
ఇందు మూలముగా తెలియజేయునది ఏమనగా.. ఎవరూ నయనతారను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవకూడదట. ఎట్టెట్టా? కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ మూవీలూ చేస్తోన్న మా మేడమ్‌ని లేడీ సూపర్ స్టార్ అనకూడదా? అని ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. ఇంతకీ మా మేడమ్‌ని అట్టా పిలవొద్దన్న మేడమ్ ఎవరో చెప్పండి అని కూడా మండిపడుతున్నారు. నయనతారకున్నంత కాకపోయినా ఆ మేడమ్‌కి కూడా ఓ రేంజ్ ఉంది. పేరు లక్ష్మీ రామకృష్ణన్.
తమిళనాడులో ఫేమస్‌లెండి. ఈవిడగారు రైటర్, డైరెక్టర్.. సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తారు. మేడమ్ ప్రొఫైల్ సూపర్‌గానే ఉంది. కానీ, నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటే ఈవిడకేంటి? అంటే.. అది నయనతారకు చెడు చేసే బిరుదు అట. ఎలగెలగా? బిరుదు చెడు చేస్తదా? అని ఫ్యాన్స్ లక్ష్మీ రామకృష్ణన్ ఎద్దేవా చేస్తున్నారు. అయినా లక్ష్మీ రామకృష్ణన్ ఫ్యాన్స్‌కి ఈ కండిషన్ పెట్టలేదు. మీడియావాళ్లకి. అయ్యా మీడియా మిత్రులారా.. మీరు కనుక లేనిపోని బిరుదులు పెడితే.. అది పెద్ద బాధ్యత అయిపోతుంది.
ఆ బిరుదుకి తగ్గట్టు నయనతార స్టోరీలు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. అది ఆమెకు చేటే తప్ప మేలు కాదు. ఆలోచించండి అంటోంది లక్ష్మీ రామకృష్ణన్. పాయింటే. కానీ, దూసుకెళుతోన్న నయనతారలాంటి ఆడకూతురికి లేడీ సూపర్ స్టార్ అని బిరుదు ఇస్తే తప్పేంటి? అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదీ పాయింటే. ఎవరి పాయింట్ ఎలా ఉన్నా.... మన పాయింట్ మనకుంటుంది కదా!
Comments
Please login to add a commentAdd a comment