
రొమాంటిక్ సినిమాలు తెరకెక్కించాలనుంది.. కానీ దక్షిణాదిలో ఏ హీరో కూడా అందుకు ఒప్పుకోవడం లేదు అంటున్నాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి (Bengaluru International Film Festival) గౌతమ్ బుధవారం హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజుల్లో ఏ హీరో కూడా రొమాంటిక్ సినిమాలు చేయాలనుకోవడం లేదు.
అందుకే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నా..
తెలుగు (Tollywood), తమిళం.. కన్నడలో కూడా పలువురు హీరోలను సంప్రదించాను. రొమాంటిక్ కథ ఉందని చెప్పగానే వాళ్లు మీటింగ్‌ను వాయిదా వేస్తున్నారు. కొందరేమో కలవడానికే ఇష్టపడటం లేదు. అది ఎందుకనేది మీరే వారిని అడగండి అన్నాడు. అయితే నా దగ్గర కథలకు కొదవలేదు. అందుకే ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నాను.
అదే పెద్ద ఛాలెంజ్
సినిమాలు తెరకెక్కించడమన్నా.. ప్రజలను థియేటర్‌కు తీసుకురావడమన్నా నాకెంతో ఇష్టం. అదే సమయంలో నేను తీసే ప్రతి చిత్రం కూడా ప్రయోగాత్మకమైనదే! కాఖా కాఖా చిత్రం రిలీజైన మొదట్లో ఎవరూ పెద్దగా ఇష్టపడలేదు. కానీ నెమ్మదిగా అది అందరికీ నచ్చింది. ఓటీటీలకు జనాలు అతుక్కుపోయిన ఈ రోజుల్లో వారిని థియేటర్‌కు రప్పించడం దర్శకనిర్మాతలకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. దీనికి ఎలాంటి మార్గం కనిపెట్టాలో నాకూ అర్థం కావడం లేదు.
డైరెక్టర్లను తిడుతున్నారు
వేందు తైంతదు కాడు సినిమాను ఆదరించిన జనాలు జోషువాను మాత్రం తిరస్కరించారు. తెలుగు, తమిళంలో ఇప్పటికీ జనాలు థియేటర్‌కు వస్తుండటం విశేషం. సినిమా రివ్యూలు కూడా ఎలా ఉంటున్నాయంటే పర్సనల్ టార్గెట్ చేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో దర్శకుడిని బండబూతులు తిడుతున్నారు. రచయితను కూడా వదలడం లేదు. ఇలాంటివాళ్లు సొంతంగా ఓ సినిమా తీయాలని కోరుతున్నాను అని చెప్పుకొచ్చాడు.
చదవండి: బంగారం అక్రమంగా తరలిస్తున్న హీరోయిన్.. ఏకంగా డీజీపీ కూతురేనట!
Comments
Please login to add a commentAdd a comment