'లవ్ టుడే' హీరో కొత్త సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా? | Pradeep Ranganathan New Movie Titled Dragon | Sakshi
Sakshi News home page

Dragon Movie: 'డ్రాగన్' పేరుతో మూవీ.. డైరెక్టర్ అతడే

Published Mon, May 6 2024 9:56 AM | Last Updated on Mon, May 6 2024 11:02 AM

 Pradeep Ranganathan New Movie Titled Dragon

'కోమాలి' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రదీప్‌ రంగనాథన్‌.. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా మారిపోయి 'లవ్ టుడే' అనే మూవీ తీశాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. దీంతో ప్రదీప్‌ రంగనాథన్‌కు క్రేజ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్ తీస్తున్న 'ఎల్‌ఐసీ' చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఇందులో నటి నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)

కాగా ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీని మొదలుపెట్టేశాడు. 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వత్‌ మారిముత్తు దీనికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాతలు ఆదివారం ప్రకటించారు. 'డ్రాగన్‌' అనే డిఫరెంట్ టైటిల్‌ ఫిక్స్ చేశారు. అలానే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. త్వరలో నటీనటుల వివరాలతో పాటు మిగతా విషయాలు చెబుతామని క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement