కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, స్టార్ హీరో చియాన్ విక్రమ్ కాంబోలో వస్తోన్న చిత్రం ధృవనచితిరం. తెలుగులో ధృవనక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమా ప్రకటించి ఎనిమిదేళ్లు పూర్తి కావోస్తోంది. 2016లో ప్రకటించినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎట్టకేలకు శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఈ సినిమాపై నీలినీడలు కమ్ముకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈనెల 24న థియేటర్లలో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ప్రకాశ్ రాజ్‌కు ఈడీ షాక్.. నోటీసులు జారీ!)
రూ.8 కోట్ల డిమాండ్!
ధృవ నచ్చతిరమ్ సినిమా విడుదల కావాలంటే రూ.8 కోట్లు చెల్లించాలని కొందరు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మద్రాస్ కోర్టులో ఉన్న అన్ని సమస్యలను క్లియర్ చేయడానికి డబ్బు చెల్లించాల్సిందిగా కొందరు అడిగినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో సినిమా విడుదలకు కొన్ని గంటలే ఉండడంతో రిలీజ్‌పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
బెంగళూరు, కొన్ని ఓవర్సీస్ సెంటర్స్ లో కూడా ధృవ నక్షత్రం సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. దీంతో సినిమా విడుదలపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ సినిమాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో అన్ని సమస్యలను క్లియర్ చేయడానికి డైరెక్టర్ గౌతమ్ మీనన్ మద్రాస్ హైకోర్టులో రూ.8 కోట్ల మొత్తాన్ని చెల్లించాలని కోరినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
డిస్ట్రిబ్యూటర్స్ మద్దతు
అయితే మరోవైపు డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించిన తర్వాత ధృవ నచ్చితిరమ్ సాఫీగా విడుదలవుతుందని సమాచారం. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ గౌతమ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ చేసేందుకు గౌతమ్ తన ఒంటరి పోరాటం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూల్లో ఒక్కడే పాల్గొంటున్నారు.
గౌతమ్ కలల ప్రాజెక్ట్
గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలల ప్రాజెక్ట్‌గా ధృవ నచ్చితిరమ్ ఎనిమిదేళ్ల తర్వాత తెరకెక్కించారు. తనకు నటనపై ఆసక్తి లేదని.. సినిమా నిర్మించేందుకు నిధుల కోసమే సినిమాల్లో నటించానని ఇటీవల ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. కాగా.. ఈ చిత్రాన్ని స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రంలో రీతూ వర్మ, వినాయకన్, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment