నదీషా థామస్ పాడారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పాటలో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తో కలిసి డాన్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment