విజయదశమి నేపథ్యంలో గ్రేటర్ నుంచి భారీగా సొంతూళ్లకు తరలివెళ్లారు. అయితే, ఈ ఏడాది ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ సమ్మెట పోటులా మారింది. ప్రజా రవాణా సాధనాలైన రైళ్లు, బస్సుల కంటే ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి సొంత వాహనాల్లోనే మెజార్టీ సిటీజన్లు స్వగ్రామాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జిల్లాలు, ఏపీలోని పలు నగరాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు సుమారు 24 లక్షల మంది బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.