nayanatara
-
ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు ?
-
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..?
2024కి బై చెప్పి... 2025కి వెల్కమ్ చెప్పడానికి అందరూ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొందరు స్టార్స్ అయితే కొత్త సంవత్సరం జరుపుకోవడానికి విదేశాలు వెళ్లారు. షూటింగ్స్‌కి కాస్త విరామం దొరకడంతో వెకేషన్ ప్లాన్ చేసుకునే అవకాశం ఈ స్టార్స్‌కి దక్కింది. వారి ఈ వెకేషన్ గురించి తెలుసుకుందాం...ఈ ఏడాది మహేశ్‌బాబు ఇప్పటికే రెండుసార్లు జర్మనీ వెళ్లొచ్చారు. అయితే ఇది హాలిడే ట్రిప్ కాదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ప్రిపరేషన్లో భాగంగా జర్మనీ వెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది మహేశ్‌బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫారిన్లో జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫారిన్లోనే మహేశ్‌బాబు ప్లాన్ చేశారని సమాచారం. మహేశ్‌బాబు మోస్ట్లీ యూరప్‌కు వెళ్లనున్నారట. ఇక ప్రభాస్ ఆల్రెడీ యూరప్‌లో ఉన్నారని తెలిసింది. ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. యూరప్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే అని టాక్. విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘రాజా సాబ్, ఫౌజి’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాన్ని ఆరంభిస్తారు ప్రభాస్. ఇక ‘దేవర’ సక్సెస్ జోష్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు చెందిన ఓ లెంగ్తీ షూట్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారని తెలిసింది. సో... ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లండన్‌లోనే అని ఊహించవచ్చు. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీ అవుతారట. ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే స్పెయిన్ వెళ్లారు. రష్మికా మందన్నా ఆల్రెడీ ఫారిన్లోనే ఉన్నారని తెలిసింది. హీరోయిన్ తమన్నా, ఫరియా అబ్దుల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను అమెరికాలో ప్లాన్ చేశారని తెలిసింది. వీరితో పాటు మరి కొందరు టాలీవుడ్ యాక్టర్స్ గోవా, మాల్దీవ్స్‌లో వేడుకలు ప్లాన్ చేశారని సమాచారం. భర్త విఘ్నేష్ శివన్‌తో నయనతార దుబాయ్ వెళ్లారు. అక్కడే మాధవన్, ఆయన భార్య సరిత కూడా ఉన్నారు. సో... ఈ రెండు ఫ్యామిలీస్ ఒకే చోట వేడుక చేసుకోనున్నారు. కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ట్ హీరో హృతిక్ రోషన్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పాట్‌గా దుబాయ్‌నే ఎంచుకున్నారు. ఇంకా ఫ్యామిలీతో కలిసి దియా మీర్జా శ్రీలంక వెళ్లారు. అర్జున్ రాంపాల్ సెలబ్రేషన్స్ గోవాలో జరుతాయని సమాచారం. ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ స్విట్జర్లాండ్‌లో, శిల్పాశెట్టి లండన్‌లో, భర్త జహీర్ ఇక్భాల్‌తో కలిసి హీరోయిన్ సోనాక్షీ సిన్హా ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ ఫిన్‌ల్యాండ్ వెళ్లారు. -
నయనతార మరో సెన్సేషనల్ డెసిషన్?
-
ధనుష్ క్యారెక్టర్ పై తీవ్ర విమర్శలు చేసిన నయనతార
-
పూర్తిగా మారిపోయిన నయన్.. ఇకపై వాటికి కూడా ఒకే..!
-
నయనతారకు కోపమెక్కువ.. డైరెక్టర్‌తో వాదించేది!
సినిమా పరిశ్రమ అంటే రంగులమయం అంటారు కానీ ఇదో మాయాజాలం కూడా! ఇక్కడ రాణించడానికి అందం, ప్రతిభ, అంతకు మించి అదృష్టం ఉండాలంటారు. నయనతార కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు పడ్డారు. ఆమె ఈ స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించలేదు. కొందరు దర్శకులైతే నువ్వు నటిగా పనికి రావని ముఖం మీదే చెప్పిన సందర్భాలున్నాయి. ఎవరో ఎందుకు? నయనతారకు తమిళంలో తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు హరినే ఈమె ఆ స్థాయికి చేరుకుంటారని ఊహించలేదట.ముక్కు మీద కోపం?ఒక సందర్భంలో ఆయన నయనతార గురించి మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన అయ్యా చిత్రంలో నయనతారను హీరోయిన్గా పరిచయం చేశానని, అందులో ఆమె 12వ తరగతి చదివే యువతిగా నటించారని చెప్పారు. ఈ చిత్రంలో నటించేటప్పుడు నయనతార చాలా కోపంగా ఉండేవారని, ఎందుకీ అమ్మాయి అంత కోపంగా ఉంటుందా? అని అనిపించేదన్నారు. దుస్తుల విషయంలో కూడా తనతో వాదించేవారని చెప్పారు. అయితే ఆ కోపంలో పని బాగా జరగాలనే భావం ఉండేదన్నారు.ఈ స్థాయికి ఊహించలేదునయనతార మంచి నటిగా ఉన్నతస్థాయికి చేరుకుంటారని తెలుసుగానీ, మరీ ఈ స్థాయికి చేరుకుంటారని ఊహించలేదన్నారు. నిజమే.. కేరళలోని ఓ గ్రామంలో పుట్టిన డయానా కురియన్ అనే అమ్మాయి ఇప్పుడు నయనతారగా అవతారమెత్తి మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలను దాటి బాలీవుడ్‌లోనూ విజయ బావుటా ఎగరేస్తున్నారంటే సాధారణ విషయం కాదు. అలాగే చిత్ర నిర్మాతగానూ ఇతరత్రా పలు వ్యాపారాలతోనూ బిజీగా ఉన్నారీ లేడీ సూపర్‌స్టార్.చదవండి: స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్? -
భర్త సినిమా నుంచి తప్పుకున్న నయనతార..
-
మరియం కురియన్ మరియు నయనతార
గ్లామర్ పాత్రలతో మెరిసిన నయనతార ‘గ్లామర్’కు మాత్రమే పరిమితం కాలేదు. ‘శ్రీరామరాజ్యం’ ‘అనామిక’ ‘గాడ్‌ఫాదర్’లాంటి సినిమాలతో నటిగా మెప్పించింది. ఫిమేల్ – సెంట్రిక్ ఫిల్మ్ అనగానే తన పేరు గుర్తుకు వచ్చేలా చేసుకుంది. ‘లేడీ అమితాబ్’గా పేరు తెచ్చుకుంది. సినిమా ఫీల్డ్కి రాక ముందు నయనతార మోడలింగ్, టీవీ షోలు చేసేది. ఒక టీవీలో ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ షో ‘చమయం’ చేసేది. నయనతార అసలు పేరు డయాన మరియం కురియన్. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన డయాన(నయన) కాలేజీ రోజుల్లోనే పార్ట్–టైమ్‌గా మోడలింగ్, టీవి యాంకరింగ్ చేసేది. ఆమె మోడలింగ్ స్కిల్స్ చూసిన మలయాళం డైరెక్టర్ సత్యన్ ‘మనసినక్కరే’ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో ‘గౌరి’ పాత్రలో నటించిన నయనతార నిన్నా మొన్నటి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘జవాన్’లోని ‘నర్మదా రాయ్’ పాత్ర వరకు నటనలో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటూనే ఉంది. -
నయనతార ఆస్తులు వందల కోట్లు..
సంచలనానికి మారుపేరు నయనతార అనవచ్చునేమో. తాజాగా ఆస్తుల విషయంలో నయనతార జంటపై విఘ్నేశ్ శివన్ బాబాయ్ కేసు పెట్టడం. ఇలా గత రెండు దశాబ్దాలుగా ఈమె వార్తల్లో ఉంటూనే ఉంది. 2003లో కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బహూభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీ సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పటి వరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో 75 చిత్రాలకు పైగానే చేసింది. ఇప్పటికి కూడా ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తొలిసారిగా షారూఖ్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్లో నయన్ అడుగుపెట్టబోతోంది. దీంతో ఆమె మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. (ఇదీ చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్) ఈ సినిమా కోసం భారీగానే నయన్‌కు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్.. దీంతో ఒక్కసారిగా ఆమె ఆస్తుల వివరాలపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె కూడబెట్టిన ఆస్తి విలువ సుమారు రూ.200 కోట్లు. ఇది నయనతార ఆదాయశాఖకు దాఖలు చేసిన లెక్కల వివరాల ప్రకారం జరుగుతున్న ప్రచారం. హైదరాబాదులో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన ఖరీదైన ఇల్లు ఉంది. కేరళలో తన తల్లిదండ్రుల కోసం అని మరో ఇల్లు ఉంది. ఇలా దేశవ్యాప్తంగా పలు సొంత నివాసాలను ఏర్పరచుకుంది. (ఇదీ చదవండి: Vignesh And Nayanthara: నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ బాబాయ్) హైదరాబాదులోని ఒక్కో ప్లాట్ సుమారు రూ.20 కోట్లు విలువ చేస్తుందని సమాచారం. అక్కడ అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో నయనతార ప్లాట్లు కొనుగోలు చేసింది. అదే విధంగా ఇటీవల ఈమె ఒక జెట్ విమానాన్ని కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ.. పలు యాడ్స్ రూపంలో కూడా నయనతార కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. మొదట కష్టపడ్డా ఇప్పుడు పిల్లలు, భర్తతో రాయల్ లైఫ్ లీడ్ చేస్తోంది. తాజాగా చెన్నైలో మూతపడిన 53ఏళ్లనాటి థియేటర్‌ను ఆమె కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతుంది. దాని ప్లేస్‌లో మల్టీఫ్లెక్స్ నిర్మించే ప్లాన్‌లో ఆమె ఉన్నారట. -
పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను గతేడాది జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. వారి పిల్లల ఫోటోలను కూడా ఆయన మొదటిసారి షేర్ చేశాడు. ఆ ఫోటోలలో, నయనతార తన బిడ్డలను పట్టుకుని ప్రకాశవంతమైన చిరునవ్వులతో కనిపిస్తుంది. ఫోటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: అప్పుడు మా కాలికి నమస్కరించేవాళ్లు, ఇప్పుడేమో హగ్గులు, ముద్దులు: నటి) నయనతార గురించి విఘ్నేశ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు. 'నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచిపోయింది. సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసే ఎదుర్కొన్నాం. నా పనిలో భాగంగా ఎన్ని చికాకులు ఉన్నా ఒక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత నిన్నూ (నయన్), పిల్లల్ని చూడగానే అన్నీ మర్చిపోతాను. కుటుంబం ఇచ్చే బలం ఎవరూ ఇవ్వలేరు. మన పిల్లలు ఉయిర్, ఉలగమ్‌లకు మంచి జీవితాన్ని అందించడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తాను' అని భావోద్వేగానికి లోనయ్యాడు. గత అక్టోబరులో అద్దె గర్భం ద్వారా ఈ జంట ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: అబ్బే.. ఈ హీరోలకు అసలు పెళ్లి ధ్యాసే లేదుగా!) -
ప్రపంచంలో బెస్ట్ మదర్ నువ్వే.. భార్యకు విఘ్నేశ్ శివన్ విషెస్
దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. అంతలా స్టార్డమ్ తెచ్చుకున్న తెలుగు, తమిళ, మళయాళంలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్ చిత్రంలో కనిపించనుంది. అగ్ర హీరోలతో జతకట్టిన నయన్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడింది. వివాహమైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ .. సోషల్ మీడియాలో వైరల్!) అయితే ఈ జంట గతేడాది సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మదర్స్ డే సందర్భంగా నయన్ భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నయనతారపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తన తల్లితో దుబాయ్‌లో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. (ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక) విఘ్నేశ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'ప్రియమైన నయన్ ... ఒక తల్లిగా నీకు 10కి 10 మార్కులు. నీ అపారమైన ప్రేమ, శక్తి నాకు రక్ష. నీకు మొదటి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. మన ఒక కల నిజమైంది. ఉయిర్, ఉలగం కవలలతో ఆశీర్వదించిన దేవుడికి నా ధన్యవాదాలు. యూ ఆర్ ది బెస్ట్ మదర్ ఇన్ ది వరల్డ్' అంటూ పోస్ట్ చేశారు. నయనతార పిల్లలను ఎత్తుకుని ఫోటోలను పంచుకున్నారు. ఆస్పత్రిలో తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న నయన్ అరుదైన పిక్స్ మీరు చూసేయండి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) అలాగే తన తల్లి మీనాకుమారితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'నువ్వు చూపించిన ప్రేమ, అప్యాయతలే మా జీవితాన్ని బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తకు ఎదిగేలా చేశాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి నువ్వే.' అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
'నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు'.. నయనతార సంచలన వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ఇప్పటికే చాలామంది మాట్లాడిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ల దగ్గర్నుంచి యంగ్‌స్టర్స్ వరకు ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార తొలిసారిగా ఈ విషయం గురించి ఓపెన్ అయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనే విషయంపై నేను మాట్లాడను. మన ప్రవర్తనను బట్టి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు. నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాను. కేవలం నా టాలెంట్‌ను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చొంది. అయితే నయన్ చేసిన ఈ కామెంట్స్‌పై కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడో జరిగితే ఇప్పుడు చెప్పడం ఏంటి? మీటూ మూమెంట్స్ జరిగినప్పుడు కూడా సైలెంట్‌గా ఉంది కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ హీరోయిన్ తో లవ్ నిజమేనా?
-
నయన్ దంపతుల సరోగసి.. ఊహించిందే జరిగింది..!
నయనతార దంపతుల వివాదంపై చర్చ అంతా ఇంతా కాదు. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళవారం విచారణ పూర్తయింది. (చదవండి: నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?) తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. నయనతార దంపతుల సరోగసి చట్టబద్ధమేనని తేల్చింది. 2021 నవంబర్లోనే సరోగసికి అగ్రిమెంట్ జరిగిందని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. దీంతో నయన్ దంపతుల సరోగసి వివాదానికి తెరపడనుంది. -
నయన్ దంపతుల దీపావళి సర్ప్రైజ్.. కవల పిల్లలతో కలిసి..!
ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జంట ఎవరంటే ఠక్కున గుర్తిచ్చేది నయన్-విఘ్నేశ్ శివన్. ఎందుకంటే ఈ దంపతులకు ఇటీవలే కవలలు జన్మించడంతో హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి వివరాలు సమర్పించడంతో వివాదం సద్దుమణిగింది. ట్విన్స్ జన్మించిన ఆనందంలో ఉన్న ఈ జంట తాజాగా దీపావళికి కవల పిల్లలతో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. పిల్లలను ఎత్తుకుని ఉన్న ఓ వీడియోను విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే పిల్లల ముఖాలను ఎక్కడా చూపించలేదు. సంప్రదాయ దుస్తులు ధరించిన నయన్ దంపతులు అందరికీ దివాళి విషెస్ తెలుపుతూ చాలా సంతోషంగా కనిపించారు. మొదటిసారి తల్లిదండ్రులైన సందర్భంగా ఎంతో ఆనందంగా ఫ్యాన్స్‌కు దివాళీ విషెస్ తెలిపారు. విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. 'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అన్ని సందర్భాల్లోనూ మీరంతా సంతోషంగా ఉండాలి. మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై పోరాడండి. ప్రేమ మాత్రమే ఈ జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. ప్రేమలో విశ్వాసం, మంచితనం ఎల్లప్పుడూ ఉండాలి.' అంటూ పోస్ట్ చేశారు. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట జూన్ 9, 2022న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
నయన్ - విఘ్నేశ్ లవ్ స్టోరీ.. నాంది పలికింది ఆ సినిమాతోనే..!
కోలీవుడ్ ప్రేమజంట నయన్- విఘ్నేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట జూన్ 2022లో ఒక్కటైంది. తాజాగా నయనతార కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే వారి ప్రేమకథ ఎక్కడ ప్రారంభమైంది? అసలు వారిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? తొలిసారి వారు ఎక్కడ కలిశారు? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ ఏడేళ్ల ప్రమాయాణానికి తొలి అడుగు పడింది మాత్రం ఆ సినిమాతోనే. వీరిద్దరి కాంబినేషన్లో 2015లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'నానుమ్ రౌడీ ధాన్'. ఈ ప్రేమకథా చిత్రం విడుదలై నేటికి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం. మొదటి ఎంపికా నయన్ కాదు: నాను రౌడీ ధాన్ షూటింగ్ సందర్భంగా మొదటిసారి విఘ్నేశ్ శివన్‌ను నయనతార కలిశారు. ఇక అప్పటి నుంచి వీరి లవ్ స్టోరీ ప్రారంభమైంది. ఇక వారిద్దరు ఎక్కడ వెనుదిరిగి చూడలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార మొదటి ఎంపిక కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే అనుకోకుండా ఓ హోటల్లో నయనతారను కలుసుకోవడంతో ఈ సినిమాకు కథానాయికగా ఎంపిక చేశారు. నానుమ్ రౌడీ ధాన్ సినిమా విడుదలై 7 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా విఘ్నేష్ శివన్ సెట్స్‌లో ఉన్న వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో విఘ్నేశ్,నయనతార సముద్రం వద్ద సంభాషణలో పాల్గొన్నారు. మొదట్లో వారిద్దరూ ఏదో సీరియస్‌గా డిస్కస్ చేస్తూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ నవ్వుతూ సంభాషించుకున్నారు. విఘ్నేశ్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ 'ఒకప్పుడు పాండీవుడ్‌లో!' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 2016లో నానుమ్ రౌడీ ధాన్ హిట్ కావడంతో వీరిద్దరి రిలేషన్‌పై రూమర్లు వచ్చాయి. అయితే 2016లో జరిగిన సైమా వేడుకలో విఘ్నేష్ శివన్ తనకు అవార్డును అందజేయాలని కోరడంతో వీరి రిలేషన్‌పై గాసిప్స్ గుప్పుమన్నాయి. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
అది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది: విఘ్నేశ్ శివన్
ఇటీవల నయనతార దంపతులు సరోగసి వివాదం తెలిసిందే. ప్రస్తుతానికి ఆ జంట ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంతో సమసిపోయింది. అయితే తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టా స్టోరీస్ షేర్ చేశాడు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రేస్టేషన్లో ఉన్న రోజుల గురించి స్టోరీలో ప్రస్తావించారు. మనం చూసే విధానం బాగుంటే ప్రతి దానిలో మంచి కనిపిస్తుందన్న సందేశంతో కోట్స్ షేర్ చేశారు. గతంలో ఓ నిర్మాత షేర్ చేసిన ఇన్‌స్టా కోట్స్‌ను సోషల్ మీడియాలో విఘ్నేశ్ పోస్ట్ చేశారు. విఘ్నేష్ ఇన్‌స్టా స్టోరీలో 'మనకు మంచి రోజులు ఉన్నాయి. కానీ ఫ్రస్టేషన్ ఉన్న రోజులు కూడా కొన్నిసార్లు మనకు మంచిదే. ప్రతిదానిలో మంచిని చూసేందుకు ప్రయత్నిచండి. అందుకు ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోండి. మీ జీవితంలో ఆనందం అనేది మన ఆలోచనలపైనే అధారపడి ఉంటుంది.' అని కోట్స్‌లో రాసి ఉంది. ఆ రెండు పోస్టులు ఇటీవల నయనతార కవలలకు జన్మనివ్వడంతో వచ్చిన వివాదాన్ని ఉద్దేశించే చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు. -
నయనతార చేసిన తప్పేంటి ...? జైలు శిక్ష తప్పదా ...?
-
నయన్-విఘ్నేశ్ చట్టాన్ని అతిక్రమిస్తే.. శిక్షేంటో తెలుసా?
నయనతార కవలలకు జన్మనినిచ్చిని విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే అదే ఇప్పుడు వివాదంగా మారింది. పిల్లలు ఏ విధంగా పుట్టారన్న దానిపై నయన్ దంపతులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వివాదం కొనసాగుతోంది. దీంతో సరోగసి ద్వారానే పిల్లలు జన్మించినట్లు అందరూ భావిస్తున్నారు. మరి మనదేశంలో సరోగసికి ఉన్న నిబంధనలేంటి? మన దేశంలో చట్టం ఏం చెబుతోంది? ఒకసారి పరిశీలిద్దాం. మనదేశంలో సరోగసి చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాక పిల్లలు పుట్టకపోతే ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. ఒకవేళ చట్టంలోని నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. అయితే నయన్-విఘ్నేశ్ దంపతులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం సోషల్ మీడియాలో కవలలు పుట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా జన్మించారో వివరణ ఇవ్వాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్‌గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్‌ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్‌కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
నయనతార చెల్లెలు తాన్యా రవిచంద్రన్ (ఫొటోలు)
-
గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పవర్‌పుల్ డైలాగ్స్
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్' ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో చిరంజీవి యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. కీలక పాత్రలో నటించిన సల్మాన్ యాక్షన్ కూడా అదిరింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ మీరూ చూసేయండి. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్ ఈ చిత్రం. అనంతపురంలో భారీస్థాయిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. (చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం) -
గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం
మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'నజబజ జజర.. గజగజ వణికించే గజరాజు అడిగోరా' అంటూ సాగే సాంగ్‌తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. -
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకు అతనే గాడ్‌ఫాదర్: చిరంజీవి
మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'గాడ్‌ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. ప్రమోషన్స్‌లో భాగంగా గాడ్ ఫాదర్ మూవీ చిత్రబృందం సరికొత్తగా ప్లాన్ చేసింది. ఏకంగా ఆకాశంలో ఇంటర్వ్యూ నిర్వహించింది. (చదవండి: God Father: గాడ్‌ఫాదర్ సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ ట్వీట్ వైరల్) ప్రత్యేక విమానంలో తిరుగుతూ చిరంజీవిని యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూకి సంబంధించి తాజాగా ప్రోమోలను రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన తార్ మార్ టక్కర్ మార్ సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊర్రూతలూగిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 5 రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది. త్వరలోనే అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రోమోలో 'రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అన్న డైలాగ్ ప్రేక్షకుల్లో మరింత హైప్ క్రియేట్ చేసింది. ప్రోమోలో చిరంజీవి లుక్ అదిరిపోయిందంటూ శ్రీముఖి అనడంతో నవ్వుతూ సమాధానాలిచ్చాడు మెగాస్టార్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కేవలం ప్రేమతో చేశాడు. హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్ అంటూ చిరు ప్రశంసించారు. పూరీ జగన్నాథ్‌లో కమాండింగ్ ఉన్న నటుడు ఉన్నాడని చూసిన తరువాత మీరే ఆశ్చర్యపోతారు అన్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ ఆరో ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే గాడ్ ఫాదర్. నిశ్శబ్ద విస్పోటనం అంటూ మెగాస్టార్ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువే ఈ సినిమాలో చూస్తారని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూ సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ సెప్టెంబర్ 25న ప్రసారం కానుంది. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. -
విఘ్నేశ్ శివన్‌కు నయన్ బర్త్‌డే సర్ప్రైజ్.. ఏంటో తెలుసా..?
కోలీవుడ్ సమ్‌థింగ్ స్పెషల్ జంట విఘ్నేశ్, నయనతార. ఇవాళ విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు ఆమె స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా విఘ్నేశ్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది నయన్. దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా ఎదుట కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ కేక్ కట్ చేశారు.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. బూర్జ్ ఖలీఫావద్ద కేక్ కటింగ్‌తో పాటు.. టపాసులుకూడా పేల్చుతూ.. విఘ్నేశ్ కుటుంబ సభ్యులు సందడి చేశారు. ఈ లేడీ సూపర్ స్టార్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా మారింది. అటు సినిమా షూటింగ్స్ చేస్తూనే.. ఇటు ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తోంది. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్.. స్టార్ హీరోయిన్ నయనతార ఈ ఏడాది ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందు ఆమె కొన్ని సినిమాలు అంగీకరించారు. అందులో షారుఖ్ ఖాన్ 'జవాన్' ఒకటి. హిందీలో నయనతారకు తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా 'గాడ్ ఫాదర్'లోనూ ఆమె నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Nayanthara (@nayantthara) . -
నయనతార ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!
సంచలనానికి మారుపేరు నయనతార అనవచ్చునేమో. గత రెండు దశాబ్దాలుగా ఈమె వార్తల్లో ఉంటూనే ఉంది. 2003లో కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ వరుసగా అవకాశాలు తలుపుతట్టాయి. ఆ తరువాత తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బహూభాషా నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిపోయింది. ఇక ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పటి వరకు ఆమె తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో 75 చిత్రాలు చేసింది. ప్రస్తుతం చిత్రానికి రూ.10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఆమె గురించి తెలిసిన విషయాలు అయితే తాజాగా ప్రచారంలో ఉన్న కథనం ఏంటంటే.. ఆమె కూడబెట్టిన ఆస్తి విలువ రూ.165 కోట్లు. ఇది నయనతార ఆదాయశాఖకు దాఖలు చేసిన లెక్కల వివరాల ప్రకారం జరుగుతున్న ప్రచారం. ఈమె సినిమాలో నటిస్తునే పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. దీనికి ఒక్కో సంస్థ నుంచి రూ.5 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. హైదరాబాదులో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలో తన తల్లిదండ్రులు నివసిస్తున్న ఇల్లు అంటూ దేశవ్యాప్తంగా పలు సొంత నివాసాలను ఏర్పరచుకుంది. హైదరాబాదులోని ఒక్కో ప్లాట్ సుమారు రూ.15 కోట్లు విలువ చేస్తుందని సమాచారం. అక్కడ అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో నయనతార ప్లాట్లు కొనుగోలు చేసింది. అదే విధంగా ఇటీవల ఈమె ఒక జెట్ విమానాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక వ్యాపార రంగంలోనూ నయనతార దూసుకుపోతుంది. డాక్టర్ వనిత రాజన్‌తో కలిసి లిప్ బామ్ కంపెనీని ప్రారంభించింది. ఇటు సినీ నిర్మాతగానూ బాగానే సంపాదిస్తోంది. -
మాంసం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నయనతార
ప్రముఖ సంస్థ ఫిపోలాకు ప్రచార కర్తగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతారను నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక సీఈఓ సుశీల్ కనుగోలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 7) జరిగిన సమావేశంలో సశీల్ మాట్లాడుతూ ''దక్షిణ భారతదేశంలోని అత్యత్తుమ మాంసం రిటైల్ బ్రాండ్లలో ఒకటైన ఫిపోలా ఆహార ప్రియులను ఆకర్షించడంతోపాటు మంచి ఆదరణ ఉందన్నారు. దీనిని మరింతగా విస్తరణ చేసేలా దృష్టి పెట్టాం'' అని తెలిపారు. అందులో భాగంగానే దక్షిణ భారతదేశంలో లేడీ సూపర్‌స్టార్ నయనతారను తమ బ్రాండ్ ప్రచార కర్తగా నియమించాని పేర్కొన్నారు. దీనికి నటి నయనతార ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రచార వీడియోను ఆయన ఆవిష్కరించారు. -
Its Official: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్..
Its Official: Vignesh Shivan About His Wedding With Nayanthara: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కలిసిన నయన్-విఘ్నేష్ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఖరారు అయిందని కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా వీరి వివాహంపై స్పందించాడు విఘ్నేష్ శివన్. 'నా ప్రేయసి నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్ చేస్తాం. జూన్ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.' అని తెలిపాడు విఘ్నేష్ శివన్. చదవండి: సీఎంను కలిసిన నయనతార.. ఫొటో వైరల్.. -
సినీరంగ ప్రవేశం చేయనున్న టీమిండియా మాజీ కెప్టెన్
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నాడు. అయితే నటుడిగా మాత్రం కాదు.. నిర్మాతగా. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో నిర్మించబోయే ఒక సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరించనున్నాడు. లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాకు ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు. కాగా ధోని ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచులు ఉన్నప్పటికి సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలు అంతంతమాత్రమే. ఇక త్వరలోనే విఘ్నేశ్ శివన్-నయనతారలు తమ సుదీర్ఘ ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు నయన్ కూడా.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో అట్లీ దర్శకత్వంలో సెట్స్‌పై ఉంది. నయన్ పెళ్లి, ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని కిలిసి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే కీలక అప్డేట్ వచ్చే అవకాశమున్నట్టు కోలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి క్రికెటర్ గా సక్సెస్ అయిన ధోని.. నిర్మాత గా ఏ మేరకు విజయం సాధిస్తాడో వేచి చూడాలి. చదవండి: సమంతకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన లేడీ సూపర్‌స్టార్ IPL 2022 - Ravindra Jadeja: ఐపీఎల్ 2022 సీజన్ నుంచి తప్పుకోనున్న జడేజా..? -
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నయనతార
Chiranjeevi and Nayanthara's film: ‘గాడ్ ఫాదర్’ టీమ్ ఫుల్ జోష్‌తో ‘అప్ అప్ ర్యాప్ అప్’ అంటోంది. ఎందుకింత జోష్ అంటే అనుకున్నట్లుగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను ర్యాప్ అప్ (ముగింపు) చేశారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా, హీరోయిన్ నయనతార ఫోటోను షేర్ చేసింది చిత్రబృందం. ‘‘పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. నయనతార పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: నీరవ్ షా, ఆర్ట్: సురేష్ సెల్వరాఘవన్. -
గాడ్ ఫాదర్ కోసం నయనతార షాకింగ్ రెమ్యునరేషన్!
Nayanthara Shcoking Remuneration For Chiranjeevi Godfather Movie: లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం టాలీవుడ్లో గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన నటించనుంది. ఇటీవలె నయన్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం నయనతార తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం నయన్ సుమారు రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. పారితోషికం విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నయనతార మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా నయన్‌కి ఉన్న క్రేజ్‌ను బట్టి ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారు మేకర్స్. ఇక సైరా నరసింహారెడ్డి తర్వాత చిరంజీవితో నయనతారకు ఇది రెండో సినిమా. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
అదిరిపోయిన ‘పెద్దన్న’ ట్రైలర్.. దీపావళికి రానున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయనకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. రజనీ సినిమా ఎప్పుడూ వస్తుందా అనుకుంటూ ఎదురుచూస్తూ ఉంటారు. అయితే శివ కుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీ తెలుగులో పెద్దన్నగా రానుంది. అయితే ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ పొందడమే కాకుండా మూవీపై అంచనాలు పెంచింది. కాగా తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. అందులో..‘నువ్వు ఎవరనేది నువ్వు వేనకేసుకున్న ఆస్తిలోనో.. నీ చుట్టూ ఉన్న వాళ్లకి నీ మీద ఉన్న భయంలోనో లేదు. నువ్వు చేసే చర్యల్లోనూ.. మాట్లాడే మాటాల్లోనూ ఉంటుంది. ఇది వేదవాక్కు’ అంటూ ఆయన చెప్పిన మాస్ డైలాగులు అదిరిపోయాయి. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్స్ విడుదల కానుంది. -
ఆస్కార్ 2022కి వెళ్లనున్న నయనతార మూవీ
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ‘ఆస్కార్’. ఒక్కసారైనా ఈ అవార్డుని సాధించాలని ప్రతి ఫిల్మ్ మేకర్ కోరుకుంటారు. అలాంటి ఫేమ్ ఉన్న ఈ అవార్డు కార్యక్రమం మార్చి 2022న లాస్ ఎంజెల్స్‌లో జరగనుంది. ఈ అవార్డుకి అంతర్జాతీయ చలనచిత్ర కేటగిరీ తమిళ చిత్రం ‘కూజాంగల్’ ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లదగ్గ మొత్తం 14 సినిమాలను వీక్షించింది. అందులో ఈ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పీఎస్ వినోద్‌రాజ్ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నటి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నిర్మించారు. విదేశి ఉత్తమ మూవీ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌కి పోటీపడుతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఈ చిత్ర నిర్మాత విఘ్నేష్ షేర్ చేసుకున్నాడు. ‘‘అండ్ ది ఆస్కార్స్ గోస్ టు..’ అనే పదం వినేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాం. ఎంతో ఆనందంగా ఉంది’ అని ఈ ఫిల్మ్ మేకర్ తెలిపాడు. చదవండి: ప్రియుడితో కలిసి దేవాలయాలను సందర్శించిన నయనతార There’s a chance to hear this! “And the Oscars goes to …. 🎉🎉🥰🥰🥰🥰 “ Two steps away from a dream come true moment in our lives …. ❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰#Pebbles #Nayanthara @PsVinothraj @thisisysr @AmudhavanKar @Rowdy_Pictures Can’t be prouder , happier & content 💝 pic.twitter.com/NKteru9CyI — Vignesh Shivan (@VigneshShivN) October 23, 2021 -
కాబోయే భర్తతో శ్రీవారిని దర్శించుకున్న నయనతార
-
శ్రీవారిని దర్శించుకున్న నయనతార
Nayanathara, Dil Raju, Vamsi Paidipally Visits Tirumala: హీరోయిన్ నయనతార తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో నయనతారతో పాటు ఆమె కాబోయే భర్త, దర్శకుడు విజ్ఞేష్ శివన్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల నయనతారని చూడటానికి, పోటోలు దిగడానికి భక్తులు అభిమానులు ఉత్సహం చూపారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నయనతార తండ్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
ప్రముఖ హీరోయిన్ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. నయనతార తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి నయనతార ఇటీవలి కాలంలో ప్రత్యేక విమానంలో కొచ్చికి వచ్చి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తన కూతురి పెళ్లిని కళ్లారా చూసుకోవాలని నయన్ తండ్రి ముచ్చటపడుతున్నారట. కొద్ది కాలంగా ఇదే విషయాన్ని నయన్తోనూ ప్రస్తావించారట. గత నాలుగేళ్లుగా విఘ్నేశ్‌తో ప్రేమలో ఉన్న నయనతార.. పెళ్లి విషయంపై మాత్రం కాస్త వెనకడుగు వేస్తుందట. కానీ ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక తమ పెళ్లి విషయాన్ని ఈ మధ్యే విఘ్నేశ్ శివన్ సైతం అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆయన త్వరలోనే తమ పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాహం కూడుకున్నదని, అందుకు ఇప్పటినుంచే డబ్బులు సేవ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అతి త్వరలోనే నయన్-విఘ్నేశ్ పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. -
రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసిన నయన్
ఇప్పటివరకు దక్షిణాది చిత్రాలకే పరిమితమైప నయనతార తొలిసారిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అవుతుంది ఈ లేడీ సూపర్ స్టార్. డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. గత పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్లో సౌత్‌లో టాప్ హీరోయిన్గా దూసుకెళ్తున్న నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అంతేకాకుండా రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది ఈ భామ. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్ల వరకు తీసుకునే నయనతార ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ కోసం రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేసింది. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూ.6-8 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసిందట. కథలో దక్షిణాది నేపథ్యం ఉండటతో నయన్ తీసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ మారేసరికి నయన్ రేటు పెంచడంతో నిర్మాతలు షాక్ అయ్యారట. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్ పేరు ముందుంటుంది. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ అనగానే పారితోషికాన్ని డబుల్ చేయడంతో ఇక చేసేదేం లేక అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. చదవండి : నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్ -
నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్ శివన్
కోలీవుడ్ లవ్ కపుల్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది నయనతార- విఘ్నేష్ శివన్‌ల జంటే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి బర్త్‌డే లాంటి వేడుకలు, పార్టీల్లో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ ఏడాది ఆఖరులో పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే విఘ్నేష్ ఆ వార్తలను ఖండించారు. ఈ జంట గురించి ఎప్పుడూ ఏదో ఓ వార్త హైలేట్ అవుతూనే ఉంటుంది. తాజాగా విఘ్నేష్ శివన్ తన ఫాలోవర్స్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక నయనతారలో నచ్చే క్వాలిటీస్ ఏంటి అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. నయన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చాడు. ఇక నయనతారతో కలిసి దిగిన ఓ ఫోటను షేర్ చేస్తూ..ఇది తన ఫేవరేట్ పిక్ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే అన్నాతే, కాతు వాకులా రెండు కాదల్, మూడో కన్ను, సహా మరో నాలుగు సినిమాలకు నయన్ సైన్ చేసింది. చదవండి : పెళ్లిపై నయనతార యూటర్న్; షాకైన విఘ్నేష్ పేరెంట్స్! బోర్ కొట్టినప్పుడే పెళ్లి -
Nayanthara: 'మాతృదేవోభవ' రీమేక్‌లో నయనతార
అమ్మప్రేమలోని గొప్పతనాన్ని అడుగడుగునా చాటిచెప్పిన చిత్రం మాతృదేవోభవ. 1993లో విడుదలైన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోని ప్రేక్షకులు లేరు. అమ్మప్రేమలోని మాధుర్యాన్ని అంతలా కనెక్ట్ చేసిన చిత్రమిది. కె. అజయ్ కుమార్ దర్శకత్వంలో నాజర్, మాధవి నటించిన ఈ చిత్రాన్ని కె.ఎస్. రామారావు నిర్మించారు. తాజాగా చిత్ర నిర్మాత రామారావు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకు మాతృదేవోభవ రీమేక్ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టేశారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అజయ్ కుమారే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాలని పేర్కొన్నారు. అయితే హీరోయిన్ పాత్రలో ఎవరు నటించాలనే ప్రశ్నకు బదులుగా..నయనతార, కీర్తి సురేష్ ఇద్దరూ ఈ పాత్రకు సరిపోతారని, నయనతార నటన ఇంకాస్త మెచ్యూర్డ్ కూడా ఉంటుందని, ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడున్న నటీనటులు కథ కంటే రెమ్యూనరేషన్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారని, వాళ్లు అడిగే రెమ్యూనరేషన్ వింటేనే కంగారు ఉందని చెప్పుకొచ్చారు. మరి చిన్న పాత్రకు సైతం భారీ పారితోషికం అందుకునే నయనతార ఈ సినిమాను చేస్తోందా? లేక కథకు ప్రాధాన్యమిచ్చి రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనక్కు తగ్గుతుందా అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది చదవండి : పుష్ప: ఆ రోల్ చేయడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా? సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు -
ప్రియుడితో నయనతార పండుగ.. పిక్స్ వైరల్..
-
నయన్‌కు క్లాస్మేట్ స్పెషల్ విషెస్ : వైరల్
సినీ రంగంలో, దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణతో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న హీరోయిన్ నయన తార. అందాల నటి నయన్‌కు అభిమానులు, సన్నిహితులతో పాటు, ఆమె ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు వేడుకని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నయన తార క్లాస్మేట్ ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు విశేషంగా నిలిచింది. 36వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కేరళకు చెందిన మహేష్ కదమ్మనిట్ట ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలోని తిరువల్లలోని మార్తోమా కాలేజీలో నయనతారకు డిగ్రీ క్లాస్మేట్ మహేష్. ఆయన ఇలా రాశారు ‘‘డిగ్రీలో తన పక్కన కూర్చున్న తన స్నేహితురాలు సూపర్ స్టార్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా పురుషాధిపత్యం, నెపోటిజం పరిశ్రమను ఏలుతున్న తరుణంలో సినిమా నేపథ్యం ఏ మాత్రం లేని ఒక మహిళ తన కాళ్ళ మీద తను గట్టిగా నిలబడటం ఆశ్చర్యం. కరియర్ ఆరంభంలో అభిమానుల కంటే విమర్శలే ఎక్కువ. అయినా వాటన్నింటినీ తట్టుకుని మొత్తం సినిమా ప్రపంచాన్ని ఏలే శక్తిగా ఎదుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ పరిశ్రమ మీద గౌరవంతో విమర్శలన్నింటినీ అధిగమించింది. పరిపూర్ణమైన కృషి అంకితభావం వల్లనే ఆమె విజయతీరాలకు చేరింది’’. 17 ఏళ్లుగా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉండటం అద్భుతం తిరువల్లలోని చిన్న గ్రామం నుండి వచ్చి, కృషి పట్టుదలతో ఇంతటి ఘనతను సాధించిన మై డియర్ డయానా(నయనతార) నీకు వేనవేల పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ సందర్బంగా మార్తోమా కాలేజీలో 2002-05 నాటి ఆంగ్ల సాహిత్య బ్యాచ్‌లో నయన తార చేతి రాతతో ఉన్న నోట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. అంతేకాదు ఇంతకాలంపాలు ఈ నోట్‌ను భద్రంగా దాచిపెట్టిన తన భార్యకు మహేష్ కృతజ్ఙతలు తెలిపారు. -
మీరు మాకు స్ఫూర్తి.. హ్యాపీ బర్త్ డే: సమంత
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ పరిశ్రమలో అగ్రనటిగా రాణిస్తున్న అందాల భామా నయనతార నేటితో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజు(నవంబర్ 18) నయన్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమె శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తన కాబోయే భర్త, ప్రియుడు విఘ్నేశ్ శివన్, నయనతారను బంగారం అంటూ స్పషల్ విషెస్ చెప్పాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్రనటి, అక్కినేని వారి కోడలు సమంత, నమనతారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక నయన్‌పై ప్రశంసల జల్లు కురిపస్తూ శక్తివంతమైన సందేశం ఇచ్చారు. తన ట్విటర్ ఖాతాలో బర్త్‌డే గర్ల్ నయనతారా... గులాబి రంగు టీ-షర్ట్ ధరించి కెమెరా వైపు సూటిగా చూస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘వన్ అండ్ ఒన్లీ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడు ఇలాగే ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి. అలాగే కావాల్సిన దాని కోసం నిరాంతరాయుంగా పోరాడే మీరు మాకు స్ఫూర్తినిచ్చారు. మీరు ఎంతో శక్తివంతురాలు సోదరి. మీ బలం, నిశ్శబ్ద సంకల్పానికి నా వందనాలు.. హ్యీపీ బర్త్‌డే నయనతార’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు సమంత. (చదవండి: నయన్‌కు ప్రియుడి స్పెషల్ విషెస్) Happy birthday to the one and only Nayanthara💓.. Keep shining brighter and brighter and inspiring us to fight for what is ours .More power to you ✊sister.. Salute your strength and silent determination 🙏 #HBDNayanthara pic.twitter.com/uwhOpj2FVU — Samantha Akkineni (@Samanthaprabhu2) November 18, 2020 కాగా నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్' (మూడో కన్ను) మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్ అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మూడు పదుల వయసులో కూడా ఏమాత్రం నయన్ సినీ గ్లామర్ తగ్గలేదు. ఇప్పటికి నేటితరం హీరోయిన్లతో పోటీ పడుతూ అత్యధిక పారితోషం తీసుకుంటున్న నటిగా రాణిస్తున్నారు. అయితే ఇటీవల తమిళంలో ఆమె నటించిన ‘మూకితి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు నయన్ దాదాపు 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే సమంత, నయనతారలు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో రూపోందనున్న ‘కాతువాకుల రేండు కాదల్’లో నటించనున్నారు. గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో విజయ్ సేతుపతి విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్నుట్లు చిత్ర బృందం సమాచారం. (చదవండి: నీడలో నయనతార) -
నయన్‌కు ప్రియుడి స్పెషల్ విషెస్
లేడీ సూపర్ స్టార్ నయనతార నేడు 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ రోజుతో నయన్ 37వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ, అభిమానులనుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నయనతార ప్రియుడు దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేయసికి ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నయన్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘హ్యపీ బర్త్‌డే బంగారం(తంగమై).. నువ్వు ఎల్లప్పుడూ అదే స్పూర్తినిస్తూ, అంకితభావంతో, నిజాయితీగా ఉండు. భగవంతుడు ఎల్లప్పుడూ నిన్ను సంతోషం, విజయాలతో ఆశీర్వదిస్తాడు. పాజిటివిటీ, అద్భుతమైన క్షణాలతో నిండిన మరో సంవత్సరాన్ని ఎంజాయ్ చేయ్’ అని పేర్కొన్నారు. ఇక నయనతార, విఘ్నేశ్ శివన్ విడదీయలేని ప్రేమ బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ప్రేమలో ఉన్నామని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటే చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: అంధురాలిగా నయన్.. ట్రెండింగ్‌లో ఫస్ట్‌లుక్ కాగా నయన్ పుట్టిన రోజు ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం 'నెట్రికన్' (మూడో కన్ను సినిమాలోని టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో నయన్ అంధురాలిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. టీజర్లో..అంధురాలిగా తనకు ఎదురుపడే సవాళ్లను ఛాలెంజ్‌గా ఎదుర్కొని ఎలా పరిష్కరిస్తుందనేది కనిపిస్తోంది. ఇందులో నయన్ అద్భుతంగా నటించడంతో.. టీజర్ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన పోలీస్ అధికారిణిగా నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాకు మిలింద్‌రావ్ దర్శకత్వం వహిస్తుండగా నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంతో దర్శకుడైన విఘ్నేష్ శివన్ నిర్మాతగా అవతారమెత్తుతున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి మిలింద్ రౌ దర్శకుడు. గిరిష్ జి సంగీతం అందిస్తున్నారు. చదవండి: బోర్ కొట్టినప్పుడే పెళ్లి: నయన్–విఘ్నేశ్ Big Day ✨💥 🎂 pic.twitter.com/qu6c4WQhLw — Nayanthara✨ (@NayantharaU) November 17, 2020 View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
దీపావళి ‘సినిమా’ పటాసులు
దీపావళికి ప్రతీ ఏడాది థియేటర్స్‌లోకి మతాబుల్లా సినిమాలు వస్తుంటాయి. చిచ్చుబుడ్డుల్లా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే ఈ ఏడాది కోవిడ్ వల్ల పండగలకు కొత్త విడుదలలు ఉండట్లేదు. ఔట్లన్నీ ఓటీటీల్లో పేలుతున్నాయి. తమిళంలో ఈ దీపావళికి మూడు పెద్ద సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఆ టపాసుల విశేషాలు. ఆశయం గొప్పదైతే... నీ ఆశయం గొప్పదైతే ఆకాశం కూడా అందుకోగలవు అని తన తాజా చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా!’ (తమిళంలో సూరరై పోట్రు) ద్వారా చెబుతున్నారు సూర్య. తక్కువ ఖరీదులోనే పేదవాడు కూడా విమానయానం చేయొచ్చు అని కల కని నిజం చేసుకున్న పైలెట్ పాత్రలో సూర్య నటించిన చిత్రం ఇది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యనే స్వయంగా నిర్మించారు. తమిళంలో నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న భారీ చిత్రమిదే. నవంబర్ 12 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. అమ్మవారే దిగి వస్తే? మతం అనేది అందర్నీ సరైన మార్గంలో నడిపించడానికి ఉన్నది. ఈ నమ్మకాన్ని తప్పు దోవలో పట్టించాలనే ప్రయత్నం చేసే కొందర్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆ అమ్మవారే దిగి వస్తే? ఈ కథాంశంతో నయనతార ప్రధాన పాత్రలో ‘మూకుత్తి అమ్మన్’ తెరకెక్కింది. తెలుగులో ‘అమ్మోరు తల్లిగా’ విడుదల కానుంది. ఆర్జే బాలాజీ, యన్జే శ్రవణన్ దర్శకత్వం వహించారు. ఇందులో అమ్మవారి పాత్రలో నయనతార కనిపిస్తారు. నవంబర్ 14 నుంచి ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. భూమి రైతు ఆత్మహత్యలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘భూమి’. ‘జయం’ రవి హీరోగా నటించారు. ఇది ఆయన కెరీర్లో 25వ సినిమా. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. దీపావళి రోజు సాయత్రం సన్‌టీవీలో ప్రసారం కానుంది. అలాగే సన్ నెక్ట్స్‌లోనూ ఈ సినిమా ప్రసారం కానుంది. -
శ్రీలతా రెడ్డి, మంత్ర, సుజాత.. ఎవరబ్బా?!
(వెబ్ స్పెషల్): పుట్టగానే అమ్మ నాన్న పేరు పెడతారు. ఆ తర్వాత ముద్దు పేర్లు వచ్చి చేరతాయి. మరి కొందరు వారు చేస్తున్న పనిని బట్టి పేర్లు తెచ్చుకుంటారు. ఆ పేరుతోనే ఫేమస్ అవుతారు. ఇక సినీ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇండస్ట్రీలో విజయాలు సాధించాలని కొందరు కొత్త పేర్లు పెట్టుకుంటారు.. మరి కొందరు ఉన్న పేరుకే మార్పులు చేసుకుంటారు. ఇక కొందరికి దర్శకులే నామకరణం చేస్తారు. అలాంటి వారు సొంత పేరుతో కన్నా ఈ పేరుతోనే బాగా గుర్తింపు పొందుతారు. మరి ఇండస్ట్రీలో ఇలా పేరు మార్చుకుని.. స్టార్‌గా ఎదిగిన హీరోయిన్లు ఎవరో చూడండి.. శ్రీదేవి బాల్యంలోనే ఇండస్ట్రీలో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగి.. ఫిమేల్ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించున్నారు అందాల నటి శ్రీదేవి. అయితే ఆమె కూడా పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆ తర్వాత శ్రీదేవిగా మారి.. ఇండియాను ఓ ఊపు ఊపేసారు. జయసుధ మూవీస్‌లో సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జయసుధ. అయితే ఆమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు సుజాత. (మార్పు అవసరం) జయప్రద అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రద అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో రాణిస్తున్నారు. సౌందర్య పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగించి ఆడపడుచు అయ్యారు సౌందర్య. టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో అకాల మృత్యువు ఆమెను కబలించింది. సావిత్రిలాగా తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య కూడ ప్రేక్షకుల మదిలో జీవించే ఉంటారు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈమె అసలు పేరు సౌమ్య అనే విషయం అందరికి తెలిసిందే. (రెండు కోట్ల ప్రేమ) రోజా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా పేరు మార్చుకున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. రంభ నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మ రంభ. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ. భూమిక ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త సినిమాల కోసం భూమికగా మారారు. హీరోయిన్గా వచ్చిన కొత్తలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (నన్ను నేను తెలుసు కుంటున్నాను) అనుష్క ప్రయోగాత్మక చిత్రాలకు.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అనుష్క. బెంగుళూరుకి చెందిన అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు. స్వతహాగా ఈమె యోగ టీచర్. నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన కేరళ బ్యూటి నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ సినిమాల కోసం నయనతారగా మారింది. రాశి రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఆమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవారు. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. అయితే రాశి అసలు పేరు విజయలక్ష్మి. ఇక వీరే కాక హీరో రజనీకాంత్, చిరంజీవి, సూర్య, పవన్ కళ్యాణ్, విక్రమ్ వంటి స్టార్ హీరోలు సైతం పేరు మార్చుకున్నారు. -
నయనతార చిత్ర సీక్వెల్లో కీర్తి సురేశ్
చెన్నె : నయనతార నటించిన చిత్ర సీక్వెల్ లో కీర్తి సురేష్ నటించనుందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 2017 నయనతార నటించిన చిత్రం అరం. దర్శకుడు గోపి నయినార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో నయనతార కలెక్టర్ గా నటించారు. బోర్‌వెల్‌లో పడిపోయిన పిల్లాడిని రక్షించే కథతో వచ్చిన ఆ చిత్రం ఆమెకు ఓరియెంటెడ్ చిత్రాల నాయికగా క్రేజీ మరింత పెంచింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు అప్పుడే ప్రకటించారు. ఇతర చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార అరం 2లో నటించడానికి సిద్ధపడలేదని సమాచారం.(మహేశ్‌తో ఢీ?) దీంతో దర్శకుడు గోపీ నయినార్ ఆ తర్వాత నటి సమంతను అరం 2లో నటింప చేసే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు కీర్తి సురేష్ ను నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నయనతారతో కీర్తి సురేష్‌ను పోల్చుతూ ఆమె నయనతార లాగా నటించలేదని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు కూడా కీర్తి సురేష్ మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో నటిస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలను ఎదుర్కొంది. అలాంటి విమర్శలను ఛాలెంజ్ గా తీసుకొని సావిత్రి పాత్రకు జీవం పోసింది. అంతేకాదు మహానటి చిత్రంలోని కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. కాగా ఇప్పుడు అరం 2 చిత్రంలో కీర్తి సురేష్ నటించడానికి అంగీకరిస్తే కచ్చితంగా ఆ చిత్రానికి ప్రాణం పోస్తుందని ఒక వర్గం పేర్కొంటోంది. -
నీ పరిచయం తర్వాత అన్నీ మధుర క్షణాలే
‘‘నీ పరిచయం తర్వాత నా జీవితంలో అన్నీ మధుర క్షణాలే. ఈ ఆనందానికి కారణమైనందుకు ధన్యవాదాలు’’ అంటూ దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో నయనతారను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. విఘ్నేష్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన ‘నానుమ్ రౌడీదాన్’ విడుదలై సోమవారంతో నాలుగేళ్లయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘‘ధన్యవాదాలు బంగారం. ఈ సినిమా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. అలాగే నా జీవితం బాగుండే అవకాశం ఇచ్చావు. ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉండాలి. నువ్వు బయట, లోపల ఎప్పుడూ ఇంతే అందంగా ఉండాలి. బోలెడంత ప్రేమతో’’ అంటూ నయన పట్ల తనకున్న ఫీలింగ్‌ని షేర్ చేశారు విఘ్నేష్ శివన్. ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా అప్పుడే విఘ్నేష్, నయన ప్రేమలో పడ్డారనే వార్తలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకూ కలిసి విహార యాత్రలకు వెళ్లడం, ఒకరి పుట్టినరోజుని మరొకరు ఘనంగా జరపడం, పండగలను కూడా కలిసి జరుపుకోవడం.. ఇలాంటివన్నీ ఇద్దరి మధ్య అనుబంధం బలపడిందని చెప్పడానికి ఉదాహరణలు. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. -
ప్రేమ సంబరాలు
నయనతార – విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని అధికారికంగా బయటపెట్టకపోయినా వాళ్ల ప్రేమను మాత్రం వీలున్నప్పుడల్లా బయటపెడుతూనో, బయటపడుతూనో ఉంటారు. హాలీడేయింగ్, ఒకరి పుట్టినరోజు ఒకరు జరపడం. ఒకరికి హిట్ వస్తే ఇంకొకరు సెలబ్రేట్ చేసుకోవడంలాగా అన్నమాట. బుధవారం విఘ్నేష్ బర్త్‌డే. బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే పార్టీను ఫ్రెండ్స్‌తో కలిసి ఘనంగా చేశారు నయనతార. ఈ ఫంక్షన్‌కు డ్రెస్ కోడ్ బ్లాక్ అండ్ బ్లాక్. దర్శకుడు అట్లీ, సంగీత దర్శకుడు అనిరు«ద్, నటుడు అరవింద్ స్వామి, హీరో విజయ్ సేతుపతి మరికొందరు ఈ పార్టీకు హాజరయ్యారు. ఇటీవలే విఘ్నేష్ నిర్మాణంలో నయనతార హీరోయిన్గా ఓ సినిమా ప్రారంభం అయింది. -
విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక
లక్ష్మీ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన నయనతార ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో నటించిన సైరా నర్సింహరెడ్డి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అయితే రీల్ లైఫ్‌లో ఇంతా బీజిగా ఉన్నా నయన.. రియల్ లైఫ్‌లోను ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో ఎంజాయ్ చేస్తోంది. రచయిత, దర్శకుడితో కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారిన విఘ్నేష్ శివన్‌తో లవ్‌ట్రాక్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే 2015 లో వచ్చిన ‘నానుమ్ రౌడీ ధన్’ చిత్రంలో వీరిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. కాగా సెప్టెంబర్ 18 గురువారం రోజు విఘ్నేష్ 34వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా నయన ప్రియుడికి ఓ భారీ కానుకను అందించారు. పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 17న విఘ్నేష్ కోసం నగరంలోని ఓ కేఫ్‌లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించిన ఓ వీడియోను నయన బుధవారం తన ట్విటర్లో పంచుకున్నారు. దీనికి ‘ప్రత్యేక రోజు.. ప్రత్యేక వేడుకలు’ అనే క్యాప్షన్ తో అభిమానులకు షేర్ చేశారు. A Special Day 🥰 Special celebrations 🎊 🎂 #WikiBdayCelebrations pic.twitter.com/z3ql6E74R9 — Nayanthara✨ (@NayantharaU) September 18, 2019 ఈ పార్టీలో తన స్నేహితులైన స్వరకర్త అనిరుధ్ రవిచందర్, ధరణ్ కుమార్, యాంకర్ దివ్యధర్షిని, ప్రకృతి కృత్ అనంత్, సమ్యూత, ఆర్తి వెంకటేష్, పూర్తి ప్రవీణ్ పార్టీలో పాల్గొన్నారు. నయనతార, విఘ్నేష్ రిలేషన్ షిప్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విఘ్నేష్ నయనతార నటిస్తున్న నేత్రికాన్ సినిమా పనులతో బీజిగా ఉన్నారు. -
నయన్ ఎందుకలా చేసింది..?
సౌత్‌లో సూపర్‌స్టార్ రేంజ్‌ను అనుభవిస్తున్న హీరోయిన్ నయనతార. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూనే.. మరోవైపు మాస్ ఎంటర్టైన్ మూవీల్లోనూ నటిస్తోంది. కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అక్కడ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండే.. నయన్ తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది. తాజాగా విఘ్నేష్ శివన్, నయన్‌లు కలిసి ఉన్న ఓ పిక్ వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీలో విఘ్నేశ్ తన ప్రియురాలిని కూడా బంధించాలని చూస్తున్నా.. నయన్ మాత్రం తన చేతులతో మొహాన్ని దాచేసింది. అయితే సిగ్గుతో అలా చేసిందా?.. కొత్త సినిమా లుక్‌ను రివీల్ చేయద్దని చేతులు అడ్డు పెట్టావా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నయనతార సైరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేపనిలో పడింది యూనిట్. మరి ఈ ప్రమోషన్ ఈవెంట్లకైనా నయన్ వస్తుందో లేదో చూడాలి. -
ప్రశ్నించడమే కాదు.. ఓటు కూడా వేయాలి
విమర్శకుల దృష్టి ఇప్పుడు నయనతారపై పడింది. దక్షిణాదిలో అగ్రనటిగా రాణిస్తున్న నటి నయనతార. జయాపజయాలకు అతీతంగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. తమిళంలోనే ఇటు సూపర్‌స్టార్‌తో, అటు దళపతి విజయ్‌తో ఏకకాలంలో నటిస్తున్న నటి ఈమె. ఆ మధ్య తన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాధారవి మాట్లాడుతూ నయనతార ఒక చిత్రంలో దెయ్యంగానూ, మరో చిత్రంలో సీతగానూ నటిస్తున్నారని అన్నారు. ఇప్పుడు సీతగా ఎవరైనా నటించవచ్చుననీ, ఇంతకు ముందు సీతగా నటించాలంటే కేఆర్.విజయనే ఎంపిక చేసేవారని అన్నారు. ఇప్పుడైతే నమస్కరించేవారూ నటించవచ్చు, అందుకు భిన్నమైన వారూ నటించవచ్చునని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద చర్చకే దారితీశాయి. చాలా మంది ప్రముఖులు రాధారవి వ్యాఖ్యలను ఖండించారు. సాధారణంగా ఏ విషయం గురించి పెద్దగా పట్టించుకోని నయనతార ఈ వ్యవహారంపై తీవ్రంగా ధ్వజమెత్తింది. వెంటనే రాధారవికి వ్యతిరేకంగా ఒక ప్రకటన చేసింది. అందులో ఇకపై మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని భావిస్తున్నానని పేర్కొంది. అంతేకాదు నడిగర్ సంఘాన్ని గట్టిగానే ప్రశ్నించింది. సంఘం తమకు వృత్తిపరంగా సహకరించే విషయం గురించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఇంతకుముందే ఒక లేఖ ద్వారా తెలియజేశానని, సుప్రీంకోర్టు వెల్లడించినట్లు నడిగర్ సంఘం ద్వారా ఒక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తారా? విశాఖా కమిటీ సూచనల మేరకు ఆరోపణలు చేసిన వారిని విచారిస్తారా? అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన నడిగర్‌సంఘం వెంటనే రాధారవి వ్యాఖ్యలను ఖండిస్తూ లేఖ రాసింది. కాగా ఆదివారం జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో పలువురు ప్రముఖ నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపధ్యంలో నయనతార ఓటు వేయడానికి రాలేదు. దీంతో తనకు సమస్య వచ్చినప్పుడు నడిగర్సంఘంను ప్రశ్నించిన నయనతార, అదే బాధ్యతతో ఓటు వేయడానికి రావాలి కదా అనే ప్రశ్న తలెత్తుతోంది. నయనతార ఇప్పుడే కాదు గత ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు. దీంతో ఒకరిని ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు తన బాధ్యతను కూడా నిర్వహించాలిగా అంటూ ఈ సంచలన నటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విజయ్ బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్‌కు ట్రీట్
తమిళసినిమా: నటుడు విజయ్ నటిస్తున్న తాజా చిత్రం గురించి ఇప్పటికే చాలా వివరాలు వెలుగుచూశాయి. ఇది ఆయన 63వ చిత్రం అనీ, లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయకిగా నటిస్తోందని, ఏజీఎస్ సంస్థ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని, ఆస్కార్ అవార్డుగ్రహీత ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారని, దర్శకుడు అట్లీ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం ఇదని లాంటి వివరాలు తెలిసినవే. కాగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు గానీ, విడుదల తేదీని మాత్రం ఫిక్స్ చేశారు. అవును చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురానున్నట్లు వర్గాలు ఇప్పటికే వెల్లడించారు. కాగా కొత్త విషయాలేమిటంటే ఇందలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది, అది తండ్రి కొడుకులుగా తొలిసారిగా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ నెల 22న విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటుడు కదిర్, యోగిబాబు, డేనియల్ బాలాజి, రెబామోనికాజాన్, ఇదుజా, వర్ష బొల్లమ్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం కాబట్టి అంచనాలు భారీ స్టాయిలోనే నెలకొన్నాయి. పైగా సర్కార్ వంటి సంచలన చిత్రం తరువాత తెరపైకి రానున్న చిత్రం కావడంతో సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ గ్యారెంటీ అని చిత్ర యూనిట్ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అగ్రనటి నయనతార అదనపు ఆకర్షణగా ఉండనే ఉంది. అదే విధంగా చాలా కాలం తరువాత విజయ్ ద్విపాత్రాభినయం చేయడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
క్రికెట్ బ్యాట్ పట్టిన రజనీ
చకచకా సినిమాలు చేస్తూ వస్తోన్న సూపర్‌స్టార్ రజనీకాంత్.. తన తదుపరి చిత్రషూటింగ్‌లో బిజీ అయ్యారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘దర్బార్’ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుండగా.. విరామ సమయంలో యూనిట్సేద తీరింది. తాజాగా వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌చేస్తున్నాయి. ఇటీవలె ముంబై షెడ్యూల్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్‌కు లీకుల బెడద తప్పడం లేదు. సన్నివేశాలు, ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా చిత్రయూనిట్ షూటింగ్ విరామ సయమంలో క్రికెట్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీ బ్యాట్ పట్టి సిక్సుల మోత మోగిస్తున్నారేమో. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. నివేధా థామస్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. -
బుల్లితెరపైకి నయనతార!
తమిళసినిమా: ఒకప్పుడు ప్రముఖ నటీనటులు బుల్లితెరపై నటించడానికి వెనుకాడేవారు. బుల్లితెర తారలు వెండితెర అవకాశాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అలాంటి వెనుకాడటాలేం లేవు. నిజానికి వెండితెర స్టార్స్ బుల్లితెరపైకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. నటుడు కమలహాసన్, విశాల్, విజయ్‌సేతుపతి, నటి వరలక్ష్మి వంటి ప్రముఖ స్టార్స్ ఇప్పటికే బుల్లితెర ప్రేక్షులను అలరిస్తున్నారు. తాజాగా అగ్రనటి, లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం.అదేంటి చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార బుల్లితెరపైకి రావడం ఏమిటీ అని ఆశ్చర్య పోతున్నారా? నిజమే కథానాయకిగా బిజీబిజీగా ఉన్న నయనతార మణిరత్నం చిత్రాన్నే వదిలేసుకున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయినా ఈ సంచలన నటి బుల్లితెరపైకి రావడం షురూ అంటున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమోను కలర్స్ చానల్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ చానల్లో ఏ కార్యక్రమంలో నయనతార పాల్గొనబోతున్నారన్నది సస్పెన్స్‌గా ఉంచారు. ఈ చానల్లో ప్రసారం కానున్న ఒక డాన్స్ కార్యక్రమానికి నటి నయనతార అతిథిగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక డాన్స్ కార్యక్రమానికి రెండు జట్లకు ఇద్దరు అతిథులు ఉంటారు. అయితే ఆ డాన్స్ కార్యక్రమానికి వారానికి ఒక కొత్త అతిథి పాల్గొంటారని, అలా ఒక వారంలో నటి నయనతార గెస్ట్‌గా పాల్గొనబోతున్నారని టాక్. సాధారణంగా తన చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనని నయనతార ఇప్పుడు బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటే ఆమె అభిమానులకు ఆసక్తిగానే ఉంది. ఇంతకీ ఏ కార్యక్రమంలో ఆమె పాల్గొనబోతోన్నారనే వారు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నయనతార రజనీకాంత్‌తో కలిసి దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈమె నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. -
రజనీ దర్బార్
లాఠీ పట్టి నేరగాళ్ల భరతం పట్టడానికి రజనీకాంత్ ఖాకీ డ్రెస్ వేసి పోలీస్‌గా మారారు. రజనీకాంత్ హీరోగా ‘గజిని, తుపాకి, కత్తి’ చిత్రాల ఫేమ్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘దర్బార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కెరీర్లో తొలిసారి రజనీకాంత్‌తో కలిసి వర్క్ చేస్తున్నారు మురుగదాస్. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నారు. ఇంతకుముందు ‘చంద్రముఖి (2005), కథానాయకుడు (2008)’ సినిమాల్లో రజనీకాంత్‌తో కలిసి సిల్వర్‌స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు నయనతార. ఇక ‘దర్బార్’ ఫస్ట్ లుక్‌ను బట్టి ఈ సినిమాలో రజనీ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవైఏళ్ల తర్వాత పోలీస్ పాత్రలో నటిస్తున్నారట రజనీ. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ బ్యాగ్రౌండ్లో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ కనిపిస్తోంది. సో.. ఇది ముంబై నేపథ్యంలో సాగే కథాంశమని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. మురుగదాస్ ‘తుపాకీ’, రజనీకాంత్ ఇటీవలి ‘కాలా’ చిత్రాలు ముంబై నేపథ్యంలోనే సాగాయన్న సంగతి తెలిసిందే. ‘దర్బార్’ చిత్రానికి అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ శివన్ ఛాయాగ్రాహకులు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. రజనీకాంత్ గత చిత్రం ‘పేట’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. -
ముంబై ప్లాన్!
రజనీకాంత్ హీరోగా నటించిన, ‘కాలా’ చిత్రం మొత్తం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. తాజాగా రజనీ చేయబోయే సినిమాలో కూడా అదే నేపథ్యం ఉంటుందని సమాచారం. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మేజర్ షూటింగ్‌ను ముంబైలో ప్లాన్ చేశారట దర్శకుడు. దాంతో కథ ముంబై నేపథ్యంలో ఉంటుందని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఎ.ఆర్. మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘తుపాకీ’ సినిమాకి కూడా ముంబై టచ్ ఉంటుంది. మరి.. తాజా చిత్రకథను పూర్తిగా ముంబైలో నడిపిస్తారా లేక కథలో కీలక సన్నివేశాలు మాత్రమే ఆ మహానగరంలో ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది. త్వరలో చిత్రబృందం ముంబై వెళ్లడానికి రెడీ అవుతోందట. చెన్నైలో ముంబై సెట్ వేసి కూడా కొన్ని సీన్స్ తీయాలనుకుంటున్నారట. ఇందులో రజనీకాంత్ డ్యూయెల్ రోల్ చేయబోతున్నారని భోగట్టా. రెండు పాత్రల్లో ఒకటి పోలీస్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. ఇందులో నయనయనతారను ఓ కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. మరో కథానాయికగా కీర్తీ సురేష్ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారు. ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్ వ్యవహరిస్తారు. -
తార..తళుకుతార...నయనతార
ఎంత తేడా! ‘చంద్రముఖి’లో ‘నా పేరు దర్గా కాదు దుర్గ’ అని అమాయకంగా పలికిన అమ్మాయే...‘అనామిక’లో ఆవేశం మూర్తీభవించిన దుర్గావతారం ఎత్తింది. ఒకప్పుడు ‘తార తళుకు తార’ గ్లామర్ పాత్రల్లో మెరిసిన నయనతార...ఇప్పుడు తనదైన దారిలో పయనిస్తోంది. ‘లేడీ సూపర్‌స్టార్’ ఇమేజ్ దిశగా దూసుకెళ్తుంది. తాజాగా ‘అంజలి సి.బి.ఐ’గా అలరించిన నయన్ గురించి కొన్ని ముచ్చట్లు... మరింత స్పీడ్‌తో ‘ఇక సెలవా మరి’ అంటూ ఒక దశలో స్వల్ప విరామం తీసుకుంది నయన్. ఆ తరువాత సన్నిహితుల సలహాతో మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ‘రెండోసారి ఆదరిస్తారా?’ అనే ప్రశ్న ఉదయించకముందే మరోసారి తన సత్తా చాటుకుంటుంది. ‘‘నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’’ అని రెట్టించిన ఉత్సాహంతో. బ్రాండ్ ఇమేజ్ ఫిల్మ్, ప్రైవేట్ ఫంక్షన్లకు నయనతార హాజరు కాదనే పేరు ఉంది. తన ‘బ్రాండ్ ఇమేజ్’ను మెల్లమెల్లగా పెంచుకోవడంలో భాగంగానే అలాంటి నిర్ణయం తీసుకుంది అంటారు సినీ విశ్లేషకులు. ఇక్కడ రెండు సినిమాలు చేయగానే బాలీవుడ్ బాట పట్టి అక్కడ ఫ్లాప్ ఎదురుకాగానే ‘ఏది ఏమైనా టాలీవుడే బెటర్’ అనే కథానాయికలను చూస్తుంటాం. అయితే నయన్ మాత్రం మొదటి నుంచి ‘సౌత్’నే నమ్ముకుంది. బాలీవుడ్ ప్రస్తావన వచ్చినప్పుడు... ‘‘ఇక్కడ పనిచేయడమంటే సొంత ఇంట్లో పనిచేస్తున్నంత సౌఖ్యంగా ఉంటుంది’’ అని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెబుతుంటుంది నయన్. ఒక్క హిట్టు చాలు! ఎప్పుడూ టాప్‌లో ఉండటం సాధ్యమేనా? సాధ్యమా అసాధ్యమా అనేది వేరే విషయంగానీ... గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటుంది నయన్.‘‘రెండు మూడు ఫ్లాప్‌లు వచ్చినా...ఒక హిట్ వస్తే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు’’ అంటోంది. ఆరోజుల్లోనే! పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు ఎంచుకోవాలనే నిర్ణయం నిన్నా మొన్నటిది కాదు...చాలా సంవత్సరాల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ‘‘తెర మీద అందంగా కనిపించాలనుకోవడం తప్పేమీ కాదు. అయితే నాలోని నటనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పింది నయన్. ‘‘నయనతార క్రేజ్ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌పై ఎక్కువగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ పెద్ద ఎత్తున రావడానికి ఉపయోగపడుతుంది’’ అనేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మాట. -
డబుల్ ధమాకా!
గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘2.ఓ’ చిత్రంలో శాస్త్రవేత్తగా, రోబోగా రజనీకాంత్ రెండు పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల టాక్. ఇందులో సామాజికవేత్తగా, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో రజనీకాంత్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజం అయితే... మళ్లీ రజనీ అభిమానులకు డబుల్ ధమాకానే. ఒకవేళ రెండు పాత్రలు చేస్తే అప్పుడు ఇద్దరు హీరోయిన్లకు ప్లేస్ ఉంటుంది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ నయనతార, కాజల్ అగర్వాల్‌ల పేర్లు స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. మరి.. రజనీ సరసన జోడీ కట్టే ఇద్దరు భామలు ఎవరో మార్చిలో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ మార్చిలో స్టార్ట్ అవుతుందని సమాచారం. అన్నట్లు.. ఇంతకుముందు ‘రాజాధిరాజా (1989), అదిశయ పిరైవి (1989), ముత్తు (1995), అరుణాచలం (1997)’ చిత్రాల్లో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. -
మార్చి 1న ‘విశ్వాసం’
తలా అజిత్.. తమిళ నాట మాస్కు మారుపేరు. వరుస హిట్లతో దూసుకుపోతూ.. అజిత్ బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా సంక్రాంతి బరిలో దిగిన అజిత్ వసూళ్ల మోత మోగించాడు. ఇప్పటికీ అక్కడ ‘విశ్వాసం’ జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం దక్షిణాది భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా కన్నడ వెర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కన్నడలో ‘జగమల్ల’గా త్వరలోనే విడుదల కానుంది. ఇక తెలుగులో ఈ సినిమా మార్చి 1న విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌కు సంబంధించిన బిజినెస్ వ్యవహరమంతా చకాచకా జరుగుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో నయన తార హీరోయిన్గా నటించగా.. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించాడు. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతమందించగా.. శివ దర్శకత్వం వహించాడు. -
డిఫరెంట్ స్టోరీ
సినిమా సినిమాకీ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు రానా. ‘గృహం’ వంటి హారర్ థ్రిల్లర్‌తో సూపర్‌హిట్ అందుకున్నారు దర్శకుడు మలింద్ రౌ. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. రజనీకాంత్ ‘బాషా’ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి, తెలుగులో ఆయనకు భారీ మార్కెట్ ఏర్పడటానికి కారణమైన విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్‌పై గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ ఆచంట మాట్లాడుతూ– ‘‘బాషా’ సినిమాతో తెలుగుసినిమా ఇండస్ట్రీకి విశ్వశాంతి పిక్చర్స్ పరిచయమైంది. చాలా గ్యాప్ తర్వాత మా బ్యానర్లో నయనతార హిట్ చిత్రం ‘ఇమైక్కా నొడిగల్’ ను ‘అంజలి సిబిఐ’ గా విడుదల చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్‌గా తెలుగుసినిమాలను నిర్మించబోతున్నాం. అందులో భాగంగా రానాగారితో సినిమా చేయబోతున్నాం. ఆగస్ట్ నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. -
నయనతార పెళ్లి ఎప్పుడంటే..?
నటి నయనతార అంటేనే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. అందుకే ఆ భామను సంచల నటి అంటారు. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టి తాజా చిత్రం ఐరా వరకూ ఈ బ్యూటీ కెరీర్లో ఎన్నో మజిలీలు జరిగాయి. నిజ జీవితంలో ప్రేమలో విఫలం అయినా నట జీవితంలో నయనతార పైచెయ్యే సాధించింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది. రెండు సార్లు ప్రేమలో చేదు అనుభవాలను చవి చూడడంతో మూడోసారి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో ప్రేమలో మునిగితేలుతోంది. అంతేకాదు ఈ సంచలన జంట సహజీవనం చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగానే హోరెత్తుతోంది. అయితే ఈ విషయాన్ని నయనతార గానీ, విఘ్నేశ్‌శివన్‌గానీ బహిరంగంగా ప్రకటించకపోయినా, షూటింగ్‌లకు గ్యాప్ దొరికితే చాలు ఈ జంట విదేశాల్లో విహారయాత్రకు పరిగెత్తుతున్నారు. అదీ రహస్యంగా కాదు. అక్కడ వారు కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోలను సోషల్‌మీడియాలకు విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారు. అలాగని నయనతార సినిమా కెరీర్‌ను గాలికొదిలేయడం లేదు. అగ్రనటిగా వెలుగొందుతున్నా, చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఐరా చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేస్తున్న మిస్టర్ లోకల్ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. వీటితో పాటు టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు చిరంజీవితో నటిస్తున్న సైరా నరసింహారెడ్డి, హీరోయిన్ సెంట్రిక్ కథాంశంతో రూపొందుతున్న కొలైయుదీర్ కాలం చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం విజయ్‌కు జంటగా అట్లీ దర్శకత్వంలో నటిస్తోంది. పెళ్లి వాయిదాకు.. నటిగా అగ్రస్థానంలో కొనసాగుతూ, నిజ జీవితంలో దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో రొమాన్స్ చేస్తున్నా, పెళ్లి తంతు వాయిదా వేసుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్న చాలా మందిని తొలిసేస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అమ్మడి వయసిప్పుడు 34. ఈ ప్రశ్నకు బదులు నయనతార సెంచరీ కొట్టాలట. అర్థం కాలేదా? ఈ బ్యూటీ అన్ని భాషల్లో కలిసి ఇప్పుటికి 60పై చిలుకు చిత్రాలు చేసింది. మరో ఆరేడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. నటిగా సెంచరీ కొట్టిన తరువాతనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. అలాగైతే మరో నాలుగైదేళ్లు పెళ్లికి దూరంగా విఘ్నేశ్‌శివన్‌తో సహజీవనం చేస్తూ హాయిగా ఎంజాయ్ చేయబోతోందన్న మాట. ప్రియుడి చిత్రంలో ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సంచలన జంటకు సంబంధించిన తాజా న్యూస్ ఏమిటంటే అంతకు ముందు అగ్ర కథానాయకిగా రాణిస్తున్నా, విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంతోనే నయనతార సినీ కెరీర్ కొత్త మలుపు తిరిగిందన్నది వాస్తవం. అయితే ఆ తరువాత విఘ్నేశ్‌శివన్ నటుడు సూర్య హీరోగా తానా సేర్నద కూటం చిత్రం మాత్రమే చేశాడు. దీంతో నయనతార ప్రేమలో పడి దర్శకత్వాన్ని దూరంగా పెట్టాడనే ప్రచారం ఆయన గురించి జరుగుతోంది. దీంతో నయనతారనే ఆయన్ని నిర్మాతగా మార్చి చిత్రం చేయడానికి సిద్ధమైందని సమాచారం. నయనతారనే సెంట్రిక్ పాత్రను పోషించనున్న ఈ చిత్రానికి మిలింద్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు అవళ్ అనే చిత్రాన్ని చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నట వర్గం, సాంకేతిక వర్గాన్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. -
ప్రేమ కుట్టింది
టాలీ, కోలీ, బాలీ.. అన్ని వుడ్లనూ దాటిలవేరియా అన్ని అడవు(డ్)లకూ పాకింది.గుయ్.. గుయ్ మంటూ..ఈ వుడ్డునుంటావా, ఆ వుడ్డునుంటావాఅని అడిగేవరకూ ఆగడం లేదు. పడవెక్కి ప్రేమవుడ్డుకు.. సారీ.. ప్రేమఒడ్డుకుసాగిపోతోంది. అన్ని వుడ్‌ల ప్రేమా ఫలించాలి. స్క్రీన్ మీద లవ్‌బర్డ్స్‌కి లైఫ్‌లో కూడా లవ్ వైరస్ సోకితే.. అభిమానులు, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ వాక్సిన్ వేసుకుంటారు. అలా లవేరియాతో అయిదు జంటలు ఎంజాయ్ చేస్తున్నాయి. ఎవరో తెలుసుకోండి... పండగ చేసుకోండి ‘వాలెంటైన్స్‌డే’ను. ఆ దేవుడే పంపాడు ఈ సంక్రాంతికి విశాల్ తన పెళ్లిని కన్ఫార్మ్ చేశారు. అనీషా ఆళ్ల అనే హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారాయన. అనీషా కూడా నటే. ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి’ చిత్రాల్లో ఆమె నటించారు. ‘‘అనీషాతో నా పరిచయం పెళ్లివరకు వెళ్తుందని ఊహించలేదు. తనలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. తను బాస్కెట్‌బాల్ నేషనల్ ప్లేయర్. సోషల్ వర్కర్ కూడా. మా పెళ్లి అయ్యాక అనీషా సినిమాలు మానేస్తుందని నేను చెప్పలేను. ఆమెను దేవుడే నా కోసం పంపాడు’’ అని విశాల్ అంటారు. విశాల్, అనీషా నిశ్చితార్థం మార్చిలో జరగనుందట. పెళ్లి ఆగస్టులో జరగనుందని టాక్. పెళ్లి కబురు ఎప్పుడొస్తుందో! కోలీవుడ్‌లో ప్రేమపక్షులు అంటే నయనతార, విఘ్నేష్ శివన్లే. లేటెస్ట్గా ఆర్య, సాయేషాల పేర్లూ టైటిల్ కార్డ్స్‌లో చేరాయి. ఈ ఇద్దరూ కలిసి ‘గజనీకాంత్’ అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా టైమ్‌లోనే ఈ ఇద్దరి మీద కాదల్ (ప్రేమ) క్లాప్ కొట్టిందట. ఇప్పుడు సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్’ సినిమాలో సాయేషా కథానాయికగా నటిస్తుండగా, ఆర్య ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అతి త్వరలో ఆర్య, సాయేషాల వివాçహానికి సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చనే వార్త వైరల్ అయింది తమిళ సినీ పరిశ్రమలో. ఫొటోలతో కన్ఫార్మ్ బాలీవుడ్ కూడా లవ్ ఫ్లూతో ఫ్లేమ్ అవుతోంది. నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, నటి షిబానీ దండేకర్ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వినపడుతోంది. సోషల్ మీడియాలో కనపడుతోంది కూడా. గతేడాది అక్టోబర్‌లో ఫర్హాన్ అఖ్తర్, షిబానీ ఇద్దరూ ఒకేఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫర్హాన్ లవ్ సింబల్‌ను జతపెట్టి మరీ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి లవ్‌కి కన్ఫర్మేషన్ వచ్చినట్టయింది. ‘‘మీరు ఫర్హాన్‌తో ప్రేమలో ఉన్నారా?’’ అని షిబానీని అడిగితే ‘‘మేం పోస్ట్ చేసే ఫొటోలను బట్టే అందరూ అర్థం చేసుకోవాలి’’ అని జవాబు ఇచ్చారు. దాంతో ఈ ఏడాదే వీళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకోనున్నారని బాలీవుడ్లో ఒకటే హోరు. రోహ్మాన్తో ప్యార్ మే 1994 మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ ఇప్పుడు సినిమాల్లో రేర్ అయినా పబ్లిసిటీలో జోరుగా ఉన్నారు... రోహ్మన్ షాల్ అనే వ్యక్తితో లవ్‌లో పడి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో ఈ జంట వేసిన స్టెప్స్ సూపర్ హిట్. ‘రోహ్మాన్తో ప్యార్ మే’ కదా అంటే సుష్మితా నవ్వుతున్నారు. ‘మీ పెళ్లెప్పుడు?’ అంటే మాత్రం ‘నా పెళ్లి విషయం మీకెందుకు’ అంటూ మండిపడతున్నారట. కానీ మీడియాలో అయితే వీళ్లిద్దరూ ఈ ఏడాది వివాహం చేసుకోబోతున్నారనే న్యూస్ స్ట్రీమ్ అవుతోంది. సుష్మితా సేన్‌కు రినీ సేన్, అలీసా సేన్ అనే ఇద్దరు దత్తపుత్రికలు ఉన్న సంగతి తెలిసిందే. లవ్ ఫర్ హార్లిన్ ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్’తో 200 కోట్ల క్లబ్లో చేరాడు విక్కీ కౌశల్. పర్సనల్ లైఫ్‌ను లవ్ క్లబ్లో రిజిష్టర్ చేయించుకున్నాడు. హార్లిన్ సేథి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు చెప్పారు విక్కీ. ‘‘కామన్ ఫ్రెండ్ ద్వారా ఓ పార్టీలో హార్లిన్ను కలిశాను. లాస్ట్ ఇయర్ నుంచే తనతో డేటింగ్లో ఉన్నా. ఒకరినొకరం తెలుసుకుంటున్నాం. మా రిలేషన్ బాగుంది’’ అని చెప్పారు విక్కీ కౌశల్. మొహబ్బతే... తాప్సీ–మాథ్యాస్ బో, శ్రుతీహాసన్ – మైఖేల్ కోర్సలే, ఇలి యానా –ఆండ్రూ నీబోన్, నటాషా దలాల్–వరుణ్‌ధావన్, ఆలియా భట్–రణ్‌బీర్ కపూర్, రియా కపూర్–కరణ్ బులానీ, టైగర్ ష్రాఫ్–దిశా పాట్నీ... ఈ జంటలు ప్రేమలో మునిగి ఉన్నట్లు వాళ్ల తీరు స్పష్టం చేస్తోంది. వీళ్ల ప్యార్ ఈ యేడాదైనా మ్యారేజ్ టేక్ తీసుకుంటుందా? చూడాలి! ఇంతకీ ఇక్కడ ప్రస్తావించిన జంటల్లో రియా కపూర్ ఎవరో అనుకునేరు... ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, నటి సోనమ్‌కపూర్ సోదరే రియా. రింగులు మార్చుకున్నారు నిశ్చితార్థంతో సగం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కథానాయికలూ ఉన్నారు. జో అనే వ్యక్తితో రిచా గంగోపాధ్యాయ, జార్జ్ పానాయియోటోన్తో అమీ జాక్సన్, గుణ జక్కాతో అనీషా అంబ్రోస్లకు ఎంగేజ్మెంట్ అయింది. వీళ్ల పెళ్లి తేదీలు ఇంకా ఖరారు కాలేదు. జతకూడేనా? టాలీవుడ్లో ప్రేమ, పెళ్లి టాపిక్స్ వస్తే చాలు వెంటనే ప్రభాస్, రానా గుర్తొస్తారు. వీరితోపాటు వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్, నిఖిల్, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, అఖిల్, నాగశౌర్య, రాజ్ తరుణ్ వంటి హీరోల స్టేటస్ సింగిల్‌గానే ఉంది. వచ్చే ప్రేమికుల రోజుకైనా వీరికి వాళ్ల వేలెంటైన్ దొరికేనా.. జత కూడేనా? కాలం కాదల్‌తో జవాబిస్తుందేమో చూద్దాం! ప్రేమించు.. పెళ్లాడు ఇటీవల ప్రేమ వివాహలు చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. మలయాళ నటి భావన.. నిర్మాత నవీన్‌ను, శ్రియ తన ప్రేమికుడు అండ్రూ కృశ్చేవ్‌ను, కలర్స్ స్వాతి పైలట్ వికాస్‌ను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు నటి శ్వేతాబసు ప్రసాద్ గత డిసెంబర్ 13న పుణేలో రోహిత్ మిట్టల్‌కు జీవితభాగస్వామి అయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె , దర్శక, నిర్మాత సౌందర్యా రజనీకాంత్ వ్యాపారవేత్త విశాగన్ వనంగాముడిని వివాహమాడారు. ఇక బీటౌన్ పెళ్లిళ్ల వైపు వెళితే.. దీప్‌వీర్‌ల (దీపికా పదుకోన్–రణ్వీర్ సింగ్) ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒకింటి వారయ్యారన్నది సినీ అభిమాన జగమెరిగిన సత్యం. ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్ (నిక్యాంక)లు కూడా గత డిసెంబర్ 1, 2 తేదీల్లో రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 1న క్రిస్టియన్ స్టైల్లో, డిసెంబర్ 2న నార్త్ ఇండియన్ స్టైల్లో ఆ పెళ్లి వేడుకలు జరిగాయి. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాల వెడ్డింగ్ పంజాబ్ స్టైల్లో గత మే 8న జరగింది. సోనమ్ కపూర్ పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత మే 10న నేహా« «ధూపియా, అంగద్ బేడీల పెళ్లి అయింది. నటుడు మిలింద్ సోమన్, అంకిత కోన్వార్.. ఏప్రిల్ 22న మహారాష్ట్రియన్ వివాహ పద్ధతిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దర్శక–నిర్మాత దినేష్ విజన్ దుబాయ్‌కి చెందిన ప్రమీత తన్వర్‌ను, బాలీవుడ్ నటుడు, కమెడియన్ కపిల్ శర్మ.. గిన్ని చత్రాథ్ను పరిణయమాడారు. వీరితో పాటు హిందీ బుల్లితెర నటీనటులు కొందరు గతేడాది మ్యారీడ్ లైఫ్‌కు శ్రీకారం చూట్టారు. -
యంగ్ హీరో సరసన నయన్!
తమిళసినిమా: దసరా, దీపావళి, సంక్రాంతి మాదిరిగానే సమ్మ ర్ కూడా సినిమా వాళ్లకు పండగే. విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు సెలవులు కావడంతో ఆ సమయాల్లో చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు పోటీ పడుతుంటా రు. అలా సమ్మర్‌కు బరిలోకి దిగడానికి శివకార్తీకేయన్ మిస్టర్‌లోకల్ చిత్రం రెడీ అవుతోంది. సీమరాజా చిత్రం తరువాత ఈ సక్సెస్ఫుల్ నటుడు నటిస్తున్న చిత్రానికి మిస్టర్‌లోకల్ అనే టైటిల్‌ను చిత్ర వర్గాలు అధికారికపూర్వంగా ఖరారు చేశారు. సాధారణంగా చిత్రాలకు టైటిల్స్ చాలా హెల్ప్ అవుతాయి. అందుకే అటు కథను నప్పేలా, అదే సమయంలో ప్రేక్షకుల్లోకి ఈజీగా వెళ్లేలా టైటిల్స్‌ను నిర్ణయించుకుంటారు. అయితే అవి అందరికీ, అన్నిసార్లు కరెక్ట్‌గా సరిపడేలా అమరవు. నటుడు శివకార్తీకేయన్‌కు మాత్రం ఇప్పటి వరకూ తన ఇమేజ్‌కు సరిపడేవి, కథకు నప్పేవే అమిరాయనే చెప్పాలి. అదే విధంగా దర్శకుడు రాజేశ్.ఎం చిత్రాల టైటిల్స్ చర్చనీయాంశంగా ఉంటాయి. ఇక స్టూడియోగ్రీన్ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజా తన చిత్రాలకు జనాకర్షకమైన పేర్లను ఎంచుకుంటారన్న పేరు ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న చిత్రమే మిస్టర్ లోకల్. ఈ చిత్రం కోసం పలు పేర్లను పరిశీలించి చివరకు మిస్టర్ లోకల్ పేరును ఎంపిక చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేశారు. నటుడు శివకార్తీకేయన్ తెరపై నటించే పవర్ఫుల్ నటన పాజిటివ్‌గా ఉంటుంది. అది చూసినప్పుడు దర్శకుడికి ఆయనతో పోటీ పడాలనే అసక్తి కలుగుతుంది అని అన్నారు దర్శకుడు రాజేశ్.ఎం. ఇక ఇందులో అదనపు ఆకర్షణ ఏమిటంటే అగ్రనటి నయనతార నాయకి కావడం. ఆమె తెరపై అద్భుతాలు చేస్తున్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా ప్రోత్సాహం యూనిట్‌కు ఎంతగానో సహకరిస్తోందని అన్నారు. ఫుల్ మాస్ ఎంటర్టెయినర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ స్పెషల్‌గా మిస్టర్ లోకల్ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వస్తుందని దర్శకుడు తెలిపారు. -
ఓ కళాఖండంతో మరో కళాఖండం
దక్షిణాదిలోనే అగ్రనటిగా వెలిగిపోతున్నారు కేరళ బ్యూటీ నయనతార. ఓ పక్క తనకంటే చిన్నహీరోలతో పాటు మరోపక్క హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాలతో కూడా దూసుకుపోతుంది నయన్. వరుస షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికి.. మధ్యలో గ్యాప్ తీసుకుని బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్‌శివన్‌ను తీసుకుని విదేశాలకు చెక్కేస్తోంది. న్యూయిర్ వేడుకల కోసం అమెరికా వెళ్లి ఎంజాయ్ చేసిన ఈ జంట.. ఈ నెల చివరిలో మరోసారి అమెరికాకు వెళ్లారు. అక్కడ జాలీగా ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక అందమైన యువతి పెయింటింగ్‌ను ఆసక్తిగా గమనిస్తోన్న నయనతార ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు విఘ్నేశ్‌శివన్. ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఒక చిత్ర కళాఖండంతో మరో చిత్రకళాఖండం నిలబడిందే ఆహా ఏమి ఆశ్చర్యం’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram Graffiti & a beautiful painting 🥰😘 #nofilterneeded #pictures #photography #candid #losangeles #streetphotography #lowlights #shotoniphone A post shared by Vignesh Shivn (@wikkiofficial) on Jan 28, 2019 at 8:19pm PST -
రూల్స్‌ను పక్కన పెట్టేసిన నయనతార!
సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా ఓ రేంజ్లో దూసుకుపోతోంది నయనతార. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. సూపర్‌హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటోంది. నయన్ డేట్స్ దొరికాలంటే ఎవరైనా ఎదురుచూడాల్సిందే. అలాంటి నయన్.. సినిమా ఫంక్షన్లకు, ప్రమోషన్లకు అసలు హాజరు కాదు. కానీ మొదటి సారి తన నియమాలను పక్కన పెట్టేసినట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సైరా’లో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యేలా చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఒప్పించినట్టు తెలుస్తోంది. చరణ్ విజ్ఞప్తి మేరకు నయన్ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం. మరి సినిమా ప్రమోషన్లలో నయన్ పాల్గొంటే మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. -
ప్రారంభంకానున్న అట్లీ-విజయ్ చిత్రం!
తేరీ, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన అట్లీ, విజయ్‌ల కాంబినేషన్లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి రికార్డులను క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ కాంబో.. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రేపు జరుగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. విజయ్ నటిస్తున్న ఈ 63వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రీడానేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్.. స్పోర్ట్స్ కోచ్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. -
‘విశ్వాసం’ తెలుగులో వస్తోంది..!
తమిళనాట సంక్రాంతి బరిలోకి దిగిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ పేట, అజిత్ విశ్వాసం రెండూ వసూళ్ల సునామీని సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద ఈ రెండూ రికార్డులు క్రియేట్చేస్తుంటే.. బయట ఫ్యాన్స్ మధ్యలో కలెక్షన్ల వార్ నడుస్తోంది. ఈ రెండింట్లో ‘పేట’ తెలుగులో రిలీజై ఓ మోస్తరుగా నడుస్తోంది. అయితే అజిత్ విశ్వాసం కూడా తెలుగులో డబ్ అయ్యేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ చిత్రం తెలుగులో రిలీజ్‌కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. జగపతి బాబు ప్రతినాయకుడిగా, నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. మరి ఇక్కడి ప్రేక్షకులు ఈ మూవీకి ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి. -
కలెక్షన్స్‌లో ‘విశ్వాసం’ టాప్
తలైవా రజనీకాంత్ పేటా, అజిత్ విశ్వాసం బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుంటే.. వారి ఫ్యాన్స్ థియేటర్ వద్ద గొడవలు పడుతున్నారు. వీరి ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ఇద్దరు బడా హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఎలా ఉంటుందో తమిళనాడులో పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రాగా.. కలెక్షన్స్‌లో మాత్రం విశ్వాసం టాప్‌లో ఉంది. తమిళనాడులో ఈ చిత్రం టాప్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ వసూళ్లలో ముందంజలో ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తొలిరోజు విశ్వాసం దాదాపు 26కోట్లను వసూళు చేసినట్టు తెలుస్తోంది. వేదాలం, వివేగం, వీరం లాంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత శివ డైరెక్షన్లో నటించిన విశ్వాసం కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నయన తార హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతాన్ని అందించారు. -
యోగిబాబుతో యాషిక రొమాన్స్
చిన్న చిన్న పాత్రలతో కోలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగిన హాస్య నటుడు యోగిబాబు. అలాంటి నటుడిప్పుడు కథానాయకుడి స్థాయికి ఎదిగిపోయాడు. కోలమావు కోకిల చిత్రంలో ఏకంగా అగ్రనటి నయనతారను ఏకపక్షంగా ప్రేమించే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ హాస్య నటుడిప్పుడు చాలా మంది యువ హీరోలకంటే బిజీగా ఉన్నాడు.అందులో పాత్రలతో పాటు, కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు ఉండడం విశేషం. హీరోగా నటించడానికి ఎర్రగా, బుర్రగా, ఆరడుగుల అందగాడై ఉండాల్సిన అవసరం లేదని యోగిబాబు ద్వారా మరోసారి రుజువైంది. నల్లగా, పొట్టిగా, బొజ్జ వంటి ఆకారాలే యోగిబాబుకు నటుడిగా ప్లస్ అయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం ఇతను గూర్కా, ధర్మప్రభు చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా జాంబి అనే మరో కొత్త చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం యోగిబాబును వరించింది. విశేషం ఏమిటంటే ఇందులో అతనితో నటి యాషికా ఆనంద్ రొమాన్స్ చేయనుండడం. ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమై పాపులర్ అయిన నటి యాషికాఆనంద్. ఆ తరువాత బిగ్‌బాస్ రియాలిటీ షో సీజర్–2లో పాల్గొని ప్రాచుర్యం పొందిన ఈ అమ్మడు ఇప్పుడు ఓడవుమ్ ముడియాదు ఒళిక్కవుమ్ ముడియాదు, కళగు–2, చిత్రాలతో పాటు నటుడు మహత్తో కలిసి ఒక చిత్రంలో నటిస్తోంది. తాజాగా యోగిబాబుతో జాంబి చిత్రంలో నటించడానికి రెడీ అయ్యింది. ఇందులో ఈ బ్యూటీ యోగిబాబుకు ప్రేయసిగా నటించబోతోందట. కామెడీ థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని ఎస్–3 పిక్చర్స్ పతాకంపై వసంత్ మహాలింగం, ముత్తులింగం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.భువన్నల్లన్ దర్శకత్వం వహించనున్నారు. -
వైరల్ : అజిత్ ‘విశ్వాసం’ మోషన్ పోస్టర్..!
తమిళనాట రజనీకాంత్, విజయ్, అజిత్‌లకు ఉండే క్రేజే వేరు. వీరికి కేవలం తమిళనాటే కాకుండా.. దేశవిదేశాల్లో అభిమాన గణం ఉంది. వీరి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక వీరి సినిమాలకు సంబంధించిన టీజర్స్, మూవీ అప్డేట్స్, ట్రైలర్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. మొన్నటి వరకు సర్కార్ హవా కొనసాగగా, ప్రస్తుతం 2.ఓ ట్రెండింగ్‌లో ఉండగా.. ఇప్పుడు అజిత్ వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. వీరం, వేదాలం, వివేగం వంటి సూపర్హిట్లను అందించిన అజిత్-శివ కాంబినేషన్లో విశ్వాసం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగనుంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అజిత్‌కు సంబంధించిన ఈ మోషన్ పోస్టర్ ఇండియాస్ మోస్ట్ లైక్డ్ పోస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అజిత్‌కు జోడిగా నయనతార నటించారు. -
తాప్సీ లీడ్రోల్లో ‘గేమ్ ఓవర్’
టాలీవుడ్, బాలీవుడ్‌లలో సత్తా చాటిన తాప్సి ప్రధాన పాత్రలో వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఓవర్. గతంలో లవ్ ఫెయిల్యూర్, గురు సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘నయనతార’ ప్రధాన పాత్రలో తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్.. గేమ్ ఓవర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ఈ రోజు(గురువారం) చెన్నై ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో ఈ రోజు నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. -
అందుకే ఆమె లేడీ సూపర్‌స్టార్ అయ్యారు!
సాక్షి, తమిళసినిమా: అగ్రనటి నయనతార మరోసారి కోలీవుడ్ హెడ్‌లైన్స్‌లో మారుమోగిపోతున్నారు. ఈ మధ్య విడుదలైన ‘కోలమావు కోకిల’ సైలెంట్‌గా సక్సెస్ బాటలో పయనిస్తూ మరోసారి నయన్ స్టామినాను నిరూపించింది. ఈ చిత్రాన్ని నయన్ ఒంటి చేత్తో విజయ పథంలోకి తీసుకెళ్లారు. ఇక, తాజాగా విడుదలైన ‘ఇమైకా నొడిగళ్’ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇందులో హీరోగా అధర్వ, విలన్‌గా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, అతిథి పాత్రలో విజయ్‌సేతుపతి నటించినా, నయనతార ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు పారితోషికం తారాస్థాయికి చేరుకుందనే వార్తలు హోరెత్తుతున్నాయి. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న హీరోయిన్గా నయన్ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇమైకా నొడిగళ్’ చిత్రానికి భారీ పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల సమయంలో ఆర్థికంగానూ పలు సమస్యలను ఎదుర్కొంది. చివరినిమిషంలో చిత్ర విడుదల ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అభిరామి రామనాథన్ లాంటి వారు చివరిసమయంలో చిత్రానికి మద్దతిచ్చి.. విడుదలయ్యేలా చూశారు. అప్పటికీ నయనతార పారితోషికంలో ఇంకా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా అన్ని శాఖల వారికి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతే చిత్రం విడుదల అవుతుంది. తన సినిమా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని అర్థం చేసుకొని.. నయనతార తనకు రావలసిన మొత్తాన్ని వదులుకుందట. ఈ విషయం తెలియడంతో నయన్ కోలీవుడ్‌లో, సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. ఈ పెద్ద మనస్సు వల్లే నయనతార లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార పాత్రకు మొదట మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ పాత్రను ఫీమేల్‌గా మార్చి నయనతారను ఎంచుకున్నారు. ఇప్పుడు ఆమె పాత్రే ‘ఇమైకా నొడిగళ్’ చిత్రానికి భారీ కాసులు కురిపిస్తోంది. -
అజిత్ ‘విశ్వాసం’ ఫస్ట్ లుక్
కోలీవుడ్ స్టార్ తలా అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వాసం. అజిత్ హీరోగా వీరం, వేదలం, వివేగం లాంటి సూపర్ హిట్స్ అందించిన శివ దర్శకత్వంలోనే ఈసినిమా తెరకెక్కుతోంది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తలా సరసన తొలిసారిగా నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు డి ఇమాన్ సంగీతమందిస్తున్నారు. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివేగం సినిమా తరువాత అజిత్ లాంగ్ గ్యాప్ తీసుకోవటంతో ఈ సినిమాలో తలా లుక్ ఎలా ఉండబోతోందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్‌కు చాలా సమయమున్నా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇప్పుడే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్‌లుక్‌లో అజిత్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. శివ మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అజిత్‌కు మరో సూపర్ హిట్ కన్ఫామ్ అంటున్నారు ఫ్యాన్స్. -
స్టార్ హీరోల బాటలో నయన్!
తమిళసినిమా: మొదట్లో అందాలారబోతకే పరిమితమైన నటి నయనతార. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ నటనలో పరిణతి పొందుతూ స్టార్ హీరోయిన్ అంతస్తును అందుకున్నారు. అంతే అలా అంచెలంచెలుగా నటిగా తన స్థాయిని పెంచుకుంటూ మాయ, అరమ్ వంటి త్రాలతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల కథానాయకి అంతస్తుకు చేరుకుంది. అలా అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నయనతార ప్రస్తుతం రూ.4 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్న ఏకైక దక్షిణాది కథానాయకిగా రికార్డుకెక్కింది. నయనతార నటించిన తాజా హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం కొలమావు కోకిల (కోకో). అరమ్ వంటి సంచలన చిత్రం తరువాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కావడంతో కోలమావు కోకిల చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. సాధారణంగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి స్టార్స్ చిత్రాల విడుదల కోసమే అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తారు. వారిని దృష్టిలో పెట్టుకునే విడుదల సమయంలో వేకువజామునే చిత్రాలను విడుదల చేస్తుంటారు. ఆ పట్టికలో నటుడు శివకార్తికేయన్ కూడా చేరారు. అదే విధంగా ఇటీవల మిర్చి శివ నటించిన తమిళ్‌పడం–2 చిత్రాన్ని కూడా ఉదయం 6 గంటల ఆటలను ప్రదర్శించారు. నయనతార కూడా స్టార్స్ జతన చేరింది. ఆమె నటించిన కోలమావు కోకిల చిత్రాన్ని శుక్రవారం నగరంలో ఉదయం 6 గంటల ఆటలను ప్రదర్శించారు. విశేషం ఏమిటంటే ఇవి విద్యార్థులకు సెలవు రోజుల్లో పండగల సమయమో కాదు. అయినా కోకో చిత్రాన్ని ఉదయం ఆటలు ప్రదర్శించడం విశేషమే అవుతుంది. ఇలా హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలు ఉదయం ఆటలు పడడం ఇదే ప్రప్రథమం అని చెప్పవచ్చు. ఆ విధంగా నయనతార ఈ చిత్రంతో స్టార్ నటులకు దీటుగా నిలిచిందనే చెప్పాలి. -
నయన్‌కు కళ్లు చెదిరే పారితోషికం
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు పోటి ఇచ్చే స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ నయనతార. వరుసగా లేడి ఓరియంటెడ్ సినిమాలతో ఘనవిజయాలు సాధిస్తున్ ఈ భామ, అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటోంది. ఇప్పటికే నయన్‌కు ఒక్కో సినిమాకు రెండు కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ భామ పాత రికార్డులన్నింటిని చేరిపేసేందుకు రెడీ అవుతోంది. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఓ తమిళ సినిమాకు ఏకంగా 4.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోనుందట. ఇంత వరకు సౌత్‌లో ఏ హీరోయిన్ కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకున్న దాఖాలలు లేవంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే నయన్ ప్రధానపాత్రలో తెరకెక్కిన కో కో కోకిల, ఇమాయక్క నొడిగళ్ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండగా విశ్వాసం, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. -
టీజర్ దారిలో ఉంది!
గతేడాది బర్త్ డే సందర్భంగా ‘సైరా’ చిత్రం టైటిల్ అండ్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సినీ ప్రేమికులను ఖుషీ చేశారు నటుడు చిరంజీవి. అలాగే ఈ సారీ ఆ ఖుషీని రెట్టింపు చేసేందుకు ‘సైరా’ టీజర్‌ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘సైరా’. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌డే. ఈ సందర్భంగా నిమిషం నిడివి ఉన్న ‘సైరా’ టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. అంటే టీజర్ అన్ ద వే అన్నమాట. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్లో వార్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
కమల్‌తో నయన్ ఢీ
కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్–2 చిత్రంలో ఆయనకు జంటగా నయనతారను నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అందుకు నయనతార కొన్ని షరతులు విధించారు. అందులో ముద్దుసీన్లు తీయాలనుకుంటే ముందుగానే తెలియజేయాలని, స్విమ్ సూట్లో నటించేది లేదంటూ తేల్చేశారు. ఇలావుండగా కోలమావు కోకిల అనే చిత్రంలో మత్తుమందులు తరలించే మహిళగా నటిస్తున్నారు నయనతార. ఈ సినిమా కోసం నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ ఓ పాట కూడా రాశారు. ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. ఇలావుండగా కమలహాసన్ నటించిన విశ్వరూపం–2 చిత్రం ఇదివరకే ఫైనాన్స్ సమస్యతో రెండేళ్లు రిలీజ్ కాకుండా ఉంది. ఈ చిత్రం బాధ్యతలు స్వీకరించిన కమలహాసన్ చిత్రాన్ని పూర్తిగా ముగించి సెన్సార్ సర్టిఫికెట్ పొందారు. ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఇండియన్–2లో జంటగా నటించనున్న కమలహాసన్, నయనతార నటించిన చిత్రాలు ఒకే రోజున తలపడేందుకు రెడీ కావటంతో కోలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. -
హన్సిక సైతం..
తమిళసినిమా: అందాల భామ హన్సిక సైతం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. నయనతార, అనుష్క, త్రిష వంటి అగ్రతారలు స్త్రీ ప్రధాన ఇతివృత్త కథాచిత్రాలకు మారిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ హర్రర్ కథా చిత్రాల్లోనూ నటించారు. తాజాగా ఈ కోవలో హన్సిక చేరుతోంది. అవును ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఒక థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. కోలీవుడ్‌లో యువ స్టార్ హీరోలందరితోనూ నటించేసిన ఈ అమ్మడికి చిన్న గ్యాప్ వచ్చిన మాట నిజ మే అయితే ఇప్పు డు సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అయిపోయింది. ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు చిత్రాలను చేస్తున్న హన్సిక తాజాగా మరో చిత్రానికి ఓకే చేసింది. ఇదే థ్రిల్లర్ కథా చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించడం. దీన్ని జ్యోస్టర్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎం.కోటేశ్వర రాజు నిర్మించనున్నారు. విజయ్ రాజేంద్ర వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా యుఆర్.జమీల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన మసాలా పడం, రోమియో జూలియట్, భోగన్ చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశారు. రోమియో జూలియట్, భోగన్ చిత్రాల సమయంలో యుఆర్.జమీల్ పనితనం నటి హన్సికను ఆకర్షించిందట. అందుకే ఈయన దర్శకత్వంలో నటించమని అడగ్గానే ఓకే చెప్పాసిందట. ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ పలు భారీ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న జిబ్రాన్ తమ చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యం కలిగిన ఈ థ్రిల్లర్ కథా చిత్రానికి పనిచేయడానికి ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారన్నారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యి సంగీతాన్ని అందించడానికి సమ్మతించారని చెప్పారు. ఇక నటి హన్సిక కథ వినగానే కథ వినగానే నటించడానికి సమ్మతించారని చెప్పారు.ఆమె నాయకిగా నటించడం, జిబ్రాన్ సంగీతాన్ని అందించడం సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. మరి కొందరు ప్రఖ్యాత సాంకేతిక నిపుణలను ఎంపిక చేసే చర్చల్లో నిర్మాతలు ఉన్నారని చెప్పారు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అనగానే వాణిజ్య పరమైన అంశాలు అంతగా ఉండవని భావించవచ్చునని, అయితే తమ చిత్రంలో థ్రిల్లింగ్ అంశాలతో పాటు జనరంజకమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని అన్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి విలువలతో నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు యుఆర్.జమీల్ చెప్పారు. -
నిర్ధాక్షణ్యంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారు..
తమిళసినిమా: అగ్రనటి నయనతార. ఆమె చిత్రం అంటే వ్యాపారం పరంగా ఎలాంటి ఢోకా ఉండదు. ఇక ప్రేక్షకులు కూడా నయనతార చిత్రం అంటే ఎలాగున్నా మినిమం గ్యారెంటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అలాంటిది ఆ నటి చిత్రంపై దర్శక నిర్మాతలు అసంతృప్తితో ఉండడం ఏమిటనేగా మీ సందేహం. ఆ కథేంటో చూసేద్దాం. నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కొలమావు కోకిల ఒకటి. ఆమె డ్రగ్స్ స్మగ్లర్‌గా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. చిత్ర నాయకి డ్రగ్స్ స్మగ్లర్ పాత్రలో నటిస్తోందన్న సమాచారం బయటకు రాగానే కొలమావు కోకిల చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక నయనతార ప్రధాన పాత్ర పోషించిన చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. చిత్రం టీజర్ ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తోంది. అందులో నయనతారను విపరీతంగా ఒన్‌సైడ్ చేసే హాస్యనటుడు యోగిబాబు పాత్రకు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అంతా బాగానే ఉంది. సమస్య అంతా సెన్సార్‌బోర్డుతోనే. ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్లగా పూర్తిగా చూసిన సభ్యులు నిర్ధాక్షణ్యంగా ఏ సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో చిత్ర వర్గాలకు షాక్. అయితే దర్శకుడు నెల్సన్ ఎలాగో సెన్సార్ సభ్యులతో పోరాడి యూ/ఏ సర్టిఫికెట్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. అదీ కొన్ని సన్నివేశాల కట్స్ తరువాతేనట. అయితే చిత్ర నిర్మాత మాత్రం ఈ విషయంలో చాలా అప్సెట్ అయ్యారని, కొలమావు కోకిలను రివైజింగ్ కమిటీకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఆర్సీకి వెళ్లితే నయనతార చిత్రానికి యూ సర్టిఫికెట్ లభిస్తుందని నిర్మాత నమ్ముతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. -
సూపర్ హిట్ రీమేక్‌లో రాజ్ తరుణ్
ఈ శుక్రవారం రాజుగాడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కోలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రాజ్ తరుణ్. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈసినిమా నానుమ్ రౌడీ దాన్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు రాజ్ తరుణ్. కానీ నానుమ్ రౌడీ దాన్ అప్పట్లో నేను రౌడీనే పేరుతో తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే తెలుగులో రిలీజ్ అయిన సినిమా రీమేక్‌తో రాజ్ తరుణ్ ఏమేరకు ఆకట్టుకోగలడో చూడాలి. గతంలో కాటమరాయుడు సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. తెలుగులో వీరుడొక్కడేగా రిలీజ్ అయిన వీరం సినిమాను మళ్లీ కాటమరాయుడు పేరుతో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో పోలీస్‌గా రిలీజ్ అయిన తేరి సినిమాను కూడా రవితేజ హీరోగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. -
విజయశాంతి తరహాలో...
సాక్షి, చెన్నై : దక్షిణాదిలో ఇప్పుడు సంచలన నటి నయనతార రేంజే వేరు. ఆమె చిత్రాలు స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా వసూళ్లను కొల్లగొడుతున్నాయి. యువ నటుల నుంచి, ప్రముఖ నటుల వరకూ నయనతార స్టార్‌డమ్‌ను ఉపయోగించుకోవడానికి తహతహ లాడుతున్నారనడం అతిశయోక్తి కాదు. నయనతార ప్రస్తుతం చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు తను నటిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. త్వరలో అజిత్‌తో విశ్వాసం చిత్రంలో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా యువ క్రేజీ నటుడు శివకార్తికేయన్‌తో రెండోసారి నటించనున్నారు. రాజేశ్.ఎం ఈ చిత్రానికి దర్శకుడు. చాలా కాలం క్రితం లేడీ సూపర్‌స్టార్‌గా రాణించిన నటి విజయశాంతి మన్నన్ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో విజయశాంతి పాత్ర రజనీకాంత్ పాత్రకు దీటుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, అహంకారం కలగలిపిన ఆ పాత్రలో విజయశాంతి నటన ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం నటి నయనతార కూడా లేడీసూపర్‌స్టార్ ఇమేజ్ను పొందారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించనున్న చిత్రం వినోదానికి పెద్ద పీట వేసే కథ అయినా, నయనతార పాత్ర మాత్రం కోపం, పౌరుషం కలిగి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. -
ఆ ముగ్గురి బాటలో...
సాక్షి, చెన్నై : హన్సిక కూడా రెడీ అయిపోతోంది అనగానే ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలకు వెళ్లిపోతున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఈ ముంబై బ్యూటీ నోట ఇంకా పెళ్లి మాట రానే లేదులెండి. మరి దేనికి రెడీ అవుతోందనేగా మీ ఆసక్తి. థ్రిల్లర్ కథా చిత్రానికండి. నయనతార, అనుష్క, త్రిష బాటలో పయనించడానికి సిద్ధం అవుతోంది హన్సిక. అవును హన్సిక కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోంది. ఈ అందగత్తె ఇప్పుటి వరకూ అభినయంతో కూడిన గ్లామరస్ పాత్రలోనే నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అరణ్మణై–2 చిత్రంతో హర్రర్ పాత్రను కూడా రక్తి కట్టించారు. అయితే థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించలేదు. అదేవిధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది ఇప్పుడా అవకాశం హన్సికను వరించింది. మసాలా పడం, భోగన్, రోమిమో జూలియట్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన యూఆర్.జమీల్ మెగాఫోన్ పడుతున్న చిత్రంలో హన్సిక కథానాయకిగా సెంట్రిక్ పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి సమయంలో కథనంతా తన భుజస్కంధాలపై మోసుకెళ్లే చిత్రంలో నటించే అవకాశం రావడం విశేషమే. ఈ చిత్రం వివరాలను దర్శకుడు జమీల్ తెలుపుతూ హన్సికను దగ్గరుండి చూసిన తనకు ఈ చిత్ర కథ తయారు చేసుకున్నప్పుడు ఇందులో కథానాయకి పాత్రకు తనే కరెక్ట్‌గా నప్పుతుందనిపించిందన్నారు. కథ చెప్పగానే హన్సిక వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుటి వరకూ పోషించనటువంటి వైవిధ్యభరిత పాత్రలో హన్సికను ప్రేక్షకులు చూస్తారన్నారు. మహిళలు తమ కష్టాల నుంచి బయట పడడానికి ఏం చేస్తారన్నది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఈ చిత్రంలో హన్సిక పాత్ర గురించి ప్రస్తుతానికి చెప్పలేనని, అయితే ఇందులో హన్సిక భారీ ఫైట్స్‌ను కూడా చేస్తారని, అవి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని అన్నారు. ప్రేమ, హాస్యం అంటూ జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయని, జాయ్స్టార్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ నిర్మించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం జూలైలో సెట్ పైకి వెళ్లనుందని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జమీల్ చెప్పారు. -
నిర్మాతగా మారుతున్న హీరోయిన్
తమిళ సినిమా : ఇంతకు ముందు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన నటి సదా. అజిత్, విక్రమ్, మాధవన్ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామ టాలీవుడ్‌లోనూ కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించింది. అలాంటిది అనూహ్యంగా వెనుకబడ్డారు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సదాకు చాలా గ్యాప్ తరువాత ఒక కోలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. టార్చ్‌లైట్ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసింది. గతంలో ముందు విజయ్ హీరోగా తమిళన్ చిత్రాన్ని తెరకెక్కించిన మజీద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని గురించి ఆయన తెలుపుతూ టార్చ్‌లైట్ చిత్రం మహిళావగాహన కథా చిత్రంగా ఉంటుందన్నారు. పేదరికం కారణంగా వ్యభిచార వృత్తిలోకి దిగే స్త్రీల గురించిన చిత్రంగా టార్చ్‌లైట్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో నటించడానికి పలువురు ప్రముఖ నటీమణులు నిరాకరించారని, అలాంటి పాత్రను చేయడానికి నటి సదా ధైర్యంగా ముందుకొచ్చారని చెప్పారు. టార్చ్‌లైట్ సదా కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ దర్శకుడి ప్రతిభను మెచ్చి నటి సదా ఆయన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని సొంతంగా నిర్మించడానికి సిద్ధం అయ్యారట. అగ్రనటిగా వెలుగొందుతున్న నయనతార కూడా ఆరమ్ కథ తనను బాగా ఆకట్టకోవడంతో ఆ చిత్రాన్ని తనే నిర్మించారన్నది గమనార్హం. ఇప్పుడు నయన్ బాటలోనే నటి సదా పయనించడానికి సిద్ధం అవుతోందన్న మాట. -
ఆ ఇద్దరి డ్యూయెట్లకు భారీ సెట్..
అజిత్, నయనతారలు ఆడి పాడుకోవడానికి హైదరాబాద్‌లో భారీ సెట్ సిద్ధమైంది. ఈ జంట తొలిసారిగా 2008లో ఏగన్ చిత్రంలో జత కట్టారు. ఆ తర్వాత నటించిన బిల్లా, ఆరంభం చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా నాలుగోసారి విశ్వాసం చిత్రం కోసం ఈ క్రేజీ జంట జతకట్టనున్నారు. వీరం, వేదాళం, వివేగం చిత్రాలను తెరకెక్కించి శివ మరోసారి విశ్వాసం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం సెట్‌పైకి వెళ్లవలసింది. అయితే చిత్ర పరిశ్రమ సమ్మె కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన సెట్ నిర్మాణం పూర్తి అయినట్లు సమాచారం. ఇందులో అజిత్ నయనతారల ప్రేమ సన్నివేశాలు, ప్రణయగీతాలను చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన అజిత్ చిత్రానికి తొలిసారి పని చేస్తున్నారు. చిత్ర షూటింగ్ ఈ నెల చివరిలో ప్రారంభం కానుంది. -
ఆ బ్యూటీ సినీ కెరీర్, జీవితం.. రెండూ సంచలనమే..
సాక్షి, చెన్నై: అగ్రనటి నయనతారపై రోజుకో సంచలన వార్త ప్రచారమవుతూ ఆమె అభిమానుల్ని టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ బ్యూటీ సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం రెండూ సంచలనంగానే సాగుతున్నాయి. నటిగా వద్దంటే అవకాశాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక వ్యక్తిగతంగా చూస్తే ప్రేమ, జాలీ అంటూ యమజోరుగా సాగిపోతోంది. దర్శకుడు విఘ్నేశ్‌శివతో పరిచయం నయనతార దిశను మార్చేసిందనే చెప్పాలి. వీరి కాంబినేషన్లో తెరకెక్కిన నానూమ్ రౌడీదాన్ చిత్రం హిట్. ఆ చిత్రంతో పరిచయం అయిన ఈ జంట బంధం బలపడింది. నయనతార, విఘ్నేశ్‌శివల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందన్న ప్రచారమే తప్ప వారిద్దరూ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఇటీవలే నయనతార డేర్ చేసి నా కాబోయే భర్తకు ధన్యవాదాలు అంటూ బహిరంగంగా విఘ్నేశ్‌శివతో తన బంధాన్ని స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు చాలా విషయాలు జరిగాయన్నదే తాజా సమాచారం. నయనతారకు విఘ్నేశ్‌శివకు ఇటీవల కేరళలో అత్యంత రహస్యంగా వివాహ నిశ్చితార్థం జరిగిందని, ఆ వేడుకను ఎంజాయ్ చేయడానికే ఈ జంట అమెరికాకు వెళ్లినట్లు తెలిసింది. అయితే నయనతార, విఘ్నేశ్‌శివల వివాహ నిశ్చితార్థం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యనే జరిగిందట. మరో విషయం ఏమిటంటే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుంటున్న నయనతార త్వరలో నటనకు గుడ్‌బై చెప్పేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అవును ఇప్పటికే నయనతార, విఘ్నేశ్శివలకు అర్ధ పెళ్లి జరిగిపోగా నవంబర్‌లో ఈ ప్రేమజంట పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం. వివాహానంతరం నయనతార నటనకు టాటా, బైబై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇందులో నిజం ఎంత అన్నది తెలియాలంటే ఈ సంచలన జంట కల్యాణ ఘడియల వరకూ ఆగాల్సిందే. -
మరో హర్రర్ చిత్రంలో..
తమిళసినిమా: మరో హర్రర్ కథా చిత్రంలో నటించడానికి నటి నయనతార రెడీ అవుతున్నారా? అవుననే టాక్ వినిపిస్తోంది. ఈ తారను లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నాయకిగా మార్చిన చిత్రం మాయ. ఇది హర్రర్‌తో కూడిన మిస్టరీ కథా చిత్రం. సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తరువాత నయనతార రేంజే మారిపోయిందని చెప్పాలి. అయితే ఆ తరువాత నటించిన డోర చిత్రం నిరాశపరచినా, నయనతార కెరీర్‌కు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. ఇక ఈ మధ్య నటించిన అరమ్ చిత్రం నయనతారకు లేడీ సూపర్‌స్టార్ స్థాయినే తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్‌లో నయనతారకు ఆ తరహా లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే కొలమావు కోకిల, కొలైయుధీర్ కాలం, అరివళగన్ దర్శకత్వంలో చిత్రం అంటూ నటిస్తున్న నయనతార తాజాగా మరో హర్రర్ మిస్టరీ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. బాలీవుడ్లో సంచలన నటి అనుష్కశర్మ కథానాయకిగా నటించి సొంతంగా నిర్మించిన పరి అనే హర్రర్ కథా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. దీనికి ప్రాజిట్‌రాయ్ దర్శకుడు. ఆయనిప్పుడు పరి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, ఇందులో నయనతారను అనుష్కశర్మ పాత్రలో నటింపజేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇదే విధంగా ఇప్పటికే హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సులు చిత్రం తమిళంలో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. హిందీలో నటి విద్యాబాలన్ పోషించిన పాత్రలో జ్యోతిక నటించడానికి రెడీ అవుతున్నారు. దీనికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా మన కథానాయికలు హిందీ చిత్రాల రీమేక్‌లపై ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. -
నయన్ ఐరన్ లేడీ!
తమిళసినిమా: కోలీవుడ్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్, నటి నయనతార సంచలన ప్రేమజంటగా వార్తల్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. నానుమ్ రౌడీ దాన్ చిత్ర షూటింగ్ సమయంలో కలిగిన వీరి పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచే మీరి మధ్య ప్రేమ గురించి మీడియా కోడై కూస్తున్నా, ఈ జంట మాత్రం చక్కగా ఎంజాయ్ చేశారేగానీ వారి ప్రేమ కలాపాల గురించి నోరు మెదపలేదు. అలాంటిది కొంతకాలంగా నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో పబ్లిక్ ఫంక్షన్లలోనూ దర్శనమిస్తున్నారు. ఇక పుట్టిన రోజున ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, విదేశాల్లో విహరించడం, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పొందుపరుస్తూ మీడియాకు మంచి పనికల్పించడం వంటి చర్యలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య ఒక అవార్డు వేదికపై ఈ అవార్డును అందుకోవడానికి కారణమైన తన తల్లిదండ్రులు, సహోదరుడు, ప్రేమికుడికి ధన్యవాదాలు అని పేర్కొంది నయన్. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు నయనతార ఆయనే నా కాబోయే వరుడు అంటూ విఘ్నేష్ శివన్‌ను తన జీవిత భాగస్వామిగా ఖరారు చేశారు. ఇదిలా ఉండగా దర్శకుడు విఘ్నేష్ శివన్ వెర్షన్‌కు వస్తే ఇటీవల ఒక టీవీ చానల్లో నయనతార ప్రస్తవన రాగా ఆమె తనకు ఎందుకు నచ్చిందన్న విషయాన్ని చెబుతూ నయనతార తన ఫేవరేట్ నటి అన్నారు. అంతకు మించి దేన్నైనా ఎదుర్కొనే మనోధైర్యం కలిగిన యువతి అని పేర్కొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నయనతార ఐరన్ మహిళామణి అని పేర్కొన్నారు. అందుకే తను అంటే తనకు ఎక్కువ ఇష్టం అని చెప్పారు. ఆ విధంగా భగవంతుడి ఆశీర్వాదం పొందానని దర్శకుడు విఘ్నేష్ శివన్ అన్నారు. ఈ సంచలన జంట ఇప్పటికే సహజీవనం సాగిస్తున్నా, త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు సినీ వర్గాల టాక్. -
కాబోయే భర్త అంటూ అనౌన్స్ చేసేసింది
సాక్షి, చెన్నై : లేడీ సూపర్ స్టార్ నయనతార, యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ మధ్య సంబంధం గురించి తెలియంది కాదు. నాన్‌మ్ రౌడీ ధాన్(తెలుగులో నేనూ రౌడీనే)చిత్ర షూటింగ్ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ పలు ఈవెంట్లలో జంటగా కనిపిస్తూ హాట్ టాపిక్‌గా మిగిలారు. ఒకానోక దశలో వీరిద్దరూ కేరళలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు రావటం.. వాటిని నయనతార ఖండించటం చూశాం. ఆ సమయంలో విఘ్నేశ్‌తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె ప్రకటించారు. అయినప్పటికీ వారి మధ్య రిలేషన్షిప్ గురించి తర్వాత చాలా కథనాలు వచ్చాయి. ఇక శుక్రవారం ది హిందూ పత్రిక నిర్వహించిన మహిళా అవార్డుల వేడుకలో నయనతార పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటనా రంగంలో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న నయన్.. తల్లిదండ్రులకు, సోదరుడికి, కాబోయే భర్త(విఘ్నేశ్‌ను ప్రస్తావిస్తూ)కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వేదిక మీద ప్రకటించింది. దీంతో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారన్న వార్త కన్ఫర్మ్ అయిపోయింది. -
సైరా టీమ్‌కు షాక్
సాక్షి, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న సైరాలో సౌత్ నటులతోపాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ కావటంతో చిత్ర యూనిట్ కంగుతింది. ఓ ఇంట్లో ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొన్న ఫోటో అది. చిరుతోపాటు హీరోయిన్ నయనతార.. మరికొందరు పాత్రధారులు అందులో ఉన్నారు. చేతిలో చంటిబిడ్డను ఎత్తుకున్న నయన్.. చిరు కుటుంబ సభ్యులతో సీరియస్‌గా మాట్లాడుతుండగా.. వెనకాల చిరు (నరసింహారెడ్డి) అనుచరులు ఉన్న ఫోటో అది. చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరో రహస్యంగా ఆ ఫోటోను తీసి ఇంటర్నెట్లో పెట్టినట్లు స్ఫష్టమౌతోంది. అయితే ఫోటో లీక్ అయిన విషయాన్ని తెలుసుకున్న చిత్ర యూనిట్ అప్రమత్తమై వెంటనే దానిని తొలగించింది. ఈ వ్యవహారంపై చిరుతోపాటు నిర్మాత రామ్ చరణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని చిత్ర యూనిట్‌కు వాళ్లు వార్నింగ్ ఇచ్చారంట. -
మూగ పాత్రలో లేడీ సూపర్ స్టార్
తమిళసినిమా: నయనతార ఇప్పుడు అభినయంతో కూడిన పాత్రలకే ఆమోదముద్ర వేస్తున్నారు. అగ్రతార ఇమేజ్ను కాపాడుకునే విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న చిత్రాలన్నీ ఆ తరహావే అని చెప్పవచ్చు. త్వరలో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నది గమనార్హం. నయనతార నటిస్తున్న చిత్రాల్లో కోకో ( కోలమావు కోకిల) ఒకటి. నయనతార నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికిన చిత్రాల్లో నానూ రౌడీదాన్ ఒకటి. అందులో నయనతార చెవిటి యువతి పాత్రలో అద్భుతంగా అభినయించి ప్రశంసలు పొందారు. ఈ పాత్రకుగానూ సైమా అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా నటిస్తున్న కోకో చిత్రంలో మూగ అమ్మాయిగా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొత్త దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఇందులో ఆమె పాత్ర స్వరూపం, హావభావాలు, ధరించే దుస్తుల వరకూ చాలా వైవిధ్యంగా ఉంటాయట. అరమ్ చిత్రంలో పూర్తిగా విభిన్నంగా కనిపించిన నయనతార కోకో చిత్రంలో మరోసారి తనను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. -
‘కర్తవ్యం’ మూవీ రివ్యూ
టైటిల్ : కర్తవ్యం జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : నయనతార, సును లక్ష్మీ, విఘ్నేష్, ఆనంద్ కృష్ణన్ సంగీతం : గిబ్రాన్ దర్శకత్వం : గోపీ నైనర్ నిర్మాత : శరత్ మరార్, ఆర్.రవీంద్రన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో వరుస విజయాలు సాధిస్తున్న నయనతార లీడ్ రోల్లో తెరకెక్కిన తమిళ సినిమా ఆరమ్. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో కర్తవ్యం పేరుతో (సాక్షి రివ్యూస్) డబ్ చేసి రిలీజ్ చేశారు. నయనతార కలెక్టర్ పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రివ్యూ షోస్‌తోనే పాజిటివ్ టాక్ రావటంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన కర్తవ్యం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? నయనతార లేడీ సూపర్ స్టార్‌గా తన హవాను కొనసాగించిందా..? కథ : కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని కలెక్టర్ మధువర్షిణి(నయనతార). నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మధువర్షిణి అక్కడి నీటి సమస్యను ఎలాగైన పరిష్కరించాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో ధన్సిక అనే నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడుతుంది. (సాక్షి రివ్యూస్) ఆ పాపను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రంగా ప్రయత్నించినా అక్కడి పరిస్థితుల కారణంగా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. మధువర్షిణి ప్రభుత్వ పరంగా చేసిన ప్రయత్నాలన్ని విఫలం కావటంతో చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? ఆ చిన్నారి ప్రాణాలు ఎలా కాపాడింది? అన్నదే మిగతా కథ. నటీనటులు : పూర్తిగా తమిళ నేటివిటితో తెరకెక్కిన ఈ సినిమాలో ఒక్క నయనతార (సాక్షి రివ్యూస్) మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. సినిమా పూర్తిగా నయనతార పాత్ర చుట్టూ నడవటంతో ఎక్కడా మనకు డబ్బింగ్ సినిమా చూస్తున్నామన్న భావన కలుగదు. నయనతార తనదైన నటనతో సిన్సియర్ కలెక్టర్ పాత్రకు ప్రాణం పోసింది. సెటిల్డ్ పర్ఫామెన్స్తో మధువర్షిణి పాత్రలో జీవించింది. ఇతర పాత్రల్లో కనిపించిన నటీనటులు సహజంగా నటించారు. కొత్తవారే అయినా ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి మెప్పించారు.(సాక్షి రివ్యూస్) విశ్లేషణ : గ్రామీణ ప్రాంతాల్లో నీటికోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ఎంచుకున్న దర్శకుడు గోపి నైనర్ ఆ కథకు కంటతడి పెట్టించే ఎమోషన్స్ జోడించి సినిమాను నడిపించాడు. అనవసరమైన కామెడీ, కమర్షియల్ సన్నివేశాలను ఇరికించకుండా (సాక్షి రివ్యూస్) సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఎక్కడా సినిమా చూస్తున్న భావన కలగకుండా నిజంగా జరిగిన సంఘటనను చూస్తున్నామనిపించేలా సాగింది కథనం. (సాక్షి రివ్యూస్) ఒక పక్క అంతరిక్షంలోకి రాకెట్ లను పంపుతున్నా వంద అడుగుల బావిలో పడ్డ పాపను కాపాడేందుకు సరైన పరిజ్ఞానం లేని పరిస్థితులను ఆలోచింప చేసే విధంగా ఎత్తి చూపించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం, రాజకీయనాయకులు తప్పులను కూడా ఎత్తి చూపించారు. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువుల బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : నయనతార నటన ఎమోషనల్ సీన్స్ కథా కథనం మైనస్ పాయింట్స్ : రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
సూపర్‌స్టార్‌తో మళ్లీనా?
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో అగ్రనటి నయనతార మరోసారి నటించనుందా? అలాంటి చర్చే తాజాగా కోలీవుడ్‌లో హల్చల్ చేస్తోంది. ఈ జంట ఇప్పటికే చంద్రముఖి, కుశేలన్ చిత్రాల్లో కలిసి నటించారు. అంతే కాదు నయన్.. శివాజీ చిత్రంలో రజనీతో ఒక పాటకు చిందేసింది కూడా. అయితే అప్పటి నయనతార స్థాయి వేరు ఇప్పటి స్థాయి వేరు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల నాయకిగా ఎదిగి, లేడీసూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార, సూపర్‌స్టార్ రజనీకాంత్ కలిసి నటిస్తే ఆ క్రేజే వేరు. తాజాగా అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయని సమాచారం. 2.ఓ, కాలా చిత్రాలను పూర్తి చేసిన రజనీకాంత్ తాజాగా యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికిక సిద్ధం అవుతున్నారన్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో జత కట్టే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకూ నయనతార, అనుష్క, త్రిష పేర్లతో పాటు ఉత్తరాది తారల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక నటి త్రిషకు సూపర్‌స్టార్‌తో నటించాలన్నది చిరకాల కోరిక. దీంతో తాజా చిత్రంలో ఆయనకు జంటగా నటించే అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాంటి అవకాశం లేకపోతే ఆయన చిత్రంలో ఏదో ఒక పాత్ర చేయడానికైనా రెడీ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర వర్గాలు మాత్రం నయనతారపైనే దృష్టి సారించినట్లు తాజా సమాచారం. ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు, నయనతార కూడా రజనీకాంత్‌తో మరోసారి రోమాన్స్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఇప్పటికే తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న నయనతార కోలీవుడ్‌లో అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. అదే విధంగా దర్శకుడు అరివళగన్ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి జంటగా ఐదోసారి నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదీ తెలుగు చిత్రమే. -
ఈ స్టార్స్కివే చివరి చిత్రాలు?
తమిళసినిమా: కోలీవుడ్‌లో దిగ్గజాలెవరంటే వచ్చే సమాధానం కమల్, రజనీ అనే. నాలుగు దశాబ్దాలకు పైగా సూపర్‌స్టార్స్‌గా ఏలుతున్న ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకేసారి రాజకీయాలపై దృష్టి పెడుతుండడం సంచలనం రేకెత్తిస్తోంది. కమలహాసన్ ఇప్పటికే రాజకీయపార్టీని నెలకొల్పారు. రజనీ పార్టీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఇద్దరూ రాజకీయపరమైన గ్రౌండ్ వర్క్‌లో ముమ్మరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్, కమలహాసన్లిద్దరూ తమ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా ప్రజలను ఆకట్టుకునే ఒక మంచి రాజకీయ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ చిత్రం అవసరం. కమల్‌కు అలాంటి చిత్రంగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2, రజనీకాంత్‌కు కార్తీక్సుబ్బరాజ్లో నటించనున్న చిత్రం అమిరాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇవే ఈ ఇద్దరికీ చివరి చిత్రాలనే ప్రచారం జోరందుకుంది. అయితే కమల్ ఇకపై తాను రాజకీయ నాయకుడినేనని ప్రత్యక్షంగానే వెల్లడించారు. రజనీకాంత్ మాత్రం ఈ విషయం గురించి నోరు మెదపడం లేదు. పోతే కమల్, రజనీలకు స్వారూప్యం ఏమిటంటే కమల్ నటించిన విశ్వరూపం–2, శభాష్‌నాయుడు, రజనీకాంత్ నటించిన 2.ఓ, కాలా చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటిలో కమల్ విశ్వరూపం–2, రజనీ కాలా చిత్రాలను ఓకే సమయంలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక చివరి చిత్రాలుగా చెప్పబడుతున్న కమల్ ఇండియన్–2, రజనీ కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రాలు ప్రారంభం కావలసి ఉంది. ఇక అసలు విషయానికి వస్తే వీరిద్దరి నూతన చిత్రాల్లో హీరోయిన్గా నటించే అదృష్టం దక్కేదెవరికన్నదే. ఈ చిత్రాల్లో నటించేందుకు ప్రముఖ నటీమణులు పోటీ పడుతున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. ఇండియన్–2 చిత్రంలో కమలహాసన్‌కు జంటగా అగ్రనటి నయనతార నటించే అవకాశాలు ఉన్నాయనేది ప్రచారంలో ఉంది. ఇంతకు ముందు విశ్వరూపం చిత్రంలో నటించిన పూజాకుమార్ పేరు కూడా వినిపిస్తోంది. మరి కమల్, శంకర్ దృష్టిలో ఎవరున్నారో తెలియాలంటే ఇంకా కొద్ది కాలం ఆగాల్సిందే. ఇక రజనీకాంత్‌కు జంటగా నటించేదెవరన్నదే ఆసక్తిగా మారింది. రజనీకాంత్ లింగా చిత్రం వరకూ ప్రముఖ హీరోయిన్లతోనే నటించారు. కబాలి, తాజా చిత్రం కాలా చిత్రంలో రాధికా ఆప్తే, ఈశ్వరిరావు లాంటి అంతగా పాపులర్ కానీ నటీమణులతోనే నటించారన్నది గమనార్హం. అలాంటిది తాజా చిత్రం కోసం అగ్రనటీమణుల్లో ఒకరిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. ఆ పట్టికలో నయనతార, అనుష్క, త్రిషలలో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నారని, అదేవిధంగా బాలీవుడ్ భామలు కంగణారావత్, రాధికాఆప్తే, దీపికాపదుకునేల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు టాక్ వైరల్ అవుతోంది. చెన్నై చిన్నదాని కోరిక నెరవేరేనా? మరో విషయం ఏమిటంటే చెన్నై చిన్నది త్రిష కమల్ నుంచి, విజయ్, విక్రమ్, అజిత్‌ల నుంచి వర్థ్ధమాన నటుడు విజయ్‌సేతుపతిల వరకూ నటించేశారు. అయితే నటిగా దశాబ్దం దాటినా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. రజనీకాంత్‌తో ఒక్క చిత్రంలోనైనా నటించాలన్నది త్రిష చిరకాల ఆశ. ఈ విషయాన్ని పలు వేదికలపై త్రిషనే స్వయంగా చెప్పింది. రజనీ తాజా చిత్రంలో ఎంపిక చేసే హీరోయిన్ల పట్టికలో తన పేరు చోటుచేసుకోవడంతో త్రిష మనసులో చిన్న ఆశ కలుగుతోందట. మరి అనుష్క, నయనతారలను దాటి ఆ అవకాశం త్రిష వరకూ వస్తుందా? అన్నది మరి కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. -
వీరి డేట్స్ చాలా కాస్ట్లీ గురూ..!
సాక్షి, చెన్నై: మొదట్లో ఒక్క అవకాశం అన్న వాళ్లే ఆ తర్వాత ఒక్క విజయం కోసం ఎదురుచూస్తారు. సినిమా మంచిగా విజయం సాదిస్తే చాలు పారితోషికాలను భారీగా పెంచేస్తారు. ఈ విషయంలో ఏ హీరో, హీరోయిన అతీతం కాదు. అలా అగ్రహీరోయిన్లుగా రాణిస్తున్న నయనతార, అనుష్కల నుంచి ఇటీవలే రేసులో నిలబడిన రకుల్‌ప్రీత్ సింగ్‌ల వరకూ తమ పారితోషికాలను పెంచేశారు. నయనతార మొదట్లో లక్షల్లో పారితోషికం తీసుకున్న నటి నయనతార. రజనీకాంత్‌తో నటించిన చంద్రముఖి చిత్రం విజయంతో తన పారితోషికాన్ని వరుసగా పెంచుకుంటూ పోతోంది. కమర్శియల్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో రూ. కోటి వరకూ పుచ్చుకుంది. ఆ తర్వాత నానూరౌడీదాన్, హీరోయిన్ ఓరియెంటెడ చిత్రం మాయ వంటి చిత్రాల విజయాలతో రూ. 3 కోట్లు డిమాండ్ చేసింది. ఇమైకా నోడిగళ్ చిత్రానికి రూ.3 కోట్లు పుచ్చుకున్నట్లు అధికారిక సమాచారం. ఆ తర్వాత అరమ్ సినిమా నయనతార స్థాయిని మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను చిత్రాలకు పైనే ఉన్నాయి. తాజాగా అజిత్‌కు జంటగా నటించిన విశ్వాసం చిత్రానికి రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అదే వరుసలో అనుష్క అనుష్కకు అరుంధతి చిత్రం ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వచ్చి పడడంతో అనుష్క పారితోషికాన్ని పెంచేసింది. బాహుబలి సిరీస్ చిత్రాల విజయంతో తన పారితోషికాన్ని రూ. 4 కోట్లకు పెంచినట్లు సినీ వర్గాల సమాచారం. తాజాగా భాగమతి విజయబాటలో పయనిస్తుండడంతో ఆమె నయనతారకు దీటుగా రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్. అదే బాటలోనే మిగతా హీరోయిన్లు..! అదేబాటలో మరికొంత మంది హీరోయిన్లు పయనిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తమిళంలో వివేగం, మెర్శల్, తెలుగులో ఖైదీనంబర్ 150, నేనేరాజు నేనే మంత్రి చిత్రాల విజయంతో హీరోయిన్ కాజల్ అగ్వాల్ తన పారితోసికాన్ని రూ. ఒకటిన్నర నుంచి రూ. 2 కోట్లకు పెంచేసిందట. అదే విధంగా త్రిష కోటిన్నర నుంచి రూ. 2 కోట్లకు, వివాహానంతరం హీరోయిన్గా బిజీగా నటిస్తున్న నటి సమంత రూ. 2 కోట్లు తీసుకుంటున్నారు. కోలీవుడ్‌లో హిట్ కోసం ఎదురుచూసిన నటి రకుల్ ప్రీత్‌సింగ్ కూడా కార్తీతో నటించిన ధీరన్ ఒండ్రు చిత్రం విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడి పారితోషికానికి కాళ్లొచ్చేశాయి. ఆమె రూ. కోటిన్నర డిమాండ్ చేస్తోంది. అదే విధంగా చాలా తక్కువ సమయంలోనే స్టార్ నటిగా ఎదుగుతున్న హీరోయిన్ కీర్తిసురేశ్. బహుబాషా నటిగా రాణిస్తూ రూ. 2 కోట్లు డిమాండ చేస్తోందని సమాచారం. సంచలన నటి అమలాపాల్ తానేమీ తక్కువ కాదని రూ. 2 కోట్లు పారితోషికం కావాలంటోందట. ఇటీవల హీరోయిన్ కథా చిత్రాలు వరసగా సక్సెస్ బాటపట్టడం, అవి హీరో చిత్రాలతో సమానంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధించడం గమనార్హం, హీరోల చిత్రాల బడ్జేట్ కంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు తక్కువ అవుతుంది. దీంతో దర్శక నిర్మాతలు ఆ తరహా చిత్రలపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. తమ చిత్రాలు లాభాలను తెచ్చి పెడడంతో హీరోయిన్లు పారితోషికాలను పెంచేస్తున్నారనేది సినీ గణితవేత్తల మాట. అందుకే వీరి డేట్స్ కాస్ట్లీ గురూ అంటున్నారు సినీ వర్గాలు. -
మరోసారి దెయ్యం కథతో నయన్
తమిళసినిమా: హర్రర్ చిత్రాలు లాభాలను తెచ్చిపెడుతున్న రోజులివి. అంతేకాకుండా అగ్రతార నయనతారకు కలిసొచ్చిన ట్రెండీ కథలు కూడా. మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియంటెడ్ నాయకిగా టర్న్ అయిన ఈ సంచలన నటికి ఆ చిత్రం సక్సెస్‌ను అందించింది. అలాంటి కథతో తెరకెక్కిన ‘డోర’ చిత్రం ఆశించిన విజయాన్ని అందించనప్పటికీ నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ‘అరమ్’ చిత్రంతో నయన్ స్థాయి మరింత పెరిగింది. దీంతో మళ్లీ హర్రర్ కథలో నటించడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. సార్జన్ అనే వర్థమాన దర్శకుడు మోగాఫోన్ పట్టనున్నాడు. ఈయన ఇటీవల ‘మా’అనే లఘు చిత్రంతో సామాజిక మాద్యమాలు, సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు. అంతకు ముందు కూడా లక్ష్మీ అనే లఘు చిత్రాన్ని రూపొందించి అభినందనలు అందుకున్నారు. తాజాగా ఈయన నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హెచ్చరికై ఇది మనిదర్గళ్ నడమాడుం ఇడం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అరమ్, గులేబకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజీఆర్ స్టూడియోస్ సంస్థ మూడో చిత్ర నిర్మాణానికి సిద్ధమైంది. అరమ్ తరువాత మరోసారి నయన్‌తో హర్రర్ కథా చిత్రాన్ని రూపొందించనుంది. దీనికి సార్జాన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోమవారం అధికారికంగా వెల్లడించారు. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయన్‌ను వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు వరించడం విశేషం. నయన్ నటించిన తరువాత విడుదలయ్యే చిత్రం ఇమైకా నోడిగళ్ అవుతుందని సమాచారం. ఇందులో ఈ బ్యూటీ సీబీఐ అధికారిగా నటిం చారు. -
‘నో’ చెప్పలేని ఆఫర్
నో చెప్పలేని ఆఫర్ వస్తే వెనకా ముందూ ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు ఎవరైనా. నయనతార ముందు అలాంటి ఓ భారీ ఆఫర్ ఉందట. ఇంతకీ అంత పెద్ద అవకాశం ఏంటీ? అనే విషయానికొస్తే.. లోక నాయకుడు సరసన నటించే చాన్స్. లోక నాయకుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రని అయినా సునాయాసంగా చేసేసే కమల్‌హాసన్‌కి సినిమా లవర్స్ ఇచ్చిన బిరుదు అది. కమల్ సరసన ‘భారతీయుడు–2’లో నటించమని చిత్ర దర్శకుడు శంకర్ వర్గం నయనతారని సంప్రదించారని టాక్. 1996లో కమల్ హీరోగా శంకర్ తీసిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్. ఇందులో కథానాయిక విప్లవ నాయిక అని సమాచారం. ఈ పాత్రకే నయనతారను అడుగుతున్నారట. కమల్‌తో జోడీ, శంకర్ లాంటి గొప్ప దర్శకుడు, సెన్సేషనల్ హిట్ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్, దాదాపు 200 కోట్ల బడ్జెట్... ‘నో’ చెప్పలేని ఆఫర్ కదా. మరి.. నయనతారకు కూడా అలానే అనిపిస్తే ‘యస్’ చెప్పేయడం గ్యారంటీ. ఒకవేళ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే అప్పుడు నయనతార స్థానంలో శంకర్ బృందం వేరే తారను అనుకోవాలి. -
హ్యాండ్ ఇచ్చిన నిర్మాత.. ఆగేది లేదంటున్న నయన!
సినిమా తీస్తానని మాటిచ్చిన నిర్మాత మధ్యలో హ్యాండ్ ఇస్తే? అసలు సెట్స్‌కి వెళ్లకముందే డ్రాప్ అయితే అప్పుడు ఆ సినిమా కమిట్ అయినవాళ్లు వేరే సినిమా చూసుకుంటారు. బాగా బిజీగా ఉన్నవాళ్లు ‘పోతే పోయిందిలే’ అనుకుంటారు. స్టోరీ బాగా నచ్చేసినవాళ్లు మాత్రం ‘మంచి ప్రాజెక్ట్ పోయిందే’ అని ఫీలవుతారు. ఓ సినిమా విషయంలో నయనతార అలానే బాధపడుతున్నారట. ఫైనల్లీ ‘ఈ బాధ పడే బదులు ఆ సినిమాకి మనమే ప్రొడ్యూసర్ని సెట్ చేస్తే పోలా’ అనుకున్నారట. ఫుల్ డీటైల్స్‌లోకి వెళితే.. ‘ఈరమ్’, ‘కుట్రమ్ 23’ చిత్రాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నారు నయనతార. గతేడాది నవంబర్‌లో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. డిసెంబర్లో సెట్స్‌కి వెళ్లాల్సింది. కానీ నిర్మాత నా వల్ల కాదంటూ సినిమా నుంచి తప్పుకున్నారని చెన్నై టాక్. సడన్‌గా నిర్మాత అలా హ్యాండ్ ఇవ్వడంతో ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితి లేదని చాలామంది ఫిక్సయ్యారు. కానీ నయనతారకు కథ బాగా నచ్చిందట. దాంతో పాటు అరివళగన్ కూడా మంచి డైరెక్టరే. అందుకని సినిమా ఆగడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతను సెట్ చేయాలనుకుంటున్నారట. ఇటీవల నయనతార నటించిన ‘అరమ్’ చిత్రానికి కూడా ఈ విధంగానే జరిగింది. ఓ నిర్మాత తప్పుకోవడంతో మరో నిర్మాతతో మాట్లాడి, ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారామె. ‘అరమ్’ సూపర్ డూపర్ హిట్టయింది. సో.. నయనతార నమ్మిన కథ కాసుల వర్షం కురిపిస్తుందని ప్రూవ్ అయింది. ఆ సెంటిమెంట్‌తో, కథానాయికగా నయనతార మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా అరివళగన్‌తో ఆమె చేయాలనుకున్న సినిమాను నిర్మించడానికి వేరే నిర్మాతలు ముందుకు రావచ్చనే ఊహాగానాలున్నాయి. ఏదేమైనా ‘మనకెందుకులే’ అనుకోకుండా నయన్ ఈ విధంగా చేయడం మాత్రం గొప్ప విషయమే. -
నంబర్ వన్ ‘నయన్’
సౌత్ ఇండియాలో అందాల తార నయనతార అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ల లిస్ట్ లోనూ టాప్‌ప్లేస్‌లో కొనసాగుతోంది. సీనియర్ హీరోయిన్ అయినా..కొత్త హీరోయిన్లతో పోటీపడుతూ.. ఇండియా టుడే పోల్‌లో మొదటిస్థానంలో నిలిచింది. కోలీవుడ్‌లో చేసిన ఈ సర్వేలో 21శాతం ఓట్లతో మొదటిస్థానాన్ని దక్కించుకుంది. ‘నానుమ్ రౌడీ దాన్’ (తెలుగులో నేను రౌడీనే) సినిమాలో నయన్ నటనకు ముగ్ధులైన ప్రేక్షకులు ఆమెకు ఫస్ట్ ప్లేస్ కట్టబెట్టారు. తన నటన, తెరపై కనిపించే తీరు, ఒంటి చేత్తో సినిమాను నడిపించే సత్తా ఉండడం అన్నీ కలిసి ఆమెను నంబర్ వన్ గా నిలబెట్టాయి. చిరంజీవి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లోనూ నయన్ హీరోయిన్గా నటిస్తోంది. బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఈ పోల్‌లో 9 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాలకి అనుష్క అరుంధతి లాంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చింది. త్వరలో ‘భాగమతి’ సినిమాతో అభిమానులను అలరించబోతోంది స్వీటీ. తరువాత 8 శాతం ఓట్లతో సమంత, ఓవియా, కీర్తి సురేష్ లు ముగ్గురు మూడో స్థానంలో నిలిచారు. గత ఏడాది పెళ్లి కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్, కాస్త వెనకబడింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ జోరు చూపిస్తోంది. ఈ నెల 26న రానున్న అభిమన్యుడు సినిమాలో రతిదేవిగా అలరించేందుకు రెడీ అవుతోంది ఈ బ్యూటీ. ఓవియాకు హిట్ సినిమాలు లేకున్నా.. ఈ పోల్‌లో మూడో స్థానంలో నిలిచింది. బిగ్‌బాస్ షోతో వచ్చిన పాపులార్టీతో ఈ అమ్మడు కెరీర్ లాగించేస్తుంది. ప్రస్తుతం ఈ భామ రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న మునీ 4(కాంచన3)లో నటిస్తోంది. అందం, అమాయకత్వం రెండూ ఉన్న ముద్దుగుమ్మ కీర్తిసురేశ్ మూడో స్థానం సాధించింది. ఎక్స్‌పోజింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది కీర్తి. విజయ్, సూర్య, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సరసన నటించిన ఈ భామ, ప్రస్తుతం మహానటి పేరుతో తెరకెక్కుతున్న సావిత్రి బయోపిక్ లో హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ అందాల భామ హన్సిక 7శాతం ఓట్లతో తర్వాతి స్థానంలో దక్కించుకుంది. కోలీవుడ్ లో మంచి విజయాలు సాధిస్తున్న ఈ భామ.. ఈ మధ్యే మాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కేరళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన విలన్ సినిమాలో నటించింది. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సీనియర్ హీరోయిన్ త్రిష 6శాతం ఓట్లను సాధించింది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదిహేనేళ్లు కావొస్తున్నా.. తనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. గత సంవత్సరం తన సినిమాలేవీ విడుదల కాకపోయినా..ప్రేక్షకులకు తనపైన ఉన్న అభిమానం ఏ మాత్రం చెక్కుచెదరలేదని ప్రూవ్ చేసుకుంది. తన సినిమాలు 2018లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వివాదాలతో వార్తల్లో నిలిచిన అమలాపాల్, బాహుబలి బ్యూటీ తమన్నా 5శాతం ఓట్లు సాధించారు. సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ అలరిస్తున్న కాజల్, శృతిహాసన్‌లు 4 శాతం ఓట్లతో 6వ స్థానంలో ఉన్నారు. కొసమెరుపు ఏంటంటే...13 శాతం మంది తమిళులు బెస్ట్ హీరోయిన్గా లిస్ట్ లో ఉన్న ఎవరినీ ఎంపిక చేయలేదు. -
నా అభిమాన హీరో ఆయనే..
నయనతార తన అభిమాన నటుడు ఆయనే అంటున్నారు. ఇంతకి ఎవరు ఆయన అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నా.. ఇటీవల నయనతారను మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే ‘అజిత్’ అని చెప్పింది. అంతేకాదు నటుడు విజయ్ కూడా తన అభిమాన హీరోనే అని చెప్పారు. ఇదిలా ఉండగా అజిత్ తాజా సినిమా విశ్వాసంలో నయన్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో నయన్ అజిత్‌తో ‘ఏకన్’ సినిమాలో జత కట్టారు. నయనతారా అయ్యా సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందించినా.. నయన్‌కు పేరు తెచ్చిన సినిమా మాత్రం సూపర్‌స్టార్‌తో నటించిన చంద్రముఖి, నయన్ తన 13 సినీ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. రజనీకాంత్ నుంచి విజయ్, అజిత్, శింబు, ధనుష్ , వర్థమాన నటుడు ఆరి వరకూ కోలీవుడ్‌లో నటించింది. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె నటించిన అరమ్ చిత్రం విమర్శకులను సైతం మెప్పించి కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం తెలుగులో రెండు , తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. -
‘జై సింహా’కు కూడా నైట్ షోస్
బుధవారం విడుదలైన అజ్ఞాతవాసి సినిమాకు అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు షో వేసుకునేందుకు అనుమతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జై సింహా సినిమాకు కూడా అదే పర్మిషన్ ఇచ్చింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న జై సింహా సినిమాకు అర్థరాత్రి కూడా షో వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 12వ తేదినుంచి 16వ తేది వరకు అర్థరాత్రి సినిమా ప్రదర్శనకు అనుమతించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాతో సంక్రాంతి సీజన్ లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. -
‘జై సింహా’లో అవే హైలెట్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై సింహా. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకుడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నందమూరి అభిమానులను అలరించే అంశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య మార్క్ భారీ డైలాగులు, చిరంతన్ భట్ సంగీతంతో పాటు కంటతడిపెట్టించే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. బాలయ్య డ్యాన్స్ మూమెంట్స్ కూడా అభిమానులను ఫుల్ ఖుషీ చేయనున్నాయి. కేయస్ రవికుమార్ రేసీ స్క్రీన్ ప్లే తో పాటు సీ కళ్యాణ్ నిర్మాణ విలువలు కూడా సినిమా రేంజ్ ను పెంచాయట. -
పొల్లాచ్చిలో ‘సై రా’ సెకండ్ షెడ్యూల్
ఖైదీ నంబర్ 150తో ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించిన చిత్రయూనిట్, ప్రస్తుతం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చింది. ఇది సమయంలో మెగాస్టార్ కొత్త లుక్ లో కనిపించటం, సినిమా యూనిట్ నుంచి పలువురు సాంకేతిక నిపుణులు తప్పుకున్నారంటూ వార్తలు రావటంతో సై రా ఆగిపోయిందా అన్న అనుమానాలు కూడా కలిగాయి. అయితే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ సై రా టీం నెక్ట్స్ షెడ్యూల్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో సై రా రెండో షెడ్యూల్ షూటింగ్ పొల్లాచ్చిలో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో నయనతార కూడా పాల్గొననుందన్న టాక్ వినిపిస్తోంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జై సింహా’
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జై సింహా’. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. భారీ యాక్షన్స్ సీన్స్ తో రూపొందిన ఈ సినిమాలో ద్వితీయార్థం హైలెట్ గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వైజాగ్ లో చిత్రీకరించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాలయ్య అభిమానులను అలరిస్తుందంటున్నారు. -
నా జీవితాన్ని అందంగా మార్చింది మీరే..
సాక్షి, సినిమా : నటి నయనతార నా జీవితాన్ని అందంగా మార్చింది మీరే ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. నయన్ నటిగా 14 ఏళ్లు దిగ్విజయంగా అధిగమించారు. ఎన్నో ఎత్తుపల్లాలు, మలుపులు, తీపి, చేదు అనుభవాలను చవిచూసి నంబర్‌వన్ కథానాయకిగా రాణిస్తున్న నయన్ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకొవాలి. సాధారణంగా మీడియాకు దూరంగా అభిమానులతో పట్టనట్లుండే ఈ స్టార్ నటి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అభిమానులకు తన స్వహస్తాలతో ఒక లేక రాయడం విశేషం. అందులో నా జీవితాన్ని అర్ధవంతంగా మార్చిన మీకు ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాను. మీ అభిమానమే నా జీవితాన్ని అందంగా మార్చింది. నా శక్తి కొలది నటిస్తున్నాను. మిగతాది భగవంతుడికే వదిలేస్తున్నాను. ఎంటర్టెయిన్మెంట్ చిత్రాలతో పాటు అరమ్ వంటి సందేశాత్మక చిత్రాలను అందించగలుగుతున్నానంటే మీ ఆదరణే కారణం. మీడియా వారికి, విమర్శకులకు నా కృతజ్ఞతలు. 2018వ సంవత్సరం ఇంకా మంచిగా ఉంటుంది. నాపై ఆదరాభిమానాలను చూపుతున్న అభిమానులకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని నయనతార ట్వీట్ చేశారు. ఈ లేఖకు ఆమె అభిమానులు ఫిదా అయ్యారు. ఉత్సాహంతో ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలను అందిస్తున్నారు. இனிய ஆங்கில புத்தாண்டு நல்வாழ்த்துக்கள் 👍Happy New Year 2018🤗 #Positivity pic.twitter.com/V4eXsTLCL0 — Nayanthara✨ (@NayantharaU) 1 January 2018 -
అవన్నీ రూమర్సే : ‘సై రా’ టీం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సై రా నరసింహారెడ్డి. ఆంగ్లేయులను ఎదింరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకులు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తాజాగా హీరోయిన్ గా నటిస్తున్న నయనతార కూడా సై రా టీంకు హ్యాండ్ ఇచ్చిందన్న టాక్ బలంగా వినిపించింది. అయితే ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. తొలి షెడ్యూల్ లో కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే చిత్రీకరించారు. దీంతో నయన్ షూటింగ్ లో పాల్గొనలేదు. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్ లో నయనతార పాల్గొననుందని తెలుస్తోంది. -
'సై రా'కు మరో షాక్?
సాక్షి, సినిమా: ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం మరింత భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో చారిత్రక చిత్రంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన చాలా కాలం తరువాత ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. కానీ అనుకున్న రీతిలో సినిమా ముందుకు సాగడం లేదు. అయితే సినిమా అధికారిక ప్రకటన వచ్చిన దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో రత్నవేలును తీసుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌ను సెలక్ట్ చేయకుండానే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లటం విశేషం. మరి రెహమాన్ స్థానం ఏ సంగీత దర్శకుడిని తీసుకుంటారో చూడాలి. కీరవాణితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం ఉన్నా అది ఇంకా కొలిక్కి రాలేదు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నయనతార హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నయన్ ఇచ్చిన డేట్లు మురుగున పడిపోయాయని, ఆమె ఇతర సినిమా షూటింగ్లో బిజిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కోసం సైరా షూటింగ్ డేట్లు అడ్జస్ట్ చేసుకుంటారో.? షూటింగ్ కోసం నయనతారను కాకుండా వేరెవరినైనా తీసుకుంటారో.? చూడాలి. ఇందులో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. -
ప్రియుడితో కలిసి నయన క్రిస్మస్ వేడుకలు
సాక్షి, సినిమా: అగ్రతార నయనతార అరుదైన మైలురాయిని అధిగమించారు. నటిగా 14 ఏళ్లను పూర్తి చేసికుని 15వ ఏటలో అడుగుపెట్టారు. ఇన్నేళ్లు హీరోయిన్గా రాణించడం విశేషం కాకపోవచ్చు. ఇప్పటికీ నంబర్‌వన్ హీరోయిన్గా వెలుగొందడం కచ్చితంగా విశేషమే. కానీ ప్రేమ విషయంలో రెండు సార్లు చిత్తుగా ఓడిపోయారు నయన్. అందుకోసం నటననే పణంగా పెట్టడానికి సిద్ధం అయినా ప్రేమలో గెలుపొందలేకపోయారు. తాజాగా మరోసారి ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. నయన్ ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివతో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని వారిద్దరూ ఖండించలేదన్నది గమనార్హం. పైగా వారి పుట్టిన రోజు వేడుకలను కలిసి జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘నటిగా 14 ఏళ్లు పూర్తి చేసుకున్న నయనతారను మరింత పవర్, విక్టరీలదో ముందుకు సాగాలి. అందుకు ఆ భగవంతుడి ఆశీస్సులుండాలని కోరుకుంటూ.. లవ్లీ నయనతార’ అంటూ గ్రీట్ చేస్తూ దర్శకుడు విఘ్నేశ్‌శివ ట్వట్టర్లో పోస్ట్ చేశారు. అంతే కాదు ఈ ప్రేమ జంట సోమవారం క్రిస్మస్ వేడుకను కలిసి జరుపుకున్నారు. ఆ ఫొటోలను నయనతార తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఇక ఆమె అభిమానులైతే 14 ఇయర్స్ ఆఫ్ నయనతార అంటూ సంబరాలు జరుపుకుంటూ ట్విట్టర్లో అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవల విడుదలైన అరమ్ చిత్రం అనూహ్య విజయంతో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు పొందారు. Christmas Tree🎄A frozen one this time 👍..Celebrations all over🎅 #MerryChristmasAll once again pic.twitter.com/DrSOM61S5F — Nayanthara✨ (@NayantharaU) 26 December 2017 #14YearsOfNayanism 😍😍😍 Wishing more power & victories to u #Nayanthara Keep it going 😇😍 A lovely day with a lot of God's grace:) 'Twas a beautiful Christmas Day! Loads of positivity ! Loads of Love for #PeelaPeela 😍😇 Next singles, song teasers&a lot more cumin #TSK pic.twitter.com/z19NusqQz8 — Vignesh ShivN (@VigneshShivN) December 25, 2017 -
ఈ లుక్కుకే బుక్కయ్యాడు
బిహార్ బీజేపీ లీడర్ సంజయ్ కుమార్ మహతో ఫోన్‌ని ఎవరో కొట్టేశారు. అది ఖరీదైన ఫోన్. అంతకన్నా వాల్యూ అయిన డేటా అందులో ఉంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ దొంగమొహం వాడెవడో కనిపెట్టే బాధ్యతను పోలీస్ డిపార్ట్మెంట్ మధుబాల దేవి అనే పోలీస్ ఆఫీసర్ మీద పెట్టింది. కాల్ డేటా రికార్డ్స్‌ని ట్రేస్ చేసి.. ఆ ఫో ఎవరి దగ్గర ఉందో కనిపెట్టింది మధుబాల. మరి వాడి దగ్గర్నుండి ఫోన్ రాబట్టడం ఎలా? మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టింది. ముందు ‘హాయ్’ అంది. తర్వాత ‘ఐ లైక్ యూ’ అంది. ఆ తర్వాత ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పింది. అతడు పడిపోయాడు. ‘ఐ టూ..’ అన్నాడు. ‘నిన్నొకసారి చూడాలని ఉంది’ అని కూడా అన్నాడు. మధుబాల ఫొటో పంపింది. ఆ వ్యక్తి మళ్లీ పడిపోయాడు. ‘మొత్తం బిహార్‌లోనే లేదు ఇంత అందగత్తె’ అనుకున్నాడు. ‘మనం వెంటనే మీట్ అవుదాం’ అన్నాడు. మధుబాల ‘ఎస్’ చెప్పింది. ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మంది. దొంగోడు వచ్చాడు. పోలీస్ ఆఫీసరమ్మా వెళ్లింది. అయితే.. బుర్ఖా వేసుకుని వెళ్లింది! అతడు ఆమెకు దగ్గరవుతుండగా, అతడికి ఎవరో నలుగురు దగ్గరయ్యారు. ఆ నలుగురూ పోలీసులు! వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. అతడి చేతిలోని ఫోన్‌ని లాక్కున్నారు. ‘ఈ ఫోన్ ఎవరిది?’ అని అడిగారు. ‘కొన్నాను’ అన్నాడు అతడు. ‘ఎక్కడ కొన్నావ్?’ అని అడిగారు. ‘ఎవరో అమ్ముతుంటే కొన్నాను’ అన్నాడు. పోలీసులకు అర్థమైంది. దొంగ దగ్గర ఇంకో దొంగ కొన్నాడని! (దొంగ సొమ్ము కొన్నవాళ్లు దొంగలే కదా). దొంగకు కూడా అర్థమైంది... ముగుసులో ఉన్నది తన లవర్ కాదు, పోలీస్ ఆఫీసర్ అని. పోయిన ఫోన్ దొరికినందుకు బీజేపీ లీడర్ హ్యాపీ. ఒక పెద్ద టాస్క్‌ని పూర్తి చేసినందుకు పోలీస్ ఆఫీసర్ హ్యాపీ. వాళ్లిద్దరికన్నా ఎక్కువ హ్యాపీ.. బిహార్ పోలీస్ డిపార్ట్మెంట్! ఫోన్ కోసం వేటాడితే అనుకోకుండా ఒక గ్యాంగ్‌స్టర్ వాళ్లకు పట్టుబడ్డాడు. అవును. ఇప్పటివరకు మనం దొంగ.. దొంగ.. అనుకున్న ఆ దొంగోడు.. మహమ్మద్ హస్నైన్ అనే నటోరియస్ గ్యాంగ్‌స్టర్! మధుబాల ప్లాన్‌కి అది ప్రతిఫలం. మామూలు దొంగను పట్టబోతే ఏకంగా గ్యాంగ్‌స్టరే వలలో పడ్డాడు. ఇదంతా సరే.. పైన నయరతార ఫొటో ఏమిటి? తన ఫొటో అంటూ గ్యాంగ్‌స్టర్‌కి మధుబాల పంపిన ఫొటో.. నయనతారదే! -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘జై సింహా’
నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా జై సింహా. ఈ సినిమాలో నయనతార, నటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలకృష్ణ 102వ సినిమాగా తెరకెక్కుతున్న ‘జై సింహా’ శుక్రవారంతో దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. బాలయ్య, నయనతారలపై ఒక పాట, బాలయ్య నటాషా జోషిలపై మరో పాట దుబాయ్ లో చిత్రీకరించారు. ఈ రెండు పాటలతో షూటింగ్ మొత్తం పుర్తయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘దుబాయ్ లో 30 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య నటాషా ల మధ్య డ్యూయోట్ సాంగ్‌ను జానీ మాస్టర్ నేతృత్వంలో, 20 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య నయనతారలపై మరో లవ్లీ సాంగ్ ను బృంద మాస్టర్ నేతృత్వంలో చాలా లావిష్ గా చిత్రీకరించాం. డిసెంబర్ నెలాఖరుకు చిరంతన్ భట్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను భారీ వేడుక నిర్వహించి విడుదల చేయనున్నాం. జనవరి 12న బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుకగా ‘జై సింహా’ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. -
ఆమె నుంచి చాలా నేర్చుకున్నా!
తమిళసినిమా: నటి నయనతార నుంచి చాలా నేర్చుకున్నానన్నారు శివకార్తికేయన్. రజనీమురుగన్, రెమో వంటి ఘన విజయాల తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. అగ్రతార నయనతార నాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇంకా ప్రకాశ్‌రాజ్, స్నేహ, ఆర్జే.బాలాజి, సతీష్ ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని 24 ఏఎం స్టూడియోస్ పతాకంపై ఆర్డీ.రాజా భారీ ఎత్తున నిర్మించారు. మోహన్‌రాజా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ వేలైక్కారన్ గురించి తన భావాలను పంచుకున్నారు. నేను నటించిన చిత్రాలన్నిటికంటే భారీ వ్యయంతో రూపొందిన చిత్రం ఇది. తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొనడం సహజం. ఈ కారణంగా కూడా చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమించారు. నేను ఇందులో అరివు అనే కార్మికుడిగా నటించాను. కార్మికుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం వేలైక్కారన్. మంచి సామాజిక సందేశం ఉన్న కథా చిత్రంగా ఇది ఉంటుంది. ఇందులో నటి నయనతారతో తొలిసారిగా కలిసి నటించాను. తను మంచి కథా చిత్రాలను ఎంచుకుని అగ్రనటిగా రాణిస్తున్నారు. అందుకు నటనలో నయనతార చూపే అంకితభావమే కారణం. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇక మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడానికి కేరళ మార్కెట్‌ను పెంచుకోవడానికా అని అడుగుతున్నారు. ఆ పాత్రకు ఆయనైతే బాగుంటారని ఎంచుకున్నాం. చిత్రంలో రాజకీయాలు ఉంటాయా? అని అడుగుతున్నారు. అలాంటి అంచనాలను ఈ చిత్రంలో టచ్ చేయలేదు. ఇది ఒక మంచి సోషల్ మేసేజ్ ఉన్న చిత్రం. నేను నటించిన చాలా సీరియస్ చిత్రం వేలైక్కారన్. నిర్మాత ఆర్డీ.రాజా ఏ విషయంలోనూ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. చిత్ర కథకు న్యాయం చేయడానికి నిర్మాణం ఎక్కువ రోజులు పట్టింది. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు చేసేలా ప్రయత్నిస్తాను అని శివకార్తికేయన్ పేర్కొన్నారు. -
ఆమె నుంచి చాలా నేర్చుకున్నా!
నటి నయనతార నుంచి చాలా నేర్చుకున్నానంటున్నారు వరుస విజయాలతో పుల్‌జోష్‌లో ఉన్న నటుడు శివకార్తికేయన్. రజనీమురుగన్, రెమో వంటి ఘన విజయాల తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. అగ్రతార నయనతార నాయకిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ఇది. ఇంకా ప్రకాష్‌రాజ్, స్నేహ, ఆర్.జె.బాలాజి, సతీష్ ప్రముఖ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని 24 ఏఎం స్టూడియోస్ పతాకంపై ఆర్.డి.రాజా భారీ ఎత్తున నిర్మించారు. మోహన్‌రాజా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ నెల 22న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ వేలైక్కారన్ గురించి తన భావాలను పంచుకున్నారు. ‘నేను నటించిన చిత్రాలన్నిటికంటే భారీ వ్యయంతో రూపొందిన చిత్రం ఇది.. తనీఒరువన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొనడం సహజం.. ఈ కారణంగా చిత్ర యూనిట్ మొత్తం ఎంతో శ్రమించారు.. నేను ఇందులో అరివు అనే కార్మికుడిగా నటించాను.. కార్మికుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రం వేలైక్కారన్.. మంచి సామాజిక సందేశం ఉన్న కథా చిత్రంగా ఇది ఉంటుంది.. ఇందులో నటి నయనతారతో తొలిసారిగా కలిసి నటించాను.. తను మంచి కథా చిత్రాలను ఎంచుకుని అగ్రనటిగా రాణిస్తున్నారు.. అందుకు నటనలో ఆమె అంకితభావమే కారణం.. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను.. ఇక మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఈ చిత్రానికి ఎంపిక చేసుకోవడానికి కేరళ మార్కెట్‌ను పెంచుకోవడానికా అని అడుగుతున్నారు.. ఆ పాత్రకు ఆయనైతే బాగుంటారని ఎంచుకున్నాం.. చిత్రంలో రాజకీయాలు ఉంటాయా అని అడుగుతున్నారు.. అలాంటి అంచనాలను ఈ చిత్రంలో టచ్ చేయలేదు.. ఇది ఒక మంచి సోషల్ మేసేజ్ ఉన్న చిత్రం.. చాలా సీరియస్ చిత్రం వేలైక్కారన్.. నిర్మాత ఆర్.డి.రాజా ఏ విషయంలోనూ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు.. కథకు న్యాయం చేయడానికి నిర్మాణం ఎక్కువ రోజులు పట్టింది.. ఇకపై ఏడాదికి రెండు చిత్రాలు చేసేలా ప్రయత్నిస్తాను.. అని చెప్పారు. -
నయన్ ‘యూ టర్న్’
తమిళసినిమా: ఒక పక్క ప్రముఖ కథానాయకుడు, యువ నటుడు అన్న భేదం చూపకుండా కథ, పాత్రలను ఎంపిక చేసుకుని కమర్శియల్ చిత్రాల్లో, మరో పక్క అరమ్ వంటి యువతకు స్ఫూర్తినిచ్చే స్త్రీ ప్రధాన పాత్రా చిత్రాల్లోనూ నటిస్తూ లేడీ సూపర్‌స్టార్ పట్టాన్ని కైవసం చేసుకున్న నటి నయనతార. వ్యక్తిగత జీవితంలో ప్రేమ పేరుతో ఒకటికి మించిన సార్లు ఓడిపోయినా నటిగా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగి అగ్రనటి స్థాయికి చేరుకున్న ఈ మలయాళీ భామ తాజాగా తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తూ బీజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ ఈ సంచలన నటిని అందలం ఎక్కించిందనే చెప్పాలి. ఇటీవల తను కలెక్టర్ పాత్రను ధరించిన అరమ్ ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను పొందింది. శివకార్తికేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం ఈ నెల 22న తెరపైకి రానుంది. ఆ తరువాత నయనతార సీబీఐ అధికారిగా నటించిన ఇమైకానోడిగళ్ జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా కోలైయుధీర్ కాలం, కోకో వంటి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు చేతిలో ఉన్నాయి. తాజాగా మరో లేడీ సెంట్రిక్ పాత్రకు నయన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. గత ఏడాది కన్నడంలో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన యూ టర్న్ చిత్ర తమిళ రీమేక్‌లో నయనతార నటించడానికి రెడీ అవుతున్నారు. అక్కడ పవన్‌కుమార్ దర్శకత్వం వహించిన యూటర్న్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కనుంది. అందులో నటి శ్రద్ధా శ్రీనాథ్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు.ఆ పాత్రను తమిళంలో నయనతార నటించనున్నారు. దీన్ని ఇంతకు ముందు సైతాన్, తాజాగా సత్య చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రదీప్‌కృష్ణమూర్తి యూటర్న్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇదే చిత్రం తెలుగు రీమేక్‌లో సమంత అక్కినేని నటించడానికి రెడీ అవుతున్నారన్నది గమనార్హం. -
మెగా ఫ్యాన్స్.. గెట్ రెడీ!
సాక్షి, సినిమా : మెగా అభిమానులే కాదు.. మెగాస్టార్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. తన కలల ప్రాజెక్టుగా చిరంజీవి చెప్పుకునే ఉయ్యలవాడ నరసింహారెడ్డి బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ రేపు అంటే బుధవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం హైదరాబాద్ కొండాపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. చిరుతోపాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్ట్‌ల మీద ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈమేరకు అంతా సిద్ధం చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్, రవి వర్మన్ నిష్క్రమణ తర్వాత రత్నవేలును కెమెరామ్యాన్‌గా ఎంపిక చేసేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌ను సెలక్ట్ చేయకుండానే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తుండటం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నయనతార హీరోయిన్గా నటించబోతోంది. -
నయన పారితోషికం తీసుకోలేదు
తమిళసినిమా: నటి నయనతార ఆత్మవిశ్వాసమే తనని అగ్రస్థాయికి చేర్చిందని శివకార్తీకేయన్ వ్యాఖ్యానించారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం వేలైక్కారన్. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ తనకు లభించే అభినందనలు తన తల్లిదండ్రులకే చెందుతాయన్నారు. శ్రమను నమ్మి జీవించే వారికి ఈ చిత్రం సమర్పణ అని అన్నారు. నయన పారితోషికం తీసుకోలేదు శివకార్తీకేయన్ మాట్లాడుతూ తనీఒరువన్ చిత్రాన్ని రెండు సార్లు చూసి దర్శకుడు మోహన్‌రాజాకు ఫోన్ చేసి అభినందించానన్నా రు. అదే సమయంలో మీ దర్శకత్వంలో చిత్రం చేయాలని తానే అడిగానని చెప్పారు. అలా వేలైక్కారన్ మొదలైనట్టు తెలిపారు. నటి నయనతారను ఏకన్ చిత్ర షూటింగ్లో చూశానని తరువాత తాను హీరోగా నటించిన ఎదుర్ నీశ్చల్ చిత్రంలో అతిథిగా మెరిశారని తెలిపారు.ఆ చిత్రానికి నయనతార పారితోషికమే తీసుకోలేదని తెలిపారు. నయనతార ఆత్మవిశ్వాసమే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చిందని శివకార్తీకేయన్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ లేకుంటే శివకార్తీకేయన్ లేడని ట్విట్టర్లో పేర్కొంటున్నారని, అది నిజమే అన్నారు. ఎడిటర్ మోహన్, అనిరుధ్, ఆర్జే.బాలాజీ, మదన్‌కార్గీ పాల్గొన్నారు. -
అట్టా పిలవమాకండి!
ఇందు మూలముగా తెలియజేయునది ఏమనగా.. ఎవరూ నయనతారను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవకూడదట. ఎట్టెట్టా? కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ మూవీలూ చేస్తోన్న మా మేడమ్‌ని లేడీ సూపర్ స్టార్ అనకూడదా? అని ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. ఇంతకీ మా మేడమ్‌ని అట్టా పిలవొద్దన్న మేడమ్ ఎవరో చెప్పండి అని కూడా మండిపడుతున్నారు. నయనతారకున్నంత కాకపోయినా ఆ మేడమ్‌కి కూడా ఓ రేంజ్ ఉంది. పేరు లక్ష్మీ రామకృష్ణన్. తమిళనాడులో ఫేమస్లెండి. ఈవిడగారు రైటర్, డైరెక్టర్.. సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తారు. మేడమ్ ప్రొఫైల్ సూపర్‌గానే ఉంది. కానీ, నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటే ఈవిడకేంటి? అంటే.. అది నయనతారకు చెడు చేసే బిరుదు అట. ఎలగెలగా? బిరుదు చెడు చేస్తదా? అని ఫ్యాన్స్ లక్ష్మీ రామకృష్ణన్ ఎద్దేవా చేస్తున్నారు. అయినా లక్ష్మీ రామకృష్ణన్ ఫ్యాన్స్‌కి ఈ కండిషన్ పెట్టలేదు. మీడియావాళ్లకి. అయ్యా మీడియా మిత్రులారా.. మీరు కనుక లేనిపోని బిరుదులు పెడితే.. అది పెద్ద బాధ్యత అయిపోతుంది. ఆ బిరుదుకి తగ్గట్టు నయనతార స్టోరీలు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. అది ఆమెకు చేటే తప్ప మేలు కాదు. ఆలోచించండి అంటోంది లక్ష్మీ రామకృష్ణన్. పాయింటే. కానీ, దూసుకెళుతోన్న నయనతారలాంటి ఆడకూతురికి లేడీ సూపర్ స్టార్ అని బిరుదు ఇస్తే తప్పేంటి? అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదీ పాయింటే. ఎవరి పాయింట్ ఎలా ఉన్నా.... మన పాయింట్ మనకుంటుంది కదా! -
వివాదంలో నయన్ కొత్త సినిమా
ఇటీవల స్టార్ లు నటించిన చిత్రాలకు వివాదాలు కామన్ అయిపోయాయి. తాజాగా నటి నయనతార, దర్శకుడు గోపీనాయినార్ల చిత్రం అరమ్పై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్రాన్ని కన్నడ చిత్రం పరివారా కథతో రూపొందిం చారని, తన అనుమతి పొందకుండా తమ కథతో సినిమాను తెరకెక్కించారని కర్ణాటకకు చెందిన పరివారా చిత్ర నిర్మాత మనోజ్ చెన్నై హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. అందులో తన చిత్ర కథను దొంగిలించినందుకు రూ.2 కోట్లు నష్టపరిహారం చెలించేలా ఆ చిత్ర దర్శక నిర్మాతలను ఆదేశించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది. -
తలైవాకు పోటీగా తలైవి?
సాక్షి, చెన్నై: తాజాగా అభిమానులకు తలైవిగా మారిన నయనతార భవిష్యత్‌ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. కోలీవుడ్‌లో తలైవాగా చాలా మంది ఎదిగారు. అలా ప్రస్తుతం తలైవాగా అభిమానులు తలకెక్కించుకుంటున్న హీరో రజనీకాంత్. ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఆశతో నిరీక్షిస్తున్నారు. అయితే అనూహ్యంగా విశ్వనటుడు దూసుకొచ్చారు. రజనీకాంత్ కూడా తన పుట్టిన రోజు(డిసెంబర్12)న తన రాజకీయ రంగప్రవేశం గురించి స్పష్టమైన ప్రకటన చేస్తారనే ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ప్రచార విషయాలు జగమెరిగిన సత్యమే. లెడీ సూపర్‌స్టార్‌గా నయన.. ప్రస్తుతం కొత్తగా తలైవి పేరు వేలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు లెడీ సూపర్‌స్టార్ అంటే విజయశాంతినే. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత నటనకు దూరం ఉండడంతో మరొకరి కోసం ఆ బిరుదు ఎదురు చూస్తోంది. చాలా కాలం తర్వాత హీరోయిన్ నయనతార అభిమానులతో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్నారు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా నటించిన అరమ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. అభిమానులు తలైవిగా పిలుస్తున్నారు.. ఈ చిత్రంలో కలెక్టర్‌గా నయనతార పాత్ర పోషణ విమర్శకులను సైతం మెప్పించింది. ఇక ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ సంతోషంలో థియేటర్లను విజిట్ చేస్తున్న నయనతారను అభిమానులు తలైవి అంటూ పేర్కొనడం విశేషం. తాజాగా అభిమానులకు తలైవిగా మారిన నయన భవిష్యత్‌ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్న సామెత గుర్తుకొస్తోంది కదూ. కాగా అరమ్ సక్సెస్ బాటలో పయనించడంతో ఆ చిత్ర నిర్మాత అరమ్కు సీక్వెల్ నిర్మిస్తానని వెల్లడించారు. -
నయన్ కసి అలా తీర్చుకుంటోందా.?
తమిళసినిమా: కొన్ని సంఘటనలు మనసులో బలంగా నాటుకు పోతాయి. వాటి నుంచి అంత తొందరగా బయట పడటం కష్టం. ఇంకా చెప్పాలంటే శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత ఉంది. నటి నయనతార ఇప్పుడు దాన్ని ఫాలో అవుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాస్త వివరంగా చెప్పాలంటే నటి నయనతార ఇప్పటి లెవలే వేరు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ సంచలన నటి ఇప్పుడు శాసించే స్థాయిలో ఉంది. కథానాయకికి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తున్న నయనతార ఎక్కవగా వర్ధమాన దర్శకుల చిత్రాలలో నటించడం విశేషం. అయితే ఇందుకో కారణం ఉందంటోంది కోలీవుడ్. నయనతార నటించిన తాజా చిత్రం అరమ్ శుక్రవారం తెరపైకి రానుంది. నయన్ కలెక్టర్‌గా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు గోపీనయినార్ తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో నయనతార నటించడానికి కారణం ఇంతకు ముందు గోపీనయినార్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన కత్తి చిత్ర కథ తనదంటూ కోర్టు వరకూ వెళ్లి ఆయన్ని రచ్చలోకి లాగాడు. కాగా ఏఆర్. మురుగదాస్‌కు నయనతారకు మధ్య చాలా కాలంగా కోల్డ్‌వార్ జరుగుతోందనే ప్రచారం ఉంది. అందుకు కారణం గజని చిత్రంలో తన పాత్రను తగ్గించి, నటి అసిన్‌కు అధిక ప్రాముఖ్యనివ్వడమేనన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ కసి తీసుకోవడానికే ఆయన్ని ఢీకొన్న గోపి నయినార్కు నయనతార అవకాశం ఇచ్చిందంటున్నారు. ఇక తాజాగా నయనతార కోకో అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. ఈయనకు నయనతార అవకాశం ఇవ్వడం వెనుక ఒక కధ ఉందట. దర్శకుడు నెల్సన్ ఇంతకు ముందు శింబు హీరోగా వేట్టైమన్నన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఆ చిత్రాన్ని శింబు మధ్యలోనే నిలిపేశారు. ఇక శింబుకు నటి నయనతారకు మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మధ్య డీప్ లవ్ చివరికి ఎలా ఫెయిల్ అయ్యిందో తెలిసిందే. శింబుపై ఆ కసి తీర్చుకోవడానికే దర్శకుడు నెల్సన్‌కు కోకో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించినట్లు సోషల్ మీడియాలో ప్రసారం హల్చల్ చేస్తోంది. -
బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్‌లుక్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ హీరోగా అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను బాలయ్య కు తిరుగులేని రికార్డ్ ఉన్న సంక్రాంతి సీజన్లో జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సింహా... జై సింహా!
అభిమానులు నందమూరి బాలకృష్ణను ముద్దుగా ఏమని పిలుచుకుంటారు? ‘నటసింహా’! ఈ పిలుపుకు తగ్గట్టు.. ‘సింహా’లో తెరపై సింహంలా బాలకృష్ణ నట విశ్వరూపమే చూపారు. ఇప్పుడు హీరోగా నటిస్తున్న 102వ సినిమాలో అంతకు మించి అనేలా ఉంటుందట! ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్, యాక్షన్, లవ్, కామెడీ.. బాలకృష్ణ నుంచి అభిమానులు ఆశించే హీరోయిజమ్‌తో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘జై సింహా’ టైటిల్‌ని ఖరారు చేశారని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారమ్. గతంలో ‘కర్ణ’తో పాటు కొన్ని టైటిల్స్‌ని పరిశీలించారు. అయితే... బాలకృష్ణ ఇమేజ్, కథను దృష్టిలో పెట్టుకుని ‘జై సింహా’ను ఫిక్స్ చేశారట! నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అరకులో జరుగుతోంది. ఈ చిత్రానికి కథ–మాటలు: ఎం. రత్నం, సంగీతం: చిరంతన్ భట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వరుణ్–తేజ, సహనిర్మాత: సీవీ రావు. -
వారికి సరిరారు మరెవ్వరూ!
తమిళసినిమా: ప్రచారాలకు, భేటీలకు దూరంగా ఉండే నటి అంటే అది నయనతార. నటిగా తన పాత్రకు న్యాయం చేశామా ‘అంతటితో తన బాధ్యత పూర్తి అయ్యిందని భావించే అరుదైన నటి ఈమె. అగ్రకథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ చేతినిండా చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. అలాంటి వాటిలో అరమ్ ఒకటి. ఈ చిత్రం దీపావళి రేస్‌కు సిద్ధం అవుతోంది. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంగా రూపొందిన ఆరమ్ కోసం నయనతార కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కారణం ఈ చిత్రానికి అనధికార నిర్మాత తనే అని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటే నయన్ ఇటీవల అరమ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ చానల్‌కు భేటీ ఇవ్వడం విశేషం. ఈ భేటీలో ముఖ్యంగా ఇద్దరు స్టార్ నటుల గురించి ప్రస్తావించడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో రజనీకాంత్, అజిత్‌లు స్టార్ హీరోలుగా ఎందుకు రాణిస్తున్నారంటే అంటూ మొదలెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు. ఈ అగ్రనటి ఆరంభంలోనే సూపర్‌స్టార్ రజనీకి జంటగా చంద్రముఖి వంటి సంచలన చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కుశేలన్లో నటించారు. ఇక శివాజీ చిత్రంలో సింగల్ సాంగ్‌కు చిందులేశారు. అదే విధంగా అజిత్‌తోనూ మూడు చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా నయనతార తన మనసులోని మాట చెబుతూ తనకు ఇష్టమైన నటుడు అజిత్ అని, ఆయనతో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అజిత్‌తో బిల్లా చిత్రంలో నటించే సమయంలో తానేమంత పెద్ద నటిని కాదన్నారు. అయినా అజిత్ అంత స్టార్‌తో నటిస్తున్నాననే ఫీలింగ్ కలిగించకుండా ఆయన ప్రవర్తించారని తెలిపారు. రజనీకాంత్, అజిత్‌లు సహ నటీనటులను గౌరవిస్తారని అన్నారు. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడంలో వారికి వారే సాటి అని పేర్కొన్నారు. అందుకే వారు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారని నయనతార అన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - నయనతార.
-
బాలీవుడ్‌పై నయన్ గురి?
ఉత్తరాది భామలు దక్షిణాది చిత్రాలవైపు చూస్తుంటే మన వాళ్లకు మాత్రం బాలీవుడ్‌పై మోజు తగ్గడంలేదన్న విషయాన్ని నటి నయనతార మరోసారి నిజమేనని తేల్చారు. అంతేకాదు, తనకు సినిమాలే చాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించను అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చిన నయనతార, చివరికి ఒక శాటిలైట్ సంస్థ ఆఫర్‌కు ప్లాట్ అయిపోయి దాని ప్రచార యాడ్‌లో నటించేసింది. అదేవిధంగా ఇప్పటి వరకూ దక్షిణాది చిత్రాలు చాలు, ఉత్తరాదికి దూరం అంటూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిందీ చిత్రాలపై మోజు పడుతోంది. దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న నయనతార ఇప్పుడు నిజానికి చేతినిండా చిత్రాలున్నాయి. అయినా తన పరిధిని పెంచుకోవడం కోసమో లేక మరింత ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆశతోనే గానీ బాలీవుడ్ రంగప్రవేశానికి పావులు కదుపుతున్నట్లు తాజా సమాచారం. నయనతార ఇప్పుడు మరో పనిలో కూడా బిజీగా ఉంది. తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివతో షికార్లు కొడుతున్న నయనతార ఇటీవల ఆయన పుట్టిన రోజును న్యూయార్క్‌లో జరిపి వార్తల్లోకెక్కింది. అయితే ఇక్కడ ఈ భామ స్వకార్యం, స్వామి కార్యం అన్నట్టుగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కి వెళ్లిన బాలీవుడ్ క్రేజీ నటి ప్రియాంకచోప్రాను కలిసి కాసేపు ముచ్చటించిందట. పనిలో పనిగా తనకు హిందీ చిత్రాలలో నటించాలనే ఆసక్తిని ప్రియాంకచోప్రా ముందు వ్యక్తం చేయడంతో పాటు అక్కడ అవకాశాలను సంపాదించుకోవడానికి దారేంటని సలహాను కూడా అడిగేసిందట. మొత్తం మీద నయనతార బాలీవుడ్ రంగప్రవేశానికి సిద్దం అవుతోందన్నమాట. -
పెళ్లికి సమయం ఆసన్నమైంది..!
చెన్నై: కల్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదంటారు. అలాంటిది హీరోయిన్ నయనతార ప్రేమ ఇంతకు ముందు కలకలానికి దారి తీస్తే, పెళ్లి ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ. అందరికీ అందనిది ఈ మలయాళీ భామ అని నయనను అనవచ్చనుకుంటా. గతంలో హీరో శింబు ఆమెను పొందాలనుకున్నారు. అయితే అది ప్రేమతోనే ఆగిపోయింది. ఆ తరువాత డ్యాన్స్ మాస్టర్, హీరో ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. కానీ అది పెళ్లి వరకూ వచ్చి ఆగిపోయింది. ఈ రెండు సంఘటనలు నయన జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలేనని చెప్పక తప్పదు. అయినా ఆమె చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో వృత్తిపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడి ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్నారు. అయిదే ఈ అమ్మడు మూడోసారి ప్రేమలో పడి మరోసారి వార్తల్లోకెక్కారు. దర్శకుడు విఘ్నేశ్‌శివ, నయనతార డీప్ లవ్‌లో ఉన్నారని చాలా కాలం నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల విఘ్నేశ్‌శివన్ పుట్టిన రోజును పురష్కరించుకుని తనతో కలిసి నయన న్యూయార్క్ వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇద్దరూ కలిసి అక్కడ తీసుకున్న ఫోటోలను వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేసి నెటిజన్లకు పని చెప్పారు. విఘ్నేశ్, నయన కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. అయినా వీరిలో ఏ ఒక్కరూ తమ ప్రేమ గురించి గానీ, సహజీవనం సాగిస్తున్న విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఇక తదుపరి ఘట్టం పెళ్లి. దానికి సమయం ఆసన్నమైందనేది తాజా సమాచారం. ప్రస్తుతం నయనతార చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో చాలా సినిమాలు హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలే. నయన నటించిన ఇమైకానోడిగళ్ చిత్రం త్వరలో విడుదలతకు సిద్ధం అవుతోంది. చక్రి తోలేటి దర్శకత్వంలో కొలైయుదీర్ కాలం చిత్రంతో పాటు ఆరమ్ తదితర చిత్రాలలో నటిస్తున్నారు. ఈ భామ తాజాగా అరివళగన్ దర్శకత్వంలో మరో హీరోయిన్ ఓరియన్‌టెడ్ చిత్రంలో నటించాడానికి అంగీకరించారు. కాగా శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి అనే చరిత్రాత్మక చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే విఘ్నేకశ్శివన్తో పెళ్లికి రెడీ అవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తాజాగా ప్రచారం హల్చల్ చేస్తోంది. -
నయనానందం
ఏ కట్టయినా... నయనతారకు అందం, చూసేవాళ్లకు ఆనందం మనమూ ట్రై చేస్తే మహదానందం! ► సైమా అవార్డ్‌కి ప్రత్యేకం అనిపించేలా హాప్వైట్ ఖాదీ చీర, దీనికి కాంట్రాస్ట్ కలర్ రెడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ఎంపిక చేశాం. చీర కొంగు సింగిల్ స్టెప్, దాని మీదుగా ఆమ్రపాలి డిజైనర్ నెక్ పీస్, ఒకవైపుగా ఉండే హెయిర్‌స్టైల్.. వేడుకలో హైలైట్‌గా నిలిచింది. ► ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వేడుకకు ఈ బ్లాక్ మిడీ డ్రెస్‌ని మింట్ బ్లష్ డిజైనర్ స్టోర్ నుంచి ఎంపిక చేశాం. కరెక్ట్ ఫిట్‌తో క్లాసీగా ఉండే ఈ డ్రెస్ వెస్ట్రన్ పార్టీలకు బాగా నప్పుతుంది. దీనికి వంకీలు తిరిగిన కేశాలంకరణ, బ్లాక్ హీల్స్, సుహానే పిట్టే ఇయర్ కఫ్స్ వాడటంతో లుక్ సింపుల్‌గా, సొగసుగా మారిపోయింది. ► రితుకుమార్ డిజైన్ చేసిన టాప్, కాటన్ స్కర్ట్‌ని సినిమాలోని పాటకు ఉపయోగించాం. దీనికి తగ్గట్టుగా ఫ్యాన్సీ జువెల్రీ వాడాం. కాలేజీ అమ్మాయిలకు ఇది మంచి జోష్‌నిచ్చే డ్రెస్సింగ్. ► రితుకుమార్ డిజైన్ చేసిన కుర్తీ ఇది. బాటమ్‌గా బ్లూజీన్స్. ఈ కాలం వనితకు తగిన డ్రెస్ ఇది. దీనికి కాంబినేషన్‌గా సిల్వర్ జువెల్రీ ధరించడంతో ఫ్యూజన్ లుక్ వచ్చేసింది. ► సినిమాలో పాట కోసం ఈ ప్రింటెడ్ కాటన్ కోటా శారీని ఎంపిక చేశాం. దీనికి కాంట్రాస్ట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ఉపయోగించాం. సింపుల్ ఈవెంట్స్కైనా,, పెద్ద పెద్ద వేడుకల్లోనూ ఇలాంటి చీరలను ధరించవచ్చు. అయితే, కేశాలంకరణ, ఫ్యాషన్ జువెల్రీ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ► ఎక్కడైనా ఎప్పుడైనా సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ అనిపించాలంటే ఇలా టాప్ టు బాటమ్ సింగిల్ కలర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. దీని వల్ల క్లాసీ లుక్ వస్తుంది. అవార్డు ఫంక్షన్‌కి బ్లాక్ కలర్ ► శారీ.. దీనికి ఎలాంటి హంగులేని సింపుల్ బార్డర్, అదే రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ని ఉపయోగించాం. దీంతో పాటు సింపుల్ జువెల్రీ, జడతో ఎందరిలో ఉన్నా పత్యేకంగా కనిపిస్తుంది. ► నికషా డిజైన్ చేసిన సింగిల్ పీస్ స్లీవ్‌లెస్ కుర్తీకి బాటమ్‌గా స్కర్ట్ ఉపయోగించాం. దీనికి గోల్డ్, సిల్వర్ రెండు రకాల జువెల్రీని ఉపయోగించాం. కుర్తీకి యాంటిక్ టచ్ ఎంబ్రాయిడరీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది ఫ్యుజన్ టచ్‌తో సినిమాలో సాంగ్‌కి బెస్ట్ కాంప్లిమెంట్స్‌ని తెచ్చింది. -
ప్రియుడి బర్త్‌డేలో.. నయన
సాక్షి, చెన్నై: హీరోయిన్ నయనతార తన ప్రియుడి పుట్టినరోజును ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్లో క్రేజీ నటిగా, కోలీవుడ్‌లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. నయనతార ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడి విఘ్నేశ్ శివ సోమవారం తన 32వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ప్రియుడి పుట్టిన రోజు వేడుకను నయనతార ఎక్కడ జరుపుతున్నారో తెలుసా? అమెరికా, న్యూయార్క్ నగరంలో. నయనతార, విఘ్నేశ్ శివతో కలిసి ఆయన పుట్టిన రోజున జాలీగా న్యూయార్క్ నగరంలో ఎంజాయ్ చేస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని బ్రీక్లిన్ బ్రిడ్జిపై ఈ ప్రేమ జంట దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో డీప్ లవ్‌లో ఉన్నట్లు, వీరిద్దరూ ఇప్పటికే సహజీవనం చేస్తున్నట్లూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. నానూరౌడీదాన్ చిత్రం షూటింగ్ సమయంలో నయనతారకు దర్శకుడు విఘ్నేశ్ శివకు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందన్నది సినీ వర్గాల ప్రచారం. నయనతార ఇటీవల తన ప్రియుడికి అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా కొనిచ్చినట్లు ప్రచారం జరిగింది. సాధారణంగానే ప్రియుడికి బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చిన నయనతార ఆయన పుట్టిన రోజు కానుకగా ఎలాంటి బహుమతి ఇస్తుందోనన్న ఆసక్తి ఆమె అభిమానుల్లో నెలకొలనడం సహజమే కదా. ‘కాగా విఘ్నేశ్ శివ ప్రస్తుతం సూర్య హీరోగా తానాసేర్న్‌దకూటం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. సూర్యతో పాటు పలువురు సినీ ప్రముఖులు విఘ్నేశ్ శివకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
విజయాల బాట పట్టిన హీరోయిన్..!
నయనతార మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. మాయ చిత్రంతో నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్న నటి నయనతార. అప్పటి వరకూ కమర్శియల్ చిత్రాల నాయకిగా రాణించిన ఈ సంచన నటి మాయ చిత్రంతో కథను తన భూజాన వేసుకుని విజయ తీరానికి చేర్చే స్థాయికి చేరారు. ఆ తరువాత నటించిన డోరా నిరాశ పరచినా నయనకు దాని ఎఫెక్ట్ ఏ మాత్రం పడలేదు. ప్రేమ వివాదాల్లో ఒడుదుడుకులను ఎలాగైతే అధిగమించారో, హీరోయిన్గా అపజయాలను దాటి విజయాల బాట పట్టారు. ప్రస్తుతం అరమ్, కొలైయుధీర్ కాలం, ఇమైకా నోడిగళ్, నేర్‌వళి వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతేకాక మరోపక్క హీరోలతో కమర్షియల్ చిత్రాలను నటిస్తున్నారు. శివకార్తకేయన్తో జత కట్టిన వేలైక్కారన్ చిత్రం డుదల కావలసి ఉన్నా, నిర్మాణ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో ఆ చిత్రం వెనక్కు వెళ్లింది. అయితే త్వరలో ఇమైకా నోడిగళ్, ఆరమ్ చిత్రాలు తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న నయనతార తాజాగా మరో హీరోయిన్ సెంట్రిక్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. కుట్రం 23 వంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన అరివళగన్ దర్శకత్వంలో నయనతార నటించనుందని తాజా సమాచారం. ఇందులో సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రను పోషించనున్నారట. ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిసింది. అయితే చిత్ర వివరాలను త్వరలోనే అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
బడ్జెట్ కాదు..సబ్జెక్ట్ కావాలి..!
బ్రేకప్ తర్వాత శింబు, నయనతార జంటగా నటించిన సినిమా ‘సరసుడు’. పాండిరాజ్ దర్శకత్వంలో టి. రాజేందర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం టి. రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘గతంలో నేను అందించిన ‘ప్రేమసాగరం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మా అబ్బాయి శింబు నటించిన ‘వల్లభ’, ‘మన్మధ’ చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు అదే నమ్మకంతో ‘సరసుడు’ చిత్రంతో వస్తున్నాం. నైజాం, ఆంధ్ర, సీడెడ్‌లో మేమే రిలీజ్ చేస్తున్నాం. చిన్న సినిమాకు కావాల్సింది బడ్జెట్ కాదు.. సబ్జెక్ట్ అని నమ్మి ఈ సినిమా చేశాం. మా రెండో అబ్బాయి కురళ్ స్వరపరచిన ఐదు పాటలు ఈ చిత్రానికి ఓ హైలైట్. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాకి ‘హలో..’ అనే పాట రాశాను. అలాగే ‘బావ వెయిటింగ్..’ అనే పాటను నేనే పాడా’’ అన్నారు. -
ఆ హీరోయిన్ పారితోషికం ఆరు కోట్లా?
ఇది విన్నారా ? హీరోయిన్ నయనతార ఒక చిత్రంలో నటించడానికి ఆరుకోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. ఏమిటీ నమ్మశక్యంగా లేదా ? నిజమే మరి ఇప్పటి వరకూ దక్షిణాదిలో ఆరు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిన హీరోయిన్ లేదు కాబట్టి ఎవరికైనా నమ్మబుద్దికాదు. నయనతార కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా మాలీవుడ్ నుంచి దిగుమతి అయ్యింది. తొలి చిత్రమే ఈమెకు విజయానందాన్ని మిగిల్చింది. ఆ తరువాత ఎప్పుడైతే రజనీకాంత్‌తో చంద్రముఖి చిత్రంలో నటించిందో ఇక ఆ తరువాత నయనతార మార్కెట్ సరఫరా పెరిగిపోయింది. గజని, బిల్లా, యారడీ, నీ మోహినీ, బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి వంటి చిత్రాల విజయం ఈ బ్యూటీని టాప్ హీరోయిన్ రేంజ్లో కూర్చోబెట్టాయి. ఆ తరువాత నానుమ్ రౌడీదాన్ చిత్రంలో చెవిటి యువతిగా నటించిన పాత్ర, మాయ చిత్రంలో దెయ్యం పాత్రలు ఆమెను లేడీ ఓరియంటెడ్ చిత్రాల కథానాయకిని చేశాయి. నిజ జీవితంలో ప్రేమ, పెళ్లి అంశాల వివాదాంశంగా మారినా నయనతార మార్కెట్‌కు అవి ఎలాంటి భంగం కలిగించలేదు. ప్రస్తుతం అరం, ఇమైకా నోడిగళ్, కొలైయూర్ కాలం వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాలతో పాటు, శివకార్తీకేయన్‌కు జంటగా నటించి వేలైక్కారన్ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా ఈ అమ్మడు తన పారితోషికాన్ని రెండు కోట్ల నుంచి పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం నటిస్తున్న ఇమైకానోడిగళ్ చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం పుచ్చుకుందనే టాక్ కోలీవుడ్ వర్గాల్లో ఉంది. నయనతారకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. శ్రీరామరాజ్యం, సింహా వంటి చిత్రాలు మంచి ఇమేజ్ను కట్టబెట్టాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మను వరించింది. చరిత్ర వీరయోధుడి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సైరా నరసింహారెడ్డి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు, బాలీవుడ్ బిగ్ బీ, శాండిల్‌వుడ్ సుధీప్, కోలీవుడ్ యువ నటుడు విజయ్‌సేతుపతి అంటూ భారతీయ నటీనటుల మేలి కలయికలో రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించడానికి నయనతార ఆరు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు ప్రచారం సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తోంది. సైరా నరసింహారెడ్డి చిత్రం తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో తెరక్కుతున్న భారీ చిత్రం కావడం, కాల్షీట్స్ అవసరం అవ్వడంతో నయనతార అంతే స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత అన్నది ఆ చిత్ర వర్గాలకే తెలుసు. -
నయనతార హాబీస్ ఇవే..!
స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిలో సూపర్ స్టార్ ఇమేజ్ అందుకున్న నయనతార, తనలోని మరో టాలెంట్ గురించి బయటపెట్టింది. తన తాజా చిత్రం అరమ్ ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నయనతార పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ ఖాళీ సమయం దొరికితే కవితలు రాస్తుందట. నయన్ తన వ్యక్తిగత విషయాలను ఎవరితో పెద్దగా షేర్ చేసుకోదు. అందుకే తనకు అత్యంత సన్నిహితులకు మాత్రమే నయన్ మంచి రచయిత కూడా అన్న విషయం తెలుసు. అయితే కవితలు రాయటం తన హాబీ అన్న నయన్ భవిష్యత్తు తన రచనలను పుస్తకరూపంలోకి తీసుకువచ్చే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించలేదు. అంతేకాదు తన కవితలు ఇంతవరకు ఎవరికీ చూపించలేదట. కేవలం కలం మాత్రమే కాదు మరింత ఖాళీగా ఉంటే కొత్త కొత్త వంటలు కూడా ట్రై చేస్తుందట ఈ బ్యూటీ. -
బాలయ్య కొత్త సినిమా ఓపెనింగ్
-
బాలయ్య కొత్త సినిమా మొదలైంది..!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫాంలో ఉన్నాడు. వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిలో ఘనవిజయం సాధించిన బాలయ్య త్వరలో పైసా వసూల్ సినిమాతో మరో డిఫరెంట్ లుక్ లో రెడీ అవుతున్నాడు. పైసావసూల్ రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. తమిళ దర్శకుడు కెయస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ 102 వ సినిమా గురువారం (03-08-2017) ఉదయం రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణపై చిత్రీకరించిన తొలిషాట్ కు క్లాప్ కొట్టారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటులు మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పి కళ్యాణ్ నిర్మిస్తుంగా చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. -
ఆ రెండింటికే రూ.2కోట్లా!
తమిళసినిమా: రెండు రోజుల కాల్షీట్స్..పారితోషికం రూ.5 కోట్లు. ఏమిటీ అర్థం కాలేదా? అయితే రండి ఈ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ మోస్ట్ హీరోయిన్ అంటే అది నయనతారనే. ఒక్క చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిన నటి ఈ కేరళా బ్యూటీ. అయ్యా(చిత్రం) అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన నయనతార ( అసలు పేరు డయానా) తన సినీ పయనంలో పలు ఎత్తుపల్లాలను చూసి ఈ స్థాయికి చేరుకుంది. నటిగా 13 వసంతాలను పూర్తి చేసుకున్న నయనతార నిజజీవితంలోనూ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచింది. ఒక దశలో ఈ అమ్మడి పరిస్థితి చూసి అయ్యో పాపం అని జాలి పడినవారు లేకపోలేదు. అలాంటి నయన్ అంటే అభిమానుల్లో ఇప్పటికీ పిచ్చ క్రేజ్.ఇటీవల నయనతార నటించిన చిత్రం డోర విడుదలై నిరాశపరచింది.అయినా ఈ క్రేజీ హీరోయిన్ మార్కెట్ ఏ మాత్రం సడలలేదు. ఇప్పటికీ దక్షిణాది నిర్మాతలు ఈమె కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారనడం అతిశయోక్తి కాదేమో. కాగా నయనతార టాప్ హీరోయిన్గా రాణిస్తున్నా, ఇటీవల వరకూ ఆ పాపులారిటీని ఇతరత్రా వాడుకోలేదు. చాలా మంది కథానాయికలు తమ ఇమేజ్ను వాణిజ్య ప్రకటనలకు వాడుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.ఈ మధ్యనే నయనతార కూడా వాణిజ్య ప్రకటనలో నటించడం ప్రారంభించారు. ఇటీవల ఒక డీటీహెచ్ వాణిజ్య ప్రకటనలో నటించారు. అయితే అందుకు ఈ భామ పుచ్చుకున్న మొత్తం రూ.5 కోట్లట.అందుకు కేటాయించింది మాత్రం కేవలం రెండురోజుల కాల్‌షీట్సేనట. ఈ సమాచారం విన్న స్టార్ హీరోలే అవాక్కు అవుతున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. మరి నయనతారా..మజాకా. -
ప్రియుడికి ప్రేమతో హీరోయిన్ భారీ గిఫ్ట్
చెన్నై: ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అన్నది పాత పాట. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత మురిపం అన్నది నేటి మాట అనాలనిపిస్తోంది నటి నయనతారను చూస్తుంటే. నయనతార.. ఇప్పుడు ఈ ఒక్క పేరు చాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్డడానికి. కొందరు స్టార్ నటుల మాదిరి జయాపజయాలకు అతీతంగా మారిపోయింది నయనతార మార్కెట్. ప్రేమకు, పాటలకు పరిమితమైన పాత్రలను అధిగమించి కథానాయకి పాత్రలకు ప్రాముఖ్యత కలిగిన కథా చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగిన టాప్ హీరోయిన్ నయనతార. ఈమె నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం ‘మాయ’ అనూహ్య విజయాన్ని సాధించింది. అయితే ఆ తరువాత నటించిన ‘డోరా’ నిరాశపరిచింది. అయినా ఈ స్టార్ నటి మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అదే తరహా చిత్రాలు అరమ్, ఇమైకా నోడిగళ్, కొలైయుదీర్ కాలం, నేర్‌వళి చిత్రాలతో పాటు తాజాగా అంగీకరించిన ‘ఖోఖో’ అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదే విధంగా శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన వేలైక్కారన్ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. కాగా, నయనతార వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమలో రెండుసార్లు విఫలమైన ఆమె ముచ్చటగా మూడోసారి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ప్రచారం చాలాకాలంగా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు విఘ్నేశ్‌శివతో నయనతార ప్రేమ ఆయనతో సహజీవనం సాగించే స్థాయికి తీసుకెళ్లిందంటున్నారు. ఈ విషయం గురించి ఇద్దరూ మౌనం వహిస్తున్నా, వీరి మధ్య ప్రేమ కొనసాగుతోందనడానికి చాలా కారణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడికి అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా కొనిచ్చారట. ఇప్పుడీ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనా మజాకా! -
క్రేజీ హీరోయిన్‌కు సినిమాలే సినిమాలు
లైకాలో నయన్ ఖోఖో. ఏమిటి అర్థం కాలేదా? అయితే రండి చూద్దాం. నేడు క్రేజీ హీరోయిన్ అంటే నయనతార. ఈ మధ్య లేడీ ఓరియయెంటెడ్ చిత్రాల హీరోయిన్ గా మారిన నయనతార సినీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా వేలైక్కారన్ చిత్రాన్ని, అధర్వతో ఇమైకా నోడిగళ్ చిత్రాలలో నటిస్తోంది. కలెక్టర్‌గా అరం అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాన్ని పూర్తి చేసిన నయన తన మాతృభాష మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. అదే విధంగా తెలుగులో ఒక భారీ చిత్రం చేయనున్నారు. తాజాగా లైకా సంస్థలో ఒక చిత్రం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారని తాజా సమాచారం. సూపర్‌స్టార్ హీరోగా 2.ఓ, కమలహాసన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో శభాష్‌నాయుడు చిత్రాన్ని చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఇప్పుడై వెల్లుమ్ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తుంది. ఈ సంస్థ తాజాగా నయనతార ప్రధాన పాత్రలో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని గురించి ఆ సంస్థ నిర్వాహకుడు రాజు మహాలింగం మాట్లాడుతూ.. నూతన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ చెప్పిన కథ చాలా బాగా నచ్చిందన్నారు. ఇది పూర్తిగా బ్లాక్ కామెడీ చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో నటి నయనతార ప్రధాన పాత్రను పోషించనున్నారని అన్నారు. ఒక ముఖ్య పాత్రలో యోగిబాబు నటిస్తారని చెప్పారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఖోఖో అనే టైటిల్ ను నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. -
నయనతార బాటలో కాజల్
తమిళసినిమా: నయనతార, త్రిషల బాటలో పయనించడానికి నటి కాజల్ అగర్వాల్ సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. 10ఏళ్లు +50 చిత్రాలు = అగ్ర కథానాయకి. ఇదీ క్లుప్తంగా నటి కాజల్‌అగర్వాల్ కేరీర్. కోలీవుడ్‌లో బోమ్మలాట్టం చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా ద్వారా నటిగా మలచబడిన ఉత్తరాది భామ కాజల్. చాలా చిత్రాల్లో గ్లామర్‌కే పరిమితం అయిన ఈ బ్యూటీలోని ప్రతిభను వెలికి తీసిన చిత్రం మగధీర అని చెప్పవచ్చు. అప్పటి వరకూ కోలీవుడ్‌లో ఫేమ్‌లేని ఈ అమ్మడికి గుర్తింపునిచ్చిన చిత్రం అదే అవుతుంది. ఆ తరువాత కోలీవుడ్‌లో విజయ్‌తో తుపాకీ, జిల్లా లాంటి చిత్రాలలో నటించే అవకాశాలను అందుకుని టాప్ హీరోయిలన్ల లిస్ట్‌లో చేరింది. ప్రస్తుతం అజిత్‌కు జంటగా వివేగం చిత్రాన్ని పూర్తి చేసి, విజయ్‌తో మెర్సల్ చిత్రం చేస్తోంది. కాగా ఆదిలో ఇలా నటించిన నటి నయనతార, త్రిషలు ఆ తరువాత స్టార్డమ్ తెచ్చుకుని హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాల స్థాయికి ఎదిగారు. తాజాగా నటి కాజల్‌అగర్వాల్‌కు అలాంటి అవకాశం తలుపుతట్టిందన్న టాక్ సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి దాదాపు అందరు హీరోలతోనూ దక్షిణాది భాషలన్నిటిలోనూ చిత్రాలు చేసిన సీనియర్ దర్శకుడు పీ.వాసు తెరకెక్కించిన శివలింగ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఆయన తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ సారి హీరోయిన్ సెంట్రిక్ పాత్రతో కూడిన విభిన్న కథా చిత్రాన్ని తమిళం, తెలుగు భాషలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో నటి కాజల్ అగర్వాల్‌ను కథానాయకిగా ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే ఈ చిత్రం కాజల్‌అగర్వాల్ నట కేరీర్‌ను మరో మలుపు తిప్పే చిత్రం అవుతుందని వేరే చెప్పక్కర్లేదు. -
షాకిచ్చిన నయనతార!
చెన్నై: తేనాండాల్ ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్ర. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తునండగా సంఘమిత్ర అనే టైటిల్ రోల్‌ను శృతిహాసన్ నటించాల్సి ఉంది. అందుకోసం ఆమెకు కత్తిసామువంటి కళల్లో శిక్షణలు కూడా ఇప్పించారు. అయితే, చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోయే సమయంలో పరిస్థితుల్లో ఆ చిత్రం నుంచి శృతి పక్కకు తప్పుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఆ పాత్ర కోసం తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషా నటి కోసం గాలించాల్సిన పరిస్థితి సంఘమిత్ర బృందానికి ఏర్పడింది. అప్పుడే దక్షిణాదిలో అగ్ర తారలుగా వెలుగుతున్న నయనతార, అనుష్కలతో రెండేళ్లకు కాల్ షీట్లకు బేరసారాలు జరిపారు. ఇద్దరూ ఇప్పటికే కొన్ని చిత్రాలలో కమిట్ అయి నటిస్తుండడం వలన ఇప్పటికి సంఘమిత్రలో నటించడం కుదరదని తెలిపారట. అయినప్పటి నయనతార నటిస్తే బాగుంటుందని తలచిన చిత్ర బృందం ఆమెతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చారు. సంఘమిత్ర తో కమిట్ అయితే కనీసం ఒకటిన్నర సంవత్సరం వేరే చిత్రాలలో నటించడానికి కుదరదు. దీంతో జాగ్రత్తగా ఆలోచించిన నయన్ తాను సంఘమిత్రలో నటించడానికి సిద్ధమేనని తెలిపిందట. అయితే అందుకు ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ మొత్తం విని బెంబేలెత్తిన చిత్ర బృందం ఆ తర్వాత నుంచి ఆమెతో చర్చలు జరపడం నిలిపేసినట్లు కోలీవుడ్ టాక్. -
నివిన్బాలీతో నయన్ రొమాన్స్
తమిళసినిమా: అగ్రనాయకి నయనతార మాలీవుడ్ యువ నటుడు నివిన్ బాలీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. నటి నయనతార తన బాణీ మార్చుకున్నారా లేక అవకాశాలే అలా వస్తున్నాయా అన్నది పక్కన పెడితే ఈ బ్యూటీ కోలీవుడ్‌లో ఇప్పుడు యువ కుర్ర హీరోలతోనే జతకడుతున్నారు. అగ్ర హీరోలతో ఒక్క చిత్రం కూడా లేదన్నది నిజం. ఆ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నటించిన నానుం రౌడీదాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆరితో నటించిన మాయ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా వేలైక్కారన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న ఇమైకా నోడిగళ్ చిత్రంలో ప్రధాన పాత్రలోనూ, అరం అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా మలయాళ యువ నటుడు నివిన్ బాలీతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మలయాళంలో పలు చిత్రాల్లో సహ నటుడిగా నటించి పలు ఆవార్డులను గెలుచుకున్న దయాన్ శ్రీనివాసన్ అక్కడ ప్రముఖ దర్శకుడు కూడా. ఆయన దర్శకత్వం వహించనున్న తాజాగా చిత్రంలో నివిన్ బాలీ హీరోగా నటించనున్నారు.ఆయనకు జంటగా నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. నయనతార కూడా ఈ చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని, ఒప్పంద పత్రాలపై సంతకం చేయడమే తరువాయి అని తెలిసింది. కాగా నివిన్ బాలి తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే ప్రస్తుతం ఆయన నటిస్తున్న తమిళ చిత్రం రుషీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో నివిన్బాలి,నయనతార కలిసి నటించే చిత్రాన్ని తమిళంలోనూ ఏకకాలంలో నిర్మించాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. -
అప్పుడు సీత.. ఇప్పుడు ద్రౌపది!
సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది? అనడిగితే... చాలామంది అంజలీదేవి పేరు చెబుతారు. ‘లవకుశ’ సినిమాలో అంత అద్భుతంగా నటించారామె. నాటి తరంలో సీత పాత్రలో అంజలీదేవి మెప్పిస్తే నేటి తరంలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు నయనతార. ఆ సినిమా తర్వాత నయనతార గ్లామరస్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాదు.. నటనకు అవకాశమున్న సంప్రదాయబద్ధమైన పాత్రలూ చేయగలరనే అభిప్రాయం బలపడింది. ఇప్పుడీ బ్యూటీకి కన్నడ ‘కురుక్షేత్ర’లో ద్రౌపదిగా నటించే ఛాన్స్ వచ్చిందట. తమిళంలో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రంలో నటించే విషయమై హామీ ఇవ్వలేదట. అయితే మంచి అవకాశం కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేసి, గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఊహించవచ్చు. ఈ నెల 23న ‘కురుక్షేత్ర’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఒకవేళ నయన అంగీకరిస్తే, ‘సూపర్’ తర్వాత కన్నడంలో ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్, భీష్ముడిగా అమ్రీష్, కర్ణుడిగా రవిచంద్రన్ నటించనున్నారు. -
పాంచాలిగా ‘నయన్’ రెడీ అవుతుందా?
చెన్నై: హీరోయిన్ నయనతారను పాంచాలి పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నట్లు తాజా సమాచారం. మన పురాణ ఇతిహాసాల్లో ప్రధానమైన రెండింటిలో ఒకటి మహాభారతం. మానవ విలువలకు అద్దం పట్టే పురాణ ఇతిహాసాన్ని పలు కోణాల్లో ఇప్పటికే తెరపై ఆవిష్కరించారు. ఇక బుల్లితెరపైనా విపులంగా వేల ఎపిసోడ్స్‌తో ప్రచారం అయ్యి ప్రేక్షకులను అలరించింది. కాగా తాజాగా మహాభారతానికి మరోసారి తెరకెక్కే సమయం ఆసన్నమైంది. ఇటీవల తెలుగు దర్శకుడు జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రాల సిరీస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో పాటు భారతీయ సినిమాను, ముఖ్యంగా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయిలో ఎగురవేసిన సంగతి తెలిసిందే. దీంతో చారిత్ర కథాచిత్రాలపై దర్శక నిర్మాతలలో ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పలు భాషలకు చెందిన ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. సుమారు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్లో రూపొందనుంది. మహాభారత ఇతివృత్తంతో కన్నడంలోనూ ఒక చిత్రం నిర్మాణానికి సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఎంటీ.వాసుదేవన్ రాసిన రెండముళం అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నాగన్న దర్శకత్వం వహించనున్నారు. ఇందులో దుర్యోధనుడిగా దర్శిన్, కర్ణుడిగా రవిచంద్రన్, భీష్ముడిగా సీనియర్ నటుడు అంబరీష్ నటించనున్నారు. ఈ చిత్రానికి కురుక్షేత్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇక కురుక్షేత్రానికి కీలక పాత్రధారిని పాంచాలిగా అగ్రనాయకి నయనతారను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే తెలుగు చిత్రం శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ఆ పాత్రలో ఒదిగిపోయిన నయనతార కురుక్షేత్ర చిత్రంలో ద్రౌపదిగా నటిస్తే ఆ చిత్ర స్థాయి పలు రెట్లు పెరిగిపోతుందని వేరే చెప్పాలా..! ‘మరో విషయం ఏమిటంటే నయనతార ఇప్పటికే సూపర్ అనే చిత్రం ద్వారా కన్నడ సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మరి కురుక్షేత్రకు ఈ భామ ఎస్ అంటారా? లేదా? అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. -
మరోసారి బాలయ్యకు జోడిగా..!
సీనియర్ హీరోల్లో ఫుల్ ఫాంలో ఉన్న స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే వంద సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య, మరిన్ని సినిమాలు లైన్లో పెట్టాడు. ప్రస్తుతం తన 101వ సినిమాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసావసూల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ చేయనున్నాడు. తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్‌లతో వరుస సక్సెస్‌లు సాధించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాను చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జయసింహా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సింహా పేరుతో బాలయ్య హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించాయి అదే సెంటిమెంట్‌ను ఈ సినిమాకు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు బాలయ్య సరసన సింహా, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో నటించి హిట్ పెయిర్ అనిపించుకున్న నయనతారను ఈ సినిమాకు హీరోయిన్గా ఫైనల్ చేశారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీగా ఉన్న నయన్, బాలయ్య సినిమాలో నటించేందుకు భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. -
అవునా.. నిజమేనా?
అదృష్టం కళ్లముందు కదలాడుతుంటే, దురదృష్టం నెత్తిపై తాండవించిన పరిస్థితిని కొందరు ఎదుర్కొన్నారనే కథానాలు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అలాంటి వాళ్లు అనుకున్నదొక్కటి. అయ్యింది ఒక్కటి అని మనసులోని చింతను బయటకు కక్కలేక, మింగలేక సతమతం అవుతున్నారు. దీనికంతటికీ కారణం బాహుబలి–2 చిత్రమే. బాహుబలి ఒక సంచలనం అయితే బాహుబలి–2 ఒక చరిత్రగా నిలిచింది. కేవలం 10 రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూళ్లను కొల్లగొట్టి కనుచూపు మేరలో మరే చిత్రం ఆ దరిదాపులకు చేరుకోలేనంత కంచుకోటగా మారింది. మరికొన్ని బ్రహ్మాండ చిత్రాలకు సవాల్ విసిరి ఆయా చిత్ర యూనిట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రపంచస్థాయి చిత్రం బాహుబలి–2. దీనికి సూత్రధారి రాజమౌళి అయితే, పాత్రధారులుగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇలా ప్రతి తార, సాంకేతిక నిపుణుడు నిలిచారు. బాహుబలి–2లో ప్రతి అంశం ఒక కళాఖండమే అనడం అస్సలు అతిశయోక్తి కాదు. అందుకే బాహుబలి–2 చిత్రాన్ని ప్రపంచ సినిమానే భళిరా అంటోంది. అలాంటి చిత్రంలో నటించే అవకాశాలు తమకు రాలేదే అని కొందరు బాధ పడుతుంటే. వచ్చిన అవకాశాన్ని అంగీకరించలేకపోయామే అని మరి కొందరు మథన పడుతున్నారన్నది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ కథేంటో చూద్దాం. బాహుబలి చిత్రంలో మొదట బాహుబలిగా నటించే అవకాశం బాలీవుడ్ నటుడు రుతిక్‌రోషన్‌నే వరించిందట. దర్శకుడు రాజమౌళి ఆయన్నే సంప్రదించారట. అయితే ఆయనకు కాల్షీట్స్ సమస్య తలెత్తడంతో బాహుబలిలో నటించలేనని అనాసక్తతను వ్యక్తం చేశారట. దీంతో నటుడు ప్రభాస్‌ను ఆ అవకాశం వరించింది. ఆయన మార్కెట్‌ను అమాంతం జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఇక భల్లాళదేవ పాత్రకు తొలుత మరో బాలీవుడ్ నటుడు జాన్‌అబ్రహంను నటింపజేసే ప్రయత్నాలు చేయగా ఆయన నిరాకరించారట. అలా ఆ పాత్ర నటుడు రానాను వెతుక్కుంటూ వచ్చింది. కథానాయకి దేవసేన పాత్ర నటి నయనతార ఇంటి తలుపుతట్టగా ఆమె కూడా కాల్షీట్స్ సమస్యతో అంగీకరించలేని పరిస్థితి అనీ, అదే విధంగా చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచిన శివగామి పాత్ర అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి ముంగిట వాలగా ఆమె రూ.ఐదు కోట్లు పారితోషికం కావాలంటూ డిమాండ్ చేయగా అందుకు సగం పారితోషికానికే నటి రమ్యకృష్ణను ఎంపిక చేసి రాజమౌళి ఆ పాత్రకు ఆమెను చిరునామాగా మార్చారు. ఇక అవంతిక పాత్రకు ముందుగా తమన్నా లిస్ట్‌లో లేరట. ఆ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ సోనంకపూర్‌ను ఎంపిక చేయాలని ప్రయత్నించినా, ఆమె నిరాకరించడంతో తమన్నా పంట పండిందట. కాగా అప్పుడు కాదు, వద్దు, పెద్ద మొత్తంలో పారితోషికం కోరిన వారందరూ ఇప్పుడు అబ్బ భలే చాన్స్ మిస్ అయ్యామే అని చింతిస్తున్నారట. అవునా? ఇదంతా నిజమేనా? అంటే అక్షరాలా వాస్తవం అంటున్నారు సినీవర్గాలు. -
రిక్టర్ స్కేల్ పగిలిపోద్ది!
అప్పులిచ్చే నాన్నంటే బుల్లెట్ లాంటి కుర్రాడికి ప్రాణం. అయితే మెచ్చిన అమ్మాయికి మనసులో మాట చెప్పాలనుకునేలోపే ఆ అమ్మాయి ఛీ కొడుతుంది. సడన్‌గా ఈ కుర్రాడి నాన్న ఓ అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటాడు. మనోడికి పూనకం వస్తుంది. రిక్టర్ స్కేల్ పగిలిపోయే రేంజ్లో విలన్‌కి వార్నింగ్ ఇస్తాడు. ఇంతకీ ఈ అల్లరి అబ్బాయి వాళ్ల నాన్నను ఎలా కాపాడుకున్నాడు? అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘ఆరడుగుల బుల్లెట్’ చూడాల్సిందే. బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార జంటగా జయా బాలాజీ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘నరసింహనాయుడు, ఇంద్ర వంటి చిత్రాలను అందించిన బి.గోపాల్ తెరకెక్కించిన మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. గోపీచంద్ అద్భుతంగా నటించారు. నయనతార గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. వంశీ అందించిన కథ సూపర్‌గా ఉంది. మణిశర్మ మంచి సంగీతం అందించారు’’ అన్నారు. -
మే 19న గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'
వరుస చిత్రాలతో బిజీ షెడ్యూల్స్‌తో ఉన్న గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'ఆరడుగుల బుల్లెట్' విడుదలకు రెడీ అవుతోంది. సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలోజయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను మే 19న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. 'ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్, మాస్ ఆడియన్స్‌కు నచ్చే అంశాలు మేళవించి దర్శకులు బి.గోపాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు, బాల మురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లోఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న 'ఆరడుగుల బుల్లెట్'ను మే 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని తెలిపారు. -
మెరుపు వేగంతో...
జోరున వర్షం. ఆరడుగుల వ్యక్తి ఇటు వైపు.. అరడజనుకు పైగా రౌడీలు అటువైపు. ఎంతమంది రౌండప్ చేసినా కన్ఫ్యూజన్ లేకుండా రఫ్ఫాడించే దమ్మున్న వ్యక్తి అతను. ఇంకేముంది? ఒంటి చేత్తో మెరుపు వేగంతో అందర్నీ మట్టి కరిపించాడు. అంతే వేగంతో బుల్లెట్ తీశాడు. ఇంతకీ ఆ రౌడీలు ఇతగాణ్ణి ఎందుకు రౌండప్ చేశారు? అసలు కథ ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్, నయనతార జంటగా జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం మే 19 న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ హీరోలకు బి.గోపాల్ మంచి హిట్స్ ఇచ్చారు. ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. బి.గోపాల్ అద్భుతంగా తెరకెక్కించారు. వంశీ కథ, అబ్బూరి రవి మాటలు, మణిశర్మ సంగీతం సినిమాకి హైలెట్. గోపీచంద్ కెరీర్లో ఈ చిత్రం ఓ మైలురాయిగా మిగులుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: నారాయణ రెడ్డి. -
సాఫ్ట్వేర్ లవ్
వారానికి రెండు సెలవులు. ఐదంకెల జీతం. హైఫై జీవితం. అప్పుడప్పుడు ఫారిన్ టూర్స్. ఇలా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రేమలో పడతారు. తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. అసలు ఆ ప్రేమికులు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? వారి ప్రేమ విజయం సాధించిందా లేదా? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మా ‘సరసుడు’ చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు పాండిరాజ్. శింబు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై శింబు హీరోగా ఆయన తండ్రి, ‘ప్రేమసాగరం’ ఫేమ్ టి.రాజేందర్ నిర్మించారు. నయనతార, ఆండ్రియా, అదాశర్మ కథానాయికలు. మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత టి. రాజేందర్ మాట్లాడుతూ– ‘‘మా శింబు సినీ అర్ట్స్ బ్యానర్లో ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత రిలీజ్ అవుతున్న తెలుగు సినిమా ఇది. ఐటీ బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథ. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. మా చిన్న కొడుకు కుళల్ అసరన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. హీరో ఫ్రెండ్‌గా ‘సత్యం’ రాజేష్ బాగా నటించారు. వచ్చే నెల మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. దర్శకుడు పాండిరాజ్ అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్: శ్రీమతి ఉషా రాజేందర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకట్ కొమ్మినేని, కెమెరా: సతీష్. -
మేలో 'ఆరడుగుల బుల్లెట్'
గోపిచంద్ హీరోగా సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆరడుగుల బుల్లెట్. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఎట్టకేలకు మేలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పలు సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ కథ అందించాడు. జయ బాలాజీ రీల్ మీడియా బ్యానర్‌పై తాండ్ర రమేష్ నిర్మిస్తున్న ఆరడుగుల బుల్లెట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. -
నయనకే విలనయ్యా!
లేడీసూపర్‌స్టార్ నయనతారకే తాను విలన్ అయ్యానన్న ఆనందంలో మునిగి తేలుతున్నాడు వర్ధమాన నటుడు షాన్. ఈయన నిజంగా చాలా లక్కీఫెలోనే అనాలి. తొలి చిత్రంలోనే బాలీవుడ్ భామ ఇషా తల్వార్‌కు లవర్‌గానూ, ఆ తరువాత ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా నటించాడు. ఇటీవల నయనతారకు విలన్ అయ్యాడు. ఇంకా ఆయనకు గుర్తింపు రాక ఏమవుతుంది. అలా పలువురి ప్రశంసలు అందుకుంటున్న వర్ధమాన నటుడు షాన్ తన గురించి తెలుపుతూ కోవై జిల్లా, పొల్లాచ్చిలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తాను నటనపై ఇష్టంతో ఆ దిశగా పయనం సాగించానన్నాడు. అలా దర్శకుడు మిత్రన్ జవహర్‌ను కలిసి అడిషన్లో సెలెక్ట్ అయి ఒరు కాదల్ కథై చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యానని తెలిపాడు. అందులో నటి ఇషా తల్వార్ ప్రేమికుడిగా నటించానని అన్నాడు. ఒరు కాదల్ కథై చిత్రంలో నటించిన వేళా విశేషం కావచ్చు ఆ చిత్ర విడుదలకు ముందే ధనుష్ కథానాయకుడిగా నటించిన తంగమగన్ చిత్రంలో ఎమీజాక్సన్‌కు బాయ్‌ఫ్రెండ్‌గా నటించే అవకాశం వచ్చిందన్నాడు. ఆ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పాడు. ఆ తరువాత డోరా చిత్రంలో నయనతారకు విలన్‌గా నటించే లక్కీఛాన్స్ వచ్చిందన్నాడు. డోరా చిత్రంలో పవనశర్మగా ప్రధాన విలన్ పాత్రలో నటించడం చాలా మంచి అనుభవంగా పేర్కొన్నాడు. నయనతారను చూడడానికే లక్షలాది మంది తపం చేస్తుంటే ఆమెకు విలన్‌గా నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అన్నాడు. డోరా చిత్రం తన స్థాయిని పెంచిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నవ దర్శకుడు సజోసుందర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో పోలీస్ అగా ప్రధాన పాత్రను పోషిస్తున్నానని తాను విలన్‌గానే స్థిరపడాలని ఆశిస్తున్నానని తెలిపాడు. అలాంటి పాత్రలకే భాషా భేదం లేకుండా ఆదరణ లభిస్తుందని అని నటుడు షాన్ అంటున్నారు. -
అసలేం జరిగింది?
వారిది ప్రేమ వివాహం. ప్రేమ కబుర్లు, చిన్ని అలకలు, సరదాలు.. జీవితం చాలా ఆనందంగా సాగుతుంటుంది. ఆకస్మాత్తుగా జరిగిన ఓ సంఘటన వారి జీవితాల్లో కల్లోలం రేపుతుంది. ఆ ఇంట్లో నవ్వులు లేవు.. అలకలు లేవు.. సరదాలు లేవు. అంతా నిశ్శబ్దం. అసలేం జరిగింది? ఆ దంపతుల జీవితంలో కల్లోలం సృష్టించిన సంఘటన ఏంటి? దాన్నుంచి వాళ్లెలా బయటపడ్డారు? అనే విషయాలు తెలసుకోవాలంటే మా చిత్రం చూడాలంటున్నారు దర్శకుడు ఎస్.కె షాజన్. ఆయన దర్శకత్వంలో రూపొందిన మలయాళ హిట్ ‘పుదియ నియమం’ను తెలుగులో ‘వాసుకి’ పేరుతో అనువదించారు. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నయనతార లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ‘‘ఇందులో నయనతార చేసిన పాత్ర ప్రతి మహిళకు కనెక్ట్ అవుతుంది. చిత్రాన్ని మేలో విడుదల చేయాలనుకుంటున్నాం. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. గోపీ సుందర్ అందించిన సంగీతం హైలెట్’’ అని అన్నారు నిర్మాత ఎస్.ఆర్. మోహన్. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - నయనతార