కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వ శైలి అందరికంటే కాస్తా స్టైలిష్ గా ఉంటుంది. మిన్నలే చిత్రం నుంచి ఇటీవలే శింబు కథానాయకుడిగా రూపొందించిన వెందు తనిందదు కాడు చిత్రం వరకు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ మీనన్ నటుడుగా మారి చాలాకాలమే అయ్యింది. పలు చిత్రాలలో ముఖ్యపాత్రను పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన ఈయన ఇకపై నటించను అనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. నటించడం తనకు ఇష్టం లేదని నిర్ణయాన్ని కూడా శనివారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
కాగా.. గౌతమ్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువ నక్షత్రం. ఈ మూవీ అనివార్య కారణాల వల్ల చాలా కాలం నిర్మాణ పనులు సాగాయి. ఎట్టకేలకు ఈ నెల 24వ తేదిన చిత్రం భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. దీని గురించి చెప్పిన దర్శకుడు గౌతమ్ మీనన్ తాను చెప్పిన కథ నచ్చడంతో విక్రమ్ మరో మాట చెప్పకుండా నటించడానికి సమ్మతించారన్నా రు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పలు దేశాల్లో నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విలేకరు లు సిటీ నేపథ్యంలోనే చిత్రాలు చేస్తున్నారు.. గ్రామీణ నేపథ్యంలో చిత్రం చేసే ఆలోచన లేదా అన్న ప్రశ్నకు తనకు అలాంటి కోరిక ఉందని చెప్పారు. అయితే వెందు తనిందదు కాడు చిత్రంలో ప్లాస్టర్లను గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించారనని.. అయితే అది కొందరికి నచ్చలేదని చెప్పా రు. ఆ కారణంగానే చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిందనే భావన ఉందన్నారు. మీకు పాత చిత్రాల్లో దేనిని రీమేక్ చేయాలని ఉంది అన్న ప్రశ్నకు.. శివాజీ గణేషన్, రాధ నటించిన మొదల్ మర్యాదై చిత్రాన్ని రీమేక్ చేస్తానని చెప్పారు. అందులో శివాజీ గణేషన్ పాత్రలో కమలహాసన్‌ను ఎంపిక చేస్తానని చెప్పారు. మొదటి సినిమా మొదల్ మర్యాదైలో తన నటనతో రాధ ప్రసంశలు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment