Vacations
-
Sitara: వెకేషన్లో మహేశ్‌బాబు గారాల పట్టి (ఫోటోలు)
-
సమంత చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్
-
వెకేషన్లో చిల్ అవుతున్న సమంత, షార్ట్ హెయిర్‌తో క్యూట్ (ఫొటోలు)
-
హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్‌లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్‌లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
బిజిబిజిగా షెడ్యూల్స్..రిలాక్సింగ్ కోసం వెకేషన్ మోడ్‌లో స్టార్స్..!
వరుస షూటింగ్‌లు, ప్రమోషన్స్ వంటి వాటితో బిజీ బిజీగా గడిపే స్టార్స్ కాస్త గ్యాప్ తీసుకుని రీ చార్జ్ అయ్యి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తారు. ఇలా రిలాక్స్ అవ్వడానికి వెకేషన్ మోడ్‌లో ఉన్న హీరోల గురించి ఓ లుక్కేయండి. కరోనా అలజడి తర్వాత తొలిసారి విదేశీ ప్రయాణం చేశారు చిరంజీవి. సతీసమేతంగా అమెరికా, యూరప్ ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లారు. తన భార్య సురేఖతో కలిసి చాలాకాలం తర్వాత వెకేషన్‌కు వెళ్తున్నట్లుగా చిరంజీవి పేర్కొన్నారు. ఈ నెల 3న అమెరికా వెళ్లారు చిరంజీవి. ఈ వీకెండ్లో వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటారని తెలిసింది. వచ్చీ రాగానే ‘గాడ్‌ఫాదర్’ షూట్లో పాల్గొంటారు చిరంజీవి. ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లపై ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేసిందట చిత్రయూనిట్. మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్. ఇక నెల రోజుల గ్యాప్‌లో రెండుసార్లు వెకేషన్‌కు వెళ్లారు మహేశ్‌బాబు. ఏప్రిల్ నెలాఖర్లో వెకేషన్‌కు వెళ్లి మే మొదటివారంలో తిరిగొచ్చి ‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు మహేశ్. ‘సర్కారువారి పాట’ రిలీజ్ తర్వాత మళ్లీ ఫ్యామిలీతో కలిసి యూరప్ వెళ్లారు. ఈ యూరప్ వెకేషన్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాక త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా షూట్లో పాల్గొంటారు మహేశ్‌బాబు. మరోవైపు గత ఏడాది డిసెంబరులో రిలీజైన ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్‌ను దక్కించుకున్నారు అల్లు అర్జున్. దీంతో ‘పుష్ప 2’ కథపై మరింత కసరత్తు ప్రారంభించారు ఈ చిత్రదర్శకుడు సుకుమార్. ‘పుష్ప2’ షూటింగ్ ఆరంభం కావడానికి సమయం పడుతుంది. ఈలోపు వెకేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు అల్లు అర్జున్. ఫ్యామిలీతో కలిసి ఆయన లండన్ వెళ్లారు. -
చలో పల్లెటూర్!
-
పల్లెబాట పట్టిన మహానగరం
సాక్షి, హైదరాబాద్: విజయదశమి నేపథ్యంలో గ్రేటర్ నుంచి భారీగా సొంతూళ్లకు తరలివెళ్లారు. అయితే, ఈ ఏడాది ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ సమ్మెట పోటులా మారింది. ప్రజా రవాణా సాధనాలైన రైళ్లు, బస్సుల కంటే ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి సొంత వాహనాల్లోనే మెజార్టీ సిటీజన్లు స్వగ్రామాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జిల్లాలు, ఏపీలోని పలు నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సుమారు 24 లక్షల మంది బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. ఎంజీబీఎస్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ బస్సులు ఆర్థికంగా భారమే అయినప్పటికీ విధి లేని పరిస్థితుల్లో ఈసారి రైళ్లు, బస్సుల కంటే వ్యక్తిగత వాహనాలనే లక్షలాది మంది ఆశ్రయించారు. ద్విచక్ర వాహనాల్లో సుమారు ఏడు లక్షలు.. కార్లు, జీపుల్లో మరో మూడు లక్షల మంది గమ్యస్థానాలకు చేరుకున్నట్లు అంచనా. అంటే వ్యక్తిగత వాహనాల్లోనే ఏకంగా 10 లక్షల మంది సిటీ దాటినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల క్యూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తగ్గిన ప్రయాణికులు గ్రేటర్ సిటీకి ఆవల ఉన్న తూప్రాన్, షాద్‌నగర్, పంతంగి, బీబీనగర్ టోల్గేట్ల వద్ద వారం రోజులుగా నిత్యం వేలాది వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు ఆపరేటర్లు సాధారణ టిక్కెట్లపై వందశాతం రెట్టింపు చార్జీలతో ప్రయాణికులను నిలువుదోపిడీ చేశారు. ప్రయాణం అనేక వ్యయ ప్రయాసలతో కూడినదైనప్పటికీ 100–150 కిలోమీటర్ల దూరం లోపు ఉన్న ప్రాంతాలకు ద్విచక్రవాహనాలపై లక్షలాది మంది బయలుదేరి వెళ్లారు. తమ గమ్యస్థానాలు 200 కి.మీ పైగా ఉన్నవారు ప్రైవేటు బస్సులు, కార్లు, జీపులతో పాటు రైళ్లను ఆశ్రయించారు. జేబీఎస్లో కనిపించని ప్రయాణికుల సందడి మొత్తం దసరా పండగ జర్నీ గ్రేటర్ సిటీజన్లకు ఆనందం లేకుండా చేసింది. ప్రయాణ అవస్థలు వర్ణనాతీతంగా మారడం గమనార్హం. ఆర్టీసీ కార్మికులు పండగ రోజుల్లోనే సమ్మెకు దిగడంతో అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులకు పండగ ఖర్చులకు అదనంగా ప్రయాణ ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. తెలంగాణా జిల్లాల్లో అంగరంగ వైభవంగా జరిగే బతుకమ్మ, దసరా నవరాత్రులకు పల్లెబాట పట్టిన సిటీజన్లు ప్రయాణం భారమైనా వెనక్కు తగ్గకుండా వ్యక్తిగత వాహనాల్లో ముందుకు సాగడం ఈసారి దసరా ప్రత్యేకత కావడం విశేషం. సమ్మె.. దశమి ప్రభావంతో ఖాళీగా మారిన బషీర్‌బాగ్ చౌరస్తా దసరాకు గ్రేటర్ నుంచి గత నాలుగు రోజులుగా పల్లెబాట పట్టినవారు (సుమారుగా).. రవాణా వెళ్లినవారు ద్విచక్రవాహనాలు 7 లక్షలు ఆర్టీసీ బస్సులు 3 లక్షలు ప్రైవేటు బస్సులు 5 లక్షలు రైళ్లు 6 లక్షలు కార్లు/జీపులు 3 లక్షలు మొత్తం 24 లక్షలు -
పాపం.. మనోళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగం చేస్తున్న భారతీయులు సెలవులుపెట్టి పండుగలకు పబ్బాలకు ఊర్లకు వెళ్లడం, కాశి, కన్యాకుమారి యాత్రలకు వెళ్లడం, ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఊటి, కొడై కెనాల్‌కు పయనం అవడం మనకు తెల్సిందే. అయితే ప్రపంచంలో అతి తక్కువగా సెలవులు వాడుకునేది భారతీయ ఉద్యోగులేనట. ఈ విషయాన్ని 19 దేశాల్లో సర్వేచేసి అమెరికాలోని పర్యాటక సంస్థ ‘ఎక్స్పీడియా’ తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత ఉద్యోగులు 75 శాతం మంది సెలవులపై వెళ్లలేదట. అదే స్పెయిన్‌లో 48 శాతం మంది, బ్రిటన్‌లో 47 శాతం మంది సెలవులపై వెళ్లలేదు. ఈ 75 శాతం మందిలో ఆరెనెలల నుంచి ఏడాది వరకు, ఏడాదికిపైగా ఒక్క రోజు కూడా సెలవులు పెట్టని వారు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక రోజు నుంచి పది రోజుల వరకు సెలవు తీసుకున్న భారత ఉద్యోగులు 41 శాతం కాగా, అదే స్పెయిన్‌లో ఇరవై ఒక్క రోజు నుంచి 30 రోజుల వరకు సెలవులు తీసుకున్న వారి సంఖ్య 64 శాతం. సర్వేలో పాల్గొన్న భారత ఉద్యోగుల్లో ఏడాదికిపైగా సెలవు తీసుకోని వారు 17 శాతంకాగా, ఆరు నెలల నుంచి ఏడాది వరకు సెలవు తీసుకోని వారి సంఖ్య 36 శాతం, మూడు నుంచి ఆరు నెలల వరకు సెలవు తీసుకోని వారు 27 శాతం, నెల నుంచి మూడు నెలల వరకు సెలవులు తీసుకోని వారి సంఖ్య 17 శాతం, తరచుగా సెలవులు తీసుకునే వారి సంఖ్య ఆరు శాతమని అధ్యయనంలో తేలింది. సెలవులు తీసుకోక పోవడానికి కారణాలు 1. మున్ముందు అత్యవసరం రావచ్చనే ఉద్దేశంతో సెలవులు తీసుకోని ఉద్యోగుల సంఖ్య 46 శాతం. 2. పని ఒత్తిడి ఎక్కువగా ఉండి, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల సెలవులు తీసుకోని వారి సంఖ్య 35 శాతం. 3. నాకు, నా జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు ఒకేసారి సెలవులు ప్లాన్ చేసుకోవడం కుదరకపోవడం వల్ల సెలవులకు దూరం అవుతున్న వారి సంఖ్య 33 శాతం. 4. వ్యక్తిగత షెడ్యూల్ సెలవులకు అనుమతించకపోవడం అంటున్న వారి సంఖ్య 31 శాతం. 5. డబ్బు కోసం సెలవులను అమ్ముకోవడం వల్ల వెళ్లలేకపోతున్న వారి సంఖ్య 31 శాతం. 6. నేను లేకుండా ఆఫీసులో కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న కారణంతో 25 శాతం 7. డబ్బులేక, సెలవులకు ఖర్చుపెట్టే స్థోమత లేక 24 శాతం. 8. కెరీర్లో పైకి రావాలంటే వృత్తికి అతుక్కుపోయి పనిచేయాలనుకోవడం వల్ల సెలవులకు దూరం అంటున్న వారి సంఖ్య 18. 9. సెలవులపై వెళ్లేందుకు సమయమే దొరకదు అంటున్న వారి సంఖ్య పది శాతం. 10. సెలవులను వాడుకుంటామంటున్న వారు ఆరు శాతం. సెలవులపై వెళ్లాలనుకుని బాస్‌లు సెలవులు ఇవ్వకపోవడం వెల్లని వారి సంఖ్య కూడా భారతీయుల్లో ఎక్కువగానే ఉంటుంది. వారి గురించి తెలియలేదంటా సర్వేలో పాల్గొన్న వారిని ఈ ప్రశ్న అడిగి ఉండకపోవచ్చు. సెలవుపై వెళ్లి కూడా ఆఫీసు పనులు చూసుకునే వారి సంఖ్య 32 శాతమని తేలింది. మొత్తం 19 దేశాల్లో సర్వే చేశామని చెప్పిన అమెరికా పర్యాటక ఏజెన్సీ ‘ఎక్స్పీడియా’ భారత్, స్పెయిన్, బ్రిటన్ దేశాల పేర్లను మినహా మిగతా 13 దేశాల పేర్లను వెల్లడించలేదు. ఇక్కడ అవసరం లేదని అనుకోవచ్చేమో! -
మదినిండుగ విహర పండగ
తీర్థ యాత్రలు / విహార యాత్రలు ఉరుకుల పరుగుల జీవితంలో ఉల్లాసమైన మార్పుకోసం విహార యాత్రలు చేస్తుంటాం. ఇంటిల్లిపాదితో కలిసి యాత్ర చేస్తే ఆ ఆనందమే వేరు. అయితే, ఏదైనా టూర్ వెళ్లాలి అని అనుకోగానే ఎక్కడికి, ఎలా? అనే అన్వేషణ మొదలవుతుంది. ఇలా ఆనందంగా వెళ్లిరావడానికి మన దేశంలో అనేక ప్రదేశాలున్నాయి. చరిత్ర, సంస్కృతి, మతాలను ప్రతిబింబించే ప్రదేశాలు కోకొల్లలు. ప్రకృతి అందాలు, జంతు ప్రదర్శనశాలలు, కొండలు, కోనలు, అడవులు, జలపాతాలు, బీచ్‌లు, నదులు.. ఇలా సువిశాల భారతదేశంలో ఎన్నెన్నో అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఏదో మొక్కుబడిగా కాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని యాత్ర ప్రారంభిస్తే అనవసర హడావిడికి తావుండదు. మరుపురాని ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాల నుంచి మన తీర్థయాత్రను ప్రారంభిద్దాం. చార్ధామ్: మన దేశంలోని గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలే చార్‌ధామ్‌గా జగత్ ప్రసిద్ధి. ఈ నాలుగు ఆలయాలను జీవితంలో ఒక్కసారైన సందర్శించాలని ప్రతీ ఒక్కరు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి. కాశీ యాత్ర: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధాని. ఈ నగరం నడిబొడ్డున కొలువైన కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా నీరాజనాలను అందుకుంటోంది. మహిమాన్వితమైనది కాబట్టే జీవితంలో ఒక్కసారైనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ. రామేశ్వరం: రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వినుతికెక్కింది. శ్రీ రామేశ్వరం పాంబన్కు ఈశాన్య భాగమందు, ధనుష్కోటికి ఆగ్నేయ భాగంలో ఉంది. విష్ణు ప్రియమైన రామేశ్వరం శంఖు ఆకారంలో కనబడుతుందంటారు. కాశీయాత్ర ఫలితము ధనుష్కోటి సేతులో స్నానం చేసి, రామనాధుని పూజించిన పూర్తి అవుతుందని చెబుతారు. అమర్నాథ్ యాత్ర: మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు, లోతెంతో తెలియని లోయలు, మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి, ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ‘ఓం నమఃశివాయ.’ ఏడాదిలో 45 రోజుల పాటు కనిపించే మంచు లింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. కైలాస మానస సరోవరం: సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు అతిపవిత్రం. శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాస మానస సరోవరం. విహార యాత్రలు మున్నార్: ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళ ప్రకృతి అందాల విందుకు నెలవు. ఇక్కడి మున్నార్ ప్రకృతి అందాల విందును కనులారా ఆరగించాలంటే కనీసం మూడురోజులు పడుతుంది. చూడముచ్చటైన వృక్షాల అందాలు, తేయాకు తోటల ఘుమఘుమలు, పన్నెండేళ్ళకోసారి పూచే కురింజి పువ్వు సోయగాలు, బోట్‌రైడింగ్ అనుభూతులు, చల్లని పిల్ల తిమ్మెరలు.. మెుత్తానికి వసంతంలో శిశిరంలా ఉంటుంది మున్నార్ విహారం. మనాలి: హిమలయపు అందాల నడుమ విరాజిల్లుతున్న ప్రాంతమే మనాలి. దీన్ని‘స్విడ్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అంటారు. ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి మనాలీకి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి 3 కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉన్నాయి. చుట్టూ మంచులోయల మధ్య వేడి నీటి కొలనులు ఉండటం ఆశ్చర్యం. సిమ్లా పరిసరాల్లో కుఫ్రీ షార్ట్ ట్రిప్, లీజర్ వాక్, హిడింబా ఆలయం, టిబెటన్ మోనస్టరీ, సోలంగ్ లోయ చూడొచ్చు. నాగర్ ఫోర్ట్, రహాలా జలపాతాలు, బీస్ నదిలో సాహస క్రీడలు, రాఫ్టింగ్ కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయ్. సిమ్లా: పెళ్లినాటి తొలిరోజులను ఆహ్లాదంగా గడిపేందుకు ఇదో చక్కని ప్రదేశం. సిమ్లా ఆపిల్ పండ్లకు ప్రసిద్ధి. ఎత్తయిన కొండలు, మల్లెపూల వానలా కురిసే మంచు, చల్లటి వాతావరణం కట్టిపడేస్తాయ్. వందల ఏళ్ల నాటి ఆలయాలు, చర్చిలు, బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఎన్నో భవనాలు ఆకట్టుకుంటాయి. ఎటుచూసినా హిమాలయ పర్వత శ్రేణులు, లోయలు, క్రమశిక్షణతో పెరిగినట్లుగా ఉండే ఫైన్, ఓక్ చెట్లు అడుగడుగునా ప్రత్యక్షమవుతాయి. స్నో స్కీయింగ్ ఇది స్వర్గధామమే. ఊటి, కొడైకనాల్: తమిళనాడు మధ్య ప్రాంతంలో ఉన్న సుందరమైన పర్వతప్రాంతం ఊటి, కొడైకెనాల్. తూర్పు కనుమల్లో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే ఘాట్రోడ్లో ప్రయాణించాల్సిందే. కొడై సరస్సు, సెయింట్ మేరీ చర్చ్, పంపార్ పాల్స్, గ్రీన్ వ్యాలీ, గుణ గుహ, పైన్ వృక్షాల వనం పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశాలు. ఇందులో కొడై అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. అంతర్జాతీయ యాత్రలు సింగపూర్: పచ్చదనానికి, పరిశుభ్రతకు మరో పేరు సింగపూర్. ఎన్నో ప్రకృతి అందాలకు నెలవైన ఆ దేశ అందాలను వీక్షించేందుకు విచ్చేసే పర్యాటకుల సంఖ్య కోకొల్లలు. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిపిన ఈ అరుదైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే సింగపూర్ వెళ్లి రావాల్సిందే. మలేషియా: నీలిరంగు కప్పుకున్న సముద్రం తెల్లగా మెరిసిపోయే ఇసుక, ఆ పక్కనే పచ్చదనం పరుచుకున్న వృక్షసంపద, నీటి మీద తేలియాడే మరపడవలూ, తీరాన్ని తాకాలనే ఉత్సాహంతో ఉరకలు వేసే సముద్ర కెరటాలు... ఇలా మలేషియా అందాలన్నీ రంగుల హరివిల్లులై పర్యాటకుల మది దోచుకుంటుంటాయి. చిన్న చిన్న దీవులతో ఏర్పడ్డ సుందర ప్రదేశమే మలేషియా. దట్టమైన అరణ్యాలూ, ఎత్తయిన కొండలూ, తెల్లని బీచ్‌లతో చూడముచ్చటగా ఉంటుంది. థాయ్‌లాండ్: ఏటా లక్షలాదిమంది పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతం థాయ్‌లాండ్. బీచ్‌లో సేద తీరాలన్నా, స్పా, మసాజ్ సెంటర్లలో రిలాక్స్ అవాలన్నా థాయ్ ది బెస్ట్ ప్లేస్. డిసెంబర్, మార్చి మధ్య థాయ్‌లాండ్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కాకుండా హాఫ్ సీజన్లో ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చులో టూర్ ప్రశాంతంగానూ పూర్తవుతుంది. శ్రీలంక: పూల సుగంధ పరిమళాల గుబాళింపు, పక్షుల కిలకిలారావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం, స్వచ్ఛమైన చల్లని పిల్లగాలులు, సముద్ర తీరం హŸయలు వీటన్నింటినీ స్వయంగా ఆస్వాదించాలంటే శ్రీలంకకు వెళ్లాల్సిందే. హైదరాబాదు నుంచి కొలంబోకు సరిగ్గా రెండు గంటల ప్రయాణం మాత్రమే. శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే కాబట్టి టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. హాంకాంగ్ మకావా: హాలీడేస్‌లో ఎక్స్ట్రార్డినరీ అనుభూతి. సముద్ర గర్భ మార్గం, కొండల్ని తొలుస్తూ వేసిన అండర్‌పాస్‌లు, సుదూర ప్రాంతాలను కలిపే వేలాడే వంతెనలు.. భూతల స్వర్గాన్ని తలపించే హాంకాంగ్ చైనాకు ఆగ్నేయ తీరంలో ఉంటుంది. పలు చిన్న చిన్న ద్వీపాల సమూహమిది. నేపాల్: ఎవరెస్టు శిఖరం మీద ఎగురుతూ ధవళవర్ణంలో ధగధగలాడే హిమాలయ పర్వతశ్రేణుల సౌందర్యాన్నీ ఆ కొండల్లోంచి జాలువారి వయ్యారంగా మలుపులు తిరుగుతూ సాగే నదుల అందాలనూ... ఎంతసేపు చూసినా విసుగనిపించదు. అలాంటి అందాల నెలవు నేపాల్. RVటూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్పో ఎప్పుడెప్పుడు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవాలకునే భక్తుల సౌలభ్యం కోసం / విహార పర్యాటక ఔత్సాహికుల కోసం ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ వేసవి సెలవులతో పాటు సంవత్సరం పొడవునా వచ్చే విశేష ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నేటి నుండి జనవరి 24 వరకు ట్రావెల్ ఎక్స్పో నిర్వహిస్తోంది. ఈ ఎక్స్పో లో 2018 ఫిబ్రవరి వరకు చేయబోయే ఆధ్యాత్మిక, వినోద, విహార లేదా అంతర్జాతీయ యాత్రలను అడ్వాన్స్‌గా కొంత మొత్తము ప్యాకేజీ అమౌంట్‌ను కట్టినట్లయితే భారీ డిస్కౌంట్ పొందే సదావకాశం కల్పిస్తోంది. నేరుగా హైదరాబాద్ కూకట్పల్లి లోని ఖVప్రధాన కార్యాలయాన్ని సందర్శించి గాని లేదా ఫోన్ ద్వారా కానీ వివరాలు పొందవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక తగ్గింపు ప్యాకేజీలను వినియోగించుకోవచ్చు. గమనిక: ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ట్రావెల్ ఎక్స్పోను సందర్శించండి. భారీ డిస్కౌంట్ పొందండి. ఈ అవకాశం 21, 22, 23, 24 తేదీలలో మాత్రమే. ఆర్ వి టూర్స్ – ట్రావెల్స్ 3వ అంతస్తు, భాగ్యనగర్ కాంప్లెక్స్, బి.జె.పి. ఆఫీస్ ఎదురుగా, మెట్రో పిల్లర్ నెం. 15, కూకట్పల్లి, హైదరాబాద్ ఆర్.వి.రమణ ఆర్.వి.టూర్స్ – ట్రావెల్స్ అధినేత -
ఆప్టిమిస్ట్ మాస్కు వేసుకుని తిరగలేక పోతున్నా
బియాస్ విహారయాత్రకు వెళ్లి ఫోటోల మోజుతో జీవితాన్ని విషాదయాత్రగా ముగించిన 24 మంది విద్యార్థుల విషాదాంతాన్ని చూసి తట్టుకోలేక ఒక ఇంజినీరింగ్ విద్యార్థి రాసిన లేఖ... నువ్వు తిరిగిరానందుకు బాధ కన్నా, అలా రాకపోవడానికి వెనకున్న కారణాలు చూస్తుంటే చాలా కోపంగా ఉంది! ‘హ్యావింగ్ ది బెస్ట్ టైమ్’ అని వాట్సప్‌లో స్టేటస్ పెట్టిన గంటలోనే ప్రపంచం తలకిందులైంది. ఇంకా నమ్మబుద్ధి అవట్లేదు. నువ్వు తిరిగొస్తావులే అని ముఖానికి ఆప్టిమిస్ట్ మాస్కు వేసుకుని తిరగలేక పోతున్నా. ఈ ఘటనలో వ్యవస్థను తప్పు పట్టలేం. వ్యవస్థ అది! తప్పులు చేయడం దాని నైజం. అయినా మన స్నేహంలో ఉన్నది ఇద్దరే వ్యక్తులు! నువ్వు - నేను! అంతే! అందుకే నేను నిన్నే తప్పుబడుతున్నాను... అర్థం లేదన్నా, మానవత్వం కాదన్నా! కోపం వల్ల, బాధ వల్ల నా నైతిక విలువలు మసకబారిపోయాయి. ఏరా! చూడని మొహమా నాది! మర్చిపోయేదా! జ్ఞాపకాలు మదిలో ఉంటే చాలవా? నీ పీసీలోని డిడ్రైవ్లో కూడా ఉండాలని ఉందా? చేతిలో కెమెరానో, స్మార్ట్ఫోనో ఉందని అస్తమానం ఫొటోలు తీసుకోవడం! ఒకటి రెండు అయితే అనుకోవచ్చు. అక్కడికి వెళ్లిందే ఫొటోల కోసం అన్నట్లుగా అన్నన్ని ఫొటోలు అవసరమా? అదీ కొండరాళ్ళూ, బండరాళ్ళూ నిండిన నదిలో అంత లోపలకంటూ వెళ్ళి! ఆ గంట కాలానికి నీ చేతిలో కెమెరా, సెల్‌ఫోన్ లేకుండా ఉండుంటే నువ్వు ఇప్పటికీ నా పక్కనే ఉండేవాడివేమో. అడుగడుగుకూ ప్లేస్ అప్డేట్స్, లొకేషన్ చెకిన్లు... ఈ దిక్కుమాలిన సోషల్ మాయలో పడి ఒక రకమైన ఆత్మన్యూనతకి నిదర్శనం అవుతోంది ఈ సమాజం. ఆ మందలో నువ్వూ కొట్టుకొని వెళ్లిపోయావు. రాయి కనబడితే సెల్ఫీ, వాగూ వంకా ఎదురుపడితే సెల్ఫీ. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలే! అసలీ సెల్ఫీ కల్చర్‌ని పరిచయం చేసిన వాడి చెంప పగలగొట్టాలని ఉంది! కానీ ఎంత చెప్పినా, ఏమనుకున్నా మన చేతుల్లో ఏదీ లేదు. ప్రమాదం జరిగిన క్షణం ముందు వరకు కూడా ఇలా అవుతుందని ఎవరూ అనుకొని ఉండరు. క్షణంలో చక్రాలు తిరిగిపోయాయి. క్షణానికి ఇంత విలనీ ఉందా? ఆశలు, ఆశయాలను అనాథలుగా చేసి వెళ్లిపోయావా నేస్తం! ఒకరి తప్పుల నుండి సమాజం తన తప్పు తెలుసుకుంటుందని తెలుసు... కానీ ఆ తప్పులకు మూల్యం నీ ప్రాణం అని ఊహించలేకపోయానురా! - శశ్రీక్ -
చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
రంగారెడ్డి జెడ్పీపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీ సొంత సభ్యులను కాపాడుకునేందుకు తంటాలు విహారయాత్రల పేరిట సభ్యులను రాష్ట్రం దాటించిన పార్టీలు హస్తంతో చేతులు కలిపిన ‘దేశం’! వైస్ చైర్మన్ పదవి కోసమే స్నేహం సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకవపోవడంతో రంగారెడ్డి జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. అధ్యక్ష పీఠం కోసం పార్టీలు నడుపుతున్న క్యాంపులు జోరందుకుంటున్నాయి. ఒకవైపు సొంత జెడ్పీ సభ్యులను కాపాడుకుంటూనే, మరోవైపు పొరుగు పార్టీల జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు పోటీపడుతున్నాయి. చైర్మన్ పీఠం కోసం కావాల్సిన మేజిక్ ఫిగర్ ‘17’ సభ్యులను సమకూర్చుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అష్టకష్టాలు పడుతున్నాయి. ప్రతిష్టాత్మక జిల్లా చైర్మన్ పదవిని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్.. తొలిసారి జెడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ తహతహలాడుతోంది. విందులు, విహార యాత్రలు జెడ్పీటీసీ సభ్యులు పక్క పార్టీల ప్రలోభాలకు లొంగకుండా కాపాడుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లు శిబిరాలు ఏర్పాటు చేసి ఎత్తు లు వేస్తున్నాయి. సభ్యులందరినీ విహారయాత్రల పేరిట జిల్లాలో లేకుండా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళారు. అత్యధిక సంఖ్యలో 14 మంది జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. వారి సభ్యులను మేనేజ్ చేసే బాధ్యతను పార్టీలోని ఓ సీనియర్ నేతకు అప్పగించారు. దీంతో కార్యరంగంలో దిగిన ఆయన 14 మంది జెడ్పీటీసీ సభ్యులను తొలుత షిర్డీకి తరలివెళ్లారు. అటు నుంచి అటు వారందరూ గోవా వెళ్తున్నట్టు సమాచారం. హస్తంతో సైకిల్ మిలాఖత్ జెడ్పీలో హంగ్ కారణంగా మునుపెన్నడూ లేని సరికొత్త సమీకరణలు తెరమీదకొచ్చాయి. ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ చైర్మన్ పదవి విషయంలో చేతులు కలిపాయి. ఏడుగురు జెడ్పీటీసీ సభ్యులున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ చైర్మన్ పదవి అప్పగిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్‌కు టీడీపీ అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు భారీగా తాయిలాలు కూడా ముట్టజెప్తామనడంతో వారు మరోమాట లేకుండా ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇక ఇరు పార్టీలు వారు పరస్పర అంగీకారంతో క్యాంపులు నడుపుతున్నారని తెలిసింది. కాంగ్రెస్ జిల్లా పరిషత్ సభ్యులు చేజారకుండా విహారయాత్రలకు తరలించగా, టీడీపీ సభ్యులకు నగర శివారులోని ఫిలింసిటీలో విడిది ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక తెలంగాణలో అధికారం చేపట్టనున్న టీఆర్ఎస్ పార్టీ కూడా జెడ్పీ చైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు పక్క పార్టీల జెడ్పీలకు ఊహించని తాయిలాలు ప్రకటిస్తూ వారిని తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమ సభ్యులు పక్క చూపులు చూడకుండా వారిని ఇప్పటికే చెన్నై షిఫ్ట్ చేశారు. ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ వారందరికీ విందు, వినోదాలు ఏర్పాటు చేశారు. మరోవైపు జెడ్పీటీసీల మద్దతు విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మైండ్‌గేమ్‌కు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు సభ్యులు తమ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ ప్రచారం చేస్తుండగా...కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యులు పలువురు తమతో టచ్ ఉన్నారని, టీడీపీ వారూ మద్దతిస్తున్నారని అంటోంది. ఈనేపథ్యంలో జెడ్పీ పీఠం ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి. -
రిజర్వాయర్‌లో విద్యార్థిని గల్లంతు
విహారయాత్రలో విషాదం బొమ్మకూరు జలాశయంలో ఘటన నర్మెట, న్యూస్‌లైన్ : సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థిని మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌లో ప్రమాదశాత్తూ పడి గల్లంతైన సంఘటన శుక్రవా రం జరిగింది.మండలంలోని మరియపురం గ్రామానికి చెందిన తిర్మల్‌రెడ్డి భాస్కర్‌రెడ్డి, మరియమ్మ దంపతుల చిన్నకూతురు సింధూ(14) మరియపురంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఎన్నికల సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తన మిత్రులు స్థానిక చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న కమాల్రెడ్డితో కలిసి విహారయాత్రకు వెళ్తున్నందున తనను కూడా పంపించాలని పట్టుబట్టింది. దీంతో తల్లిదండ్రులు అంగీకరించారు. అనంతరం తన మిత్రులు సృజన, ఆనందవర్షిత, జీవని, హర్షిత్, రాజశేఖర్‌తోపాటు ఫాదర్ కమాల్‌రెడ్డి బొమ్మకూరు రిజర్వాయర్‌కు విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం వారి వెంట తీసుకెళ్లిన భోజనం తిన్నారు. అందరిలో మొదటగా తిన్న సింధూ, సృజన చేతులు కడుక్కోవడానికి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ సింధూ నీళ్లలో పడిపోయింది. పక్కనే చేతులు కడుక్కుంటున్న సృజన ఆందోళనకు గురై వెంటనే వెళ్లి మిత్రులకు, ఫాదర్ కమల్‌కు చెప్పడంతో వారు పరుగెత్తుకొచ్చారు. అయితే అప్పటికే సింధూ నీట మునిగింది. వెంటనే ఫాదర్ కమాల్ స్థానికులకు, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినా ఆమె జాడ తెలియరాలేదు. -
విహారానికీ బీమా..
వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి.. హాయిగా ... సరదాగా చల్లని ప్రదేశాలకు అలా తిరిగి రావాలనుకునే వారు టూర్ ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. విహారయాత్ర అంటేనే రోజువారీ టెన్షన్లూ.. గొడవలు లేకుండా జాలీగా గడిపేందుకు ఉద్దేశించినది. ఎలాంటి తలనొప్పులు లేకుండా సరదాగా సాగిపోవాలి. ఇందుకోసం ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాం. ఎక్కడికెళ్లాలి, అక్కడ ఏమేం ఉంటాయి, ఎక్కడెక్కడ తిరగొచ్చు, ఏం చేయొచ్చు, ఏమేం తీసుకెళ్లాలి, ఎలా వెళ్లాలి లాంటి అనేక విషయాల గురించి బోలెడంత కసరత్తు చేస్తాం. బడ్జెట్ గట్రా లాంటివన్నీ కూడా మన చేతుల్లో ఉన్న అంశాలు కాబట్టి మనం ఎంతైనా ప్లాన్ చేయొచ్చు. కానీ, మన చేతుల్లో లేని వాటి కారణంగా కూడా ఒకోసారి ప్లాన్ అంతా అప్సెట్ కావచ్చు. దొంగతనం జరిగినా.. ఆరోగ్యం దెబ్బతిన్నా... ఊరు గాని ఊరులో ఏం చేయాలో అర్థం కాదు. విహారయాత్రలనే కాకుండా తీర్థయాత్రలు, సాధారణ ప్రయాణాల్లో కూడా ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొన్నటి అమర్నాథ్ యాత్ర కావొచ్చు .. నిన్నటి మలేసియా విమాన దుర్ఘటనలాంటివి ఇందుకు నిదర్శనాలు. శుభమా అంటూ సరదాగా తిరిగొద్దామని బైల్దేరే ముందు ఇలాంటి సమస్యల గురించి ఆలోచించడానికి, కనీసం ప్రస్తావించుకోవడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. కానీ, విహారయాత్ర నిజంగానే క్షేమంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలంటే.. ఎలాంటి సమస్య ఎదురైనా బైటపడ గలిగేట్లు ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇందుకోసమే ప్రయాణ బీమా పాలసీలు ఉపయోగపడతాయి. కేవలం వందల రూపాయల ప్రీమియాలతో కొండంత భరోసానిస్తాయి ఈ పాలసీలు. సాధారణంగా.. ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు, వైద్యానికి వేరే చోటికి తరలింపు, ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత అంగవైకల్యం, లగేజ్ పోగొట్టుకోవడం, దొంగతనాల బారిన పడటం, ఫ్లయిట్ జాప్యం, ఆర్థికంగా అత్యవసర పరిస్థితులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజీ వర్తిస్తుంది. అత్యవసర వైద్య ఖర్చులు.. ప్రయాణంలో అనారోగ్యం పాలైనా .. గాయాల పాలైనా చికిత్స ఖర్చులకు టావెల్ బీమా పనిచేస్తుంది. అవుట్పేషంట్గా ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా ఇన్‌పేషంట్‌గా చేరినా, పాలసీలో పేర్కొన్న పరీక్షలు చేయించుకున్నా బీమా కంపెనీయే ఖర్చులు చెల్లిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మనం ఉన్న చోట్ల సరైన వైద్య సదుపాయాలు లేకపోతే.. వేరే దగ్గరికి తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా చెల్లిస్తుంది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చిక్కుబడిపోయినప్పుడు ఇలాంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాదు, కంపాషనేట్ విజిట్.. అంటే.. పాలసీదారు వారం రోజులపైగా ఆస్పత్రిలోనే ఉండాల్సి వ చ్చినప్పుడు వారిని చూసుకునేందుకు వెళ్లే కుటుంబ సభ్యుల (ఒకరు) ప్రయాణ ఖర్చులను (రాను, పోను) కూడా బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఫ్లయిట్ జాప్యం.. కొన్ని సందర్భాల్లో అనివార్య కారణాల వల్ల ఫ్లయిట్ జాప్యం కావడం, ఫలితంగా మనం వేసుకున్న ప్లాన్ అంతా గందరగోళం అయ్యే పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటి సందర్భాలకు కూడా బీమా కవరేజీ వర్తిస్తుంది. విమానం బైల్దేరడంలో పన్నెండు గంటలకు మించి జాప్యం జరిగితే .. బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అలాగే చెక్డ్ ఇన్ బ్యాగేజ్ దొరక్కుండా పోయినా లేదా మన బ్యాగేజ్ మనకు అందుబాటులోకి రావడంలో తీవ్ర జాప్యం వల్ల మెడికేషన్కి, దుస్తులకు ఇబ్బందిపడినా ఆ మేరకు పరిహారం లభిస్తుంది. అంతే కాదు.. విమానం హైజాక్ అయినప్పుడు కూడా పాలసీ అక్కరకొస్తుంది. హైజాక్ ఎన్ని రోజులు కొనసాగితే అన్ని నాళ్లకు రోజుకు ఇంత చొప్పున అలవెన్స్ ఇస్తుంది బీమా కంపెనీ. ఆర్థిక అత్యవసర పరిస్థితి .. ముందే చెప్పుకున్నట్లు ఊరు గాని ఊరులో పర్సునెవరైనా కొట్టేస్తే డబ్బుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సందర్భాల్లో పాలసీల్లో పేర్కొన్న పరిమితికి లోబడి బీమా కంపెనీ అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఒకవేళ ఊహించని విధంగా మన తప్పిదం వల్ల ఇతరులెవరైనా గాయపడినా, మరణించినా.. ఆస్తులు ధ్వంసమైనా కూడా థర్డ్ పార్టీకి పరిహారం కూడా చెల్లిస్తుంది. ప్రీమియంలు.. కంపెనీలు.. అత్యంత తక్కువ ప్రీమియంలకే అత్యధిక స్థాయిలో కవరేజీ ఇస్తున్నాయి బీమా కంపెనీలు. కొన్ని సంస్థలు ఆన్లైన్లో దేశీ ప్రయాణాలకు రూ. 173 నుంచి రూ. 865 స్థాయిలో పాలసీలు అందిస్తున్నాయి. మెడికల్ రీయింబర్స్మెంట్కి సంబంధించి ఇవి రూ. 20,000 నుంచి రూ. 1 లక్ష దాకా కవరేజీ కల్పిస్తున్నాయి. టాటా ఏఐజీ, నేషనల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్, ఐసీఐసీఐ లాంబార్డ్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో తదితర సంస్థలు ఈ తరహా పాలసీలు అందిస్తున్నాయి. షరా.. పాలసీ తీసుకునే ముందు ఒకసారి వివిధ సంస్థలవి పోల్చి చూసుకోవాలి. తక్కువ ప్రీమియానికి ఎక్కువ కవరేజీ ఏది ఇస్తోందో తెలుసుకోవాలి. అలాగే, ఏయే అంశాలకు కూడా కవరేజీ వర్తిస్తుంది, వేటికి మినహాయింపులు ఉన్నాయన్నది కూడా తెలుసుకోవాలి. ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. జర్నీ హ్యాపీనే.. దేశీ ప్రయాణాల్లో బీమా కవరేజీలు ఇలా.. -
జీవితాన్ని ఈదుతూ..తోటివారి కోసం పరిగెడుతూ..
పొద్దునే క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్, సాయంత్రం స్విమ్మింగ్. పద్దెనిమిదేళ్ల ప్రీతి దినచర్యలో క్రికెట్, స్విమ్మింగ్ తప్ప మరేం ఉండేవి కావు. 1998 జూలై 11 తర్వాత..ప్రీతికి జరిగిన ప్రమాదం ఆమె బతుకుచిత్రాన్ని మార్చేసింది. ప్రీతి మాటల్లో చెప్పాలంటే...‘నాకు ఈ జీవితంలో రెండు జన్మలు. ఒకటి ప్రమాదానికి ముందు, రెండోది ప్రమాదానికి తర్వాత. ఈ కొత్త జన్మలో నాకు చేతులు, కాళ్లు పని చేయవు’ అని నవ్వుతూ చెప్పే ప్రీతి పదేళ్ల తర్వాత మరోరూపంలో సెలబ్రిటీ అయ్యింది. వికలాంగుల సంక్షేమంకోసం ‘సోల్‌ఫ్రీ’ అనే సంస్థని స్థాపించి తోటివారికి అండగా నిలబడింది. ఈ ఛాంపియన్ గురించి మరిన్ని వివరాలు... స్నేహితులతో విహారయాత్రకెళ్లిన ప్రీతి తిరిగొస్తూ పాండిచ్చేరి బీచ్ దగ్గర ఆగారు. స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి సిద్ధమైన ప్రీతి సముద్రం ఒడ్డున ఎత్తుగా ఉన్న రాయి ఎక్కి నీళ్లలోకి దూకింది. నీళ్లలోకి దూకగానే ప్రీతి గట్టిగా అరిచింది... చుట్టూ ఉన్న స్నేహితులు ఆమెను ఒడ్డుకు తీసుకొచ్చారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. ‘ఈత రాని అమ్మాయి నీళ్లలోకి వెళ్లడం దేనికంటూ’ చుట్టూ మూగిన వాళ్లు అంటుంటే....ప్రీతి స్నేహితురాలు చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రీతి స్విమ్మింగ్‌లో స్టేట్ ఛాంపియన్. తమిళనాడు అండర్ -19 ఉమెన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్ కూడా. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగానే డాక్టర్లు చెప్పిన మాటలు విని ప్రీతి స్నేహితులు భోరుమన్నారు. ‘ప్రీతికి మెడ నుంచి కిందభాగమంతా పెరాలసిస్ అటాక్ అయ్యింది. చెయ్యి, కాలు...ఏదీ పనిచేయదు’ అన్నారు. కానీ ఓ ఏడాది తర్వాత ప్రీతి నోట వచ్చిన మాటలకు అదే స్నేహితులు ‘సలామ్’ అన్నారు. ‘నేను రెండో జన్మ ఎత్తా. ఈ జన్మలో నాకు కాళ్లు, చేతులూ లేవు. కేవలం మెదడు, మనసూ మాత్రమే ఉన్నాయి. వాటితో పరుగులు పెడతాను, అవసరమైతే ఈత కూడా కొడతాను’ అని ప్రీతి అన్న మాటలు వికలాంగులనే కాదు మిగతావారిని కూడా ఆలోచింపజేశాయి. ‘సోల్‌ఫ్రీ’ పేరుతో వికలాంగులకు ప్రీతి చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి. రెండు క్రీడల రాణి... చెన్నైకి చెందిన ప్రీతికి ఊహ తెలిసిననాటినుంచే క్రికెట్ అంటే ఇష్టం. తొమ్మిదేళ్ల వయసులోనే ఇంటిదగ్గర అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. బిడ్డ ఇష్టాన్ని కాదనలేక ప్రీతి తండ్రి ఆమెకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. ప్రీతికి చదువొక