తమిళసినిమా: నటుడు జీవా తాజాగా భారీ బ్ర హ్మాండ హారర్, థ్రిల్లర్ కథా చిత్రంతో వచ్చే ఏడాది పొంగల్ అనంతం థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు బ్లాక్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో హిట్ కొట్టిన ఈయన తాజాగా నటించిన చిత్రానికి అగత్యా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటించగా నటుడు అర్జున్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2025లో పొంగల్ అనంతం జనవరి 31న తమిళం తెలుగు హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర టైటిల్‌తో పాటు వీడియోను క్రిస్మస్ పండగ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇది అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అని నిర్మాత ఐసరి గణేష్ పేర్కొన్నారు. ఇందులో మన సంసతని, మానవ అనుబంధాలు ఉంటాయని చెప్పారు. మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలన్నదే తమ భావన అన్నారు. ఆ విధంగా వెర్సెస్ డెవిల్స్ అనే ఇతివత్తంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనీష్ అర్జున్ దేవ్‌కు చెందిన వామ్ ఇండియా సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు.
దర్శకుడు కుమార్ పెరియస్వామి, ధనుష్
Comments
Please login to add a commentAdd a comment