Gautham Vasudev Menon
-
స్టార్ హీరో మూవీ వాయిదా.. డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్!
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం చిత్రం ధృవనచ్చితిరం. స్పై, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. అయితే ఊహించని విధంగా సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన గౌతమ్ మీనన్ అభిమానులకు షాకిచ్చాడు. అయితే తాజాగా ఆయన ఓ లేఖను పోస్ట్ చేశారు. ధృవనచ్చితిరం త్వరలోనే మీ ముందుకు వస్తుందని గుడ్ న్యూస్ చెప్పారు. దర్శకుడు లేఖలో రాస్తూ.. ''ఒక విజన్, అభిరుచి, అంకితభావంతో ధృవ నచ్చితిరాన్ని తెరకెక్కించాం. మాకు ఎంత వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ ముందుకు తీసుకురావడానికి యత్నిస్తున్నాం. నవంబర్ 24న విడుదల చేయనందుకు అభిమానులు నిరాశకు గురైన మాట వాస్తవమే. ఇప్పటికీ మేము సినిమా రిలీజ్ విషయంలో ప్రేక్షకులకు భరోసా ఇవ్వడానికే పోస్ట్ చేస్తున్నా. మూవీకి ఉన్న అడ్డంకులను తొలగించి ధృవ నచ్చితిరమ్‌ను త్వరలోనే మీముందుకు తీసుకొస్తాం' అని అన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఇప్పటికైనా వివాదాలు తొలగిపోయి మూవీ రిలీజ్ కావాలని విక్రమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఆర్. పార్తిబన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, వినాయకన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. #DhruvaNatchathiram@OndragaEnt @oruoorileoru pic.twitter.com/Bbcn32sgWM — Gauthamvasudevmenon (@menongautham) November 28, 2023 -
విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' వాయిదా.. చివరి క్షణంలో నిర్ణయం!
కోలీవుడ్ టాప్ హీరో 'విక్రమ్' నటించిన చిత్రం 'ధ్రువ నక్షత్రం'. స్పై, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో 'గౌతమ్ మేనన్' దీనిని సిద్ధం డైరెక్ట్ చేశారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని 2017లో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. చిత్రీకరణ పూర్తైనప్పటికీ అనుకోని కారణాలతో ఈ చిత్రం వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు నవంబర్ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే విక్రమ్ అభిమానులు టికెట్లు కూడా కొన్నారు. కొన్ని గంటల్లో బొమ్మ థియేటర్లలో పడుతుండగా తాజాగా ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు గౌతమ్ మేనన్ ప్రకటించారు. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గౌతమ్ మేనన్ ఏం చెప్పారంటే ఈరోజు విడుదల కానున్న ధ్రువ నక్షత్రం చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల నేడు ఈ సినిమా విడుదల చేయడం లేదు. అందుకు గాను నన్ను క్షమించండి. సినిమా విడుదల కోసం చాలా ప్రయత్నించాను. మరో రెండు రోజుల్లో ఈ సినిమాపై ప్రకటన ఇస్తాం. ఈ సినిమా అందరికీ అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు. కారణం ఏంటి..? కోలీవుడ్‌లో శింబు నటించిన 'సూపర్ స్టార్' చిత్రానికి దర్శకత్వం వహించేందుకు వాసుదేవ్ మీనన్ ఆల్ ఇన్ పిక్చర్స్ నుంచి రూ.2.40 కోట్లు తీసుకున్నారని, అయితే ఆ సినిమా పనులు పూర్తి చేయలేదని, సంస్థకు డబ్బులు తిరిగి చెల్లించలేదని గతంలో వార్తలు వచ్చాయి. తదనంతరం, డబ్బు తిరిగి ఇవ్వకుండా ధృవ నక్షత్రం విడుదల చేయవద్దని నిర్మాణ సంస్థ ఆల్ ఇన్ పిక్చర్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈరోజు (నవంబర్ 24) ఉదయం 10.30 గంటలలోపు ఆన్ ఇన్ పిక్చర్స్‌కు రూ. 2 కోట్ల రూపాయలను తిరిగి ఇస్తే సినిమా విడుదల చేస్తామని కోర్టు షరతులు విధించింది. దీంతో ధ్రువ నక్షత్రం సినిమాకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. #DhruvaNatchathiram #DhruvaNakshathram pic.twitter.com/dmD4ndEnp9 — Gauthamvasudevmenon (@menongautham) November 23, 2023 -
డైరెక్టర్‌ను వీడని కష్టాలు.. స్టార్ హీరో సినిమా రిలీజ్‌పై సస్పెన్స్!
