
ప్రముఖ మలయాళ నటుడు శ్యామ్ మోహన్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. లగ్జరీ కంపెనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తన భార్య గోపికతో కలిసి కారు ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
కాగా.. ప్రేమలు, అమరన్ చిత్రాలతో మెప్పించిన మలయాళ నటుడు శ్యామ్ మోహన్. ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలో శ్యామ్ మోహన్ నటించాడు. ఈ సినిమా తర్వాత మలయాళంలోనే నునాకుజి అనే చిత్రంలోనూ కనిపించారు. ఇటీవల విడుదలైన అమరన్ మూవీలో కీలక పాత్ర పోషించాడు. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ దీపావళి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment