నయనతార స్థానంలో...?
ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే నానుడి చిత్రసీమకు సరిగ్గా సరిపోతుంది. ఒక పాత్రకు ఎవర్నో అనుకుని, మరెవర్నోతీసుకోవడం ఇక్కడ సర్వసాధారణం. అందుకు బోల్డన్ని ఉదాహరణలున్నాయి. తాజాగా, ‘ఓ మై గాడ్’ని చెప్పొచ్చు. హిందీలో అక్షయ్‌కుమార్, పరేష్ రావల్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. పరేష్ రావల్ పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ చేసిన శ్రీకష్ణుడి పాత్రను పవన్ కల్యాణ్ చేయనున్నారు.
ఇందులో వెంకటేశ్ సరసన నయనతార నటిస్తారనే వార్త వచ్చింది. అది కూడా వెంకటేశ్ సరసన ‘రాధ’ చిత్రానికి నయన్ ఇచ్చిన డేట్స్‌ని ‘ఓ మైగాడ్’కి వినియోగించుకోవాలనుకున్నారట. అయితే, ఇప్పుడామె స్థానంలో రాధికా కుమారస్వామిని తీసుకోవాలనుకుంటున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ఇటీవల విడుదలైన ‘అవతారం’లో ముఖ్య పాత్ర చేశారు రాధికా. ఒకవేళ, వెంకటేశ్ సరసన ఆమె అవకాశం కొట్టేస్తే.. ‘ఓ మై గాడ్... వాట్ ఎ గోల్డెన్ చాన్స్’ అని అనుకోకుండా ఉండలేరు.