కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.
గతంలో 2019లో ధనుశ్‌తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు.
అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్‌గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment