kolly wood
-
ప్రముఖ నిర్మాత మృతి.. సుధా కొంగర ఎమోషనల్ నోట్
ప్రముఖ కోలీవుడ్ చిత్ర నిర్మాత మనో అక్కినేని కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే ఆమె చెన్నైలో మరణించారు. ఫేమస్ డైరెక్టర్ సుధా కొంగర తొలి చిత్రానికి మనో నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుడా అజిత్ కుమార్ చిత్రం కిరీడం, మాధవన నటించిన 13బీ సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ సందర్భంగా సుధా కొంగర ఆమెకు నివాళులర్పించారు. ఆమెతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.సుధా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా తొలి చిత్ర నిర్మాత, నా ప్రాణ స్నేహితురాలు మనో అక్కినేనికి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ భూమిపై మీరెలా జీవించారో.. అక్కడ కూడా ప్రకాశిస్తారని నమ్ముతున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. మీరు నా మొదటి సినిమాకు పనిచేయడం ఎప్పటికీ గుర్తుంటుంది. నీతో కలిసి తీసిన ద్రోహి చిత్రాన్ని అంకితమిస్తున్నా. ఎందుకంటే సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారిలో ఒకరిగా నువ్వు నా ప్రతి కదలికను గమనిస్తావని నాకు తెలుసు' అని పోస్ట్ చేశారు. కాగా.. 2008లో సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. A long journey through life and cinema.Miss you Mano... pic.twitter.com/pQ1iTuhwHv— Sudha Kongara (@Sudha_Kongara) January 21, 2025 View this post on Instagram A post shared by Sudha Kongara (@sudha_kongara) -
ధనుశ్‌తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.గతంలో 2019లో ధనుశ్‌తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్‌గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జత కుదిరినట్లేనా?
తమిళసినిమా: నటుడు జీవా తాజాగా భారీ బ్ర హ్మాండ హారర్, థ్రిల్లర్ కథా చిత్రంతో వచ్చే ఏడాది పొంగల్ అనంతం థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు బ్లాక్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో హిట్ కొట్టిన ఈయన తాజాగా నటించిన చిత్రానికి అగత్యా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటించగా నటుడు అర్జున్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2025లో పొంగల్ అనంతం జనవరి 31న తమిళం తెలుగు హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర టైటిల్‌తో పాటు వీడియోను క్రిస్మస్ పండగ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇది అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అని నిర్మాత ఐసరి గణేష్ పేర్కొన్నారు. ఇందులో మన సంసతని, మానవ అనుబంధాలు ఉంటాయని చెప్పారు. మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలన్నదే తమ భావన అన్నారు. ఆ విధంగా వెర్సెస్ డెవిల్స్ అనే ఇతివత్తంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనీష్ అర్జున్ దేవ్‌కు చెందిన వామ్ ఇండియా సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. దర్శకుడు కుమార్ పెరియస్వామి, ధనుష్ -
మలయాళమే కాదు.. ఇక్కడ పెద్ద లిస్టే ఉంది: నటి షాకింగ్ కామెంట్స్
మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదికపై ప్రముఖ కోలీవుడ్ నటి రేఖ నాయర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉందన్నారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. మీడియా లేని కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. అప్పట్లో చాలామంది సర్దుకుపోయేవారని కామెంట్ చేశారు. కొంతమంది అడ్జస్ట్మెంట్ కాలేక సినిమాల నుంచి తప్పుకున్నారని రేఖా నాయర్ వెల్లడించారు.కోలీవుడ్‌లోనూ ఇలాంటి వేధింపులు చాలానే జరుగుతున్నాయని రేఖా నాయర్ ఆరోపించారు. మలయాళంలో కేవలం పది నుంచి ఇరవై మంది మాత్రమే ఉంటారని.. తమిళంలో ఆ సంఖ్య భారీగానే ఉంటుందని అన్నారు. ఇక్కడైతే ఏకంగా 500లకు పైగానే ఉంటారని తెలిపారు. ఇవన్నీ బయటికి మాట్లాడితే సినిమా ఛాన్సులు రావని రేఖా నాయర్ వెల్లడించారు. అందుకే హీరోయిన్స్ వాటి గురించి మాట్లాడేందుకు భయపడతారని పేర్కొన్నారు. తమిళంలో సినిమా సంఘాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరన్నారు. కేవలం మలయాళం, తమిళం మాత్రమే అన్ని భాషల్లోనూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.కాగా.. తమిళంలో టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే గతంలో మహిళల పట్ల ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి కానీ.. ఏదో అయిపోయిందని హంగామా చేయొద్దని కామెంట్స్ చేశారు. -
బుల్లితెరలోనూ లైంగిక వేధింపులు: నటి పద్మిని
మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హేమా కమిషన్ నివేదిక అక్కడ ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రభావం అన్ని చిత్ర పరిశ్రమలను తాకుతోంది. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. సీనియర్ల నుంచి జూనియర్ నటీమణులు పలువురు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిర్గతం చేస్తూ మంచి పరిష్కారం ఆశిస్తున్నారు. కాగా లైంగిక వేధింపులకు బుల్లితెర నటీమణులు అతీతం కాదని నటి కుట్టి పద్మిని పేర్కొన్నారు. బాల నటిగా పరిచయం అయిన ఈమె పలు చిత్రాల్లో నటించినా, ఆ తరువాత బుల్లితెరలో నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె నటీమణుల లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ డాక్టర్, ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌లో మాదిరిగానే సినిమా వృత్తి కూడా అన్నారు. అయితే ఇక్కడ లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెండితెరలోనే కాకుండా బుల్లితెరలోనూ నటీమణులు లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారు. కొందరు ఆ సంఘటనలపై ఫిర్యాదులను నిరూపించుకోవడం సాధ్యం కాకపోవడం, బయటకు చెబితే అవకాశాలు రావేమోనని భయపడుతున్నారన్నారు. మరి కొందరు బాగా సంపాదించుకోవడంతో సర్దుకు పోతున్నారన్నారు. నటి శ్రీరెడ్డి లాంటి వాళ్లకు నడిగర్ సంఘం మెంబర్ షిప్ కార్డు ఇవ్వడం లేదన్నారు. దీంతో వారు సీరియళ్లలోనూ నటించలేకపోతున్నారని అన్నారు. మలయాళ నటుడు సురేష్‌గోపి లైంగిక వేధింపులకు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారని, ఆధారాలు ఎక్కడ నుంచి వస్తాయని, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలన్నారు. తాను బాల తారగా నటిస్తున్నప్పుడు ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, ఈ విషయం తన తల్లి ఫిర్యాదు చేయడంతో తనను ఆ చిత్రం నుంచి తొలగించారని నటి కుట్టి పద్మిని ఈసందర్భంగా పేర్కొన్నారు. -
ఏంది స్వామీ ఆ స్పీడు.. అదేం షూటింగ్ కాదు..కాస్తా తగ్గించు!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విడాముయార్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీ రోల్ పోషిస్తున్నారు.ఇదిలా ఉండగా.. అజిత్‌కు కారు, బైక్ రేసులు అంటే మహా సరదా. కాస్తా షూటింగ్ విరామం దొరికితే చాలు.. బైక్ రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. సినిమాలకు కాస్తా గ్యాప్ రావడంతో తాజాగా తన లగ్జరీ కారుతో రైడ్‌కు వెళ్లారు. ఆడి కారులో ఏకంగా 234 కిమీ స్పీడ్‌తో డ్రైవ్ చేస్తూ కనిపించారు. అయితే సీటు బెల్ట్ కూడా లేకుండా.. ఏమాత్రం భయం లేకుండా అంత స్పీడులో అజిత్ కారును నడపడం విశేషం.అయితే ఇది చూసిన అజిత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి స్టంట్స్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. రోల్ మోడల్‌గా ఉన్న మిమ్మల్ని చూసి యువత అదే స్పీడులో వెళ్లితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ కారును నడిపింది ఇండియాలోనా లేదా విదేశాల్లోనా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సీటు బెల్ట్ లేకుండా అంత వేగంతో వెళ్తే మనదేశంలో అయితే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా అన్నదే డౌటానుమానం. ఏదేమైనా కారు అంత స్పీడుతో నడపడం మంచిది కాదని చాలామంది నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. New video of #Ajithkumar during the racing🏎️Speed👀🔥pic.twitter.com/Qsyi6BYtgZ— AmuthaBharathi (@CinemaWithAB) August 28, 2024 -
ది గోట్ మూవీ.. రన్‌టైమ్ ఎన్ని గంటలో తెలుసా?
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గోట్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు.అయితే ఈ సందర్భంగా చిత్రబృందానికి కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. దీంతో గోట్ మూవీకి మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చింది. సెన్సార్ బోర్డు ఆదేశాలతో ఓ లేడీ క్యారెక్టర్‌కు సంబంధించిన రియాక్షన్ షాట్‌ను తొలగించిన చిత్రబృందం.. రెండు సెకన్ల నిడివి ఉన్న షాట్‌ను మరో షాట్‌తో భర్తీ చేసింది. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3.03 నిమిషాలుగా ఉంది. ప్రస్తుం దీనికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.కాగా.. ఇప్పటికే రిలీజైన ది గోట్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. ఈ మూవీలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రల్లో పోషించారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.#TheGoat bookmyshow 136k interested 🎟️❤️🔥❤️🔥❤️🔥Duration: 3hrs 3mins 14secs.Certified: U/AIn theaters from September 5th!#TheGreatestOfAllTime @actorvijay @vp_offl @thisisysr @archanakalpathi @aishkalpathi @Ags_production pic.twitter.com/dQcNMGFp46— The GOAT Movie (@GoatMovie2024) August 27, 2024 -
కోలీవుడ్ స్టార్ హీరో భారీ యాక్షన్ చిత్రం.. ట్రైలర్ ఎప్పుడంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. ఈ సినిమాను శివ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ సూర్య విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కంగువా ట్రైలర్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విటిర్‌లో పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుందని ఇప్పటికే వెల్లడించారు. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. The anticipation ends now! The time for glory is arriving ✨Get ready for a celebration like no other ❤️🔥The grand #KanguvaTrailer is all set to be yours from 12th August#KanguvaFromOct10 🦅 #Kanguva@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP #StudioGreen… pic.twitter.com/OJ8eRvIv6X— Studio Green (@StudioGreen2) August 10, 2024 -
రజనీకాంత్‌ను చూసి వారు ఆశ్చర్యపోతున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన చిత్రాల వేగాన్ని పెంచుతున్నారు. గ్యాప్ లేకుండా చిత్రాలు చేస్తూ ఈతరం హీరలను మించిపోతున్నారు. ఏడుపదుల వయసులోనూ అవిశ్రాంతిగా నటిస్తున్న రజనీకాంత్‌ను చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే జైలర్ చిత్రంలో నటించారు. దీన్ని సన్ పిచ్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. నెల్సన్ దర్శకత్వం వహించారు. ఇందులో జైలర్‌గా నటిస్తున్న రజినీకాంత్ రెండు గెటప్పుల్లో కనిపిస్తారా? లేక రెండు పాత్రల్లోనా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఆగస్టు 10వ తేదీన జైలర్ చిత్రం తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల) ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటిస్తున్న లాల్ సలాం చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పుదుచ్చేరిలో జరుగుతోంది. దీంతో రజినీకాంత్ తన 170వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) జైభీమ్ చిత్రం టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. బోగస్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూలైలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. -
షూటింగ్‌కు ముందే హీరోతో లిప్‌లాక్ చేసిన హీరోయిన్
కోలీవుడ్‌లో మంచి స్థానం కోసం పోరాడుతున్న నటీమణులలో స్మృతి వెంకట్ ఒకరు. మొదట్లో హీరోలకు సిస్టర్ పాత్రలో నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు కథానాయికగా నటించే స్థాయికి ఎదిగింది. దీంతో సాదాసీదాగా నటిస్తే ప్రయోజనం ఉండదని గ్రహించిందేమో, అందాలారబోతతోనే కాకుండా ఏకంగా లిప్‌లాక్ సన్నివేశాలకు సిద్ధమైపోయింది. అదీ చిత్ర షూటింగ్‌కు ముందే ఆ చిత్ర హీరోతో ఘాటు చుంబనానికి రెడీ అయిపోయారు. దీంతో మూవీ లోకేషన్‌లోని వారు ఆశ్చర్యానికి గురయ్యారట. (ఇదీ చదవండి: నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్) ఇంతకుముందు 'దేజావు' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు అరవింద్ శ్రీనివాసన్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం తరుణం. ఈ చిత్రంలో కిషన్‌దాస్ కథానాయకుడుగాను, స్మృతి వెంకట్ నాయకిగానూ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే అంతకుముందే ఒక టీజర్‌ను చిత్రీకరించి విడుదల చేశారు. అందులో స్మృతి వెంకట్, కిషన్దాస్తో లిప్‌లాక్ సన్నివేశంతో కూడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీంతో నెటిజనుల స్మృతి వెంకట్‌పై రకరకాల సైటెర్లు వేస్తున్నారు. టీజర్లోనే ఇంత ఘాటు చుంబనాల సన్నివేశం ఉంటే ఇంకా మెయిన్ పిక్చర్ ఎలా ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద దర్శకుడు టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేశారు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) -
హీరోగా మారిన 'సార్పట్టా' నటుడు
కోలీవుడ్‌లో ఆర్య హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'సార్పట్టా పరంపరై'. అందులో డాన్సింగ్ రోస్ అనే ముఖ్యమైన పాత్రలో షబ్బీర్ కల్లరాక్కల్ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం 2021లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా డాన్సింగ్ రోస్ షబ్బీర్ కల్లరాక్కల్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'బర్త్ మార్క్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి మీర్జా హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్ శ్రీధరన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎప్పుడో హింట్ ఇచ్చిన అల్లు అరవింద్, వీడియో వైరల్) 1990 ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమని డైరెక్టర్ చెప్పాడు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని మరైయూర్ అనే గ్రామంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. మిస్టరీ డ్రామాగా సాగే ఈ చిత్రం కథ ముఖ్యంగా రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నాడు. డేని అనే సిపాయి కార్గిల్ యుద్ధం అనంతరం తన భార్యను తీసుకుని సొంత గ్రామానికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు, కష్టాలే చిత్ర ప్రధాన అంశం అని చెప్పాడు. సెంటిమెంట్, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలతో కూడిన చిత్రం 'బర్త్ మార్క్' అని తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
పాన్ఇండియా ని షాక్ చేస్తున్న కాంబినేషన్..!
-
మహేష్ బాబు ప్రభాస్ కి పోటిగా ఇండియన్ 2
-
కమల్ మాస్టర్ ప్లాన్ శింబు కోసం దీసికకు 30 కోట్లు
-
సినీ నిర్మాత అరెస్ట్.. కారణం ఇదే.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
తమిళ సినిమా: ఆరుద్ర గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ మోసం కేసులో కాంచీపురం బ్రాంచ్ నిర్వాహకుడు, సినీ నటుడు, నిర్మాత రుసో(42)ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి పుళల్ జైలుకు తరలించారు. వివరాలు.. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఆరుద్ర గోల్డ్ ఫైనాన్స్‌కు చెందిన బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ కంపెనీ 30 శాతం వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేసి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది. బోర్డు తిప్పేయడంతో బాధితులు చెన్నై క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెన్నై అమంజికరైలోని ఆరుద్ర గోల్డ్ ఫైనాన్స్ ప్రధాన కార్యాలయం డైరెక్టర్ సెంథిల్‌ను అరెస్ట్ చేసి విచారించారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆయన బ్యాంకు అకౌంట్ నుంచి కాంచీపురం బ్రాంచ్ నిర్వాహకుడు రుసో బ్యాంకు అకౌంటుకు భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. దీంతో రుసో ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.8 లక్షల నగదు, బంగారం, ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఆయన బ్యాంకులోని రూ.1.40 కోట్లను సీజ్ చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, రుసో రూ.10 కోట్లతో కొత్త భవనాన్ని, ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. కాగా ఆర్కే సురేశ్ దర్శకత్వంలో రుసో చిత్రాన్ని నిర్మిస్తూ అందులో కథానాయకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది. చదవండి: అలాంటి వాటిపై నమ్మకం లేదు.. కానీ భయమేస్తుంటుంది: నయన్ -
మరో సంచలనమైన కొత్త కేసుతో జై భీమ్-2 ..!
-
ప్రభాస్ ప్యాన్స్ కు గుడ్ న్యూస్ ..!
-
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ మూవీ క్రేజీ అప్డేట్..!
మహాభారతం ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రబృందం ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీని 3డీలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్ చేసింది. (చదవండి: సమంత 'శాకుంతలం' నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ అప్పుడే) ఇటీవలే సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సైతం 3డీలో కనువిందు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత శాకుంతలం 3డీలో అలరించేందుకు సిద్ధమైంది. ‘శాకుంతలం ఇప్పుడు 3డీలో రానుంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని ట్విటర్లో వెల్లడించింది. ఈ విషయంపై గతంలోనే వార్తలు వచ్చినా ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.ఈ వార్త విని సమంత ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తుండగా.. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. #Shaakuntalam Also In 3D. A new release date will be announced soon! https://t.co/iFeTe4X60U@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials#Shaakuntalam3D pic.twitter.com/gAPy7InS5D — Gunaa Teamworks (@GunaaTeamworks) November 4, 2022 -
ఆన్లైన్లో ద్వేషపూరిత సంస్కృతి పెరిగిపోయింది: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో అభిమానులు సంపాదించుకున్న నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. టాలీవుడ్లో ఎక్కువ విజయాలు అందుకున్న ఈ భామ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జంటగా సలార్‌లో నటిస్తున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో బాలీవుడ్ చిత్రాలను టార్గెట్ చేయడంపై ఆమె స్పందించారు. హిందీ చిత్రాలు విడుదల సమయంలో బాయ్‌కాట్ బాలీవుడ్ అంశం తెరపైకి రావడం పట్ల ఆమె మాట్లాడారు. శృతిహాసన్ మాట్లాడుతూ..'ఇది కేవలం సినిమాకు సంబంధించినది మాత్రమే కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. దీనికి చాలా కారణాలున్నాయి. మనమందరం దీనిపై ఒక్కసారి ఆలోచించుకోవాలి. సినిమాలను రద్దు చేయాలనే సంస్కృతి అనేది బెదిరింపు, దాడి చేయడం లాంటిది. ఇది కేవలం సినిమా పరిశ్రమలోనే మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం సమాజంలో ఆన్లైన్ సంస్కృతి సమాజంలో ద్వేషం నింపేలా మారింది.' అని అన్నారు. తాను వ్యక్తిగతంగా కూడా ఎలాంటి ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో వివరించింది శృతిహాసన్. తనను 'చుడైల్' (తెలుగులో మంత్రగత్తె) అని పిలుస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుత ప్రపంచం ప్రతికూల ప్రదేశంగా మారింది. కానీ దానిని అధిగమిస్తామని నాకు తెలుసు. నేను నా సొంత మార్గంలో ఆలోచిస్తాను అని వెల్లడించింది. -
రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో రెండు సినిమాలకు సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు వచ్చేనెల 5న చెన్నైలో జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది నిర్మాణ సంస్థ. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తాజాగా రెండు కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేశారు. ఇవాళ లైకా ప్రొడక్షన్స్ అధినేత తమిళకుమారన్, ఛైర్మన్ సుభాస్కరన్, బ్యానర్ డిప్యూటీ ఛైర్మన్ ప్రేం శివసామితో రజనీకాంత్ ఉన్న ఫోటోనూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. #Thalaivar @rajinikanth Signed two films with LYCA PRODUCTIONS ,Pooja For the Both films will happen on NOV 5 in Chennai! 🤩🔥 Thalaivar #Rajinikanth with Lyca Chairman #Subaskaran , Lyca Head #Tamilkumaran & Deputy chairman #Premsivasamy! ⭐@LycaProductions pic.twitter.com/wWtuECgyjc — BA Raju's Team (@baraju_SuperHit) October 28, 2022 -
అల్లు అర్జున్ టాలీవుడ్ హీరో కాదు.. టీమిండియా క్రికెటర్ షాకింగ్ సమాధానం..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ పాన్ ఇండియాకు మారిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప మూవీతో ఆల్ ఇండియాలో బన్నీ పేరు మార్మోగింది. అంతేకాకుండా ఆ చిత్రంలోని 'తగ్గేదేలే' అనే డైలాగ్ అయితే అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో ఎంతోమంది అభిమానాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్‌కు ఇండియాలోని ప్రేక్షకులతో పాటు విదేశీ సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే ఏకంగా పుష్ప స్టైల్లో లుక్ షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో క్రికెటర్ అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన టీమిండియా క్రికెటర్ ధావల్ కులకర్ణి ట్విట్టర్ వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఓ అభిమాని మీ ఫేవరేట్ తమిళ హీరో ఎవరు అంటూ ఒకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ధావల్ కులకర్ణి అల్లు అర్జున్ అంటూ సమాధానమిచ్చారు. దీంతో అభిమానులు అవాక్కయ్యారు. అదేంటీ టాలీవుడ్ హీరోను కోలీవుడ్ హీరో అని చెప్పడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మరో నెటిజన్ అల్లు అర్జున్ తమిళ హీరో కాదు కదా అని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ అదేమో నాకు తెలియదు కానీ.. మై ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ కులకర్ణి చెప్పారు. Your favourite tamil actor? — ☄️ (@P_m_6_4) October 25, 2022 Allu Arjun — Dhawal Kulkarni (@dhawal_kulkarni) October 25, 2022 My fav South Indian actor is Allu Arjun — Dhawal Kulkarni (@dhawal_kulkarni) October 25, 2022 Allu not tamil actor he is telugu actor.but tamil peoples like allu arjun — வந்தியதேவன் Army (@massmani45) October 25, 2022 -
నయన్ దంపతుల సరోగసి.. ఊహించిందే జరిగింది..!
నయనతార దంపతుల వివాదంపై చర్చ అంతా ఇంతా కాదు. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళవారం విచారణ పూర్తయింది. (చదవండి: నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?) తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. నయనతార దంపతుల సరోగసి చట్టబద్ధమేనని తేల్చింది. 2021 నవంబర్లోనే సరోగసికి అగ్రిమెంట్ జరిగిందని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. దీంతో నయన్ దంపతుల సరోగసి వివాదానికి తెరపడనుంది. -
అరుంధతి మూవీలో బాలనటి.. అంతలా మారిపోతుందని ఊహించలేదు..!
టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అరుంధతి'. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా అనుష్క ఫేమస్ అయిపోయింది. అందరూ జేజమ్మ అంటూ ముద్దుగా పేరు పెట్టారు. అయితే ఈ సినిమాలో బాలనటిగా ఓ చిన్నారి అద్భుతంగా నటించింది. తన డైలాగులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఎవరా చిన్నారి అనుకుంటున్నారా? బాలనటిగా మెప్పించిన దివ్య నగేశ్ అందరినీ తనదైన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆ చిన్నారి ఇప్పుడెలా ఉంది? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదివేయండి. (చదవండి: కాంతార మూవీ.. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరో తెలుసా?) చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి అగ్రతారలుగా ఎదిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలతోనే మర్చిపోలేని గుర్తింపును పొందారు. అలానే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి దివ్య నగేశ్ కూడా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ఆమె పలు సినిమాలు కూడా చేసింది. టాలీవుడ్లో 'నేను నాన్న అబద్దం' అనే సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దివ్య నగేశ్. ఇటీవలే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అరుంధతి బాలనటి దివ్య నగేశ్. -
తెలుగులో కొత్త కథలు లేవా..? పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా..?
-
దీపావళికి వస్తున్న సర్దార్.. ఆ విషయంలో సూర్యను దాటేస్తాడా?
హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో దాదాపు 15 గెటప్పుల్లో కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇప్పటివరకు సూర్యను అధిగమించనున్నాడు. ఇంతకుముందు వీడొక్కడే సినిమాలో ఓ పాటకోసం పది రూపాల్లో కనిపించాడు సూర్య. (చదవండి: రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు.. అదే ‘సర్దార్’కు స్ఫూర్తి) అయితే ఈ గెటప్స్ పాట కోసమా, సినిమాలో భాగంగా వేశాడా అన్న విషయం రిలీజైన తర్వాతే క్లారిటీ రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అతనికి జంటగా రాశిఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా.. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తమిళం, తెలుగులో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది. టాలీవుడ్లో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ విడుదల చేస్తుంది. ఈ చిత్రానికి దర్శకత్వం పీఎస్ మిత్రన్ వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21న విడుదల కానుంది. -
తమిళ స్టార్ విజయ్ మూవీ అప్డేట్.. బీస్ట్ తర్వాత మళ్లీ..!
తమిళ స్టార్ హీరో నటిస్తున్న తాజా చిత్ర 'వారీసు'. తెలుగులో వారసుడిగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నటి రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, యోగిబాబు, షామ్, ఖుష్బు, సంగీత, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరో విజయ్ ఓ పాట పాడినట్లు తెలుస్తోంది. బీస్ట్ మూవీ తర్వాత తమిళ స్టార్ ఈ సినిమాలో పాట పాడారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. విజయ్‌తో అతనికి ఇదే మొదటి చిత్రం. గతంలో రిలీజైన బీస్ట్‌లో కూడా విజయ్ శివకార్తికేయన్ రాసిన ఓ పాటను పాడారు. వారీసులో విజయ్ పాట అభిమాలను ఆకట్టుకునేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాతికి థియేటర్లలో సందడి చేయనుంది. -
ఇది ఊహించలేదు.. ప్రభుత్వానికి నయన్ దంపతుల బిగ్ ట్విస్ట్!
నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సైతం నయన్ దంపతులను వివరణ కోరింది. (చదవండి: నయనతార-విగ్నేశ్ సరోగసి వివాదంలో కీలక మలుపు) నివేదికలో బిగ్ ట్విస్ట్..: అయితే తాజాగా నయన్ దంపతులు తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ జంట 6 ఏళ్ల క్రితమే చట్టబద్ధంగా రిజిష్టర్ వివాహం చేసుకున్నట్లు అఫిడవిట్లో వెల్లడించినట్లు సమాచారం. తమిళనాడు ఆరోగ్య శాఖకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని తెలిపింది. వివాహానికి సంబంధించిన పత్రాలన్నింటినీ అఫిడవిట్‌తో పాటు అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించలేదు: సరోగసీ (నియంత్రణ) చట్టం 2021 ప్రకారం పెళ్లైన జంట ఐదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటాక మాత్రమే సరోగసీని ఎంచుకోవడానికి అర్హులు. అద్దె తల్లి దంపతులకు దగ్గరి బంధువు అయి ఉండాలని కూడా చట్టం చెబుతోంది. అలాగే సరోగేట్ మదర్ యూఏఈకి చెందిన నయనతార బంధువే అని అఫిడవిట్లో పేర్కొన్నారు. కవలలు జన్మించిన చెన్నై ఆసుపత్రికి కూడా అధికారులు ఇండెంట్ పెట్టారు. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని.. అన్ని నియమాలను పాటించామని నయన్ దంపతులు అఫిడవిట్లో పేర్కొన్నారు. -
స్క్రీన్ ప్లే @ 14th అక్టోబర్ 2022
-
నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు తారలు శుభాకాంక్షలు తెలిపారు. నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ జంట కవల పిల్లలకు తమిళంలో ఉయిర్, ఉలగం అనే పేర్లను పెట్టారు. చాలామంది అభిమానులు వారి పేర్ల వెనుక ఉన్న అర్థాలపై ఆరా తీశారు. ఉయిర్, ఉలగం రెండూ తమిళ పదాలు కావడంతో ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే తమిళంలో ఉయిర్ అంటే జీవితం అనే అర్థం వస్తుంది. మరోవైపు ఉలగం అంటే ప్రపంచమని అర్థం వచ్చేలా పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా తల్లిదండ్రులైన కోలీవుడ్ జంటకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేష్ పోస్ట్‌పై విక్కీ కౌశల్, అర్జున్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్లు స్పందించారు. టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 'నయన్, విక్కీకి అభినందనలు. పేరెంట్ క్లబ్‌కు స్వాగతం. జీవితంలో అత్యుత్తమ దశ. మీ ఇద్దరు పిల్లలకు నా ఆశీర్వాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
నయనతార ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. కవలలకు జన్మనిచ్చిన నటి
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. తాజాగా నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) జన్మనిచ్చినట్లు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఫోటోలను షేర్ చేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్, విఘ్నేశ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నయనతార నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఇటీవలే అభిమానుల కోసం వీరిద్దరి పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నట్లు సర్ప్రైజ్ ఇచ్చారు. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వీరి పెళ్లి డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార చిన్నతనం నుంచి పెళ్లి వరకూ సాగే ప్రయాణాన్ని అభిమానులకు చూపించనున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి లవ్ స్టోరీ, పెళ్లి వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ప్రసారం కానుంది. అయితే నయనతార సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. Nayan & Me have become Amma & Appa❤️ We are blessed with twin baby Boys❤️❤️ All Our prayers,our ancestors’ blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for us❤️😇 Need all ur blessings for our Uyir😇❤️& Ulagam😇❤️ pic.twitter.com/G3NWvVTwo9 — Vignesh Shivan (@VigneshShivN) October 9, 2022 -
పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలోనూ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్ల మార్కును అధిగమించింది. (చదవండి: 'పొన్నియిన్ సెల్వన్' సాంగ్ అవుట్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్) పొన్నియిన్ సెల్వన్ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ ధృవీకరించారు. మణిరత్నం కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. అయితే ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్, యష్ కేజీఎఫ్- 2తో పోలిస్తే తక్కువగానే వసూళ్లు సాధించిందని వెల్లడించారు. ఈ రెండు సినిమాలు రూ.600 కోట్ల కంటే ఎక్కువ నికర వసూళ్లు సాధించాయన్నారు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. -
‘పసలపూడి వీరబాబు’గా కార్తి.. డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
తమిళ హీరో కార్తి నటించిన చిత్రం 'విరుమన్'. తాజాగా ఈ సినిమాను ‘పసలపూడి వీరబాబు’గా తెలుగులో రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. ఆగస్టు 12న తమిళంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. కార్తికి కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. అభిమాన హీరో చిత్రాన్ని మిస్సవుతున్న టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్. 'పసలపూడి వీరబాబు'గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ డ్రామా కథతో ముత్తయ్య ఈ సినిమాను తెరకెక్కించారు. అగ్ర దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రాజ్‌కిరణ్, సూరి కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకెందుకు ఆలస్యం సినిమా చూసేయండి. -
నయన్-విఘ్నేశ్ లవ్ డాక్యుమెంటరీ.. టీజర్ చూసేయండి..
కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేశ్ శివన్ గురించి అందరికి సుపరిచితమే. ఇటీవలే విఘ్నేశ్ శివన్ బర్త్‌డే వేడులకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై 'నయనతార- బియాండ్ ది ఫెయిర్‌టేల్' పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో నయన్-విఘ్నేశ్ కలిసి సన్నివేశాలు ఉన్నాయి. అలాగే పలు ప్రశ్నలకు వీరిద్దరు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘గాడ్ ఫాదర్’లో నయన్ రోల్ ఇదే.. ఆసక్తిగా ఫస్ట్‌లుక్ పోస్టర్) దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తమిళనాడు మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు వివాహానికి హాజరయ్యారు. త్వరలోనే విడుదల ప్రేమజంట డాక్యుమెంటరీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయనున్నారు. కాగా, చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
అందుకే ఆయన పొన్నియిన్ సెల్వన్‌లో భాగం కాలేదు: మణిరత్నం
కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేసిన పాటల రచయిత 'వైరముత్తు'. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఆయన.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాలకు గతంలో సాహిత్యమందించారు. వైరముత్తు పాటలు సినీ ప్రియుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. మరీ తాజాగా మణిరత్నం రూపొందించిన కొత్త చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో మాత్రం వైరముత్తు ఎందుకు లేరు. దీనికేమైనా ప్రత్యేక కారణాలున్నాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అడిగిన ప్రశ్నకు తాజాగా మణిరత్నం స్పందించారు. 'వైరముత్తు టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సైతం వైరముత్తు టాలెంట్‌ను మెచ్చుకునేవారు. నేను ఆయనతో కలిసి ఎన్నోసార్లు పనిచేశా. ఆయన సాహిత్యాన్ని నా సినిమాల్లో ఉపయోగించా. అతనొక అద్భుతం. అయితే వైరముత్తును మించిన కొత్త టాలెంట్ ప్రస్తుతం పరిశ్రమలో ఉంది. కొత్త తరానికి ప్రోత్సాహమందించాలి’ అందుకే అని మణిరత్నం వివరణ ఇచ్చారు. గతంలో వైరముత్తుపై మీటూ ఆరోపణలు రావడంతో దూరం పెట్టారని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) అయితే గతంలో వైరముత్తు తమను వేధింపులకు గురి చేశాడంటూ కొంతమంది మహిళలు ‘మీటూ’ వేదికగా ఆరోపించారు. ప్రముఖ గాయని చిన్మయి సైతం ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే వైరముత్తుతో పనిచేసేందుకు పలువురు సినీ ప్రముఖులు వెనకాడుతున్నట్లు అప్పట్లోనే కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మణిరత్నం, వైరముత్తు చివరి చిత్రం 'చెక్క చివంత వానం' (2018). ఈ చిత్రంలో 'మజై కురువి' 'భూమి భూమి' లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ కోసం ఇళంగో కృష్ణన్ మూడు పాటలు, కబిలన్, శివ అనంత్, కృతికా నెల్సన్లు మరో మూడు పాటలు రాశారు. -
Karthikeya 2: కేరళలో కార్తీకేయ-2 జోడి.. మలయాళంలోనూ గ్రాండ్ రిలీజ్..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగస్ట్ 13న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఊహించని విజయాన్ని సాధించింది. బాలీవుడ్లో ఈ మూవీ కలెక్షన్లతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాను మళయాళంలోనూ విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా అఖిల్, అనుపమ కేరళలో సందడి చేశారు. తాజాగా ఈ జంట కొచ్చిన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సందడి చేసింది. ఈనెల 23న మలయాళంలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. (చదవండి: Karthikeya 2 Movie-Nikhil: శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ 2 మూవీ టీం) కలియుగ సృష్టి రహస్యాలను పొందుపరచిన కృష్ణుని కంకణాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే యువకుని కథతో దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కీలకమైన అతిథిపాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ ఈ మూవీలో నటించారు. ఈ చిత్రానికి నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ వ్యవహరించారు. -
పొన్నియన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని రూపొందించారాయన. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల మొదటి భాగం షూటింగ్ పూర్తవ్వగా.. అందుకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం ప్రచార కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది చిత్రబృందం. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. (చదవండి: పొన్నియన్ సెల్వన్- పార్ట్ 2 ఎప్పుడో చెప్పేసిన మణిరత్నం) అయితే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్ పాత్ర కోసం మీరు ఎవరినైనా ఎంపిక చేయాలనుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మణిరత్నం స్పందించారు. ఆ పాత్రకు అప్పట్లో రేఖను ఎంపిక చేయాలనుకున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టారు దర్శకధీరుడు మణిరత్నం. తొలిసారి కమల్ హాసన్‌తో కలిసి ఈ చిత్రాన్ని తీయాలనుకున్నట్లు తెలిపారు. 1994, 2011లో ఈ చిత్రం చేయడానికి ప్రయత్నించగా.. ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా టేకాఫ్ కాలేదని వివరించారు. కాగా పొన్నియన్ సెల్వన్ -1లో ఐశ్వర్రాయ ద్విపాత్రాభినయం చేస్తోంది. నందిని, ఆమెకు మూగ తల్లిగా మందాకిని దేవి పాత్రల్లో కనిపించనుంది. జూలైలో ఐశ్వర్య పాత్రకు చెందిన నందిని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి సంబంధించి యుద్ధ సన్నివేశాలను ఎక్కువ భాగం థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. -
సినీరంగ ప్రవేశం చేయనున్న టీమిండియా మాజీ కెప్టెన్
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. అయితే నటుడిగా మాత్రం కాదు.. నిర్మాతగా. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో నిర్మించబోయే ఒక సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరించనున్నాడు. లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాకు ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు. కాగా ధోని ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచులు ఉన్నప్పటికి సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలు అంతంతమాత్రమే. ఇక త్వరలోనే విఘ్నేశ్ శివన్-నయనతారలు తమ సుదీర్ఘ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నయన్ కూడా.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో సెట్స్‌పై ఉంది. నయన్ పెళ్లి, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని కిలిసి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే కీలక అప్డేట్ వచ్చే అవకాశమున్నట్టు కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి క్రికెటర్ గా సక్సెస్ అయిన ధోని.. నిర్మాత గా ఏ మేరకు విజయం సాధిస్తాడో వేచి చూడాలి. చదవండి: సమంతకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ IPL 2022 - Ravindra Jadeja: ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకోనున్న జడేజా..? -
పునీత్ లేడు అనే విషయం తట్టుకోలేక పోతున్నాను
-
హైకోర్టులో ఏఆర్ రెహ్మాన్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఆర్ రెహ్మాన్ 2000 సంవత్సరంలో ఒక సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాళియప్పన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. తాను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదని, ఏఆర్ రెహ్మాన్ మాత్రం లబ్ధి పొందారని..తనకు నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని కాళియప్పన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి ఆర్.సుబ్రమణియం శుక్రవారం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకు ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి పిటిషన్‌దారుడు తరఫు న్యాయవాది వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. -
ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పిన నయనతార ?
కోలీవుడ్ లవ్ కపుల్ విఘ్నేష్ శివన్-నయనతారలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హైలైట్ అవుతూనే ఉంటుంది. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. కలిసి ఏ దేశానికి విహారయాత్రలకు వెళ్లినా, పుట్టిన రోజు, రెండు రోజు వేడుకలను జరుపుకున్నా వెంటనే ఆ ఫొటోలను మీడియాకు విడుదల చేసి వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా లవ్కపుల్కి సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గత నాలుగేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంటకు త్వరలోనే పెళ్లిచేయాలని విఘ్నేష్ తల్లిదండ్రులు భావిస్తున్నారట. చాలాకాలంగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరిని భార్యభర్తలు చేయాలని విఘ్నేష్ పేరేంట్స్ అనుకుంటున్నారట. పెళ్లికి నయన్ నో చెప్పిందట. ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని, కరోనా పరిస్థితులు చక్కబడ్డాక వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. ఇందుకు విఘ్నేష్ కూడా ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేశారని టాక్. ఇదే నిజమైతే వచ్చే ఏడాది నయనతార మిసెస్ నయనతార విఘ్నేష్‌గా మారనుంది. చదవండి : ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక.. -
డ్రగ్స్ కేసులో సినీ నటి ద్వివేదికి బెయిల్
బెంగళూరు: గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి రాగిణి ద్వివేదికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని, చిత్రపరిశ్రమలో చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కారణంతో గత సెప్టెంబర్‌లో రాగిణి, సంజనాలను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో ద్వివేది, ఇతరులకు బెయిల్ ఇవ్వడానికి నవంబర్ 3న కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి తనను ఈ కేసులో తనను ఇరికించారని పిటిషన్ లో పేర్కొంది. నేడు దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార కేంద్ర జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంది.( చదవండి: మిషన్ ఫ్రంట్‌లైన్.. ఆర్మీలో రానా) -
యశ్‌తో భారీ మల్టీస్టారర్‌కు శంకర్ ప్లాన్
అప్పటివరకు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండస్ట్రీని ఏలాయి. ఇంతలో దక్షిణ భారతంలో ఓ చిన్న సినీ పరిశ్రమ అందరి చూపు తనవైపు తిప్పుకుంది. అదే శాండల్‌వుడ్. అప్పటివరకు కన్నడ సినిమాల గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆ ఒక్క సినిమా శాండల్‌వుడ్ స్థాయినే మార్చేసింది. అదే కేజీఎఫ్.. కళ్లు చెదిరే గ్రాఫిక్స్ లేవు, ఫేమస్ హీరో కాదు, బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ కాదు. కానీ మూవీతో ఏదో మ్యాజిక్ చేశాడు. అంతే మూవీ లవర్స్ అందరూ శాండల్‌వుడ్‌లో కంటెంట్ ఉంది అనుకోవడం మొదలుపెట్టారు. అందుకే కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంత క్రేజ్ దక్కించుకున్నాడు కాబట్టే హీరో యశ్ తమిళంలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన శంకర్ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్-2 సినిమా సెట్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ పడింది. అందుకే దాన్ని పక్కన పెట్టి అప్పటిలోపు ఒక మల్టీస్టారర్ సినిమా తీద్దామన్న ఆలోచనలో ఉన్నాడట శంకర్. అందులో ఒక హీరోగా యశ్‌ను అనుకున్నాడని, దీనికి యశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కమల్ హాసన్ కూడా దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో తన తర్వాత సినిమా ఉండబోతుందని ప్రకటించాడు కాబట్టి ఇండియన్-2 షూటింగ్ సంగతి కనుమరుగయినట్టే అని తెలుస్తోంది. అందుకే ఇండియన్-2 గురించి క్లారిటీ వచ్చేలోపు మల్టీస్టారర్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్‌కి క్రేజ్ రావాలని పలు ఇండస్ట్రీల నుంచి భారీ తారాగణాన్ని దింపాలని శంకర్ ప్లాన్. (13 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి బొమ్మరిల్లు) అందుకే కేజీఎఫ్‌తో శాండల్వుడ్లోనే కాక దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యశ్ని ఎంచుకున్నాడు. దీనికి యశ్ కూడా అంగీకరించాడు. ఇంకో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నారు. ఈ మల్టీస్టారర్‌ని ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. కేజీఎఫ్ 2 షూటింగ్లో ఉన్న యశ్ డిసెంబర్ వరకు ఇందులోనే బిజీగా గడపనున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శంకర్, యశ్ కాంబినేషన్లో సినిమా 2021 జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. (శ్యామ్ సింగరాయ్‌లో విలన్‌గా నారా రోహిత్) ఫిబ్రవరిలో ఇండియన్-2 సినిమా సెట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఆ షూటింగ్ ఆగిపోయింది. భారీ లైట్‌తో ఉన్న క్రేన్ కూలిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. దీని నుంచి కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ తృటిలో తప్పించుకున్నారు. ఇందులో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి అందజేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకుంది. వారికి ఇచ్చిన మాట ప్రకారం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి గురువారం వారి కుటుంబాలకు చెక్‌లను అందజేశారు. వారితో పాటు ప్రమాదంలో గాయపడిన టెక్నిషియన్ రామరాజన్‌కి కూడా 90లక్షలు పరిహారాన్ని ఇచ్చింది మూవీ టీమ్. -
ఉత్తమ థ్రిల్లర్ సీక్వెల్‌కు రెడీ!
తిరువనంతపురం: 2013 లో విడుదలైన మోహన్ లాల్ ‘దృశ్యం’ చిత్రం భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు చేసిన ఉత్తమ థ్రిల్లర్లలో ఒకటి. ఈ సినిమా మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ఉండబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఆగస్టు 17 నుంచి ఈ చిత్రం షూటింగ్‌కు మోహన్‌లాల్ అంగీకరించారని, దీనికి సంబంధించి ఈ వారాంతంలో పరిశ్రమలోని నిపుణులు, నిర్మాతలతో సమావేశం నిర్వహించే ఆలోచనల్లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. (ఆ వార్తల్లో నిజం లేదు : కత్తి మహేష్) ఈ సమావేశంలో కరోనా సంక్షోభ పరిస్థితిని అధిగమించడానికి తీసుకోవలసిన భద్రతా చర్యలు, ఇతర ఆర్థిక విషయాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం దృశ్యం 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించబోయే మిగిలిన తారాగణాన్ని త్వరలో ప్రకటించనున్నారు. గత నెలలో కేరళ ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించిన క్రమంలో సినిమా షూటింగ్‌ల కోసం అనుమతించింది. సునామి అనే మలయాళ చిత్రం జూన్ మధ్యలోనే కొంతమంది సిబ్బందితో తిరిగి షూట్ ప్రారంభించింది. ఇదిలావుండగా, మోహన్ లాల్ ‘మరక్కర్: అరబికడాలింటే సింహాం’ సినిమా ఏప్రిల్‌లో తెరపైకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. దీని తరువాత జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ‘రామ్’ అనే మరో చిత్రానికి సంతకం చేశారు. ఈ చిత్రంలోని ప్రధాన భాగాలను విదేశాలలో చిత్రీకరించాల్సిన అవసరం ఉన్నందున వచ్చే ఏడాది షూటింగ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. (బై ముంబై.. వెళ్లిపోతున్నా: హీరోయిన్) -
ఎనిమిదేళ్ల తర్వాత స్టార్టింగ్ పాయింట్‌కి!
తెలుగులో బిజీగా ఉన్న పూజా హెగ్డేకి కోలీవుడ్ నుంచి కబురు అందిందని సమాచారం. మాస్ హీరో విజయ్ 65వ సినిమాలో తనను కథానాయికగా అడిగారట. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించనుంది. బాక్సింగ్ నేపథ్యంలో హిందీలో తీసిన ‘సాలా ఖదూస్’ ద్వారా దర్శకురాలిగా పరిచయమైన సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్. ‘సాలా ఖదూస్’కి రీమేక్‌గా తెలుగులో వెంకటేశ్‌తో ఆమె ‘గురు’ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మోహన్‌బాబు కీలక పాత్రలో సూర్య హీరోగా సుధ ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత విజయ్‌తో చేయబోయే సినిమాని పట్టాలెక్కిస్తారట. వార్తల్లో ఉన్న ప్రకారం ఇందులో పూజా హెగ్డే కథానాయికగా కన్ఫార్మ్ అయితే ఎనిమిదేళ్ల తర్వాత ఆమె తమిళ సినిమాలో నటిస్తున్నట్లు అవుతుంది. 2012లో చేసిన ‘ముగముడి’ చిత్రంతోనే పూజా కథానాయికగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’తో తెలుగులో, ‘మొహెంజోదారో’తో హిందీ తెరకు పరిచయమయ్యారు ఈ ఉత్తరాది భామ. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ఓ సినిమా, అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో నటిస్తున్నారు పూజా హెగ్డే. -
స్టార్ హీరోపై కన్నేసిన రష్మిక
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అజిత్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది నటి రష్మిక మందన. ఈ కన్నడి గుమ్మ తెలుగులో గీతగోవిందం చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్లో మార్కెట్ ఉన్న కథానాయకిల లిస్ట్‌లో ఈ అమ్మడు చేరింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ లో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోలతోనూ నటిస్తూ బిజీగా ఉంది. అయితే కోలీవుడ్‌కు డియర్ కామ్రేడ్ చిత్రం ద్వారా పరిచయమైనా, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం రష్మికను నిరాశపరిచింది. అంతకంటే ఎక్కువగా హీరో విజయ్‌తో నటించే అవకాశం మిస్ కావడం. దీంతో ఎలాగైనా కోలీవుడ్‌లో జెండాను గట్టిగా పాతాలని కోరుకుంటున్న ఈ బ్యూటీ దృష్టి ఇప్పుడు విజయ్‌కు దీటైన నటుడు అజిత్‌పై పడినట్లు తెలుస్తోంది. అందుకు ఉదాహరణ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక అజిత్ పేరు చెప్పి వార్తల్లో కెక్కింది. అజిత్‌కు దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన సాధారణంగా తన సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే పాల్గొనరు. అయినా అలాంటి కార్యక్రమాల్లో అజిత్ పేరు చెప్పగానే అభిమానులు ఈలలు, చప్పట్లతో ఆవరణ దద్దరిల్లుతుంది. ఇది తెలిసిన రష్మిక తను పాల్గొన్న కార్యక్రమంలో మీకు కోలీవుడ్‌లో ఎవరితో నటించాలని ఆశ పడుతున్నారన్న వ్యాఖ్యాత ప్రశ్నకు టక్కున అజిత్ అని చెప్పింది. ఇది విన్న అభిమానులు తలా అంటూ గట్టిగా కేకలు వేస్తూ డాన్స్ చేయడం ప్రారంభించారు. అది చూసిన నటి రష్మిక అజిత్ మాస్ అని అంది. అలా విజయ్‌తో నటించే అవకాశాన్ని కోల్పోయిన ఈ బ్యూటీ దాన్ని అజిత్‌తో నటించి భర్తీ చేయాలని కోరుకుంటోంది. అయితే అలాంటి అవకాశం ఈ అమ్మడికి ఎప్పుడు వస్తుందో చూడాలి. ఏదేమైనా నటి రష్మిక అజిత్ మాస్ అన్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే ఈ బ్యూటీ కార్తీకి జంటగా సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తోందన్నది గమనార్హం. -
మాస్ సాంగ్
స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు హీరోయిన్ శ్రద్ధాదాస్. ఇటీవల విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ (తెలుగు హిట్ ‘టెంపర్’తమిళం రీమేక్)లో శ్రద్ధాదాస్ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. తాజాగా కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘హిప్పీ’ చిత్రంలో శ్రద్ధా దాస్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రానికి టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దిగంగనా సూర్యవంశీ, జజ్బాసింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ‘‘హిప్పీ’ సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాను. ఓ ఫన్ మాస్ సాంగ్ షూటింగ్లో పాల్గొన్నాను’’ అని పేర్కొన్నారు శ్రద్ధాదాస్. సరే..ఓన్లీ ఇలా స్పెషల్ సాంగ్స్‌తోనే శ్రద్ధాదాస్ కెరీర్ సాగుతుందని అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే... కన్నడ ‘కోటిగొబ్బ 3, ఉద్ఘర్ష’ చిత్రాల్లో శ్రద్ధాదాస్ కథానాయికగా నటించారు. అలాగే 2017లో వచ్చిన రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ చిత్రంలో ఆమె జర్నలిస్టుగా నటించిన సంగతి తెలిసిందే. -
విశాల్‌పై భగ్గుమన్న రాధారవి
చెన్నై : ప్రముఖ నటి నయనతారపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాధారవి తీరును పలువురు కోలీవుడ్ నటులు, సెలబ్రిటీలు తప్పుపడుతున్నారు. రాధారవి వ్యవహార శైలి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ భగ్గుమన్నారు. రాధారవి తన పేరుముందున్న రాధాను తొలగించుకోవాలని లేకుంటే మహిళలకు అన్యాయం చేసినట్టవుతుందని విశాల్ ఘాటుగా ట్వీట్ చేశారు. విశాల్ ట్వీట్‌పై రాధారవి స్పందించారు. తన పేరు ముందున్న పదాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది ఆర్కే నగర్ లాంటిదే..విశాల్ ఏమీ తెలియకుండానే మాట్లాడుతున్నాడు..రాధ మా తండ్రి పేరు..అందుకే ఈ పేరు పెట్టుకున్నా’నని రాధారవి పేర్కొన్నారు. కాగా,నయనతార నటించిన ఓ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆమెను ఉద్దేశించి రాధారవి చేసిన వ్యాఖ్యలు కలకలంరేపిన సంగతి తెలిసిందే. మరోవైపు వేదికపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రవర్తనకు గాను ఆయనను డీఎంకే సస్పెండ్ చేసింది. -
కోలీవుడ్ ఎంట్రీ
మాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న మంజు వారియర్ ఇప్పుడు కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుశ్ హీరోగా ‘అసురన్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు మంజు వారియర్‌ను తీసుకున్నారు టీమ్. ఈ నెల 26న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. ‘‘మా సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం ఎవర్గ్రీన్ మంజు వారియర్‌ను తీసుకున్నాం. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. అద్భుతమైన ప్రతిభాశాలి అయిన ఆమె నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాను’’ అని ధనుశ్ పేర్కొన్నారు. -
ఆ ఒక్కటుంటే లైఫ్ ఈజ్ బ్యూటీపుల్!
ఆ ఒక్కటుంటే లైఫ్ ఈజ్ బ్యూటీఫులే అంటోంది నటి సాయేషా సైగల్. ఈ జాణ చాలా తెలివి మీరిపోయింది. ఈమె మాట్లాడే విధానంలోనేఅది తెలిసిపోతోంది. టాలీవుడ్లో సక్సెస్ వెక్కిరించడంతో అక్కడ దుకాణం బంద్ చేసి కోలీవుడ్‌లో మకాం పెట్టింది బాలీవుడ్ బ్యూటీ. తమిళసినిమా :ఇక్కడతొలి చిత్రం నటిగా పేరు తెచ్చి పెట్టినా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆ చిత్రంతోనే అమ్మడు మూటాముల్లెసర్దుకుంటుందనుకున్నారు. అయితే లక్కీగా కోలీవుడ్ అక్కున చేర్చుకుంది. ఆ తరువాత నటించిన కడైకుట్టి సింగం, గజనీకాంత్, జుంగా చిత్రాల వరుసగా విజయాలను అందుకోవడంతో సాయేషాను క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నటుడు సూర్యతో రొమాన్స్ చేస్తోంది. ఈ అమ్మడి ముచ్చట్లు చూద్దాం. ప్ర: బాలీవుడ్ నుంచి వచ్చి పర భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. కష్టం అనిపించడం లేదా? జ: నిజం చెప్పాలంటే వనమగన్ చిత్రంలో నటిస్తున్నప్పుడే తమిళ భాష నచ్చేసింది. అయితే స్పాట్లో ప్రామిటింగ్‌లో తమిళంలో సంభాషణలు చెప్పి నటించడం కష్టగానే అనిపించింది. దీంతో తంగ్లీష్‌లో (తమిళ సంభాషణలను ఇంగ్లిష్‌లో రాసుకోవడం) రాసుకుని బట్టీ పట్టి మాట్లాడడం మొదలెట్టాను. ఆ తరువాత యూనిట్లో అంద రూ మాట్లాడడం గమనిస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాను. ఇంకా ప్యూర్‌గా మాట్లాడడం నేర్చుకుంటున్నాను. ఇంకో విష యం ఏమిటంటే ఇకపై నన్ను పూర్తి పేరుతో పిలవనక్కర్లేదు. సాయేషా అని పిలిస్తే చాలు. సాయేషా అంటే హార్ట్స్ మోస్ట్ బ్యూటీఫుల్ డిజైర్ అని అర్థం. ప్ర: తమిళ చిత్రాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లున్నారే? జ: నాకు చిన్న వయసు నుంచే డాన్స్, నటన అంటే చాలా ఆసక్తి. అలా మొట్టమొదటి సారిగా హిందీలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అయితే ఆ చిత్ర షూటింగ్ ప్రారంభం కావడానికే ఒక ఏడాది అయ్యింది. అలాంటి సమయంలో తెలుగులో అఖిల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం పూర్తి కాగానే శివాయ్ షూటింగ్ ప్రారంభమైంది. ఆ తరువాత కోలీవుడ్‌లో వనమగన్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు విజయ్ అన్నయ్య ముంబై వచ్చి కథ వినిపించారు. కథ చాలా ఇంప్రెష్ చేయడంతో వన మగన్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పాను. ఆ తరువాత ఇదుగో ఈ స్థాయికి వచ్చా. మూడు చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. ప్రస్తుతం కేవీ.ఆనంద్ దర్శకత్వంలో సూర్య సరసన నటిస్తున్నాను. బాలీవుడ్, టాలీవుడ్లో నటించినా కోలీవుడ్‌లో నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అందుకే తమిళ చిత్రాలపైనే దృష్టి పెడుతున్నాను. ప్ర: మీతో నటించిన కథానాయకుల్లో మీకు నచ్చిన విషయాలు? జ: జయం రవిది పెద్ద మనసు. ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు అధిక ప్రాముఖ్యత ఉన్నా ఫీల్ కారు. ఆయన నటించే పాత్రపై నమ్మకం కలిగి ఉంటారు. వనమగన్ చిత్రంలాంటి అవకాశం మళ్లీ నాకు లభిస్తుందో, లేదో చెప్పలేను. ఇక కార్తీ చాలా బ్రిలియంట్ యాక్టర్. స్క్రీన్‌పై మన ముఖం నవ్వుతూ ఉండాలన్న విషయాన్ని తెలియజేశారు. ఆయన స్క్రిప్ నాలెడ్జ్ చూసి ఆశ్చర్యపోయాను. భవిష్యత్‌లో కార్తీ కచ్చితంగా పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. నటుడు ఆర్య గురించి చెప్పాలంటే ఆయన షూటింగ్ స్పాట్లో చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా జాలీ పర్సన్. తన చుట్టు ఉన్న వారిని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తారు. అదే సమయంలో ఆర్యలో సీరియస్‌నెస్ ఉంటుంది. ఇక సూర్యలోని నిర్మలత్వం, కఠిన శ్రమ గురించి అందరికీ తెలిసిందే. ప్ర: మీ కాలక్షేప అంశాలు. జ: ఐ లవ్ డాన్స్. స్విమ్మింగ్ అంటే ఇంకా ఇష్టం. ఇంట్లో రోజూ గంట సేపు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. ప్రయాణాల్లో బుక్స్ చదవడంపై ఆసక్తి. చాక్లెట్స్, కేక్స్ ఇష్టంగా తింటాను. ఇప్పుడు చెన్నై చాలా నచ్చేసింది. ఇక్కడ అన్నం కారంగా ఉంటే చేపల కర్రీ ఉంటే చాలు లైఫ్ ఈజ్ బ్యూటీపులే. -
శ్రీరెడ్డి ఆరోపణలకు బదులివ్వండి: ప్రముఖ దర్శకుడు
సాక్షి, చెన్నై: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్‌లతో సోషల్ మీడియాలో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్, నానితో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులపై చేసిన ఆరోపణలు వివాదస్పదంగా మారాయి. ఇప్పటికే కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్, శ్రీరామ్‌లపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. శ్రీరెడ్డి ఆరోపణలపై బాధ్యులు బదులివ్వాలని ప్రముఖ దర్శకుడు, నటుడు, రాజకీయ నేత టీ రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరెడ్డి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పి సమస్యను ఇంతటితో ముగింపు పలికితే మంచిదన్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి, చెడు రెండూ ఉంటాయని, అయితే వాటిని సమస్యాత్మకంగా వదిలేయకూడదని పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో సహజమే, కానీ మా కాలంలో నా వ్యక్తిగతంగా నేను నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో ఏ కథానాయికను కనీసం టచ్ కూడా చేయలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం సినిమా అలా కాదని రాజేందర్ వాపోయారు. సినీ పరిశ్రమలో ఇటువంటి బహిరంగ ఆరోపణలు ఆరోగ్యకరమైనవి కాదని అన్నారు. -
అభిమాన హీరోతో నటించనున్న సాయిపల్లవి
మాలయాళంలో ప్రేమమ్ చిత్రంలో మలర్ పాత్రలో హీరోయిన్ సాయిపల్లవి తన నటనతో అందర్నీ అకట్టుకుంది. టాలీవుడ్లో కూడా ఫిదా, ఎంసీఏ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో నటిస్తోంది. అయితే మలయాళం, తెలుగులో మాదిరిగా తన మ్యాజిక్ కంటిన్యూ కాలేదు. ఆరంభంలోనే మణిరత్నం లాంటి దర్శకుడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తాజాగా ఆమె ఆటో నేర్చుకుంటోందనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బ్యూటీ తన అభిమాన హీరో సూర్యతో జతకట్టనున్నారు. అంతేకాక కోలీవుడ్‌లో మొదటి సినిమా ‘దియా’ కాస్తా నిరాశ పరిచింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దియా తెలుగులోనూ సక్సెస్ కాలేదు. కానీ తన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కోలీవుడ్‌లో మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అందులో ఒకటి తన అభిమనా హీరో సూర్యతో నటిస్తోంది. ‘ఎన్జీకే’ పేరుతో సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రం దీపావళికి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. సాయిపల్లవి ధనుష్‌కు జంటగా ‘మారి-2’లో నటించనుంది. ఇందులో సాయిపల్లవి ఆటో డ్రైవర్ పాత్రలో నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ అమ్మడిప్పుడు ఆటో నేర్చుకోవటంలో శిక్షణ పొందుంతోందని సమాచారం. ‘ఫిదా’ చిత్రంలో ఈ బ్యూటీ ట్రాక్టర్ నడిపిన విషయం తెలిసిందే. బాలాజీమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
నేనెప్పుడూ అలా అనలేదు!
సాక్షి, చెన్నై: సినీరంగంలో వారసులు ఎక్కువ అవుతున్నారు. వారి గుప్పెట్లోనే సినిమా. ప్రముఖ నటులు, దర్శకులకు వారుసులై ఉంటేనే ఈ రంగంలో కొనసాగగలం. అలా కాకుంటే పక్కన పెట్టేస్తారు అని నటి కాజల్‌అగర్వాల్ అన్నట్టుగా సోషల్‌మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే దీని గురించి కాజల్ స్పందిస్తూ పుట్టుకతోనే ఎవరూ స్టార్ కాలేరని, సినిమా రంగంలో వారసులకు మొదట్లో అవకాశాలు అయితే రావచ్చుగానీ నిలదొక్కుకోవాలంటే ప్రతిభ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. వారసుల్లోనూ చాలా మంది ఎంతో కృషి, శ్రమతోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని అన్నారు. ఉదాహరణకు నటుడు విజయ్, సూర్య, కార్తీ తెలుగులో మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, నాగచైతన్య వంటి వారు వారసులుగా తెరంగేట్రం చేసినా ప్రతిభ, కఠిన శ్రమతోనే స్టార్స్‌గా ఎదిగారన్నారు. శ్రమను, కష్టాన్ని నమ్మే పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే వారసులనే ఇమేజ్ వారికి ఒక రకంగా భారం అని అన్నారు. ప్రముఖ నటుల వారసులు కావడంతో వారిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల ఇతరుల కంటే వారసులు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని అన్నారు. అలాంటిది వారసుల గురించి తాను ఎప్పుడూ తక్కువగా మాట్లాడలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్‌లో నిజం లేదని కాజల్‌అగర్వాల్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. నిజానికి కాజల్‌కు సక్సెస్ గ్రాఫ్ బాగానే ఉంది. అయినా క్రేజ్ తగ్గింది. కొత్త హీరోయిన్ల రాక ఎక్కువ అవడం ఒక కారణం కావచ్చు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్‌లో ప్యారిస్ ప్యారిస్ అనే ఒక్క చిత్రంలోనే నటిస్తున్నారు. టాలీవుడ్‌లోనూ స్టార్స్‌తో నటించే అవకాశాలు లేవు. -
ఓవియ ఎందుకు లేదు?
తమిళసినిమా: కాటేరి చిత్రంలో నటి ఓవియ ఎందుకు నటించడంలేదు. ఆమెను తప్పించారా? తనే వైదొలగిందా? కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. తామిరుక్క భయమే వంటి సక్సెస్ఫుల్ చిత్రం ఫేమ్ డీకే తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాటేరి. వైభవ్ హీరోగా నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ కథా చిత్రంలో మొదట హన్సిక నటించనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఓవియ పేరును వెల్లడించారు. చివరకు నటి వరలక్ష్మీ, సోనంబాజ్వా వచ్చి చేరారు. ఇలాఉండగా నటి ఓవియ కాటేరి నుంచి తొలగించబడిందా? తనే వైదొలగిందా? అన్న చర్చ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తరువాత ఓవియ క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం లారెన్స్‌తో కాంచన–3 చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మరో తమిళ చిత్రం, ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. కాటేరి చిత్ర నిర్మాత కేఇ.జ్ఞానవేల్‌రాజా బిగ్‌బాస్ గేమ్ షో ప్రారంభానికి ముందు నటి ఓవియను ఎంపిక చేశారట. అప్పుడు ఆమె పారితోషికం రూ.10 లక్షల లోపే. అయితే బిగ్‌బాస్ షోతో అనూహ్య క్రేజ్ రావడంతో ఓవియ రూ.50లక్షలు పారితోషికం కావలంటూ డిమాండ్ చేశారట. దీంతో నిర్మాతను పక్కన పెట్టి, కథలో కొన్ని మార్పులు చేసి నటి వరలక్ష్మీ, సోనంబాజ్వాలను ఎంపిక చేసినట్లు వారి వెర్సన్. అయితే పారితోషికం తనకు పెద్ద విషయం కాదని, కాటేరి చిత్రంలో తాను మాత్రమే కథానాయకినని చెప్పి, ఆ తరువాత మరో ఇద్దరిని చేర్చడంతోనే ఆ చిత్రం నుంచి వైదొలగినట్లు ఓవియ చెబుతున్నారు. -
నా అభిమాన హీరో ఆయనే..
నయనతార తన అభిమాన నటుడు ఆయనే అంటున్నారు. ఇంతకి ఎవరు ఆయన అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నా.. ఇటీవల నయనతారను మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే ‘అజిత్’ అని చెప్పింది. అంతేకాదు నటుడు విజయ్ కూడా తన అభిమాన హీరోనే అని చెప్పారు. ఇదిలా ఉండగా అజిత్ తాజా సినిమా విశ్వాసంలో నయన్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో నయన్ అజిత్‌తో ‘ఏకన్’ సినిమాలో జత కట్టారు. నయనతారా అయ్యా సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందించినా.. నయన్‌కు పేరు తెచ్చిన సినిమా మాత్రం సూపర్‌స్టార్‌తో నటించిన చంద్రముఖి, నయన్ తన 13 సినీ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. రజనీకాంత్ నుంచి విజయ్, అజిత్, శింబు, ధనుష్ , వర్థమాన నటుడు ఆరి వరకూ కోలీవుడ్‌లో నటించింది. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె నటించిన అరమ్ చిత్రం విమర్శకులను సైతం మెప్పించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం తెలుగులో రెండు , తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. -
రకుల్‌కు కలిసిరాని కోలీవుడ్
సాక్షి, సినిమా : నటి రకుల్ ప్రీత్‌సింగ్‌కు కోలీవుడ్ అచ్చిరాలేదా? అంటే అవుననే అంటున్నాయి పరిస్థితులు. అనుష్క నుంచి తమన్నా, కాజల్ లాంటి చాలా మందిని కోలీవుడ్ తొలుత నిరాకరించింది. వారందరు టాలీవుడ్‌కు వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరిక్షించుకుని నిలదొక్కుకున్న తరువాత కోలీవుడ్‌కు మళ్లీ స్వాగతించారు. రకుల్ అదే విధంగా కోలీవుడ్‌లో పుత్తగం, తడయార తాక్క, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌కు మకాం మార్చింది. ఆమె అక్కడ వరుస అవకాశాలతో స్టార్ హీరోలతో నటించి క్రేజీ నాయకిగా పేరు తెచ్చుకుంది. దీంతో కోలీవుడ్ దృష్టి మళ్లీ రకుల్‌ప్రీత్ సింగ్‌పై పడింది. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌కు జంటగా నటించడంతోనే కోలీవుడ్‌లో అవకాశాలు రావడం మొదలుపట్టాయి. దీంతో రకుల్ కోలీవుడ్‌లో ఒక రౌండ్ కొట్టొచ్చని కలలు కంది. అంతే కాదు దర్శకుడు ఏఆర్.మురుగదాస్ విజయ్ హీరోగా చేయబోయే తన తదుపరి చిత్రంలో రకుల్‌కు అవకాశం కల్సించినట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని రకుల్ అందుకుంది. అయితే తను నటించిన స్పైడర్ చిత్రం హిట్ కాకపోవడం ఆమెకు శాపంగా మారిందనే చెప్పాలి. సూర్యతో నటించే అవకాశాన్ని, విజయ్‌తో నటించే అవకాశాన్ని రకుల్‌ప్రీత్ సింగ్ కోల్పోయింది. కారణాలేమైనా ఇప్పుడు ఆ రెండు అవకాశాలను నటి కీర్తీపురేశ్ తన్నుకు పోయింది. అలా ఇంతకు ముందు హీరోయిన్ల సెంటిమెంట్ రకుల్‌కు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ పెద్దగా చిత్రాలు లేవు. అంతగా వెలిగిన రకుల్ ఒక్కసారిగా పడిపోయింది. టైమ్ అంటే ఇదేనేమో! -
అక్కడ నటించడానికి అనుష్కకు ఇష్టంలేదా?
కోలీవుడ్‌లో అవకాశాల కోసం చాలా మంది ఆరట పడుతుంటారు. ముఖ్యంగా కథానాయిక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఇక్కడ రాణిస్తే ఇతర భాషల్లో అవకాశాలు ముంగిట వాలతాయి. బాలీవుడ్ బ్యూటీస్ కూడా కోలీవుడ్‌లో అవకాశాలొస్తే చేజార్చుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది అనుష్క మాత్రం కోలీవుడ్ అంటేనే విముఖత చూపుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. 2005లో ‘సూపర్’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ యోగా టీచర్ అదే జోరుతో రెండో చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క అందాలను మితి మించి ఆరబోసి సినీ ప్రియులకు కనువిందు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. కోలీవుడ్ అనుష్క అందాలను పట్టించుకోలేదు. దీంతో తెలుగులోనే దృష్టి సారించింది. అక్కడ పాపులర్ అయిన తరువాతనే మళ్లీ కోలీవుడ్ అవకాశాలు ఇచ్చింది. విజయ్‌తో నటించిన వేట్టైక్కారన్ చిత్రం అనుష్కకు ఇక్కడ తొలివిజయం అని చెప్పవచ్చు. ఆ తరువాత కోలీవుడ్‌లో వరుసగా అందిపుచ్చుకున్నారు. ఈ బ్యూటీపై టాలీవుడ్లో పలు వదంతులు ప్రచారమైనా, అంతకు మించి కోలీవుడ్‌లోనూ హల్చల్ చేశాయి. ముఖ్యంగా నటుడు ఆర్యతో కలిపి రకరకాల వదంతులు దొర్లాయి. అలాంటివి అనుష్కను చాలానే ఇబ్బందులు పెట్టాయి. అదీ కాకుండా ఇక్కడి మీడియా తరచూ ఏదో ఒక అసత్యప్రచారం చేస్తూ అనుష్కను మనస్తాపానికి గురి చేసిందనే చింత అనుష్కలో ఏర్పడింది. దీంతో తమిళ మీడియాను దూరంగా పెట్టేశారనేది ప్రచారంలో ఉంది. అదీగాక ఈ మధ్య అనుష్క నటించిన తమిళ చిత్రం ఏదీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ కారణంగానూ కోలీవుడ్‌లో కొన్ని అవకాశాలను అనుష్క వాంటెడ్‌గానే నిరాకరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో అనుష్క కోలీవుడ్‌పై విముఖత చూపిస్తుందనే ప్రచారానికి సోషల్ మీడియా తెరలేపింది. -
చారిత్రక చిత్రంతో శృంగార తార..
సాక్షి, చెన్నై : స్టన్నింగ్ వార్త ఏంటో తెలుసా? శృంగార తారగా గుర్తింపు పొందిన సన్నిలియోన్ తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించడం, అదీ చారిత్రక ఇతివృత్తంతో రూపొందనున్న చిత్రం కావడమే. ఇదంతా ప్రచారంలో ఉన్న విషయమే. అయితే కొత్త విషయం ఏమిటంటే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అమ్రేశ్ సంగీత బాణీలు అందించనున్నారంట. ఆయన తొలి చిత్రం నానే ఇన్నుళ్ ఇల్లై తోనే కథానాయకుడు, సంగీత దర్శకుడు అంటూ జోడెద్దుల సవారీ చేశారు. ఆ తరువాత సంగీతంపైనే దృష్టి సారించిన అమ్రేశ్ మొట్టశివ కెట్టశివ చిత్రానికి సంగీత బాణీలు కట్టి శభాష్ అనిపించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే అమ్రేశ్ సంగీతం అందించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఆడియోకు పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. త్రిష ప్రధాన పాత్ర పోషించిన గర్జన, ప్రభుదేవా హీరోగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, ప్రభు, ప్రభుదేవా కలిసి నటిస్తున్న చార్లి చాప్లిన్–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా సన్నిలియోన్ నటించనున్న చిత్రానికి సంగీతం అందించే అవకాశం అమ్రేశ్‌ను వెతుక్కుంటూ వచ్చింది. స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్సీ స్టీఫెన్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చారిత్రాత్మక కథా చిత్రానికి వీసీ.వడివుడయాన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ అవకాశంపై అమ్రేశ్ స్పందిస్తూ.. ‘చిత్ర కథ అద్భుతంగా ఉంది. ఇందులో సన్నిలియోన్‌కు భారీ పోరాట దృశ్యాలు ఉంటాయి. ఈ చిత్రానికి సంగీతం రూపొందించడానికి విదేశాలకు వెళుతున్నాం. చాలా కొత్త బాణీలను రూపొందించనున్నాను. ఆ తరుణం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా’ అన్నారు. -
కోలీవుడ్ కష్టాలకు కారణం వీళ్లేనా?
తమిళసినిమా: కోలీవుడ్‌లో అప్పుల బాధలు, ఆత్మహత్యలు అధికం అవుతున్నాయి. ఇలాంటి దుస్సంఘటనలు ఇంతకు ముందు లేవా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఉన్నాయి అయితే ఈ పరిస్థితి ఇప్పుడు అధికమించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. గత 21వ తేదీన నటుడు శశికుమార్ అత్తకొడుకు, సహ నిర్మాత అశోక్‌కుమార్‌కు ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పుల భారమే. అందుకు ఫైనాన్సియర్ అన్బుచెళియన్ ఒత్తిళ్లు, బెదిరింపులు, అసభ్య దూషణలు ఒక కారణం కావచ్చు. అయితే ఫైనాన్సియర్ అన్బుచెళియన్ను కోలీవుడ్‌లో ఒక వర్గం తప్పు పడుతున్నా, మరో వర్గం ఆయనకు మద్దతు పలకడం గమనార్హం. మొన్నటి వరకూ ఫైనాన్సియర్ అన్బుచెళియన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారు ఇవాళ ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. దర్శక నిర్మాత సీవీ.కుమార్ అయితే అన్బుచెళియన్పై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. అదే విధంగా పరారీలో ఉన్న అన్బుచెళియన్ ఆచూకీని పోలీసులు ఇంకా కనిపెట్టలేదు. ఆయన ఒక సీనియర్ మంత్రికి చెందిన వారి అండదండలున్నాయని, అందుకుగాను ఆయన్ని పోలీసులు కాపాడే ప్రయత్రం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అశోక్‌కుమార్ బంధువు శశికుమార్‌ను మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. అసలేం జరుగుతోంది? నిజంగా నిర్మాతల ఆత్మహత్యలకు కారణం కందువడ్డీలతో వేధిస్తున్న ఫైనాన్సియర్లేనా? వేరే కారణాలేమైనా ఉన్నాయా? సంక్షోభానికి కారణం దర్శకులు, నటీనటులు కూడావేరే కారణాలు ఉన్నాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అసలు చిత్ర పరిశ్రమ క్షీణించడానికి దర్శకులే కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.చిత్ర నిర్మాణానికి సరైన ప్రణాళికలేని దర్శకులు, కోట్లలో పారితోషికాలు డిమాండ్ చేసే నటీనటులు కారణం అనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాత కేఎస్.శ్రీనివాసన్ పస్తుత పరిస్థితులపై స్పందిస్తూ, అశోక్‌కుమార్ ఆత్మహత్యకు ఫైనాన్స్ సమస్య మాత్రమే కాదన్నారు.మూడేళ్ల క్రితం తాను నిర్మించిన నిమిర్నుదు నిల్ చిత్రం కలిగించిన నష్టం నుంచి ఇప్పటికీ బయట పడలేకపోయానన్నారు. ఇంతకు ముందు దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్ లాంటి వాళ్ల నిర్మాతల పరిస్థితులనడిగి ప్రణాళిక ప్రకారం చిత్రాలను పూర్తి చేసేవాళ్లని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా ఘోరంగా తయారయ్యాయన్నారు. షూటింగ్ చేయడం చాలా సులభం అని, షూటింగ్‌కు ముందు నటీనటులకు, సాంకేతికవర్గానికి కోట్ల రూపాయల్లో పారితోషికాలు చెల్లించి వెళ్లడం చాలా కష్టంగా మారిందని అన్నారు. రూ.కోటి అప్పు చేస్తే అది మూడు నెలలకు వడ్డీతో కలిసి రూ.1.70 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఆత్మాభిమానానికి బాధ్యతకు మధ్య పోరాటంలో ఆత్మాభిమానం ఎక్కువ అయినప్పుడు ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని అన్నారు. ఈ పరిస్థితి మారాలని, సినిమారంగంలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద సహ నిర్మాత అశోక్‌కుమార్ ఆత్మహత్య కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. -
హీరోల రెమ్యునరేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, చెన్నై: ఒక్క సినిమా విజయం సాధిస్తే చాలు అమాంతం రెమ్యునరేషన్ పెంచేస్తారు హీరో, హీరోయిన్లు. అందుకు రకుల్‌ప్రీత్‌సింగ్ ఏమాత్రం అతీతం కాదు. కోలీవుడ్‌లో ఒక్క విజయం కోసం చాలా కాలం ఎదురుచూపులు చూసింది ఈ అమ్మడు. పుత్తగం, తడయార తాక్క, ఎన్నమో ఏదో వంటి చిత్రాల్లో నటించిన రకుల్‌కు వాటిలో ఏ ఒక్కటీ విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో తమిళంలో సక్సెస్ ఎండమావిగా మారడంతో టాలీవుడ్‌పై దృష్టిసారించింది. వరుస విజయాలతో క్రేజీ హీరోయిన్గా చెలామణి అవుతోంది. అలాంటి రకుల్ కోలీవుడ్‌లో విజయదాహాన్ని చాలా కాలం నిరీక్షణ తరువాత ధీరన్ అధికారం ఒండ్రు రూపంలో వరించింది. ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సక్సెస్‌లు ఇస్తున్నా, స్టార్ హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికాన్ని ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించింది. నయనతార లాంటి వారు వరుస విజయాలతో అగ్రకథానాయకిగా రాణిస్తున్నా, లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఆమె రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోందని, అదే స్టార్ హీరోలయితే రూ.15 కోట్లకు పైగా అందుకుంటున్నారని అంది. లేడీ ఓరియంటెడ్ కథాపాత్రల్లో నటిస్తున్న నయనతార చిత్రాలు కమర్షియల్గానూ మంచి వసూళ్లు సాధిస్తున్నా, చాలా తక్కువ పారితోషికం ఇస్తున్నారని విమర్శించింది. తమిళ పరిశ్రమలో పురుషాధిక్యం కొనసాగుతోందని అంటూనే, తన పారితోషికం పెంచాలనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క కోలీవుడ్ చిత్రం కూడా లేదు. అయితే సూర్య సరసన సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఒక చిత్రం, విజయ్ తాజా చిత్రంలోనూ హీరోయిన్గా రకుల్‌ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. -
వర్థమాన సినీ దర్శకుడు మృతి
చెన్నై: కోలీవుడ్ వర్థమాన సినీ దర్శకుడు కన్నన్ రంగస్వామి (27) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తమిళంలో గత మార్చిలో విడుదలైన ‘దాయం’ చిత్రంకు కన్నన్ రంగస్వామి దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రంలో కొత్తవారిని నటీనటులుగా పరిచయం చేశారు. కాగా కన్నన్ రంగస్వామి గతవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై వడపళణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కన్నన్ రంగస్వామి తుదిశ్వాస విడిచారు. దాయం చిత్ర సంగీత దర్శకుడు సతీష్ సెల్వం దర్శకుని మృతదేహానికి అంజలి ఘటించారు. -
బిగ్‌బాస్ బ్యూటీతో యంగ్ హీరో..