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, స్టార్ హీరో చియాన్ విక్రమ్ కాంబోలో వస్తోన్న చిత్రం ధృవనచితిరం. తెలుగులో ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమా ప్రకటించి ఎనిమిదేళ్లు పూర్తి కావోస్తోంది. 2016లో ప్రకటించినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈనెల 24న థియేటర్లలో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ప్రకాశ్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ!) రూ.8 కోట్ల డిమాండ్! ధృవ నచ్చతిరమ్ సినిమా విడుదల కావాలంటే రూ.8 కోట్లు చెల్లించాలని కొందరు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మద్రాస్ కోర్టులో ఉన్న అన్ని సమస్యలను క్లియర్ చేయడానికి డబ్బు చెల్లించాల్సిందిగా కొందరు అడిగినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో సినిమా విడుదలకు కొన్ని గంటలే ఉండడంతో రిలీజ్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బెంగళూరు, కొన్ని ఓవర్సీస్ సెంటర్స్ లో కూడా ధృవ నక్షత్రం సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. దీంతో సినిమా విడుదలపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ సినిమాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో అన్ని సమస్యలను క్లియర్ చేయడానికి డైరెక్టర్ గౌతమ్ మీనన్ మద్రాస్ హైకోర్టులో రూ.8 కోట్ల మొత్తాన్ని చెల్లించాలని కోరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. డిస్ట్రిబ్యూటర్స్ మద్దతు అయితే మరోవైపు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత ధృవ నచ్చితిరమ్ సాఫీగా విడుదలవుతుందని సమాచారం. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ గౌతమ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ చేసేందుకు గౌతమ్ తన ఒంటరి పోరాటం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూల్లో ఒక్కడే పాల్గొంటున్నారు. గౌతమ్ కలల ప్రాజెక్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలల ప్రాజెక్ట్‌గా ధృవ నచ్చితిరమ్ ఎనిమిదేళ్ల తర్వాత తెరకెక్కించారు. తనకు నటనపై ఆసక్తి లేదని.. సినిమా నిర్మించేందుకు నిధుల కోసమే సినిమాల్లో నటించానని ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. కాగా.. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రంలో రీతూ వర్మ, వినాయకన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
డైరెక్టర్ సాహసం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మూవీ రీమేక్!
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వ శైలి అందరికంటే కాస్తా స్టైలిష్ గా ఉంటుంది. మిన్నలే చిత్రం నుంచి ఇటీవలే శింబు కథానాయకుడిగా రూపొందించిన వెందు తనిందదు కాడు చిత్రం వరకు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ మీనన్ నటుడుగా మారి చాలాకాలమే అయ్యింది. పలు చిత్రాలలో ముఖ్యపాత్రను పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన ఈయన ఇకపై నటించను అనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. నటించడం తనకు ఇష్టం లేదని నిర్ణయాన్ని కూడా శనివారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కాగా.. గౌతమ్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువ నక్షత్రం. ఈ మూవీ అనివార్య కారణాల వల్ల చాలా కాలం నిర్మాణ పనులు సాగాయి. ఎట్టకేలకు ఈ నెల 24వ తేదిన చిత్రం భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. దీని గురించి చెప్పిన దర్శకుడు గౌతమ్ మీనన్ తాను చెప్పిన కథ నచ్చడంతో విక్రమ్ మరో మాట చెప్పకుండా నటించడానికి సమ్మతించారన్నా రు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పలు దేశాల్లో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరు లు సిటీ నేపథ్యంలోనే చిత్రాలు చేస్తున్నారు.. గ్రామీణ నేపథ్యంలో చిత్రం చేసే ఆలోచన లేదా అన్న ప్రశ్నకు తనకు అలాంటి కోరిక ఉందని చెప్పారు. అయితే వెందు తనిందదు కాడు చిత్రంలో ప్లాస్టర్లను గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించారనని.. అయితే అది కొందరికి నచ్చలేదని చెప్పా రు. ఆ కారణంగానే చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిందనే భావన ఉందన్నారు. మీకు పాత చిత్రాల్లో దేనిని రీమేక్ చేయాలని ఉంది అన్న ప్రశ్నకు.. శివాజీ గణేషన్, రాధ నటించిన మొదల్ మర్యాదై చిత్రాన్ని రీమేక్ చేస్తానని చెప్పారు. అందులో శివాజీ గణేషన్ పాత్రలో కమలహాసన్‌ను ఎంపిక చేస్తానని చెప్పారు. మొదటి సినిమా మొదల్ మర్యాదైలో తన నటనతో రాధ ప్రసంశలు అందుకుంది. -
'ఆయనతో పని చేయడం చాలా కష్టం'.. జైలర్ విలన్‌పై డైరెక్టర్ కామెంట్స్!
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తాజా చిత్రం 'ధృవ నచ్చిత్తిరం'. తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వినాయకన్‌తో పనిచేయడం చాలా కష్టమని తెలిపారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. 'వినాయకన్‌ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యారెక్టర్ స్టైల్, కాస్ట్యూమ్, క్యారెక్టర్‌కి ఎలాంటి మూడ్ ఇవ్వాలనుకుంటున్నానో అతనికి స్పష్టంగా వివరించాలి. ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో వినాయకన్‌కి విక్రమ్ మేకప్ వేయాల్సి వచ్చింది. వినాయకన్ సర్ ఓ ఫైట్ సీన్లో గాయపడ్డారు. ఆ తర్వాత విక్రమ్, వినాయకన్ ఇద్దరూ కలిసి ఆ సీన్ ఎలా చేయాలో చర్చించుకున్నారు. అయితే వినాయకన్ ఇంత స్టైలిష్‌గా మరే సినిమాలోనూ కనిపించలేదు. అతని డైలాగ్స్, స్వాగ్, మ్యానరిజమ్ అద్భుతంగా ఉన్నాయని' అన్నారు. మొదట ఈ సినిమాలో విలన్ కోసం వెతుకుతున్నప్పుడు అతని పేరును నటి దివ్యదర్శిని సూచించింది. అతని సినిమాలు చూశాక.. విలన్‌గా ది బెస్ట్ అనిపించించిదని గౌతమ్ మీనన్ తెలిపారు. ఈ సినిమాలో అతనే బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చాడు. ఇటీవలే డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయాడు. కానీ నేను అతని నుంచి మరో రోజు ఆశించా. కానీ దొరకలేదు. వినాయకన్‌కి ఫోన్లో మెసేజ్ పెట్టా. సార్ మీరు ఈ సినిమాలో ఎంత బాగా చేశారో మీకు తెలియదు. ఈ విషయం సినిమా విడుదలయ్యాక మీకే అర్థమవుతుంది. ఇందులో విక్రమ్ సార్ హీరోగా నటించడం నా అదృష్టం.' అని గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. కాగా.. జైలర్ తర్వాత వినాయకన్ మరోసారి విలన్‌గా అలరించనున్నారు. తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ధృవ నచిత్తిరం'. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్‌లో వినాయకన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. పార్తీపన్, మున్నా, సిమ్రాన్, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
Leo Success Meet: విజయ్ ‘లియో’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
అదిరిపోయే కాంబినేషన్లో 'హిట్లర్'గా వస్తున్న విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ.. విభిన్నమైన కథలతో పాటు తన సూపర్ టాలెంట్‌తో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. బిచ్చగాడు2తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోని ఆ తర్వాత 'హత్య' అంటూ పలకరించినా అది పెద్దగా మెప్పించలేదు. తాజాగా మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. దానికి హిట్లర్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పేరుతో ఇప్పటికే చిరంజీవి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. దీంతో సులభంగా హిట్లర్ పేరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుందనే ఈ టైటిల్ పెట్టినట్లు టాక్. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం విశేషం. చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. (ఇదీ చదవండి; నటి హరితేజ విడాకులు.. వైరల్‌గా మారిన పోస్ట్) విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ మూవీని నిర్మించిన వారు ఆయనతో మరో సినిమా చేస్తుండటం విశేషం. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలుగా ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. అయితే దీనిని అన్ని భాషల్లో లాంచ్ చేశారు. 'హిట్లర్' సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. 'ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఒక నియంతను ఎదుర్కొనే సాధారణ పౌరుడి కథే హిట్లర్.' అని చెప్పారు. మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. ట్రైన్ జర్నీలో ఉన్న విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ను ఎదుర్కొన్నట్లు చూపించారు. ఇదే ట్రైన్లో హీరోయిన్ రియా సుమన్‌ను హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తూ గౌతమ్ మీనన్ కొత్త లుక్‌లో కనిపించారు. త్రీడీ యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందించిన ఈ మోషన్ పోస్టర్లో చివరగా విజయ్ ఆంటోని జోకర్ గెటప్‌లో దర్శనమిచ్చాడు. ఇప్పుడు ఇదీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. -
ఐదేళ్ల తర్వాత విక్రమ్ సినిమాకు మళ్లీ మోక్షం.. సంతోషంలో ఫ్యాన్స్
నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువనక్షత్రం. నటి రీతూ వర్మ నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం 2017లోనే ప్రారంభం అయ్యింది. షూటింగ్ కొంత భాగం లండన్‌లో జరుపుకుంది. (ఇదీ చదవండి: మిద్దరం ఎలాంటోళ్లమంటే.. ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వెళ్లే వాళ్లం) ఇందులో నటుడు విక్రమ్ జాన్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించారు. 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల కాలేదు. ఈ చిత్రం విడుదల గురించి పలుమార్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఐదేళ్లు దాటినా ధ్రువనక్షత్రం ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. ఇంతకు ముందే చిత్రం లోని ఒక పాటను విడుదల చేశారు. తాజాగా రెండో పాటను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో త్వరలోనే జాన్‌ను చూస్తారు అని పేర్కొన్నారు. దీంతో ధ్రువనక్షత్రం చిత్రానికి త్వరలోనే మోక్షం లభిస్తుందని తెలుస్తోంది. దీంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం తర్వాత ధ్రువనక్షత్రం రాబోతోందని విక్రమ్ అభిమానులు ఆనందంతో ఎదురు చూస్తున్నారు. (ఇదీ చదవండి: త్రిషకు మరో అవకాశం ఇచ్చిన సూపర్ హిట్ డైరెక్టర్) -
ఆ డైరెక్టర్ స్పూర్థితోనే సినిమాల్లోకి వచ్చాను : గౌతమ్ మీనన్
పటాన్చెరు టౌన్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన నాయగన్ సినిమా తాను సినీ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ అని, ఆ సినిమాలో ఉన్న వాటిని తన సినిమాల్లో చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రసిద్ధ భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రివైండ్ ద మిలీనియమ్ ఇతివృత్తంతో సోమవారం నిర్వహించిన టెడ్ఎక్స్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తాను అనుకున్నది, తన జీవితంలో ఎదురైన సంఘటలనే సినిమాగా తీస్తానన్నారు. కష్టపడకుండా ఏదీ సాధించలేమని, ఏదైనా ఒక కళలో నెపుణ్యం సాధించాలంటే పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సవితా శాస్త్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండీ మ్యూజిక్ ఆర్టిస్ట్ నితీశ్ కొండపర్తి, సిస్సీ ఐస్ పాప్స్ వ్యవస్థాపకుడు రని కాబ్రా, విద్యార్థులు పాల్గొన్నారు. -
చైతూతో ‘ఏ మాయ చేశావే- 2’.. హీరోయిన్ సమంత కాదట!
సమంత, నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. 2010లో వచ్చిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక ఆన్ స్క్రీన్‌పై చై-సామ్‌ల కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో మొదలైన వీరి స్నేహం ఆ తర్వాత ప్రేమ, పెళ్లి దాకా వెళ్లింది. కానీ వీళ్ళ వివాహబంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లి చేసుకున్న నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏమాయ చేశావే సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా, త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీక్వెల్లో నాగచైతన్యనే హీరోగా నటించనుండగా, సమంత స్థానంలో రష్మిక నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా విడాకులు తీసుకున్నాక చై-సామ్ ఎదుర్కొన్న సమస్యలను కూడా సినిమాలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. -
‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది: గౌతమ్ మీనన్
‘‘ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచం, సినిమా పరిశ్రమ చిన్నవి అయిపోయాయి. ఇతర భాషల సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే సినిమాకు భాష లేదు. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ చిత్రంలో కొన్ని పాత్రలు హిందీ మాట్లాడతాయి. ఈ డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది’’ అని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అన్నారు. శింబు కథానాయకుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ‘వెందు తనిందదు కాడు’. సిద్ధీ ఇద్నాని కథానాయిక. ఇషారి.కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాను ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ టైటిల్‌తో శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ఈ నెల 17న తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ మాట్లాడుతూ–‘‘పల్లెటూరులో జీవించే ముత్తు ముంబై వెళ్లి, అనుకోకుండా చీకటి ప్రపంచంలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఎలా బయట పడ్డాడు? అన్నదే కథ. రెహమాన్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కథ డిమాండ్ చేయడంతోనే ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నాం. ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ను తెలుగులో ‘స్రవంతి’ రవికిశోర్‌గారు విడుదల చేయడం హ్యాపీ. నేను, రామ్ చేయాలనుకుంటున్న మూవీ వేసవి తర్వాత ఉండొచ్చు. కమల్‌హాసన్‌గారితో ‘రాఘవన్ 2’ చేయాలనే ప్లాన్ ఉంది. వెంకటేష్‌గారితో ‘ఘర్షణ 2’, నాగచైతన్యతే ‘ఏ మాయ చేసావె 2’ చేయాలనుంది. విక్రమ్‌తో నేను తీసిన ‘ధృవనక్షత్రం’ ఈ డిసెంబరులో రిలీజ్ అవుతుంది’’ అన్నారు. -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
డైరెక్టర్ మణి నాగరాజ్ గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన దర్శకుడు గౌతమ్ మీనన్ వదద్ద కాక్క కాక్క చిత్రం నుంచి విన్నైతాండి వరుసవాయా చిత్రం వరకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్, శ్రీదివ్య జంటగా నటించిన పెన్సిల్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం వాసువిన్ కర్ఫైణెగన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. స్థానిక పలసరవాక్కంలో నివాసం ఉంటున్న ఆయన గురువారం గుండపోటుతో హఠాన్మరణం చెందారు. నాగరాజ్ మృతి చిత్ర పరిశ్రమకు దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Shocked & saddened to know about the passing away of film-director Mani Nagaraj, former associate of Gautham Vasudev Menon. He's the one who taught me the basics of post-production. A good friend & a great teacher gone too soon. Rest in Peace, Mani Ji. You will be missed. 💔🕯️🌹 — T.S.Suresh (@editorsuresh) August 25, 2022 So sorry to know about the passing of director of Pencil, Mani Nagaraj. Deepest condolences @gvprakash and everyone associated with him. — Lyricist Parvathy (@theparvathy) August 25, 2022 -
చియాన్ విక్రమ్ 'ధ్రువ నక్షత్రం' చిత్రీకరణ పూర్తి కానుందా?
Gautham Vasudev Menon Shares Photo With Chiyaan Vikram: చియాన్ విక్రమ్, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ధ్రువ నక్షత్రం'. ఐశ్వర్య రాజేష్, నీతూ వర్మ, సిమ్రాన్, నటుడు పార్తీపన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను చాలా భాగం విదేశాల్లో నిర్వహించడం, ఆ మధ్య విడుదలైన 'ఒరు మనం' అనే సింగిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2017లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షూటింగ్ దశలోనే ఉండటం విక్రమ్ అభిమానులను నిరాశ పరుస్తోంది. ఈ నేపథ్యంలో విక్రమ్ ఇటీవల దర్శకుడు గౌతమ్ మీనన్‌ను కలిసి 'ధ్రువ నక్షత్రం' చిత్ర షూటింగ్ విషయాల గురించి చర్చించడం శుభ పరిణామం. వీరిద్దరూ కలిసిన ఫొటోలను దర్శకుడు గౌతమ్ మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిపై విక్రమ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం విక్రమ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన 'కోబ్రా' చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన చరిత్రాత్మక కథా చిత్రం 'పొన్నియిన్ సెల్వన్' సినిమా తొలిభాగం సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కానుంది. కాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటించే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మరి 'ధ్రువ నక్షత్రం' ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి మరి. చదవండి: ఒక్క సినిమాకు రూ. 20 కోట్లు తీసుకున్న హీరోయిన్! క్వాలిటీ శృంగారంపై హీరోయిన్‌కు నిర్మాత ప్రశ్న.. హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్ చేసుకోవాలని ట్వీట్ View this post on Instagram A post shared by Gautham Menon (@gauthamvasudevmenon) -
'మేజర్ సెల్వన్'గా ప్రముఖ డైరెక్టర్..
Gautham Menon As Major Selvan First Look Out: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల 'బ్రిగేడియర్ విష్ణు శర్మ' పాత్రలో నటిస్తున్న సుమంత్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గౌతమ్ 'మేజర్ సెల్వన్'గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ విడుదల కాగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం Attention Everyone! 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐞𝐥𝐯𝐚𝐧 is here! Here's the first look of @menongautham from #SitaRamam.https://t.co/HNfYz5h9Yy@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth#SitaRamamOnAug5 pic.twitter.com/oUkrUIf6EE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2022 -
ఇది నిజంగా షాకింగ్‌గా, భయంకరంగా ఉంది: నటుడు
తమిళ చిత్రం 'అంబు సెల్వన్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే రిలీజైంది. 'ద కాప్ డెవిల్' అనేది ఉపశీర్షిక. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ప్రముఖ నటుడు విష్ణు, దర్శకుడు పా రంజిత్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. అయితే తాను ఈ సినిమాలో ఎప్పుడు నటించానని ఆశ్చర్యపోతున్నాడు గౌతమ్. 'ఇది షాకింగ్ న్యూస్. ఈ సినిమా గురించి నాకేం తెలీదు. పోస్టర్లో ఉన్న దర్శకుడిని నేనెప్పుడూ కలవలేదు, అతడెవరో కూడా తెలియదు. పెద్దపెద్దవాళ్లతో నిర్మాతలు ఈ పోస్టర్‌ను ట్వీట్ చేయిస్తున్నారు. నాకే తెలియకుండా నేను సినిమా చేస్తున్నట్లు అభూత కల్పన చేయడం నిజంగా షాకింగ్‌గా, భయంకరంగా ఉంది' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. అయితే అతడి వ్యాఖ్యలను నిర్మాణ సంస్థ ఎంఎం స్టూడియోస్ కొట్టిపారేసింది. అతడు కూడా సినిమాలో భాగమేనని చెప్తూ రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో గౌతమ్ నటుడు వివేక్ ప్రసన్నతో కలిసి నటించినట్లుగా ఉంది. మరి దీనిపై గౌతమ్ మీనన్ ఏమని స్పందిస్తాడో చూడాలి!. This is shocking & news to me.I have no idea what this film is that I’m supposed to be acting in.I don’t know or haven’t met the director whose name is on this poster.Producer has got big names to tweet this. It’s shocking & scary that something like this can be done so easily. https://t.co/CnMaB3Qo90 — Gauthamvasudevmenon (@menongautham) November 3, 2021 -
కాలిన గాయాలతో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా?
Vendu Thanindathu Kadhu Movie: మాసిన చొక్కా, పైకి కట్టుకున్న లుంగీ, శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఆయుధంగా పొడవాటి కర్ర, ఏదో ఆపద సంభవించిందన్నదానికి ప్రతీకగా భూమి మీద మండుతున్న గడ్డి.. పై ఫొటో చూస్తుంటే హీరో ఏదో పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లే కనిపిస్తున్నాడు. ఇంతకీ ఈ హీరోను గుర్తుపట్టారా? తమిళంలో ఈయన పెద్ద స్టార్. మన్మధ, వల్లభ, పోకిరోడు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన సుపరిచితుడే. పోస్టర్లో ఉన్నదెవరో మీకీపాటికే అర్థమైపోయుంటుంది. అతడు స్టార్ హీరో శింబు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు ఓ సినిమా చేస్తున్నాడు. నేడు(ఆగస్టు 6) ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'నదిగలిలే నీరాడుం సూరియన్' అని గతంలో పెట్టిన టైటిల్‌ను మార్చివేసి 'వెందు తనిందదుక్కాడు' అని కొత్త టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్లో అడవిలో అంటుకున్న కార్చిచ్చులో శింబు గాయపడినట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె గణేశ్, అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. శింబు ప్రస్తుతం మానాడుతో పాటు పాతు కల(కన్నడ 'ముఫ్తీ' రీమేక్) సినిమాలు చేస్తున్నాడు. Here’s the title and first look of the new film with @TRSilambarasan @arrahman @IshariKGanesh@VelsFilmIntl @Ashkum19 Thank you to everybody who made this possible pic.twitter.com/6LY9icJuSd — Gauthamvasudevmenon (@menongautham) August 6, 2021 -
జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది?
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా కనిపించిన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ‘విన్నైతాండి వరువాయ’ పేరిట తమిళంలో విడుదలైన ఈ చిత్రంలో త్రిష, శింబులు కార్తీక్, జెస్సీలుగా నటించారు. తాజాగా శింబు- త్రిషలపై ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు గౌతమ్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో శింబు, త్రిషకి కాల్ చేయడమే కథాంశం. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది సన్నివేశాలుగా చూపించారు. ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఎవరి ఇంట్లో వారుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఇక ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతాన్ని అందించడం మరో విశేషం. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో చైతూ, సామ్‌లతో ఈ విధంగానే ఓ షార్ట్ ఫిలిం చేస్తే బాగుంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. చదవండి: రానా నిశ్చితార్థం జరిగిపోయిందా? సినిమాలకు సడలింపులు ఇవ్వాలి -
‘కార్తీక్ మీ రచనలు చాలా అందంగా ఉంటాయి’
నాగ చైతన్య, సమంత కాంబినేషనన్లో 2010లో వచ్చిన ఏ మాయ చేశావే చిత్రం ఎంతటి మాయ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జెస్సీగా సమంత కుర్రకారు మదిని దోచింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కింది ఈ చిత్రం. తెలుగులో నాగ చైతన్య, సమంత మాయ చేస్తే.. తమిళంలో త్రిష-శింబు ప్రేక్షకుల మది దోచారు. ఈ చిత్రం పూర్తయ్యి ఇప్పటికి పదేళ్లు పూర్తయ్యాయి. తాజాగా గౌతమ్ మీనన్ విన్నైతాండి వరువాయకి కొనసాగింపుగా కార్తీక్ డయల్ సేత్యా యెన్ షార్ట్ ఫిల్మ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్రిష, శింబులు ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించగా.. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు.(శ్రీమతికో కేక్) లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు ఏవి జరగడం లేదు. దాంతో డైరక్టర్లు, రచయితలు కొత్త రచనలు చేస్తూ, షార్ట్ ఫిల్మ్‌లు తీస్తూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గౌతమ్ మీనన్ ఈ కార్తిక్ డయల్ సేత్యా యెన్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. అంతేకాక ఇటీవల షార్ట్ ఫిల్మ్ మేకర్స్ దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు.(చైతూకి 49, సమంతకు 51: సామ్ ట్వీట్!) ఈ టీజర్లో జెస్సీ(త్రిష), కార్తీక్(శింబు)ను ఉద్దేశించి ‘రాయండి.. మీ రచనలు చాలా అందంగా ఉంటాయి. అయితే బలవంతంగా ప్రయత్నించకండి. మీరొక ఆర్టిస్ట్.. ఏదైనా సహజంగానే జరగాలి. త్వరలోనే థియేటర్లు తెరుస్తారు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మిమ్మల్ని కలిసి తమ కోసం పని చేయమని కోరతాయి. వారికి కావాల్సింది మంచి రచనలు మాత్రమే. త్వరలోనే అంతా సర్టుకుంటుంది’ అంటూ సాగిన టీజర్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. విన్నైతాండి వరువాయి చిత్రంలో కార్తీక్ ఓ రచయిత అనే సంగతి తెలిసిందే. దాంతో లాక్డౌన్ గురించి చింతించకుండా కథలు రాయమని జెస్సీ, కార్తీక్‌ను ప్రేరేపిస్తుంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ కోసం త్రిష, శింబుల పాత్రలను వారి ఇళ్లలోనే షూట్ చేశారు. ఈ షార్ట్ ఫిల్మ్ విడదల తేదీని ఇంకా ప్రకటించలేదు. -
దూసుకుపోతున్న ‘కనులు కనులను దోచాయంటే’
పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకూ... కొన్నేళ్లుగా నిర్మాతలు అనుసరించే సూత్రం ఒక్కటే! వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేసి, తొలి వారంలో వీలైనన్ని వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్నారంతా!! రెండో వారానికి థియేటర్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ, ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మాత్రం ఈ పరిస్థితికి అతీతమని చెప్పాలి. రెండో వారంలో ఈ సినిమా థియేటర్లు పెరిగాయి. (‘కనులు కనులను దోచాయంటే’ మూవీ రివ్యూ) దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలైంది. దేసింగ్ పెరియసామి దర్శకుడు. వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్' విడుదల చేసింది. ఫిబ్రవరి 28న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు, ప్రేక్షకుల డిమాండ్ మేరకు శనివారం నుండి 40 థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాతలు తెలిపారు. 'కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్' నుండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘సినిమాకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు ఈ రోజు నుండి మేం 40 స్క్రీన్స్ యాడ్ చేశాం. అశేష ప్రేక్షకాదరణతో రెండో వారంలోనూ సినిమా థియేటర్లలో బలంగా నిలబడడమే కాదు, మంచి వసూళ్లను రాబడుతోంది’ అని అన్నారు. -
‘కనులు కనులను దోచాయంటే’ రివ్యూ
టైటిల్: కనులు కనులను దోచాయంటే జానర్: లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతు వర్మ, నిరంజని, రక్షణ్, గౌతమ్ మీనన్ సంగీతం: మాసాల కేఫ్ దర్శకత్వం: దేసింగ్ పెరియసామి నిర్మాత: ఆంటోనీ జోసెఫ్ నిడివి: 162.10 నిమిషాలు దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నూతన దర్శకుడు దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఓకే బంగారం, మహానటి వంటి సినిమాలతో టాలీవుడ్లో అభిమానులను సొంతం చేసుకున్న దుల్కర్ తన 25వ చిత్రానికి పూర్తిగా డిఫరెంట్ కథను ఎంచుకున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆంటోని జోసెఫ్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో దుల్కర్ దక్షిణాదిలో సెటిల్ అయినట్టేనా? ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో మన రివ్యూలో తెలుసుకుందాం కథ: ఆరేళ్లుగా సిద్ధార్థ్ (దుల్కర్ సల్మాన్), కల్లీస్ (రక్షణ్) మంచి స్నేహితులు. సిద్ధార్థ్ యాప్ డెవలపర్‌గా, కల్లీస్ యానిమేటర్‌గా పనిచేస్తూ రిచ్ లైఫ్‌ను అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో వీరిద్దరూ మీరా (రీతు వర్మ), శ్రేయా (నిరంజని)లతో తొలి చూపులోనే ప్రేమలో పడతారు. వారి వెంటపడి వారి ప్రేమను పొందుతారు. అయితే మరోవైపు నగరంలో ఆన్లైన్ క్రైంతో పాటు ఖరీదైన కార్లలోని ఖరీదైన వస్తువులను దొంగతనాలకు గురవుతాయి. అయితే ఈ కేసులతో పాటు మరో కీలక కేసును అనఫిషియల్‌గా డీల్ చేస్తుంటాడు పోలీస్ కమిషనర్ ప్రతాప్ సింహా (గౌతమ్ మీనన్). మరోవైపు లవ్, పెళ్లి, ఎంజాయ్ అని సిద్దార్థ్, కల్లీస్, మీరా, శ్రేయాలు గోవాకు వెళతారు. అయితే అక్కడ మీరా గురించి సిద్ధార్థ్‌కు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఇంతకి ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? ప్రతాప్ వెతుకుతున్న ఆ మోసగాళ్లు ఎవరు? సిద్ధార్థ్, మీరాల ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? తెలసుకోవాలంటే ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా చూడాల్సిందే. నటీనటులు: ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో మెప్పించిన దుల్కర్.. ఈ సినిమాలో సిద్దార్థ్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. అయితే అతడి పాత్రను తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే ఎమోషన్ పండించడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ఇక తెలుగమ్మాయి రీతు వర్మకు ఈ సినిమాలో మంచి క్యారెక్టరే లభించింది. డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించి మెప్పిస్తుంది. రక్షణ్, నిరంజనిల మధ్య వచ్చే కొన్ని సీన్లు నవ్వులు తెప్పిస్తాయి. గౌతమ్ మీనన్ మొదట్లో సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి చివరికి కమెడియన్ అయిపోతాడు. అనీష్ కురువులకు సైతం ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. మిగతా తారాగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: కథ, కథనం కొత్తగా, డిఫరెంట్‌గా ఉంది. కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. అన్లైన్ మోసాలు, దొంగతనాలు, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, పోలీస్ కమిషనర్ ఎంట్రీతో ఇంటర్వెల్ ముందువరకు సాదాసీదాగా సాగిపోతుంది. దీంతో అందరూ రొటీన్ స్టోరీ అనుకుంటారు. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్‌తో ఆడియన్స్ అంచనాలతో పాటు సినిమా మొత్తం టర్న్ అవుతుంది. దీంతో సెకండాఫ్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. అయితే రెండో అర్థభాగాన్ని కూడా దర్శకుడు చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఫస్టాప్‌లో ఇచ్చిన ట్విస్టులను సెకండాఫ్‌లో ఒక్కొక్కటి రివీల్ చేస్తూనే ఆడియన్స్‌ను కట్టిపడేసేందుకు సస్పెన్స్ సీన్లను జోడించాడు. దీంతో క్రైమాక్స్ వరకు ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురుచూస్తాడు. మధ్యమధ్యలో కామెడీ పండించాలని దర్శకుడు ప్లాన్ చేసినా అంతగా వర్కౌట్ కాదు. కానీ క్రైమ్ సీన్స్ చాలా ఇంట్రెస్ట్‌గా,కొత్తగా ఉంటాయి. ఓ సందర్భంలో ఇంత సులువుగా క్రైమ్ చేసి, విలాసవంతంగా బతకొచ్చా అనే అనుమానం కలుగుతుంది. కానీ రియలస్టిక్‌గా సాధ్యం కాదు. అయితే క్రైమ్ సీన్లు చేయడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని సగటు అభిమాని ఆశిస్తే నిరాశ తప్పదు. ఎందుకంటే క్రైమ్ సీన్ల వెనక ఏదో బలమైన కారణం ఉంటే రెగ్యులర్ సినిమా అవుతుందని భావించిన డైరెక్టర్ విభిన్నంగా ఆలోచించి సింపుల్‌గా తెగ్గొట్టేశాడు. ఇక సాంకేతిక విషయానికి వస్తే పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతమే అక్కడక్కడా విసుగుతెప్పిస్తుంది. లిరిక్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకొచ్చారు. సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా స్క్రీన్‌ప్లే ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. క్రైమ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్: డిఫరెంట్ కాన్సెప్ట్ క్రైమ్ సీన్స్ మైనస్ పాయింట్స్: స్లో నెరేషన్ నిడివి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం -సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్
నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’.గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇప్పటికే విడుదలైన క్వీన్ ఫస్ట్ లుక్, టీజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ‘క్వీన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల 44 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ అద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ పేరు శక్తి శేషాద్రి. జయలలిత స్కూల్ డేస్ నుంచి మొదలు సినీ, రాజకీయ విషయాలను ఈ ట్రైలర్లో జోడించారు. ఇక జయలలిత చిన్న నాటి పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ ఆకట్టుకుంది. డిసెంబర్ 14న విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. ఇక ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా.. దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా తలైవి ఫస్ట్ లుక్‌పై జయలలిత అభిమానులతో పాటు సినీ అభిమానులు పెదవి విరుస్తున్నారు. (తలైవి ఫస్ట్ లుక్ రిలీజ్) -
ఇన్నాళ్లకు విడుదలవుతోంది..!
క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’. చాలా క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆర్ధిక పరమైన కారణాల వల్ల చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్నిచిత్ర నిర్మాత మధన్ అధికారికంగా ప్రకటించారు. ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ సాధించినట్టుగా వెల్లడించారు. త్వరలోనే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శశికుమార్ కీలక పాత్రలో నటించారు. Finally #ENPTCensoredUA 😍🔥 Audio & Release date Soon | Summer Release ❤️ #ENPT pic.twitter.com/o5a21tHWYc — A2 Studio (@a2studoffl) 15 February 2019 -
సాహసమే శ్వాసగా...
నాగచైతన్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేశావె’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. మంజిమా మోహన్ కథానాయిక. రచయిత కోన వెంకట్ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘యువతతో పాటు అన్ని వర్గాల వారిని అలరించేలా తెరకెక్కించిన చిత్రమిది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగచైతన్య, గౌతమ్ మీనన్, రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన ‘ఏమాయ చేసావె’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం కూడా మరో మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 19న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. పంజాబీ సినిమా రీమేక్‌లో! మేనల్లుడు అక్కినేని నాగచైతన్య హీరోగా ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కృష్ణ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నారు. పంజాబీలో మంచి హిట్టయిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘సింగ్ వర్సెస్ కౌర్’కి రీమేక్ ఇదని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథను మారుస్తున్నారట. ప్రస్తుతం నాగచైతన్య ‘ప్రేమమ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్న సినిమాలో చైతు నటించనున్నారు. కల్యాణ్‌కృష్ణ సినిమా పూర్తయిన తర్వాత ‘సింగ్ వర్సెస్ కౌర్’ షూటింగ్ ప్రారంభమవుతుందట!