ఎత్తై, క్రికెట్ ఒక ఎత్తు. ఇష్టానికి పట్టుదల తోడవడంతో ప్రీతి ఇంటర్మీడియట్లో ఉండగా స్టేట్ అండర్ -19 ఉమెన్ క్రికెట్ టీమ్‌కి కెప్టెన్ అయ్యింది. అప్పటికి ఉన్న రికార్డులు బద్దలుగొడుతూ తన సొంత రికార్డులు సృష్టించిన ప్రీతి విజయం వెనకున్న రహస్యం ఆమె స్విమ్మింగ్‌లో కూడా స్టేట్ ఛాంపియన్ కావడం. ఒకే సమయంలో రెండు క్రీడల్లో తనదైన ముద్రలు వేస్తూ ముందుకెళుతున్న ప్రీతి అనుకోకుండా ఎదురైన చేదు సంఘటన వల్ల సర్వస్వం కోల్పోయింది. కెరటం దెబ్బకి... అసలేం జరిగిందంటే... ఓ వీకెండ్ సరదాగా స్నేహితులతో బీచ్‌కి వెళ్లిన ప్రీతి ఎత్తుగా ఉన్న రాయి ఎక్కి అక్కడినుంచి నీళ్లలోకి దూకింది. నీళ్లలో ఉన్న రాయి తగిలి ప్రీతి స్పృహ తప్పిందనుకున్నారంతా. కాని ప్రీతికి తగిలింది రాయి కాదు వేగంగా వస్తున్న అల తాకిడికి ప్రీతి శరీరం మొత్తం షాక్‌కి గురైంది. వెంటనే దగ్గరగా ఉన్న పాండిచ్చేరిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ‘వెన్నెముకకి బలమైన గాయం అవడం వల్ల శరీరంలోని అవయవాల కదలిక ఆగిపోయిందని’ చెప్పారు డాక్టర్లు. అక్కడ చికిత్సకు కావాల్సిన పరికరాలు లేకపోవడం వల్ల తమిళనాడుకి తీసుకెళ్లమన్నారు. తమిళనాడు ఆసుపత్రికి వస్తే...‘ఇది యాక్సిడెంట్ కేస్’ అని ఇంకొంత సమయం వృథా చేశారు. అసలు చికిత్స మొదలుపెట్టేసరికి నాలుగు గంటల సమయం గడచిపోయింది. ‘యాక్సిడెంట్ జరిగిన గంటలోగా ఆసుపత్రికి తీసుకువస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉండేద’ని డాక్టరు చెప్పిన మాటలు ప్రీతి తల్లిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను వీల్‌చైర్‌లో చూస్తున్నందుకు ఇంకా కన్నీరు కారుస్తూనే ఉంది ఆ తల్లి. చేదు అనుభవాలు... ఏడాదిపాటు సుదీర్ఘ చికిత్స తర్వాత ప్రీతికి ఇక వీల్‌చైర్ చక్రాలే కాళ్లని అర్థమయ్యాయి. ఆటలు ఆగిపోయాయి. చదువు ఆగకూడదనుకుని డిగ్రీలో చేరడానికి తండ్రిని తీసుకుని కాలేజీకి వెళ్లింది. ప్రీతి సర్టిఫికెట్లు చూసి ‘శభాష్’ అన్న అధ్యాపకులు కాలేజీలో సీటు మాత్రం ఇప్పించలేకపోయారు. కారణం...ఆ కాలేజీ తరగతిగదులు వీల్‌చైర్ వాడకానికి అనుకూలంగా లేవు. అప్పుడు ప్రీతి బాధపడింది తనకు సీటు రానందుకు కాదు. తోటి వికలాంగుల దుస్థితి గురించి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రీతిని వెంటాడిన సమస్యలు రెండే రెండు. ఒకటి వెన్నెముక గాయానికి ఎమర్జన్సీ చికిత్స అందరికీ అందుబాటులో లేకపోవడం. రెండోది వికలాంగులకు కళాశాల చదువులు సుదూర స్వప్నాలని తెలియడం. తన కొత్త జీవితంలో ఈ రెండు సమస్యలనూ రెండు క్రీడల్లా భావించింది. ‘సోల్‌ఫ్రీ’ అనే సంస్థని నెలకొల్పి వెన్నెముకకు గాయమైనవారికి ఎమర్జెన్సీ సౌకర్యం కోసం ఒక టోల్‌ఫ్రీ నెంబర్ని పెట్టింది. రెండోది వికలాంగులకు పై చదువుల అవసరాన్ని చెబుతూ వారికి ఉపాధి అవకాశాలను వెదికి పెడుతోంది. సోల్‌ఫ్రీ ఏం చేస్తుంది? వెన్నెముకకు మాత్రమే ప్రమాదం జరిగినవారు ‘సోల్‌ఫ్రీ’ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేసి చెబితే వెంటనే అంబులెన్స్‌ని పంపడం, దగ్గర్లోని ఆసుపత్రి సమాచారం చెప్పడం, ఈలోగా డాక్టర్లతో మాట్లాడి చికిత్సకు ఏర్పాట్లు చేయడం వంటి సేవలందిస్తుంది. ఉపాధి అవకాశాల్లేని వికలాంగులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా, టెలిఫోన్ మార్కెటింగ్, బుక్ రీడర్స్‌గా, రేడియో జాకీలుగా శిక్షణ తర్వాత ఉపాధి అవకాశాలు చూపెడుతోంది. ఇంట్లో నుంచే డిగ్రీ పూర్తిచేసిన ప్రీతి తోటి వికలాంగుల సంక్షేమం కోసం ఇంకేం చేయాలో ఆలోచిస్తోంది. ‘‘వికలాంగుల జీవితం ఎలా ఉంటుందో వికలాంగులకు తప్ప మరెవరికీ తెలియదు. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో వికలాంగుల జీవనం మరీ దుర్భరం అని తెలుసుకున్నాను. వారి జీవనవిధానాలను మార్చడం ఒక్కటే నా ముందున్న లక్ష్యం. ఈ సమయంలో నా ప్రతి ఆలోచన సిక్సర్లాగా గాల్లోకి ఎగరకపోవచ్చు. నీటిలో వేగంగా ఈదలేకపోవచ్చు. కానీ ఎవరో ఒకరు మాకోసం గ్రౌండ్లో సాధన చేస్తున్నారనే ధీమాను మాత్రం ఇవ్వగలదు’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న ప్రీతికి మనం కూడా సలామ్ చెబుతాం.