సాక్షి, చెన్నై: తెలుగులో లవ్ల్లీ, ప్రేమకావాలి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో ఆది. త్వరలో హీరోయిన్ ఓవియాతో కలిసి కొలివుడ్కు పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో తర్వాత మంచి పాపులారిటీ పెంచుకున్న నటి ఓవియా. ఈ భామకు చిత్రాల అవకాశాలు వరుస కడుతున్నాయి. అందులో ఒకటి కాటేరి. యామిరుక్క భయమే వంటి హారర్ కామేడీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు డీకే తాజాగా ఈ కాటేరికి దర్శకత్వం బాధ్యతలను చేపడుతున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి రాజా మాట్లాడుతూ.. కాటేరి ఎడ్వేంచర్ కామెడీ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హారర్ థ్రిల్లర్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు యువ నటుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారనీ, అందులో ఒకరిగా ఓవియాను ఎంపిక చేసినట్లు ఆయన తెలపారు. మరో ముగ్గురిని ఎరన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు. అదే విధంగా త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని డీకే తెలపారు. కాగా, ఈయన ఇంతకు ముందు జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన కవలైవేండామ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించక పోవడంతో తొలి చిత్రం యామిరుక్క భయమే చిత్ర నేపధ్యం అయినా హారర్నే తన తాజా చిత్రానికి నమ్ముకున్నారని చెప్పవచ్చు. -
చిన్న హీరోలను కాజల్ చిన్నచూపు చూస్తోందా ?
-
శింబు మూవీలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా
-
హారర్ మూవీస్‌తో భయపెట్టబోతున్న త్రిష
-
మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి
అవకాశాల వెంట పరిగెట్టడం ఒక రకం అయితే అవకాశాలను వెతుక్కుంటూ పరుగులు తీయడం మరో రకం. ఇక కళాకారులకు భాషా భేదం ఉండదు. ముఖ్యంగా హీరోయిన్లు ఏ భాషలో మంచి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఏ భాషా చిత్రాల్లో చూసినా పరభాషా కథానాయికల శాతమే అధికంగా ఉంటుంది. ఇక అంజలి విషయానికొస్తే ఈ తెలుగమ్మాయి టాలీవుడ్లో తొలుత హీరోయిన్గా ఎదగాలని ఆశించింది. అరుుతే అంజలి తొలి ప్రతిభకు మొదట్లో టాలీవుడ్ గుర్తించలేదు. దీంతో కోలీవుడ్ పై కన్నేసింది. ఇక్కడ తొలి చిత్రం కట్రదు తమిళ్ నటిగా ఆమెకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. అయితే నటిగా ఎదగడానికి కాస్త సమయం పట్టింది. అంగాడి తెరు చిత్రం అంజలి ప్రతిభకు పట్టం గట్టింది. ఆ తరువాత ఎంగేయుమ్ ఎప్పుదుమ్, కలగలప్పు వంటి చిత్రాలు ఆమెకంటూ ఒక స్థాయిని ఏర్పరచాయి. సరిగ్గా అలాంటి పరిస్థితిలో అంజలి సమస్యల వలయంలోకి వెళ్లిపోయింది. అనూహ్యంగా పినతల్లితో మనస్పర్థలు, ఆమెపై వ్యతిరేకత అంజలిని కోలీవుడ్‌కు దూరం చేశాయి. అనూహ్యంగా హైదరాబాద్ వెళ్లి పినతల్లిపై ఆరోపణలు గుప్పించి కలకలం సృష్టించింది. అదే సమయంలో తెలుగులో వెంకటేష్ వంటి ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఇక అక్కడ తన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని భావించింది. దీంతో కోలీవుడ్‌ను పక్కన పెట్టేసింది. అయితే టాలీవుడ్లో రెండు మూడు చిత్రాలు వచ్చినా ఆ తరువాత అవకాశాలు ముఖం చాటేశాయి. ఇక చేసేది లేక ఈ అమ్మడిప్పుడు మళ్లీ కోలీవుడ్‌పై దృష్టి సారించింది. తెలుగు చిత్రాల్లో నటిస్తున్నందువలన తమిళంలో కొంచెం గ్యాప్ వచ్చిందని నచ్చ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న అంజలి మళ్లీ తమిళ చిత్రాలకు సంబంధించి కథలు వింటున్నానంది. తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నానని దాన్ని పదిలపరచుకోవడానికి మరిన్ని మంచి కథా పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఇకపోతే గ్లామరస్ పాత్రలు పోషించడానికి రెడీనా? అని అడుగుతున్నారని గ్లామరనేది సినిమాలో ఒక భాగమైనందువల్ల అందుకు తన కెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో మంచి పాత్రలను ఆశిస్తున్నట్లు అంజలి పేర్కొంది. -
అజిత్ సలహా ఇచ్చారు
నటుడు అజిత్ చెప్పిన బాటలోనే పయనిస్తున్నానంటోంది నటి పియూ బాజ్‌పాయ్. ఈ ఉత్తరాది భామ కో చిత్రంలో పాత్రకు మంచి మార్కులు కొట్టేసింది. కుర్రకారును కిర్రెక్కించే అందం, చక్కని అభినయం ఉన్నా ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్‌లో సరైన ఆదరణ లభించలేదు. అమ్మడికి అవకాశాలు అడపాదడపానే వస్తున్నాయి. తాజాగా మహిళా దర్శకురాలు, నటి లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వం వహించే చిత్రంలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీ మాట్లాడుతూ లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంది. కోలీవుడ్‌లో తన తొలి చిత్రం పొయ్ సొల్లపోరోంలోనే లక్ష్మీరామకృష్ణన్‌తో కలిసి నటించానని చెప్పింది. లక్ష్మీ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన ఆరోహణం చిత్రం చూసి ఆమెకు అభినందనలు తెలిపానని చెప్పింది. తాజాగా ఆమె దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపింది. ముందుగా ఒక విషయం చెప్పాలంది. తాను ఏకన్ చిత్రంలో నటుడు అజిత్‌తో కలిసి నటించానని తెలిపింది. ఆ తరువాత ఒక సారి ముంబాయిలోను మరో సారి మంగాత్తా షూటింగ్లోను కలిశామని చెప్పింది. అప్పుడాయన తనకో సలహా ఇచ్చారని, అదేమిటంటే అంది వచ్చిన అవకాశాలను అంగీకరించి చేయడం సులభమే, అయితే ఆ పాత్రలపై ప్రత్యేక దృష్టి పెట్టి లీనమై నటించడానికి శ్రమించాలి, అలాగే సాదాసీదా పాటలు అంగీకరించే కంటే నటన ప్రతిభను చాటే పాత్రల కోసం వేచి ఉండటం మంచిది అని సలహా ఇచ్చారన్నారు. తానిప్పుడు ఆయన సలహాను పాటిస్తున్నట్లు పేర్కొంది. ఇంత కాలం తాను ఎదురు చూస్తున్న పాత్రను లక్ష్మీరామకృష్ణన్ దర్శకత్వంలో నటించనున్నట్లు చెప్పింది. ఇది కమర్షియల్ కథా చిత్రం అని చెప్పింది. పెట్రోల్ ధర ఇతివృత్తంగా తెరకెక్కనున్న చిత్రం ఇదని వెల్లడించింది. కుటుంబ నేపథ్యం ఉంటుందని ఇందులో తనది చాలా బలమయిన పాత్ర అని చెప్పింది. ఇంతకు ముందు నటించిన చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా తన పాత్రకు ప్రశంసలు లభించాయని అంది. అయితే ఇకపై అజిత్ సలహాను పాటిస్తూ చిత్రాల ఎంపికలో తగు జాగ్రత్తలను తీసుకోనున్నట్లు పియా బాజ్‌పాయ్ పేర్కొంది. -
ఆ చిత్రాల మధ్య పోటీ లేనట్లేనా?
భారతీయ సినిమా మాత్రమే కాదు ప్రపంచ సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలు కోచ్చడయాన్, విశ్వరూపం-2. ఒక చిత్రంలో విశ్వ నటుడు కథనాయకుడు కాగా మరో చిత్రంలో ఇండియన్ సూపర్ స్టార్ హీరో. ఈ రెండు చిత్రాలు సాంకేతికపరంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతుండడం మరో విశేషం. భారీ తారాగాణంతో అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకుంటున్న కోచ్చడయాన్, విశ్వరూపం-2 చిత్రాలు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రా లు ఒకేసారి తెరపైకి రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యం అయ్యేలా కనిపించడంలేదు. కోచ్చడయాన్ చిత్ర ఆడియోను ఈ నెల 28న, చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎప్పటిలానే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. మార్చి 9న ఆడియో విడుదల చేయనున్నట్లు మరోసారి ప్రకటించారు. అయితే చిత్రం విడుదల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. విశ్వరూపం -2 విడుదల తేదీ మాత్రం మరోసారి వాయిదాపడనున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తి అయిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కోచ్చడయాన్‌కు పోటీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇందుకు బయ్యర్లు ఒప్పుకోవడంలేదని తెలిసింది. రెండు భారీ చిత్రాలు ఒకేసారి విడుదలయితే వసూళ్లు తగ్గిపోతాయని బయ్యర్లు అంటున్నారు. దీంతో విశ్వరూపం -2 చిత్రాన్ని కోచ్చడయాన్ చిత్రం విడుదలైన వారం తరువాత విడుదల చేయడానికి కూడా వారు అంగీకరించడంలేదు. అందువల్ల విశ్వరూపం-2 మే నెలకు వాయిదాపడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.