మలయాళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా కాల్ చేయలేదని అన్నారు. అసలేం జరిగిందో కూడా తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్ అవసరమైనప్పుడు ఎవరూ సహకరించలేదని అసహనం వ్యక్తం చేశారు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ..' ఈ విషయం గురించి మాట్లాడుతున్నందుకు ఎంతో బాధగా ఉంది. 2017లో నా సినిమా ధృవ నచ్చితిరమ్(తెలుగులో ధృవనక్షత్రం) విడుదల కాలేదు. కానీ ఇండస్ట్రీలో నాకు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. కనీసం నా సమస్య గురించి ఎవరూ కూడా ఫోన్ చేయలేదు. అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. కేవలం ధనుశ్ సార్, లింగుసామి లాంటి వ్యక్తులు నా సినిమా చూశారు. విడుదల చేసేందుకు ప్రయత్నిచారు. కానీ వారికి ఉన్న సమస్యల వల్ల వీలుకాలేదు. మరికొందరికి ఈ సినిమా చూపించాను. కానీ కొన్ని సమస్యల వల్ల ఎవరూ ముందుకు రాలేదు. ప్రేక్షకులు ఇప్పటికీ సినిమాని చూడాలని కోరుకుంటున్నందు వల్లే ఇంకా నేను బతికి ఉన్నా.' అని అన్నారు.
కాగా.. 2017లో విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ధృవ నచ్చతిరమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రీతూ వర్మ, ఆర్ పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఏడేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. దీనిపై ఇప్పటికే పలుమార్లు గౌతమ్ వాసుదేవ్ మేనన్ అసహనం వ్యక్తం చేశారు. గౌతమ్ చాలా సంవత్సరాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు.
నటుడిగా రాణిస్తున్న డైరెక్టర్
గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటనలో దూసుకెళ్తున్నారు. చివరిసారిగా 2024లో రత్నం, హిట్ లిస్ట్, హిట్లర్. విడుతలై పార్ట్- 2 చిత్రాలలో కనిపించాడు. అంతే కాకుండా త్వరలో వరాహం, బజూకా, తలపతి 69 చిత్రాల్లో నటించనున్నాడు. త్వరలోనే మలయాళంలో డొమినిక్ అండ్ లేడీస్ పర్స్ అనే మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 23న విడుదలవుతోంది. అతని చివరిసారిగా దర్శకత్వం వహించిన 2024 చిత్రం జాషువా ఇమై పోల్ కాఖా ఇంకా విడుదల కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment