Radha
-
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్..
న్యూజిలాండ్ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 59 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అమ్మాయిలు 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటయ్యారు.టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అరంగేట్ర బౌలర్ సైమా ఠాకూర్ రెండు, దీప్తీ శర్మ, అరుంధతి రెడ్డి తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో బ్రూక్ హాలీడే(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఆఖరిలో అమీలియా కేర్(25) పోరాడినప్పటకి, సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఆమె ఆజేయంగా ఉండిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 44.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా బ్యాటర్లలో అరంగేట్ర ప్లేయర్ తేజల్ హసబ్నిస్(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీప్తీ శర్మ(41), యస్తికా భాటియా(37), షఫాలీ వర్మ(33) రాణించారు. ఇక కివీస్ బౌలర్లలో అమీలియా కేర్ 4 వికెట్లు సత్తాచాటగా.. జేస్ కేర్ 3 వికెట్లు సాధించింది. కాగా ఈ మ్యాచ్‌కు భారత రెగ్యూలర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూరం కావడంతో నాయకత్వ బాధ్యతలను స్మృతి మంధాన చేపట్టింది.చదవండి: IND vs NZ: వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో కీలక మార్పు!?
మహిళల టీ20 వరల్డ్ కప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. దాయాదుల పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. కాగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభావం పొందిన భారత జట్టు.. పాక్‌పై గెలిచి తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. అదేవిధంగా హర్మాన్ సేన తమ సేవలను సజీవంగా ఉంచుకోవాలంటే పాక్‌పై కచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఓ కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తోందిరాధా యాదవ్ ఎంట్రీ..న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన స్పిన్న్ రాధా యాదవ్.. పాక్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ పిచ్ స్పిన్ అనుకూలించే ఛాన్స్ ఉన్నందున అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ అరుంధతి రెడ్డి స్ధానంలో రాధా తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ శ్రీలంకపై ఆడిన జట్టునే కొనసాగించే ఛాన్స్ ఉంది.పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టుషఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, ఆశా శోబన. -
విభేదాలే రాధ ప్రాణాలు తీశాయా!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫార్మర్ అన్న ముద్రతో హత్యకు గురైన పల్లెపాటి రాధ అలియాస్ నీల్సో ఉదంతం ఇప్పుడు మాజీలు..ప్రస్తుత మావోయిస్టుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2017 డిసెంబర్ నెలలో ఉద్యోగం వచ్చి0దని రాధ తన తల్లిదండ్రులకు సమాచారమిచ్చి చైతన్య మహిళా సంఘం సభ్యులతో కలిసి విశాఖపట్నం వెళ్లింది. అక్కడ నుంచి ఏవోబీ బో ర్డర్ మీదుగా దళంలో చేరింది. అక్కడే ఆమె పేరును నీల్సోగా మార్చారు. సాంకేతిక విద్యావంతురాలు కావడంతో ఆమెను తొలుత సిగ్నల్ ఆపరేటర్‌గా నియమించి ఒక సెల్‌ఫోన్ ఇచ్చారు. అడవి నుంచి జనావాస ప్రాంతాలకు వచ్చి.. నేతలు చెప్పిన వారికి సమాచారం (ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్) చేరవేసి, ఫోన్ స్విచాఫ్ చేసి, సిమ్‌కార్డు తీసేసి తిరిగి అడవిలోకి వెళ్లిపోయేది. అప్పటికే అడవిలో ఉన్న అగ్రనేతలకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి.వారందరూ షుగర్, బీపీ, గుండె ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్, పరీక్షలు, మందు లు, చికిత్స మొత్తం రాధ అలియాస్ నీల్సోనే చూసుకునేది. అలా నీల్సో అనతికాలంలో అగ్ర నాయకత్వానికి దగ్గర అ య్యింది. అందుకే ఆమె సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్Œ ఫోర్స్ క మాండర్‌గా ఎదిగింది. ఆమెను లేడీ చేగువేరాగా పిలిచేవారు.కరోనా సమయంలో వైద్యసేవలు కరోనా ఫస్ట్ వేవ్‌లో మావోయిస్టులకు పెద్దగా నష్టం వాటి ల్లలేదు. కానీ..సెకండ్ వేవ్‌లో చాలామంది అగ్రనేతలు వరుసగా మరణించడం మొదలైంది. మందుల కోసం బయటకు వచ్చే కొరియర్లపై పోలీసు నిఘా తీవ్రమైంది. ఆ సమయంలో నీల్సోనే చాలా మంది దళ సభ్యులకు చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడింది.అయితే కరోనా తగ్గుముఖం పట్టాక.. ఓ అగ్రనేతతో నీల్సోకు విభేదాలు మొదలై.. తారస్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో నీల్సో దళం వదిలి ఇంటికి వద్దామనుకుంది. కానీ, సదరు నేత తీరు, సిద్ధాంతాలు ఉల్లంఘిస్తున్న వైనాన్ని వివరిస్తూ.. మూడునెలల క్రితం అగ్ర నాయకత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ పార్టీలో తీవ్ర అలజడి రేపగా, దీనిపై నిజనిర్ధారణ చేయాలంటూ ఓ కీలకనేతకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో దళానికి వరుస ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. నీల్సోతో ఘర్షణ పడిన నేత నిజ నిర్ధారణకు వచ్చిన నేతకు రాధ ఇన్ఫార్మర్ అంటూ ఫిర్యాదు చేశాడు. అసలే పోలీసుల నుంచి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్న క్రమంలో అతని మాటలను అగ్రనేత సైతం విశ్వసించాడు. చివరికి నీల్సోకు మరణశిక్ష విధించారు. లొంగుబాటులో మావోలు రాధ హత్య దళంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము రాధ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న భయంతో ప్రస్తుతం దళంలోని కొందరు సభ్యులు తెలంగాణ పోలీ సులను సంప్రదించినట్టు సమాచారం. వీరిలో ఇద్దరు సెంట్ర ల్ కమిటీ మెంబర్లు కొద్ది రోజుల్లో సరెండర్ అవుతామంటూ సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు. కరోనాకు ముందు మావోయిస్టులు ఫిట్టర్, ఎల్రక్టీషియన్, మెకానికల్ డిప్లొమా చదువుకున్న గిరిజన యువతను భారీగా రిక్రూట్ చేసుకున్నారు. ఐఈడీల తయారీ కోసమేనని అప్పుడే తెలంగాణ పోలీసులు అనుమానించారు. వెళ్లిన వారిలో చాలామంది అక్కడ ఉండలేకపోయారు. మెజారిటీ యువకులు అప్పటి కొత్తగూడెం ఎస్పీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. -
అందాల రాధగా తమన్నా..ట్రెడిషన్ లుక్ అదుర్స్!
కృష్ణాష్టమి వస్తున్న తరుణంలో టాలీవుడ్ నటి మిల్కీ బ్యూటీ అందమైన రాధలా మిస్మరైజ్ చేస్తుంది. రాధమ్మ ఇలానే ఉంటుందా అనేంతలా చూపు తిప్పుకోని అందంతో అలరించింది. తమన్నా భాటియా రీసెంట్ గా స్త్రీ 2 సినిమా ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి హెడ్ లైన్లో నిలిచింది. ఎప్పుడూ గ్లామర్ పాత్రలే కాకుండా..ఐటమ్ లేడీ, విలన్ పాత్రల్లో కూడా యాక్ట్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తోంది. అలాంటి తమన్నా ఈసారి సాంప్రదాయ లుక్‌లో కనిపించి సందడి చేసింది.అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. భారతీయ హస్తకళకు సంబంధించిన అల్లికలతో కూడిన లెహెంగాలో తమన్నా 'రాధారాణిలా' తలుక్కుమంది. ప్రముఖ డిజైనర్ కరణ్ టోరానీ ప్రేమకు చిహ్నమైన రాధ లుక్‌ని అత్యంత ప్రేమమయంగా ఆవిష్కిరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ తమన్నా భాటియా ధరించిన లెహంగా అది వెల్లడించేలా అత్యంత అందంగా తీర్చిదిద్దాడు. రాధ కృష్ణులు మధ్య స్వచ్ఛమైన బంధాన్ని తెలిపేలే రాధ లుక్‌ని ఆవిష్కరించాడు. ఇక్కడ తమన్నా ‘చంద్రమల్లికా మన్మయి లెహంగా సెట్’లో ఉంది. ఈ లెహెంగా సెట్ “లష్ ఆర్గాన్జా, జెన్నీ సిల్క్" ఫ్యాబ్రిక్. నీలి గులాబి రంగుల కలయికతో కూడిన లెహంగా తమన్నాకి అందాన్ని రెట్టింపు చేసింది. దీనిపై ఉన్న ఈహెరిటేజ్ డబ్కా వర్క్, మోతీ గోల్డ్ సీక్విన్స్, సిగ్నేచర్ ఎంబ్రాయిడరీలతో అట్రాక్టివ్‌గా ఉంది.. ఈ లెహంగా సెట్ పూర్తి పర్పుల్ ఒద్నీతో అయితే ధర రూ. 435,500/-, అదే ఆక్వా ఒధ్నితో రూ. 399,500 ఉంటుందట. ఇక్కడ రాధా దేవిలా ఉన్న తమన్నా ఓ అందమైన చిలకతో సంభాషిస్తున్న స్టిల్ అత్యంత అద్భుతంగా ఉంది. View this post on Instagram A post shared by T O R A N I (@toraniofficial) (చదవండి: మిసెస్ సౌత్ ఇండియా వర్షారెడ్డి) -
రాధే మరణశిక్షను అంగీకరించింది
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పార్టీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి పోలీ సులు బంటి రాధ అలియాస్ నీల్సోను కోవ ర్టుకుట్రలో భాగం చేయడం ద్వారా ఆమె మరణానికి కారకులయ్యారు.. చివరకు రాధే తాను చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించడం సరైందని మనస్ఫూర్తిగా అంగీకరించింది’ అని మావోయిస్టు పార్టీ ఆంధ్రా–ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణే‹శ్వెల్లడించారు. ఈ మేరకు ఆయన పేరి ట శుక్రవారం ఒక లేఖ విడుదలైంది. ఆ లేఖ లోని వివరాల ప్రకారం.. ‘పోలీసు ఉన్నతాధి కారులు ఆమె కులం, జెండర్‌ను ఉపయోగించుకొని అవాస్తవాలతో కొన్ని సంఘాల పేరి ట పోస్టర్లు, ప్రకటనలు, పాటలు విడుదల చేశారు. నిత్యం దళిత, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడే పోలీసు లకు రాధ కులం, మహిళ అని మాట్లాడే అర్హ త లేదు. పీడితవర్గ మహిళగా సమస్యల్ని ఎదుర్కొని వాటికి పరిష్కారంగా విప్లవ రాజకీయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి స్వచ్ఛందంగా పార్టీ లో చేరింది. సభ్యురాలి నుంచి నాయ కత్వ స్థానంలోకి ఎదగడానికి ఆమె పట్టుదల, పార్టీ కృషి ఉంది. ఆపై ఆమె కుటుంబ బలహీనతలను పోలీసులు వాడు కొని విప్లవద్రోహిగా మార్చి పార్టీ నాయక త్వాన్ని నిర్మూలించాలని చూశా రు. ఇంతలోనే పార్టీ అప్రమత్తం కావడం, పోలీసుల పథకం విఫలమైంది’. అని పేర్కొన్నారు. వాళ్లకు మానవత్వం లేదు..బండి రాధను చంపి మృతదేహాన్ని రోడ్డుపై పడవేసిన మావోయిస్టు నేతలు మాయ మాటలతో ప్రకటనలు విడుదల చేయడం వారి క్రూరత్వానికి నిదర్శనమని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత చదువు పూర్తిచేసిన రాధను బలవంతంగా పార్టీలో చేర్చుకొని జీవితాన్నే లేకుండా చేసిన మావోలకు మానవత్వమే లేదని ఈ ఘటనతో అర్థమవుతోందని చెప్పా రు. తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోలీసులే బాధ్యత వహించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రాధను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టి లైంగికంగా వేధిస్తూ కులం పేరుతో దూషించారని ఆమె సోదరుడు కూడా ఆరోపించా డని తెలిపారు. మావోయిస్టుల్లో కీలకపాత్ర పోషించిన దళిత మహిళ రాధపై పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్రవేయడం ఆ పార్టీ నేత ల నీచమైన ఆలోచనలకు నిదర్శనమన్నారు. -
విప్లవం కోసం అడవిబాట పట్టి.. విగతజీవిగా ఇంటికి..
కాప్రా: విప్లవం కోసం ఉద్యమంలోకి వెళ్లిన మహిళా మావోయిస్టు పల్లెపాటి రాధ అలియాస్ బంటి రాధ అలియాస్ నీల్సో జీవితం విషాదాంతంగా ముగిసింది. కాప్రా సర్కిల్, న్యూ ఇందిరానగర్‌కు చెందిన రాధ డిప్లొమో ఇన్ ల్యా»ొరేటరీ టెక్నాలజీ పూర్తి చేసింది. అనంతరం విప్లవంపై ఆకర్షితురాలై అడవిబాట పట్టిన రాధ తిరిగి విగతజీవిగా ఇంటికి చేరింది.ఇన్ఫార్మర్ నెపంతో సహచర మావోయిస్టులే ఆమెను హత్య చేశారు. ఓ మహిళా మావోయిస్టును తోటి మావోయిస్టులే హతమార్చడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, చెన్నాపురం అటవీప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాధ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గురువారం ఉదయం రాధ భౌతికకాయాన్ని ఇందిరానగర్‌లోని ఇంటికి తీసుకొచ్చారు. ఆరేళ్ల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన కుమార్తె విగత జీవిగా తిరిగి ఇంటికి చేరడంతో తల్లిదండ్రుల రోధనలతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. సాయిబాబానగర్‌లోని శ్మశానవాటికలో రాధ అలియాస్ నీల్సో దహన సంస్కరాలు పూర్తి చేశారు. అన్యాయంగా చంపేశారుమావోయిస్టుల అంతర్గత విషయాలు బయటకొస్తాయనే రాధను అన్యాయంగా చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విప్లవ బాటపట్టిన మావోయిస్టుల్లోనూ అగ్రవర్ణాలు, అణగారిన వర్గాలు అనే తారతమ్యం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డనే రాధను సహచర మావోయిస్టులు చంపేశారని ఆరోపిస్తున్నారు. మావోయిస్టుల్లో కొందరు చేసిన తప్పులను రా«ధ ప్రశ్నించిందని, వారి గుట్టు బయటపడుతుందనే భయంతోనే చంపేశారని చెబుతున్నారు. రాధ ఇన్ఫార్మర్గా మారిందనడానికి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్లుగా లేని అనుమానం ఇప్పుడే ఎందుకు వచ్చింది, మూడు నెలల క్రితం కమాండర్ బాధ్యతల నుంచి తప్పిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఆగారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు జరిగిన అన్యాయంపై స్పందించాలని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని రాధ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.దళిత మహిళ అనే వివక్ష ఒక దళిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డనే మా చెల్లెను అన్యాయంగా చంపేశారు. ఇన్ఫార్మర్ నేపంతో సహచర మావోయిస్టులే చంపి రోడ్డుపై పడేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తే మృతదేహం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అక్కడ ఏరియా ఆస్పత్రికి మేం వెళ్లేసరికే రాధ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అసలు తల్లిదండ్రులు లేకుండా వారికి సమాచారం అందించకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా రాధ మృతదేహానికి పోస్టుమార్టం ఎలా చేస్తారు. – లింగం, రాధ అన్నయ్య.నా బిడ్డను చూస్తా అనుకున్నామూడు రోజుల్లో నా బిడ్డ ఇంటికొస్తుందని తెలిసింది. చాలా ఏళ్ల తర్వాత నా బిడ్డను చూస్తా అనుకున్నా. అంతలోనే రెండు రోజుల తర్వాత చనిపోయిందని చెప్పారు. బిడ్డ ఇక లేదని తెలియడంతో చివరి చూపుకోసం బుధవారం మధ్యాహ్నం అక్కడికి బయలుదేరాం. మేం వెళ్లేసరికే పోస్టుమార్టం పూర్తి చేశామని చెప్పి,మృతదేహాన్ని అప్పగించేశారు. ఇన్ఫార్మర్ పేరుతో నా బిడ్డను అన్యాయంగా చంపేశారు. నా కొడుకుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. –పోచమ్మ(బాలమ్మ), రాధ తల్లిఇన్ఫార్మర్ అనడం అబద్ధంమా అక్క రాధను ఇన్ఫార్మర్ అని చెప్పడం పచ్చి అబద్ధం. ఆరేళ్ల క్రితం మావోయిస్టుల పార్టీలో చేరిన అక్క ఫ్యామిలీ గుర్తుకు వచ్చినప్పుడు కేవలం మెసేజ్ మాత్రం చేసేది. అది కూడా ఆమె వెళ్లిన తర్వాత రెండేళ్ల క్రితం ఒక్క మెసేజ్ చేసింది. ఎలా ఉన్నారు, అమ్మ, నాన్న ఎలా ఉన్నారు అని ఆరా తీసింది. మేం బాగానే ఉన్నాం, నువ్వు ఇంటికి రావొచ్చు కదా అంటే నన్ను మర్చిపోండి, నేను మావోయిస్టుల్లోనే ఉంటానని చెప్పింది. అలాంటి మా అక్క ఇన్ఫార్మర్ అని ముద్ర వేసి అన్యాయంగా చంపేశారు. ఆ తర్వాత ఈ నెల 18న నాకు మెసేజ్ వచ్చింది. కానీ ఆ మెసేజ్ చేసింది మా అక్క కాదని గుర్తించా. అక్కకు ఏం జరిగిందోననే భయంతో మాకు తెలిసిన వ్యక్తి ద్వారా ఆరా తీశా. ఆ తర్వాతి రోజునే చనిపోయిందని తెలిసింది. ఈ నెల 21న చనిపోయిందని ఫొటో వాట్సాప్ చేశారు. కానీ ఆ ఫొటోలో 19వ తేదీ కనిపించింది. అంటే మా అక్క చనిపోయిన తర్వాత రెండు రోజులకు మాకు సమాచారం అందింది. నాకు డబ్బులు పంపేదని ఆరోపిస్తున్నారు. అలా అయితే నేను క్యాబ్ డ్రైవర్‌గా ఎందుకు పని చేస్తాను. –సూర్యప్రకాష్, రాధ తమ్ముడు -
ఏడేళ్ల కిందట అదృశ్యం..శవమై ప్రత్యక్షం
సాక్షిప్రతినిధి, వరంగల్/ యాదాద్రి/ చర్ల/కాప్రా: ఏడేళ్ల క్రితం అదృశ్యమై..మావోయిస్టు పార్టీలో చేరి కీలకంగా ఎదిగిన బంటి (పల్లెపాటి) రాధ అలియాస్ నీల్సో శవమై ప్రత్యక్షమైంది. చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) సభ్యురాలి నుంచి దండకారణ్యంలో చేరి నాయకత్వ రక్షణదళ కమాండర్‌గా ఎదిగిన ఆమె.. చివరకు దళం సహచరుల చేతిలోనే హత మైంది. విద్యార్థి నుంచి దళనేతగా సాగిన ఏడేళ్ల ప్రస్థానం విషాదాంతంగా ముగిసింది. ఉద్యమంలో కొనసాగుతూనే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులకు ‘కోవర్టు’గా మారిందన్న సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ నాయకత్వం.. ప్రజాకోర్టు నిర్వహించి రాధ అలియాస్ నీల్సోను చర్ల సమీపంలో హతమార్చి ఏవోబీ కార్యదర్శి గణేష్ పేరిట బుధవారం వీడియో, ప్రకటన విడుదల చేసింది. రాధ కేసు..రంగంలోకి దిగిన ఎన్ఐఏ బంటి బాలయ్య– పోచమ్మ (బాలమ్మ)ల స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్ పరిధిలోని కాప్రాలో నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు సూర్యం, కూతురు రాధలు ఉండగా.. బంటి రాధ అలియాస్ నీల్సో 2017లో ఇంటర్ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తూ అదృశ్యమైంది. రాజాపేటకు చెందిన జిట్టా సుదర్శన్‌రెడ్డి పీపుల్‌వార్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేసే సమయంలో రాధ విప్లవ గీతాలు ఆకర్షితురాలయ్యారు. అప్పట్లో ఆమె అదృశ్యం సంచలనంగా మారగా.. మొదట హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు 2022, జనవరి 2న విశాఖపట్నం జిల్లా పెద్దబయలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును అక్కడి పోలీసులు ఎటూ తేల్చలేదు. కేంద్రహోంశాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కేసును రీ ఓపెన్ చేసింది. మావోయిస్టులు ఆమెను బలవంతంగా పార్టీలో చేర్చుకున్నారన్న అభియోగంపై మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, కాకరాల మాధవి అలియాస్ అరుణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో 2022, జూన్ 23 హైదరాబాద్‌లోని చిలకానగర్, ఫిర్జాదిగూడ, మెదక్ జిల్లా చేగుంట, వరంగల్ నగరంలలో ఎన్ఐఏ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్)తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో హైకోర్టు న్యాయవాదులు డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పా, దుబాసి స్వప్నలను అరెస్టు చేసి ఎన్ఐఏ రాధ ఆచూకీ కోసం విచారించింది. వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డు, ప్రకాశ్‌రెడ్డి పేటలలోనూ సోదాలు నిర్వహించింది. నేడు కాప్రాలో అంత్యక్రియలుపోలీసులు రాధ మృతదేహానికి భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో శవ పంచనామా చేయించాక, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, రాధ మెడకు ప్లాస్టిక్ తాడు కట్టి చెట్టుకు లాగడం ద్వారా ప్రాణం తీసినట్టు తెలుస్తోంది. గురువారం రాధ అంత్యక్రియలు కాప్రాలో నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. హేయమైన చర్య : ఎస్పీ రోహిత్ రాజుమావోయిస్టు పార్టీ నాయకుల వేధింపులు తట్టుకోలేక పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకున్న దళిత యువతి రాధ అలియాస్ నీల్సోను అతి కిరాతకంగా చంపడం హేయమైన చర్య అని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. సామాజిక న్యాయమంటూ మాటలు చెప్పే మావోయిస్టులు ఇతరులను వదిలేసి కేవలం దళితురాలైన రాధను ఎందుకు చంపారో సమాధానం చెప్పాలన్నారు. కీలకంగా ఎదిగి...సహచరుల చేతిలో హతమైఓ వైపు పోలీసులు, మరోవైపు ఎన్ఐఏ బంటి రాధ కోసం ఆరా తీస్తుండగా.. ఆమె మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఎదిగింది. విశాఖపట్నం వెళ్లి 2017 డిసెంబర్లో అదృశ్యమైన ఆమె.. ఆంధ్ర –ఒడిశా బార్డర్ (ఏవోబీ) మావోయిస్టు కమిటీకి కీలకంగా మారింది. ఏడాదిలోనే పార్టీ నాయకత్వ కమిటీకి రక్షణ దళ కమాండర్‌గా ఎదిగింది. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (కోవిడ్ సమయంలో చనిపోయారు)తో పాటు పలువురు నేతలకు రక్షణ కల్పించే ఫ్లటూన్కు కీలకమైంది. సుమారు ఏడేళ్లపాటు బంటి రాధ అలియాస్ నీల్సో ప్రస్థానం మావోయిస్టు పార్టీలో కొనసాగింది. మూడు నెలల కిందటే అనుమానం వచ్చిన మావోయిస్టు పార్టీ నాయకత్వం ఆమెను ‘కోవర్టు’గా భావించి కీలక బాధ్యతల నుంచి తప్పించి నిఘా పెట్టింది. తన సోదరుడు సూర్యం ద్వారా పోలీసులకు సహకరిస్తుందని భావించిన పార్టీ నాయకత్వం, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన రాధ అలియాస్ నీల్సోను అంతమొందించినట్టు ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను చంపి ఈ హత్య తామే చేసినట్లు మావోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరిట లేఖ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని పోలీసులు మళ్లీ అలర్ట్ అయ్యారు. -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 80 పరుగులకే బంగ్లా ఖేల్ ఖతం
వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024 టోర్నీ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా కేవలం ఎనభై పరుగులకే బంగ్లా కథ ముగిసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా టీ20 కప్‌లో గ్రూప్-ఏలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ టాపర్‌గా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ గ్రూప్-బి సెకండ్ టాపర్‌గా నిలిచింది.ఫలితంగా తొలి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాతో పోటీకి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ రేణుకా సింగ్ ఆది నుంచే నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టింది.తన బౌలింగ్ నైపుణ్యాలతో టాపార్డర్‌ను కుదేలు చేసింది. రేణుక దెబ్బకు ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.నిగర్ కెప్టెన్ ఇన్నింగ్స్జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా పట్టుదలగా నిలబడింది. 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో నిగర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ మిగిలిన పని పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 81 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళా జట్టు తేలికగానే ఛేదించే అవకాశం ఉంది. -
పని ఒత్తిడి, ఆపై జ్వరం.. ఆశ వర్కర్ మృతి
ఎ.కొండూరు (తిరువూరు): తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆశ వర్కర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో గురువారం చోటుచేసుకుంది. ఎ.కొండూరు గ్రామానికి చెందిన తోట రాధ (42) సుమారు 18 ఏళ్లుగా ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. వారం క్రితం జ్వరం బారిన పడ్డారు. రాధ జ్వరంతో బాధపడుతూనే ఫీవర్ సర్వే నిర్వహించారు. పని ఒత్తిడి పెరగడం, తీవ్ర జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్నప్పటికీ నయంకాలేదు. దీంతో తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చినఅవుటపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాధ మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. న్యాయం చేయాలని ధర్నా తోట రాధ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఐటీయూ, ఆశ వర్కర్లు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గురువారం ధర్నా చేశారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.కమల, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైద్యాధికారులు నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన రాధ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతురాలి కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రాధకు సెలవు ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా జ్వరంతో సర్వేలు చేయొద్దు.. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని ఎ.కొండూరు పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి కె.శ్రీనివాసరావు చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని ఆదేశాల మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేశామని వివరించారు. -
కోడలి హత్య కేసులో అత్తకు రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కట్నం కోసం కొడుకుతో కలిసి కుట్రపన్ని కోడలి కిరాతకంగా హతమార్చిన చేసిన కేసులో బానోత్ పద్మ అనే దోషికి రెండు జీవిత కారాగార శిక్షలు విధిస్తూ నిజామాబాద్ జిల్లా, సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన ముద్దాయి బానోత్ రామ్‌సింగ్ కోర్టు వాయిదాకు గైర్హాజరవడంతో అతనిపై బెయిల్‌కు వీల్లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ముద్దాయి కోర్టుకు హాజరయ్యాక శిక్ష ఖరారు చేయనున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని... నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం శివ తండాకు చెందిన బానోత్ రామ్‌సింగ్... ఏపీలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన యెండల రాధ సికింద్రాబాద్‌లోని కళామందిర్ షోరూంలో కలిసి పనిచేసేవారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించి 2020 జనవరి 30న నవీపేట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రాధ తల్లిదండ్రులు పేదలు కావడంతో పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇవ్వలేదు. అయితే పెళ్లియిన కొన్ని రోజులకే కట్నం కోసం రాధకు వేధింపులు మొదలయ్యాయి. రూ. లక్ష నగదుతోపాటు బంగారాన్ని తల్లిదండ్రుల నుంచి తేవాలని భర్త, అత్త పద్మ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ విధించడంతో రామ్‌సింగ్ ఉద్యోగం కోల్పోయాడు. మరో పెళ్లి చేసుకుంటే ఆర్థికంగా కలిసొస్తుందని భావించాడు. ఇందుకు అడ్డంకిగా ఉన్న భార్యను చంపాలని తల్లితో కలిసి కుట్రపన్నాడు.బైక్‌పై తీసుకెళ్లి.. చుట్టాల ఇంటికి వెళ్లొద్దామని రాధను నమ్మించిన రామ్‌సింగ్, పద్మ ఆమెను బైక్‌పై తీసుకెళ్లారు. దగ్గర దారిలో వెళ్దామంటూ రాధను మాక్లూర్ మండలం రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలోని బాసం లొద్ది గుట్టపైకి తీసుకెళ్లారు. ముందు నడుస్తున్న రాధపై వెంట తెచ్చుకున్న పెట్రోల్, కిరోసిన్‌ను అత్త పోసింది. వెంటనే రామ్‌సింగ్ అగ్గిపుల్ల గీసి నిప్పంటించడంతో మంటలకు తాళలేక రాధ విలవిల్లాడింది. అయినా ఆమె బ్రతికి ఉండటంతో బండ రాళ్లతో తలపై కొట్టి తీవ్రంగా గాయపర్చారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఒక గుంతలో పడేసి సజీవదహనం చేశారు. ఈ కేసును ఛేదించిన అప్పటి నిజామాబాద్ సౌత్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన జడ్జి తాజాగా ముద్దాయి పద్మకు జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. వరకట్న వేధింపులు, హత్య చేసినందుకు ఒక జీవితఖైదు విధించడంతోపాటు కుట్ర కేసులో మరో జీవిత ఖైదు, సాక్ష్యాధారాలను మాయం చేసిన నేరానికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రధాన ముద్దాయిపైనా నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిరాజ్ వాదనలు వినిపించారు. -
చిరంజీవితో 16 సినిమాల్లో నటించిన హీరోయిన్ బర్త్‌డే (ఫోటోలు)
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
సుందరా ట్రావెల్స్ చిత్ర కథానాయకి మరో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పోలీసులు కేసు గురించి విచారణ జరుపుతున్నారు. వివరాలు చూస్తే.. చెన్నై, నెర్కుం డ్రం, పల్లవన్నగర్ సమీపంలోని ఏరిక్కరై వీధికి చెందిన వ్యక్తి మురళీకృష్ణన్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు, ఎల్ఐసీ ఏజెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. మురళీకృష్ణన్ మాట్లాడుతూ ద్వారకేశ్ అనే తన మిత్రుడికి నటి రాధ పరిచయం చేశానన్నారు. దీంతో ఆమె రెండేళ్ల క్రితం 90 వేలు బిట్ కాయిన్స్ పె ట్టుబడి పెట్టారన్నారు. అయితే అప్పటినుంచి అత ను ఆ బిట్ కాయిన్స్‌ను నటి రాధకు తిరిగి చెల్లించలేదన్నారు. దీంతో నటి రాధ ద్వారకేశ్‌ను పరిచయం చేసిన తనను ఆ బిట్ కాయిన్స్ తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేశారన్నారు. అలా రాధ, ఆమె తల్లి పల్లవి, కొడుకు మరో ముగ్గురు స్థానిక చూలైమేడులోని తన కార్యాలయానికి వచ్చి గొడవ చేశారన్నారు. వాగ్వాదం తరువాత నటి రాధ తనను కిందకు పడేసి కొట్టారన్నారు. దీంతో తన అనుచరు లు స్థానిక రాయపేటలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చారని, తన తలకు మూడు కుట్లు పడ్డాయని చె ప్పారు. అనంతరం తాను స్థానిక వడపళనిలో పోలీస్‌స్టేషన్‌లో నటి రాధ, ఆమె కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా పోలీసులు ఈ వ్యహారంపై విచారణ జరుపుతున్నారు. -
Phone tapping Case: రాధాకిషన్‌రావుకు జ్యుడీషియల్ రిమాండ్
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు గురువారం ఉదయం రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న విషయం తెలి సిందే. అప్పటి నుంచి రాత్రి వరకు ఆయన్ను బంజారాహిల్స్ ఠాణాలో సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను శుక్రవారం ఉదయం వీరిని చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పంజగుట్ట పోలీ సులు వైద్యపరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు పోలీసులు ఈ ముగ్గురినీ కలిపి, విడివిడిగా విచారించారు. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్‌తో పాటు అక్రమ వసూళ్ల కోణంలోనూ ప్రశ్నించారు. ఆపై రాధాకిషన్ రావును గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లికి తీసుకు వెళ్లారు. తదుపరి విచారణ నిమిత్తం రాధాకిషన్ రావును పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతి కోరుతూ శనివారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ప్రభాకర్‌రావుతో లింకులు, వసూళ్ల కోణంలో... సిట్ అధికారులు రాధాకిషన్‌రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను ప్రధానంగా రెండు కోణాల్లో ప్రశ్నించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయన ఆదేశాల మేరకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం సహాయంతో వీరు ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులతో పాటు వ్యాపారుల ఫోన్లూ ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారు. ఈ రకమైన ఆదేశాలు ఎవరు ఇచ్చారు? గుర్తించిన వివరా లను తొలుత ఆ వ్యక్తులకు చెప్పేవారా? అనే కోణాల్లో సిట్ ప్రశ్నించింది. వీరి వేధింపుల నేపథ్యంలో ఓ పార్టీకి వివిధ రూపాల్లో విరా ళాలు ఇవ్వడంతో పాటు ప్రభాకర్‌రావు, రాధా కిషన్‌రావు తదితరులకు కప్పం కట్టిన వాళ్లల్లో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమా నులు, రియల్టర్లతో పాటు హవాలా వ్యాపా రులూ ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. ఈ ముగ్గురినీ ప్రశ్నించిన సిట్ అధికారులు దీనికి సంబంధించి కీలక సమాచారం సేకరించారని తెలిసింది. రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లును శుక్రవారం తెల్లవారు జామున విడిచిపెట్టారు. దాదాపు ఆరుగంటల పాటు రాధాకిషన్‌రావుతో కలిపి గట్టుమల్లును ప్రశ్నించిన సిట్ ఆయన నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ల్లో పనిచేసిన అనేక మంది అధికారులు, సిబ్బందినీ సిట్ విచారిస్తూ వారి నుంచి వాంగ్మూలాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 47మంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేశారని సమాచారం. ఏసీబీ కేసుకు రంగం సిద్ధం రాధాకిషన్‌రావు, నాయిని భుజంగరావు, మేక ల తిరుపతన్నలు అక్రమ ఆస్తులు కూడబెట్టా రని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాథమిక ఆధారా లు సేకరించారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు సమాచారమివ్వాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు అందిన తర్వాత ఏసీబీ అధికారులు ఆదాయా నికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయనున్న ట్లు సమాచారం. మరోపక్క అక్ర మ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన అధికారుల పూర్వాపరాల ను ఉన్నతా ధికారులు పరిశీలిస్తున్నారు.వీరు గతంలో ఎక్క డెక్కడ పనిచేశారు? ఆయాచోట్ల వీరిపై ఉన్న వివాదాలు ఏంటి? కేసులు ఉన్నా యా? అని ఆరా తీస్తున్నారు. తిరుపతన్నపై పెద్దగా వివా దాల్లేనప్పటికీ.. భుజంగ రావు సర్వీసు మొత్తం అక్రమ దందాలతోనే సాగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తో ంది. రాధాకిషన్‌రావు ఉప్ప ల్ ఏసీపీగా ఉండగా 2013లో చోటు చేసుకున్న యాంజాల్ శ్రీధర్‌రెడ్డి అలియాస్ ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య కేసును అధికా రులు తవ్వుతున్నారు. అప్పటి రామంతాపూర్ కార్పొరేటర్ పరమేశ్వర్‌రెడ్డితోపాటు రాధా కిషన్‌రావు వేధింపులతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైంది. 2007లో జరి గిన పరమేశ్వర్‌రెడ్డి సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి హత్య కేసులో ఉప్పల్ వైఎస్సార్ నిందితుడు. ఇతడు మరికొందరితో కలిసి పరమేశ్వర్‌రెడ్డికి హత్యకు కుట్ర పన్నిన ఆరోప ణలపై ఉప్పల్ వైఎస్సార్ తదితరులను పోలీ సులు 2013 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాధా కిషన్ రావు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి వేధించడంతోనే ఉప్పల్ వైఎస్సార్ ఆత్మహత్య చేసుకున్నట్టు అభియో గాలు నమోదయ్యాయి. ఈ కేసు ఇప్పటికీ ట్రయల్ పూర్తి కాకపోవడానికి కార ణాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. నగదు రవాణా చేసినట్టూ అంగీకరించారు.. పంజగుట్ట ఠాణాలో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ఆయన తాను చేసిన నేరాలను అంగీకరించారు. చట్టవిరుద్ధంగా, తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్‌ను అభివృద్ధి చేయడం, కుట్రపూరితంగా అనధికారికంగా ఆ వ్యక్తులపై నిఘా ఉంచడం చేసినట్టు బయటపెట్టారు. రాజకీయంగా పక్షపాతంతో వ్యవహరించడంతోపాటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో తాము అక్రమంగా డబ్బు రవాణా చేయడానికి అధికారిక వనరులను వినియోగించామని అంగీకరించారు. ఇతర నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మరియు సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. – ఎస్ఎం.విజయ్‌కుమార్, వెస్ట్‌జోన్ డీసీపీ -
టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 10 గంటలు విచారించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు పంజగుట్ట పోలీసులు తెలిపారు. శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు గతంలో టాస్్క ఫోర్స్, ఎస్‌ఐబీల్లో పని చేసిన రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ బి.గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్‌తో పాటు బలవంతపు వసూళ్లలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. తొలుత డీసీపీగా, తర్వాత ఓఎస్డీగా.. గతంలో ముఖ్యమంత్రి భద్రత విభాగంలో అదనపు ఎస్పీగా పని చేసిన రాధాకిషన్‌రావు నాన్–క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొంది, 2017 నవంబర్ 3న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టు 31న ఈయన పదవీ విరమణ చేసినా.. మూడేళ్ల పాటు ఓఎస్డీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఆగస్టు 31తో ఆ గడువు ముగిసింది. అయితే గడువును ప్రభుత్వం మరో రెండేళ్లపాటు పొడిగించింది. 2018 నాటి ఎన్నికల సమయంలో రాధాకిషన్‌రావు డీసీపీ హోదాలో విధులు నిర్వర్తించారు. ఒక అధికారి ఒకే పోస్టులో రెండు ఎన్నికలకు పని చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో పాటు ఆయన అధికార పారీ్టకి సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలూ వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ గత ఏడాది అక్టోబర్ 20న ఆయనపై బదిలీ వేటు వేసింది. అప్పటి నుంచి విధులకు దూరంగా ఉన్న ఆయన.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కొత్త సర్కారు ఏర్పడుతుండటంతో గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. ప్రభాకర్‌రావుతో కలిసి భారీ వసూళ్లు.. ఎస్ఐబీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని టీమ్ వ్యవహారాల్లో రాధాకిషన్‌రావుకు కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. వీళ్లు టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ప్రణీత్‌రావు ఇచ్చే సమాచారంతో రంగంలోకి దిగే రాధాకిషన్‌రావు సైన్యం ఓ పార్టీ కోసం విరాళాలతో పాటు తమ బాస్‌ల కోసం పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేశారు. ప్రణీత్‌రావు అరెస్టు తర్వాత రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ప్రణీత్‌తో పాటు భుజంగరావు, తిరుపతన్నల విచారణలో రాధాకిషన్‌రావు పాత్రపై సిట్‌కు అనేక ఆధారాలు లభించాయి. దీంతో పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) కూడా జారీ చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య రాధాకిషన్‌రావు గురువారం పోలీసులకు చిక్కారు. ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఇద్దరికీ సన్నిహితుడే.. సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్న ఇన్స్పెక్టర్ గట్టుమల్లు అటు ప్రభాకర్‌రావు, ఇటు రాధాకిషన్‌రావులకు సన్నిహితుడని తెలుస్తోంది. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా పని చేసినప్పుడు ఇతను చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేశాడు. రాధాకిషన్‌రావు హయాంలో హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గానూ విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్‌రావు నేతృత్వం వహిస్తున్న ఎస్ఐబీలోకే వెళ్లాడు. ఇటీవల అరెస్టు అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీమ్‌లో చురుకుగా వ్యవహరించాడని సిట్ చెప్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ గట్టు మల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న నలుగురు అధికారులను పిలిచి విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్లు రాధాకిషన్‌రావు హయాంలోనూ టాస్్కఫోర్స్లోనే పని చేయడంతో వీరి పాత్రపై ఆరా తీస్తున్న సిట్.. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషి స్తోంది. భుజంగరావు, మేకల తిరుపతన్న సస్పెన్షన్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్నలను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణీత్‌రావు అదనపు కస్టడీ పిటిషన్‌ను మాత్రం న్యాయస్థానం కొట్టేసింది. ఇలావుండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిని ఈనెల 23న పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
డ్రైవింగ్ మణి @ 71
వయసు అరవై దాటిందంటే చాలు ‘ఇంకా ఏం పనులు చేస్తావు, విశ్రాంతి తీసుకో..’ అనే సలహాలు ఇస్తుంటారు. కొందరు ఆ సలహాలను కూడా సవాళ్లుగా తీసుకుంటారు. కొన్ని అభిరుచులను జీవితకాల సాధనగా మార్చుకుంటారు. ఈ మాటలను నిజం చేస్తోంది 71 ఏళ్ల రాధామణి. ఇప్పటివరకు 11 హెవీ వాహనాల లైసెన్స్‌లను పొంది మూస పద్ధతులను బద్దలు కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అందరూ మణి అమ్మ అని పిలుచుకునే రాధామణి కేరళవాసి. సాధనమున ఏవైనా సమకూరుతాయి అని నిరూపిస్తున్న రాధామణి ఇప్పుడు ఇంజినీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ ఈ రంగంలో ఎదగడానికి చేస్తున్న కృషి అందరికీ ఓ స్ఫూర్తి మంత్రం. 1984లో కేరళలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన రాధామణి ఇప్పటికీ ‘వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు’ అని, అందుకు తన జీవితమే ఓ ఉదాహరణగా చూపుతుంది. స్కూటర్ నుంచి జేసీబీ వరకు సాధారణంగా మహిళలు స్కూటర్, కార్ డ్రైవింగ్‌తో సరిపెట్టేస్తారు. రాధామణి మాత్రం అంతటితో ఆగలేదు. డ్రైవింగ్ పట్ల తనకు ఆసక్తి కలగడానికి ప్రోత్సాహాన్నిచ్చిన భర్తను గర్తుచేసుకుంటూ ‘‘1981లో మొదటిసారి ఓ అంబాసిడర్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ఐదేళ్లలోపు ఫోర్ వీలర్ లైసెన్స్ పొందాను. ఆ విధంగా కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా కూడా గుర్తుంపు పొందాను. ఎ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైనింగ్ స్కూల్నుప్రారంభించాను’ అని వివరిస్తుంది. ఈ వెంచర్‌ను రాధామణి భర్త పదేళ్లకు ముందుగానే ప్రారంభించాడు. అక్కడ నుంచే ఈ జంట డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ రాధామణి పేరుతో లైసెన్స్ పొందడానికి స్కూల్ రిజిస్టర్ చేయడానికి కష్టంగా మారింది. దీంతో రాధామణి హెవీ డ్రైనింగ్ లైసెన్స్‌లు పొందాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొన్నేళ్ల న్యాయ ΄ోరాటం తర్వాత ఈ జంట కేరళలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లెర్నింగ్ స్కూల్‌ను రాధామణి పేరుతో రిజిస్టర్ చేయగలిగారు. సంకల్పంతో నిలబెట్టింది.. రాధామణి భర్త 2004లో మరణించాడు. ఆ తర్వాత ఈ వెంచర్ మరింతప్రాముఖ్యతను నింపుకుంది. మణి అమ్మ సంకల్పం ఆ ట్రైనింగ్ స్కూల్‌ను నిలబెట్టడం ఒక్కటే కాదు, దానిని ఒక సంస్థగా మార్చేందుకు కృషి చేయడం కూడా! అందుకే ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ రంగమైనా హెవీ డ్రైవింగ్ అంటే ముందు పురుషులే గుర్తుకు వస్తారు. అలాంటి ఆలోచనకు తావు ఇవ్వకుండా, వయసు నింబధనలను కూడా ధిక్కరిస్తూ ఈ డ్రైవింగ్ స్కూల్‌ను రాధామణి నడుపుతోంది. అందుకు మరింతగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజనీరింగ్ డిప్లామాను అభ్యసిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. రికార్డ్ల చక్రం ఆమె అద్భుతమైన నైపుణ్యాలు, అంకితభావాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ‘ఇన్సి ్పరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని ఇచ్చి తనను తాను గౌరవించుకుంది సంస్థ. రాధామణి అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో కూడా తన ఉనికిని చాటుతోంది. అక్కడ ఆమె తన డ్రైవింగ్ అనుభవాలను పంచుకుంటుంది. వయసు లేదా జెండర్‌తో సంబంధం లేకుండా కలలను పండించుకునేందుకు తగిర ప్రేరణను ఇస్తోంది రాధామణి. సోషల్ మీడియాలో.. రాధామణి ఇన్స్టాగ్రామ్ పేజీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. జేసీబీలు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, ఫెరారీలు, పడవలు, ట్యాంకర్లు, జిప్సీ, పెద్ద పెద్ద ట్రక్కుల వరకు ప్రతి వాహనాన్ని డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కు ఉన్న 19కె ఫాలోవర్లు మణి అమ్మను ప్రశంసిస్తుంటారు. ఎంతోమంది చేత సత్కారం పొందుతుంటారు. చాలా మంది మహిళలకు హెవీ డ్రైవింగ్ పరికరాల గురించి చెప్పడం, నేర్పడం చూడచ్చు. రాధామణి అమ్మ అంటే ఆవేశం, పట్టుదల, శక్తికి నిదర్శనం. ఆమె కేవలం రోడ్డుపైనే కాదు అడ్డంకులను ఛేదించి చక్రాన్ని చేరుకోవడానికి తగిన స్ఫూర్తిని ఇచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. -
ఓ పండుగలా ‘రాధా మాధవం’: హీరో వినాయక్ దేశాయ్
అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా ‘రాధా మాధవం’ రాబోతోంది. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని గోనాల్ వెంకటేష్ నిర్మించగా.. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం మార్చి 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో వినాయక్ దేశాయ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. 'మాతృభాష కన్నడ అయినా.. పెరిగింది ముంబైలోనే. అక్కడే సినిమా ప్రయత్నాలు చేశాను. కన్నడలో చిన్న చిన్న పాత్రల్లో నటించాను. బాహుబలి సినిమా చూసి తెలుగు చిత్ర సీమకు రావాలని నిశ్చయించుకున్నాను. చేస్తున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు వచ్చి సినిమా ప్రయత్నాలు చేశాను. అలా 2019 నుంచి ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. కరోనా టైంలో ఆన్ లైన్ డ్యాన్స్ క్లాసులు కూడా చెప్పేవాడిని. ‘శ్రీరంగపురం’ అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాను. ‘లవర్స్ లవ్ స్టోరీ’ అనే మూవీ చేయగా.. అది ఓటీటీలోకి వచ్చింది. నా మూడో చిత్రమే రాధా మాధవం. రాధా మాధవం దర్శకుడు ఇస్సాకు నాకు మంచి ఫ్రెండ్. హైదరాబాద్ వచ్చిన కొత్తలో పరిచయం అయ్యాడు. అతను చాలా టాలెంటెడ్ పర్సన్. తనకు దర్శకుడిగా అవకాశం వస్తే.. నాకు ఈ సినిమాను ఇచ్చారు. దర్శక నిర్మాతలు నాకు ముందు నుంచీ పరిచయం ఉండటంతో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. నిర్మాత గోనాల్ వెంకటేష్ గారు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తుంటారు. మేం అంతా కొత్త వాళ్లమే అయినా మా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రాధా మాధవం సినిమాను నిర్మించారు. చైతన్య కొల్లి ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. థాజ్ విజువల్స్ ఎంతో సహజంగా ఉంటాయి. సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్‌తో చాలా మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాం. మా చిత్రం అందరికీ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా రాధా మాధవం రాబోతోంది. గ్రామీణ ప్రేక్షకులకు ఈ చిత్రం ఓ పండుగలా ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. మా లాంటి కొత్త వాళ్లని, కొత్త టీం చేసిన ప్రయత్నాన్ని ఆడియెన్స్ ఆదరిస్తే.. మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేస్తాం. మార్చి 1న రాబోతోన్న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారు.' అని కోరుకుంటున్నాను. -
ఈమె ఫ్లాప్ హీరోయిన్.. తల్లి స్టార్ హీరోయిన్.. చిన్నారిని గుర్తుపట్టారా? (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ ముద్దుగుమ్మ కార్తీక నాయర్. 2009లో జోష్ చిత్రంలో టీచర్ పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. 2015లో ఆమె తన చివరిసారిగా తమిళ చిత్రం 'పురంపోక్కు ఎంగిర పొదువుడమై'లో కనిపించింది. ఆ తర్వాత 2017లో 'ఆరంభ్'అనే సీరియల్లో ఆమె దేవసేన పాత్రను పోషించింది. అయితే సీనియర్ నటి, హీరోయిన్ రాధ కూతురిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన కార్తీక గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో రోహిత్ మీనన్‌ను పెళ్లాడింది. నవంబర్ 19న జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, జాకీ ష్రాఫ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే తాజాగా కార్తీక నాయర్ ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. ఈ విషయాన్ని హీరోయిన్ తల్లి రాధ నాయర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవలే కొత్త కోడలిగా అడుగుపెట్టిన నా కూతురికి అప్పుడే ప్రమోషన్ కూడా వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. తన కుమార్తె కార్తీక పెద్ద కోడలిగా ప్రమోట్ అయిందని ఇన్‌స్టాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
Thulasi Nair: హీరోయిన్ రాధ చిన్న కూతురు ఇలా అయిపోయిందేంటి? (ఫొటోలు)
-
గ్రామీణ ప్రేమ కథ నేపథ్యంలో 'రాధా మాధవం'
టాలీవుడ్లో విలేజ్ లవ్ స్టోరీలు ఎన్నో అద్భుతాలు సృష్టించాయి. ఇండస్ట్రీలో ఎన్ని కొత్త జానర్లు వచ్చినా ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నెలలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర యూనిట్.. మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డీ.ఎస్.ఎన్. రాజు రిలీజ్ చేశారు. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
డైరెక్టర్ సాహసం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మూవీ రీమేక్!
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వ శైలి అందరికంటే కాస్తా స్టైలిష్ గా ఉంటుంది. మిన్నలే చిత్రం నుంచి ఇటీవలే శింబు కథానాయకుడిగా రూపొందించిన వెందు తనిందదు కాడు చిత్రం వరకు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ మీనన్ నటుడుగా మారి చాలాకాలమే అయ్యింది. పలు చిత్రాలలో ముఖ్యపాత్రను పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన ఈయన ఇకపై నటించను అనే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. నటించడం తనకు ఇష్టం లేదని నిర్ణయాన్ని కూడా శనివారం చైన్నెలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. కాగా.. గౌతమ్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ధ్రువ నక్షత్రం. ఈ మూవీ అనివార్య కారణాల వల్ల చాలా కాలం నిర్మాణ పనులు సాగాయి. ఎట్టకేలకు ఈ నెల 24వ తేదిన చిత్రం భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. దీని గురించి చెప్పిన దర్శకుడు గౌతమ్ మీనన్ తాను చెప్పిన కథ నచ్చడంతో విక్రమ్ మరో మాట చెప్పకుండా నటించడానికి సమ్మతించారన్నా రు. ఇది క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ పలు దేశాల్లో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరు లు సిటీ నేపథ్యంలోనే చిత్రాలు చేస్తున్నారు.. గ్రామీణ నేపథ్యంలో చిత్రం చేసే ఆలోచన లేదా అన్న ప్రశ్నకు తనకు అలాంటి కోరిక ఉందని చెప్పారు. అయితే వెందు తనిందదు కాడు చిత్రంలో ప్లాస్టర్లను గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించారనని.. అయితే అది కొందరికి నచ్చలేదని చెప్పా రు. ఆ కారణంగానే చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిందనే భావన ఉందన్నారు. మీకు పాత చిత్రాల్లో దేనిని రీమేక్ చేయాలని ఉంది అన్న ప్రశ్నకు.. శివాజీ గణేషన్, రాధ నటించిన మొదల్ మర్యాదై చిత్రాన్ని రీమేక్ చేస్తానని చెప్పారు. అందులో శివాజీ గణేషన్ పాత్రలో కమలహాసన్‌ను ఎంపిక చేస్తానని చెప్పారు. మొదటి సినిమా మొదల్ మర్యాదైలో తన నటనతో రాధ ప్రసంశలు అందుకుంది. -
మూడు ముళ్లు... ఏడడుగులు
సీనియర్ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. రోహిత్ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ఫ్యాలెస్ కన్వెన్షన్ సెంటర్లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు హీరో చిరంజీవి–సురేఖ దంపతులు, నటీనటులు రాధిక, సుహాసిని, రేవతి, భాగ్యరాజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నాగచైతన్య హీరోగా రూపొందిన ‘జోష్’(2009) సినిమాతో కార్తీక తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీ అయ్యారు. -
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ కార్తిక.. పెళ్లి ఫోటోలు వైరల్
సీనియర్ నటి రాధ కుమార్తె, హీరోయిన్ కార్తిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం(నవంబర్ 19) ఉదయం రోహిత్ మేనన్‌తో కార్తిక మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్లో..కేరళ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ప్రస్తుతం కార్తిక పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, జోష్(2009) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కార్తిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. కార్తిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జీవా నటించిన ‘రంగం’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. 2015 నుంచి కార్తిక చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీ అయిపోయింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) View this post on Instagram A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
దేశం అనుకరించేలా ఏపీ విజన్ ప్రణాళిక–2047
సాక్షి, అమరావతి: దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047ను అనుకరించేలా అద్భుతమైన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధా.. రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించారు. ప్రాథమిక, ఉత్పాదక, సామాజిక రంగాలకు సంబంధించి పలు అంశాలపై వర్క్ షాపులో ఫలవంతంగా చర్చలు జరిగాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న నీతి ఆయోగ్ వర్క్ షాపులో భాగంగా శుక్రవారం రాష్ట్ర విద్యా రంగంపై సుదీర్ఘ చర్చ జరిగింది. వి.రాధా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన సంస్కరణలపై విద్యా వేత్తలు, మేథావులు పలు సూచనలు చేశారని, వాటిని అమలు చేయాలంటే కేంద్ర స్థాయిలోని పలు విద్యా సంస్థల్లో వ్యవస్థాగతంగా కీలక మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర పాఠశాల విద్యా విభాగంలో అమలు పరుస్తున్న పలు విద్యా సంస్కరణలను వివరించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, అక్షరాశ్యత శాతం పెంపుతో పాటు రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో దీటుగా నిలబడేందుకు అవసరమైన అన్ని రకాల శిక్షణలను ప్రాథమిక స్థాయి నుంచే అందజేస్తున్న విషయాన్ని తెలిపారు. రాష్ట్ర విజన్ ప్రణాళిక–2047లో భాగంగా పాఠశాల విద్యా విభాగం లక్ష్యాలు, అమలు చేయనున్న వ్యూహాత్మక ప్రణాళి కలను వివరించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్, స్కిల్ డెవలప్మెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు, విద్యా వేత్తలు ప్రసంగించారు. నీతి ఆయోగ్ డీఎంఈవో డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో ఎండీ డా.వినోద్ కుమార్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ సి.నాగరాణితో పాటు నీతి ఆయోగ్ సలహాదారులు సీహెచ్ పార్థసారథిరెడ్డి, పబ్లిక్ పాలసీ నిపుణుడు అమ్రిత్ పాల్ కౌర్, సీనియర్ కన్సెల్టెంట్ శైలీ మణికర్, పర్యవేక్షణ, మూల్యాంకన నిపుణుడు బిప్లప్ నంది, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ప్రతినిధి అభిషేక్ పాల్గొన్నారు. కేంద్ర నిధులకు సిఫార్సు చేయండి: సీఎస్ విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డిని కలిసింది. నిధులు సమకూర్చేందుకు నీతి ఆయోగ్ కేంద్రానికి తగిన సిఫార్సులు చేయాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు. -
రహస్యంగా రాధ కూతురు 'కార్తీక' నిశ్చితార్థం.. ఫోటో వైరల్
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు 'కార్తీక' జోష్ సినిమాతో తెలుగువారికి దగ్గరైంది. అందులో నాగచైతన్యకు జోడీగా ఆమె మెప్పించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించిన కార్తీకకు 'రంగం' సినిమా ఆమె కెరీయర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పవచ్చు. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో ఏకంగా జూ. ఎన్టీఆర్ 'దమ్ము' చిత్రంలో ఆమెకు అవకాశం దక్కింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కార్తీక తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో ఆమె ఓ వ్యక్తిని కౌగిలించుకోవడమే కాకుండా.. నవ్వులు చిందిస్తూ కనిపించింది. అలాగే ఆమె చేతికి ఓ ఖరీదైన రింగును ధరించింది. ఫోటోలో వారిద్దరి ఫేస్ లుక్స్ కంటే ఆ ఉంగారాన్నే ఎక్కువగా హైలెట్ చేస్తూ ఉంది. ఆ ఫోటోను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఆమె.. నెగెటివ్ ఎనర్జీ తమపై పడకూడదనే ‘ఈగల్ ఐ’ ఎమోజీని జత చేశానంటూ చెప్పుకొచ్చింది. ఆ ఫోటో చూసిన వారందరూ కార్తీక నిశ్చితార్థం చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. దీంతో భారీ ఎత్తున ఆమె ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: హాస్పిటల్ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్.. మళ్లీ అలాంటి డ్రామానేనా?) కొద్దిరోజుల క్రితమే కార్తీక ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆమె నిశ్చితార్థం గురించి ఆ వివరాలను అధికారికంగా త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నట్లు సమాచారం. అల్లరి నరేష్‌తో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి చిత్రాల్లో నటించిన కార్తీక.. 2015 తర్వాత నుంచి వెండితెరకు దూరంగా ఉంటుంది. View this post on Instagram A post shared by Karthika Nair (@karthika_nair9) -
‘రాధాస్వామి’ గురువు ఎవరు? సత్సంగిలు ఏమి చేస్తుంటారు?
యూపీలోని ఆగ్రాలో గల రాధాస్వామి దయాల్బాగ్ శాఖ ఆమధ్య భూముల ఆక్రమణలకు పాల్పడిందనే ఆరోపణలు వినిపించాయి. కాగా రాధాస్వామి దయాల్బాగ్ శాఖలోని సత్సంగిలు తమదైన సత్సంగంలో ఉంటూ, లోకవ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఈ వర్గానికి చెందిన గురువు కూడా ప్రచారానికి దూరంగా ఉంటారు. అతని గురించిన వివరాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం సత్సంగ్‌కు గురువుగా వ్యవహరిస్తున్న డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఐఐటీ పాసౌట్. విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. పీహెచ్డీ పూర్తి చేశారు. డాక్టర్ ప్రేమ్ శరణ్ సత్సంగి ఈ శాఖకు ఎనిమిదవ గురువు. ప్రేమ్ శరణ్ 2002 నుంచి గురువుగా వ్యవహరిస్తున్నారు. ఐఐటీ బనారస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల పాటు అమెరికా, యూరప్‌లలోని ప్రముఖ విద్యా సంస్థలలో పనిచేశారు. డాక్టర్ ప్రేమ్ శరణ్ నిరంతరం తెల్లని దుస్తులలో కనిపిస్తారు. సరళత, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. దానినే ఇతరులకూ బోధిస్తారు. ప్రతిరోజూ దయాల్బాగ్ అనుచరులను కలుసుకుంటుంటారు. దేశం నలుమూలల నుండి వచ్చిన సత్సంగిలు దయాల్బాగ్లో ఉంటారు. ఇక్కడ ఎవరికీ కులం ప్రస్తావన ఉండదు. సత్సంగి అనేది ఇంటిపేరుగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న చాలా మంది సత్సంగిలు ఉన్నత విద్యావంతులు. వీరు అర్హతలకు తగిన విధంగా పలు చోట్ల పనిచేస్తుంటారు. ఇది కూడా చదవండి: ఐఎఎఫ్‌హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ -
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
సాక్షి, అమరావతి: రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మకుమారీస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు జయ, పద్మజ, రాధ రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం మౌంట్ అబూలో సెపె్టంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సీఎం జగన్‌ను వారు ఆహ్వనించారు. సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన హౌస్ కీపింగ్ సిబ్బంది రాఖీ పండుగ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం జగన్ చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది తమ అభిమానాన్నిచాటుకున్నారు. -
డాక్టర్ రాధా హత్య కేసులో బిగ్ ట్విస్ట్
ఎన్టీఆర్: జిల్లాలో సంచలనం రేపిన డాక్టర్ మాచర్ల రాధ (59) హత్య కేసులో మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడని పోలీసులు తేల్చి చెప్పారు. రాధను హతమార్చటంలో నిందితుడు కారు డ్రైవర్ సహాయం పొందినట్లు నిర్ధారించారు. కుటుంబ కలహాలు, ఆర్ధిక వివాదాలే హత్యకు గల కారణాలుగా నిర్ధరించారు. జిల్లా ఎస్పీ పి.జాషువా శుక్రవారం తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మూడు నెలల ముందే పథక రచన.. డాక్టర్ లోక్‌నాథ్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ రాధ భార్యభర్తలు. మచిలీపట్నం జవ్వారుపేటలో శ్రీ వెంకటేశ్వర తల్లిపిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. రాధ కొంత కాలంగా ప్రాక్టీస్ ఆపేసింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిరువురూ వివాహితులే. కుమారుడికి ఇటీవలే వివాహం కావటంతో గత నెలలో అత్తారింటికి వెళ్లాడు. ఇదిలా ఉండగా లోక్నాధ్, రాధల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. వ్యక్తిగత కలహాలతో పాటు ఆర్ధికపరమైన విషయాల్లోనూ మనస్పర్ధలు ఉన్నాయి. విబేధాలు తారస్థాయికి చేరుకోవటంతో ఉమామహేశ్వరరావు భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పథకం రచించి సమయం కోసం వేచి చూస్తున్నాడు. తన వద్ద సుమారు 15 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న కారు డ్రైవర్ స్ఫూర్తి జానార్ధన్ అలియాస్ మధును ఈ పనిలో సహాయం కోరాడు. సహకరిస్తే 30 లక్షల నగదుతో పాటు రాధ సంబంధించిన బంగారం మొత్తం ఇచ్చి జీవితంలో స్థిరపడేందుకు సహాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇందుకు మధు ఒప్పుకున్నాడు. ముందుగానే వేసుకున్న పథకాన్ని అమలు చేసేందుకు మూడు నెలల ముందుగానే సీసీ కెమెరాలను ఉపయోగంలో లేకుండా చేశారు. ఆభరణాలు తీసి.. సీలింగ్‌లో దాచి.. అదును కోసం చూస్తున్న ఉమామహేశ్వరరావు కొడుకు అత్తగారింటికి వెళ్లటంతో డ్రైవర్‌తో చర్చలు జరిపాడు. ఆక్సిజన్ సిలిండర్లు బిగించేందుకు ఉపయోగించే రెంచీని ఆయుధంగా ఎంచుకున్నారు. గత నెల 25వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ లోక్‌నాథ్ రెంచీని మధుకు అందజేశాడు. సాయంత్రం రెండో అంతస్తులో అనుమానం కలుగకుండా నక్కి ఉండమని చెప్పాడు. అతడు డాక్టర్ చెప్పిన విధంగా చేశాడు. అదును చూసుకుని ఉమామహేశ్వరావు, మధు ఇద్దరూ రాధపై ఒక్కసారిగా దాడి చేశారు. మధు ఆమెను బలంగా పట్టుకోగా భర్త ఆమె తలపై రెంచీతో బలమైన దెబ్బలు కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అయిన రాధ స్పృహ కోల్పోయింది. మృతి చెందిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు మరలా రెంచీతో బలంగా ఆమె తలపై కొట్టారు. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఉమామహేశ్వరరావు ఇంటి వెనుక వైపు నుంచి కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌లో వెళ్లిపోయాడు. మధు ఆమె ఒంటిపై ఆభరణాలు ఒలిచి సీలింగ్‌లో దాచాడు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు డాక్టర్ సలహా మేరకు కారం తెచ్చి మృతురాలి ఒంటిపై చల్లాడు. గదిలో అక్కడక్కడా కారం చల్లటంతో పాటు రెంచీని ఇంటి వెనుకభాగంలో దాచి పెట్టాడు. అదే రోజు రాత్రి 10.30 సమయంలో డాక్టర్ ఉమామహేశ్వరావు ఏం ఎరుగనట్టు పోలీసులకు ఫోన్ చేసి తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ సమాచారం ఇచ్చాడు. ఆభరణాలు స్వాధీనం.. రాధ హత్య సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మాధవరెడ్డి, సంబంధిత ఏరియా సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త నుంచి వివరాలు తీసుకున్నారు. అతని ఫిర్యాదుపై ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో హత్య కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు చిక్కకపోవటంతో ఎస్పీ ఆదేశాల మేరకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రాధను హత్య చేసింది ఆమె భర్తేనని నిర్ధారించారు. అతడికి డ్రైవర్ సహకరించినట్లు నిర్ణయానికి వచ్చారు. ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసింది తామేనని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన రెంచీతో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసును చేధించటంలో ప్రతిభ కనబరచిన బందరు డీఎస్పీ మాధవరెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తును సమర్ధవంతంగా నిర్వర్తించి హంతకులను అదుపులోకి తీసుకున్న సిబ్బందికి రివార్డులు ప్రకటించేందుకు రాష్ట్ర డీజీపీకి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్పీ హరిబాబు, డీఎస్పీ మాధవరెడ్డి, సీఐలు ఉమామహేశ్వరరావు, రవికుమార్ పాల్గొన్నారు. -
డాక్టర్ రాధ హత్యకేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): డాక్టర్ రాధ హత్యకేసులో అయిన వాళ్లే హంతకులా..? పథకం ప్రకారమే ఆమెను హత్య చేశారా..? ఆరు పదుల వయసు ఉన్న ఆమెను అంత క్రూరంగా కొట్టి చంపింది అతి దగ్గరి వారేనా..? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఆమెది పథకం ప్రకారం జరిగిన హత్యేనని రుజువు చేస్తున్నాయని సమాచారం. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో హంతకులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టేందుకుందుకు శ్రమిస్తున్నారు. సంచలనం రేపిన హత్య మచిలీపట్నంలో గత నెల 25వ తేదీన జరిగిన డాక్టర్ మాచర్ల రాధ (59) హత్య సంచలనం రేపింది. ఆ రోజు రాత్రి 8.15 గంటల సమయంలో హైదరాబాద్‌లోని కుమార్తెతో ఫోన్లో మాట్లాడిన రాధ 10.15 గంటల సమయంలో దారుణ హత్యకు గురైంది. భర్త డాక్టర్ మాచర్ల మహేశ్వరరావు కింది ఫ్లోర్‌లోని క్లినిక్‌లో రోగులను పరీక్షిస్తుండగానే ఈ హత్య జరగడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ప్రతిభ కలిగిన సీఐ స్థాయి అధికారులను ఎస్పీ జాషువా రంగంలోకి దింపి దర్యాప్తును ముమ్మరం చేయించారు. హత్య జరిగిన రోజు మృతురాలి చేతిలో ఉన్న వెంట్రుకలను హంతకుల ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. చిక్కిన కీలక ఆధారాలు! రాధ హత్య కేసులో పోలీసులకు పలు కీలక ఆధారాలు చిక్కినట్లు తెలుస్తోంది. ఆ ఆధారాలతో రాధ కుటుంబా నికి అత్యంత సన్నిహితుడిగా ఉండే వ్యక్తితో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని అనుమానితులుగా గుర్తించారు. విచారణ నిమిత్తం వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. రాధను హత్య చేసేందుకు పూనుకున్న వ్యక్తికి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి ఎందుకు సహకరించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. రాధను పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో దాదాపు తేలిందని సమాచారం. పైపులపే బిగించే భారీ రెంచీతో ఆమె తలపై బలంగా కొట్టి అత్యంత క్రూరంగా హతమార్చినట్లు పోలీసులు తెలుసుకున్నారని సమాచారం. అయితే ఆమె హత్య ఎందుకు జరిగిందనేది ఇంకా వెల్లడికాలేదని తెలుస్తోంది. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులూ తమపై పోలీ సులకు అనుమానం రాకుండా ఉండేందుకు సినిమా ఫక్కీలో డాక్టర్ రాధ వంటిపై ఉన్న బంగారు వస్తువులను తొలగించి సీలింగ్‌లో దాచిపెట్టారని దర్యాప్తులో తేలింది. హత్యకు ఉపయోగించిన రెంచీతో పాటు బంగారు ఆభరణాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని సమాచారం. -
ప్రపంచ పటంలో విశాఖ..
సాక్షి, అమరావతి : విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమం‘త్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి. రాధతో పాటు పార్థసారథిరెడ్డి, నేహా శ్రీవాత్సవ, అభిషేక్ తదితరుల ప్రతినిధుల బృందం మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి జగన్ ఈ సందర్భంగా వారికి వివరించారు. నగరీకరణ, పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో విశాఖకు చోటుకల్పించడం శుభపరిణామమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌పోర్టు–సీపోర్ట్ కనెక్టివిటీ రోడ్డు, డేటా సెంటర్, మూలపేట పోర్టు, ఇనార్బిట్ మాల్.. ఇలా అనేక విధాలుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా, ప్రపంచ పటంలో పెట్టే ప్రయత్నాన్ని తమ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అంతేకాక.. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సీపోర్టులు, వ్యవసాయం, వైద్య, ఆరోగ్య, విద్యారంగం, నాడు–నేడు, నవరత్నాలు, ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా.. ప్రతి విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాటి ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ పనితీరును నీతి ఆయోగ్ బృందం అభినందించింది. ఈ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ సమగ్ర నివేదిక రూపంలో తమకు అందజేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని బృందం కోరింది. ఏపీకి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి మరోవైపు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టిసారించింది. అందుకు రాష్ట్రంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా రాధ మాట్లాడుతూ.. రాష్ట్రం అధిక వృద్ధి రేటు సాధించే విషయంలో అభివృద్ధి వ్యూహాల రూపకల్పనకుగాను రానున్న రెండేళ్లలో నీతి ఆయోగ్ రూ.5.28 కోట్లు అందించడంతోపాటు అవసరమైన ఇతర సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో నగరీకరణ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందని ఆమె అన్నారు. రానున్న సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ వైపు భారత్ పరుగులు తీస్తోందని.. అందుకు రాష్ట్రాల సహకారం ఎంతో ముఖ్యమని రాధ అన్నారు. నవరత్నాలతో అధిక వృద్ధి రేటు: సీఎస్ ఇక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. నవరత్నాలు పేరిట పెద్దఎత్తున సంక్షేమాభివృద్ధి పధకాలను అమలుచేయడంవల్ల రానున్న రోజుల్లో అధికవృద్ధి రేటు సాధనకు అన్నివిధాలా అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ సలహాదారు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. ఆయా రంగాల వారీగా ఆర్థికాభివృద్ధికి గల అంశాలను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి గిరిజాశంకర్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మిస్టరీగా డాక్టర్ రాధ హత్య కేసు.. పనిచేయని సీసీ కెమెరాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో సంచలనం కలిగించిన డాక్టర్ రాధ హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో నేరస్తులను పట్టుకునేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకోసం జిల్లాలోని సమర్థులైన పలువురు సీఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఆమెను హత్య చేయటం వల్ల ఎవరికి ప్రయోజనం? ఆ అవసరం ఎవరికి ఉంటుంది? అంత పెద్ద పేరు గల ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయకపోవటానికి గల కారణాలు? నిజంగానే గుర్తు తెలియని దుండగులా? లేక సమీప బంధువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? అనే కోణాల్లో పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పాత నేరస్తులపై నిఘా.. జిల్లాలో జరిగిన పలు హత్య కేసుల్లో హంతకులుగా ఉన్న పలువురు పాత నేరస్తులపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఆస్పత్రికి సంబంధించిన సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. అయితే జరిగిన హత్యకు సమీప బంధువులకు సంబంధం ఉండి ఉంటుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి, చాలా వరకు హత్యకేసుకు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు సమాచారం. అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు.. డాక్టర్ మాచర్ల రాధా (59) హత్యకేసులో పోలీసులను అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. రోగులతో నిత్యం రద్దీగా ఉంటే ఆస్పత్రి ఆవరణలో మూడు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయటం పోలీసులకు ప్రధాన అనుమానంగా మారింది. అలాగే రద్దీగా ఉంటే ఆస్పత్రి ముందు నుంచే నేరస్తులు మూడో ఫ్లోర్లో ఉన్న రాధా ఇంటిలోకి వెళ్లాలి. అలా కాని పక్షంలో సమీప బంధువులు మాత్రమే వేరే మార్గం గుండా పై ఫ్లోర్‌లోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ మార్గం గుండా హంతకులు ఏ విధంగా పై ఫ్లోర్‌లోకి వెళ్లి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మృతురాలి భర్త డాక్టర్ ఉమామహేశ్వరరావు సాయంత్రం 6.00 గంటలకు క్లినిక్‌లోకి వెళ్లగా రాత్రి 8.15 సమయంలో మృతురాలు రాధా హైదరాబాద్‌లోని తన కూతరుతో ఆఖరిగా సారిగా ఫోన్లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో డాక్టర్ రాధా హత్య 8.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తుల ఆచూకీ కోసం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.అలాగే గురువారం డాగ్‌స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. -
టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?
తన సినీ ఆరంగేట్రం టాలీవుడ్లోనే మొదలైంది. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డ్ కూడా అందుకుంది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన జోష్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జీవా సరసన తమిళంలో తెరకెక్కిన మూవీ రంగం ద్వారా మరింత ఫేమ్ తెచ్చుకుంది. తెలుగులో ఎన్టీఆర్ దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్‌తో పాటు మలయాళం, తమిళంలోనూ నటించింది. (ఇది చదవండి: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కూతురు!) ఇంతకీ ఆ ఫోటోలోని చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా? ఆమె మరెవరో కాదండీ.. సీనియర్ నటి రాధ కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక నాయర్. ఇవాళ తన బర్త్‌డేను పురస్కరించుకుని రాధ షేర్ చేసిన ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఇవాళ కార్తీకా బర్త్‌డే కావడంతో కూతురికి స్పెషల్ విషెస్ చెప్పింది సీనియర్ నటి రాధ. తన కూతురి చిన్ననాటి ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా.. రాధ కార్తీకతో పాటు తన పిల్లలైన తులసి, విఘ్నేశ్ ఫోటోలను పంచుకుంది. కార్తీక 1992 జూన్ 27న చెన్నెలో జన్మించింది. ఇవాళ 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. బాల్యంలో కార్తీక ఫోటోలు చూసి ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్) View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
సీనియర్ హీరోయిన్ రాధ కూతురు బర్త్ డే (ఫొటోలు)
-
రాధ మర్డర్.. ట్విస్ట్లే.. ట్విస్ట్‌లు..
కనిగిరి రూరల్: వివాహిత రాధ హత్య కేసు.. అంతా థ్రిల్లింగ్.. సస్పెన్స్..ఎన్నో ట్విస్టులు.. పోలీసులకు సవాల్‌గా నిలిచింది. అవసరాల కోసం డబ్బును అప్పుగా తీసుకున్న స్నేహితుడే హత్య చేశాడని తొలుత ప్రచారం..ప్రాథమికంగా లభించిన ఆధారాలతో పోలీసులు కూడా ఆ దిశగా దర్యాప్తు..రెండు రోజుల పాటు ఏవేవో ప్రచారాలు..కిరాయి హంతకులపైనా ఆరా తీశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు.. కొత్త సెల్‌సిమ్ ఆధారంగా సాగిన దర్యాప్తులో ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త ట్విస్ట్.. స్నేహితుడు కాదు భర్తే హత్య చేశాడని తేలింది. అందరూ షాక్‌కు గురయ్యారు. స్నేహితుడి ముసుగులో చాట్ చేసి..ఎవరికీ అనుమానం రాకుండా సీన్ క్రియేట్ చేసి.. రాధను అంతమొందించాడు.. ఈ ఘటనలో ‘సాక్షి’ కథనాలు అక్షర సత్యాలుగా నిలిచాయి. రాధ దారుణ హత్య ఘటనలో సీన్..టు సీన్ ఇలా.. ► వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన మేడం సుధాకర రెడ్డి కుమార్తె రాధకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మండల కేంద్రం కోదాడకు చెందిన కోట కృష్ణా రెడ్డి కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కోట మోహన్ రెడ్డితో వివాహమైంది. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన కాశిరెడ్డి, రాధ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు..కాశిరెడ్డి కూడా హైదరాబాద్‌లోనే ఉంటూ వ్యాపారం నిమిత్తం వీరి ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. వీరి వద్ద సుమారు రూ.1.27 కోట్లు అప్పు చేశాడు. అప్పు తీర్చకపోవడం..ఐపీ నోటీస్ పంపడంతో రాధ, మోహన్‌రెడ్డిల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.. రాధపై అనుమానం పెంచుకుని హత్య చేసేలా కక్ష పెంచుకున్నాడు..పథకం ప్రకారం పక్కాగా వ్యవహరించాడు. ► రాధ ఊర్లో జరిగే అమ్మవారి కొలువులే తన పథకానికి అనుకూలంగా మార్చుకున్నాడు..స్నేహితుడి పేరుతో సిమ్‌లు మారుస్తూ భార్యతో చాటింగ్ చేశాడు..కాశిరెడ్డి డబ్బు ఇస్తాడంటూ 17వ తేదీ సాయంత్ర రాధ జిల్లెళ్లపాడుకు వెళ్లింది. చిన్న కొడుకుని బాబాయ్ ఇంట్లో దించి. బజారులో షాపింగ్ చేసింది. రాత్రి ఏడుగంటల వరకూ సీసీ కెమెరాల్లో రాధ కదలికలు కనిపించాయి. పామూరు బస్టాండ్‌లో ఉన్న సమయంలో వచ్చిన కారు ఎక్కిన తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. రాత్రి రాధ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి 12.50కి ఫోన్ లొకేషన్ గుర్తించారు. జిల్లెళ్లపాడు అడ్డరోడ్డు వద్ద రాధ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ► మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు ఇస్తానని స్నేహితుడు కాశిరెడ్డి చెప్పడంతో రాధ కనిగిరికి వెళ్లిందని కుటుంబ సభ్యులు చెప్పారు. కాశిరెడ్డే స్నేహితురాలు రాధను హత్య చేశాడని అందరూ భావించారు. పోలీసులు సైతం ఆ దిశగా దర్యాప్తు చేశారు. కేసులో ఎలాంటి పురోగతి లేదు. 17వ తేదీ మధ్యాహ్నం రాధ భర్త, కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని కోదాడకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మోహన్‌రెడ్డి కూడా ఏమీ తెలియనట్టుగా పాల్గొన్నాడు.. ఎవరూ అనుమానం రాకుండా అతను కూడా కాశిరెడ్డిపైనే ఆరోపణలు చేశాడు. ► 18వ తేదీన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొత్త సిమ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సిమ్ హతురాలు రాధ భర్త మోహన్రెడ్డిదిగా గుర్తించారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా హత్యకు సంబంధించిన చిక్కుముడి వీడి పోయింది. మరో మూడు రోజుల పాటు లోతుగా దర్యాప్తు చేశారు. అందరూ షాక్‌కు గురయ్యే విషయాలు వెల్లడయ్యాయి. స్నేహితుడికి డబ్బుసాయం సంసారంలో చిచ్చురేపింది. అది అనుమానంగా మారి హత్యకు దారి తీసింది. విచారణలో తేలిందిలా.. ► రాధను హత్య చేసేందుకు పన్నాగం పన్నిన మోహన్‌రెడ్డి.. కాశిరెడ్డి పేరుతో ఫేక్ మెసేజ్‌లు పెట్టి చాటింగ్ చేసి నిర్ధారించుకుని, 13వ తేదీ కనిగిరికి ఒంటరిగా రావాలని మెసేజ్ పెట్టాడు. రాధ దానికి పూర్తిగా స్పందించలేదు. ► తిరిగి 15వ తేదీ మళ్లీ ఫేక్ మెసేజ్‌లతో చాటింగ్ చేశాడు. (హైదరాబాద్‌లోని మార్గ మధ్యంలో సంగారెడ్డి నుంచి పఠాన్ చెరువుకు వెళ్లే దారిలో చెరుకు రసం అమ్మే మహిళ ఫోన్ తీసుకున్నాడు. ఆ ఫోన్లోని సిమ్‌ను తస్కరించి.. కాశిరెడ్డి చేసినట్లు ఫోన్ మెసేజ్ చాటింగ్ చేశాడు) ►16న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో లాంగ్ డ్రైవ్ రెంటెడ్కార్ను తీసుకున్నాడు. కనిగిరిలో కలుద్దాం రమ్మని కాశిరెడ్డిలా రాధకు మెసేజ్‌లు పెట్టాడు. రాత్రికి ఒంగోలులో బసచేశాడు. ► 17న ఒంగోలు నుంచి మోహన్‌రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు కనిగిరికి చేరాడు. ► ఈ మధ్యలో భార్య రాధతో కాశిరెడ్డిలా మోహన్‌రెడ్డి ఫోన్ మెసేజ్‌లో చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రాధ సాయంత్రం 6 గంటలకు కనిగిరి వచ్చింది. ► గం.6.47 కు రాధ ఉన్న స్థలానికి భర్త మోహన్‌రెడ్డి కారులో వచ్చాడు. ఒక్క సారిగా కాశిరెడ్డి స్థానంలో భర్తను చూసిన రాధ అవాకై ్కంది. కొద్ది సేపటికి కారులో ఎక్కించుకున్నాడు. ► ఆ తర్వాత రాధను కారులో తీసుకెళ్లిన భర్త మోహన్‌రెడ్డి .. ఎన్‌హెచ్ 565 రోడ్డు మాచవరం సమీపంలోని డిగ్రీ కళాశాల వద్దకు తీసుకెళ్లి ఇద్దరు మాట్లాడుకున్నారు. ► ఈ క్రమంలో రాధకు బాబాయి, నాన్న దగ్గర నుంచి పలు ఫోన్లు వచ్చాయి. అయినా లిఫ్ట్ చేయలేదు. అక్కడ ఇద్దరికీ కారులో వాగ్వాదం జరిగింది. ► సుమారు రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఒక్కసారిగా రాధపై భర్త మోహన్‌రెడ్డి దాడి చేసి చున్నీతో గొంతు నులిమి, గట్టి కొట్టి చంపాడు. ►11 గంటల సమయంలో అదే కారులో వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు సమీపంలో క్రాస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లి పడేశాడు. ►రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కారును భార్య శవంపై ఎక్కించాడు. ► రాధను హత్య చేసిన భర్త ఒంటిపై బంగారు నగలను సైతం తీసుకుని వెళ్లాడు. ► కారును పూర్తిగా శానిటైజర్‌తో కడిగి మరీ.. అత్యతంగా వేగంగా మిర్యాలగూడ చేరాడు. తిరిగి మరో కారులో తల్లిదండ్రులతో 18న కనిగిరికి చేరా డు. అమాయకంగా వ్యవహరించి, కాశిరెడ్డినే తన భార్యను చంపినట్లు అందర్నీ నమ్మించాడు. కోదాడ స్వగ్రామం తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశాడు. ► 19వ తేదీ రాత్రికి సాంకేతిక ఆధారంగా, ఐటీ కోర్ టీం, దర్యాప్తు బృందాల సమాచారంతో కేసు మలుపు తిరిగింది. అదే రోజు భర్త మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ► 20, 21 తేదీల్లో సమగ్ర విచారణతో భర్త మోహన్‌రెడ్డి ఒక్కడే భార్య రాధను హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ► చివరకు మోహన్‌రెడ్డి వాడిన సిమ్‌కార్డే అతడిని పట్టింది. మిస్టరీ వీడిపోయింది. -
రాధ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. సినిమా ట్విస్టులు తలపించే రీతిలో..
కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా): వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద వివాహిత దారుణ హత్యకు గురైన కేసు కీలక మలుపు తిరిగింది. కోట రాధ (35)ను ఆమె భర్త మోహన్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రాధకు ఆమె చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త మోహన్‌రెడ్డి పథకం ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన కె.రాధకు నల్గొండ జిల్లా కోదాడకు చెందిన కోట మోహన్‌రెడ్డితో 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. రాధ గృహిణి కాగా.. మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే ఉంటున్న రాధ చిన్ననాటి స్నేహితుడు కాశయ్య అలియాస్ కాశిరెడ్డి కుటుంబ సభ్యులతో దగ్గరయ్యాడు. ఆ క్రమంలోనే కాశిరెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట రాధ నుంచి సుమారు రూ.16 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అతనికి రాధ తన భర్త మోహన్‌రెడ్డి నుంచి కూడా రూ.35 లక్షల వరకు ఇప్పించింది. కొంతకాలానికి కాశిరెడ్డి అప్పులపాలై పరారయ్యాడు. అప్పు తీర్చకుండా సుమారు రెండేళ్ల నుంచి కాశిరెడ్డి తిప్పుతుండటంతో భార్యభర్తల మధ్య వివాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో భార్య రాధపై మోహన్‌రెడ్డికి అనుమానం కలిగింది. ఒకవైపు ఆర్థికపరమైన అంశం, మరోవైపు అనుమానం రెండు మోహన్‌రెడ్డిలో తీవ్ర ద్వేషాన్ని పెంచాయి. దీంతో భార్యను ఎలాగైనా అంతమొందించేందుకు పథకం రచించినట్టు తెలిసింది. ఫోన్లు.. సిమ్ కార్డ్‌లు కొని.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఓ ఫోన్, సిమ్‌కార్డ్ కొనుగోలు చేసిన భర్త మోహన్‌రెడ్డి.. ఆ వ్యక్తి పేరు ట్రూ కాలర్‌లో వచ్చేలా నమోదు చేశా డు. ఆ నంబర్‌తో సొంత భార్యతోనే చాటింగ్ చేయగా.. మోహన్‌రెడ్డి అనుమానానికి మరింత బలం చేకూరిందని సమాచారం. దీంతో ఎలాగైనా భార్య ను చంపాలని మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న జిల్లెళ్లపాడులో జాతర ఉండటంతో రాధ పుట్టింటికి భర్త మోహన్‌రెడ్డి, పిల్లలు వచ్చారు. భార్యాపిల్లల్ని ఇక్కడే వదిలేసి మోహన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 13, 14 తేదీల్లో భార్యకు వేరే వ్యక్తి పేరిట మెసేజ్ పెట్టాడు. తిరిగి 17న కనిగిరికి ఒంటరిగా వస్తే రూ.2 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో రాధ కనిగిరి వచ్చింది. ఈ క్రమంలో వేరే వ్యక్తి మాదిరిగా ఫోన్లో మాట్లాడుతూ.. మెసేజ్, ఫోన్ చాటింగ్‌లు కూడా చేశాడు. పామూరు బస్టాండ్‌లో ఎదురుచూస్తున్న రా«ధకు నగదు ఇస్తానని చెప్పిన వ్యక్తి, అతని మనుషులకు బదులు కారులో భర్త కన్పించాడు. చదవండి: విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని.. దీంతో ఒక్కసారిగా అవాక్కైన రాధ భర్త మోహన్‌రెడ్డి పిలవడంతో కారులో ఎక్కినట్టు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఇదే కారు పాతకూచిపుడిపల్లి సమీపంలో కొంతసేపు ఆగినట్లు సీసీ ఫుటేజీల్లో నమోదైనట్టు సమాచారం. ఆ తర్వాత కారులో టిడ్కో గృహాల సముదాయం వద్దకు రాధను తీసుకెళ్లి చున్నీతో గొంతు నులిమి కొట్టి చంపినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కారులోనే ఆమె మృతదేహాన్ని జిల్లెళ్లపాడు క్రాస్‌రోడ్డులో పడేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శనివారం ఉదయం భర్త మోహన్‌రెడ్డిని పోలీసులు దాచేపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొట్టి చంపేశారయ్యా! నా కూతురుని భయంకరంగా కొట్టి చంపారయ్యా. మా అల్లుడు మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఫోన్ చేసి నీకేమైనా క్లూ దొరికిందా మామా అని అడిగాడు. ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారని అడిగితే.. నాకు సమాచారం లేదని చెప్పాను. రాధ చనిపోయిందని అల్లుడికి ఫోన్ చేసినప్పుడు తాను వచ్చేదాకా ఆమె ఫోన్ తీయవద్దన్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చాడు. హత్య చేసింది వీడని మాకెట్లా తెలుస్తుంది. ఇప్పటివరకు గండ్లోపల్లికి చెందిన వ్యక్తిపై అనుమానం ఉండేది. అతడికి మా అమ్మాయి రూ.18 లక్షలు ఇచ్చింది. అల్లుడు రూ.33 లక్షలు ఇచ్చాడు. పెళ్లప్పుడు 38 ఎకరాల పొలం, 25 సవర్ల బంగారం, రూ.10 లక్షలు కట్నం ఇచ్చాం. నా కూతుర్ని చంపిన వాళ్లకు ఉరిశిక్ష పడాలి. – సుధాకర్‌రెడ్డి, రాధ తండ్రి -
జిల్లెలపాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కేసులో కొత్త కోణం
-
రాధ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ప్రకాశం: సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల అనుమానం రాధ భర్త మోహన్‌రెడ్డిపైకి మళ్లింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారిస్తున్నారు. స్నేహితుడు కాశిరెడ్డికి రాధ దంపతులు రూ.80 లక్షలు అప్పు ఇచ్చారు. అయితే కాశిరెడ్డి తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో ఆ భార్యాభర్తల నడుమ విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోయేదాకా వెళ్లారని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. రాధ పేరు మీద భారీ(కోటిన్నర రూపాయలు) ఇన్సూరెన్స్ ఒకటి ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అన్ని కలుపుకుని పక్కా ప్లాన్ ప్రకారమే భర్త ఈ హత్య చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇన్సూరెన్స్ సొమ్ముపై ఆశతో పాటు వివాహేతర సంబంధం కూడా రాధ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్ పురం పోలీస్ స్టేషన్‌కు తరలించి.. మోహన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ప్రకాశం (Prakasam) జిల్లా వెలిగండ్ల మండలంలో జిల్లెళ్లపాడులో ఈ నెల 17వ తేదీన ఈ హత్య జరిగింది. రాధను హత్య చేయడానికి ఆర్థిక కారణాలా? లేదంటే ఇతర అంశాలేమైనా ముడిపడి ఉన్నాయా?.. ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆమెను హత్య చేసిందెవరు? చేయించింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది. -
బికినీలో సీనియర్ నటి రాధ.. ఎలా ఉందో చూశారా?
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ రాధ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 1980లో సీనియర్ స్టార్ హీరోలతో నటనతో మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో రాధ పేరుతోనే ఫేమ్ సాధించింది. కానీ ఆమె అసలు పేరు ఉదయచంద్రిక. దక్షిణాదిలో దాదాపు 250కు పైగా సినిమాల్లో నటించింది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆమె కూతురు కార్తీక తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ఓ సినిమాలోని ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. అప్పట్లో కమల్‌హాసన్ సినిమాలో నటించిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారామె. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాధ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ రోజుల్లో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇదీ ఒకటి. అప్పటికి అది నా కెరీర్లో ఒక భాగం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటున్నా. సరైన లుక్‌తో కనిపించిన మాధవికి ప్రత్యేక ప్రశంసలు. యాటిట్యూడ్‌తో పని చేయగలిగినందుకు ఆమెకు హ్యాట్సాఫ్. కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆలాంటి కొన్ని చెప్పలేని ఆలోచనలను ఇక్కడ పంచుకుంటున్నా. ఈ అందమైన దుస్తులను తయారు చేసిన డిజైనర్ వాణీ గణపతికి మా కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో కమల్ హాసన్ కుర్చీలో ఉండగా.. రాధ, స్వప్న, మాధవి ఆయన వెనక నిలబడి ఉన్నారు. కమల్ హాసన్ హీరోగా 1981లో తెరకెక్కిన టిక్ టిక్ టిక్ చిత్రంలో రాధ నటించింది. View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
రజనీకి థ్యాంక్స్ చెప్పిన అలనాటి హీరోయిన్ రాధ, ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా రజనీకాంత్ వారసురాలు ఐశ్వర్య దర్శకత్వంలో అతిథి పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ పాత్ర భాషా చిత్రంలోని పాత్ర తరహాలో అదిరిపోయేలా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ విషయాన్ని అటుంచితే 1980 ప్రాంతంలో రజనీకాంత్, నటి రాధ సూపర్‌హిట్ జంట. వీరు ఏడు చిత్రాల్లో కలిసి నటించారు. ఇందులో అధిక శాతం సూపర్‌హిట్ అయ్యాయి. చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా? కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ వేదికపై మాట్లాడుతూ తాను ఈ నవల చదివినప్పుడు దీనిని సినిమాగా తీస్తే తాను వాందియదేవన్గాను, అరుళ్‌మొళి వర్మగా కమలహాసన్, ఆదిత్య కరికాలన్‌గా విజయ్‌కాంత్, పెరియ పళవేటరైయార్గా సత్యరాజ్, నందినిగా హిందీ నటి రేఖ, కుందవైగా శ్రీదేవి, పూంగళిగా రాధ నటిస్తే బాగుంటుందని భావించానన్నారు. ఇది జరిగి చాలా రోజులు అయినా నటి రాధ చెవికి ఇప్పుడు చేరినట్లు ఉంది. ఆమె ఆలస్యంగా స్పందించారు. రాధ ట్విట్టర్లో పూంగళి పాత్రలో తాను నటిస్తే బాగుంటుందని చెప్పిన తలైవాకు ధన్యవాదాలు అని అన్నారు. Dear Rajani Sir , Thank you for your thought that I will fit into the role of an amazing character of a truly brilliant literary work. So proud and happy see this !#rajanikanth #ps1 #ponniyinselvan #radha #instagood #instagram #fb @ikamalhaasan pic.twitter.com/YuVFUOSrQT — Radha Nair (@ActressRadha) November 8, 2022 -
రాధా TMT డైరెక్టర్ - అక్షత్ శరఫ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
కొత్త ప్రొడక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించిన రాథ టీఎంటీ
-
కొత్త ప్రోడక్ట్ ను లాంఛనంగా ప్రారంభించిన రాధా TMT
-
తొలిసారి తన కూతురి ఫేస్‌ను రివీల్ చేసిన శ్రియ
హీరోయిన్ శ్రియ సరన్ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా సత్తాచాటింది. అయితే 2018లో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడిన శ్రియ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచిన శ్రియ ఇటీవలె తన చిన్నారి రాధను అభిమానులకు పరిచయం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియ ఇప్పటివరకు కూతురు రాధ ఫేస్‌ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే తాజాగా ఆమె తండ్రి బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రియ అందులో రాధ ఫేస్‌ని రివీల్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు రాధ ఎంతో క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
శ్రీకృష్ణ జన్మాష్టమి: బాయ్‌కాట్ అమెజాన్ దుమారం
సాక్షి, బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అభ్యంతర కరమైన ఫోటోను షేర్ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో బాయకాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. (PM Kisan eKYC deadline extended: పీఎం కిసాన్ ఈ-కేవైసీ అప్డేట్ గడువు పొడిగింపు) పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని, ప్రేమను అవమానించింది. అసలు ఇలాంటి అసభ్య చిత్రాలను విక్రయించే ధైర్యం అమెజాన్ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ‘షేమ్ ఆన్ యూ’ అంటూ మండిపడుతున్నారు. ఇందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అమెజాన్‌పై సోషల్ మీడియా యూజర్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఎక్సోటిక్ ఇండియాపై ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ట్విటర్లో #Boycott_Amazon #Boycott_ExoticIndia జోరు కొనసాగుతోంది. (వారెన్ బఫెట్ పోలికపై రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్పందన వైరల్) జన్మాష్టమికి 20 శాతం సేల్ అంటూ కొన్ని చిత్రాలను అమ్మకానికి పెట్టింది అమెజాన్. వెబ్సైట్లో రాధతో శ్రీకృష్ణుడు ఉన్న అశ్లీల పెయింటింగ్‌ను విక్రయించడంపై హిందూ జాగృతి సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెజాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగుళూరులోని సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా హిందూ దేవతలపై అభ్యంతరంగా ,అనుచితంగా వ్యవహరించడం ఆనక లెంపలేసుకోవడం అమెజాన్‌కు ఇది కొత్తేమీ కాదు. ఇది చదవండి: లక్ అంటే టెకీలదే: అట్లుంటది ఐటీ కొలువంటే! #Boycott_Amazon#Boycott_ExoticIndia ‼️‼️amazonIN & exoticindiaart selling obscene paintings of hindu gods and again & again hurting hindu sentiments!! 👉Hindus are you still want to use this app⁉️⁉️ pic.twitter.com/5xPp1UVTdq — Snehal Patil (@SnehalPatil4SP) August 19, 2022 Press Release Members of @HinduJagrutiOrg submitted a memorandum to the Police Inspector, Subramanya Nagar Benguluru, requesting action against @amazonIN for selling obscene painting of Lord Krishna with Radha on their website.#Boycott_Amazon #Boycott_ExoticIndia pic.twitter.com/E5ASG6PLSH — HJS Karnataka (@HJSKarnataka) August 19, 2022 Hindu unity triumphs! Amazon & Exotic India Art quietly withdraw obscene painting of ShriKrishna & Radhaji. But this is not enough. Both Amazon & Exotic India must tender unconditional apology & pledge not to hurt sentiments of Hindus again.#Boycott_Amazon#Boycott_ExoticIndia pic.twitter.com/tvWbuAetcg — Yamanu Naikodi (@Yamanu76669807) August 19, 2022 We won't allow anyone to hurt Hindu sentiments Neither Bollywood nor Corporates Time and again Amazon providing its platform to sell things which hurt Hindu sentiment#Boycott_Amazon for insulting gods 👇@RadharamnDas#Boycott_ExoticIndia#Janmashtami #harekrishna . pic.twitter.com/u5wX3cyrQ3 — Saffron Swamy (@SaffronSwamy) August 19, 2022 -
మహేశ్‌బాబుకు తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు- డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కీలక పాత్రలో కనిపించనుందట. మహేశ్ తల్లి పాత్ర కోసం మేకర్స్ ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా 90వ దశకంలో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన రాధ పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసింది. తాజాగా ఈ చిత్రంతో వెండితెరపై రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో సినియర్ హీరోయిన్లకు కీలక పాత్రలు ఇస్తుంటారు. అలా అత్తారింటికి దారేదిలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబులు ముఖ్యపాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. -
ఫ్యాన్స్‌కి తీపి కబురు అందించిన నటి రాధ, మళ్లీ వస్తున్నానంటూ ట్వీట్..
Senior Actress Radha Re Entry To Small Screen After Long Gap: అలనాటి హీరోయిన్, ప్రముఖ సీనియర్ నటి రాధ.. అప్పటి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రత్యేకం పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయం, నటన.. అంతకు మించి డ్యాన్స్‌తో ఎంతో ప్రేక్షకులను గుండెల్లో ఆమె నిలిచిపోయారు. 80, 90 దశకంలో ఆనాటి అగ్ర హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో పలువురి హీరోలందరి సరసన ఆమె నటించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యలతో పోటీ పోడుతూ డ్యాన్స్ చేసి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా.. అలా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రాధ తమిళ్, మలయాళంలో కూడా హీరోయిన్గా నటించారు.అక్కడ కూడా ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రానూరానూ సినిమాలు తగ్గించిన రాధ పెళ్లి చేసుకుని పూర్తిగా నటనకు దూరమయ్యారు. భర్త, పిల్లలు, వ్యాపారంతో బిజీ అయిపోయారు. ఆమె తెరపై కనిపించి ఓ దశాబ్దమే గడిచింది. ఈక్రమంలో అప్పుడప్పుడు పలు ఈవెంట్స్‌లో మెరిసిన ఆమె పూర్తిస్థాయిలో తెరపై కనిపించలేదు. ఇదిలా ఉంటే తన ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసే ఓ తీపి కబురు అందించారు రాధ. మళ్లీ వస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. ఈ మేరకు రాధ ట్వీట్ చేస్తూ.. త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నానంటూ ఓ షో ప్రోమోను వదిలారు. ‘చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వస్తున్నా. ఓ రియాలిటీ షోకు న్యాయనిర్థేతగా వ్యవహరించేందుకు బుల్లితెరపైకి వస్తున్నాను. నా కో-జడ్జీగా నకుల్ వ్యవహరిస్తున్న ఈ సూపర్ క్వీన్స్ షో జీ తమిళ్లో ప్రసారం కాబోతోంది. ఈ షోకు జడ్జీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా చూడటం గర్వంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. 90వ దశకంలో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన రాధ పెళ్లి తర్వాత ముంబయిలో సెటిలయ్యారు. అడపాదడపా ఈవెంట్లలో దర్శనమిస్తూ అభిమానులను అలరించడం తప్ప హోస్ట్‌గా ఆమె కనిపించడం ఇదే తొలిసారి. కాగా ఈ షో జనవరి 16 నుంచి జీ తమిళంలో ప్రసారం కానుంది. After pretty long time , again as a judge for a reality show ! Nakul, my co judge is such a sweetheart ❤️That too on Zee Tamil! Enjoyed every bit of it! So proud to witness our talented girls!https://t.co/Kae1rQA7ax @ZeeTamil — Radha Nair (@ActressRadha) January 11, 2022 -
Jharkhand Radha Pandey: హ్యాపీ న్యూస్.. రాధ పెళ్లి ఆగింది
ఇప్పటి వరకు బాల్యవివాహాలను అడ్డుకున్న ఎంతో మంది సామాజిక కార్యకర్తలను చూశాం. ఇప్పుడు తన వివాహాన్ని తానే అడ్డుకున్న ఓ బాలికను చూస్తున్నాం. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక తన పెళ్లిని తనే స్వయంగా ఆపి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్న ఆ బాలిక పేరు రాధాపాండే. రాధను అభినందిస్తున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ ఘోలప్ కొడెర్మా జిల్లా మధుబన్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల రాధాపాండేకు.. ఆమె తల్లిదండ్రులు పక్క ఊరి వరుడితో వివాహం నిశ్చయించారు. ఈ పెళ్లి జూన్ 23 జరగాల్సింది. అయితే మే నెలలో ఆ విషయం తెలుసుకున్న రాధ ‘ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, పెళ్లి ఆపేయమని తల్లిదండ్రులు, బంధువులను కోరింది’. కానీ పెద్దలు ఎవరూ తనకు సహకరించకపోగా పెళ్లికి సిద్ధపడు అని బెదిరించారు. తన తల్లిదండ్రులను ఒప్పించలేక, వరుడి తండ్రి దగ్గరకు వెళ్లి ‘తనకు చదువుకోవాలని ఉందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, పెళ్లిచేసుకుంటే తన కలలన్నీ చెదిరిపోతాయని’ చెప్పి... ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది. కానీ ఆయన మనసు కూడా రాధ వేడుకోలుకు కరగలేదు. కేఎస్‌సీఎఫ్.. ఇదే సమయంలో మధుబన్ పంచాయితీలో బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ వివిధ కార్యక్రమాలతో యాక్టివ్‌గా ఉండే కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ (కేఎస్‌సీఎఫ్) గురించి రాధ తెలుసుకుంది. వెంటనే వాళ్లను కలిసి తన బాధ వెళ్లబోసుకుని, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపించమని అభ్యరి్థంచింది. దీంతో కేఎస్‌సీఎఫ్ బృందం రాధ తల్లిదండ్రులను కలిసి వారు తలపెట్టిన బాల్యవివాహాన్ని ఆపాలని చెప్పారు. మొదట్లో రాధ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పద్దెనిమిదేళ్లు రాకుండా పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పడంతో, పోలీసులకు భయపడి ఎట్టకేలకు ఒప్పుకున్నారు. వరుడి కుటుంబంతో చర్చించి పెళ్లి రద్దు చేశారు. అంతేగాక రాధకు మైనారిటీ తీరేంత వరకు పెళ్లి చేయబోమని కూడా మాట ఇచ్చారు. దీంతో రాధ పెళ్లి ఆగిపోయింది. జిల్లాకు అంబాసిడర్... రాధ పెళ్లి విషయం, ఆమెకు బాలల హక్కులు, బాల్యవివాహాలపై ఉన్న అవగాహనతో ధైర్యంగా ఎదుర్కొన్న తీరు తెలుసుకున్న జిల్లా డిప్యూటీ కమిషనర్ రమేశ్ఘోలప్ ఎంతో సంతోషించారు. ఆయన రాధను అభినందించి, ఆమెను జిల్లాలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడే అంబాసిడర్‌గా నియమించారు. ‘ముఖ్యమంత్రి సుకన్య’ ప్రభుత్వ పథకం కింద నెలకు రెండు వేల రూపాయలను కూడా జారీ చేయించారు. అంతేగాక రాధ కుటుంబానికి రేషన్ కార్డు, ఉచిత వైద్య సదుపాయం, పెన్షన్ వంటి సదుపాయాలను కలి్పంచారు. ప్రభుత్వ ప్రోత్సాహం, కేఎస్‌సీఎఫ్ ఆధ్వర్యంలో రాధ ఇప్పుడు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ తనలాంటి ఎంతో మంది అమ్మాయిలను కాపాడుతోంది. బాగా చదువుకుని భవిష్యత్‌లో మంచి టీచర్‌ను అవుతానని రాధ చెప్పడం విశేషం. ప్రతి బాలికలోనూ రాధలాంటి తెగువ, అవగాహన ఉంటే బాల్యవివాహాలు కనుమరుగు కావడానికి ఎక్కువ సమయం పట్టదు. చదవండి: "Kidnap And Wed": ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే! -
చిత్రహింసలకు గురిచేస్తున్నాడు.. రెండో భర్తపై నటి రాధ ఫిర్యాదు
సాక్షి, చెన్నై: భర్తపై నటి రాధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుందరా ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర చిత్రాల్లో కథానాయకిగా నటించారు రాధ. మనస్పర్థల కారణంగా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని కొడుకు, తల్లితో కలిసి జీవిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఎన్నూర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వసంత రాజాను రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో రెండో భర్త వసంత రాజు తనని హింసిస్తున్నాడంటూ గత ఏప్రిల్ నెలలో స్థానిక విరుగంబాక్కం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తనపై అనుమానం పెంచుకున్నారని, కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే ఆ తరువాత ఇద్దరు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుని కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మరోసారి భర్తపై స్థానిక వరంగమలై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్త, ఆయన మిత్రులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన భర్తతో పాటు అతని మిత్రులైన సబ్ ఇన్స్పెక్టర్ భారతి, ఇళంవరుదిలపై చర్యలు తీసుకోవాలని రాధ పోలీసులను కోరారు. -
‘బిగ్‌బాష్’లో షఫాలీ, రాధ
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ టీనేజ్ సెన్సేషన్ షఫాలీ వర్మకు మరో మంచి అవకాశం లభించింది. ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’లో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌కు ఆడనున్న షఫాలీ... ఆస్ట్రేలియాలో జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నమెంట్లో కూడా బరిలోకి దిగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లీగ్‌లో ఆమె సిడ్నీ సిక్సర్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న 17 ఏళ్ల షఫాలీ, భారత్ తరఫున 22 మ్యాచ్‌లలో 148.31 స్ట్రయిక్‌రేట్‌తో 617 పరుగులు చేసింది. మరో భారత క్రీడాకారిణి, 21 ఏళ్ల రాధా యాదవ్ కూడా బిగ్‌బాష్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో కూడా సిడ్నీ సిక్సర్స్ టీమ్ చర్చలు తుది దశకు చేరాయని సమాచారం. బిగ్‌బాష్ లీగ్‌లో భారత్ నుంచి గతంలో హర్మన్‌ప్రీత్ (సిడ్నీ థండర్), స్మృతి మంధాన (బ్రిస్బేన్ హీట్స్), వేద కృష్ణమూర్తి (హోబర్ట్ హరికేన్స్) ప్రాతినిధ్యం వహించారు. -
సినీ నటి రాధ కేసులో కొత్త మలుపు..
సాక్షి, చెన్నై: భర్త మోసంచేశాడు, వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్ధమాన నటి రాధ రాజీబాటపట్టారు. భర్త ఎస్ఐ వసంతరాజ్‌పై ఇచ్చిన ఫిర్యాదును కేవలం 24 గంటల్లో వెనక్కి తీసుకున్నారు. కలిసి కాపురం చేస్తూ జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన రాధ తన భర్తకు విడాకులిచ్చి చెన్నై సాలిగ్రామంలోని లోగయ్య వీధిలో తల్లి, కుమారుడితో నివాసం ఉంటున్నారు. ఎస్ఐగా పనిచేస్తున్న వసంతరాజ్ను రెండో వివాహమాడి అదే ఇంటిలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా, చెన్నై విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో గురువారం భర్త వసంతరాజ్‌పై ఫిర్యాదు చేశారు. వసంతరాజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో కొన్నేళ్ల క్రితం ఇంటిలోనే తాము వివాహం చేసుకున్నాం. అయితే ఇటీవల తన నడతను అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్న, భౌతికదాడులకు పాల్పడుతున్న భర్తపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును అనుసరించి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాల్సిందిగా రాధ, వసంతరాజ్లకు సమన్లు పంపారు. అయితే సూచించిన సమయానికి వారిద్దరూ హాజరుకాలేదు. గురువారం రాత్రి విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నటి రాధ.. తానిచ్చిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా ఉత్తరం అందజేసి ఫిర్యాదుపత్రాన్ని తీసుకుని వెళ్లిపోయారు. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న వైనంపై శుక్రవారం ఆమె మీడియాకు వివరణ ఇచ్చారు. ఒక మహిళా న్యాయవాది ద్వారా వసంతరాజ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్లుకు అతను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని కోరాడు. త్వరలో ఇన్స్పెక్టర్గా పదోన్నతి వస్తుంది. నిన్ను రాణిలా చూసుకుంటానని బతిమాలాడాడు. మొదట్లో నేను నిరాకరించినా ఒంటరి జీవితంలో ఒక మగతోడు కావాలని భావించి అంగీకరించాను. చదవండి: పెళ్లి.. మోసం: రచ్చకెక్కిన సినీ నటి ఇంటిలోనే నా మెడలో తాళికట్టగా భార్యాభర్తల్లా మెలిగాం. అడయారులోని ఈ–కేంద్రానికి తీసుకెళ్లి నా ఆధార్‌కార్డులో, బ్యాంకు ఖాతాలో భర్తగా తనపేరు నమోదు చేయించాడు. పదేళ్లుగా వాడుతున్న కారును అమ్మివేసి నా డబ్బుతో కొత్తకారు కొనుక్కున్నాను. కారు కొనుగోలుకు వసంతరాజ్ డబ్బులు ఇవ్వలేదు. అతడు కొనుక్కున్న కారుకు నేనే రూ.4.50 లక్షలు ఇచ్చాను. ఇదిగాక అప్పుడప్పుడూ రూ.20వేలు, రూ.30వేలు తీసుకెళ్లేవాడు. నన్ను అనుమానించి కొట్టడం వల్లనే ఫిర్యాదు ఇచ్చాను. అయితే, జరిగిన సంఘటనలకు విచారం వెలిబుస్తూ పోలీసుల సమక్షంలో నన్ను క్షమాపణ కోరడం, నా ఫిర్యాదు వల్ల అతని పదోన్నతి దెబ్బతినకూడదని వెనిక్క తీసుకున్నానని చెప్పారు. -
అలనాటి తారలతో చిరు స్టెప్పులు.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. నిత్యం తన అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. ఒకవైపు కరోనాపై అవగాహన కల్పిస్తూనే తన అభిమానులకు కావాల్సినంత ఫన్ అందిస్తున్నాడు. తాజాగా చిరంజీవి అలనాటి హీరోయిన్లు అయిన సుహాసిని, ఖుష్బూ, జయసుధ, రాధ, రాధక, లిజి ప్రియదర్శన్‌లతో కలసి స్టెప్పులేసిన వీడియోను తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు.. గత ఏడాది చిరంజీవి కొత్త ఇంటిలో ఈ రీయూనియన్ జరిగింది. (చదవండి : మేమంతా మీకు రుణపడి ఉన్నాం : చిరంజీవి) ఈ రియూనియన్ వేడుకకి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటీనటులు ఒక చోట కలిసి సందడి చేశారు. వెంకటేష్, నాగార్జున, మోహన్‌లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్, సురేష్, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో నటీనటులంతా చాలా హ్యాపీగా గడిపారు. ఆటపాటలతో కలసి సందడి చేశారు. ఇందులో సుహాసినితో రాక్షసుడు సినిమాలోని మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు డాన్స్ చేశాడు. ఆ తర్వాత చిరు.. రాధతో మరణ మృదంగంలోని సరిగమ పదనిస పాటకు చిందేసారు. ఆ తర్వాత కుష్బూతో ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు కాలు కదిపాడు. ఈ పాటకు కుష్బూతో పాటు జయప్రద,జయసుధ తదితరులు స్టెప్పులు వేశారు. (చదవండి : మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా: చిరు) -
బడికి వచ్చిపో 'రాధా'?
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వారిని పర్యవేక్షించాల్సిన మండల విద్యాశాఖాధికారులు వారికి సహకరిస్తుండడంతో ఆ శాఖకే చెడ్డపేరు వస్తోంది. 25 నెలలుగా పాఠశాలకు హాజరుకాని ఉపాధ్యాయినికి ప్రతినెలా జీతం అందుతున్న వైనం జిల్లా అధికారులను విస్మయానికి గురిచేసింది. చిత్తూరు కలెక్టరేట్: దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన ఉపాధ్యాయిని ఖాతాలో 25 నెలలుగా జీతం జమ అవుతూనే ఉంది. దీన్ని రెండు సంవత్సరాల తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులు కనిపెట్టారు. సోమల మండలం బోడమంద ప్రాథమిక పాఠశాలలో కిరణ్‌కుమారి అలియాస్ రాధ అనే ఉపాధ్యాయిని ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పలు కారణాలతో 2018 జనవరి 1వ తేదీ నుంచి దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి 2020 మార్చి 1వ తేదీ వరకు సెలవులోనే ఉన్నారు. ఈ విషయాన్ని బయోమెట్రిక్ హాజరు ద్వారా తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవో కార్యాలయం ఏడీ–1 పురుషోత్తంను విచారణాధికారిగానియమించారు. ఆయన ఈ నెల 4న బోడమంద ప్రాథమిక పాఠశాలలో, సోమల మండలం ఎంఈఓ కార్యాలయంలో విచారణ జరిపారు. రికార్డుల ను పరిశీలించారు. సిబ్బందిని విచారించారు. ప్రాథమిక విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు పంపారు. బడికి రాని ఉపాధ్యాయిని ఖాతాలోకి ప్రతి నెలా జీతం జమ అవుతున్నట్లు తేలింది. అలసత్వం వహించిన సోమల ఎంఈఓ బాలాజీనాయక్, ఎస్జీటీ కిరణ్‌కుమారిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. రూ.10 లక్షలు స్వాహా బడికి హాజరుకాని ఉపాధ్యాయిని ఖాతాలోకి ప్రతి నెలా జీతం మంజూరు అవుతున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎస్జీటీ ఉపాధ్యాయిని కిరణ్‌కుమారి 25 నెలల జీతం రూ.10లక్షలు నిబంధనలకు విరుద్ధంగా జమ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. జీతాల బిల్లులను ఎంఈవో క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల గైర్హాజరైన ఉపాధ్యాయినితో ఒప్పందం కుదుర్చుకుని జీతాన్ని సగం సగం తీసుకోవడానికి ప్రయత్నించారా అనే విషయంపై విద్యాశాఖ అధికారుల క్షేత్రస్థాయి విచారణలో తెలియాల్సి ఉంది. రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు ఆ ఉపాధ్యాయిని బయోమెట్రిక్ నమోదు కాకపోవడంతో సందేహం వచ్చి కిరణ్కుమారికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆమె ఫోన్లో స్పందించకపోగా స్విచాఫ్ చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఎంఈవో బాలాజీనాయక్‌ను సంప్రదించగా తడబడుతూ సమాధానమివ్వడంతో ఉన్నతాధికారులకు సందేహం వచ్చి విచారణ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పర్యవేక్షణ లోపమే క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారా.. లేదా అన్న విషయంపై ఎంఈవో, డీవైఈవో, డీఈవో, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. రెండేళ్లకు పైగా ఆ పాఠశాలకు ఏ అధికారీ తనిఖీకి వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. బోడమంద పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు 25 నెలలకు ముందు మాత్రమే కిరణ్‌కుమారిని చూసినట్లు చెబుతుండడం గమనార్హం. ఇలాంటి ఘటనలు జిల్లావ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయో అని విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకుండా కలెక్టర్, రాష్ట్రస్థాయి విద్యాశాఖాధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. -
సహస్ర కాదు వినయశ్రీ...
కరీంనగర్‌క్రైం/తిమ్మాపూర్(మానకొండూర్): పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, చెల్లి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో సహా అల్గునూర్ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. సత్యనారయణరెడ్డి కారు ఏ తేదీన, ఏ సమయంలో పడిందన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈమేరకు సీపీ కెమెరాల ఫుటేజీలను మంగళవారం పరిశీలించారు. సత్యనారాయణరెడ్డి ఒక్కడే జనవరి 26న హైదరాబాద్ వెళ్లొచ్చినట్లు తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో నమోదైనట్లు గుర్తించారు. జనవరి 26వ తేదీఉదయం 11.44 గంటలకు రేణిగుంట టోల్‌ప్లాజా నుంచి హైదరాబాద్ వైపు వెళ్లాడని... తిరిగి సాయంత్రం 8.15 గంటలకు కరీంనగర్ వైపు వచ్చాడని గుర్తించారు. ఈమేరకు సీసీ ఫుటేజీలు స్వీకరించినట్లు ఎల్ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి వెల్లడించారు. కాలువలో పడిన కారు ఫిట్నెస్ రిపోర్టు కోసం రవాణాశాఖ అధికారులను సంప్రదించామని తెలిపారు. వాహనానికి సంబంధించి ఏదైనా తప్పిదంతో ప్రమాదవశాత్తు కాలువలో పడిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. రవాణాశాఖ అధికారుల నుంచి వాహనం కండీషన్ రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. 27న కరీంనగర్‌లోనే.. కరీంనగర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాల ప్రకారం జనవరి 27న సాయంత్రం వరకు నారాయణరెడ్డి కారు పలు ప్రాంతాల్లో కనిపించినట్లు సమాచారం. దీంతో కరీంనగర్ బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వరకూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నమోదుకాని దృశ్యాలు.. సత్యనారాయణరెడ్డి కుటుంబంతో సహా 27వ తేదీ సాయంత్రం బయల్దేరినట్లు అతడి షాపులో పనిచేసే వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు 27 తేదీన అల్గునూర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కారు అటుగా వచ్చినట్లు కనిపించలేదని తెలిసింది. రాత్రి నమోదైన దృశ్యాల్లో వాహనాల నంబర్లు సరిగా కనిపించకపోవడంతో మరింత నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపా రు. 27 తేదీ సాయంత్రం వరకు మాత్రం కారు అటువైపు రాలేదని తేలడంతో కారు ఏ సమయంలో పడిందనే విషయంపై స్పష్టత రాలేదు. కాల్‌డాటా వస్తే మరిన్ని విషయాలు... సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లకు సంబంధించి కాల్‌డేటా వివరాలు నేడు పోలీసులకు అందనున్నట్లు తెలిసింది. కాలే డేటా వస్తే వారు చివరి ఫోన్ ఎవరికి చేశారు. ఏం మాట్లాడారు.. ఎప్పుడు మాట్లాడారు. అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా మరికొన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసుల భావిస్తున్నారు. సహస్ర కాదు వినయశ్రీ... సత్యనారాయణరెడ్డి–రాధ దంపతులతోపాటు కూతురు వినయశ్రీ మృతి గురించి తెలియగానే బీడీఎస్ చదువుతున్న వినయశ్రీ స్నేహితులు బాధపడ్డారు. వినయశ్రీతోపాటు ఆమె తల్లిదండ్రుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే వినయశ్రీ ఫొటోపై సహస్ర అని ఉండడంతో కొంతమంది సహస్ర అని భావించారు. అన్ని ధ్రువపత్రాల్లో మాత్రం వినయశ్రీగానే పేరు నమోదై ఉంది. బంధువులు కూడా వియశ్రీగానే రికార్డుల్లో ఉందని, పూర్తిపేరు అదే అని నిర్ధారించారు. -
కేకు శిల్పాలు
సైరా సినిమా సక్సెస్‌మీట్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది ఎదురుగా ఉన్న శిల్పం. అది శిల్పం కాదని, కేక్ అని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నివాసముండే ఢాకా రాధ ఆ కేక్ రూపకర్త. ఇంట్లో పుట్టినరోజు నుంచి సెలబ్రిటీల ఫంక్షన్ల వరకు రాధ అందించే రకరకాల శిల్పాకృతులను పోలిన కేక్ తయారీకి ఆమె చేసిన కృషి గురించి ఆమె మాటల్లోనే... సైరా సక్సెస్‌మీట్‌లో..కేక్! ‘ఈ బేకింగ్ ఆర్ట్‌లో నైపుణ్యం సాధించడానికి కొన్నేళ్లు పట్టింది. రాత్రింబవళ్లు కష్టపడితే తప్ప ఈ రూపాలు రాలేదు. మొదట్లో మా పిల్లలిద్దరి పుట్టిన రోజులకు కేక్స్ తయారుచేసేదాన్ని. వాటిల్లోనూ బయట కొనే కేకుల మాదిరి కాకుండా ఏదైనా భిన్నంగా ఉండాలనుకున్నాను. వాటిని చాలా అందంగా డెకొరేట్ చేసేదాన్ని. వచ్చిన బంధుమిత్రులు చూసి వారిళ్లలో వేడుకలకు కేక్స్ తయారుచేసి ఇవ్వమనేవాళ్లు. ఆ తర్వాత్తర్వాత కేక్‌తోనే చిన్న చిన్న బొమ్మలను తయారుచేసి అలంకరించేదాన్ని. గతంలో వంటల పుస్తకాలు చూస్తూ వంటలు చేసేదాన్ని. తర్వాత్తర్వాత ఇంటర్నెట్లో ఇలాంటి కళ కోసం, కళాకారుల కోసం వెతుకుతూ ఉండేదాన్ని. సాధనతో ఆకృతులు చేయడం వచ్చింది. థీమ్‌కు తగినట్టు చదివింది పోస్టు గ్రాడ్యుయేషన్. కానీ, పెయింటింగ్ మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి. క్యారికేచర్స్ వేసేదాన్ని. తంజావూర్, వాటర్ కలర్ పెయింటింగ్స్ చేసేదాన్ని. ఆ కళ ఇలా కేక్ మీదకు తీసుకురావడానికి ఉపయోగపడింది. పెళ్లి రోజు, రిసెప్షన్, షష్టిపూర్తి.. ఇలా ఏ కార్యక్రమమైనా ఆ థీమ్‌కు తగ్గట్టు బొమ్మల కేక్ తయారు చేసి ఇస్తూ ఉండేదాన్ని. సింగర్ సునీతకు.. కేక్ ఆకృతి వంటల పోటీలు కేక్ ఆర్ట్‌లో నిరంతర సాధన, ప్రయోగాలు చేస్తూనే దేశంలో ఎక్కడ బేకింగ్ పోటీలు జరిగినా వాటిలో పాల్గొంటూ వచ్చాను. దేశంలో యుకెకు చెందిన కేక్ మాస్టర్స్ మ్యాగజీన్, గ్లోబల్ షుగర్ ఆర్ట్ ఆన్లైన్ మ్యాగజీన్స్ ప్రతియేటా టాప్ టెన్ అవార్డులను ఇస్తుంటాయి. కిందటేడాది ఆ అవార్డు నన్ను వరించింది. వంటగదిలోనే.. మా అమ్మగారికి ఎనభైమూడేళ్లు. ఇప్పటికీ తను వంట చేస్తారు. ఇంట్లో వంటవాళ్లు ఉన్నప్పటికీ వండి వడ్డించడంలో ఆమెకున్న ఆసక్తి నన్నూ వంటవైపుగా నడిపించింది. ఆమె దగ్గరే నేనూ రకరకాల పదార్థాల తయారీ నేర్చుకున్నాను. మా ఇంట్లోని వంటగదే ఈ కేక్ వ్యాపారానికి కేంద్రబిందువు. మా పిల్లలు కూడా కేక్ బేకింగ్‌లో పాల్గొంటారు. ఈ తరం వాళ్లలో ఉండే ఆలోచనలు, సృజన కేక్ తయారీ రూపకల్పనకు ఉపయోగపడుతుంది. అటు అమ్మ నుంచి ఇటు మా అమ్మాయి నుంచీ సూచనలు తీసుకుంటాను. ఆర్డర్స్ ఎక్కువ వచ్చాయంటే మా ఇంట్లో వాళ్లూ సాయం చేస్తారు. ఇదంతా మా ఇంటి సభ్యుల టీమ్ ఎఫర్ట్. పదేళ్లుగా బిజినెస్ బిజినెస్ చేయాలనే ఆలోచనతో కాకుండా బేకింగ్ ఆర్ట్ ఆసక్తితో నేర్చుకున్నాను. ముందు బంధు మిత్రులు అడిగితే కేక్స్ చేసి ఇస్తూ వచ్చిన నేను పదేళ్ల క్రితం బిజినెస్ మొదలుపెట్టాను. బేకింగ్ క్లాసులు కూడా తీసుకుంటున్నాను. ఆ క్లాసులు రెండు రోజుల నుంచి నెల రోజుల వరకూ ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఈ కేక్ తయారీ గురించి తెలుసుకుంటూ బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వచ్చి ఈ బొమ్మల కేక్ తయారీలో మెలకువలు నేర్చుకొని వెళుతుంటారు. గృహిణిగా ఉంటూ ఇష్టం కొద్ది మొదలుపెట్టిన ఈ కేక్ తయారీ ఇప్పుడు నాకో ప్రత్యేక గుర్తింపును తెచ్చింది’ అంటూ రాధ ఆనందంగా తెలిపారు. – నిర్మలారెడ్డి,ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
పనిమనషి
తిన్న కంచం నుంచి వేసుకునే బట్టల దాకా శుభ్రం చేయాలి. వంట గది నుంచి తోట పని దాకా మనకు తోడవ్వాలి. రోజంతా ఇంటి బాధ్యతలతో పాటు మన బాగోగులూ చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సమానంగా అంతకు మించీ మనతో ఉంటున్న తననెందుకు పనిమనిషి అంటున్నాం? మనమనిషి అనుకోలేమా? ఈ ప్రశ్నలకు సమాధానం అందరి దగ్గరా లేకపోవచ్చు కానీ కొందరి దగ్గర ఉంది. ఆ కొందరిలో ఒకరి గురించి తెలుసుకుందాం. అందరికీ ఆ సమాధానాన్ని చేరువ చేద్దాం. ‘‘దీదీ... కుక్కర్ ఏదీ... తోమడానికి వేయలేదు?’’‘‘పాచి వాసన పోవట్లేదని నేను కడిగేశాలే’’ఆ సమాధానంతో అపరాధభావానికి లోనైంది రాధ. మిగిలిన గిన్నెలు కడిగేసి.. ఇల్లు ఊడ్చి.. తుడవడానికి సన్నద్ధమైంది. తుడిచే గుడ్డ కనిపించలేదు. అంతా వెదికింది. ఎక్కడా లేదు.‘‘దీదీ.. తుడిచే గుడ్డ కనిపించడం లేదు?’’‘‘ఇవ్వాళ్టి నుంచి దీంతో తుడువు...’’ అంటూ మాప్ కర్రను తెచ్చిచ్చింది.‘‘దీంతోనా?’’ చూపుల్లో ఆశ్చర్యం... స్వరంలో కుతూహలంతో రాధ.ఈలోపు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు లేచి ఏడుపు అందుకున్నాడు. చేతిలో పని పడేసి గబగబా వచ్చి ఉయ్యాల్లోంచి పిల్లాడిని తీసి ఎత్తుకుంది రాధ.. పంటి బిగువున పాపాయి బరువును భరిస్తూ!గబగబా వచ్చిన యజమానురాలు..‘‘నేను ఎత్తుకుంటాలే’’ అంటూ బిడ్డను తీసుకుంది రాధ చేతుల్లోంచి!యజమానురాలి ఊహించని చర్యకు విస్తుపోతూ.. ‘‘దీదీ.. బాబుకి నా చేతుల్లో నిద్రపడుతుంది.. నేను పడుకోబెడ్తాలే’’ అంది.‘‘నేను చూసుకుంటానన్నాను కదా...’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది యజమానురాలు. ఆమె కొత్తగా ఉండడంతో దిగులు పడుతూనేబాల్కనీలోకి వెళ్లింది రాధ. బట్టలు ఉతకడానికి. నల్లా కింద బకెట్ పెట్టి... నల్లా విప్పింది. ఆ చప్పుడికి మళ్లీ లోపలి నుంచి పరిగెత్తుకొచ్చింది యజమానురాలు.‘‘ఏం చేస్తున్నావ్?’’‘‘బట్టలుతుకుదామని నల్లా తిప్పాను దీదీ...’’ అమాయకంగా రాధ.‘‘నల్లా కట్టేసి.. బట్టల్ని వాషింగ్ మెషీన్లో వెయ్’’ యజమానురాలి ఆర్డర్. ‘‘అదేంటి దీదీ? మీరే చెప్తారు కదా ఎప్పుడూ..వాషింగ్ మెషీన్లో బట్టలేస్తే సరిగ్గా మురికి వదలదని?’’ అడుగుతుంది అదే అమాయకత్వంతో.‘‘ఇప్పుడు చెప్తున్నా కదా.. వెయ్! వాడకుండా దాన్నలా మూలన పెట్టి పాత సామాన్లకుఅమ్మేయడానికా?’’ అంటూ లోపలకు వెళ్లిపోతుంది యజమానురాలు.దీదీ వింతగా కనపడ్తోంది ఆ రోజెందుకో మరి రాధకు.పనైపోయాక అటూ ఇటూ తచ్చాడుతుంటుంది రాధ.. ‘‘యే.. ఇంకా ఇంటికెళ్లవా?’’ అడుగుతుంది యజమానురాలు.‘‘వెళ్తా దీదీ..’’‘‘వెళ్లేప్పుడు ఈ పళ్లు తీసుకెళ్లు.. ఎప్పటి నుంచో పడున్నాయిక్కడ’’ డైనింగ్ టేబుల్ మీదున్న పళ్లబుట్టను చూపిస్తూ యజమానురాలు.‘‘అయ్యో... దీదీ.. ఇవి ఈరోజు పొద్దున తీసుకున్నవే... తాజా పళ్లు’’ అంటుంది చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ రాధ.‘‘చెప్పింది చెయ్... తీసుకెళ్లమన్నా కదా.. తీసుకెళ్లు అంతే.. ఆ.. రేపు రానక్కర్లేదు.. సెలవ్ తీసుకో’’ అంది యజమానురాలు.రాధ మనసు కీడు శంకించి ఏదో అనబోతుండగా.. కాలింగ్ బెల్ మోగింది. గబగబా వెళ్లి తలుపు తీసింది రాధ. ఎదురుగా ఓ అమ్మాయి.‘‘ఎవరు కావాలి?’’ అంది రాధ.‘‘నన్ను రమ్మన్నారు’’ అని ఆ అపరిచితురాలు సమాధానం చెప్తూండగానే... ‘‘ఆ.. ఆ.. నేనే రమ్మంది... లోపలికి రా..’’ అంటూ పిలుస్తుంది యజమానురాలు.‘‘రేపట్నుంచి పనిలోకి వస్తావా?’’ అడుగుతుంది యజమానురాలు లోపలికి వచ్చిన ఆ అమ్మాయితో.‘‘దీదీ.. నేనేమై పోవాలి?’’.. ఆందోళనతో రాధ. ‘‘నీతో కాదులే రాధా.. నువ్వాగు’’ అని రాధను వారిస్తూ కొత్త అమ్మాయితో ‘‘పాచి వాసన రాకుండా గిన్నెలు తోమాలి, ఇల్లు ఊడ్చి, తుడవాలి, బట్టలు.. అన్నీ చేయాలి. రేపటి నుంచి వచ్చేయ్’’ బాధ్యత అప్పజెప్పేస్తుంది యజమానురాలు. ‘‘మరి వంట? ఎంతమందికి వండాలి?’’ కొత్త అమ్మాయి ప్రశ్న. ‘‘వంట పని నేను, రాధ చూసుకుంటాంలే..’’ అని ఆమెతో చెప్పి.. ‘‘యే... రాధా.. నాకు హెల్ప్ చేస్తావ్ కదా?’’ అడుగుతుంది నవ్వుతూ యజమానురాలు. రాధా కళ్లల్లో చెమ్మ... ఆనందంతో!‘‘రాధా.. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నన్నెంత శ్రద్ధగా చూసుకున్నావ్? మరి నువ్ గర్భిణిగా ఉంటే నేనూ అంతే శ్రద్ధగా నిన్ను చూసుకోవాలా లేదా?’’ రాధను దగ్గరకు తీసుకుంటూ చెప్తుంది యజమానురాలు! ఇది ఒక యాడ్. విమెన్స్ డే సందర్భంగా విడుదలైంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని.. ముఖ్యంగా ఇంటి పనుల్లో సహాయపడ్తున్న మహిళలను గౌరవించమని... మనుషులుగా చూడమని చెప్తున్న యాడ్. బాగుంది.. యాడ్.. అలా ఉండాలన్న ఊహా.. చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా అలా ఉండ దు. ఎన్ని ఇళ్లల్లో పనమ్మలకు వేరు టీ కప్పు.. సప రేట్ టిఫిన్ ప్లేట్లుండవ్? నిజంగా జరిగే పని కాదు.అలా ఎందుకు అనుకోవడం? నిజంగా జరిగిన సంఘటనల ప్రేరణతోనే ఆ యాడ్ పుట్టి ఉండొచ్చు కదా! అలాంటి రియల్ లైఫ్ యజమానురాలిని ఇక్కడ పరిచయం చేసుకుందాం.ఆమె పేరు... నిహారికా రెడ్డి. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ, ఇంజనీర్స్ కాలనీలో నివాసం. బొటిక్ నడిపిస్తుంది. కొన్నాళ్ల కిందట నాగమ్మ అనే అమ్మాయి నిహారిక వాళ్లింట్లో డొమెస్టిక్ హెల్పర్‌గా చేరింది. పెళ్లికాని పిల్ల. స్వస్థలం.. కరీంనగర్ జిల్లాలోని సబ్బితం అనే పల్లె. నిహారికను అక్కా... అని ఆప్యాయంగా పిలుస్తూ ఇంటి పనుల్లో సహాయంగా ఉండేది. నిహారికా ఆ అమ్మాయిని బుజ్జీ అంటూ అంతే ప్రేమగా చూసుకునేది. నిహారిక దగ్గర చేరిన ఆర్నెల్లకు నాగమ్మ అస్వస్థతకు గురైంది. నిహారికే ఆసుపత్రిలో చూపించింది. కిడ్నీ సమస్య అని తేలింది. వయసుతోపాటు కిడ్నీలు పెరగక రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు వైద్యులు.కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారమని, అప్పటివరకు డయాలసిస్ చేయించాలని సూచించారు. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న నాగమ్మ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది నిహారిక. అప్పటికే నాగమ్మ తండ్రి పక్షవాతంతో, తల్లి డయాబెటీస్‌తో బాధపడ్తున్నారు. నాగమ్మ ఇద్దరు అక్కల పెళ్లిళ్లయిపోయి అత్తగారిళ్లల్లో ఉన్నారు. అన్నదమ్ములు చదువుకుంటున్నారు. తమ బిడ్డ ఆరోగ్యం కోసం రూపాయి ఖర్చు పెట్టలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు నాగమ్మ తల్లిదండ్రులు. దాంతో ఆమె బాధ్యతను నిహారికే తీసుకుంది. దక్కన్ ఆసుపత్రిలో చేర్పించింది. నాగమ్మ కోసం తను స్వయంగా ఆరు లక్షల రూపాయలను వెచ్చించింది. కిడ్నీ మార్పిడి ప్రయత్నం కోసం ఫండింగ్కూ వెళ్లింది. దురదృష్టం.. నాగమ్మ బతకలేదు. ఆర్థికంగా అండగానే కాదు.. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా నాగమ్మను చూసుకుంది నిహారిక. అప్పటికే ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు. అర్ధరాత్రి ఆసుపత్రికి పరుగెత్తాల్సి వచ్చేది. తెలిసిన వాళ్లను ఇంట్లో పిల్లలకు తోడుగా ఉంచి నాగమ్మను తీసుకుని హాస్పిటల్ వెళ్లేది. ‘‘ఇంత చేసినా ఆ అమ్మాయిని కాపాడుకోలేకపోయాననే బాధ. బుజ్జీ గురించి నేను పడిన ఆరాటమంతా గొప్పకోసం కాదు. ఓ మనిషిగా నా బాధ్యత అది. డొమెస్టిక్ హెల్పర్స్ మనకు స్లేవ్స్ కారు. మనం ఇంకో చోట వర్క్ చేయడానికి ఎలా వెళ్తామో... వాళ్లు మన ఇంట్లో వర్క్ చేయడానికి వస్తారు. మన బాస్ మనల్ని ఇల్ ట్రీట్ చేస్తే మనమెంత హర్ట్ అవుతామో.. సేమ్ మనం ఇల్ ట్రీట్ చేస్తే డొమెస్టెక్ హెల్పర్స్ కూడా అంతే హర్ట్ అవుతారు. సొసైటీలో ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉంటాం. పనులూ అంతే. మనమెక్కడో కంట్రిబ్యూట్ చేయాలంటే మన సొంత పనుల్లో ఎవరో ఒకరు మనకు సహాయపడాల్సిందే. పరస్పర సహాయ సహకారాలతోనే సమాజం.. దాని అభివృద్ధి. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే మనుషుల మధ్య తేడాలుండవ్. అందరినీ గౌరవించగలుగుతాం’’ అంటుంది నిహారికా రెడ్డి. ప్రస్తుతం నీహారిక దగ్గర లక్ష్మి అనే హెల్పర్ పదేళ్ల నుంచి పనిచేస్తోంది. ‘‘లక్ష్మీ అక్కా’’ అని పిలుస్తుంది ఆమెను. లక్ష్మీ తన యజమానురాలు నిహారిక గురించి ఏం అంటుందంటే.. ‘‘ఆమె పెద్దబ్బాయి పుట్టినప్పటి నుంచి ఆమె దగ్గరే పనిచేస్తున్నా. అక్కా.. అనే పిలుస్తది. ఎందుకమ్మా అక్కా అంటావ్... అంటే ‘నాకు అక్క లాంటిదానివే లక్ష్మక్కా నువ్వు’ అంటుంది. వాళ్లింట్లో మనిషిలాగే చూస్తుంది. ఒంట్లో బాగాలేకపోయినా.. డబ్బు అవసరం ఉన్నా అన్నిటికీ అమ్మలా ఆదుకుంటుంది’’ అని చెప్తుంది. ఇదొక్క ఉదాహరణే కాదు.. డొమెస్టిక్ హెల్పర్స్‌కు జీవిత బీమా చేసి, పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న యజమానులూ ఉన్నారు. వీళ్లంతా యాడ్ ఫిల్మ్స్‌కే కాదు.. రియల్ లైవ్స్కీ స్ఫూర్తే. – సరస్వతి రమ -
సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
వీణవంక (హుజూరాబాద్): తనను ఏకగ్రీవంగా సర్పంచ్ పదవికి ఎంపిక చేస్తామని మొదట ప్రకటించి.. తీరా మరొకరిని బరిలో దింపారంటూ మనస్తాపంతో కరీంనగర్ జిల్లా వీణవంక మం డలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన అంగిడి రాధ అనే మహిళ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వివరాలు.. హిమ్మత్‌నగర్ పంచాయతీ ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ పంచాయతీకి మూడో విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన అంగిడి రాధను బరిలో నిలపాలని టీఆర్ఎస్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు సూచించారు. కూలీ పనులు చేసుకునే రాధ ఇందుకు ఒప్పుకుంది. రాధను ఏకగ్రీవం చేయాలని పార్టీ కార్యకర్తలతోపాటు కులసంఘాలు తీర్మానించారు. నామినేషన్ సమయంలో అదే సామాజికవర్గానికి చెందిన మరో మహిళతో నామినేషన్ వేయించారు. తనను ఏకగ్రీవం చేస్తామని చెప్పి మరో అభ్యర్థిని బరిలో నిలపడంతో విషయాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ.. పార్టీ కార్యకర్తలు, స్థానిక పెద్దలు రాధకు బదులు మరో అభ్యర్థికి ప్రచారం చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. ఇది గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. -
సొమ్మసిల్లిన రాధ
బుచ్చిరెడ్డిపాళెం: భర్త ఇంటి ముందు న్యాయపోరాటం చేస్తున్న భార్య రాధ ఆదివారం ఒక్కసారిగా సొమ్మసిల్లి తల్లి ఒడిలో పడిపోయింది. అక్కడి నుంచి రాధను 108 వాహనంలో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాధకు చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా రాధ తల్లి జయమ్మ మాట్లాడుతూ తన కుమార్తెను ఆమె అత్త, మామలైన «శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసమ్మ మోసం చేసి ప్రసాద్‌రెడ్డితో పెళ్లి జరిపించాన్నారు. ప్రసాదర్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి మాయమాటలు చెప్పాడన్నారు. తన కుమార్తె వాళ్ల ఇంటి ముందు బైఠాయించినా నేటికీ పట్టించుకోవడం లేదన్నారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని ఆమె కోరారు. -
ఓ ప్రేమ కథ
విరాజ్ జె. అశ్విన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. రిద్ధి కుమార్, రాధా బంగారు కథానాయికలు. దర్శకుడు ఎన్. శంకర్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన టి. ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీఎస్ రాజు అల్లుడు కేఎల్ఎస్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ ఫైనాన్షియర్ సత్యరంగయ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. కేఎల్ఎస్ రాజు క్లాప్ ఇచ్చారు. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘దర్శకుడిగా ప్రతాప్కిది మొదటి సినిమా. మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత. ‘‘దర్శకునిగా అవకాశం ఇచ్చినందుకు రాజుగారికి థ్యాంక్స్’’ అన్నారు ప్రతాప్. కాశీ విశ్వనాథ్, అనీష్, వేణు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: టీఆర్ కృష్ణ చేతన్. -
ప్రాణాలు తీసిన పిన్ని
⇒ గత ఏడాది ఆగస్టులో నాలుగేళ్ల బాలిక హత్య ⇒ వివాహేతర సంబంధం, అసూయతో పిన్ని దురాగతం ⇒ తిరుమలలో ఘటన... ఛేదించిన పోలీసులు సాక్షి, తిరుమల: అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిహృదయాన్ని పిన్ని చిదిమేసింది. తానూ ఒక బిడ్డకు తల్లిననే విషయాన్ని మరిచి ముక్కుపచ్చలారని ఆడబిడ్డను కట్టెతో మోది, చెట్టుకు కటేసి అతి కర్కశంగా హత్య చేసింది. గత ఆగస్టు 24వ తేది జరిగిన ఈ హత్యాఘటన తిరుమల పోలీసులు దర్యాప్తులో ఛేదించారు. పోలీసుల కథనం కర్ణాటకలోని ఎట్టిగ గ్రామానికి చెందిన దేవరాజ్ (40) కొంతకాలంగా తిరుమలలో కూలి పనులు చేస్తున్నాడు. ఇతని భార్య ఉలిగమ్మ (35), ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయినా, అదేప్రాంతంలోని జ్యోతి (30)ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కుమారుడున్నాడు. తల్లి దుర్గమ్మ, మొదటి భార్యతోపాటు దేవరాజ్ కూలీ పనులకెళితే వారి పిల్లల ఆలనాపాలనా రెండో భార్య జ్యోతి చూసుకునేది. వివాహేతర సంబంధం జ్యోతికి పెళ్లికి ముందే సొంతూరిలోని జయానాయక్‌తో వివాహేతర సంబంధం ఉంది. మరో కులానికి చెందిన దేవరాజ్ జ్యోతిని పెళ్లి చేసుకోవడం జయానాయక్‌కు నచ్చలేదు. ఇదే సందర్భంలో దేవరాజ్ కూడా మొదటిభార్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో జ్యోతి ఆగ్రహం పెంచుకుంది. వారి ముగ్గురు కుమార్తెల్లో నాలుగేళ్ల రాధను హత్య చేయాలని నిర్ణయించుకుంది. గత ఏడాది ఆగస్టు 24వ తేదిన ఉదయం జ్వరం పేరుతో రాధను అశ్విని ఆస్పత్రికి తీసుకెళ్లి పేరు నమోదు చేసి చికిత్స చేయించింది. తర్వాత బాటగంగమ్మ ఆలయం మీదుగా పాపవినాశానికి వెళ్లే మెట్ల మార్గానికి 500 మీటర్ల దూరంలోని ముళ్ల పొదల్లో పెద్ద కట్టెతో మూడుసార్లు మోది రాధను హత్య చేసింది. బతికి వస్తుందేమో అన్న అనుమానంతో బండరాయిపై కూర్చోబెట్టి రాధ ప్యాంట్‌తోనే చేతులను పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి తిరిగి వచ్చేసింది. తర్వాత అనుమానం రాకుండా అదే రోజు భర్త దేవరారాజ్‌తో కలసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసింది. దాగని నేరం పోలీసు విచారణలో నేరం బయటపడింది. సోమవారం ఉదయం డీఎస్పి మునిరామయ్య, సీఐ తులసీరామ్, ఫోరెన్సిక్‌క్లూస్‌టీం బృందం నిందితురాలు జ్యోతిని వెంట బెట్టుకుని ఘటన స్థలికి వెళ్లారు. అక్కడ రాధకు చెందినదిగా భావిస్తున్న పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, దుస్తులు, పాదరక్షలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇదే సందర్భంగా రాధను ఎలా కూర్చోబెట్టింది? ఎలా కట్టెతో మోదింది? ఆ బిడ్డ ప్యాంటుతో ఎలా చెట్టుకు కట్టేసి హత్య చేసిందన్న వివరాలను ఘటన స్థలంలో పోలీసులకు చూపింది. -
ప్రతి పోలీస్ చూడాల్సిన సినిమా
‘‘హీరోలు చాలా బాధ్యతగా ఉంటున్నారు. ఓ సినిమా తేడా కొడితే కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని కథ నచ్చితేనే సినిమా చేస్తున్నారు’’ అన్నారు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. శర్వానంద్ హీరోగా చంద్రమోహన్ దర్శకత్వంలో ఆయన సమర్పణలో భోగవల్లి బాపినీడు నిర్మించిన ‘రాధ’ శుక్రవారం విడుదలైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘పోలీస్ అంటే దేవుడనే సందేశాన్ని ‘రాధ’లో వినోదాత్మకంగా చెప్పాం. ‘రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా’ తరహాలో ఫన్ క్యారెక్టర్లో శర్వా అద్భుతంగా నటించాడు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోలీసుల సేవను గుర్తు చేసేలా, వాళ్ల విలువ పెంచేలా ఈ సినిమా తీశాం. ప్రతి పోలీస్ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రమిది. త్వరలో పోలీసులకు స్పెషల్ షో వేయాలనుకుంటున్నాం. ‘బాహుబలి’ ప్రభంజనంలోనూ మా సినిమాకు తగినన్ని థియేటర్లు లభించాయి. ప్రేక్షకులూ చిత్రాన్ని ఆదరిస్తున్నారు’’ అన్నారు. -
'రాధ' మూవీ రివ్యూ
టైటిల్ : రాధ జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవికిషన్, ఆశిష్ విద్యార్థి, సంగీతం : రాధన్ దర్శకత్వం : చంద్రమోహన్ నిర్మాత : భోగవళ్లి బాపినీడు వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధ. ఇటీవల కామెడీ ఎంటర్టైనర్ లతో వరుస విజయాలు సాధిస్తున్న శర్వా, ఈ సారి చిన్న మెసేజ్ ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త డైరెక్టర్ చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధ.. శర్వా సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసిందా..? కథ : రాధకృష్ణ.. చిన్నతనంలోనే కృష్ణతత్వానికి ఆకర్షితుడై ఎప్పుడు భగవద్గీత వింటూ భగవంతుడే అంతా నడిపిస్తున్నాడని నమ్ముతుంటాడు. ఒకసారి తనను ప్రమాదం నుంచి కాపాడిన పోలీసే కృష్ణుడని నమ్మి కష్టాల్లో ఉన్నవారిని కాపాడే పోలీసు అవ్వాలని ఫిక్స్ అవుతాడు. అదే కసితో పెరిగి పెద్దవాడైన రాధకృష్ణ.. యూనిఫాం లేకపోయినా క్రిమినల్స్ ఆట కట్టిస్తుంటాడు. డిపార్ట్మెంట్ కు కృష్ణ చేసిన సాయాన్ని గుర్తించిన డీజీపీ.. రాధకు ఎస్సైగా ఉద్యోగం ఇప్పిస్తాడు. కేసులు లేని స్టేషన్ లో పనిచేయటం ఇష్టం లేదని కోరి మరీ ఎప్పుడూ కేసులు క్రిమినల్స్ తో కలకలలాడే ధూల్ పేట్ స్టేషన్ కు ట్రాన్సఫర్ తెచ్చుకుంటాడు. రాధ చార్జ్ తీసుకున్న టైంలో పీపుల్స్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో గొడవలు జరుగుతుంటాయి. సిట్టింగ్ సీఎం (కోట శ్రీనివాసరావు) తన తరువాత ముఖ్యమంత్రిగా సుజాత (రవికిషన్), సూర్రెడ్డి (ఆశిష్ విద్యార్థి)ల్లో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని హైకమాండ్ కు సూచిస్తాడు. అదే సమయంలో సుజాత మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఈ బ్లాస్ట్ లో కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా చనిపోతారు. పోలీసులు తాగి నిర్లక్ష్యంగా వ్యవహరించటం కారణంగానే ఇలా జరిగిందన్న ప్రచారం జరుగుతుంది. పోలీసుల మీద ఈగ వాలితేనే ఒప్పుకొని రాధకృష్ణ.. పోలీసుల మీద పడ్డ నింద ఎలా చెరిపేశాడు..? అసలు సుజాత మీటింగ్ లో బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరు..? వాళ్ల ఆట రాధకృష్ణ ఎలా కట్టించాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న శర్వానంద్.. ఈ సారి మాత్రం రొటీన్ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తనని తాను కృష్ణుడిగా భావించే పోలీసు ఆఫీసర్ పాత్రలో మంచి కామెడీ పండించాడు. కామెడీ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించిన శర్వానంద్ అంతా తానే అయి సినిమాను నడిపించాడు. హీరోయిన్ పాత్రకు కథలో పెద్దగా స్కోప్ లేకపోవటంతో లావణ్య గ్లామర్ షోతో సరిపెట్టుకుంది. ఉన్నంతలో లవ్ సీన్స్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెప్పించింది. విలన్ గా రవికిషన్ మరోసారి ఆకట్టుకున్నాడు. పైకి మంచివాడుగా నటించే క్రూరమైన పొలిటీషిన్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, బ్రహ్మాజీ, శంకర్, సప్తగిరి, తనికెళ్ల భరణి, అక్ష తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : సక్సెస్ ట్రాక్ లో ఉన్న శర్వానంద్ లాంటి యంగ్ హీరో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చంద్రమోహన్ తొలి ప్రయత్నంలో పరవాలేదనిపించాడు. శర్వానంద్ నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ కథను రెడీ చేసుకున్న దర్శకుడు కథనంలో మాత్రం కాస్త తడబడ్డాడు. అయితే శర్వా ఎనర్జీ, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. సాంగ్స్ తో పరవాలేదనిపించిన రాధన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. ముఖ్యంగా అసలు కథ మొదలైన తరువాత వచ్చిన లవ్ సీన్స్ కాస్త ఇబ్బంది పెడతాయి. డైలాగ్స్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : శర్వానంద్ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : స్క్రీన్ ప్లే స్లో సెకండ్ హాఫ్ రాధ.. బాహుబలి ఫీవర్ తరువాత మంచి రొమాంటిక్ కామెడీతో రిలీఫ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నిఖిల్ డైరెక్టర్‌తో శర్వా
స్టార్ హీరోలతో ఢీ అంటే ఢీ అని సత్తా చాటిన యంగ్ హీరో శర్వానంద్. వరుసగా రెండు సంక్రాంతి సీజన్లలో టాప్ స్టార్లతో పోటి పడి సక్సెస్ సాధించిన శర్వానంద్, ఈ శుక్రవారం రాధగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ స్క్రీన్ మీద సక్సెస్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న పోలీస్ కథతో అలరించనున్నాడు శర్వా. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మరో సినిమాను ఫైనల్ చేశాడు ఈ యంగ్ హీరో. స్వామి రారా సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన సుధీర్ వర్మ ప్రస్తుతం మరోసారి నిఖిల్ హీరోగా కేశవ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మే మూడో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కేశవ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కేశవ తరువాత సుధీర్ వర్మ, శర్వానంద్ హీరోగా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే శర్వానంద్‌కు లైన్ వినిపించిన దర్శకుడు ప్రస్తుతం పూర్తి కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. -
‘రాధ’ మూవీ ఫ్రీ రిలీజ్
-
కాంబినేషన్ కుదిరిందా?
రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి... ఇలా మూడు వరుస విజయాలతో శర్వానంద్ హ్యాట్రిక్ సాధించారు. ‘మినిమమ్ గ్యారంటీ’ హీరో అనే పేరు సంపాదించుకున్న శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘రాధ’ 12న విడుదల కానుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. ఇది కాకుండా దశరథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారన్నది తాజా సమాచారం. సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్... ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసే చిత్రాలను తెరకెక్కించిన దశరథ్... ఇప్పుడు శర్వానంద్‌తో ఓ మంచి లవ్‌స్టోరీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ కాంబినేషన్ నిజంగానే కుదిరిందా? లేదా? అన్నది మరో పది రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే, అన్నీ కుదిరితే టెన్ డేస్ తర్వాత అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. -
మరోసారి పండుగ బరిలో శర్వానంద్
వరుసగా తెలుగు పండుగలను టార్గెట్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధిస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇప్పటికే వరుసగా రెండు సార్లు సంక్రాంతి బరిలో టాప్ స్టార్ అనిపించుకున్న శర్వానంద్ మరోసారి పండుగ బరిలో సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. 2016 సంక్రాంతికి ఎక్స్‌ప్రెస్ రాజాగా వచ్చిన శర్వ.. బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్లు బరిలో ఉన్నా మంచి విజయం సాధించాడు. అదే ఫీట్ రిపీట్ చేస్తూ 2017 సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణలు పోటి పడుతున్న సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఘనవిజయం సాధించాడు. అదే సెంటిమెంట్ ను మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాడు శర్వానంద్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న రాధ సినిమాను ఈ ఉగాది బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఉగాది వారం రోజుల ముందు పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్ అవుతున్నా.. పోటికే సై అంటున్నాడు. మరి శర్వ నమ్మకం మరోసారి నిజమౌతుందేమో చూడాలి. -
రాధ.. చాలా సిన్సియర్
కృష్ణుడు వెన్న దొంగిలిస్తాడు. మహాభారతంలోని ముచ్చటది. ఈ ‘రాధా’కృష్ణుడు ఎవరేం స్వాహా చేసినా తాట తీస్తాడు. ఎందుకంటే... ఈయన కృష్ణుడిలా వెన్నదొంగ కాదు, పోలీసాఫీసర్ మరి. కానీ, కృష్ణుడిలో చిలిపితనం ఈయనలో కనిపిస్తుంది. ఇది నేటి భారతంలోని కథ. ఇందులో శర్వానంద్ హీరో. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తనయుడు భోగవల్లి బాపినీడు నిర్మాణంలో శర్వానంద్ సిన్సియర్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న సినిమాకి ‘రాధ’ అనే టైటిల్ ఖరారు చేశారు. చంద్రమోహన్ దర్శకునిగా పరిచయమవు తున్న ఈ సినిమా చిత్రీకరణ ఓ పాట మినహా పూర్తయింది. ఉగాది కానుకగా మార్చి 29న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘అటు క్లాస్.. ఇటు మాస్ ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. రొమాన్స్, కామెడీ, యాక్షన్లతో దర్శకుడు చంద్రమోహన్ పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు’’ అని నిర్మాత తెలిపారు. లావణ్యా త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: రధన్. -
మధ్యాహ్నం హత్య
పట్టుకోండి చూద్దాం అలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. చివరకు... సుబ్బారావుకు అతి సన్నిహితులైన మిత్రులు కూడా. అరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న సుబ్బారావు... పాతికేళ్ల అమ్మాయి రాధను పెళ్లి చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సుబ్బారావు భార్య చాలా సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకోమని బంధువులు, మిత్రులు ఒత్తిడి తెచ్చారు. ‘‘నా పెళ్లి సరే... ఆమె నా బిడ్డల్ని బాగా చూసుకుంటుందనే నమ్మకం నాకు లేదు. అందుకే... పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నాను’’ అంటూ పెళ్లి చేసుకోకుండా... తానే తల్లై ఇద్దరు కొడుకులను కంటికి రెప్పలా చూసుకున్నాడు సుబ్బారావు. ఏరోజూ ‘పెళ్లి’ అనే ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా? సుబ్బారావు పెళ్లిపై రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. కష్టాల్లో ఉన్న రాధను పెళ్లి చేసుకోవడానికే సుబ్బారావు పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు. కాదు... ఆరోగ్యం బాగ లేకపోవడం వల్ల... తనను చూసుకునేవారు ఎవరూ లేకపోవడం వల్ల... గత్యంతరం లేని పరిస్థితుల్లో రాధను పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు. పేద అమ్మాయికి డబ్బు ఆశ చూపి... కేవలం తన స్వార్థం కోసం పెళ్లి చేసుకున్నాడు అంటారు కొందరు. లేదు... ఆస్తి మొత్తం కాజేయడానికి రాధ... ప్లాన్ ప్రకారమే సుబ్బారావుని పెళ్లిచేసుకుంది అంటారు కొందరు. ఎవరి అభిప్రాయం వారిది. ఏ అభిప్రాయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు. అయితే వారి ఇంటికి వెళ్లిన వాళ్లు మాత్రం... సుబ్బారావుని రాధ పువ్వుల్లో పెట్టి చూసుకుంటుందని మెచ్చుకునేవాళ్లు. ఈరోజుల్లో... రాధలాంటి అమ్మాయిని చూడలేదని కూడా అనేవాళ్లు. సుబ్బారావు ఇద్దరు కొడుకులు మొదట్లో రాధతో సరిగ్గా మాట్లాడేవారు కాదు. ‘‘ఒకవేళ మీ అమ్మ బతికి ఉన్నా... రాధలా చూసుకొని ఉండేది కాదేమో’’ అని కూడా చాలా మంది చెప్పడంతో వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇక అప్పటి నుంచి... రాధను సొంతింటి మనిషిలా చూసుకునేవారు. రాధ కోసం... ఆమె మేనమామ మంగపతి తరచుగా వచ్చిపోతుండేవాడు. ‘‘అమ్మా, నాన్న లేని రాధను చిన్నప్పటి నుంచి నేనే పెంచి పెద్ద చేశాను’’ అని అందరికీ చెబుతుంటాడు మంగపతి. ‘మంగపతి మోసగాడు. తాగుబోతు. డబ్బు కోసం రాధను వేధిస్తాడు’ అని ఎక్కువమంది చెప్పుకుంటారు. ఇదే విషయాన్ని రాధ దగ్గర ఎవరో ప్రస్తావించినప్పుడు.. ఆమె ఏడ్చినంత పనిచేసింది. ‘‘మామయ్య అలాంటి వాడు కాదు... దేవుడు’’ అంది. ఒకసారి సుబ్బారావుకు యాక్సిడెంట్ జరిగి కాలు విరిగింది. కొద్ది నెలల తరువాత మాత్రం...క్రచ్ సహాయంతో నడవడం ప్రారంభించాడు. ఉన్నట్టుండి ఒకరోజు మధ్యాహ్నం... ‘సుబ్బారావు చనిపోయాడు’ అనే వార్త అగ్గిలా వ్యాపించింది. ‘ఎలా చనిపోయాడటా?’ ‘మెట్లపై నుంచి జారి పడి’ సంఘటన స్థలికి హుటాహుటిన వచ్చాడు ఇన్స్పెక్టర్ నరసింహ. రాధ ఏడుస్తుంది... ఇన్స్పెక్టర్ను చూస్తూ... ‘‘మీకేదైనా పని ఉంటే పిలిచి నాకు చెప్పండి. మెట్లు దిగి వెళ్లొద్దు... అని తరచు చెప్పేదాన్ని. ఆయన నా మాట వినిపించుకునేవారు కాదు. ఈరోజు కూడా క్రచ్ సహాయంతో మెట్లు దిగి బ్యాలెన్స్ తప్పి మెట్ల మీది నుంచి దొర్లుతూ కింద పడిపోయారు. శబ్దం విని... నేను పరుగెత్తుకుంటూ వచ్చాను. నేను వచ్చేలోపే ఆయన ప్రాణం పోయింది’’ అని చెప్పింది. ‘‘ఇది ప్రమాదం కాదు... హత్య!’’ అని గట్టిగా అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ చెప్పింది అక్షరాలా నిజమైంది. అది ప్రమాదం కాదు... హత్య! సుబ్బారావు ప్రమాదవశాత్తు చనిపోలేదని ఇన్స్పెక్టర్ ఎలా చెప్పగలిగాడు? క్లూ: స్టెయిర్స్ జ్చిఛీ ట్చజీ సుబ్బారావు కుడి చేతి వైపు ఉంది. ఎడమ చేయిని మాత్రం ‘క్రచ్’ పట్టుకోవడానికి ఉపయోగించేవాడు. Ans : స్టెయిర్స్ కింద ఉన్న ఫ్లోర్‌పై బొక్కబోర్ల పడి ఉన్నాడు సుబ్బారావు. అయితే... ‘క్రచ్’ మాత్రం కుడి చేయి పక్కన పడి ఉంది. కుడిచేతికి ఆసరగా జ్చిఛీ ట్చజీ ఉండగా ‘క్రచ్’ వాడాల్సిన అవసరమే ఉండదు కదా! ఇంతకంటే అనుమానించాల్సిన విషయం ఏముంటుంది! -
రోడ్డు ప్రమాదంలో తెగిన పడిన మహిళ చేయి
ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం కర్రివారిగూడెం సమీపంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చేయి తెగిపోయింది. వివరాలివీ... పెద్దతండా గ్రామానికి చెందిన భూక్యా రాధ తన భర్తతో కలసి కట్టెలు వేసుకుని సైకిల్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాధ కుడి చేయి తెగిపడిపోయింది. ఆమె భర్తకు గాయాల య్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా రాధ
హన్మకొండ చౌరస్తా : హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధకు మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి లభించిం ది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేష¯ŒS ఉత్తర్వు లు జారీ చేసినట్లు తెలిసింది. రాధ ప్రస్తుతం జీఎంహెచ్ ఎఫ్ఏసీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీ చేస్తూ పదోన్నతి క ల్పించినట్లు సమాచారం. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ రాధ మాట్లాడుతూ పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేయడం వాస్తవమే అన్నారు. పదోన్నతిని స్వీకరించాలా ఇక్కడే కొనసాగాలా అనే అంశంపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నేటి వర్షాలతో పంటలకు ప్రయోజనంలేదు
–ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పాలెం శాస్త్రవేత్తలు వనపర్తిరూరల్: అల్పపీడన తుపాను వల్ల వేసిన పంటలకు ఎలాంటì ప్రయోజనం లేదని, ఒక్క కందికి మాత్రమే కొంత ఉపయుక్తంగా ఉంందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, కషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్తలు డాక్టర్ స్పందన, డాక్టర్ అనురాధ అన్నారు. రైతులు వేసిన పంటలను తీవ్రంగా నష్టపోయారని, కనీసం కందినైనా దక్కించుకోవాలన్నారు. మంగళవారం వారు మండల వ్యవసాయశాఖ అధికారి నర్సింహ్మరెడ్డితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, కంది, ఆముదం పంటలను పరిశీలించారు. మొక్కజొన్న ఇప్పటికే వేసిన పంటల పూర్తి స్థాయిలో నష్టాన్ని కూడగట్టుకుందని, అన్ని యజమాన్య పద్ధతులు పాటించినా వర్షాలు లేక రైతులు ఎకరాకు రూ.15వేల నుంచి రూ.20వేలు నష్టపోయినట్లు రైతులు చెప్పారన్నారు. ఆముదం కూడా 70 శాతం నుంచి 80శాతం వరకు పంటను రైతులు నష్టపోయారని వారు తెలిపారు. జొన్న పంట గింజలు గట్టిపడే దశలో ఉన్నందున వర్షాలకు గింజ బూజెక్కకుండా ప్రొఫికోనోజోల్ 0.5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేయాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల బందం పంటల పరిశీలనకు రాగా ఎంపీపీ Ô¶ ంకర్‌నాయక్ వారిని కలిసి వర్షాలు లేక పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విన్నవించారు. ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వర్తింప చేసి ఆదుకోవాలని కోరారు. -
చిరంజీవిగారు మా అమ్మకు పేరు పెట్టారు!
పాతికేళ్ల క్రితం వెండితెరపై సందడి చేసిన హిట్ పెయిర్స్‌లో చిరంజీవి-రాధల జంట ఒకటి. 1980 టు 1990 వరకూ చిరూ సరసన రాధ దాదాపు పదిహేను సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయేలా ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు బర్త్‌డే సందర్భంగా ‘సాక్షి’కి రాధ ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... చిరంజీవిగారిని మొదటిసారి మీరెప్పుడు కలిశారు? ‘గూండా’ సినిమాకి. ఆయన పక్కన నేను యాక్ట్ చేసిన మొదటి సినిమా అది. తెలుగు సినిమాలు చేయడం మొదలు పెట్టాక ఇక్కడి హీరోల డ్యాన్సులు చూసి ఆశ్చర్యపోయాను. చిరంజీవిగారి డ్యాన్స్ సూపర్. నటుడిగా ఆయన గురించి? డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుండే ది. ఎంత శ్రద్ధగా యాక్ట్ చేసేవా రంటే కెమేరా ముందుకెళ్లి పోయిన తర్వాత తాను చిరంజీవి అనే విషయాన్ని మర్చి పోయారేమో అనిపించేది. ఆయన తో డ్యాన్స్ అంటే ఇష్టంగా ఉండేది. పోటాపోటీగా చేయొచ్చు కదా. పోటీపడి డ్యాన్స్ చేయాలని ఆయనకు తెలియకుండా ముందుగా మీరు ప్రాక్టీస్ చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా? అలా ఎప్పుడూ చేయలేదు. ఒకే ఒక్కసారి మాత్రం స్టెప్స్ ముందుగానే తెలుసుకున్నాను. ‘మరణ మృదంగం’లో ‘కొట్టండి తిట్టండి.. గిల్లండి.. గిచ్చండి...’ పాట ఉంది కదా. ఆ పాటని ఢిల్లీలో తీసినట్లు గుర్తు. అప్పుడు ఫ్లైట్‌లో నేను, తారా మాస్టర్ వెళ్లాం. ‘ఈవిడ ఈ పాటకి మనల్ని బాగా కష్టపెట్టడం ఖాయం’ అని ఫిక్సయ్యాను. ఎలాంటి స్టెప్స్ అనుకుంటున్నారో ముందే ఆవిడ చెప్పడంతో నాకో క్లారిటీ వచ్చేసింది. లొకేషన్లో నేను ఈజీగా చేసేశాను. అప్పుడు ‘నీకింత తొందరగా ఎలా వచ్చింది?’ అని చిరంజీవిగారు అడిగితే నవ్వాను. రాధికగారు, మీరు చిరంజీవిగారితో ఎక్కువ సినిమాలు చేశారు. ఆవిడతో మీకేమైనా పోటీ? అప్పట్లో మేం బాగా పోటీపడేవాళ్లం అనుకునేవాళ్లు. మా మధ్య మాత్రం పోటీ ఉండేది కాదు. నేను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో చేసేదాన్ని. సంవత్సరానికి కనీసం పది సినిమాలకు పైగా చేతిలో ఉండేవి. దాంతో ఎవరి గురించీ ఆలోచించే తీరిక ఉండేది కాదు. పైగా నా స్టైల్ వేరు. రాధిక స్టైల్ వేరు. చిరంజీవిగారితో మీ కెమిస్ట్రీ బాగా కుదరడానికి కారణం? వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాక కంఫర్ట్ లెవల్స్ పెరిగాయి. ఎన్టీఆర్‌గారు, కృష్ణగార్ల కాంబినేషన్లో చేసినప్పుడు వాళ్లు వయసులో బాగా పెద్దవాళ్లు కాబట్టి ఫ్రీగా మాట్లాడలేకపోయేదాన్ని. వాళ్లు ఫ్రెండ్లీగా ఉన్నా నేను ఉండలేక పోయేదాన్ని. చిరంజీవిగారితో ఆ ప్రాబ్లమ్ లేదు. ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. దాంతో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. మీ ఫ్రెండ్షిప్ షూటింగ్స్ వరకేనా.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండేవారా? సురేఖగారు (చిరంజీవి సతీమణి) నాకు బాగా తెలుసు. చాలా ఫ్రెండ్లీ టైప్. ఒకసారి షూటింగ్‌కి వచ్చారు. ఆ తర్వాత చాలా సందర్భా ల్లో కలిశాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లానే ఉంటాం. చిరంజీవి గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌నీ బాగా బ్యాలెన్స్ చేసుకునేవారు. అది నాకు ఇన్స్పైరింగ్గా ఉండేది. అప్పట్లో మీ అమ్మగారు షూటింగ్‌కి వచ్చేవారా...? ఆల్మోస్ట్ వచ్చేవారు. మా అమ్మగారు కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉండేవారు. ఆవిడంటే చిరంజీవిగారికి ఇష్టం. చాలా బాగా మాట్లాడేవారు. మా అమ్మకి ఓ నిక్‌నేమ్ కూడా పెట్టారాయన. ‘హిట్లరమ్మ ఎక్కడ?’ అని సరదాగా అనేవారు. మా అమ్మగారు కూడా చిరంజీవిగారంటే అభిమానంగా ఉండేవారు. 1980 రీ యూనియన్ పేరుతో ప్రతి ఏడాది మీరంతా కలుస్తుంటారు కదా అప్పట్లో యాక్ట్ చేసిన మేమంతా కలుస్తుంటాం. చెన్నై, బెంగళూరు.. ఇలా ఒక్కోసారి ఒక్కో చోట కలుస్తుంటాం. ఓసారి చిరంజీవిగారు హైదరాబాద్‌లో తన ఇంట్లో ఏర్పాటు చేశారు. రుచికరమైన వంటలు తయారు చేయించారు. ఎవరికీ బోర్ కొట్టకుండా ఉండేలా ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ చేశారు. అందరూ కంఫర్ట్‌గా ఉన్నారా? అని మరీ మరీ అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎంత మంచి హోస్టో అప్పుడు తెలిసింది. చిరంజీవిగారు నైస్ పర్సన్. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆ పాట ఓ చాలెంజ్ ‘స్టేట్ రౌడీ’లోని ‘రాధ రాధ మదిలోన మన్మథ బాధ...’ పాట నాకో చాలెంజ్. ఆ పాట కోసం టైట్ ప్యాంటు, షర్టు వేసుకున్నాను. తారా మాస్టర్ చాలా హెవీ స్టెప్స్ సమకూర్చారు. కాలు బాగా పెకైత్తి డ్యాన్స్ చేయాలి. కానీ, నేను వేసుకున్న ప్యాంటు టైట్ కాబట్టి ఆ స్టెప్స్ చేయలేననుకున్నాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు మామూలుగా చేశాను.. షూట్ చేసేటప్పుడు ప్యాంటు చిరిగితే చిరిగిందిలే అనుకుని రెచ్చిపోయి డ్యాన్స్ చేశాను. పక్కన హీరో దూకుడుగా స్టెప్స్ వేస్తుంటే నేనెందుకు తగ్గాలన్నది నా పట్టుదల (నవ్వుతూ). -
సినిమాలకు స్టార్ వారసురాలు గుడ్ బై..?
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కార్తీక. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కూతురిగా అందరి దృష్టిని ఆకర్షించిన కార్తీక, తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిలో ఆఫర్లు మాత్రం సాధించలేకపోయింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సరసన నటించినా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తెలుగులో హిట్ ఇవ్వకపోయినా తమిళ నాట హీరోయిన్గా నటించిన రంగం సినిమాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమా కూడా కార్తీక కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. అందుకే కొద్ది రోజులుగా సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంటున్న ఈ అందాల భామ, ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని డిసైడ్ అయ్యిందట. అయితే నటిగా మాత్రం కొనసాగేందుకు ఓ హిందీ టివి సీరియల్లో నటించాలని నిర్ణయించుకుంది. మరి బుల్లి తెర అయినా ఈ స్టార్ వారసురాలికి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. -
అయ్యో నాన్న!
స్థానికులు సమాచారం అందిస్తే ‘అయితే నేనేం చేయాలి’ అన్న కొడుకు కేజీహెచ్‌కు తరలించిన స్థానికులు చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తినిపిస్తే.. నాన్న చేయి పట్టుకుని ఈ లోకాన్ని చూపిస్తూ నడక నేర్పుతాడు. అల్లారు ముద్దుగా పెంచి.. కావాల్సిందల్లా కొనిపెట్టి.. ఏది మంచో.. ఏది చెడో చెబుతూ నడత నేర్పుతాడు. అలాంటి తండ్రి.. వయసుడిగి.. కదల్లేని స్థితికి చేరాక.. ఆతని రక్తం పంచుకుపుట్టిన కొడుకే నడిరోడ్డుపైకి ఈడ్చేశాడు. నడవలేని స్థితిలో కాలువలో పడిపోయిన ఆ తండ్రిని.. స్థానికులు బయటికి తీసి.. సపర్యలు చేసి.. పోలీసుల సహకారంతో కేజీహెచ్‌కు తరలించారు. అల్లిపురం: వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న సబ్బవరానికి చెందిన సకురు సీతారామయ్య (75)ను అల్లిపురం, రైల్వేక్వార్టర్స్, రైల్వే కోర్డు మేజిస్ట్రేట్ బంగళా వద్ద సోమవారం సాయంత్రం ఆతని కుటుంబ సభ్యులు వదిలేసి వెళ్లిపోయినట్లు స్థానికులు గుర్తించారు. అప్పటి నుంచీ అక్కడే పడి ఉన్న అతడు మంగళవారం ఉదయం పక్కనే ఉన్న కాలువలో పడిపోయి ఉండడాన్ని చూసి, బయటికి తీసి పక్కన పడుకోబెట్టారు. దారిన పోయేవారంతా.. అతడిని చూసి.. అయ్యో అంటూ నిట్టూర్చారు. కొందరు రొట్టెలు, మంచినీళ్లు తెచ్చి అందించారు. మండుటెండలోనే పడి ఉన్న వృద్ధుడిని ఒక మీడియా వ్యాను డ్రైవర్ విశ్వేశ్వరరావు, స్థానిక మోటార్ మెకానిక్ ఎం.డి. ఆలీ సపర్యలు చేసి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. కాస్త తేరుకున్న వృద్ధుడిని ఆరా తీసి, అతని కొడుకు వివరాలు తెలుసుకున్నారు. సీతారామయ్యకు సబ్బవరం పోలీస్ స్టేషన్ ఎదురుగా నాలుగు పోర్షన్ల ఇల్లు ఉందని, కొడుకు పేరు సకురు వెంకటరమణ అని, కోడలి పేరు రాధ అని, కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారని చెప్పటంతో తెలిసిన వారు సబ్బవరంలో ఉన్న స్నేహితులకు ఫోన్ చేసి వివరాలు అందించే ప్రయత్నం చేశారు. వారు అతని ఇంటి అడ్రస్ తెలుసుకుని కొడుకు ఫోన్ నంబరు సంపాదించి, వెంకటరమణకు ఫోన్ చేసి తండ్రి పరిస్థితిని వివరించారు. ‘అయితే.. నేనేం చేయాలి’ అని, తాను వీరఘట్టంలో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటంతో అవాక్కయ్యారు. ఇంతలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108కు సమాచారం ఇవ్వటంతో వారు సీతారామయ్యను కేజీహెచ్‌లో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య ఉండగానే మరో పెళ్లి..
న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ చెన్నారావుపేట : మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి భార్య ఉండగానే మరో స్త్రీని వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై పులి వెంకట్ కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన కందకట్ల శ్రీనివాస్, సావిత్రి దంపతుల కుమార్తె సాహితి(స్వప్న)ని వరంగల్ లేబర్ కాలనీ(అబ్బకుంట)కి చెందిన నల్ల రాధ, చంద్రవళి దంపతుల కువూరుడు రాజుకు ఇచ్చి రెండేళ్ల క్రితం రూ.6 లక్షల నగదు, 5 తులాల బంగారం, తదితర కానుకలిచ్చి పెళ్లి చేయించారు. కొన్ని రోజులు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత భర్త రాజుతో పాటు అత్త మామలు రాధ, చంద్రవళి, ఆడపడుచులు రజిని, రాజ్యలక్ష్మీ, మరిది ప్రసాద్ అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో నిండు గర్భిణిగా ఉన్న సాహితి 7 నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోరుుంది. అక్కడ ఉంటున్న క్రమంలో బాబుకు జన్మనిచ్చింది. ఇంతలోనే ఎవరికీ చెప్పకుండా ఈ నె ల 10న గోనె స్వాతితో రాజు మరో పెళ్లి చేసుకున్నాడు. తాను ఉండగానే వురో స్త్రీని వివాహం చేసుకున్న రాజుపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయుం చేయూలని నల్ల సాహితి ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
కూలి పనులకు సైకిల్ పై వెళ్తున్న భార్యా భర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద బుధవారం చోటుచేసుకుంది. మంగళాపురం గ్రామానికి చెందిన కొల్లూరి వీరయ్య, రాధ దంపతులు లక్ష్మీపురం వద్ద కూలి పనులకు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో రాధ అక్కడికక్కడే మృతిచెందగా.. వీరయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
గరిడేపల్లిలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడంలో ఓ ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారి రాధా మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వెంకన్న సేవలో నాటి నేటి తారలు
సాక్షి, తిరుమల: నాటి అందాల తార రాధ, నేటి తార, ఆమె కుమార్తె కార్తిక మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త రాజశేఖరన్ , తన ఇద్దరు కుమార్తెలు కార్తిక, తులసితో కలసి వచ్చారు. వీరికి అధికారులు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించారు. లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తల్లీకుమార్తెల్ని చూసేందుకు అభిమానులు పెద్దయెత్తున అక్కడికి చేరుకున్నారు. రాధ మాట్లాడుతూ తన భర్త రాజశేఖరన్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నామని, చాలా సంతోషంగా ఉందని అన్నారు. -
వెంకీ బాబూ... బంగారం!
కొందరు కుటుంబ కథలు చేసి మెప్పిస్తారు... మరికొందరు కామెడీ కథల్లో తెరపై భేష్ అనిపిస్తారు... ఇంకొందరు యాక్షన్ కథలతో ఈలలేయిస్తారు. ...కానీ, ఇలాంటి కథలన్నిటిలో పేరు తెచ్చుకోవడమంటే కష్టమే. అలాంటి కష్టాన్ని వెండితెరపై సాధ్యం చేసి, బాక్సాఫీస్‌ను కళకళలాడేలా చేసిన హీరోలు కొందరే. అలాంటి ఘనత సాధించిన సమకాలీన హీరోల్లో ముందుండే పేరు - వెంకటేశ్.... అభిమానుల మాటల్లో ‘విక్టరీ’ వెంకటేశ్... ఒక్కమాటలో హీరో వెంకటేశ్. ఈ ఏడాది ప్రథమార్ధంలో మలయాళ హిట్ ‘దృశ్యమ్’ రీమేక్‌లో కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించిన వెంకీ... ఇప్పుడు కామెడీ జానర్లో కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. యువ దర్శకుడు మారుతి సారథ్యంలో ఎస్. నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సినిమా పేరు - ‘బాబూ... బంగారం’ అని ఖరారు చేశారు. గతంలో ‘లక్ష్మీ’, ‘తులసి’ లాంటి హిట్స్ ఇచ్చిన వెంకటేశ్ - నయనతారల కాంబినేషనే ఇందులోనూ మరోసారి కనువిందు చేయనుంది. నిజానికి, మారుతి దర్శకత్వంలో ‘రాధ’ అనే సినిమా వెంకటేశ్ గతంలో చేయాల్సి ఉంది. అప్పట్లో అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఆ కాంబినేషన్ ఇప్పుడు ఈ కొత్త స్క్రిప్ట్‌తో తెర ముందుకు వచ్చింది. అయితే, ‘‘అప్పట్లో చేసిన ‘రాధ’ స్క్రిప్ట్కీ, దీనికీ సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్త స్క్రిప్ట్. ఇందులో వెంకటేశ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా కనిపిస్తారు. వినోదం పండించే పోలీసు పాత్ర అది’’ అని చిత్ర యూనిట్‌లోని విశ్వసనీయ వర్గాల భోగట్టా. విశేషం ఏమిటంటే, ఈ చిత్రానికి దర్శకుడితో పాటు ఇతర విభాగాల్లోనూ యువ బృందంతో వెంకటేశ్ జట్టు కడుతున్నారు. ఇటీవల కమలహాసన్ సినిమాలన్నిటికీ సంగీతం అందిస్తున్న జిబ్రాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డెరైక్టర్. ప్రసిద్ధ కెమేరామన్ పి.సి. శ్రీరామ్ సహాయకుడు వివేక్ ఛాయాగ్రాహకుడు. ఈ నెల 16 నుంచి ఏకధాటి షెడ్యూల్‌తో హైదరాబాద్ పరిసరాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. రెండు పాటలకు మాత్రం విదేశాలకు వెళ్ళాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇటీవల వెంకటేశ్ కొంత విరామం తీసుకున్నప్పటికీ, పూర్తిస్థాయి వినోదం పంచే ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ఆయన విజయ ప్రస్థానంలో కొత్త మైలురాయి అవుతుందని అభిమానుల నమ్మకం. ఆ నమ్మకం నిజం కావడానికీ, జనం తెరపై వినోదాన్ని ఆస్వాదించడానికీ వచ్చే వేసవి చివర మే నెలాఖరు దాకా ఆగాలి. అందుకు సిద్ధమవుతూ, ఇవాళ బర్త్‌డే జరుపుకొంటున్న బాక్సాఫీస్ బాబూ... బంగారం వెంకటేశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. కొత్త ప్రాజెక్ట్‌కు ఆల్ ది బెస్ట్! -
వెంకటేష్‌తో మరోసారి జోడీ కట్టబోతున్న నయన్
-
ఆత్మహత్యాయత్నం వెనుక... యూనియన్ల వర్గపోరు
విజయవాడ : రైల్వే ఆస్పత్రిలో పనిచేస్తున్న మొండెం రాధ ఈనెల 3న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘన వెనుక యూనియన్ల వర్గపోరు ఉన్నట్లు తేటతెల్లమైంది. గత నెల 21న రైల్వే ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎంప్లాయిస్ సంఘ్ విజయం సాధించింది. మజ్దూర్ యూనియన్ ఓటమిపాలైంది. ఎంప్లాయిస్ సంఘ్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుండగా మజ్దూర్ యూనియన్ను వామపక్ష పార్టీలు బలపరుస్తున్నాయి. అయితే వారు ప్రత్యక్షంగా ఎక్కడా పాల్గొనలేదు. రజనీకుమారిపై ఆరోపణలు ఆస్పత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న ఎ. రజనీకుమారి తనను వేధిస్తున్నారని 20 రోజుల క్రితం మహిళా విభాగం హెడ్నర్స్ ఎం రాధ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆయన సరిగా పట్టించుకోలేదు. దీంతో హెడ్నర్స్ రజనీకుమారి వేధింపుల వ్యవహారాన్ని భర్త రాజశేఖర్‌కు రాధ తెలిపింది. దీంతో రాజశేఖర్ ఆస్పత్రికి వచ్చి హెడ్‌నర్స్‌ను నిలదీశాడు. తన సెల్‌ఫోన్ విరగొట్టి తనపై దాడి చేసినట్లు రజనీకుమారి రాజశేఖర్‌పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసుపెట్టింది. తన భర్తపై పెట్టిన కేసు విరమించుకోవాలని రజనీకుమారిని రాధ కోరింది. అందుకు నిరాకరించిన రజనీకుమారి, రాధను మరింత అవమానించింది. దీన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇందుకు కారణం రజనీకుమారేనని చెప్పింది. ఈ మేరకు రాజశేఖర్ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో రజనీకుమారిపై కేసు పెట్టాడు. ఓటమిని జీర్ణించుకోలేకే... రజనీకుమారి ఆస్పత్రి విభాగం నుంచి యూనియన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ సభ్యురాలుగా ఎంప్లాయీస్ సంఘ్ తరఫున పోటీ చేయగా, మజ్దూర్ సంఘ్ సభ్యుడు తిరుపతి స్వామి గెలుపొందాడు. ఓటమిని తట్టుకోలేక తనను వేధించడం ప్రారంభించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో వర్గపోరే ఎక్కువ ఆస్పత్రిలో రెగ్యులర్ సిబ్బంది 25 మంది ఉన్నారు. వీరు కాకుండా మెడికల్ కాలేజీ నుంచి 50 మంది విద్యార్థులు వస్తుంటారు. రైల్వే ఉద్యోగులకు వైద్య సేవలు బాగా అందించే అవకాశం ఉంది. అయితే రిటైర్డ్ ఉద్యోగులు వచ్చినప్పుడు వారిని విసుక్కోవడం, సరిగా వైద్యం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ల మధ్య ఉండే స్పర్థలను మనసుల్లో పెట్టుకొని వర్గాలుగా విడిపోయి వైద్యం సక్రమంగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సెలైన్ పెట్టేందుకు సఫాయి కార్మికులను వాడుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంత మంది నర్సులు ఉండి కూడా ఈ దుస్థితి ఎందుకు వచ్చిందనేది ఉన్నతాధికారులు పరిశీలించాల్సి ఉంది. మందులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఆస్పత్రికి రైల్వే శాఖ ద్వారా సరఫరా అయ్యే మందులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాధ మందులు వైద్యశాల నుంచి తీసుకుపోయి అమ్ముకుంటున్నదని, అందుకే మందలించానని రజనీకుమారి చెబుతోంది. ఇందులో నిజమెంతనేది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. మందులు దొంగతనంగా బయటకు తీసుకువెళ్లి అమ్ముకుంటుంటే హెడ్‌నర్స్‌గా రజనీ కుమారి కాని, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎన్సీ రావుకాని ఎందుకు చర్యలు తీసుకోలేదనేదీ ప్రస్తుతం ఆస్పత్రి వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలో జరుగుతున్న కీచులాటలు ఆత్మహత్యా యత్నం వరకు వెళ్లాయంటే ఎటువంటి పరిణామాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.