2024కి బై చెప్పి... 2025కి వెల్‌కమ్ చెప్పడానికి అందరూ సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కొందరు స్టార్స్ అయితే కొత్త సంవత్సరం జరుపుకోవడానికి విదేశాలు వెళ్లారు. షూటింగ్స్‌కి కాస్త విరామం దొరకడంతో వెకేషన్ ప్లాన్ చేసుకునే అవకాశం ఈ స్టార్స్‌కి దక్కింది. వారి ఈ వెకేషన్ గురించి తెలుసుకుందాం...
ఈ ఏడాది మహేశ్‌బాబు ఇప్పటికే రెండుసార్లు జర్మనీ వెళ్లొచ్చారు. అయితే ఇది హాలిడే ట్రిప్ కాదు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ప్రిపరేషన్‌లో భాగంగా జర్మనీ వెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది మహేశ్‌బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫారిన్‌లో జరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా ఫారిన్‌లోనే మహేశ్‌బాబు ప్లాన్ చేశారని సమాచారం. మహేశ్‌బాబు మోస్ట్‌లీ యూరప్‌కు వెళ్లనున్నారట.
ఇక ప్రభాస్ ఆల్రెడీ యూరప్‌లో ఉన్నారని తెలిసింది. ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. యూరప్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే అని టాక్. విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘రాజా సాబ్, ఫౌజి’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ చిత్రాన్ని ఆరంభిస్తారు ప్రభాస్.
ఇక ‘దేవర’ సక్సెస్ జోష్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో స్ట్రయిట్ ఫిల్మ్ ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు చెందిన ఓ లెంగ్తీ షూట్‌ను పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లారని తెలిసింది. సో... ఎన్టీఆర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లండన్‌లోనే అని ఊహించవచ్చు. లండన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్‌తో ఎన్టీఆర్ బిజీ అవుతారట.
ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే స్పెయిన్ వెళ్లారు. రష్మికా మందన్నా ఆల్రెడీ ఫారిన్‌లోనే ఉన్నారని తెలిసింది. హీరోయిన్ తమన్నా, ఫరియా అబ్దుల్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను అమెరికాలో ప్లాన్ చేశారని తెలిసింది. వీరితో పాటు మరి కొందరు టాలీవుడ్ యాక్టర్స్ గోవా, మాల్దీవ్స్‌లో వేడుకలు ప్లాన్ చేశారని సమాచారం.
భర్త విఘ్నేష్ శివన్‌తో నయనతార దుబాయ్ వెళ్లారు. అక్కడే మాధవన్, ఆయన భార్య సరిత కూడా ఉన్నారు. సో... ఈ రెండు ఫ్యామిలీస్ ఒకే చోట వేడుక చేసుకోనున్నారు. కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ట్ హీరో హృతిక్ రోషన్ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్పాట్‌గా దుబాయ్‌నే ఎంచుకున్నారు. ఇంకా ఫ్యామిలీతో కలిసి దియా మీర్జా శ్రీలంక వెళ్లారు. అర్జున్ రాంపాల్ సెలబ్రేషన్స్ గోవాలో జరుతాయని సమాచారం. ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ స్విట్జర్లాండ్‌లో, శిల్పాశెట్టి లండన్‌లో, భర్త జహీర్ ఇక్భాల్‌తో కలిసి హీరోయిన్ సోనాక్షీ సిన్హా ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోనున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ ఫిన్‌ల్యాండ్ వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment